
అనిల్ అంబానీ
న్యూఢిల్లీ: రాఫెల్ ఒప్పందంలో రిలయన్స్ గ్రూప్ పాత్రపై పోటీ సంస్థలు, కొన్ని శక్తులు కాంగ్రెస్ పార్టీని తప్పుదోవ పట్టిస్తున్నాయని రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ రాహుల్ గాంధీకి లేఖ రాశారు. ఫ్రాన్స్ నుంచి భారత్ కొంటున్న 36 ఫైటర్ జెట్లకు సంబంధించి తాము ఒక్క రూపాయి కూడా లబ్ధి పొందడం లేదని అనిల్ లేఖలో వెల్లడించారు. భారత్‌లో ఆయుధాలు అమ్మాలనుకునే సంస్థలు దేశీయ కంపెనీలతో జట్టుకట్టాలన్న నిబంధన నేపథ్యంలోనే డసాల్ట్ ఏవియేషన్ సంస్థ తమ కంపెనీతో జాయింట్ వెంచర్ ఏర్పాటు చేశామన్నారు. రాహుల్ వ్యక్తిగత విమర్శలతో తీవ్ర మనోవేదనకు లోనైనట్లు అనిల్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment