చీపురు పట్టిన అనిల్ అంబానీ | Anil Ambani took a broom | Sakshi
Sakshi News home page

చీపురు పట్టిన అనిల్ అంబానీ

Published Thu, Oct 9 2014 12:31 AM | Last Updated on Sat, Sep 2 2017 2:32 PM

చీపురు పట్టిన అనిల్ అంబానీ

చీపురు పట్టిన అనిల్ అంబానీ

ముంబై: రిలయన్స్ గ్రూపు అధినేత అనిల్ అంబానీ చీపురు పట్టారు. ముంబైలోని చర్చి గేట్ రైల్వే స్టేషన్ ముందు చెత్తాచెదారాన్ని ఉడ్చారు. తన బాటలో నడవాల్సిందిగా బాక్సర్ మేరీ కోమ్, బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్, టెన్నిస్ తార సానియా మిర్జా, తెలుగు సినీహీరో నాగార్జునతోపాటు మొత్తం తొమ్మిది మందిని ఆహ్వానించారు. ప్రధాని నరేంద్రమోదీ గాంధీ జయంతి రోజున ‘స్వచ్ఛ భారత్’లో పాల్గొనాల్సిందిగా తొమ్మిది మంది ప్రముఖులను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. వారిలో క్రికెటర్ సచిన్ టెండూల్కర్, బాలీవుడ్ నటులు సల్మాన్‌ఖాన్, ప్రియాంకచోప్రా తదితరులతోపాటు అనిల్ అంబానీ కూడా ఉన్నారు.

ప్రధాని పిలుపు మేరకు బుధవారం అనిల్.. తన స్నేహితులతో కలిసి చర్చి గేట్ ముందు పరిసరాలను శుభ్రపరిచారు. తన ఆహ్వానం మేరకు స్వచ్ఛ భారత్‌లో పాలుపంచుకున్న అనిల్ అంబానీని ప్రధాని మోదీ తన బ్లాగ్‌లో అభినందించారు. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లాల్సిందిగా అనిల్ అంబానీ ఆహ్వానించిన తొమ్మిది మంది ప్రముఖుల్లో ప్రముఖ రచయిత్రి శోభా డే,
 జర్నలిస్టు శేఖర్ గుప్తా, గేయ రచయిత ప్రసూన్ జోషి, బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్, రన్నర్స్ క్లబ్ సభ్యులు ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement