Jio Fiber Planes Details, in Telugu | Register With Annual Plan And More Benefit With Welcome Offer - Sakshi
Sakshi News home page

జియో ఫైబర్ : సంచలన ఆఫర్లు

Published Fri, Sep 6 2019 8:10 AM | Last Updated on Sat, Sep 7 2019 11:34 AM

Mukesh Ambani Launch Jio Fibre With Special Offers - Sakshi

న్యూఢిల్లీ: 4జీ మొబైల్‌ సేవల్లో చౌక టారిఫ్‌లతో సంచలనాలు సృష్టించిన రిలయన్స్‌ జియో.. బ్రాడ్‌బాండ్‌ ఇంటర్నెట్‌లో మరొ కొత్త సంచలనానికి తెరతీసింది. దేశీ నెట్‌ వినియోగదారులు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న జియో ఫైబర్‌ సేవలను దేశవ్యాప్తంగా 1,600 నగరాల్లో గురువారం ప్రారంభించింది. కనీసం 100 ఎంబీపీఎస్‌(మెగాబైట్స్‌ పర్ సెకన్‌) స్పీడు నుంచి గరిష్టంగా 1 జీబీపీఎస్‌(గిగాబైట్స్‌ పర్‌ సెకన్‌) స్పీడు వరకూ వివిధ రకాల ప్లాన్‌లను అందుబాటులోకి తెచ్చింది. అన్‌లిమిటెడ్‌ బ్రాండ్‌బాండ్‌తో పాటు దేశంలో ఎక్కడికైనా ఉచిత వాయిస్‌ కాలింగ్‌, టీవీ ద్వారా వీడియోకాలింగ్‌/కాన్ఫరెన్స్‌ సదుపాయం వంటి అనేక సేవలను వినియోగదారులకు అందించనున్నట్లు కంపెనీ ప్రకటించింది.

మొత్తం ఆరు రకాల ప్లాన్‌లు..
ఫైబర్‌ నెట్‌ సేవలకు మొత్తం ఆరు రకాల ప్లాన్‌లను రిలయన్స్‌ జియో ఆవిష్కరించింది. ఇందులో కనీస నెలవారీ చార్జీ(బ్రాంజ్‌ ప్లాన్‌) రూ.699 (స్పీడ్‌ 100 ఎంబీపీఎస్‌) కాగా, గరిష్టంగా రూ.8,499 (టైటానియం ప్లాన్‌-స్పీడ్‌ 1 జీబీపీఎస్‌) చార్జీ చేయనుంది. ఇంకా సిల్వర్‌ ప్లాన్‌ అయితే నెలకు రూ.849 (100 ఎంబీపీఎస్‌ స్పీడ్‌); గోల్డ్‌ ప్లాన్‌కు రూ.1,299 (స్పీడ్‌ 250 ఎంబీపీఎస్‌); డైమండ్‌ ప్లాన్‌కు రూ.2,499 (స్పీడ్‌ 500 ఎంబీపీఎస్‌); ప్లాటినం ప్లాన్‌కు రూ.3,999 (స్పీడ్‌ 1 జీబీపీఎస్‌) చొప్పున  చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఆరు ప్లాన్‌లపైనా అదనంగా 18 శాతం జీఎస్‌టీ వర్తిస్తుంది. ఏ ప్లాన్‌ తీసుకున్నా సేవలు పొందాలంటే ముందుగా (వన్‌టైమ్‌) రూ.2,500 చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో రూ.1,500 సెక్యూరిటీ డిపాజిట్‌, రూ.1,000 నాన్‌-రిఫండబుల్‌ ఇన్‌స్టలేషన్‌ చార్జీల రూపంలో కంపెనీ వసూలు చేస్తుంది. కాగా, ఫెయిర్‌ యూసేజ్‌ పాలసీ(ఎఫ్‌యూపీ) కింద  డౌన్‌లోడ్‌ పరిమితిని గనుక దాటితే నెట్‌ స్పీడ్‌ 1 ఎంబీపీఎస్‌కు తగ్గుతుంది. బ్రాంజ్‌ ప్లాన్‌లో డౌన్‌లోడ్‌ ఎఫ్‌యూపీ పరిమితి 100 జీబీ కాగా, అదనంగా మరో 50 జీబీ(ప్రారంభ ఆఫర్‌ కింద 6 నెలలు మాత్రమే ఇస్తారు) లభిస్తుంది.

ఇక సిల్వర్‌ ప్లాన్‌లో డౌన్‌లోడ్‌ పరిమితి 200 జీబీ(మరో 200 జీబీ అదనం), గోల్డ్‌ ప్లాన్‌లో 500+250 జీబీ, డైమండ్‌ ప్లాన్‌లో 1250+250 జీబీ, ప్లాటినం ప్లాన్‌లో 2,500 జీబీ, టైటానియం ప్లాన్‌లో 5,000 జీబీ చొప్పన ఎఫ్‌యూపీ డౌన్‌లోడ్‌ పరిమితి ఉంటుంది. ఇక ప్రారంభ ఆఫర్‌లో భాగంగా రూ.699 ప్లాన్‌ తీసుకున్నవారికి మూడు నెలల పాటు జియో సినిమా, జియో సావన్‌లు ఉచితంగా లభిస్తాయి. రూ.849 ప్లాన్‌కు మూడు నెలలు వీడియో ఎంటర్‌టైన్‌మెంట్‌ యాప్స్‌ వాడుకోవచ్చు. హోమ్‌ నెట్‌వర్కింగ్‌, వీఆర్‌, వీడియో కంటెంట్‌ సేవల కోసం, అదేవిధంగా టీవీ వీడియో కాలింగ్‌, కాన్ఫరెన్సింగ్‌ కోరుకునే యూజర్లు తగిన పరికరాలను(డివైజెస్‌) కొనుగోలు చేయాల్సి ఉంటుందని కంపెనీ వివరించింది.

‘ప్రస్తుతం దేశంలో ఫిక్స్‌డ్‌ లైన్‌ బ్రాడ్‌బాండ్‌ వేగం సగటున 25 ఎంబీపీఎస్‌గా ఉంది. అత్యంత అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థ అయిన అమెరికాలో కూడా సగటు వేగం 90 ఎంబీపీఎస్‌. అయితే, జియో ఫైబర్‌ ప్రారంభ నెట్‌ స్పీడ్‌ 100 ఎంబీపీఎస్‌ నుంచి ప్రారంభమై 1 జీబీపీఎస్‌ వరకూ ఉంటుంది. తద్వారా ప్రపంచంలోనే టాప్‌-5 బ్రాడ్‌బాండ్‌ వినియోగ దేశాల్లో ఒకటిగా భారత్‌ నిలుస్తుంది’ అని జియో ఫైబర్‌ ఒక ప్రకటలో పేర్కొంది.

వెల్‌కమ్‌ ఆఫర్‌తో ఉచితంగా టీవీ...
ఫైబర్‌ నెట్‌ సేవల కోసం వార్షిక చందా ఒకేసారి చెల్లించే వారికి వెల్‌కమ్‌ ఆఫర్‌ను కూడా జియో ప్రకటించింది. ఇందులో అన్‌లిమిటెడ్‌ వాయిస్‌, డేటాతో పాటు జియో హోమ్‌ గేట్‌వే(సెక్యూరిటీ సేవలు-విలువ దాదాపు రూ.5,000), 4కే సెట్‌టాప్‌ బాక్స్‌(విలువ సుమారు రూ.6,400) లభిస్తుంది. ఇక గోల్డ్‌, అంతకుమించిన ప్లాన్‌లను వెల్‌కమ్‌ ఆఫర్‌లో వార్షికంగా సబ్‌స్క్రయిబ్‌ చేస్తే టీవీ కూడా ఉచితంగా లభిస్తుంది. ఇంకా ఓటీటీ(ఓవర్‌ది టాప్‌ వీడియో స్ట్రీమింగ్‌ సేలు) యాప్స్‌ ద్వారా నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రోగ్రామ్స్‌ను చూసే అవకాశం కూడా ఉంటుంది.

జియో ఫైబర్‌లో సేవలు ఇవీ...
అల్ట్రాహైస్పీడ్‌ బ్రాడ్‌ బ్యాండ్‌ (1 జీబీపీఎస్‌ వరకూ)
ఉచిత వాయిస్‌ కాలింగ్‌(దేశీయంగా), కాన్ఫరెన్సింగ్‌, ఇంటర్నేషనల్‌ కాలింగ్‌
టీవీ వీడియో కాలింగ్‌/కాన్ఫరెన్సింగ్‌
ఎంటర్‌టైన్‌మెంట్‌ ఓటీటీ యాప్స్‌
గేమింగ్‌
హోమ్‌ నెట్‌వరర్కింగ్‌ (ఇంటా, బయటా కూడా కంటెంట్‌ షేరింగ్‌)
డివైస్‌ సెక్యూరిటీ(నార్టన్‌ యాంటీవైరస్‌)
వర్చువల్‌ రియాలిటీ(వీఆర్‌) హెడ్‌సెట్‌ వినియోగానికి అనుకూలం(థియేటర్‌లో చూసిన అనుభూతి)
ప్రీమియం కంటెంట్‌(ఫస్ట్‌డే ఫస్ట్‌ షో సినిమాలు, స్పెషల్‌ స్పోర్ట్‌​‍్స కంటెంట్‌)

సేవలు పొందడం ఎలా...
జియో ఫైబర్‌ నెట్‌ కనెక‌్షన్‌ తీసుకోవాలంటే ముందుగా www.jio.com వెబ్‌సైట్‌ ద్వారా లేదా మైజియో యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని సంబంధిత వివరాలన్నీ ఇచ్చి రిజిస్టర్‌ చేసుకోవాలి. కస్టమర్‌ ఇచ్చిన అడ్రస్‌ పరిధిలో జియో ఫైబర్‌ అందుబాటులో ఉంటే.. సర్వీస్‌ ప్రతినిధులు సంప్రదించి తగిన చర్యలు తీసుకుంటారు.

విప్లవాత్మకమైన సేవలు...
‘రిలయన్స్‌ జియో ఫైబర్‌ కస్టమర్లకు అత్యధ్బుతమైన బ్రాడ్‌బాండ్‌ ఇంటర్నెట్‌ సేవలను అందించాలన్న లక్ష్యంతో దీన్ని ప్రారంభించాం. బ్రాడ్‌బాండ్‌ సేవల్లో ఇది ఒక విప్లవాత్మకమైన ముందడుగు. మరిన్ని అధునాతన సేవలను వినియోగదారులకు అందించేందుకు ఎల్లవేళలా కృషిచేస్తూనే ఉంటాం. తద్వారా జియో ఫైబర్‌ను కొత్త శిఖరాలకు చేరుస్తాం. అం‍తేకాకుండా ముందస్తుగా జియో ఫైబర్‌ సేవలను అందిపుచ్చుకున్న (ప్రివ్యూ యూజర్స్‌) 5 లక్షల మంది సబ్‌స్క్రయిబర్స్‌కు కృతజ్ఞతలు’.
- ఆకాశ్‌ అంబానీ, రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ డైరెక్టర్‌

ప్లాన్‌ ప్రయోజనాలు
1.
డేటా (30 రోజులకు హైస్పీడ్‌,ఎఫ్‌యూపీ దాటితే 1ఎంబీపీఎస్‌)    అన్‌లిమిటెడ్‌    అన్‌లిమిటెడ్‌    అన్‌లిమిటెడ్‌    అన్‌లిమిటెడ్‌    అన్‌లిమిటెడ్‌    అన్‌లిమిటెడ్‌            100జీబీ+50జీబీ    200జీబీ+200జీబీ)    500జీబీ+250జీబీ    1250జీబీ+250జీబీ)    2500జీబీ    5000జీబీ
2. వాయిస్‌ కాలింగ్‌ (దేశంలో ఎక్కడికైనా) ఉచితం
3. టీవీ వీడియో కాలింగ్‌/ ఏడాదికి రూ.1,200 విలువ చేసే సేవలుకాన్ఫరెన్సింగ్‌
4. గేమింగ్‌ ఏడాదికి రూ.1,200 విలువ చేసే సేవలు
5. హోమ్‌ నెట్‌వర్కింగ్‌(కంటెంట్‌ షేరింగ్‌ ఇంటాబయటా)    వర్తిస్తుంది
6. డివైజ్‌ సెక్యూరిటీ(నార్టన్‌)  5 డివైజ్‌ల వరకూ(ఏడాదికి రూ.999 విలువ)
7. వీఆర్‌ ఎక్స్‌పీరియన్స్‌   ప్లాట్‌ఫామ్‌ యాక్సెస్‌
8. ప్రీమియం కంటెంట్‌(ఫస్ట్‌డే ఫస్ట్‌ షో మూవీస్‌, స్పెషల్‌ స్పోర్ట్స్‌)  ప్లాట్‌ఫామ్‌ యాక్సెస్‌)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement