Jio fibre broadband
-
జియో ఫైబర్ రూ. 398 ప్లాన్, ఆఫర్లేంటో తెలుసా?
హైదరాబాద్: బ్రాడ్‌బ్యాండ్ సంస్థ రిలయన్స్ జియో ఫైబర్ కొత్తగా నెలకు రూ. 398 ప్లాన్‌ను ఆవిష్కరించింది. జియో ఫైబర్ టీవీ ప్లాన్ ప్రకారం 750 పైచిలుకు లైవ్ టీవీ ఛానెల్స్‌ను వీక్షించవచ్చని సంస్థ తెలిపింది. అలాగే నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జీ5, డిస్నీ హాట్‌స్టార్ వంటి 14 ప్రీమియం ఓటీటీ ప్లాట్‌ఫాంలకు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా యాక్సెస్ పొందవచ్చని పేర్కొంది. అపరిమిత కాల్స్, డేటా ప్రయోజనాలను పొందవచ్చని జియో ఫైబర్ వివరించింది. అలాగే మాన్సూన్ ఆఫర్ కింద కస్టమర్లు ఉచిత 4కే సెట్–టాప్ బాక్స్‌తో పాటు ఉచిత గిగా ఫైబర్ రూటర్‌ను కూడా అందుకోవచ్చని తెలిపింది. వీటి మొత్తం విలువ రూ. 10,000 ఉంటుంది. అదనంగా జీరో ఇన్స్టాలేషన్ చార్జీలు, జీరో డిపాజిట్ సౌలభ్యాన్ని కూడా అందిస్తున్నట్లు జియో ఫైబర్ పేర్కొంది. ఈ ఆఫర్ కోసం 6 నెలల వ్యవధికి ముందస్తు రీచార్జ్‌ను ఎంచుకోవాల్సి ఉంటుందని తెలిపింది. (బ్లాక్‌రాక్ బ్యాక్ టూ ఇండియా: అంబానీ మరో సంచలనం) -
శుభవార్త..దేశంలో జియో ఎయిర్‌ఫైబర్ సేవలు..ఎలా పనిచేస్తుందంటే?
ప్రముఖ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో త్వరలో జియో ఎయిర్‌ఫైబర్‌ను మార్కెట్లో విడుదల చేయనుంది. ఈ ఎయిర్‌ఫైబర్ గురించి 2022లో జరిగిన 45వ రిలయన్స్ ఏజీఎం (వార్షిక సర్వసభ్య సమావేశం) లో దీనిపై ప్రకటన చేసింది. కానీ విడుదల, ధర ఇతర విషయాల్ని వెల్లడించలేదు. ఈ నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) ప్రెసిడెంట్ కిరణ్ థామస్ జియో ఫైబర్ లాంఛింగ్‌పై స్పందించారు. మరికొద్ది నెలల్లో ఎయిర్‌ఫైబర్‌ను మార్కెట్‌కు పరిచయం చేయనున్నట్లు తెలిపారు. దీంతో ఫిక్స్డ్ లైన్ ఇంటర్నెట్ సర్వీసుల్ని అందించే ఎయిర్ టెల్, బీఎస్ఎన్ఎల్,యాక్ట్ వంటి సంస్థలకు జియో గట్టిపోటీ ఇవ్వనుంది. జియో ఎయిర్‌ఫైబర్ డివైజ్ సాయంతో వైఫై తరహాలో ఎటువంటి వైర్లు లేకుండా ఇంట్లో 5జీ ఇంటర్నెట్, హాట్‌స్పాట్ వినియోగించుకోవచ్చు. ఇందుకోసం ఎయిర్‌ఫైబర్ డివైజ్‌ను ఆఫ్, ఆన్ చేస్తే సరిపోతుంది. సులభంగా, వేగంగా ఇంట్లో, ఆఫీస్‌లో గిగాబైట్ (సెకనుకు వెయ్యి మెగాబైట్స్) స్పీడ్ ఇంటర్నెట్ను ఉపయోగించుకోవచ్చు. జియో ఏం చెబుతోంది! సాధారణంగా బ్రాండ్ బ్యాండ్ సేవలు ఫైబర్ ఆప్టికల్ కేబుల్ ద్వారా అందిస్తారు. ఈ సేవలను పొందాలంటే వైర్‌తో పాటు, మోడెమ్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది. జియో ఎయిర్‌ఫైబర్ విషయానికొచ్చేసరికి దీనికి కేబుల్స్‌తో పనిలేదు. ఇదో సింగిల్ డివైజ్. దగ్గర్లోని జియో టవర్స్ నుంచి వీటికి సిగ్నల్స్ అందుతాయి. గత ఏడాది ఎయిర్‌ఫైబర్ గురించి జియో వీడియో ప్రజెంటేషన్ ఇచ్చింది. అందులో ఇంట్లో జియోఫైబర్‌తో పిల్లలు వినియోగించే యాప్స్, వెబ్‌సైట్స్‌ను కుటుంబసభ్యులు కంట్రోల్ చేయొచ్చు. సంబంధిత వెబ్సైట్లను, యాప్స్‌ను ఎలాంటి టెక్నీషియన్ అవసరం లేకుండా బ్లాక్ చేసే సౌలభ్యం ఉన్నట్లు పేర్కొంది. 5జీ నెట్‌వర్క్‌తో 1.5జీబీపీఎస్ స్పీడ్ పొందవచ్చని తెలిపింది. Shri Akash M. Ambani introduces JioAirFiber, at the Reliance AGM 2022.#JioAirFiber #RILAGM #RILAGM2022 #JioTrue5G #WeCare #JioTogether #Jio #Jio5G #5G pic.twitter.com/tCmSatpUte — Reliance Jio (@reliancejio) August 30, 2022 జియో ఎయిర్‌ఫైబర్ ధర ఎంతంటే? జియో 2022 అక్టోబర్‌లో జరిగిన ఇండియా మొబైల్ కాంగ్రెస్ (IMC)లో 5జీ నెట్‌వర్క్‌తో పాటు జియో ఫైబర్ డివైజ్ గురించి ప్రస్తావించింది. జియో అధికారికంగా పోర్టబుల్ రూటర్లను (జియోఫై ఎం2ఎస్) రూ. 2,800కి, మెష్ ఎక్స్టెండర్ (వైఫై ధర రూ. 2,499), జియో ఎక్స్టెండర్ 6 మెష్ వైఫై సిస్టం ధర రూ. 9,999గా నిర్ణయించింది. ఇప్పుడు ఈ సరి కొత్త వైర్లెస్ రూటర్ ధర రూ. 10,000 ఉంటుందని పరిశ్రమల వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
తెలుగు రాష్ట్రాల్లో 71 పట్టణాల్లో జియో ఫైబర్
దేశంలో అత్యంత వేగవంతమైన హై స్పీడ్ బ్రాడ్ బాండ్ గా పేరొందిన జియో ఫైబర్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో సేవలు భారీ స్థాయిలో విస్తరించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో 71 ముఖ్యమైన నగరాలు, పట్టణాల్లో జియో ఫైబర్ సేవలు లభిస్తున్నాయి. జియోఫైబర్ వేగంగా విస్తరించడం విద్యారంగంలో ఉన్న వేలాది మంది విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంది. ముఖ్యంగా ఐటీ, ఇతర సేవా రంగాలకు చెందిన వారు వర్క్ ఫ్రం హోంకి అనుకూలంగా ఉంది. కొత్త యూజర్లకు పోస్ట్ పెయిడ్ ప్లాన్ యూజర్లకు జియో ఫైబర్ ఇప్పుడు ఎలాంటి ప్రవేశరుసుము లేకుండానే లభిస్తుంది. యూజర్లు గనుక జియో ఫైబర్ పోస్ట్ పెయిడ్ కనెక్షన్ ను ఎంచుకుంటే, రూ.10,000 విలువ కలిగిన ఇంటర్నెట్ బాక్స్ (గేట్ వే రూటర్), సెట్ టాప్ బాక్స్, ఇన్ స్టాలేషన్ లను ఉచితంగానే పొందగలుగుతారు. మరో సంచలనాత్మక ఆఫర్ జియో ఫైబర్ ఎంటర్ టెయిన్ మెంట్ బొనాంజా. ఇది అదనంగా చెల్లించే రూ. 100తోనే అపరిమిత వినోదాన్ని అందిస్తుంది. వినియోగదారులు నెలకు రూ.399ల ప్రారంభ ధరతో అపరిమిత హైస్పీడ్ ఇంటర్నెట్ కు యాక్సెస్ పొందవచ్చు. నెలకు రూ.100 లేదా రూ.200 అదనంగా చెల్లించడం ద్వారా వారు 14 ప్రముఖ ఓటీటీ యాప్స్ కలెక్షన్ నుంచి తమకు నచ్చిన కంటెంట్ ను చూడవచ్చు. ఏపీలో ఆంధ్రప్రదేశ్‌లో జియో ఫైబర్ 43 నగరాలు, పట్టణాల్లో సేవలు అందిస్తోంది. వీటిలో విజయవాడ, విశాఖపట్నం వంటి ముఖ్యమైన నగరాలతో పాటు అనకాపల్లి, అనంతపురం, భీమవరం, బొబ్బిలి, చీరాల, చిత్తూరు, కడప, ధర్మవరం, ఏలూరు, గన్నవరం, గుడివాడ, గుంతకల్, గుంటూరు, హిందూపురం, ఇబ్రహీంపట్నం, జగ్గయ్యపేట, కాకినాడ, కర్నూలు, మచిలీపట్నం, మదనపల్లె, నందిగామ, నంద్యాల, నరసారావుపేట, నెల్లూరు, నిడదవోలు, నూజివీడు, ఒంగోలు, పెద్దాపురం, పొన్నూరు, ప్రొద్దుటూరు, రాజమండ్రి, శ్రీకాళహస్తి, శ్రీకాకుళం, తాడేపల్లె, తాడేపల్లెగూడెం, తణుకు, తెనాలి, తిరుపతి, వినుకొండ, విజయనగరం, వుయ్యూరులు ఉన్నాయి. తెలంగాణలో తెలంగాణలో జియోఫైబర్ 28 నగరాలు, పట్టణాలకు తన సేవలను విస్తరించింది. హైదరాబాద్‌తో పాటు ఆదిలాబాద్, బోధన్, భువనగిరి, హనుమకొండ, జగిత్యాల, జనగాం, కోదాడ, కొత్తగూడెం, కామా రెడ్డి, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, మంచిర్యాల్, మేడ్చల్, మిర్యాలగూడ, మహేశ్వరం, నల్గొండ, నిజామాబాద్, రామగుండం, సంగారెడ్డి, షాద్‌నగర్, శంకర్ పల్లి, సూర్యాపేట, తాండూర్, వనపర్తి, వరంగల్, జహీరాబాద్ లలో కూడా లభ్యమవుతుంది. త్వరలో మరో 7 పట్టణాలకు విస్తరించనుంది. చదవండి: జియో అదిరిపోయే బంపరాఫర్, రూ.200కే '14 ఓటీటీ' యాప్స్ సబ్స్క్రిప్షన్! -
జియో కస్టమర్లకు గుడ్‌న్యూస్..!
జియో తన కస్టమర్లకు తీపికబురును అందించింది. జియో ఫైబర్ వినియోగదారులు ఇప్పుడు ఏలాంటి వెబ్‌కెమెరా లేకుండా టీవీల్లో వీడియో కాలింగ్ చేసే సదుపాయాన్ని జియో తన కస్టమర్ల కోసం అందుబాటులోకి తెచ్చింది. 'కెమెరా ఆన్ మొబైల్' అనే కొత్త ఫీచర్‌తో యూజర్లు తమ టీవీల్లో వీడియో కాలింగ్ ఆప్షన్‌ను పొందవచ్చును. అందుకోసం జియోజాయిన్ అనే యాప్‌ను యూజర్లు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. గత కొన్ని నెలలుగా 'కెమెరా ఆన్ మొబైల్' ఫీచర్‌ను జియో పరీక్షిస్తోంది. ప్రస్తుతం ఈ ఫీచర్ ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్లకు అందుబాటులో ఉండనుంది. జియోఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను వినియోగించుకునే కస్టమర్లకు జియోఫైబర్‌వాయిస్‌తో వీడియోకాలింగ్ ఆప్షన్‌ను ఎనెబుల్ చేయవచ్చును. కస్టమర్లు తమ మొబైల్లోని జియోజాయిన్ యాప్ ద్వారా ల్యాండ్‌లైన్ నంబర్లకు కూడా వాయిస్‌కాల్స్ చేసుకోవచ్చును. మొబైల్ ఫోన్ కెమెరా ద్వారా యూజర్లు తమ టీవీలో వీడియో కాల్ చేయడానికి ముందుగా పది అంకెల జియో ఫైబర్ నంబర్‌ను జియోజాయిన్ యాప్‌లో నమోదు చేయాలి. జియోఫైబర్ నంబర్‌ను నమోదు చేసిన తర్వాత, జియో జాయిన్ యాప్ సెట్టింగ్‌లలో 'కెమెరా ఆన్ మొబైల్' ఫీచర్‌తో వీడియోకాల్స్ చేసుకోవచ్చును. స్పష్టమైన వీడియో కాలింగ్ సేవల కోసం జియోఫైబర్ మోడమ్‌ను 5GHz Wi-Fi బ్యాండ్‌కి మార్చాల్సి ఉంటుంది. 2.4GHz బ్యాండ్‌లో కూడా వీడియో కాలింగ్ ఫీచర్‌ను పొందవచ్చును, కానీ వీడియో కాలింగ్‌లో కొంత అస్పష్టత ఉండవచ్చును. -
1000జీబీ డేటా కేవలం రూ. 199కే..!
టెలికాం రంగంలో జియో అనేక సంచలనాలను సృష్టించింది. తక్కువ ధరలకే ఇంటర్నెట్ డేటాను , ఉచిత కాలింగ్ సౌకర్యాన్ని యూజర్ల కోసం జియో ప్రవేశపెట్టింది. జియో దెబ్బకు పలు మొబైల్ నెట్వర్క్ కంపెనీలు దిగివచ్చాయి. గత్యంతరం లేక పలు దిగ్గజ మొబైల్ నెట్‌వర్క్‌లు ఇంటర్నెట్ డేటా ధరలను తగ్గించాయి. ఉచిత కాల్స్‌ను కూడా ప్రవేశపెట్టాయి. 2019 సెప్టెంబర్‌లో జియోఫైబర్‌ను ప్రకటించి రిలయన్స్ మరో సంచలనాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా జియో ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను పలు నగరాల్లో ప్రవేశపెట్టింది. జియోఫైబర్‌తో పలు ఓటీటీ సేవలను, ఉచిత హెచ్డీ వాయిస్ కాల్స్, హై స్పీడ్ ఇంటర్నేట్, టీవీ వీడియో కాలింగ్, గేమింగ్, సెక్యూరిటీ సేవలను యూజర్లకు అందిస్తోంది. జియోఫైబర్ బ్రాడ్‌బ్యాండ్‌లో 999,1499,2499 డేటా ప్యాక్ లు ఎక్కువగా ప్రజాదరణను పొందాయి. తాజాగా జియో ఫైబర్ తన యూజర్ల కోసం అద్బుతమైన ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. కేవలం రూ. 199కే 1టీబీ డేటా(1000జీబీ)ను జియోఫైబర్ అందిస్తోంది. యూజర్లకు ఈ డేటా సాచెట్ ట్యాక్స్‌తో కలిపి రూ.234.82రూపాయలకు రానుంది. కాగా డేటా ప్యాక్ వ్యాలిడిటీ కేవలం ఏడు రోజులు మాత్రమే. 1 టీబీ డేటా 100ఎమ్‌బీపీఎస్ స్పీడ్‌తో యూజర్లకు అందుబాటులో ఉండనుంది. డేటా ప్యాక్ ముగిసిన తరువాత 1ఎమ్‌బీపీఎస్ స్పీడ్ వస్తుంది. -
అపరిమిత డేటా… 30 రోజులు ఉచితం
తూర్పు గోదావరి : జియో ఫైబర్ తన హై స్పీడ్ ఇంటర్నెట్ సేవలను పెద్దాపురంలో లాంఛనంగా ప్రారంభించింది. ప్రారంభ ఆఫర్ కింద పెద్దాపురం పట్టణ ప్రజలకు జియో 150 ఎంబీపీఎస్ స్పీడ్‌తో 30 రోజుల ఉచిత సేవలను అందిస్తోంది. ఫ్రీ ట్రయల్‌లో భాగంగా 4కే సెట్ టాప్ బాక్స్, ఉచిత 10 ఓటీటీ యాప్స్ సబ్స్క్రిప్షన్, ఉచిత వాయిస్ కాలింగ్. అన్నింటికీ మించి వినియోగదారులకు అపరిమితమైన డేటా అందుబాటులో ఉంటుంది. ఒకవేళ 30 రోజుల్లో సర్వీస్ నచ్చకపోతే కనెక్షన్ వద్దని చెప్పొచ్చు. ఎలాంటి కండీషన్స్ ఉండవు. ఈ 30 రోజుల ఫ్రీ ట్రయల్ కొత్త కస్టమర్లకు మాత్రమే. ఈ సేవల ప్రారంభం సందర్భంగా జియో ఆంధ్రప్రదేశ్ సీఈఓ మండపల్లి మహేష్ కుమార్ మాట్లాడుతూ, "మొబైల్ కనెక్టివిటీ పరంగా ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే జియో వేగంగా , విస్తృతంగా దూసుకువెళ్లి నెంబర్ వన్ ఆపరేటర్ గా నిలిచింది. ఇదే పరుగును బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ రంగంలో కూడా కొనసాగించి జియో ఫైబర్‌ను పెద్దాపురం పట్టణంలో ప్రతీ ఇంటికి తీసుకెళ్లి, ఆ ఇంట్లో ప్రతీ ఒక్కరికీ డిజిటల్ ప్రపంచాన్ని పరిచయం చేయాలనుకుంటున్నాం" అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో జియో ఫైబర్ ఇప్పటికే అన్ని ప్రధాన నగరాలు, పట్టణాల్లో అందుబాటులో ఉంది. విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, తిరుపతి, నెల్లూరు, రాజమండ్రి, కాకినాడ, అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు, ఏలూరు, ఒంగోలు, విజయనగరం, శ్రీకాకుళం, హిందూపూర్, తెనాలి, బొబ్బిలి తదితర పట్టణాల్లో వినియోగదారులు జియో ఫైబర్ సేవలను ఆస్వాదిస్తున్నారు. ఆసక్తిగల కస్టమర్లు ఇక్కడ తమను తాము నమోదు చేసుకోవచ్చు https://www.jio.com/registration' నయా ఇండియా కా నయా జోష్ ' పేరుతో జియో సరికొత్త ప్లాన్స్ వివరాలు. ఇవిగో... JioFiber Rs 399 Plan: జియోఫైబర్ రూ.399 ప్లాన్ తీసుకుంటే 30 ఎంబీపీఎస్ స్పీడ్‌తో ఇంటర్నెట్ ఉపయోగించొచ్చు. అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఉచితం. JioFiber Rs 699 Plan: జియోఫైబర్ రూ.699 ప్లాన్ తీసుకుంటే 100 ఎంబీపీఎస్ స్పీడ్‌తో ఇంటర్నెట్ ఉపయోగించొచ్చు. అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఉచితం. JioFiber Rs 999 Plan: జియోఫైబర్ రూ.999 ప్లాన్ తీసుకుంటే 150 ఎంబీపీఎస్ స్పీడ్‌తో ఇంటర్నెట్ ఉపయోగించొచ్చు. అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఉచితం. రూ.1000 విలువైన 11 ఓటీటీ యాప్స్ సబ్స్క్రిప్షన్స్ ఉచితం. jioFiber Rs 1499 Plan: జియోఫైబర్ రూ.1499 ప్లాన్ తీసుకుంటే 300 ఎంబీపీఎస్ స్పీడ్‌తో ఇంటర్నెట్ ఉపయోగించొచ్చు. అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఉచితం. రూ.1500 విలువైన 12 ఓటీటీ యాప్స్ సబ్స్క్రిప్షన్స్ ఉచితం. -
అపరిమిత డేటా… 30 రోజులు ఉచితం
విజయవాడ : జియో ఫైబర్ తన హై స్పీడ్ ఇంటర్నెట్ సేవలను ఆంధ్రప్రదేశ్ లో మరో మూడు పట్టణాలకు విస్తరించింది. తెనాలి, హిందూపూర్, బొబ్బిలి లలో ఈ సేవలను లాంఛనంగా ప్రారంభించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 26 పట్టణాల్లో జియో ఫైబర్ హై స్పీడ్ ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వచ్చినట్లు అయ్యింది. ఇప్పటికే విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, తిరుపతి, నెల్లూరు, రాజమండ్రి, కాకినాడ, అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు, ఏలూరు, ఒంగోలు, విజయనగరం, శ్రీకాకుళం తదితర పట్టణాల్లో వినియోగదారులు జియో ఫైబర్ సేవలను ఆస్వాదిస్తున్నారు. ఈ సందర్భంగా జియో ఆంధ్రప్రదేశ్ సీఈఓ మండపల్లి మహేష్ కుమార్ మాట్లాడుతూ, ‘మొబైల్ కనెక్టివిటీ పరంగా ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే జియో వేగంగా , విస్తృతంగా దూసుకువెళ్లి నెంబర్ వన్ ఆపరేటర్ గా నిలిచింది. ఇదే పరుగును బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ రంగంలో కూడా కొనసాగించి జియో ఫైబర్‌ను ఈ పట్టణాల్లో ప్రతీ ఇంటికి తీసుకెళ్లి, ఆ ఇంట్లో ప్రతీ ఒక్కరికీ డిజిటల్ ప్రపంచాన్ని పరిచయం చేయాలనుకుంటున్నాం’ అని అన్నారు. 'నయే ఇండియా కా నయా జోష్' పేరుతో జియో సరికొత్త ప్లాన్స్ ప్రకటించింది. ఈ ప్లాన్స్ రూ.399 నుంచి ప్రారంభమౌతాయి. అపరిమిత డేటా వాడుకోవచ్చు. అంతేకాదు... 150 ఎంబీపీఎస్ స్పీడ్‌తో 30 రోజుల ఉచిత ట్రయల్ కూడా ఆఫర్ చేస్తోంది. 4కే సెట్ టాప్ బాక్స్ ఉచితం. కొత్త యూజర్లకు 10 ఓటీటీ యాప్స్ సబ్స్క్రిప్షన్ ఉచితం. 30 రోజుల ఫ్రీ ట్రయల్‌లో భాగంగా 10 ఓటీటీ యాప్స్ యాక్సెస్ చేయొచ్చు. వాయిస్ కాలింగ్ ఉచితం. ఒకవేళ 30 రోజుల్లో సర్వీస్ నచ్చకపోతే కనెక్షన్ వద్దని చెప్పొచ్చు. ఎలాంటి కండీషన్స్ ఉండవు. ఈ 30 రోజుల ఫ్రీ ట్రయల్ కొత్త కస్టమర్లకు మాత్రమే. ఇప్పటికే జియోఫైబర్ కస్టమర్లుగా ఉన్నవారికి కూడా లాయల్టీ బెనిఫిట్స్ లభిస్తాయి. కొత్త టారిఫ్ ప్లాన్స్ ప్రకారం ప్రస్తుత కస్టమర్లను అప్‌గ్రేడ్ చేసి ఆయా ప్రయోజనాలను అందిస్తారు. ఆసక్తిగల కస్టమర్లు ఇక్కడ తమను తాము నమోదు చేసుకోవచ్చు. https://www.jio.com/registration కొత్తగా ప్రకటించిన జియో ఫైబర్ 4 ప్లాన్ల వివరాలు ఇవిగో... Rs 399 Plan: జియోఫైబర్ రూ.399 ప్లాన్ తీసుకుంటే 30 ఎంబీపీఎస్ స్పీడ్‌తో ఇంటర్నెట్ ఉపయోగించొచ్చు. అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఉచితం. Rs 699 Plan: జియోఫైబర్ రూ.699 ప్లాన్ తీసుకుంటే 100 ఎంబీపీఎస్ స్పీడ్‌తో ఇంటర్నెట్ ఉపయోగించొచ్చు. అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఉచితం. Rs 999 Plan: జియోఫైబర్ రూ.999 ప్లాన్ తీసుకుంటే 150 ఎంబీపీఎస్ స్పీడ్‌తో ఇంటర్నెట్ ఉపయోగించొచ్చు. అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, రూ.1000 విలువైన 11 ఓటీటీ యాప్స్ సబ్స్క్రిప్షన్స్ ఉచితం. Rs 1499 Plan: జియోఫైబర్ రూ.1499 ప్లాన్ తీసుకుంటే 300 ఎంబీపీఎస్ స్పీడ్‌తో ఇంటర్నెట్ ఉపయోగించొచ్చు. అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, రూ.1500 విలువైన 12 ఓటీటీ యాప్స్ సబ్స్క్రిప్షన్స్ ఉచితం. -
జియోఫైబర్ యూజర్లకు అద్భుతమైన ఆఫర్
ముంబై: జియో వినియోగదారులకు శుభవార్త. తమ యూజర్ల కోసం ఓ కాంప్లిమెంటరీ గిఫ్ట్ ఇచ్చింది కంపెనీ. లయన్స్ గేట్ ప్లే నుంచి ప్రీమియం కంటెంట్‌ను చూసే వెసులుబాటు కల్పిస్తోంది. జియోఫైబర్ సిల్వర్, అంతకు మించిన ప్లాన్ వారకి లయన్స్‌గేట్ ప్లే కంటెంట్ అందుబాటులోకి రానుంది. స్టార్జ్ ఒరిజినల్ సిరీస్, ఫస్ట్-రన్ సినిమాలతోపాటు ఇతర టీవీ, సినిమా కంటెంట్ (7500 ఎపిసోడ్లు), ఇతర పాపులర్ ప్రోగ్రామ్స్‌ను జియో ఫైబర్ వినియోగదారులు వీక్షించవచ్చు. ఈ రోజు నుంచే ఇది అమల్లోకి వచ్చింది. లయన్స్‌గేట్‌లో హారర్, కామెడీ, డ్రామా, యాక్షన్, థ్రిల్లర్, డాక్యుమెంటరీ, సినిమాల కంటెంట్ ఉంటుంది. ఇంగ్లీష్‌తో పాటు ఇతర భాషల్లో కూడా ఇది అందుబాటులో ఉంటుంది. హిందీ, మరాఠీ, తమిళం, తెలుగు, కన్నడ, భోజ్ పురి భాషల్లో లయన్స్‌గేట్ బ్లాక్‌బస్టర్ సినిమాలను వీక్షించవచ్చు. ఈ కాంప్లిమెంటరీని జియోఫైబర్ సిల్వర్ యూజర్లు (ఒక నెల కంటే ఎక్కువ నెలలు ప్లాన్లు) వీక్షించవచ్చు. అలాగే, కొత్త వారికి కూడా ఈ ఆఫర్ వర్తిస్తుంది. జియోటీవీ+ యాప్ నుంచి జియోఫైబర్ యూజర్లు లయన్స్ గేట్ ప్లే కంటెంట్ చూడవచ్చు. దీని కోసం ప్రత్యేకంగా లాగిన్ అవ్వడం లేదా యాప్ డౌన్ లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. (జియో మీట్ : 10 లక్షలు దాటిన డౌన్లోడ్స్) సాధారణం కన్నా ఎక్కువ కంటెంట్‌ను వీక్షించాలనుకునే జియోఫైబర్ యూజర్లు గోల్డ్ ప్లాన్ తీసుకోవచ్చు. ఈ గోల్డ్ ప్లాన్‌లో హై స్పీడ్, ఎక్కువ బ్రాడ్ బ్యాండ్ డాటా లభిస్తుంది. గోల్డ్ ప్లాన్ భిన్నరకాలైన సేవలను అందిస్తుంది. గోల్డ్ ప్లాన్‌లో 250 ఎంబీపీఎస్ స్పీడ్, అన్ లిమిటెడ్ ఇంటర్నెట్ (నెలకి 1750 జీబీ డేటా), దేశవ్యాప్తంగా అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్‌తో పాటు అంతర్జాతీయ కాల్స్‌ను తక్కువ ధరకే అందిస్తుంది. దీని ఎనీటైమ్ టీవీ ద్వారా ప్రీమియం ఓటీటీలు అయిన లయన్స్‌గేట్ ప్లే, జీ 5, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ + హాట్‌స్టార్, సోనీలివ్, సన్నెక్స్ట్, వూట్, ఆల్ట్‌బాలాజీ, హోయిచోయ్, షెమరూమ్, జియో సినిమా, జియోసావ్న్ వంటి ప్రీమియం ఓటీటీ లాంటి వాటికి యాక్సెస్ లభిస్తుంది. వీటితో పాటు గోల్డ్ ప్లాన్‌లో అన్ లిమిటెడ్ వీడియో కాలింగ్, కాన్ఫరెన్సింగ్ (టీవీ వీడియో కాలింగ్ ), అన్ లిమిటెడ్ మ్యూజిక్, గేమ్స్, జియోయాప్స్ని అన్‌లిమిటెడ్‌గా యాక్సెస్ చేసుకునే సౌలభ్యం ఉంటుంది. -
జియో ఫైబర్: రూ.199కే 1000 జీబీ డేటా
సాక్షి, ముంబై : మహమ్మారి కరోనా వైరస్ వ్యాప్తి, లాక్డౌన్ ఆంక్షలతో దాదాపు ప్రజలందరూ ఇంటికే పరిమితమవుతున్నారు. దీంతో దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ డేటా వినియోగం భారీగా పుంజుకుంది. ఈ నేపథ్యంలో దేశీయ టెలికాం కంపెనీలు తమ ఇంటర్నెట్, డేటా ప్లాన్లను ఎప్పటికపుడు సమీక్షిస్తున్నాయి. తాజాగా రిలయన్స్ జియో ఫైబర్ (ఫైబర్-టు-హోమ్) వినియోగదారులకోసం ఒక అద్భుతమైన కాంబో ప్లాన్ ను ప్రకటించింది. రూ.199 లకు వేగవంతమైన 1000 జీబీ డేటాను అందిస్తున్నట్టు ప్రకటించింది. ఈ ప్లాన్ వాలిడిటీ స్వల్ప కాలం అంటే 7 రోజుల వరకు చెల్లుబాటు అవుతుంది. అంతేకాదు, ఈ ప్లానులో డేటా 100 ఎంబీపీఎస్ వేగంతో వస్తుంది. ఈ కాంబో ప్లాన్ ప్రస్తుత బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను అయిపోయిన వారికి, లేదా అదనపు డేటా అవసరం ఉన్నవారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అయితే లిమిట్ దాటిన అనంతరం ఇది ఒక ఎంబీపీఎస్‌కు పడిపోతుందని వెల్లడించింది. పాత కస్టమర్లతోపాటు కొత్త వారికి కూడా ఈ ప్లాన్ అందుబాటులో ఉంటుంది. ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే, రూ. 199 కాంబో ప్లాన్ జీఎస్టీతో కలిపి మొత్తం రూ .234 ఖర్చు అవుతుంది. దీంతోపాటు ఉచిత వాయిస్ కాలింగ్ ప్రయోజనాలను అందిస్తుంది. అయితే, మైజియో యాప్ కాంప్లిమెంటరీ యాక్సెస్ లేదా ఉచిత ఎస్ఎంఎస్ వంటి అదనపు ప్రయోజనాలు ఈ కాంబో ప్లాన్ లో లభించవు. (కరోనా సంక్షోభం : టీసీఎస్ కీలక నిర్ణయం) కాగా కోవిడ్ -19 కారణంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ సమయంలో ప్రజలంతా ఇంటర్నెట్ పైనే ఎక్కువ కాలం గడుపుతున్నారు. పెరిగిన డేటా వినియోగాన్ని అందిపుచ్చుకునే క్రమంలో టెలికాం దిగ్గజాలు తమ డేటాప్లాన్లను సమీక్షిస్తుండటంతో పాటు రీఛార్జ్ సౌకర్యాన్ని సులభతరం చేశాయి. జియో పాటు ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా చందాదారులు ఏటీఎం సెంటర్లలో రీఛార్జ్ చేసుకునే వెసులుబాటును ఇటీవల ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. (రూపాయికి ఆర్బీఐ 'శక్తి') -
జియో ఫైబర్ : సంచలన ఆఫర్లు
న్యూఢిల్లీ: 4జీ మొబైల్ సేవల్లో చౌక టారిఫ్‌లతో సంచలనాలు సృష్టించిన రిలయన్స్ జియో.. బ్రాడ్‌బాండ్ ఇంటర్నెట్లో మరొ కొత్త సంచలనానికి తెరతీసింది. దేశీ నెట్ వినియోగదారులు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న జియో ఫైబర్ సేవలను దేశవ్యాప్తంగా 1,600 నగరాల్లో గురువారం ప్రారంభించింది. కనీసం 100 ఎంబీపీఎస్(మెగాబైట్స్ పర్ సెకన్) స్పీడు నుంచి గరిష్టంగా 1 జీబీపీఎస్(గిగాబైట్స్ పర్ సెకన్) స్పీడు వరకూ వివిధ రకాల ప్లాన్లను అందుబాటులోకి తెచ్చింది. అన్లిమిటెడ్ బ్రాండ్‌బాండ్‌తో పాటు దేశంలో ఎక్కడికైనా ఉచిత వాయిస్ కాలింగ్, టీవీ ద్వారా వీడియోకాలింగ్/కాన్ఫరెన్స్ సదుపాయం వంటి అనేక సేవలను వినియోగదారులకు అందించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. మొత్తం ఆరు రకాల ప్లాన్లు.. ఫైబర్ నెట్ సేవలకు మొత్తం ఆరు రకాల ప్లాన్లను రిలయన్స్ జియో ఆవిష్కరించింది. ఇందులో కనీస నెలవారీ చార్జీ(బ్రాంజ్ ప్లాన్) రూ.699 (స్పీడ్ 100 ఎంబీపీఎస్) కాగా, గరిష్టంగా రూ.8,499 (టైటానియం ప్లాన్-స్పీడ్ 1 జీబీపీఎస్) చార్జీ చేయనుంది. ఇంకా సిల్వర్ ప్లాన్ అయితే నెలకు రూ.849 (100 ఎంబీపీఎస్ స్పీడ్); గోల్డ్ ప్లాన్‌కు రూ.1,299 (స్పీడ్ 250 ఎంబీపీఎస్); డైమండ్ ప్లాన్‌కు రూ.2,499 (స్పీడ్ 500 ఎంబీపీఎస్); ప్లాటినం ప్లాన్‌కు రూ.3,999 (స్పీడ్ 1 జీబీపీఎస్) చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఆరు ప్లాన్లపైనా అదనంగా 18 శాతం జీఎస్టీ వర్తిస్తుంది. ఏ ప్లాన్ తీసుకున్నా సేవలు పొందాలంటే ముందుగా (వన్‌టైమ్) రూ.2,500 చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో రూ.1,500 సెక్యూరిటీ డిపాజిట్, రూ.1,000 నాన్-రిఫండబుల్ ఇన్స్టలేషన్ చార్జీల రూపంలో కంపెనీ వసూలు చేస్తుంది. కాగా, ఫెయిర్ యూసేజ్ పాలసీ(ఎఫ్‌యూపీ) కింద డౌన్లోడ్ పరిమితిని గనుక దాటితే నెట్ స్పీడ్ 1 ఎంబీపీఎస్‌కు తగ్గుతుంది. బ్రాంజ్ ప్లాన్‌లో డౌన్లోడ్ ఎఫ్‌యూపీ పరిమితి 100 జీబీ కాగా, అదనంగా మరో 50 జీబీ(ప్రారంభ ఆఫర్ కింద 6 నెలలు మాత్రమే ఇస్తారు) లభిస్తుంది. ఇక సిల్వర్ ప్లాన్‌లో డౌన్లోడ్ పరిమితి 200 జీబీ(మరో 200 జీబీ అదనం), గోల్డ్ ప్లాన్‌లో 500+250 జీబీ, డైమండ్ ప్లాన్‌లో 1250+250 జీబీ, ప్లాటినం ప్లాన్‌లో 2,500 జీబీ, టైటానియం ప్లాన్‌లో 5,000 జీబీ చొప్పన ఎఫ్‌యూపీ డౌన్లోడ్ పరిమితి ఉంటుంది. ఇక ప్రారంభ ఆఫర్లో భాగంగా రూ.699 ప్లాన్ తీసుకున్నవారికి మూడు నెలల పాటు జియో సినిమా, జియో సావన్‌లు ఉచితంగా లభిస్తాయి. రూ.849 ప్లాన్‌కు మూడు నెలలు వీడియో ఎంటర్టైన్మెంట్ యాప్స్ వాడుకోవచ్చు. హోమ్ నెట్వర్కింగ్, వీఆర్, వీడియో కంటెంట్ సేవల కోసం, అదేవిధంగా టీవీ వీడియో కాలింగ్, కాన్ఫరెన్సింగ్ కోరుకునే యూజర్లు తగిన పరికరాలను(డివైజెస్) కొనుగోలు చేయాల్సి ఉంటుందని కంపెనీ వివరించింది. ‘ప్రస్తుతం దేశంలో ఫిక్స్డ్ లైన్ బ్రాడ్‌బాండ్ వేగం సగటున 25 ఎంబీపీఎస్‌గా ఉంది. అత్యంత అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థ అయిన అమెరికాలో కూడా సగటు వేగం 90 ఎంబీపీఎస్. అయితే, జియో ఫైబర్ ప్రారంభ నెట్ స్పీడ్ 100 ఎంబీపీఎస్ నుంచి ప్రారంభమై 1 జీబీపీఎస్ వరకూ ఉంటుంది. తద్వారా ప్రపంచంలోనే టాప్-5 బ్రాడ్‌బాండ్ వినియోగ దేశాల్లో ఒకటిగా భారత్ నిలుస్తుంది’ అని జియో ఫైబర్ ఒక ప్రకటలో పేర్కొంది. వెల్కమ్ ఆఫర్‌తో ఉచితంగా టీవీ... ఫైబర్ నెట్ సేవల కోసం వార్షిక చందా ఒకేసారి చెల్లించే వారికి వెల్కమ్ ఆఫర్‌ను కూడా జియో ప్రకటించింది. ఇందులో అన్లిమిటెడ్ వాయిస్, డేటాతో పాటు జియో హోమ్ గేట్‌వే(సెక్యూరిటీ సేవలు-విలువ దాదాపు రూ.5,000), 4కే సెట్‌టాప్ బాక్స్(విలువ సుమారు రూ.6,400) లభిస్తుంది. ఇక గోల్డ్, అంతకుమించిన ప్లాన్లను వెల్కమ్ ఆఫర్లో వార్షికంగా సబ్స్క్రయిబ్ చేస్తే టీవీ కూడా ఉచితంగా లభిస్తుంది. ఇంకా ఓటీటీ(ఓవర్ది టాప్ వీడియో స్ట్రీమింగ్ సేలు) యాప్స్ ద్వారా నచ్చిన ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్‌ను చూసే అవకాశం కూడా ఉంటుంది. జియో ఫైబర్‌లో సేవలు ఇవీ... ♦ అల్ట్రాహైస్పీడ్ బ్రాడ్ బ్యాండ్ (1 జీబీపీఎస్ వరకూ) ♦ ఉచిత వాయిస్ కాలింగ్(దేశీయంగా), కాన్ఫరెన్సింగ్, ఇంటర్నేషనల్ కాలింగ్ ♦ టీవీ వీడియో కాలింగ్/కాన్ఫరెన్సింగ్ ♦ ఎంటర్టైన్మెంట్ ఓటీటీ యాప్స్ ♦ గేమింగ్ ♦ హోమ్ నెట్వరర్కింగ్ (ఇంటా, బయటా కూడా కంటెంట్ షేరింగ్) ♦ డివైస్ సెక్యూరిటీ(నార్టన్ యాంటీవైరస్) ♦ వర్చువల్ రియాలిటీ(వీఆర్) హెడ్సెట్ వినియోగానికి అనుకూలం(థియేటర్లో చూసిన అనుభూతి) ♦ ప్రీమియం కంటెంట్(ఫస్ట్‌డే ఫస్ట్ షో సినిమాలు, స్పెషల్ స్పోర్ట్్స కంటెంట్) సేవలు పొందడం ఎలా... జియో ఫైబర్ నెట్ కనెక్షన్ తీసుకోవాలంటే ముందుగా www.jio.com వెబ్సైట్ ద్వారా లేదా మైజియో యాప్‌ను డౌన్లోడ్ చేసుకొని సంబంధిత వివరాలన్నీ ఇచ్చి రిజిస్టర్ చేసుకోవాలి. కస్టమర్ ఇచ్చిన అడ్రస్ పరిధిలో జియో ఫైబర్ అందుబాటులో ఉంటే.. సర్వీస్ ప్రతినిధులు సంప్రదించి తగిన చర్యలు తీసుకుంటారు. విప్లవాత్మకమైన సేవలు... ‘రిలయన్స్ జియో ఫైబర్ కస్టమర్లకు అత్యధ్బుతమైన బ్రాడ్‌బాండ్ ఇంటర్నెట్ సేవలను అందించాలన్న లక్ష్యంతో దీన్ని ప్రారంభించాం. బ్రాడ్‌బాండ్ సేవల్లో ఇది ఒక విప్లవాత్మకమైన ముందడుగు. మరిన్ని అధునాతన సేవలను వినియోగదారులకు అందించేందుకు ఎల్లవేళలా కృషిచేస్తూనే ఉంటాం. తద్వారా జియో ఫైబర్‌ను కొత్త శిఖరాలకు చేరుస్తాం. అంతేకాకుండా ముందస్తుగా జియో ఫైబర్ సేవలను అందిపుచ్చుకున్న (ప్రివ్యూ యూజర్స్) 5 లక్షల మంది సబ్స్క్రయిబర్స్కు కృతజ్ఞతలు’. - ఆకాశ్ అంబానీ, రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ డైరెక్టర్ ప్లాన్ ప్రయోజనాలు 1.డేటా (30 రోజులకు హైస్పీడ్,ఎఫ్‌యూపీ దాటితే 1ఎంబీపీఎస్) అన్లిమిటెడ్ అన్లిమిటెడ్ అన్లిమిటెడ్ అన్లిమిటెడ్ అన్లిమిటెడ్ అన్లిమిటెడ్ 100జీబీ+50జీబీ 200జీబీ+200జీబీ) 500జీబీ+250జీబీ 1250జీబీ+250జీబీ) 2500జీబీ 5000జీబీ 2. వాయిస్ కాలింగ్ (దేశంలో ఎక్కడికైనా) ఉచితం 3. టీవీ వీడియో కాలింగ్/ ఏడాదికి రూ.1,200 విలువ చేసే సేవలుకాన్ఫరెన్సింగ్ 4. గేమింగ్ ఏడాదికి రూ.1,200 విలువ చేసే సేవలు 5. హోమ్ నెట్వర్కింగ్(కంటెంట్ షేరింగ్ ఇంటాబయటా) వర్తిస్తుంది 6. డివైజ్ సెక్యూరిటీ(నార్టన్) 5 డివైజ్‌ల వరకూ(ఏడాదికి రూ.999 విలువ) 7. వీఆర్ ఎక్స్పీరియన్స్ ప్లాట్‌ఫామ్ యాక్సెస్ 8. ప్రీమియం కంటెంట్(ఫస్ట్‌డే ఫస్ట్ షో మూవీస్, స్పెషల్ స్పోర్ట్స్) ప్లాట్‌ఫామ్ యాక్సెస్) -
జియో ఫైబర్ : జుట్టు పీక్కుంటున్న దిగ్గజాలు
సాక్షి, ముంబై: జియో ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ సేవలు మరికొద్దిసేపట్లో కమర్షియల్‌గా లాంచ్ కానున్నాయి. ఈ నేపథ్యంలో పలు జోక్‌లు, వ్యంగ్య కామెంట్లు, సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా లాంచింగ్ కోసం వేచి చూస్తున్నామంటూ మరికొంతమంది ఉత్సాహంగా కామెంట్ చేస్తున్నారు. ప్రధానంగా టెలికా మార్కెట్లో సంచలనాలు నమోదు చేసిన జియో డీటీహెచ్ మార్కెట్లో కూడా పలు కీలక ప్లాన్లను తీసుకురానుందని దీంతో దిగ్గజాలకు మరోసారి భారీషాక్ తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాగా జియో ఫైబర్ వార్షిక ప్లాన్ తీసుకున్న వారికి ఉచితంగా హెచ్డీ టీవీ సెట్ కూడా అందిస్తామంటూ రిలయన్స్ ఇండస్ట్రీస్ సీఎండీ ముకేశ్ అంబానీ వార్షిక సర్వసభ్య సమావేశంలో వెల్లడించిన సంగతి తెలిసిందే. మొత్తం మీద జియో ఫైబర్ రాకతో చాలామటుకు డైరెక్ట్ టు హోమ్ సేవలందించే సంస్థల వ్యాపారాలకు గట్టి దెబ్బే తగిలే అవకాశాలు ఉన్నాయని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. దీన్ని తట్టుకునేందుకు ఆయా సంస్థలు ఇప్పటికే వివిధ ప్యాకేజీలు ప్రకటిస్తున్నాయి కూడా. జీ5, హుక్ వంటి పలు వీడియో స్ట్రీమింగ్ మొబైల్ యాప్స్ కంటెంట్ అందుబాటులోకి తెస్తూ భారతీ ఎయిర్టెల్ కొత్తగా రూ. 3,999కి సెట్ టాప్ బాక్స్‌ను ఆవిష్కరించింది. తొలి ఏడాది తర్వాత రూ. 999 వార్షిక ఫీజుతో సబ్‌స్క్రిప్షన్‌ను కొనసాగించవచ్చు. #JioFiber Other service providers waiting for launch : pic.twitter.com/V9WdML38ps — Rakshit Mahajan (@Rakshitm09) September 5, 2019 Everyone waiting for Jio Fiber plans but most importantly the catch behind the 'free tv'. #JioGigafiber pic.twitter.com/eIEYvb8uSd — SpaceMonkey (@ThisIsSherab) September 5, 2019 People waiting for #JioFiber be like pic.twitter.com/SqxmNPYM4s — 🇮🇳Just_Right🇮🇳 (@Right_of_Right) September 5, 2019 #JioFiber Everybody right now 😂😂 pic.twitter.com/z5fMHEjQ4B — Er- Ram katariya (@Ramkishorkatar2) September 5, 2019 #JioFiber Waiting for jiofiber launch. Public to Mukesh ambani pic.twitter.com/gyGXBYJ7dl — THE MUSE (@Raopnky) September 5, 2019 #JioFiber plans going to launch today. Other Broadband providers be like: pic.twitter.com/TiOAjhOLP3 — Priyesh (@Pr1yesh786) September 5, 2019 -
జియో ఫైబర్ వచ్చేసింది.. ప్లాన్స్ ఇవే..
సాక్షి, ముంబై: రిలయన్స్ జియో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఆప్టికల్ ఫైబర్ ఆధారిత జియోఫైబర్ సర్వీసులను కమర్షియల్‌గా నేడు (గురువారం, సెప్టెంబరు 5) ప్రారంభించింది. జియో ఫైబర్ కస్టమర్లకు ల్యాండ్‌లైన్ నుంచి జీవితాంతం ఉచిత వాయిస్ కాల్స్, సెకనుకు 100 మెగాబిట్ నుంచి 1 గిగాబిట్ దాకా స్పీడ్‌తో బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందుతాయి. బ్రాంజ్, సిల్వర్, గోల్డ్, డైమండ్, ప్లాటినం, టైటానియం పేరుతో మొత్తం 6 ప్లాన్లను పరిచయం చేసింది. జియో ఫైబర్ ప్లాన్లు నెలకు రూ. 699 నుంచి ప్రారంభం. రిలయన్స్ జియో గురువారం భారతదేశంలోని 1,600 నగరాల్లో బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ సర్వీస్ - జియో ఫైబర్ - దాని "ఫైబర్ టు ది హోమ్" సేవను ప్రారంభించినట్లు ప్రకటించింది. జియో ఫైబర్‌తో తన వాగ్దానాన్ని కొనసాగిస్తోందని రిలయన్స్ జియో ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. జియో ఫైబర్ ప్లాన్లు నెలకు రూ. 699 నుంచి 8,499 మధ్య ఉంటాయి. జియో ఫైబర్ అల్ట్రా-హై-స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ (1 జిబిపిఎస్ వరకు), ఉచిత దేశీయ వాయిస్ కాలింగ్, కాన్ఫరెన్సింగ్ , ఇంటర్నేషనల్ కాలింగ్, టివి వీడియో కాలింగ్, కాన్ఫరెన్సింగ్, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వంటి ఎంటర్టైన్మెంట్ ఓవర్ టాప్ (ఒటిటి) అనువర్తనాలు వంటి సేవలను అందిస్తుంది. గేమింగ్, హోమ్ నెట్వర్కింగ్, పరికర భద్రత, వర్చువల్ రియాలిటీ అనుభవం, ప్రీమియం కంటెంట్ ప్లాట్‌ఫాం తమదనిరిలయన్స్ జియో తెలిపింది. ప్రపంచ రేట్ల కంటే పదోవంతు కంటే తక్కువ ధరలకు ధర నిర్ణయించింది, అందరికీ అందుబాటులో ఉండేలా చేయడానికి, ప్రతి బడ్జెట్‌కు, ప్రతి అవసరానికి అనుగుణంగా ప్లాన్లను సిద్ధం చేశామని తెలిపింది. నెలవారీ ప్లాన్లు జియోఫైబర్ ప్లాన్ అద్దెలు రూ .699 -రూ.8,499 అతి తక్కువ ప్లాన్‌లో కూడా 100 ఎంబీపీఎస్ వేగంతో సేవలు దీర్ఘకాలిక్ ప్లాన్స్ వినియోగదారులకు 3, 6 , 12 నెలల ప్లాన్లను కూడా ఎన్నుకోవచ్చు. ఈఎంఐ సౌకర్యం కూడా. ఇందుకు బ్యాంక్‌లతో టై ఆప్ జియో ఫైబర్ వెల్కమింగ్ ఆఫర్ ప్రతీ వినియోగదారుడికి అమూల్యమైన సేవలు వార్షిక ప్లాన్ - ప్రయోజనాలు జియో హోమ్ గేట్‌వే జియో 4కే సెట్ టాప్ బాక్స్ టెలివిజన్ సెట్ (గోల్డ్ ప్లాన్ ఆ పైన మాత్రమే) మీకు ఇష్టమైన ఓటీటీ అనువర్తనాలకు చందా అపరిమిత వాయిస్ , డేటా సేవలు రిలయన్స్ జియో ఫైబర్ ఆఫర్లు -
జియో బ్రాడ్‌బ్యాండ్‌తో సెట్‌టాప్ బాక్స్ ఉచితం!
న్యూఢిల్లీ: డీటీహెచ్, కేబుల్ టీవీ కస్టమర్లను ఆకర్షించే దిశగా టెలికం దిగ్గజం రిలయన్స్ జియో ప్రతి బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌పై ఉచితంగా సెట్‌టాప్ బాక్స్ కూడా అందించనున్నట్లు తెలుస్తోంది. ‘జియోఫైబర్ కస్టమర్లందరికీ కాంప్లిమెంటరీ సెట్‌టాప్ బాక్స్ కూడా లభిస్తుంది‘ అని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అలాగే, పేరొందిన ఎంటర్టైన్మెంట్ మొబైల్ యాప్స్‌లోని వీడియో కంటెంట్, సినిమాలు మొదలైనవన్నీ కూడా జియోఫైబర్ కస్టమర్లకు అందుబాటులో ఉంటాయి. వీటి సబ్స్క్రిప్షన్ ఫీజు కూడా కలిపే బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ చార్జీలు ఉంటాయి. ప్రత్యేకంగా కంటెంట్‌కు చెల్లించనక్కర్లేదు. ఇక సెట్‌టాప్‌కు కెమెరాను అమర్చుకుంటే టీవీ ద్వారా వీడియో కాలింగ్ సేవలు కూడా పొందవచ్చని సమాచారం. నేటి నుంచి (సెప్టెంబర్ 5) ఆప్టికల్ ఫైబర్ ఆధారిత జియోఫైబర్ సర్వీసులను జియో ప్రారంభిస్తున్న సంగతి తెలిసిందే. జియోఫైబర్ కస్టమర్లకు ల్యాండ్‌లైన్ నుంచి జీవితాంతం ఉచిత వాయిస్ కాల్స్, సెకనుకు 100 మెగాబిట్ నుంచి 1 గిగాబిట్ దాకా స్పీడ్‌తో బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందనున్నాయి. దీని చార్జీలు నెలకు రూ. 700 నుంచి ప్రారంభమవుతాయి. వార్షిక ప్లాన్ తీసుకున్న వారికి ఉచితంగా హెచ్డీ టీవీ సెట్ కూడా అందిస్తామంటూ రిలయన్స్ ఇండస్ట్రీస్ సీఎండీ ముకేశ్ అంబానీ గతంలో వెల్లడించారు. మొత్తం మీద జియోఫైబర్ రాకతో చాలామటుకు డైరెక్ట్ టు హోమ్ సేవలందించే సంస్థల వ్యాపారాలకు గట్టి దెబ్బే తగిలే అవకాశాలు ఉన్నాయని పరిశమ్రవర్గాలు భావిస్తున్నాయి. దీన్ని తట్టుకునేందుకు ఆయా సంస్థలు ఇప్పటికే వివిధ ప్యాకేజీలు ప్రకటిస్తున్నాయి. జీ5, హుక్ వంటి పలు వీడియో స్ట్రీమింగ్ మొబైల్ యాప్స్ కంటెంట్ అందుబాటులోకి తెస్తూ భారతీ ఎయిర్టెల్ కొత్తగా రూ. 3,999కి సెట్ టాప్ బాక్స్‌ను ఆవిష్కరించింది. తొలి ఏడాది తర్వాత రూ. 999 వార్షిక ఫీజుతో సబ్‌స్క్రిప్షన్‌ను కొనసాగించవచ్చు. -
జియో ఫైబర్, మరో బంపర్ ఆఫర్
సాక్షి,న్యూఢిల్లీ : రిలయన్స్ జియో ఫైబర్‌బ్రాడ్ బ్రాండ్ సేవలను రేపు ఆవిష్కరించనున్న నేపథ్యంలో మరో బంపర్ ఆఫర్‌ను కూడా తన వినియోగదారులకు అందించనుంది. తాజా సమాచారం ప్రకారం కాంప్లిమెంటరీ ఆఫర్‌ను కూడా ప్రకటించనుంది. ప్రతి బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌తో డైరెక్ట్-టు-హోమ్, కేబుల్ టీవీ కస్టమర్లను ఆకర్షించే లక్ష్యంతో ప్రతి కస్టమర్‌కు ఉచిత సెట్ టాప్ బాక్స్‌ను అందించనుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఈ అంచనాలపై రిలయన్స్ జియో అధికారికంగా స్పందించాల్సి వుంది. బిలియనీర్ ముకేశ్ అంబానీ నేతృత్వంలోని జియో రేపు(సెప్టెంబర్, 5)న ఆప్టికల్ ఫైబర్ ఆధారిత ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను ప్రారంభించనుంది. ఈ సందర్భంగా జియో ఫైబర్ కస్టమర్లు అందరికీ కాంప్లిమెంటరీ ఆఫర్‌గా సెట్ టాప్ బాక్స్ లభించనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. జియో ఫైబర్ వెల్ కమ్ ఆఫర్ కింద వార్షిక ప్లాన్‌ను ఎంచుకున్న వినియోగదారులకు మాత్రమే ఫుల్ హెచ్డీ టీవీ లేదా 4కే టీవీ, 4కే సెట్ టాప్ బాక్సులను ఉచితంగా అందిస్తామని గత నెలలో జరిగిన ఏజీఎంలో ముకేశ్ అంబానీ ప్రకటించిన సంగతి తెలిసిందే. చదవండి : జియో ఫైబర్ బ్రాడ్‌బాండ్ లాంచింగ్ రేపే: రిజిస్ట్రేషన్ ఎలా? -
ముకేశ్.. మెగా డీల్స్!
చమురు నుంచి టెలికం దాకా వివిధ రంగాల్లో విస్తరించిన పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) తాజాగా మరిన్ని భారీ వ్యాపార ప్రణాళికలు ప్రకటించింది. ఏడాదిన్నర వ్యవధిలో రుణ రహిత సంస్థగా మారాలని నిర్దేశించుకుంది. ఇందులో భాగంగా రూ. 1.15 లక్షల కోట్ల భారీ డీల్స్ ప్రకటించింది. అలాగే అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న జియో ఫైబర్ సర్వీసులను కూడా వచ్చే నెల నుంచే అందుబాటులో తేనున్నట్లు వెల్లడించింది. వీటితో పాటు పలు వ్యాపార వ్యూహాలు ఆవిష్కరించింది. ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ 42వ వార్షిక సర్వ సభ్య సమావేశ (ఏజీఎం) వేదికపై సంస్థ అధినేత ముకేశ్ అంబానీ భారీ వ్యాపార ప్రణాళికలను ప్రకటించారు. ఏడాదిన్నర వ్యవధిలో రుణరహిత కంపెనీగా మార్చే దిశగా పలు చర్యలను వెల్లడించారు. ప్రధానమైన పెట్రోకెమికల్ వ్యాపార విభాగంలో సౌదీకి చెందిన చమురు దిగ్గజం సౌదీ ఆరామ్కోకు 20 శాతం వాటాలు విక్రయిస్తున్నట్లు తెలిపారు. ఈ విభాగం విలువను 75 బిలియన్ డాలర్ల కింద అంచనా వేశారు. అంటే... 20 శాతం వాటా కింద 15 బిలియన్ డాలర్ల వరకూ రిలయన్స్ చేతికి అందుతాయి. ఇక, ఇంధనాల రిటైల్ వ్యాపారంలో బ్రిటన్ దిగ్గజం బ్రిటిష్ పెట్రోలియం (బీపీ) సంస్థకు 49 శాతం వాటాలు విక్రయిస్తున్నట్లు అంబానీ చెప్పారు. ఈ డీల్ విలువ సుమారు రూ.7,000 కోట్లు. స్థూలంగా ఈ రెండు ఒప్పందాల ద్వారా సుమారు రూ.1,15,000 కోట్లు రిలయన్స్‌కు లభించగలవని అంచనా. ఒప్పందాల స్వరూపం ప్రకారం... పెట్రోకెమికల్ వ్యాపారంలో 20 శాతం వాటా సౌదీ ఆరామ్కోకు దక్కుతుంది. ఇంధన రిటైల్ నెట్‌వర్క్‌లో బీపీకి 49 శాతం వాటా దక్కుతుంది. ఆ నెట్‌వర్క్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ చేతిలో మిగిలే 51 శాతం వాటాలో సైతం కొంత సౌదీ ఆరామ్కో చేతికి వెళుతుంది. రోజుకు 5 లక్షల బ్యారెళ్ల సరఫరా... ప్రపంచంలోనే అతి పెద్ద ముడిచమురు ఎగుమతిదారు అయిన ఆరామ్కో... జామ్‌నగర్ (గుజరాత్)లోని రిలయన్స్ జంట రిఫైనరీలకు దీర్ఘకాలిక ప్రాతిపదికన రోజుకు 5,00,000 బ్యారెళ్ల చమురును సరఫరా చేయనుందని అంబానీ ఈ సందర్భంగా తెలిపారు. రిలయన్స్‌కు ప్రస్తుతం 1,400 పైచిలుకు పెట్రోల్ బంకులు, 31 విమాన ఇంధన విక్రయ స్టేషన్లు ఉన్నాయి. బీపీతో జాయింట్ వెంచర్ ఏర్పాటు చేయడం ద్వారా వచ్చే అయిదేళ్లలో ఈ నెట్‌వర్క్‌ను 5,500 బంకుల స్థాయికి పెంచుకోవాలని ఇరు సంస్థలు నిర్దేశించుకున్నాయి. సౌదీ ఆరామ్కోతో డీల్ 2020 మార్చి నాటికి పూర్తి కాగలదని ఏజీఎం అనంతరం రిలయన్స్ ఈడీ పీఎంఎస్ ప్రసాద్ విలేకరులకు తెలియజేశారు. అయిదేళ్ల వ్యవధిలో పెట్రో కెమికల్స్ వ్యాపార విభాగాన్ని అన్‌లిస్టెడ్ అనుబంధ సంస్థగా విడగొట్టనున్నట్లు చెప్పారాయన. రూ. 2.8 లక్షల కోట్ల రుణభారం.. గడిచిన ఐదేళ్లుగా చమురు నుంచి టెలికం, రిటైల్ దాకా వివిధ వ్యాపార విభాగాల విస్తరణ కోసం రిలయన్స్ రూ.5.4 లక్షల కోట్లకు పైగా ఇన్వెస్ట్ చేసింది. ఇందులో అధిక భాగం రుణాల రూపంలోనే ఉంది. ఈ ఏడాది జూన్ ఆఖరు నాటికి రిలయన్స్ గ్రూప్ రుణ భారం రూ.2,88,243 కోట్లు కాగా... దాని చేతిలో మాత్రం రూ.1,31,710 కోట్ల నగదు నిల్వలున్నాయి. బీపీ, సౌదీ ఆరామ్కో సంస్థలతో డీల్స్‌తో రుణభారం కొంత వరకూ తగ్గుతుంది. అధిక రుణభారంతో సంస్థ వృద్ధికి విఘాతం ఏర్పడుతుందన్న పరిశ్రమ నిపుణుల అభిప్రాయాలను అంబానీ తోసిపుచ్చారు. అయితే, 18 నెలల కాలంలో మొత్తం రుణభారాన్ని తగ్గించేసుకుని అప్పుల్లేని సంస్థగా ఆవిర్భవించాలని కంపెనీ నిర్దేశించుకుంది. నగదు నిల్వల కన్నా రుణ భారం తక్కువగా ఉంటే రుణరహిత సంస్థగా పరిగణిస్తారు. టెలికం, రిటైల్ తదితర వ్యాపార విభాగాలన్నింటినీ కలిపితే రిలయన్స్ గ్రూప్ విలువ 134 బిలియన్ డాలర్లకు పైగానే ఉంటుందని అంచనా. టాప్ టెల్కోగా జియో.. టెలికం విభాగం జియో యూజర్ల సంఖ్య ఈ ఏడాది జూన్ చివరినాటికి 34 కోట్లకు చేరినట్లు ముకేశ్ అంబానీ తెలిపారు. యూజర్లపరంగా దేశీయంగా అతి పెద్ద టెలికం ఆపరేటర్‌గా, ప్రపంచంలోనే రెండో అతి పెద్ద ఆపరేటర్‌గా (సింగిల్ ప్లాట్‌ఫాం) జియో ఆవిర్భవించినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ), గృహాలకు, ఎంటర్ప్రైజ్ కంపెనీలకు, చిన్న సంస్థలకు (ఎస్ఎంఈ) బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందించటం ద్వారా మరింత వృద్ధి సాధించనున్నట్లు చెప్పారు. ఈ నాలుగు విభాగాల నుంచి ఆదాయ ఫలాలు ఈ ఆర్థిక సంవత్సరం నుంచే కనిపిస్తాయన్నారు. 2020 జనవరి 1 నుంచి ఐవోటీ సర్వీసులు అందుబాటులోకి వస్తాయి. స్టార్టప్స్‌కు ఊతం.. స్టార్టప్ సంస్థలకు తోడ్పాటునిచ్చే దిశగా వాటికి ఉచితంగా ఇంటర్నెట్ సేవలు అందించడంతో పాటు కొన్నింటిలో ఇన్వెస్ట్ కూడా చేయనున్నట్లు అంబానీ చెప్పారు. ‘జియో సంస్థ... భారత్‌లో భారతీయుల చేతిలో తయారైన స్టార్టప్. సాధారణంగా స్టార్టప్స్ వ్యయాల్లో 80 శాతం వాటా క్లౌడ్, కనెక్టివిటీ తదితర అవసరాలదే ఉంటుంది. అందుకే ఔత్సాహిక సంస్థలకు వీటిని ఉచితంగా అందించేందుకు జియో సిద్ధంగా ఉంది. 2020 జనవరి 1 నుంచి ఈ సర్వీసు అందుబాటులోకి వస్తుంది. ఈలోగా జియోడాట్‌కామ్‌లో స్టార్టప్స్ ప్యాకేజీలు నమోదు చేసుకోవచ్చు. వ్యవ సాయం, విద్య, వైద్యం, నైపుణ్యాల శిక్షణ విభాగాల స్టార్టప్స్ కు ప్రాధాన్యం లభిస్తుంది‘ అని అంబానీ చెప్పా రు. తల్లి కోకిలాబెన్, భార్య నీతా అంబానీ, తనయులు ఆకాశ్, అనంత్, కూతురు ఈషా, కోడలు శ్లోక కూడా ఏజీఎంలో పాల్గొన్నారు. నవభారతం రూపుదిద్దుకుంటున్న ఈ తరుణంలో రిలయన్స్ కూడా కొత్త రిలయన్స్‌గా రూపాంతరం చెందుతుందని అంబానీ పేర్కొన్నారు. రిలయన్స్ 42వ ఏజీఎం ముఖ్యాంశాలు... సౌదీ ఆరామ్కో–ఆర్ఐఎల్ డీల్ ► రిఫైనరీ, పెట్రోకెమికల్ వ్యాపారంలో 20% వాటా సౌదీ ఆరామ్కో చేతికి ► డీల్ విలువ రూ.1.05 లక్షల కోట్లు (15 బిలియన్ డాలర్లు) ► దీని ప్రకారం ఈ విభాగాల విలువ రూ.5,25,000 కోట్లు (75 బిలియన్ డాలర్లు) బీపీ–ఆర్ఐఎల్ డీల్ ► ఇంధన రిటైల్ వ్యాపా రంలో 49% వాటా బీపీ చేతికి ► డీల్ విలువ రూ.7,000 కోట్లు ► దేశవ్యాప్తంగా ఐదేళ్లలో 5,500 పెట్రోలు బంకులు రుణ రహిత కంపెనీగా... ► ఐదేళ్లలో కన్సూమర్ వ్యాపారాలన్నీ స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ ► రియల్టీ, ఫైనాన్షియల్ పెట్టుబడులను తగినవిధంగా ఉపయోగించుకోవడం ► ప్రస్తుతం కంపెనీ మొత్తం రుణ భారం : రూ.2.88 లక్షల కోట్లు ► నగదు నిల్వలు : రూ.1.32 లక్షల కోట్లు ► నికర రుణ భారం : రూ.1.56 లక్షల కోట్లు ► 18 నెలల్లో (2021, మార్చి 31 నాటికి) రుణ రహిత కంపెనీగా ఆవిర్భావం లక్ష్యం షేరు పనితీరు గత ఐదేళ్లలో... రిలయన్స్ 135% అప్ నిఫ్టీ: 44% అప్ జియో దూకుడు... ► ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న డిజిటల్ కంపెనీ ► సబ్స్క్రయిబర్ల సంఖ్య : 34 కోట్లు ► యూజర్ల పరంగా దేశంలో నంబర్ 1 టెల్కో, ప్రపంచంలో 2వ స్థానం ► జియో ఫైబర్ నెట్ వాణిజ్య సేవలు : సెప్టెంబర్ 5న షురూ ► కనీస బ్రాడ్‌బ్యాండ్ స్పీడ్ : 100 ఎంబీపీఎస్ ► టారిఫ్ : రూ.700 నుంచి రూ.10,000 ► మైక్రోసాఫ్ట్‌తో భాగస్వామ్యం : అజూర్ క్లౌడ్ సేవలు జియో నెట్‌వర్క్‌లో ► 2020, జనవరి 1 నుంచి ఐవోటీ సేవలు రూ. 700కే జియో ఫైబర్ జియో టెలికం సర్వీసులు ప్రారంభించి మూడేళ్లవుతున్న సందర్భంగా సెప్టెంబర్ 5న జియో ఫైబర్ సర్వీసులను కూడా ప్రారంభించనున్నట్లు అంబానీ వెల్లడించారు. ల్యాండ్‌లైన్ నుంచి జీవితకాలం పాటు ఉచిత వాయిస్ కాల్స్... కనిష్టంగా 100 ఎంబీపీఎస్ బ్రాండ్‌బ్యాండ్ స్పీడ్ అందించేట్లుగా ఈ సర్వీసులుంటాయి. నెలకు రూ. 700 నుంచి రూ. 10,000 దాకా ప్లాన్స్ ఉంటాయి. అమెరికా, కెనడాలకు నెలకు రూ.500 అద్దెకే ల్యాండ్‌లైన్స్ నుంచి అపరిమిత ఇంటర్నేషనల్ కాల్స్ చేసుకోవచ్చు. ప్రస్తుత మార్కెట్ రేట్లతో పోలిస్తే ఇది అయిదో వంతు నుంచి పదో వంతు దాకా తక్కువ ఉంటుందని అంబానీ తెలిపారు. ‘అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఫిక్సిడ్ లైన్ డౌన్లోడ్ స్పీడ్ 90 ఎంబీపీఎస్ మాత్రమే ఉంటోంది. కానీ మన దగ్గర జియో ఫైబర్ ప్రారంభ ప్లానే 100 ఎంబీపీఎస్ స్పీడ్ ఉంటుంది. 1 జీబీపీఎస్ దాకా స్పీడ్ పొందవచ్చు’ అని ఆయన పేర్కొన్నారు. 1,600 పట్టణాల నుంచి ఇప్పటిదాకా 1.5 కోట్ల మేర రిజిస్ట్రేషన్స్ నమోదైనట్లు వివరించారు. ఫైబర్‌తో టీవీ ఉచితం జియో ఫరెవర్ ప్లాన్స్ పేరిట ఉండే వార్షిక ప్లాన్స్‌ను ఎంచుకున్న వారికి హెచ్డీ లేదా 4కే ఎల్ఈడీ టీవీ సెట్ కూడా ఉచితంగా అందించనున్నట్లు ముకేష్ అంబానీ చెప్పారు. దీంతో పాటు 4కే సెట్ టాప్ బాక్స్‌ను కూడా ఉచితంగా పొందవచ్చు. అలాగే ప్రముఖ ఓవర్ ది టాప్ (ఓటీటీ) యాప్స్‌కి కూడా సబ్స్క్రిప్షన్ లభిస్తుంది. ఫస్ట్ డే ఫస్ట్ షో.. సినిమాలు థియేటర్లలో రిలీజైన రోజే ఇంట్లోనే వాటిని చూసే సర్వీసు కూడా ప్రవేశపెడుతున్నట్లు అంబానీ చెప్పారు. జియో ఫస్ట్ డే ఫస్ట్ షో పేరిట 2020 మధ్యలో దీన్ని అందుబాటులోకి తేనున్నట్లు వివరించారు. ప్రీమియం కస్టమర్లు ఈ సర్వీసులు పొందవచ్చని పేర్కొన్నారు. మైక్రోసాఫ్ట్‌తో జట్టు... కొత్తగా క్లౌడ్ డేటా సెంటర్స్ ఏర్పాటు కోసం సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌తో చేతులు కలిపినట్లు అంబానీ చెప్పారు. మైక్రోసాఫ్ట్ అజ్యూర్ క్లౌడ్ ప్లాట్‌ఫాం ఆధారంగా ఈ ప్రపంచ స్థాయి డేటా సెంటర్స్ ఏర్పాటవుతాయని ఆయన తెలిపారు. ఇందుకోసం ఇరు సంస్థలు దీర్ఘకాలిక ఒప్పందం కుదుర్చుకున్నాయి. షేర్హోల్డర్లకు మరింత విలువ.. రిలయన్స్ ఇండస్ట్రీస్ చరిత్రలోనే ఇది అతి పెద్ద విదేశీ పెట్టుబడి (సౌదీ ఆరామ్కో డీల్). అంతే కాదు దేశంలోకి వచ్చిన అత్యంత భారీ ఎఫ్‌డీఐల్లో ఇది కూడా ఒకటి. మరోవైపు పెట్రో రిటైల్ వ్యాపార విభాగంలో బ్రిటన్ సంస్థ బీపీ 49 శాతం వాటాలు కొనుగోలు చేసింది. ఈ డీల్ విలువ రు.7,000 కోట్లు. వచ్చే 18 నెలల్లో.. అంటే 2021 మార్చి 31 నాటికి రుణ రహిత కంపెనీగా మారతాం. ఇందుకు సంబంధించి మాకు స్పష్టమైన ప్రణాళిక ఉంది. ఈ లక్ష్య సాధన క్రమంలో షేర్‌హోల్డర్లయిన మీ అందరికీ.. కంపెనీ చరిత్రలోనే గతంలో ఎన్నడూ లేనంత వేగంగా మరింత అధిక డివిడెండ్లు, మధ్య మధ్యలో బోనస్ ఇష్యూలు, ఇతరత్రా సాధనాల ద్వారా మరిన్ని ప్రయోజనాలు అందిస్తామని హామీ ఇస్తున్నాను. సౌదీ ఆరామ్కో, బీపీతో ఒప్పందాలు ఈ ఆర్థిక సంవత్సరంలోనే పూర్తవుతాయని భావిస్తున్నాం. వీటితో రూ.1.15 లక్షల కోట్ల దాకా నిధులు అందుబాటులోకి వస్తాయి. వచ్చే అయిదేళ్లలో జియో, రిలయన్స్ రిటైల్‌ను ఐపీవోకి కూడా తెస్తాం. ఈ ఏడాది సెప్టెంబర్ 5 నుంచే జియోఫైబర్ సర్వీసులను ప్రారంభిస్తున్నాం. వచ్చే ఐదేళ్లు ఏటా 15 శాతం వృద్ధి సాధించగలం. – ముకేశ్ అంబానీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ సీఎండీ ఎంఆర్ హెడ్‌సెట్‌తో జియో సేవలను వివరిస్తున్న ఆకాశ్ అంబానీ, ఈషా అంబానీ, ఏజీఎంకు హాజరైన అనంత్ అంబానీ -
జియో ఫైబర్ సంచలనం: బంపర్ ఆఫర్లు
రిలయన్స్ ఇండస్ట్రీస్ 42వ వార్షిక సర్వసభ్య సమావేశంలో రిలయన్స్ అధినేత, సీంఎడీ ముకేశ్ అంబానీ మరోసారి సంచలనం సృష్టించారు. ముఖ్యంగా జియో గిగా ఫైబర్ సేవలకు సంబంధించి అందరూ ఊహించిన దానికంటే ఎక్కువగా ఆఫర్లను ప్రకటించడం విశేషం. టెలికాం రంగంలో జియో మాదిరిగాగానే అతి తక్కువ ధరకే ఫైబర్ సేవలను భారతీయ వినియోగదారులకు అందుబాటులో తీసుకొస్తామని చెప్పారు. ముఖ్యంగా రానున్న 18 నెలలో అప్పుల్లేని కంపెనీగా రిలయన్స్ అవతరించనుందని ముకేశ్ ప్రకటించడం విశేషం. జియో 3వ వార్షికోత్సవం సందర్భంగా ఈ ఏడాది సెప్టెంబర్ 5 నుంచి దేశవ్యాప్తంగా జియో ఫైబర్ సేవలను అందుబాటులోకి తెస్తామని అంబానీ వెల్లడించారు. 100 ఎంబీపీఎస్ నుంచి 1జీబీ పీఎస్ వరకు డేటా ఉచితం. అలాగే వెల్ కం ప్లాన్ కింద కస్టమర్లకు 4కే ఎల్డీ టీవీ, 4జీ హెచ్డీ సెట్‌టాప్‌బాక్స్ పూర్తిగా ఉచితం అందిస్తామన్నారు. తద్వారా 5 లక్షల కుటుంబాలకు ఉచిత ఫైబర్ సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. జియో ఫైబర్ సబ్‌స్క్రైబర్స్‌కు ల్యాండ్ లైన్ ద్వారా ఇంటి నుంచి అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ అందించనుంది. రూ.500 లకే అమెరికా, కెనడాకు అన్లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. అలాగే ప్రీమియం కస్టమర్లు ఇంటివద్దే ఫస్ట్ డే ఫస్ట్ షో ప్రాతిపదికన కొత్త సినిమాలు చూసే అవకాశం కల్పిస్తామన్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు జియో.కాం ద్వారా సెప్టెంబరు 5నుంచి అదుబాటులో వుంటాయని తెలిపారు. అలాగే రానున్న 12 నెలల్లో జియో ఫైబర్ భారీగా విస్తరిస్తుందని పేర్కొన్న అంబానీ, బ్రాడ్‌బాండ్ సిగ్నల్ వచ్చేలా సెట్‌టాప్ బాక్స్‌ను సిద్ధం చేశామని స్పష్టం చేశారు. జియో ఫైబర్‌నెట్ ద్వారా ఎమ్ఎస్ఎమ్ఈ క్లౌడ్ కనెక్టివిటీ అందజేస్తామని తెలిపారు. ఇందుకోసం మైక్రోసాఫ్ట్‌తో జత కట్టినట్టు వెల్లడించారు. ఈ సందర్భంగా రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ కుమార్తె ఈశా, కుమారుడు, ఆకాశ్ జియో ఫైబర్ సంచలన వివరాలను అందిస్తూ వేదికపై సందడి చేశారు. ముఖ్యంగా జియోతో హై ఎండ్ వీడియో కాన్ఫరెన్స్ ఎలా చేయవచ్చో లైవ్‌గా చేసి చూపించారు. ఇషా, ఆమె సోదరుడు ఆకాశ్ అంబానీ. ఈ సందర్భంగా ఆకాశ్ అంబానీ మాట్లాడుతూ..మన ఇంట్లో ఉన్న టీవీ స్క్రీన్ల పైనే వీడియో కాలింగ్ ద్వారా ఒకేసారి నలుగురితో మాట్లాడవచ్చో ప్రదర్శించారు. ప్రపంచంలో ఏమూలనున్నవారితోనైనా వీడియో కాలింగ్, కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుకోవచ్చని తెలిపారు. మల్టీ ప్లేయర్ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభిస్తున్నామని చెప్పారు. గిగా ఫైబర్‌లో ఉండే ఏఆర్, వీఆర్ తో షాపింగ్ అనుభవాన్ని పొందవచ్చన్నారు. ఇంటి వద్దనుంచే మనకు సరిపడే దుస్తుల షాపింగ్ చేయవచ్చని తెలిపారు. అంతేకాదు ఇంట్లో థియేటర్ అనుభవాన్ని ఎలా పొందవచ్చో కూడా చూపించారు. జియో సీఈవో కిరణ్ కూడా ఈ సమావేశంలో మాట్లాడారు. -
జియో దెబ్బకు బీఎస్ఎన్ఎల్ భారీతగ్గింపు
న్యూఢిల్లీ : టెలికాం మార్కెట్లో సంచలనాలు సృష్టించిన రిలయన్స్ జియో ప్రస్తుతం ఫైబర్ సేవలతో బ్రాడు బ్యాండు మార్కెట్లోనూ తన మార్కు చూపించడానికి వచ్చేస్తోంది. దీపావళికి జియో ఫైబర్ సేవలు కమర్షియల్ గా లాంచ్ కాబోతున్నాయి. ఈ సందర్భంగా రిలయన్స్ జియో ఫైబర్ సర్వీసులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ ముందుగానే సిద్ధమవుతోంది. అవసరమైతే హోం బ్రాడ్ బ్యాండు టారిఫ్ రేట్లను భారీగా తగ్గించనున్నామని పేర్కొంది. తమ ఫిక్స్ డ్ బ్రాడ్ బ్యాండు ప్లాన్స్ ను మరోసారి పునరుద్ధరించనున్నామని, అవసరమైతే జియోకు తగ్గ టారిఫ్ ప్లాన్స్ ను ప్రకటించనున్నామని బీఎస్ఎన్ఎల్ చైర్మన్ అనుపమ్ శ్రీవాస్తవ పేర్కొన్నారు. ప్రస్తుతం బ్రాడ్ బ్యాండు మార్కెట్లో దాదాపు కోటి సబ్ స్క్రైబర్లతో బీఎస్ఎన్ఎల్ ఆధిపత్య స్థానంలో ఉంది. దీని తర్వాత ఎయిర్ టెల్ కు 1.95 మిలియన్ మంది యూజర్లున్నారు. తమకు అతిపెద్ద ఆప్టిక్ ఫైబర్ ఆధారిత నెట్ వర్క్ ఉందని శ్రీవాస్తవ చెప్పారు. సర్వీసు క్వాలిటీలో ఎక్కడా రాజీపడకుండా తమ సబ్ స్క్రైబర్ బేస్ ను పెంచుకుంటున్నామని పేర్కొన్నారు. బీఎస్ఎన్ఎల్ బ్రాడ్ బ్యాండు యూజర్లకు టారిఫ్ ప్లాన్స్ రూ.799 నుంచి ప్రారంభమవుతున్నాయి. రూ.799 రీఛార్జ్ కు సెకనుకు 4మెగాబిట్స్ తో 10జీబీ డేటాను ఈ కంపెనీ ఆఫర్ చేస్తోంది. హైఎండ్ అపరిమిత ఎఫ్టీటీహెచ్ ప్లాన్ కింద రూ.2,641 రీఛార్జ్ తో 175జీబీ డేటాను 8ఎంబీపీఎస్ స్పీడులో అందిస్తోంది. కాగ, అతి త్వరలో జియో ఫైబర్ సేవలను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. ప్రమోషనల్ ఆఫర్లో భాగంగా మూడు నెలల పాటు ఉచిత సేవలు అందించేందుకు జియో సిద్ధమవుతోంది. ఆ తర్వాత నెలకు రూ.500తో 100జీబీ డేటా ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. జియో ప్రత్యర్థిగా ఉన్న ఎయిర్ టెల్ ఇటీవలే 1000జీబీ ఆఫర్ ను లాంచ్ చేసింది. అయితే ఇది కేవలం ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలోని కస్టమర్లకు మాత్రమే. ఎంపిక చేసిన ప్లాన్స్ లో బ్రాడ్ బ్యాండు సర్వీసులు పొందే వారికి మాత్రమే ఆ ఆఫర్ ను అందిస్తోంది.