సాక్షి,న్యూఢిల్లీ : రిలయన్స్ జియో ఫైబర్‌బ్రాడ్ బ్రాండ్ సేవలను రేపు ఆవిష్కరించనున్న నేపథ్యంలో మరో బంపర్ ఆఫర్‌ను కూడా తన వినియోగదారులకు అందించనుంది. తాజా సమాచారం ప్రకారం కాంప్లిమెంటరీ ఆఫర్‌ను కూడా ప్రకటించనుంది. ప్రతి బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌తో డైరెక్ట్-టు-హోమ్, కేబుల్ టీవీ కస్టమర్లను ఆకర్షించే లక్ష్యంతో ప్రతి కస్టమర్‌కు ఉచిత సెట్ టాప్ బాక్స్‌ను అందించనుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఈ అంచనాలపై రిలయన్స్ జియో అధికారికంగా స్పందించాల్సి వుంది.
బిలియనీర్ ముకేశ్ అంబానీ నేతృత్వంలోని జియో రేపు(సెప్టెంబర్, 5)న ఆప్టికల్ ఫైబర్ ఆధారిత ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను ప్రారంభించనుంది. ఈ సందర్భంగా జియో ఫైబర్ కస్టమర్లు అందరికీ కాంప్లిమెంటరీ ఆఫర్‌గా సెట్ టాప్ బాక్స్ లభించనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. జియో ఫైబర్ వెల్ కమ్ ఆఫర్ కింద వార్షిక ప్లాన్‌ను ఎంచుకున్న వినియోగదారులకు మాత్రమే ఫుల్ హెచ్‌డీ టీవీ లేదా 4కే టీవీ, 4కే సెట్ టాప్ బాక్సులను ఉచితంగా అందిస్తామని గత నెలలో జరిగిన ఏజీఎంలో ముకేశ్ అంబానీ ప్రకటించిన సంగతి తెలిసిందే.
చదవండి : జియో ఫైబర్ బ్రాడ్‌బాండ్ లాంచింగ్ రేపే: రిజిస్ట్రేషన్ ఎలా?
Comments
Please login to add a commentAdd a comment