
హైదరాబాద్: బ్రాడ్‌బ్యాండ్ సంస్థ రిలయన్స్ జియో ఫైబర్ కొత్తగా నెలకు రూ. 398 ప్లాన్‌ను ఆవిష్కరించింది. జియో ఫైబర్ టీవీ ప్లాన్ ప్రకారం 750 పైచిలుకు లైవ్ టీవీ ఛానెల్స్‌ను వీక్షించవచ్చని సంస్థ తెలిపింది. అలాగే నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జీ5, డిస్నీ హాట్‌స్టార్ వంటి 14 ప్రీమియం ఓటీటీ ప్లాట్‌ఫాంలకు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా యాక్సెస్ పొందవచ్చని పేర్కొంది. అపరిమిత కాల్స్, డేటా ప్రయోజనాలను పొందవచ్చని జియో ఫైబర్ వివరించింది.
అలాగే మాన్‌సూన్ ఆఫర్ కింద కస్టమర్లు ఉచిత 4కే సెట్–టాప్ బాక్స్‌తో పాటు ఉచిత గిగా ఫైబర్ రూటర్‌ను కూడా అందుకోవచ్చని తెలిపింది. వీటి మొత్తం విలువ రూ. 10,000 ఉంటుంది. అదనంగా జీరో ఇన్‌స్టాలేషన్ చార్జీలు, జీరో డిపాజిట్ సౌలభ్యాన్ని కూడా అందిస్తున్నట్లు జియో ఫైబర్ పేర్కొంది. ఈ ఆఫర్ కోసం 6 నెలల వ్యవధికి ముందస్తు రీచార్జ్‌ను ఎంచుకోవాల్సి ఉంటుందని తెలిపింది. (బ్లాక్‌రాక్ బ్యాక్ టూ ఇండియా: అంబానీ మరో సంచలనం)
Comments
Please login to add a commentAdd a comment