Reliance Jio New Plan: ఆధునిక కాలంలో ఎక్కువమంది వినియోగించే నెట్‌వర్క్‌లలో రిలయన్స్ జియో (Reliance Jio) ఒకటని అందరికి తెలుసు. అయితే ఇప్పుడు సంస్థ ఇప్పటి వరకు అందించిన ఒక ప్రీపెయిడ్ ప్లాన్ నిలిపివేసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
నివేదికల ప్రకారం.. కంపెనీ ఇప్పటి వరకు అందిస్తున్న రూ. 119 ప్లాన్ నిలిపివేసి, ఆ స్థానంలో రూ. 149 ప్లాన్ తీసుకువచ్చింది. సాధారణంగా రూ. 119తో రీఛార్జ్ చేసుకుంటే 14 రోజుల పాటు అన్‌లిమిటెడ్ కాల్స్ మాత్రమే కాకుండా, ప్రతి రోజూ 1.5 జీబీ డేటా, 100 మెసేజులు చేసుకోవడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు ఈ ప్లాన్ స్థానంలో కొత్త ప్లాన్ పుట్టుకొచ్చింది.
రూ. 119 స్థానంలో వచ్చిన రూ. 149 ప్లాన్ వ్యాలిడిటీ ఇప్పుడు 20 రోజుల వరకు ఉంటుంది. అలాగే రోజుకి 1 జీబీ డేటాతో సహా 100 మెసేజిలు చేసుకోవచ్చు. అంతే కాకుండా ఈ ప్లాన్ ద్వారా యూజర్లు జియో టీవీ యాప్, జియో సినిమాల్లో కార్యక్రమాలను చూసే అవకాశం ఉంటుంది.
ఇదీ చదవండి: ఖరీదైన కారు కొన్న పుష్ప నటుడు - ధర ఎంతో తెలిస్తే షాక్ అవుతారు!
ఇదిలా ఉండగా.. ఇటీవల జియో తన యూజర్లకు నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌తో మొదటిసారి రెండు ప్లాన్స్ లాంచ్ చేసింది. దీంతో ఒక ప్లాన్ రూ. 1099 (84 రోజుల వ్యాలిడిటీ) కాగా, మరో ప్లాన్ రూ. 1499 (84రోజుల వ్యాలిడిటీ). ఈ రెండింటిలోనూ వినియోగదారుని లభించే డేటా ప్యాక్ వేరువేరుగా ఉంటుందని గుర్తుంచుకోవాలి. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ మొబైల్స్ ప్లాన్ ధర రూ. 149 కాగా, బేసిక్ ప్లాన్ ధర రూ. 199గా ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment