రిలయన్స్ జియో రీఛార్జ్ ప్లాన్‌ల ధరను పెంచిన తర్వాత.. ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం మూడు కొత్త ప్లాన్‌లను పరిచయం చేసింది. ఈ కొత్త ప్లాన్‌లు ఫ్రీ కాలింగ్, డేటా, ఓటీటీ స్ట్రీమింగ్ ప్రయోజనాలను అందిస్తాయి. ఇది తప్పకుండా తన పోర్ట్‌ఫోలియోను మెరుగుపరచడానికి ఉపయోగపడుతుందని సంస్థ భావిస్తోంది.
జియో తీసుకొచ్చిన కొత్త ప్లాన్‌ల ధర రూ. 329, రూ. 949, రూ. 1049. ఇందులో ప్రతి ఒక్కటీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, జీ5, సోనిలైవ్ వంటి ప్రధాన ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లకు సబ్‌స్క్రిప్షన్‌లను అందిస్తోంది.
జియో రూ.329 ప్లాన్
రూ.329 ప్లాన్ 28 రోజుల వాలిడిటీతో వస్తుంది
రోజుకు 1.5GB డేటాను అందిస్తుంది
అపరిమిత ఫ్రీ కాలింగ్ ఉంది
ప్రతిరోజూ 100 ఉచిత SMSలతో వస్తుంది
జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ యాక్సెస్ వంటి వాటికి సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది.
జియో రూ.949 ప్లాన్
రూ.949 ప్లాన్ 84 రోజుల వాలిడిటీతో వస్తుంది.
అపరిమిత ఫ్రీ కాలింగ్ లభిస్తుంది.
వినియోగదారులు రోజుకు 2జీబీ డేటాను పొందుతారు.
ఈ ప్లాన్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ (మొబైల్) కోసం 90 రోజుల సబ్‌స్క్రిప్షన్ అందిస్తుంది.
5జీ వెల్‌కమ్ ఆఫర్‌తో వస్తుంది, హై-స్పీడ్ ఇంటర్నెట్‌ను పొందాలనుకునేవారికి మంచి ఆప్షన్.
జియో రూ.1,049 ప్లాన్
ఈ ప్లాన్ 84 రోజుల పాటు చెల్లుబాటు అవుతుంది
రోజుకు 2GB డేటా ఉపయోగించుకోవచ్చు.
ప్రతిరోజూ 100 ఉచిత SMSలను అందిస్తుంది
వినియోగదారులు సోనీలైవ్, జీ5 వంటి వాటికి సబ్‌స్క్రిప్షన్ పొందుతారు
జియోటీవీ మొబైల్ యాప్‌తో వస్తుంది.
5జీ వెల్‌కమ్ ఆఫర్ లభిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment