new plans
-
జియో కొత్త ఐఎస్డీ ప్లాన్లు.. రూ.39కే!
టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో తన ఐఎస్డీ రీఛార్జ్ ప్లాన్లను పునరుద్ధరించింద. కొత్త ప్లాన్లు కేవలం రూ.39 నుంచి ప్రారంభమవుతాయి. కొత్త ప్లాన్లతో 7 రోజులపాటు ఐఎస్డీ కాల్స్ చేసుకోవచ్చని, అత్యంత తక్కువ ధరలకు ఐఎస్డీ మినిట్స్ అందిస్తున్నట్లు జియో పేర్కొంది.జియో బంగ్లాదేశ్, యూకే, సౌదీ అరేబియా, నేపాల్, చైనా, జర్మనీ, నైజీరియా, పాకిస్తాన్, ఖతార్, న్యూజిలాండ్, శ్రీలంక, స్విట్జర్లాండ్, స్పెయిన్, ఇండోనేషియా కోసం ఐఎస్డీ రీఛార్జ్ ప్లాన్ రేట్లను సవరించింది.యూఎస్, కెనడా కోసం జియో ఐఎస్డీ ప్లాన్ రూ.39 నుండి ప్రారంభమవుతుంది. 7 రోజుల చెల్లుబాటుతో 30 నిమిషాల టాక్ టైమ్‌ని అందిస్తోంది. అదే విధంగా బంగ్లాదేశ్‌కు రూ.49 ప్లాన్ 20 నిమిషాల టాక్ టైమ్, సింగపూర్, థాయ్‌లాండ్, మలేషియా, హాంకాంగ్‌లకు రూ.59 ప్లాన్ 15 నిమిషాల టాక్ టైమ్‌ని అందిస్తోంది.ఇక ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లకు 15 నిమిషాల టాక్ టైమ్‌తో రూ.69 రీఛార్జ్ ప్లాన్, యూకే, జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్లకు 10 నిమిషాల టాక్ టైమ్‌తో రూ.79 రీఛార్జ్ ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. -
ఆకర్షణీయమైన బెనిఫిట్లతో జియో కొత్త రీచార్జ్ ప్లాన్లు
రిలయన్స్ జియో (Jio) తన ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ రీఛార్జ్ ప్లాన్ల ధరలను ఇటీవల సగటున 15 శాతం పెంచింది. దీనిపై కస్టమర్ల నుంచి వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో అప్డేట్లో భాగంగా కంపెనీ ఇప్పటికే ఉన్న ప్లాన్లపై కొన్ని ప్రయోజనాలను జియో సవరించింది.వివిధ కస్టమర్ల అవసరాలకు అనుగుణగా జియో కొత్త ఆప్షన్లను రూపొందించింది. కొత్త ఆఫర్లలో రూ. 1,028, రూ. 1,029 రీఛార్జ్ ప్లాన్లు ఉన్నాయి. ఈ రెండూ వినియోగదారులకు సమగ్ర ప్రయోజనాలను అందించేలా రూపొందించారు. ఏ ప్లాన్ ఏయే బెనిఫిట్స్ ఆఫర్ చేస్తుందో ఇక్కడ తెలుసుకుందాం.రూ. 1,028 ప్లాన్జియో రూ. 1,028 ప్లాన్ 84 రోజుల పాటు అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్లను అందిస్తుంది. అదనంగా సబ్స్క్రైబర్లు 2జీబీ రోజువారీ డేటాను అందుకుంటారు. ప్లాన్ వ్యవధిలో మొత్తం 168జీబీ లభిస్తుంది. జియో 5జీ నెట్వర్క్ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో వినియోగదారులు అపరిమిత 5జీ డేటాను ఆనందివచ్చు.రూ. 1,028 ప్లాన్‌లో స్విగ్గీ వన్ లైట్ మెంబర్షిప్ ఉంది. తరచుగా ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసే కస్టమర్లకు ఇది సరైనది. అంతేకాకుండా జియో టీవీ, జియో సినిమా, జియోక్లౌడ్ సేవలకు కూడా యాక్సెస్‌ను పొందుతారు.రూ. 1,029 ప్లాన్జియో రూ. 1,029 ప్లాన్ విషయానికి వస్తే అపరిమిత కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు 84 రోజులపాటు ఆనందించవచ్చు. రోజూ 2జీబీ 4జీ డేటా, అందుబాటులో ఉన్న చోట అపరిమిత 5జీ డేటా వినియోగించుకోవచ్చు. స్ట్రీమింగ్ కంటెంట్‌ను ఆస్వాదించే వినియోగదారులకు ఈ ప్లాన్ అమెజాన్ ప్రైమ్ లైట్ ప్రయోజనాలను అందిస్తుంది. దీంతోపాటు జియోటీవీ, జియోసినిమా, జియోక్లౌడ్కి యాక్సెస్ ఉంటుంది. -
ఎస్బీఐ శుభవార్త!.. డిపాజిటర్ల కోసం కొత్త ప్లాన్స్..
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) మరింత మంది డిపాజిటర్లను ఆకర్షించే ప్రయత్నంలో భాగంగా.. రికవరింగ్ డిపాజిట్లు, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (SIP) వంటి వినూత్న పథకాలను పరిచయం చేయనుంది. ఆర్థికంగా ఎదగాలనుకునేవారు.. కొన్ని విభిన్న పెట్టుబడి ఎంపికల కోసం చూస్తారు. అలాంటి కస్టమర్ల అభివృద్ధి కోసం ఎస్బీఐ చర్యలు తీసుకుంటోందని చైర్మన్ సీఎస్ శెట్టి పేర్కొన్నారు.ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతున్న క్రమంలో చాలామంది పొదుపు చేయడం లేదా పెట్టుబడులకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు. అయితే పెట్టుబడులు పెట్టే ప్రతి ఒక్కరూ.. లాభాలనే కోరుకుంటారు. రిస్క్ ఉన్న వాటికంటే కూడా.. వారి పెట్టుబడులకు అధిక లాభాలు వచ్చే రంగాలవైపు సుముఖత చూపుతారు. కాబట్టి అలాంటి వారి కోసం కొత్త బ్యాంకింగ్ సేవలను ప్రవేశపెట్టాలని సీఎస్ శెట్టి అన్నారు.కస్టమర్ల కోసం ఫిక్స్డ్ డిపాజిట్స్, రికవరింగ్ డిపాజిట్స్, సిప్ పెట్టుబడుల కాంబోతో ఓ కొత్త సర్వీస్ తీసుకురావాలనే ఆలోచనలో ఎస్బీఐ ఉన్నట్లు సీఎస్ శెట్టి వెల్లడించారు. ఈ ఆవిష్కరణలు మొత్తం యువ కస్టమర్లను, ముఖ్యంగా Gen Z తరాన్ని ఆకర్షించడానికి ఉద్దేశించినట్లు పేర్కొన్నారు.డిపాజిట్లను పెంచడంతో పాటు దేశవ్యాప్తంగా నెట్‌వర్క్‌ను పెంచడానికి కూడా యోచిస్తున్నట్లు ఎస్బీఐ చైర్మన్ వివరించారు. డిపాజిట్ సమీకరణలో కస్టమర్ సర్వీస్, వడ్డీ రేట్లు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని శెట్టి చెప్పారు. కాబట్టి సమతుల్య వడ్డీ రేట్లు, ఉన్నతమైన కస్టమర్ సేవను అందించడంపైనే ఎస్బీఐ దృష్టి ఉందని సూచించారు. డిజిటల్ బ్యాంకింగ్‌లో కూడా గణనీయమైన పురోగతి సాధించిన ఎస్బీఐ ప్రతిరోజూ 50000 నుంచి 60000 సేవింగ్ అకౌంట్స్ ఓపెన్ చేస్తోందని ఆయన అన్నారు. -
యూత్ కోసం ఎల్ఐసీ కొత్త టర్మ్ ప్లాన్లు..
భారత జీవిత బీమా సంస్థ (LIC) యువతను దృష్టిలో ఉంచుకుని రెండు కొత్త టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్లను ప్రారంభించింది. ఇవి నాన్-పార్టిసిపేటింగ్, నాన్-లింక్డ్, రిస్క్ ప్లాన్లు. లోన్ రీపేమెంట్ రిస్క్‌ల నుంచి రక్షణ కల్పించేలా ఈ ప్లాన్లను రూపొందించారు. వీటి ప్రయోజనాలు ఏంటి అన్నది ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం..ఎల్ఐసీ కొత్త ప్లాన్లు ఇవే..ఎల్ఐసీ తీసుకొచ్చిన కొత్త టర్మ్ ప్లాన్ల పేర్లు ఒకటి ఎల్ఐసీ యువ టర్మ్/డిజి టర్మ్, మరొకటి ఎల్ఐసీ యువ క్రెడిట్ లైఫ్/డిజి క్రెడిట్ లైఫ్. వీటిని ఎల్ఐసీ సీఈఓ, ఎండీ సిద్ధార్థ మొహంతి ప్రారంభించారు.యువ టర్మ్/డిజి టర్మ్‌పాలసీ వ్యవధిలో పాలసీదారు మరణించిన సందర్భంలో పాలసీదారు కుటుంబానికి ఆర్థిక భద్రతను అందిస్తుంది.గ్యారెంటీడ్ డెత్ బెనిఫిట్స్ అందిస్తుంది.ఎల్ఐసీ యువ టర్మ్ మధ్యవర్తుల ద్వారా అందుబాటులో ఉంటుంది.ఎల్ఐసీ డిజి టర్మ్ ఎల్ఐసీ వెబ్సైట్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది.ప్రవేశ వయసు కనిష్టం 18 సంవత్సరాలు, గరిష్టం 45 సంవత్సరాలు.మెచ్యూరిటీ వయసు 33- 75 సంవత్సరాల మధ్య.హామీ మొత్తం రూ. 50 లక్షల నుంచి రూ. 5 కోట్ల మధ్య.డెత్ బెనిఫిట్స్ రెగులర్, లిమిటెడ్ ప్రీమియం చెల్లింపు: వార్షిక ప్రీమియంకు ఏడు రెట్లు లేదా మరణించిన తేదీ వరకు చెల్లించిన మొత్తం ప్రీమియంలలో 105% లేదా నిర్ణీత మొత్తం.సింగిల్ ప్రీమియం చెల్లింపు: సింగిల్ ప్రీమియంలో 125% లేదా హామీ మొత్తం.యువ క్రెడిట్ లైఫ్/డిజి క్రెడిట్ లైఫ్యువ క్రెడిట్ లైఫ్/డిజి క్రెడిట్ లైఫ్ ప్లాన్లు రుణ బాధ్యతలకు కవరేజీని అందిస్తాయి. గృహ, విద్య లేదా వెహికల్ లోన్ వంటి వాటి రీ పేమెంట్ అవసరాలకు రక్షణ కల్పిస్తాయి. ఈ ప్లాన్లు ఆఫ్‌లైన్, ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి.హామీ మొత్తం: రూ. 50 లక్షల నుంచి రూ. 5 కోట్లు.డెత్ బెనిఫిట్స్: పాలసీ వ్యవధిలో పాలసీదారు మరణిస్తే, లోన్ బ్యాలెన్స్ ప్రకారం డెత్ బెనిఫిట్స్ తగ్గుతాయి. ఈ కొత్త ప్లాన్లు యువ వినియోగదారులకు వారి భవిష్యత్తును సురక్షితంగా ఉంచుకోవడానికి, లోన్ రిస్క్‌ల నుంచి రక్షణ పొందడానికి మెరుగైన అవకాశాన్ని అందిస్తాయి. -
జియో యూజర్లకు అంబానీ గిఫ్ట్!.. సైలెంట్‌గా నాలుగు కొత్త ప్లాన్స్
జియో రీఛార్జ్ ప్లాన్స్ భారీగా పెంచేసిందని యూజర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న వేళ ముకేశ్ అంబానీ గుడ్ న్యూస్ చెప్పారు. ఇందులో భాగంగానే అంబానీ నాలుగు బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రవేశపెట్టారు.జియో కొత్త ప్రీపెయిడ్ ఆఫర్లురూ.199 ప్లాన్: ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే.. రోజుకు 1.5 జీబీ డేటా, అపరిమిత కాల్స్, రోజుకు వంద ఎస్ఎంఎస్లు మాత్రమే కాకుండా జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ వంటి సబ్స్క్రిప్షన్లు (18 రోజులు) ఉన్నాయి.రూ.209 ప్లాన్: ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే.. రోజుకు 1 జీబీ డేటా, అపరిమిత కాల్స్, రోజుకు వంద ఎస్ఎంఎస్లతో పాటు 22 రోజుల చెల్లుబాటుతో జియో ఎంటర్టైన్మెంట్ యాక్సిస్ లభిస్తుంది.రూ.249 ప్లాన్: రోజుకు 1జీబీ డేటా, అపరిమిత కాల్స్, రోజుకు వంద ఎస్ఎంఎస్లతో పాటు 28 రోజుల చెల్లుబాటుతో జియో ఎంటర్టైన్మెంట్ యాక్సిస్ లభిస్తుంది.రూ.299 ప్లాన్: రోజుకు 1.5 జీబీ డేటా, అపరిమిత కాల్స్, రోజుకు వంద ఎస్ఎంఎస్లతో పాటు 28 రోజుల చెల్లుబాటుతో జియో ఎంటర్టైన్మెంట్ యాక్సిస్ లభిస్తుంది.రీఛార్జ్ ప్లాన్స్ పెంచడం వల్ల ఇప్పటికే చాలామంది జియో యూజర్లు 'బీఎస్ఎన్ఎల్'కు మారిపోతున్నారు. ఇప్పటికే లక్షలమంది యూజర్లు బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్ తీసుకున్నట్లు సంస్థ అధికారికంగా వెల్లడించింది. దీంతో ఇక యూజర్లను మళ్ళీ ఆకట్టుకోవడానికి సంస్థ ఈ ప్లాన్స్ ప్రకటించినట్లు తెలుస్తోంది. -
జియో కొత్త రీఛార్జ్ ప్లాన్స్.. ప్రయోజనాలెన్నో!
రిలయన్స్ జియో రీఛార్జ్ ప్లాన్ల ధరను పెంచిన తర్వాత.. ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం మూడు కొత్త ప్లాన్లను పరిచయం చేసింది. ఈ కొత్త ప్లాన్లు ఫ్రీ కాలింగ్, డేటా, ఓటీటీ స్ట్రీమింగ్ ప్రయోజనాలను అందిస్తాయి. ఇది తప్పకుండా తన పోర్ట్‌ఫోలియోను మెరుగుపరచడానికి ఉపయోగపడుతుందని సంస్థ భావిస్తోంది.జియో తీసుకొచ్చిన కొత్త ప్లాన్ల ధర రూ. 329, రూ. 949, రూ. 1049. ఇందులో ప్రతి ఒక్కటీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, జీ5, సోనిలైవ్ వంటి ప్రధాన ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లకు సబ్స్క్రిప్షన్లను అందిస్తోంది.జియో రూ.329 ప్లాన్రూ.329 ప్లాన్ 28 రోజుల వాలిడిటీతో వస్తుందిరోజుకు 1.5GB డేటాను అందిస్తుంది అపరిమిత ఫ్రీ కాలింగ్ ఉందిప్రతిరోజూ 100 ఉచిత SMSలతో వస్తుందిజియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ యాక్సెస్ వంటి వాటికి సబ్స్క్రిప్షన్ లభిస్తుంది.జియో రూ.949 ప్లాన్రూ.949 ప్లాన్ 84 రోజుల వాలిడిటీతో వస్తుంది.అపరిమిత ఫ్రీ కాలింగ్ లభిస్తుంది. వినియోగదారులు రోజుకు 2జీబీ డేటాను పొందుతారు.ఈ ప్లాన్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ (మొబైల్) కోసం 90 రోజుల సబ్స్క్రిప్షన్ అందిస్తుంది.5జీ వెల్కమ్ ఆఫర్‌తో వస్తుంది, హై-స్పీడ్ ఇంటర్నెట్ను పొందాలనుకునేవారికి మంచి ఆప్షన్.జియో రూ.1,049 ప్లాన్ఈ ప్లాన్ 84 రోజుల పాటు చెల్లుబాటు అవుతుంది రోజుకు 2GB డేటా ఉపయోగించుకోవచ్చు.ప్రతిరోజూ 100 ఉచిత SMSలను అందిస్తుందివినియోగదారులు సోనీలైవ్, జీ5 వంటి వాటికి సబ్స్క్రిప్షన్ పొందుతారుజియోటీవీ మొబైల్ యాప్‌తో వస్తుంది.5జీ వెల్కమ్ ఆఫర్ లభిస్తుంది. -
కొత్త ప్లాన్లు తీసుకొచ్చిన జియో
రిలయన్స్ జియో ఇప్పటికే టెలికాం ఛార్జీలను సవరించింది. ఈ క్రమంలోనే కొత్తగా 5జీ డేటా బూస్టర్ ప్లాన్లను ప్రవేశపెట్టింది. 1జీబీ, 1.5జీబీ మొబైల్ డేటా ప్లాన్లను తీసుకొచ్చింది. ఇప్పటికే వివిధ ప్రీపెయిడ్ ప్లాన్లను కలిగి ఉన్న యూజర్లు అదనపు డేటా కోసం వీటిని రీచార్జ్ చేసుకోవచ్చు.ఈ కొత్త ప్లాన్ల ధర రూ.51, రూ. 101, రూ. 151 లుగా ఉంది. డేటా కోసం మాత్రమే రీఛార్జ్ ప్లాన్ చేయాల్సిన వారికి ఈ ప్లాన్లు ఉత్తమమైనవి. మూడు ప్లాన్లలో ఒక సాధారణ విషయం ఏమిటంటే, ఇవన్నీ అపరిమిత 5G డేటాతో వస్తాయి. అయితే ఈ మూడు ప్లాన్లకు ప్రత్యేక వ్యాలిడిటీ లేదు. ఈ ప్లాన్ల చెల్లుబాటు యాక్టివ్ ప్లాన్ వ్యాలిడిటీపై ఆధారపడి ఉంటుంది.జియో వెబ్సైట్లో ట్రూ అన్లిమిటెడ్ అప్‌గ్రేడ్ సెక్షన్ కింద ఈ ప్లాన్లు లిస్ట్ అయ్యాయి. అయితే ఇవి రూ. 479, రూ. 1,899 ప్రీపెయిడ్ ప్లాన్లకు అనుకూలంగా లేవు. మూడింటిలో చౌకైనది. రూ. 51 ప్లాన్. 3జీబీ 4జీ మొబైల్ డేటాను అందిస్తుంది. మీరు 5జీ కనెక్టివిటీ బాగా ఉన్న ప్రాంతంలో నివసిస్తున్నట్లయితే, అపరిమిత 5జీతో పాటుగా రూ.101 ప్లాన్ అయితే 6జీబీ 4జీ డేటా, రూ.151 ప్లాన్ అయితే 9జీబీ 4జీ డేటా పొందవచ్చు. -
సీనియర్ సిటిజన్ల ప్రయోజనాలకు పెద్దపీట
న్యూఢిల్లీ: భారతదేశంలో పన్ను సంస్కరణలతో పాటు, సీనియర్ సిటిజన్లకు తప్పనిసరి పొదుపు, గృహనిర్మాణ ప్రణాళిక అవసరమని నీతి ఆయోగ్ స్పష్టం చేసింది. దేశ జనభాలో 2050 నాటికి సీనియర్ సిటిజన్ల వాటా 19.5 శాతానికి చేరుకుంటుందని, ఈ నేపథ్యంలో వారి ప్రయోజనాలకు పెద్దపీట వేయాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించింది. భారతదేశంలో సీనియర్ సిటిజన్ల భద్రత– సంస్కరణలు అనే అంశంపై ఒక నివేదికను ఆవిష్కరించిన నీతి ఆయోగ్, సీనియర్ సిటిజన్లకు అన్ని సేవలను సులువుగా అందుబాటులోకి తీసుకురావడానికి ఒక జాతీయ పోర్టల్‌ను అభివృద్ధి చేయాలని స్పష్టం చేసింది. ‘‘భారత్‌లో సామాజిక భద్రతా విధాన చర్యలు పరిమితంగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో చాలా మంది వృద్ధులు వారి పొదుపు నుండి వచ్చే ఆదాయంపై ఆధారపడతారు. కొన్ని సందర్భాల్లో నెలకొనే తక్కువ వడ్డీ రేట్ల వ్యవస్థ వారి ఆదాయ కోతకు దారితీస్తుంది. కొన్నిసార్లు ఈ వడ్డీరేట్లు జీవనోపాధి స్థాయిల కంటే కూడా తక్కువగా ఉంటాయి’’ అని నివేదిక వివరించింది. అందువల్ల ఆయా అంశాల పరిశీలనకు, సీనియర్ సిటిజన్ల ప్రయోజనాల పరిరక్షణకు ఒక నియంత్రణా యంత్రాంగం అవసరమని ఉద్ఘాటించింది. వృద్ధ మహిళలకు మరింత రాయితీ ఇవ్వడం అవసరమని, అది వారి ఆరి్థక శ్రేయస్సుకు దోహదం చేస్తుందని నివేదిక పేర్కొంది. నివేదిక ప్రకారం భారతదేశంలో వృద్ధులు ప్రస్తుతం జనాభాలో 10 శాతానికి పైగా (10 కోట్లకు పైగా) ఉన్నారు. 2050 నాటికి మొత్తం జనాభాలో ఇది 19.5 శాతానికి చేరుతుందని అంచనా. సీనియర్ సిటిజన్ల ప్రయోజనాలకుగాను పన్ను సంస్కరణలు, దత్తత వ్యవస్థ నిబంధనావళి సరళీకరణ అవసరమని కూడా నీతి ఆయోగ్ నివేదిక ఉద్ఘాటించింది. భారతదేశంలో 75 శాతం కంటే ఎక్కువ మంది వృద్ధులు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారని వివరించింది. -
ఒక్కప్లాన్‌తో 14 ఓటీటీ సబ్స్క్రిప్షన్లు.. జియో టీవీ బంపర్ ఆఫర్
ప్రముఖ టెలికామ్ దిగ్గజం 'రిలయన్స్ జియో' (Reliance Jio) ఇటవల తన సబ్స్క్రైబర్ల ఓ సరి కొత్త ప్లాన్స్ తీసుకువచ్చింది. ఈ కొత్త ప్లాన్స్ ప్రకారం ఏకంగా 14 ఓటీటీలను ఒకే ప్లాన్ తో పొందే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. కొత్త ప్లాన్ల ధరలు రిలయన్స్ జియోటీవీ ప్రీమియం ప్లాన్లలో రూ.398, రూ.1198, రూ.4498 ధరలతో మూడు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు ఉన్నాయి. ఈ ప్లాన్స్ ఇప్పటికే (15 డిసెంబర్ 2023) అందుబాటులో ఉన్నాయి 👉రూ.398తో ప్రారంభమయ్యే ప్లాన్ రోజుకు 2GB డేటాతో 28 రోజుల పాటు చెల్లుబాటు అవుతుంది. అంతే కాకుండా మీరు అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకి 100 SMSలు వంటివి పొందవచ్చు. అయితే ఈ ప్లాన్ 12 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లను మాత్రమే అందిస్తుంది. 👉రూ.1198తో ప్రారంభమయ్యే ప్లాన్ అనేది 84 రోజుల పాటు చెల్లుబాటు అవుతుంది. ఇందులో రోజుకి 2 జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకి 100 SMSలు, JioTV ప్రీమియం (14 ఓటీటీలు) వంటివి పొందవచ్చు. 👉రూ.4498తో ప్రారంభమయ్యే ప్లాన్ 365 రోజులు పాటు చెల్లుబాటు అవుతుంది. ఇందులో కూడా రోజుకి 2జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకి 100 SMSలు వంటివి లభిస్తాయి. పైగా 14 ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లను పొందవచ్చు. కంపెనీ ఈ ప్లాన్ కోసం ఈఎమ్ఐ వెసులుబాటుని కూడా అందిస్తుంది. జాబితాలోని రీజనల్ అండ్ గ్లోబల్ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు జియోసినిమా ప్రీమియం డిస్నీ+ హాట్‌స్టార్ జీ5 సోనీలైవ్ ప్రైమ్ వీడియో (మొబైల్) లయన్స్‌గేట్ ప్లే డిస్కవరీ+ డాక్యుబే హోఇచోయ్ SunNXT ప్లానెట్ మరాఠీ చౌపాల్ ఎపిక్ఆన్ కంచ లంక -
‘ఎక్స్’లో పోస్ట్ పెట్టాలంటే డబ్బులు కట్టాలి
వాషింగ్టన్: మైక్రోబ్లాగింగ్ సైట్ ‘ఎక్స్’(ట్విట్టర్) తన వినియోగదారులకు చేదువార్త చెప్పింది. ‘నాట్ ఎ బాట్’ అనే కొత్త సబ్ర్స్కిప్షన్ ప్లాన్‌ను అమల్లోకి తీసుకొచి్చంది. దీనిప్రకారం.. ‘ఎక్స్’లో కొత్త యూజర్లు పోస్ట్‌లు చేయాలన్నా, వేరొకరి ట్వీట్‌ను రీట్వీట్ చేయాలన్నా, రిప్లై ఇవ్వాలన్నా, లైక్ కొట్టాలన్నా, షేర్ చేయాలన్నా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ సబ్ర్స్కిప్షన్ ఫీజు కింద ఏడాదికి ఒక డాలర్ చొప్పున ‘ఎక్స్’ యాజమాన్యం వసూలు చేయనుంది. -
క్రికెట్ అభిమానుల కోసం ప్రత్యేక డేటా ప్లాన్లు
న్యూఢిల్లీ: వన్డే ప్రపంచకప్ టోర్నమెంట్ ఆరంభం కావడంతో టెలికం కంపెనీలు ఎయిర్టెల్, జియో క్రికెట్ అభిమానుల కోసం ప్రత్యేక ప్లాన్లను ఆవిష్కరించాయి. ► జియో రూ.328 ప్లాన్ రోజూ 1.5 జీబీ హైస్పీడ్ డేటా, 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. మూడు నెలల డిస్నీప్లస్ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్రి్కప్షన్ ఇందులో భాగంగా ఉంటుంది. ► జియో రూ.758 ప్లాన్‌లో రోజూ 1.5 జీబీ హైస్పీడ్ డేటా 84 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఇందులోనూ మూడు నెలల డిస్నీప్లస్ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్రి్కప్షన్ ఉచితం. ► జియో రూ.388 ప్లాన్ రోజువారీ 2జీబీ హైస్పీడ్ డేటా, 28 రోజుల వ్యాలిడిటీ, మూడు నెలల డిస్నీహాట్ స్టార్ సబ్‌స్క్రిప్షన్‌తో ఉంటుంది. ► జియో రూ.808 ప్లాన్ రోజువారీ 2జీబీ డేటా, 84రోజుల వ్యాలిడిటీ, మూడు నెలల డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సబ్్రస్కిప్షన్తో వస్తుంది. ► జియో రూ.598లో 84 రోజులు, రూ.3,178 ప్లాన్‌లో ఏడాది పాటు డిస్నీ హాట్‌స్టార్ ఉచితంగా లభిస్తుంది. ► భారతీ ఎయిర్టెల్ 6జీబీ డేటా, ఒక రోజు వ్యాలిడిటీతో రూ.49 ప్లాన్‌ను తీసుకొచ్చింది. అలాగే, రెండు రోజుల వ్యాలిడిటీ, అన్లిమిటెడ్ డేటా ఆప్షన్‌తో రూ.99 ప్లాన్‌ను ఆవిష్కరించింది. -
2040కల్లా కర్బనరహితం
న్యూఢిల్లీ: పూర్తికర్బనరహిత కంపెనీగా ఆవిర్భవించేందుకు ప్రణాళికలు అమలు చేయనున్నట్లు చమురు రంగ ప్రభుత్వ దిగ్గజం ఆయిల్ ఇండియా తాజాగా పేర్కొంది. 2040కల్లా కర్బన ఉద్గారాల నెట్‌జీరో కంపెనీగా నిలిచేందుకు రూ. 25,000 కోట్ల పెట్టుబడులు వెచి్చంచనున్నట్లు తెలియజేసింది. దీనిలో భాగంగా గ్యాస్ వినియోగాన్ని తగ్గించడం, పునరుత్పాదక విద్యుదుత్పాదనకు తెరతీడం, గ్రీన్ హైడ్రోజన్, బయోగ్యాస్, ఇథనాల్ ప్లాంట్ల ఏర్పాటు తదితర కార్యక్రమాలను చేపట్టనున్నట్లు కంపెనీ చైర్మన్ రంజిత్ రథ్ వివరించారు. అరుణాచల్ ప్రదేశ్ నుంచి అస్సామ్కు సహజవాయు సరఫరాకుగాను 80 కిలోమీటర్ల పైప్‌లైన్‌ను నెలకొల్పనున్నట్లు వెల్లడించారు. తద్వారా లిక్విడ్ ఇంధనాల రవాణా కాలుష్యానికి చెక్ పెట్టనున్నట్లు తెలియజేశారు. అంతేకాకుండా ముడిచమురు రవాణాకు ఏర్పాటు చేసిన కొన్ని పైప్లైన్లను గ్యాస్ పంపిణీకి అనువుగా మార్పు చేయనున్నట్లు పేర్కొన్నారు. పెట్టుబడులు ఇలా నెట్‌జీరో పెట్టుబడుల్లో రూ. 9,000 కోట్లను 1,800 మెగావాట్ల సోలార్, ఆన్‌షోర్ పవన విద్యుత్ ప్రాజెక్టులకు కేటాయించనుండగా.. మరో రూ. 3,000 కోట్లు గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుపై వెచి్చంచనున్నట్లు రంజిత్ తెలియజేశారు. ఈ బాటలో రూ. 1,000 కోట్లు కార్బన్ క్యాప్చర్, యుటిలైజేషన్, స్టోరేజీ(సీసీయూఎస్) ప్రాజెక్టులకు వెచి్చంచనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే కంపెనీ అస్సామ్‌లో 640 మెగావాట్లు, హిమాచల్ ప్రదేశ్‌లో 150 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టుల ప్రణాళికలు వేసింది. వెరసి నెట్‌జీరో లక్ష్యాన్ని ముందుగానే అంటే 2038కల్లా సాధించాలని ఆశిస్తున్నట్లు తెలియజేశారు. -
బైజూస్ సరికొత్త ప్లాన్స్: విదేశీ విభాగాల విక్రయంలో
న్యూఢిల్లీ: ఎడ్టెక్ సంస్థ బైజూస్ 1.2 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 9,956 కోట్లు) రుణ మొత్తాన్ని పూర్తిగా చెల్లించేసే ప్రయత్నాల్లో ఉంది. ఆరు నెలల్లోపు తిరిగి చెల్లించేందుకు యోచిస్తోంది. తదుపరి మూడు నెలల్లో 300 మిలియన్ల డాలర్లను తిరిగి చెల్లించాలన్న ప్రతిపాదనను ప్రతిపాదనకు రుణదాతలు ఆమోదించడంతో సంస్థకు కొంత ఊరటనివ్వనుంది. (ఆడి క్యూ8 స్పెషల్ ఎడిషన్, ధర చూస్తే..!) ఇందులో భాగంగా విదేశీ విభాగాలైన ఎపిక్, గ్రేట్ లెర్నింగ్ సంస్థలను విక్రయించాలని యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ రెండింటి విక్రయంతో దాదాపు 800 మిలియన్ డాలర్ల నుంచి 1 బిలియన్ డాలర్ల వరకు సమకూర్చుకోవచ్చని బైజూస్ భావిస్తున్నట్లు వివరించాయి. అలాగే వాటాల విక్రయం ద్వారా తాజాగా మరిన్ని పెట్టుబడులు కూడా సమీకరించడంపైనా కంపెనీ కసరత్తు చేస్తున్నట్లు పేర్కొన్నాయి. 1.2 బిలియన్ డాలర్ల రుణాన్ని (టీఎల్‌బీ) మొత్తం మీద ఆరు నెలల వ్యవధిలో తీర్చేయొచ్చని బైజూస్ ఆశిస్తోంది. 2021 నవంబర్‌లో విదేశీ ఇన్వెస్టర్ల నుంచి బైజూస్ ఈ రుణాన్ని తీసుకుంది. (10 శాతం జీఎస్టీ?ఇక డీజిల్ కార్లకు చెక్? నితిన్ గడ్కరీ క్లారిటీ) -
హ్యుందాయ్ చేతికి జనరల్ మోటార్స్ ప్లాంట్.. కొత్త ప్లాన్ ఏంటంటే?
ప్రముఖ అమెరికన్ కార్ల తయారీ సంస్థ 'జనరల్ మోటార్స్' భారతదేశంలోని తన తాలెగావ్ ప్లాంట్ సౌత్ కొరియా దిగ్గజం 'హ్యుందాయ్ ఇండియా' చేతికి అందించినట్లు సమాచారం. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం హ్యుందాయ్ కంపెనీ మహారాష్ట్రలోని జనరల్ మోటార్ యూనిట్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ డీల్ విలువ ఎంత అనేదానికి సంబంధించిన వివరాలు అధికారికంగా వెలువడలేదు. దేశంలో అత్యధిక కార్లను విక్రయిస్తున్న సంస్థల జాబితాలో ఒకటైన హ్యుందాయ్ తన ఉనికిని మరింత విస్తరించడానికి ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని భావిస్తున్నారు. 2025 నుంచి ఉత్పత్తి.. హ్యుందాయ్ కంపెనీ ఈ కొత్త ప్లాంట్‌లో 2025 నుంచి ఉత్పత్తి ప్రారంభించే అవకాశం ఉంది. ఇప్పటికే సంస్థ ఈ సంవత్సరం ప్రారంభంలో తమిళనాడులో ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి ఏకంగా రూ. 20వేలకోట్లు పెట్టుబడికి ఒప్పందం కుదుర్చుకుంది. ఇక తాలెగావ్ కొత్త ప్లాంట్‌లో ఏడాదికి 10 లక్షల యూనిట్లను ఉత్పత్తి చేయాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఇదీ చదవండి: అందులోని వాహనాల ఖరీదే వేలకోట్లు.. ఆ ప్యాలెస్ గురించి తెలిస్తే షాకవుతారు! భారతదేశంలో జనరల్ మోటార్స్ అమ్మకాలు రోజురోజుకి తగ్గుముఖం పడుతుండటంతో త్వరలో ఇండియాను వదిలేసే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. కాగా ఇప్పుడు మహారాష్ట్ర ప్లాంట్ వదులుకోవడంతో ఆ నమ్మకం మరింత బలపడింది. ఇప్పటికే ఫోర్డ్ కంపెనీ కూడా మన దేశంలో ఉత్పత్తిని నిలిపివేసిన సంగతి తెలిసిందే. -
హ్యుందాయ్ కొత్త ప్లాన్స్: గ్రామీణ భారతంపై కన్ను
హైదరాబాద్: డిజిటల్ ఫ్లోట్ వ్యాన్ల ద్వారా గ్రామీణ కొనుగోలుదారులను ఆకర్షించాల ని హ్యుందాయ్ ఇండియా వ్యూహరచన చేసింది. ఈ మేరకు ఒక ప్రకటన ప్రకారం కారును స్వయంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రదర్శించడం ఈ చొరవ ఉద్దేశం. ఇదీ చదవండి: 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో నెక్సన్ ఈవీ మ్యాక్స్: ధర ఎంతో తెలుసా? ఇందులో భాగంగా, గ్రాండ్ ఐ10 నియోస్‌ను వినియోగదారుల ఇళ్ల వద్దకే పంపాలని నిర్ణయించింది. 36 డిజిటల్ ఫ్లోట్లు వచ్చే రెండు నెలల్లో 27 రాష్ట్రాల్లోని దాదాపు 582 గ్రామీణ ప్రాంతాలను కవర్ చేయాలన్నది కంపెనీ లక్ష్యం. తెలుగు రాష్ట్రాల్లో 61 గ్రామీణ ప్రాంతాలను కవర్ చేయడానికి 4 డిజిటల్ ఫ్లోట్లను సిద్ధం చేసింది. (తనిష్క్ 100 టన్నుల బంగారు మార్పిడి ఉత్సవాలు, ఏకంగా 20 లక్షలమంది) తెలుగు రాష్ట్రాల గ్రామీణ ప్రాంతాలకు బయలుదేరిన డిజిటల్ ఫోట్ వ్యాన్లను జెండా ఊపి ప్రారంభిస్తున్న కంపెనీ ప్రతినిధులను చిత్రంతో తిలకించవచ్చు. ‘‘భారత్ డైనమిక్ మార్కెట్లో చివరి మైలు ను చేరుకోవడానికి వినూత్న విధానాలను అవలంబించాలని మేము విశ్వసిస్తున్నాము. ఉత్పత్తులను గ్రామీణ ప్రాంతాలకు విస్తరించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాము’’ అని హ్యుందాయ్ మోటార్ ఇండియా సీఓఓ తరుణ్ గార్గ్ పేర్కొన్నారు. మరిన్ని టెక్ వార్తలు, బిజినెస్ అప్డేట్స్ కోసం చదవండి: సాక్షిబిజినెస్ -
రాష్ట్రాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి
న్యూఢిల్లీ: భారత్‌ను 2047 నాటికి అభివృద్ది చెందిన దేశంగా తీర్చిదిద్దుకోవాలని, ఈ లక్ష్య సాధన కోసం ఒక ఉమ్మడి ప్రణాళిక సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఒక బృందంగా కలిసి పనిచేయాలన్నారు. రాష్ట్రాలు ఆర్థిక క్రమశిక్షణ పాటించాలని పేర్కొన్నారు. శనివారం ఢిల్లీలో ‘నీతి ఆయోగ్’ ఎనిమిదో గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, కేంద్ర మంత్రులను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. ఇక ఉమ్మడి దార్శనికత(విజన్) అవసరమని అభిప్రాయపడ్డారు. స్థానిక ప్రాంతాల అభివృద్ధికి, సామాజిక మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్రాలు ‘గతిశక్తి పోర్టల్’ను ఉపయోగించాలని చెప్పారు. ‘వికసిత్ భారత్’ సాధనకు సుపరిపాలన కీలకమని వివరించారు. కీలక అంశాలపై చర్చ దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడమే లక్ష్యంగా ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి, మహిళా సాధికారత, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి కీలక అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, అస్సాం, జార్ఖండ్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల ముఖ్యమంత్రులతోపాటు కేంద్ర మంత్రులు అమిత్ షా తదితరులు హాజరయ్యారు. నీతి ఆయోగ్ సమావేశానికి తెలంగాణ, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, పంజాబ్, తమిళనాడు, బిహార్, రాజస్తాన్ తదితర రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకాలేదు. ఈ భేటీకి 19 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, 6 కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు హాజరయ్యారని నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం తెలిపారు. కొందరు సీఎంల తీరు ప్రజా వ్యతిరేకం: బీజేపీ నీతి ఆయోగ్ సమావేశానికి కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కాకపోవడాన్ని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తప్పుపట్టారు. వారి నిర్ణయం ప్రజా వ్యతిరేకం, బాధ్యతారహితం అని విమర్శించారు. దేశ అభివృద్ధికి రోడ్డు మ్యాప్ రూపొందించడంలో నీతి ఆయోగ్ పాత్ర కీలకమని గుర్తుచేశారు. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గైర్హాజరయ్యారని ఆక్షేపించారు. 100 కీలక అంశాలపై చర్చించే గవర్నింగ్ కౌన్సిల్ భేటీకి ముఖ్యమంత్రులు రాకపోవడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. దీనివల్ల వారు తమ రాష్ట్రాల వాణిని వినిపించే అవకాశం కోల్పోయారని తెలిపారు. ప్రధాని మోదీని ఇంకెంత కాలం ద్వేషిస్తారని రవిశంకర్ ప్రసాద్ ప్రశ్నించారు. మోదీని ద్వేషించడానికి ఇంకా చాలా అవకాశాలు వస్తాయని, మరి ప్రజలకెందుకు అన్యాయం చేస్తున్నారని నిలదీశారు. -
జియో కొత్త ప్లాన్.. రూ.198కే బ్రాడ్‌బాండ్ సేవలు
న్యూఢిల్లీ: ఫిక్సిడ్ బ్రాడ్‌బాండ్ సెగ్మెంట్లో పోటీని మరింత వేడెక్కిస్తూ జియో కొత్తగా ఎంట్రీ లెవెల్ ప్లాన్‌ను ఆవిష్కరించింది. నెలకు రూ.198 ధరతో బ్రాడ్‌బాండ్ బ్యాకప్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. దీనితో సెకనుకు 10 మెగాబిట్ వేగంతో నెట్ సర్వీసులు అందుకోవచ్చు. రూ. 21 - 152 వరకు చెల్లించడం ద్వారా 1 - 7 రోజుల పాటు ఇంటర్నెట్ వేగాన్ని 30 ఎంబీపీఎస్ లేదా 100 ఎంబీపీఎస్‌కు అప్‌గ్రేడ్ చేసుకునే వీలును కల్పిస్తున్నట్లు సంస్థ తెలిపింది. 5 నెలల పాటు యూసేజీ, ఇన్స్టాలేషన్ చార్జీలు కలిపి కొత్త కస్టమరు రూ.1,490 కట్టాల్సి ఉంటుంది. ఇప్పటివరకు జియో ఫైబర్ కనెక్షన్ తీసుకునేందుకు కనీస ప్లాన్ నెలకు రూ.399గా ఉంది. -
హోండా మోటార్‌సైకిల్ మాస్టర్ ప్లాన్.. భవిష్యత్ ప్రణాళిక ఇలా!
భారతదేశంలో అతి పెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థగా పేరు పొందిన హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా రాబోయే రోజుల్లో దేశీయ మార్కెట్లో ఏకంగా పది ఎలక్ట్రిక్ టూ వీలర్స్ విడుదల చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తోంది. భవిష్యత్తులో కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి కంపెనీ ఇప్పటి నుంచే ప్రణాళికలను రూపొందిస్తోంది. నివేదికల ప్రకారం.. మల్టిపుల్ పవర్‌ట్రెయిన్స్, స్పీడ్ కేటగిరి, బాడీ టైప్ వంటి వాటిని ఆధారంగా చేసుకుని కంపెనీ భవిష్యత్తులో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను విడుదల చేయనున్నట్లు సమాచారం. సుమారు రెండు సంవత్సరాల తరువాత కంపెనీ ఈ ప్లాన్ సిద్ధం చేసింది. (ఇదీ చదవండి: సైడ్ బిజినెస్‌తో కోట్లు గడిస్తున్న హీరోయిన్లు వీళ్లే!) 2024 నాటికి దేశీయ విఫణిలో ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల చేయడానికి కంపెనీ ప్రయత్నాలు కొనసాగిస్తోంది. ఇందులో భాగంగానే కంపెనీ పాపులర్ స్కూటర్ హోండా యాక్టివాను ఎలక్ట్రిక్ వెర్షన్లో విడుదల చేయనుంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎలక్ట్రిక్ వాహన విభాగంలో తన ఉనికిని చాటుకోవడానికి హోండా చేయవలసిన అన్ని ప్రయత్నాలను నిర్విరామంగా చేస్తోంది. (ఇదీ చదవండి: హయ్యర్ స్టడీస్ లోన్‌పై బ్యాంకు విధించే చార్జెస్, ఇవే!) 2024లో హోండా యాక్టివా ఎలక్ట్రిక్ విడుదలైన తరువాత మరో టూ వీలర్ కూడా లాంచ్ చేసే సూచనలు కనిపిస్తున్నాయి. అంటే వచ్చే ఏడాదిలో కంపెనీ రెండు ఈవీ మోడల్స్ విడుదల చేయనున్నట్లు స్పష్టమైంది. ఆ తరువాత 2026-27 మధ్యలో మరికొన్ని మోడల్స్ విడుదల చేయాలనీ సంస్థ యోచిస్తోంది. మొత్తం మీద కంపెనీ ఎలక్ట్రిక్ వాహన రంగంలో తప్పకుండా మంచి అభివృద్ధిని సాధిస్తుందని భావిస్తున్నాము. -
ఓలా సరికొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్.. కస్టమర్ల కోసం అదిరిపోయే బెనిఫిట్స్
భారత్‌లో ఆటోమొబైల్ రంగం వృద్ది వైపు పరుగులు పెడుతోంది. కరోనా తర్వాత ఈ రంగంలో సేల్స్ ఆశాజనకంగా ఉన్నాయి. అంతేకాకుండా కాలుష్య నివారణ, ఇంధన వాడకం తగ్గించే క్రమంలో మార్కెట్లోకి వస్తున్న ఎలక్ట్రిక్ వాహనాలు విపరీతమైన డిమాండ్ ఏర్పడుతోంది. ఈవీ మార్కెట్లో ఓలా సంస్థ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే ఓలా ఎలక్ట్రిక్ బైక్‌ల సేల్స్‌లో దూసుకెళ్తోంది. తాజాగా తమ కస్టమర్లకు మరిన్ని ప్రయోజనాలు అందించేందుకు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే తాజాగా రెండు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను ప్రవేశపెట్టింది. కస్టమర్లకు మెరుగైన సేవలు అందించడం కోసం ఓలా కేర్, ఓలా కేర్+ ప్లాన్లను ప్రారంభించింది. ఈ ప్లాన్ల ధర వరుసగా రూ. 1,999, కేర్ ప్లస్ రూ. ₹2,999 ఓలా కేర్ బెనిఫిట్స్ ఇలా.. ఓలా కేర్ సబ్స్క్రిప్షన్ ప్లాన్లలో భాగంగా, కస్టమర్లు ఉచిత హోమ్ సర్వీసింగ్ వంటి సేవలను అందిస్తోంది. ఇందులో ఉచిత హోమ్ పికప్, డ్రాప్, రోడ్‌సైడ్ అసిస్టెన్స్ కూడా ఉన్నాయి. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ యజమానులు నాన్ యాక్సిడెంటల్, నాన్ ఇన్సూరెన్స్ కేసులకు రీప్లేస్మెంట్ల సేవలను ఉచింతంగా పొందవచ్చు. ఓలా కేర్ ప్లస్ ఇలా ప్రత్యేకంగా, ఓలా కేర్ ప్లస్‌లో.. ఒక సంవత్సరం పాటు స్కూటర్ ఇన్స్పెక్షన్, ఉచిత లేబర్ ఆన్ సర్వీస్, థెఫ్ట్ అసిస్టెన్స్, హెల్ప్‌లైన్, రోడ్‌సైడ్ అసిస్టెన్స్ ఉన్నాయి. ఓలా కేర్ ప్లస్ (Ola Care+) ప్లాన్ వార్షిక సమగ్ర రోగనిర్ధారణ, ఉచిత హోమ్ సర్వీస్, పికప్/డ్రాప్ సౌకర్యంతో పాటు ఒకవేళ ప్రమాదం (యాక్సిడెంట్) జరిగితే 24×7 డాక్టర్, అంబులెన్స్ సర్వీసులను ఓలా కేర్ + ప్లాన్ ద్వారా ఉపయోగించుకోవచ్చు. ఎక్కడికైనా వెళ్లినప్పుడు అర్ధాంతరంగా స్కూటర్ ఆగిపోతే, టోయింగ్ చేయాల్సి వచ్చినప్పుడు ఉచితంగా టాక్సీ రైడ్ సర్వీస్ పొందవచ్చు. నగరం వెలుపల బైక్ రిపేర్ వచ్చి ఆగిపోతే ఉచిత హోటల్ వసతి పొందవచ్చు. ఓలా చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అన్షుల్ ఖండేల్వాల్ మాట్లాడుతూ, “కస్టమర్లకు ఎల్లప్పుడూ మెరుగైన సేవలు అందించడమే మా లక్ష్యం. ‘ఓలా కేర్ సబ్స్క్రిప్షన్ ప్లాన్’ ద్వారా, మేము కస్టమర్ సర్వీస్ అనుభవాన్ని పూర్తిగా పునర్నిర్మిస్తున్నాం. సబ్స్క్రిప్షన్ ప్లాన్ కస్టమర్లకు మా సర్వీస్ నెట్‌వర్క్‌కు 360 డిగ్రీల యాక్సెస్‌ను అందిస్తుంది, ఈ సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ ద్వారా కంపెనీ కస్టమర్లకు సర్వీస్‌లను వారి ఇంటి వద్ద లేదా సమీపంలోని ఓలా ఎక్స్పీరియన్స్ సెంటర్లలో అందించనుందన్నారు. చదవండి: నమ్మలేకపోతున్నా.. ఇంటర్వ్యూ చేస్తుండగానే ఉద్యోగం ఊడింది -
అధిక కవరేజీ వైపు మొగ్గు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో కస్టమర్లలో అధిక కవరేజీ ఉండే ప్లాన్ల వైపు మొగ్గు చూపే ధోరణి పెరిగిందని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ప్రోడక్ట్స్ విభాగం హెడ్ శ్రీనివాస్ బాలసుబ్రమణియన్ తెలిపారు. యాక్సిడెంటల్ డిజేబిలిటీ, ప్రీమియం వెయివర్, క్రిటికల్ ఇల్నెస్ రైడర్ల వంటి అదనపు ప్రయోజనాలు ఉండే టర్మ్ ప్లాన్లకు, జీవితంలోని వివిధ దశల్లో అవసరాలకు అనుగుణమైన కవరేజీనిచ్చే వినూత్న ప్లాన్లకు ఆదరణ పెరుగుతోందని వివరించారు. పొదుపునకు సంబంధించి కచ్చితమైన రాబడినిచ్చే సాధనాలపై ఆసక్తి ఏర్పడిందన్నారు. రిటైర్మెంట్ తర్వాత ఆర్థికంగా భరోసా కల్పిస్తూ జీవితకాలం ఆదాయాన్నిచ్చే యాన్యుటీ ఉత్పత్తులకు డిమాండ్ గణనీయంగా పెరిగిందని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా ఐసీఐసీఐ ప్రూ ఐప్రొటెక్ట్ స్మార్ట్, ఐసీఐసీఐ ప్రు ఐప్రొటెక్ట్ స్మార్ట్ రిటర్వ్ ఆఫ్ ప్రీమియం వంటి వినూత్న పథకాలను తాము అందిస్తున్నట్లు ఆయన చెప్పారు. అటు కచ్చితమైన రాబడులిచ్చే పథకాలను కస్టమర్లు ఇష్టపడుతుండటంతో సుఖ్ సమృద్ధిలాంటి పథకాలు ఉన్నాయన్నారు. ఇవి కచ్చితమైన రాబడులతో పాటు బోనస్‌ల వంటి అదనపు ప్రయోజనాలను కూడా అందిస్తాయని శ్రీనివాస్ చెప్పారు. రిటైర్మెంట్ ప్లానింగ్ ముఖ్యం.. జీవన ప్రమాణాలు మెరుగుపడి జీవిత కాలం పెరుగుతున్న నేపథ్యంలో రిటైర్మెంట్ కోసం తగిన ప్లానింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటోందని శ్రీనివాస్ చెప్పారు. పదవీ విరమణ తర్వాత ఆదాయం తగ్గిపోతుందని, ఏళ్ల తరబడి పొదుపు చేసుకున్నదొక్కటే ఆదాయ మార్గంగా ఉంటుందని ఆయన తెలిపారు. కాబట్టి ఆర్థికంగా ఒత్తిడి లేని రిటైర్మెంట్ జీవితం గడపాలంటే సరైన ప్రణాళిక వేసుకుని, తగిన సాధనాల్లో సాధ్యమైనంత ముందు నుంచీ ఇన్వెస్ట్ చేయడం శ్రేయస్కరమని శ్రీనివాస్ వివరించారు. రిటైర్మెంట్ ప్రణాళికను ప్రధానంగా రెండు దశలుగా వర్గీకరించవచ్చని ఆయన చెప్పారు. మొదటి దశలో నిధిని ఏర్పాటు చేసుకోవడం, రెండో దశలో దాన్ని వినియోగించుకోవడం ఉంటుందన్నారు. జీవిత బీమా కంపెనీలు అందించే యులిప్స్, సాంప్రదాయ సేవింగ్స్ సాధనాల్లాంటివి దీర్ఘకాలికంగా రిటైర్మెంట్ నిధిని ఏర్పర్చుకునేందుకు ఉపయోగపడగలవని శ్రీనివాస్ వివరించారు. అధిక రిస్కును భరించగలిగే వారు యులిప్‌లను ఎంచుకోవచ్చని, రిస్కులను ఎక్కువగా ఇష్టపడని వారు సాంప్రదాయ సేవింగ్స్ పథకాలను ఎంచుకోవచ్చన్నారు. యాన్యుటీలకు సంబంధించి జాయింట్ లైఫ్ ఆప్షన్‌ను ఎంచుకుంటే జీవిత భాగస్వామికి కూడా జీవితాంతం స్థిరమైన ఆదాయం లభించగలదని ఆయన చెప్పారు. -
దేశంలోనే వైఎస్ జగన్ అరుదైన రికార్డ్
ఏపీ స్టేట్ ఫైబర్ లిమిటెడ్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి.వైఎస్ జగన్ పుట్టిన రోజు వేడుకల సందర్భంగా ఏపీ స్టేట్ ఫైబర్ లిమిటెడ్ ఛైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వైఎస్ జగన్ పుట్టిన రోజును పురస్కరించుకుని ఏపీ.ఎస్.ఎఫ్.ఎల్ సంస్థ కొత్తగా 9 ప్యాకేజీలు ప్రకటించింది. ►రూ.190 రూపాయలకే 20 ఎంబీపీఎస్(mbps) స్పీడ్ తో 400 జిబి (జీబీ) ఇంటర్నెట్ ఇవ్వాలని నిర్ణయం ►రూ.190 రూపాయల కనెక్షన్ తీసుకున్న వారికి ఉచితంగా సెట్ టాప్ బాక్స్ ►రూ.249 కే 50..ఎంబీపీఎస్ స్పీడ్ తో 600 జీబీ ఇంటర్నెట్ ►రూ.295 రూపాయలకు ఎఫ్‌టీఏ ఛానల్స్, 15ఎంబీపీఎస్ స్పీడ్ తో 200జీబీ ఇంటర్నెట్ ►ఏపీ.ఎస్.ఎఫ్.ఎల్ లో త్వరలో OTTలు ►రూ.299, రూ.399,రూ.799 రూపాయలతో ఒటీటీ ,ఇంటర్నెట్ ,టెలిఫోన్ సదుపాయం ►రూ.499,రూ.699,రూ.999.. రూపాయలకే ఒటీటీతో పాటు ట్రిపుల్ ప్లే ప్యాకేజీలు అందిస్తుండగా మరో పది రోజుల్లో కొత్త స్కీంలు ప్రారంభం మరో పది రోజుల్లో కొత్త స్కీంలు ప్రారంభిస్తున్నట్లు గౌతమ్ రెడ్డి తెలిపారు. 19 వేల పైన ఉన్న గ్రామ పంచాయతీల్లో చివరి ఇంటి వరకు ఇంటర్నెట్ సౌకర్యం అందిస్తామన్నారు. ప్రీపెయిడ్ విధానంలో బిల్లులు చెల్లింపు, ఏ ప్రాంతంలోనైనా ఏపీఎస్ఎఫ్ఎల్ సేవలు అందేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఏపీఎస్ఎఫ్ఎల్ను ప్రజలందరికి చేరువ చేసేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. వైఎస్ జగన్ సరికొత్త రికార్డులు ఆధునాత సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తర్వాత కేబుల్, ఇంటర్నెట్, ఫోన్ సేవల ప్రాధాన్యం పెరిగింది. కేబుల్‌తో పాటు ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకోవడం కూడా ఇటీవలి కాలంలో చాలా మందికి సర్వసాధారణంగా మారింది. ఫోన్ సదుపాయం ఎప్పడో తప్పనిసరిగా మారింది. కానీ.. ఈ మూడిటికీ అయ్యే ఖర్చు మాత్రం వినియోగదారులకు భారమే. ఈ నేపథ్యంలో మూడు రకాల సేవలనూ కేబుల్, ఇంటర్నెట్, ఫోన్,వాయిస్, డేటా సేవల్ని ఒకే గొడుకు కిందకు తెచ్చి, అతి తక్కువ ధరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం అందిస్తుంది. దేశంలో హైస్పీడ్ ఆప్టిక్ ఫైబర్ కేబుల్ నెట్ వర్క్ సేవలను అందించిన రాష్ట్ర ముఖ్య మంత్రిగా వైఎస్ జగన్ రికార్డ్ సృష్టించిన విషయం తెలిసిందే. -
ఏపీ ఫైబర్ నెట్ అదిరిపోయే ప్లాన్స్: 245+ ఛానల్స్, అన్లిమిటెడ్ డేటా, ఓటీటీ కూడా..
గ్రామీణ ప్రాంత ప్రజల సౌలభ్యం కొరకు దేశంలోనే మరెవ్వరు అందించలేనటువంటి ట్రిపుల్ ప్లే సర్వీస్‌లను తక్కువ ధరలకే మీ ముందుకు తీసుకువచ్చింది ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ (APSFL). వినియోగదారులకు సరికొత్త హంగులతో డిఫెరెంట్ ప్యాకేజీలతో ఇంటర్నెట్, టెలిఫోన్, ఓటీటీ సేవలను అతి తక్కువ ధరలలో కస్టమర్లకు అందిస్తోంది. వాటి పూర్తి వివరాలపై ఓ లుక్కేద్దాం! హోమ్ లైఫ్ ప్యాకేజీ: రూ.295/- ఫ్రీ టు ఎయిర్ ఛానెల్స్‌తో పాటు 15 ఎంబీపీఎస్(Mbps) ఇంటర్నెట్ స్పీడ్, 200 GB FUP లిమిట్, 2 ఎంబీపీఎస్(Mbps) Post FUB అన్ లిమిటెడ్ నెట్ కాలింగ్ సౌకర్యం కూడా ఉంది. ప్రస్తుత ట్రిపుల్ ప్లే సేవలతో పాటు ఓటీటీ ఇంటిగ్రేటెడ్ ప్యాకేజీలు IP టీవీ, ఇంటర్నెట్, టెలిఫోన్ ఓటీటీ సౌకర్యంతో: హోమ్ గోల్డ్ ప్యాకేజీ: రూ.499.. 200 + ఛానెల్స్, 20 ఎంబీపీఎస్ స్పీడ్, 150 GB FUP లిమిట్, 2 ఎంబీపీఎస్ Post FUP, ఓటీటీ(OTT) సేవలు.. Aha, Voot Select, Epic On, 1 OTT, Eros Now, Meemoతో పాటు టెలిఫోన్ సౌకర్యం హోమ్ గోల్డ్ ప్లస్ ప్యాకేజీ: రూ.699 240+ ఛానల్స్, 30 ఎంబీపీఎస్ స్పీడ్, 300 GB FUP లిమిట్, 2 ఎంబీపీఎస్ Post FUP, ఓటీటీ సేవలు.. Aha, Eros Now, ShemarooMe, Discovery PLus, Hungama Play, Hungama Music, Epic On, 1 OTT, Eros Now, Meemo తో పాటు టెలిఫోన్ సౌకర్యం. హోమ్ గోల్డ్ ప్లస్ ప్యాకేజీ: రూ.999 245+ ఛానల్స్, 50 ఎంబీపీఎస్ స్పీడ్, అన్లిమిటెడ్ ఇంటర్నెట్, FUB లిమిట్ లేదు. ఓటీటీ సేవలు.. Aha, Zee5, Voot, Sun nxt Premium, Alt Balaji, Eros Now, Discovery PLus, Hungama Play, Hungama Music, Discovery PLus, Meemo, MX player Gold, Aao NXT,Gaana Plus Epic On, 1 OTT, Eros Now తో పాటు టెలిఫోన్ సౌకర్యం ఓటీటీ , ఇంటెర్నట్, టెలిఫోన్ సౌకర్యంతో ప్లాన్లు ఇవే.. ఓటీటీ మినీ ప్యాకేజీ: రూ.299 (10 ఎంబీపీఎస్ స్పీడ్, 150 GB FUP, 2 ఎంబీపీఎస్ Post FUB, ఓటీటీ సేవలు.. Epic On, 1 OTT, Meemo/Aha, టెలిఫోన్ సౌకర్యం) ఓటీటీ మినీ ప్యాకేజీ: రూ.399 30 ఎంబీపీఎస్ స్పీడ్, 300 GB FUP, 2 ఎంబీపీఎస్ Post FUB, ఓటీటీ సర్వీసులు.. Ah, Voot, epic on, 1 ott, eros now, Meemoతో పాటు టెలిఫోన్ సౌకర్యం) ఓటీటీ మినీ ప్యాకేజీ: రూ.799 50 ఎంబీపీఎస్ స్పీడ్, అన్లిమిటెడ్ ఇంటర్నెట్..FUP లిమిట్ లేదు, ఓటీటీ సేవలు Aha, Zee5, Voot, Sun nxt Premium, Alt Balaji, Eros Now, Discovery PLus, Hungama Play, Hungama Music, Discovery PLus, Meemo, MX player Gold, Aao NXT,Gaana Plus Epic On, 1 OTT, Eros Now.. టెలిఫోన్ సౌకర్యం) ఈ వివిధ ప్యాకేజీలను ఏపీఎస్ఎఫ్ఎల్ వినియోగదారుల ముందుకు తీసుకువచ్చింది. ఈ ప్యాకేజీల సమాచారం కొరకు వెంటనే మీ దగ్గరలోని కేబుల్ ఆపరేటర్ని సంప్రదించండి లేదా APSFL కాల్ సెంటర్ -18005995555 కు సంప్రదించాల్సి ఉంటుంది. (అడ్వటోరియల్) -
బిగ్ షాక్: ఈ ఓటీటీ అకౌంట్ పాస్వర్డ్ షేర్ చేయాలంటే, పైసలు కట్టాల్సిందే!
గత సంవత్సర కాలంగా ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ గడ్డు కాలాన్ని చవి చూస్తోంది. కరోనా కారణంగా ఓటీటీ మార్కెట్ పుంజుకున్న, నెట్‌ఫ్లిక్స్ మాత్రం సబ్స్క్రైబర్లను పోగొట్టుకుంటూ డీలా పడింది. కొనసాగుతున్న ప్రతికూల ఆర్థిక పరిస్థితులు, OTTలో పెరుగుతున్న పోటీ, నెట్‌ఫ్లిక్స్‌లో ప్లాన్ల చార్జీలు అధికంగా ఉండడం కారణంగా ఇప్పటికే లక్షల్లో సబ్‌స్క్రైబర్లును కోల్పోయింది. అయితే దీని వెనుక ప్రధాన కారణాన్ని కనుగోంది. అదే యూజర్ అకౌంట్ పాస్వర్డ్ షేరింగ్. ఈ సమస్యను ఎదుర్కొనేందుకు సరికొత్త ప్లాన్‌ని తీసుకురాబోతోంది. అదనపు చార్జ్ కట్టాల్సిందే! గతంలో నెట్‌ఫ్లిక్స్ యూజర్లు ఒక అకౌంట్‌కి నగదు చెల్లించి ఆ పాస్వర్డ్ ఇతరులకు షేర్ చేసేవాళ్లు. ఇకపై అలా కుదరదు. కస్టమర్లు తమ అకౌంట్లను ఇతర యూజర్లతో పంచుకోవాలంటే అదనపు ఛార్జీని చెల్లించాల్సి ఉంటుందని నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. ఈ నిర్ణయం 2023 నాటికి అమలులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. అయితే సబ్స్క్రైబర్లు తమ అకౌంట్ పాస్‌వర్డ్‌లను ఇతర వినియోగదారులతో షేరింగ్ కోసం ఎంత ఛార్జీ చెల్లించాలనే విషయాలు మాత్రం ఇంకా వెల్లడించలేదు. సమాచారం ప్రకారం నెట్‌ఫ్లిక్స్ వసూలు చేసే అదనపు రుసుము $3 నుంచి $4 మధ్య ఉండబోతుంది. కాస్త ఊపిరి పీల్చుకున్న నెట్‌ఫ్లిక్స్ నెట్‌ఫ్లిక్స్ మార్చి త్రైమాసికంలో దాదాపు 200,000 మంది, జూన్ త్రైమాసికంలో దాదాపు 970,000 మంది సబ్‌స్క్రైబర్ కోల్పోయినట్లు తెలిపింది. అయితే, మూడవ త్రైమాసిక ఆదాయ నివేదికలో, 2.41 మిలియన్ల సబ్స్క్రైబర్లను పొందినట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలో కస్టమర్ల సంఖ్యను పెంపుతో పాటు ఆదాయాన్ని మరింత పెంచుకోవడానికి, ఇటీవలే చౌకైన యాడ్-సపోర్టెడ్ ప్లాన్లను కూడా ప్రకటించింది. తాజాగా 2022 మూడో త్రైమాసికంలో 2.4 మిలియన్ల కొత్త సబ్స్క్రైబర్లు రావడంతో కాస్త ఊపిరి పీల్చుకుంది. చదవండి: బ్యాంక్ కస్టమర్లకు ఊహించని షాక్.. ఈ లావాదేవీలపై.. -
వ్యాపార వైవిధ్యంపై ఎల్ఐసీ దృష్టి
న్యూఢిల్లీ: జీవిత బీమా రంగంలోని దిగ్గజ సంస్థ ఎల్ఐసీ సెప్టెంబర్ 1వ తేదీకి 66 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, తన వ్యాపార వైవిధ్యంపై దృష్టి సారించింది. నాన్ పార్టిసిపేటింగ్ ఇన్సూరెన్స్ ఉత్పత్తుల విభాగంలో మార్కెట్ వాటాను పెంచుకోవాలని అనుకుంటున్నట్టు సంస్థ చైర్మన్ ఎంఆర్ కుమార్ వెల్లడించారు. జీవిత బీమా రంగంలో ఎల్ఐసీకి సుమారు 65 శాతం మార్కెట్ వాటా ఉన్న విషయం తెలిసిందే. 17 ఇండివిడ్యువల్ పార్టిసిపేటింగ్ బీమా ప్లాన్లు 17 ఇండివిడ్యువల్ (వ్యక్తుల విభాగంలో) నాన్‌పార్టిసిపేటింగ్ ఉత్పత్తులు, 11 గ్రూపు ప్లాన్లను ఎల్ఐసీ ఆఫర్ చేస్తోంది. నాన్ పార్టిసిపేటరీ ప్లాన్లలో బోనస్‌లు రావు. పాలసీదారు మరణించిన సందర్భాల్లోనే పరిహారాన్నిచ్చే అచ్చమైన టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్లను నాన్ పార్టిసిపేటరీ ప్లాన్లుగా చెబుతారు. తమ ఏజెంట్లు ఇక ముందూ ఉత్పత్తుల పంపిణీకి మూలస్తంభాలుగా కొనసాగుతారని కుమార్ తెలిపారు. ఇండివిడ్యువల్ బీమా ఉత్పత్తుల వ్యాపారంలో 95 శాతం ప్రీమియం తమకు ఏజెన్సీల ద్వారానే వస్తున్నట్టు చెప్పారు. ఎల్ఐసీకి దేశవ్యాప్తంగా 13.3 లక్షల ఏజెన్సీలు ఉండడం గమనార్హం. బ్యాంకు అష్యూరెన్స్ (బ్యాంకుల ద్వారా) రూపంలో తమకు వస్తున్న వ్యాపారం కేవలం 3 శాతంగానే ఉంటుందని కుమార్ తెలిపారు. ‘‘జీవితావసరాలకు బీమా కావాలన్న అవగాహన గరిష్ట స్థాయికి చేరింది. కస్టమర్ల మారుతున్న అవసరాలకు తగ్గట్టు కొత్త విభాగాల్లోకి ప్రవేవిస్తాం’’అని వెల్లడించారు. నాన్ పార్టిసిపేటరీ ప్లాన్లను మరిన్ని తీసుకురావడం ద్వారా తాము అనుసరించే దూకుడైన వైవిధ్య విధానం తగిన ఫలితాలను ఇస్తుందని ఆశిస్తున్నట్టు చెప్పారు. బ్యాంక్ అష్యూరెన్స్‌ను మరింత చురుగ్గా మారుస్తామన్నారు. -
ఎయిర్టెల్ కొత్త బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్స్: అదిరే ఆఫర్
సాక్షి, ముంబై: ప్రముఖ టెలికాం సంస్థ భారతి ఎయిర్టెల్ మూడు కొత్త ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లను ప్రకటించింది. ఎయిర్టెల్ రూ. 1599, రూ. 1,099, రూ. 699 ల విలువ చేసే బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లను ప్రకటించింది. ఈ ప్లాన్లలో ఎయిర్టెల్ 4కే ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్‌తో అపరిమిత డేటా, 350కి పైగా ఛానెళ్లను ఉచితంగా వీక్షించవచ్చు. అంతేకాదు 17 ప్రీమియం ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌తో మూడు ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్లాన్లను సబ్‌స్క్రైప్ చేసుకోవాలనే వినియోగదారులు ఎయిర్టెల్ అధికారిక వెబ్సైట్లో వివరాలను చూడొచ్చు. ఎయిర్టెల్ రూ. 1,599 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ఎయిర్టెల్ తాజా రూ. 1,599 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ఇప్పటికే ఉన్న రూ. 1,498 ప్లాన్‌లాంటిదే. కానీ, 4కే ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్‌తో 350కి పైగా ఛానెళ్లకు యాక్సెస్ లభిస్తుంది. అయితే దీని కోసం రూ. 2,000 చెల్లించాల్సి ఉంటుంది.ఇది వన్-టైమ్ ఛార్జ్. ఈ సెటప్ బాక్స్‌తో, వినియోగదారులు కేబుల్ టీవీతో పాటు ఓటీటీ కంటెంట్‌ను ఎంజాయ్ చేయొచ్చు. ఇందుల 300ఎంబీపీఎస్, ఇంటర్నెట్ వేగం, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ , డిస్నీ+ హాట్‌స్టార్ లాంటి టాప్ ఓటీటీలు ఉచితం. అంతేకాదు ఈ ప్లాన్‌లో SonyLIV, ErosNow, Lionsgate Play, Hoichoi, ManoramaMax, Shemaroo, Ultra, HungamaPlay, EPICon, DivoTV, Klikk, Nammaflix, Dollywood, Shorts TVలాంటి 17 ఓటీటీలు ఉచితం. నెలకు 3.3టీబీ డేటా వాడుకోవచ్చు. రూ. 1099 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ఇందులో నెలకు 200ఎంబీపీఎస్ వేగంతో 3.3 టీబీ డేటా లభ్యం. ఇందులోనూ అన్ని ఓటీటీలు ఉచితం. ఇక ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్ ఆఫర్లో 350కి పైగా ఛానెల్స్ కూడా ఉచితం. రూ. 699 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ సరసమైన ఈ ప్లాన్‌లో 40ఎంబీపీఎస్ వేగంతో నెలకు 3.3టీబీ డేటా అందిస్తుంది. అయితే నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో మినహా పైన పేర్కొన్న అన్ని ఓటీటీలకు, టీవీ చానెల్స్‌కు యాక్సెస్ ఉంటుంది -
ఈక్విటీ ఫండ్స్‌లోకి భారీగా పెట్టుబడులు
న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో నికరంగా రూ.39,927 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాయి. అంతక్రితం జూన్ త్రైమాసికంలో ఈక్విటీ పథకాల్లోకి వచ్చిన పెట్టుబడులు రూ.19,508 కోట్లుగానే ఉన్నాయి. నూతన పథకాల ఆవిష్కరణ (ఎన్‌ఎఫ్‌వోలు), సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో పెట్టుబడులు స్థిరంగా ఉండడం ఇందుకు మేలు చేసింది. మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) గణాంకాలను పరిశీలిస్తే.. సెప్టెంబర్ ఆఖరుకు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణలోని ఇన్వెస్టర్ల పెట్టుబడుల విలువ రూ.12.8 లక్షల కోట్లుగా ఉంది. జూన్ చివరికి ఈ మొత్తం రూ.11.1 లక్షల కోట్లుగా ఉండడం గమనార్హం. 2020 జూలై నుంచి 2021 ఫిబ్రవరి వరకు ఈక్విటీ పథకాల నుంచి నికరంగా పెట్టుబడులు బయటకు వెళ్లగా.. ఈ ఏడాది మార్చి నుంచి నికరంగా పెట్టుబడులు వస్తున్నాయి. ఈక్విటీ పథకాల్లోకి వచ్చే నికర పెట్టుబడుల్లో 50 శాతం ఎన్‌ఎఫ్‌వోల నుంచే ఉంటున్నట్టు పరిశ్రమకు చెందిన నిపుణులు పేర్కొంటున్నారు. ఈక్విటీల్లో ఫ్లెక్సీక్యాప్ విభాగం అత్యధికంగా రూ.18,258 కోట్లను ఆకర్షించగా.. సెక్టోరల్ ఫండ్స్ రూ.10,232 కోట్లు, ఫోకస్డ్ ఫండ్స్ రూ.4,197 కోట్లు, మల్టీక్యాప్ ఫండ్స్ రూ.3,716 కోట్లు, మిడ్‌క్యాప్ ఫండ్స్ రూ.3,000 కోట్ల చొప్పున సెప్టెంబర్ క్వార్టర్లో నికరంగా పెట్టుబడులు ఆకర్షించాయని మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ డేటా పేర్కొంది. -
ఓటీటీ యూజర్లకు శుభవార్త...!
ఓటీటీ యూజర్లకు డిస్నీ+హాట్‌స్టార్ శుభవార్తను అందించింది. యూజర్లను పెంచుకోవడం కోసం డిస్నీ+హాట్‌స్టార్ తాజాగా కొత్త సబ్స్క్రిప్షన్ ధరలను ప్రకటించింది. ఈ సబ్స్క్రిప్షన్ ధరలు సెప్టెంబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్నాయి. డిస్నీ+హాట్‌స్టార్ ప్రస్తుతం వీఐపీ సేవలను సంవత్సరానికి రూ. 399 అందిస్తుండగా, డిస్నీ+హాట్‌స్టార్ ప్రీమియమ్ సేవలను రూ. 1499కు అందిస్తోంది. తాజాగా డిస్నీ+హాట్‌స్టార్ రూ.499లకు కొత్త మొబైల్ ప్లాన్‌ను ప్రకటించింది. ఈ సబ్‌స్క్రిప్షన్‌తో ఒక సంవత్సరం పాటు డిస్నీ+హాట్‌స్టార్ ప్రీమియం సేవలను పొందవచ్చును. కాగా ఈ కొత్త ప్లాన్ కేవలం ఒక్క యూజర్‌కు మాత్రమే వర్తిస్తుంది. అంతేకాకుండా ఈ ప్లాన్‌తో హెచ్డీలో వీడియోలను చూడవచ్చును. డిస్నీ+హాట్‌స్టార్ మరో సబ్స్క్రిప్షన్ ప్లాన్ రూ. 899ను కూడా ప్రకటించింది. ఈ ప్లాన్‌తో ఇద్దరు యూజర్లు డిస్నీ+హాట్‌స్టార్ సేవలను ఒకేసారి పొందవచ్చును. మూడో సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధర సంవత్సరానికి రూ. 1,499 ఉంటుంది. ఈ ప్లాన్‌తో ఒకేసారి నలుగురు యూజర్లు ఒకేసారి వీడియోలను చూడవచ్చును. అంతేకాకుంగా 4కే స్ట్రీమింగ్ కూడా మద్దతు ఇస్తుంది. కాగా ప్రస్తుతం ఉన్న వీఐపీ ప్లాన్ రూ. 399, నెలకు రూ. 299 డిస్నీ + హాట్‌స్టార్ ప్రీమియం ప్లాన్లను నిలిపివేయనున్నట్లు తెలుస్తోంది. -
కనీస రాబడులతో వినూత్న పెన్షన్ పథకం
ముంబై: వినూత్నమైన పెన్షన్ ప్లాన్లను తీసుకురావడం దిశగా పనిచేస్తున్నట్టు పింఛను నిధి నియంత్రణ, అభివృద్ధి సంస్థ (పీఎఫ్ఆర్డీఏ) ప్రకటించింది. ఇందులో కనీస రాబడుల హామీతో ఒక పథకం ఉంటుందని పీఎఫ్ఆర్డీఏ చైర్మన్ సుప్రతిమ్ బంధోపాధ్యాయ అన్నారు. పీఎఫ్ఆర్డీఏ నియంత్రణలో ప్రస్తుతం ఎన్పీఎస్, అటల్ పెన్షన్ యోజన (ఏపీవై) పథకాలు కొనసాగుతుండగా.. మరింత మంది చందాదారులను ఆకర్షించేందుకు వినూత్నమైన పెన్షన్ ఉత్పత్తులను తీసుకురావడంపై దృష్టి పెట్టామని బంధోపాధ్యాయ చెప్పారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ యాక్చుయరీస్ ఆఫ్ ఇండియా నిర్వహించిన వర్చువల్ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. నూతన పెన్షన్ ఉత్పత్తి తీసుకువచ్చే విషయంలో యాక్చుయరీలు సాయమందించాలని బంధోపాధ్యాయ కోరారు. యాక్చుయరీల నుంచి వచ్చే సూచనలకు ఎంతో ప్రాధాన్యం ఉంటుందన్నారు. ఎన్పీఎస్ నుంచి వైదొలిగే సమయంలో సభ్యులకు అధిక రేట్లతో కూడిన పెన్షన్ లేదా యాన్యుటీ ప్లాన్‌ను అందించే అంశంపై దృష్టి సారించినట్టు చెప్పారు. మార్కెట్ ఆధారిత బెంచ్‌మార్క్ రేట్లకు అనుగుణంగా ఉండే భిన్నమైన యాన్యుటీ ఉత్పత్తుల అవసరం ఉందన్నారు. క్రమానుగతంగా కావాల్సినంత వెనక్కి తీసుకునే ప్లాన్ (ఎస్‌డబ్ల్యూపీ) మాదిరి యాన్యుటీ ప్లాన్లు కావాలన్నారు. పెన్షన్ ఎంత రావచ్చన్న అంచనాలను ప్రస్తుత, నూతన చందాదారులకు అందుబాటులోకి తీసుకురావడంపై పనిచేస్తున్నట్టు బంధోపాధ్యాయ చెప్పారు. -
లైఫ్ ఈజీ చేసుకుందాం ఇలా...
కొత్తగా ఏదో ఒకటి చేయాలి.. ఏటా నూతన సంవత్సరంలోకి ప్రవేశించే సమయంలో చాలా మంది అనుకునే సంకల్పమే ఇది. కానీ, కొద్ది మందే అనుకున్నవి ఆచరణలో పెడుతుంటారు. 2020 ఎన్నో పాఠాలు చెప్పి వెళ్లిపోయింది. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో, ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ, నిర్లక్ష్యం పనికిరావన్న హెచ్చరికలు కూడా ఇచ్చి వెళ్లింది. అందుకే 2021లో అయినా ఆర్థికంగా నిలదొక్కుకునే ప్రణాళికలపై దృష్టి పెట్టి.. అమల్లో పెట్టడం ద్వారా ఎంతో స్థైర్యాన్ని, మానసిక ప్రశాంతతను పొందే అవకాశాన్ని కోల్పోవద్దు. ఇందుకు ఏం చేయవచ్చంటే..? ఆపద్బాంధవ.. బీమా ఆరోగ్య బీమా, జీవిత బీమా తమకు అంతగా అవసరం లేదనుకునే వారు ఎందరో ఉన్నారు. వీటి ప్రాధాన్యం ఎంతన్నది కరోనా వైరస్ చాలా మందికి తెలిసేలా చేసింది. కరోనా కారణంగా ఆస్పత్రిలో చేరిన వారు రూ.లక్షల్లో ఖర్చు చేసుకోవాల్సి వచ్చింది. బీమా పాలసీ లేని వారు తమ కష్టార్జితాన్ని వైద్య చికిత్సల కోసం ధారపోయాల్సి వచ్చింది. మరోవైపు కరోనా వైరస్ వేలాది మంది ప్రాణాలను బలితీసుకుంది. వారి కుటుంబాలకు తీవ్ర ఆర్థిక నష్టాన్ని కూడా తెచ్చిపెట్టింది. కుటుంబానికి ఆధారమైన వ్యక్తి ఎటువంటి జీవిత బీమా పాలసీ లేకుండా కరోనాతో మరణించినట్టయితే.. పరిస్థితి ఎంత కఠినంగా ఉంటుందో ఆలోచించాలి. ఒకవేళ జీవిత బీమా పాలసీ ఉన్నా తగినంత కవరేజీ లేని కుటుంబాలకు వాస్తవంలో రక్షణ లేనట్టుగానే భావించాలి. కట్టిన ప్రీమియం రాదన్న ప్రతికూల ధోరణితో టర్మ్ ప్లాన్లకు బదులు.. మరణించినా లేదా మెచ్యూరిటీ తీరినా రాబడులతో వెనక్కిచ్చే ఎండోమెంట్ ప్లాన్లు తీసుకునే వారు ఎందరో ఉన్నారు. కానీ, రూ.1–5 లక్షల ఎండోమెంట్ ప్లాన్ ఓ కుటుంబ అవసరాలను ఏ మాత్రం తీర్చగలదో ఆలోచించండి. అందుకే హెల్త్, లైఫ్ ప్లాన్లు లేని వారు వెంటనే వాటిని తీసుకోవాలి. ఒకవేళ ఇప్పటికే ఎండోమెంట్ ప్లాన్ తీసుకున్న వారు.. వీలు చేసుకుని టర్మ్ ప్లాన్ తీసుకునేందుకు ప్రయత్నించాలి. తమ వార్షిక ఆదాయానికి తక్కువలో తక్కువ 10 రెట్ల మేర అయినా బీమా తీసుకోవాలి. ఒకవేళ వ్యక్తిగత రుణాలు, గృహ రుణాలు ఉంటే ఆ మొత్తాన్ని కూడా కవరేజీకి కలిపి అధిక మొత్తంలో బీమా తీసుకోవడం మంచిది. దీనివల్ల కుటుంబానికి తాము లేని లోటును తీర్చే రక్షణ ఏర్పాటు చేసిన వారు అవుతారు. అనారోగ్యం, ప్రమాదాలు చెప్పి రావు. వయసులో ఉన్న వారికి కూడా ఇటువంటివి ఎదురుకావచ్చు. ఒకవేళ హెల్త్ పాలసీ ఉన్నా కేవలం రూ.2–3లక్షల కవరేజీయే ఉంటే.. దానికి టాపప్ తీసుకోవడాన్ని తప్పకుండా పరిశీలించాలి. టాపప్‌కు ప్రీమియం తక్కువే ఉంటుంది. నలుగురు సభ్యుల కుటుంబానికి కనీసం రూ.5–10 లక్షల హెల్త్ కవరేజీ అయినా ఉండాలి. దీనికి అదనంగా టాపప్ కూడా జోడించుకోవాలన్నది నిపుణుల సూచన. సాయం కోసం ఎదురుచూడొద్దు అనుకోని అవసరం ఎదురైనప్పుడు, అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు ఆర్థిక సాయం కోసం బంధువులు, స్నేహితులు, సన్నిహితులను ఆశ్రయించడం కంటే.. ఒక ప్రత్యేక అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవడం మనశ్శాంతిని, ధైర్యాన్నిస్తుంది. ఉన్నట్టుండి ఉద్యోగం కోల్పోవడం, ప్రమాదానికి గురి కావడం ఇటువంటివన్నీ అత్యవసర పరిస్థితులే. అందుకే కనీసం 12 నెలల అవసరాలకు సరిపడా అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలని నిపుణులు చెబుతుంటారు. ఇందులో రుణాలకు చేసే చెల్లింపులు కూడా భాగంగా ఉండాలి. ఈ మొత్తాన్ని బ్యాంకు ఎఫ్డీలు లేదా లిక్విడ్ ఫండ్స్ రూపంలో ఉంచుకోవచ్చు. దీనివల్ల అవసరం ఏర్పడినప్పుడు ఒకటి, రెండు రోజుల్లోనే కావాల్సినంత వెనక్కి తీసుకోవచ్చు. ఇలా ప్రత్యేక నిధిని సమకూర్చుకోవడమే కాదు.. అత్యవసరాలు ఎదురైతే తప్పించి చిన్న అవసరాలకు కదపకూడదు. భిన్న సాధనాలకు కేటాయింపులు పెట్టుబడులన్నింటినీ ఒకటే సాధనంలో కాకుండా భిన్న సాధనాలకు కేటాయించుకోవడం కూడా ఆర్థిక ప్రణాళికలో ఒక భాగమే. ఉదాహరణకు నూరు శాతం పెట్టుబడులను ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేశారనుకోండి.. అప్పుడు మీరు చాలా రిస్క్ తీసుకున్నట్టు అవుతుంది. పెట్టుబడుల పరంగా మీ నిర్ణయాల్లో తప్పిదం చోటు చేసుకుంటే అసలుకే ఎసరు వస్తుంది. అందుకే ఈక్విటీలు, డెట్, బంగారం ఇలా వీలైనన్ని సాధనాల మధ్య పెట్టుబడులను వేరు చేసుకోవాలి. దీనివల్ల రిస్క్‌ను మించి రాబడులు వస్తాయి. మీ రిస్క్ సామర్థ్యం, ఆశిస్తున్న రాబడులు, పెట్టుబడులకు ఉన్న వ్యవధి వీటి ఆధారంగా ఏ విభాగంలో ఎంత ఇన్వెస్ట్ చేయాలన్నది ఆర్థిక సలహాదారుల సాయంతో నిర్ణయిం చుకోవాలి. ఒక్కో విభాగం అద్భుత పనితీరుతో అందులోని పెట్టుబడుల విలువ గణనీయంగా పెరిగిపోతే.. అందుకు తగ్గట్టు పోర్ట్‌ఫోలియో రీబ్యాలెన్స్ చేసుకోవాలి. ఈక్విటీలకు 50% కేటాయించాలన్నది మీ ప్రణాళిక అయితే.. మార్కెట్ల ర్యాలీ కారణంగా ఈక్విటీ పెట్టుబడుల విలువ మొత్తం పోర్ట్‌ఫోలియోలో 60 శాతానికి చేరితే.. అప్పుడు 10% మేర ఈక్విటీలకు కేటాయింపులు తగ్గించుకోవాలి. ఇన్వెస్ట్మెంట్ ఆగొద్దు పెట్టుబడులు ఎప్పుడూ లక్ష్యాలకు అనుగుణంగా సాగిపోవాలి. మధ్యలో వచ్చే ఆటుపోట్లను చూసి పెట్టుబడుల ప్రణాళికలు ఆగిపోకూడదు. గతేడాది మార్చి చివరికి మార్కెట్లు కనిష్టాలకు పడిపోయినప్పుడు కంగారుపడిపోయి స్టాక్స్‌ను అమ్ముకున్న వారు.. డిసెంబర్ వచ్చే సరికి ఎంతో విచారించి ఉంటారు. ఎందుకంటే తొమ్మిది నెలల్లో మార్కెట్లు కొత్త గరిష్టాలకు వెళ్లిపోయాయి. మార్కెట్లు ఎప్పుడూ పడి లేచే కెరటాలు. అలాగే, స్టాక్స్ విక్రయించకుండా.. అదనంగా ఇన్వెస్ట్ చేసిన వారు భారీ లాభాలను కళ్లచూసి ఉంటారు. అందుకే ఈక్విటీ పెట్టుబడులు కనీసం ఐదేళ్లకు మించిన కాలానికే సముచితం. అందులోనూ నేరుగా స్టాక్స్‌లో కాకుండా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో, అందులోనూ ప్రతీ నెలా ఇంతచొప్పున సిప్ రూపంలో ఇన్వెస్ట్ చేసుకోవడం.. సగటున అధిక రాబడులను సమకూర్చుకునేందుకు, రిస్క్‌ను తట్టుకునేందుకు సాయపడుతుంది. ఇరువైపులా ప్రయోజనాలను తెచ్చిపెట్టే సాధనమే సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్). ఇక బ్యాంకు సేవింగ్స్ ఖాతాల్లో ఎక్కువ మొత్తాలను అలాగే ఉంచేయవద్దు. సేవింగ్స్ వడ్డీ రేటు 4–5 శాతం అన్నది ద్రవ్యోల్బణానికే సరిపోతుంది. కనుక అదనపు బ్యాలన్స్‌ను డిపాజిట్లుగా మార్చే ఆటోస్వీప్ సదుపాయాన్ని ఎంచుకోవాలి. నామినీని, విల్లును మర్చిపోవద్దు ఒక వ్యక్తి మరణానంతరం అతని పేరిట ఉన్న ఆస్తులు, పెట్టుబడులు కుటుంబ సభ్యులకు సులభంగా అందేలా చేసేదే విల్లు. ఎవరికి ఏవి, ఏ మేరకు చెందాలన్నదీ విల్లులో నిర్దేశించుకోవచ్చు. తమ పేరిట ఉన్న ఆస్తులు, అప్పులు, బీమా పాలసీల వివరాలు కుటుంబ సభ్యులకు తప్పకుండా తెలియజేయాలి. బీమా ప్లాన్లు, పెట్టుబడుల్లో నామినీని చేర్చాలి. ఖర్చు/పొదుపు కరోనా, వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా గతంతో పోలిస్తే కొన్ని అనవసర వ్యయాలు తగ్గాయి. వీకెండ్లో బయటకు వెళ్లి రెస్టారెంట్లలో తినడం, సినిమాలు, పర్యటనలు వంటివి చాలా వరకు తగ్గాయి. వేతనాల్లో కోతలు పడిన వారికి ఈ విధంగా తగ్గిన వ్యయాలు కాస్త ఊరటనిచ్చాయి. అదే సమయంలో వేతన కోతల్లేని వారికి మిగిలిన మేర అదనంగా ఇన్వెస్ట్ చేసుకునే మంచి అవకాశం లభించిందనే చెప్పుకోవాలి. ఎంత సంపాదించామన్నది కాకుండా.. ఎంత పొదుపు చేశారన్నదే మీ ఆర్థిక పరిస్థితులను మార్చే సూత్రం అవుతుంది. కనుక పరిమితుల్లోపే ఖర్చు చేసుకోవాలి. అందుకే నెలవారీ బడ్జెట్ రూపొందించుకుని దాని ప్రకారం ఖర్చు, ఇన్వెస్ట్ చేసుకోవాలి. అప్పుడు మీ వ్యయాలపై మీకు నియంత్రణ సాధ్యమవుతుంది. అంతగా అవసరం లేని వాటి కోసం రుణాలపై కొనుగోళ్లకు వెళ్లడం ఏ మాత్రం మంచిది కాదు. ఈ తరహా అనవసర వ్యయాలకు దూరంగా ఉండాలి. కొత్త ఏడాది ప్లానింగ్ ► జనవరి: బీమా కవరేజీ మీకు సరిపడా ఉన్నదీ, లేనిదీ ఒక్కసారి సరిచూసుకోవాలి. అలాగే, బీమా ప్రీమియం, ఈఎంఐ చెల్లింపుల తేదీల కోసం రిమైండర్ పెట్టుకోవాలి. ► ఫిబ్రవరి: కేంద్ర బడ్జెట్లో కొత్త నిబంధనల వల్ల మీ ఆదాయం, పన్నులు, పెట్టుబడుల ప్రణాళికలను మార్చుకోవాలేమో సరిచూసుకోవాలి. ► మార్చి: 2020–21 సంవత్సరం అడ్వాన్స్ ట్యాక్స్ నాలుగో విడత చెల్లింపుల గడువు మార్చి 15తో ముగుస్తుంది. పన్ను చెల్లించాల్సి ఉంటే ఈలోపు ఆ పనిచేసేయాలి. పన్ను ఆదా కోసం పెట్టుబడులకు మార్చితో గడువు ముగిసిపోతుంది. ఫాస్టాగ్ 2021 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. ► ఏప్రిల్: 2021–22 నూతన ఆర్థిక సంవత్సరం ఆరంభం కనుక.. ఆర్థిక నిపుణుల సాయంతో పెట్టుబడుల ప్రణాళికలను సమీక్షించుకుని లక్ష్యాలకు అనుగుణంగా మార్పులు చేసుకోవాలి. సొంతంగా ఆ పరిజ్ఞానం ఉంటే తామే ఆ పనిచేసుకోవచ్చు. ► మే: ఈ నెలలో 14న అక్షయ తృతీయ ఉంది. ఆ రోజు బంగారం కొనుగోలు చేసుకోవాలని అనుకుంటే అందుకు కావాల్సిన మొత్తాన్ని సిద్ధం చేసుకోవాలి. ► జూన్: 2021–22 మొదటి అడ్వాన్స్ ట్యాక్స్ గడువు జూన్ 15. ఇక 2020–21 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపన్ను రిటర్నులు వేసేందుకు గాను పనిచేస్తున్న సంస్థ వద్ద ఫామ్ 16 కోసం దరఖాస్తు చేసుకోవాలి. ► జూలై: ఆదాయపన్ను రిటర్నుల దాఖలుకు జూలై 31 వరకు గడువు. ఆ లోపు రిటర్నులు ఫైల్ చేయాలి. ► ఆగస్టు: పెట్టుబడులపై మధ్యంతర సమీక్ష మంచిది. ► సెప్టెంబర్: 2021–22 రెండో విడత అడ్వాన్స్ ట్యాక్స్‌ను 15వ తేదీలోపు చెల్లించాలి. ► అక్టోబర్: దసరా పండుగ భారీ ఆఫర్ల సమయంలో కొనుగోళ్లకు ముందుగానే సన్నద్ధం అయితే మంచిది. ► నవంబర్: ఈ నెలలో దీపావళి పండుగ 4న వస్తోంది. ఆ సందర్భంలో కొనుగోళ్లకు సన్నద్ధులు కావాలి. ► డిసెంబర్: మూడో విడత అడ్వాన్స్ ట్యాక్స్ (2021–22)కు 15 వరకు గడువు ఉంది. 25న క్రిస్మస్ పండుగ వేడుకలకు బడ్జెట్‌ను సిద్ధం చేసుకోవాలి. -
మొబైల్ యూజర్ల కోసం అమెజాన్ ప్రైమ్
న్యూఢిల్లీ: దేశీయంగా మొబైల్ యూజర్ల కోసం అమెజాన్ ప్రత్యేకంగా ప్రైమ్ వీడియో ప్లాన్లను ప్రవేశపెట్టింది. నెలకు రూ. 89 నుంచి ఇవి ప్రారంభమవుతాయి. ముందుగా భారతీ ఎయిర్టెల్ ప్రీపెయిడ్ యూజర్లకు ఇది అందుబాటులో ఉంటుందని అమెజాన్ తెలిపింది. 30 రోజుల ఉచిత ట్రయల్ తర్వాత 6 జీబీ డేటాతో 28 రోజుల వ్యాలిడిటీతో రూ. 89 ప్లాన్‌ను యూజర్లు ఎంచుకోవచ్చని వివరించింది. కేవలం మొబైల్ యూజర్ల కోసమే అమెజాన్ ఇలాంటి ప్లాన్లను ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి. ఒక్క యూజర్‌కి మాత్రమే పరిమితమయ్యే ఈ ప్లాన్‌లో స్టాండర్డ్ డెఫినిషన్ నాణ్యతతో ప్రసారాలు పొందవచ్చని అమెజాన్ ప్రైమ్ వీడియో ఇండియా డైరెక్టర్ గౌరవ్ గాంధీ తెలిపారు. బహుళ యూజర్ల యాక్సెస్, హెచ్డీ/అల్ట్రా హెచ్డీ కంటెంట్, ప్రైమ్ మ్యూజిక్, అమెజాన్‌డాట్‌ఇన్ ద్వారా ఆర్డర్ల వేగవంతమైన డెలివరీ తదితర సర్వీసుల కోసం 30 రోజుల అమెజాన్ ప్రైమ్ సభ్యత్వాన్ని రూ. 131తో పొందవచ్చు. ఎయిర్టెల్ థాంక్స్ యాప్‌తో పాటు దేశవ్యాప్తంగా పలు రీచార్జ్ పాయింట్లలో దీన్ని రీచార్జ్ చేయించుకోవచ్చు. ప్రస్తుతం నెలకు రూ. 129, వార్షికంగా రూ. 999 చార్జితో అందిస్తున్న అమెజాన్ ప్రైమ్ ఆఫర్ కూడా యథాప్రకారం అందుబాటులో ఉంటుందని గాంధీ పేర్కొన్నారు. దేశీ ఓవర్ ది టాప్ (ఓటీటీ) మార్కెట్లో డిస్నీప్లస్‌హాట్‌స్టార్, జీ5, నెట్‌ఫ్లిక్స్ తదితర సంస్థలతో కంపెనీ పోటీపడుతోంది. నెట్‌ఫ్లిక్స్ గతేడాదే మొబైల్ యూజర్ల కోసం రూ. 199 సబ్స్క్రిప్షన్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. -
మొబైల్ యూజర్లకు అమెజాన్ ప్రైమ్ వీడియో సూపర్ ఆఫర్
సాక్షి, న్యూఢిల్లీ: అమెజాన్ ప్రైమ్వీడియో తన వినియోగదారులకు మరో బంపర్ ఆఫర్ తీసుకొచ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియో ప్రపంచంలోనే తొలిసారిగా మొబైల్-ఓన్లీ ప్లాన్‌ను ప్రకటించింది. ప్రైమ్ వీడియో కంటెంట్ కోసం 89 రూపాయల ప్లాన్‌నుంచి ప్రారంభయ్యేలా ప్లాన్లను తీసుకొచ్చింది. ఓవర్ ద టాప్ ప్లాట్‌ఫామ్స్ మధ్య పోటీ తీవ్ర మవుతున్న నేపథ్యంలో ఈ కొత్త స్ట్రాటజీతో యూజర్లను ఆకర్షించనుంది. ముఖ్యంగా . ఓటీటీ ప్రత్యర్థి , టాప్ ప్లేస్‌లో ఉన్న నెట్‌ఫ్లిక్స్‌కు ఎదుర్కొనేలా సరికొత్త వ్యూహాలతో దూసుకొస్తోంది. నెట్‌ఫ్లిక్స్ తన మొబైల్ ప్లాన్‌ను నెలకు రూ. 199 ధరతో విడుదల చేసిన తర్వాత వీటిని లాంచ్ చేయడం గమనార్హం. ఎయిర్టెల్ భాగస్వామ్యంతోఈ కొత్త ప్లాన్‌ను అమెజాన్ లాంచ్ చేసింది. ఇందులో భాగంగా ప్రీపెయిడ్ ఎయిర్టెల్ వినియోగదారులకు తొలి 30 రోజులు ఉచితంగా ట్రయల్ చేయవచ్చు. ఆ తర్వాత 28 రోజులకు రూ.89 వసూలు చేస్తారు. ప్రైమ్ వీడియో సేవలు మొబైల్లోఅందుబాటులోఉంటాయి. అలాగే ఇదే ప్లాన్‌లో 6 జీబీ డేటా కూడా వస్తుంది ఎస్డీ (స్టాండర్డ్ డెఫినిషన్) క్వాలిటీ స్ట్రీమింగ్ అందిస్తుంది.అయితే ఈ మొబైల్ ఓన్లీ ప్లాన్లపై కేవలం ఒక్క యూజర్ మాత్రమే ప్రైమ్ వీడియోను యాక్సెస్ చేయవచ్చు. రూ.89ప్లాన్: వాలిడిటీ 28రోజులు, 6 జీబీ డేటా రూ.299 ప్లాన్ : 28రోజుల వాలిడిటీ ఉన్న ఈ ప్లాన్‌లో ప్రైమ్ వీడియోతోపాటు అన్లిమిటెడ్ కాల్స్.. రోజుకు 1.5 జీబీ డేటా వస్తుంది. మొబైల్ డేటా సేవలకుఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో ఈ కొత్త ప్లాన్స్ తీసుకొచ్చామని అమెజాన్ ప్రైమ్ వీడియో వరల్డ్‌వైడ్ వైస్ ప్రెసిడెంట్ జే మెరైన్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ ద్వారా ప్రత్యేకమైన, అసలైన కంటెంట్‌తో ప్రతి భారతీయుడిని అలరించనున్నామని తెలిపారు. కాగా ప్రైమ్ వీడియో సాంప్రదాయ ప్లాన్ నెలకు రూ.129, సంవత్సరానికి రూ.999గా ఉన్న విషయం తెలిసిందే. -
ఈ ఏడాది ప్లాన్ ఇదే
కొత్త సంవత్సరం ప్రారంభమైపోయింది. ఈ ఏడాది ఏమేం చేయాలా అని ఆల్రెడీ ప్లాన్ సిద్ధం చేసుకున్నారు చాలామంది. మరి మీ ప్లాన్స్ ఏంటి అని హీరోయిన్లు ఐశ్వర్యా రాజేష్, లక్ష్మీ రాయ్‌ని అడిగితే ఇలా చెప్పారు. ఆరోగ్యం మీద మరింత దృష్టి పెడతాను 2020 మనకు ఆరోగ్యం ఎంత ముఖ్యమైనదో చెప్పింది. రోగనిరోధక శక్తిని కాపాడుకోవాలని గుర్తు చేసింది. ఫిట్నెస్ అనేది మనందరి జీవితాల్లో ఎంతో ముఖ్యమైనది. ఫిట్నెస్ మనకు ఒకలాంటి ధైర్యాన్ని తీసుకువస్తుంది. మరింత పని చేసే శక్తి, ఉత్సాహం వస్తుంది. ఫిట్నెస్ వల్ల తెలియకుండానే ఒకలాంటి పాజిటివ్ లైఫ్‌స్టయిల్ అలవడుతుంది. ఇక నుంచి మరింత ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకునేలా జాగ్రత్తపడతాను. మన పూర్వీకులు తీసుకునే రాగులు, మిల్లెట్స్ అన్నీ నా డైట్లో భాగం చేస్తాను. అలానే ఈ ఏడాది కూడా కంటెంట్ ఉన్న సినిమాల్లోనే భాగమవ్వడానికి ప్రయత్నిస్తాను. – ఐశ్వర్య 2020 నేర్పిన పాఠం మర్చిపోవద్దు గత ఏడాది మనలో చాలామందికి అనుకున్నట్టు జరగలేదు. కానీ మనందరికీ చాలా పాఠాలు నేర్పింది. మనందరం మర్చిపోయిన విషయాల్ని గుర్తుచేసింది. ఇలాంటి కష్టమైన సందర్భాలే చాలా విషయాలను త్వరగా గ్రహించేలా చేస్తాయి. 2020 నాకు చాలా ఓపిక నేర్పింది. మనలోని ప్రతి ఒక్కరికీ, అలానే మన సమాజానికి మానవత్వం మరింత ముఖ్యం అని చెప్పింది. 2020 నేర్పించిన పాఠాలను మనం ఎప్పటికీ మరచిపోకూడదు. ఈ పాఠాలతో ఈ మహమ్మారి దాటాలి. మళ్లీ మునుపటి పరిస్థితి త్వరగా వచ్చేలా చేసుకుందాం. – లక్ష్మీరాయ్ -
జియో: భారత్‌లో తొలిసారి ఇన్–ఫ్లైట్ సేవలు
-
జియో.. పోస్ట్‌పెయిడ్ ప్లస్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్ టారిఫ్‌లు, బ్రాడ్‌బ్యాండ్ సేవల్లో ధరల యుద్ధానికి తెరలేపి సంచలనం సృష్టించిన రిలయన్స్‌కు చెందిన టెలికం సంస్థ జియో.. తాజాగా మరో అడుగు ముందుకేసింది. ఇప్పటి వరకు కేవలం రూ.199 పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌కు పరిమితమైన ఈ కంపెనీ కొత్తగా పోస్ట్‌పెయిడ్ ప్లస్ పేరుతో నూతన సేవలను మంగళవారం ప్రకటించింది. నెల టారిఫ్ రూ.399తో మొదలుకుని రూ.1,499 వరకు ఉంది. ఎటువంటి అదనపు ఖర్చు లేకుండానే నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్, హాట్‌స్టార్ ఎంజాయ్ చేయవచ్చు. ఫ్యామిలీ ప్లాన్, డేటా రోల్ఓవర్ ఆకర్షణీయ ఫీచర్లుగా నిలవనున్నాయి. విదేశాలకు వెళ్లే భారతీయ ప్రయాణికులకు తొలిసారిగా ఇన్‌ఫ్లైట్ కనెక్టివిటీ ప్రవేశపెట్టారు. కస్టమర్ కోరితే ఇంటి వద్దకే వచ్చి సర్వీస్ యాక్టివేట్ చేస్తారు. ప్రీపెయిడ్ స్మార్ట్‌ఫోన్ విభాగంలో 40 కోట్ల మంది కస్టమర్ల నమ్మకాన్ని చూరగొన్నామని జియో డైరెక్టర్ ఆకాశ్ అంబానీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ప్రతి పోస్ట్‌పెయిడ్ కస్టమర్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని కొత్త సేవలను పరిచయం చేశామన్నారు. పోస్ట్‌పెయిడ్ ప్లస్ విశేషాలు.. ఇంటర్నేషనల్ కాలింగ్ చార్జీ నిముషానికి 50 పైసల నుంచి ప్రారంభం. ప్రపంచంలో ఎక్కడి నుంచైనా వైఫై కాలింగ్ ద్వారా భారత్‌కు నిముషానికి రూపాయికే కాల్ చేయవచ్చు. డేటా రోల్ఓవర్ పేరుతో అదనంగా డేటాను ఆఫర్ చేస్తోంది. దీని కింద ఇచ్చినదాంట్లో మిగిలిపోయిన డేటానే తదుపరి నెలకు జమ అవుతుంది. అపరిమిత వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ చేసుకోవచ్చు. ప్యాక్నిబట్టి ఫ్యామిలీ ప్లాన్ కింద అదనపు కనెక్షన్లు పొందవచ్చు. ఇలా అదనంగా కనెక్షన్ తీసుకున్న కుటుంబ సభ్యులు ప్యాక్ కింద వచ్చిన డేటాను వాడుకోవచ్చు. ఇవీ నూతన టారిఫ్‌లు..: రూ.399 ప్యాక్‌లో 75 జీబీ డేటా లిమిట్ ఉంది. అలాగే డేటా రోల్ఓవర్ కింద 200 జీబీ ఇస్తారు. 100 జీబీ డేటాతో కూడిన రూ.599 ప్యాక్‌లో డేటా రోల్ఓవర్ 200 జీబీ, ఫ్యామిలీ ప్లాన్ కింద ఒక సిమ్ అదనం. రూ.799 ప్యాక్‌లో 150 జీబీ డేటా, 200 జీబీ డేటా రోల్ఓవర్, ఫ్యామిలీ ప్లాన్‌లో 2 అదనపు సిమ్‌లు పొందవచ్చు. రూ.999 ప్యాక్‌లో 200 జీబీ డేటా, 500 జీబీ డేటా రోల్ఓవర్, 3 అదనపు సిమ్‌లు లభిస్తాయి. రూ.1,499 టారిఫ్‌లో 300 జీబీ డేటా, 500 జీబీ డేటా రోల్ఓవర్తోపాటు యూఎస్ఏ, యూఏఈలో అన్లిమిటెడ్ డేటా, వాయిస్ ఆఫర్ చేస్తున్నారు. -
రీబ్రాండింగ్ తరువాత ‘వీఐ’ కొత్త ప్లాన్లు
సాక్షి,ముంబై: వొడాఫోన్ ఐడియా లిమిటెడ్ ‘వీఐ’గా రీబ్రాండింగ్ పూర్తి చేసుకున్నఅనంతరం సరికొత్త ప్రణాళికలపై దృష్టి పెట్టింది. తాజాగా కొత్త ప్లాన్లను ప్రకటించింది. తద్వారా వినియోగదారులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది. అయితే అందరూ ఊహించినట్టుగా డేటా ప్లాన్లు కాదు. కాలర్ ట్యూన్ల ప్లాన్లు. ప్రత్యక కాలర్ట్యూన్ల కోసం వొడాఫోన్ ఐడియా వీఐ కాలర్ ట్యూన్ అనే స్పెషల్ యాప్ ప్రారంభించింది. ఇందులో కస్టమర్లు తమ కిష్టమైన కాలర్ ట్యూన్లను ఎంచుకునే అవకాశం కల్పిస్తోంది. ఇది ఆపిల్ యాప్ స్టోర్, గూగుల్ ప్లే స్టోర్లలో ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. వీఐ కాలర్టూన్స్ ప్లాన్స్ రూ .49, రూ .69, రూ.99, రూ .249 గా ఉన్నాయి. వినియోగదారులు ప్రొఫైల్ ట్యూన్స్ , తమ పేరుతో పాటు స్టేటస్ టోన్‌ను సెట్ చేసుకోవచ్చు. కాగా టెలికాం మార్కెట్లో ఉన్న పోటీ కారణంగా త్వరలో ప్లాన్ల టారిఫ్ లు పెరిగే అవకాశం ఉందని రీబ్రాండింగ్ తరువాత వొడాఫోన్ ఐడియా సంకేతాలిచ్చింది. కానీ ప్రస్తుతానికి డేటా ప్లాన్లలో ఎలాంటి మార్పులను ప్రకటించలేదు. (వొడాఫోన్ ఐడియా కొత్త బ్రాండ్ వీఐ) వీఐ కాలర్ ట్యూన్ ప్లాన్స్ రూ .49 ప్లాన్: ప్రీపెయిడ్ వినియోగదారులకు నాలుగు వారాలు , పోస్ట్ పెయిడ్ వినియోగదారులకు 30 రోజులు 50 కాలర్ ట్యూన్లు ఉచితం రూ .69 ప్లాన్: ఈ ప్లాన్ లో పరిమితి లేదు. అన్ లిమిటెడ్ గా వాడుకోవచ్చు. ప్రీపెయిడ్ వినియోగదారులకు నాలుగు వారాలు, పోస్ట్‌పెయిడ్ వినియోగదారులకు 30 రోజులు అపరిమితంగా కాలర్ ట్యూన్లను మార్చుకోవచ్చు. రూ .99 ప్లాన్: 100 కాలర్ ట్యూన్లను మూడు నెలలు ఉచితం రూ .249 ప్లాన్ : ఒక ఏడాదికి 250 కాలర్ ట్యూన్లు ఉచితం -
జియో ఫైబర్ : 30 రోజులు ఫ్రీ ట్రయల్
సాక్షి,ముంబై: రిలయన్స్ జియో ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులకు ఆకర్షణీయ ఆఫర్ తో కొత్త ప్లాన్స్ లాంచ్ చేసింది. ప్రకటించింది. ‘ట్రూలి అన్ లిమిటెడ్’ అంటూ జియో ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ వీటిని తాజాగా విడుదల చేసింది. సెప్టెంబర్ 1 నుండి జియోఫైబర్ కొత్త వినియోగదారుల కోసం ప్రత్యేకంగా ఒక నె లరోజులుపాటు ఎలాంటి కండీషన్లు లేని 30 రోజుల ఉచిత ట్రయల్ లభిస్తుంది వీరితోపాటు ఆగస్టు 15, 31 మధ్య ప్లాన్ తీసుకున్న జియోఫైబర్ పాత కస్టమర్లకు కూడా 30 రోజుల ఉచిత ట్రయల్ లభిస్తుంది. అలాగే 999, 1499 ప్లాన్లలో 1500 విలువైన 12 స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌ల (నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ+హాట్‌స్టార్, జీ 5, సోనీ లివ్, లయన్స్‌గేట్ ప్లే, ఆల్ట్ బాలాజీ) చందా ఉచితం. 4కే సెట్ టాప్ బాక్స్‌ను కూడా పొందుతారు. ఇప్పటికే ఉన్న వినియోగదారులు కొత్త టారిఫ్ ప్లాన్ల ప్రయోజనాలకు అనుగుణంగా అప్‌గ్రేడ్ అవుతారు. విశ్వసనీయమైన ఇంటర్నెట్ కనెక్టివిటీ అవసరమైన ప్రస్తుత సమయంలో వీటిని తీసుకొచ్చామని జియో ఫైబర్ ఒక ప్రకటనలో వెల్లడించింది. కొత్త జియోఫైబర్ ప్రణాళికలు ప్రయోజనాలు అపరిమిత ఇంటర్నెట్ సిమెట్రిక్ స్పీడ్ (అప్లోడ్ వేగం = డౌన్లోడ్ వేగం) నెలకు 399 నుండి ప్రారంభమయ్యే ప్రణాళికలు అదనపు ఖర్చు లేకుండా టాప్ 12 ఓటీటీ యాప్స్ ఉచితం జియోఫైబర్ నో-కండిషన్ 30 రోజుల ఉచిత ట్రయల్ 150 ఎంబీపీసెస్ అపరిమిత ఇంటర్నెట్ 4కే సెట్ టాప్ బాక్స్ ఉచిత వాయిస్ కాలింగ్ నచ్చకపోతే, (ఎలాంటి ప్రశ్నలు సమాధానం చెప్పాల్సిన అవసంర లేకుండానే) ప్లాన్ వెనక్కి తీసుకోవచ్చు. జియో ఫైబర్ కొత్త ప్లాన్స్ 399 రూపాయల ప్లాన్ లో 30 ఎంబీపీఎస్ స్పీడ్ 699 రూపాయల ప్లాన్ లో 100 ఎంబీపీఎస్ స్పీడ్ 999 రూపాయల ప్లాన్ లో 150 ఎంబీపీఎస్ స్పీడ్ 1,499 రూపాయల ప్లాన్ లో300 ఎంబీపీఎస్ స్పీడ్ -
బీఎస్ఎన్ఎల్ లోన్ టాక్‌టైమ్ ప్లాన్
న్యూఢిల్లీ: కరోనా వైరస్ ఉదృతి నేపథ్యంలో ప్రజలందరు ఇంట్లో ఉండడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే అధిక టెలికాం కంపెనీలు రూ.200 దాటిన డిజిటల్ రీచార్జ్‌లనే అనుమతిస్తున్నాయి. ప్రస్తుతం వినియోగదారులు స్టోర్స్‌లోకి వెళ్లి రీచార్జ్ చేసుకునే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో బీఎస్ఎన్ఎల్ ఎగువ నుంచి దిగువ తరగతి కస్టమర్లకు లాభం కలిగించే విధంగా సరికొత్త టాక్‌టైమ్ లోన్స్(రుణాలు)తో ముందుకొచ్చింది. టాక్‌టైమ్ లోన్స్ ప్రారంభ ధర రూ.10 నుంచి 50 రూపాయల వరకు వినియోగదారులు లోన్ తీసుకునే అవకాశం కల్పించింది. అయితే టాక్‌టైమ్ లోన్స్(రుణాలు) కావాలనుకునే వారు యూఎస్ఎస్డీ (USSD) కోడ్(*511*7#)లో నమోదు చేసుకోవాలని సంస్థ పేర్కొంది. ఈ కోడ్ నమోదు చేసుకోగానే వినియోగదారులకు దృవీకరించినట్లు ఒక ఎస్ఎమ్ఎస్ వస్తుంది. ఈ ఎస్ఎమ్ఎస్లో లోన్‌కు సంబంధించిన వివరాలుంటాయి. వినియోగదారులకు కావాల్సిన రీచార్జ్ నెంబర్లు ఉంటాయి. రీచార్జ్‌కు కావాల్సిన నెంబర్‌ను ఎంచుకొని సెండ్ ఆఫ్షన్ క్లిక్ చేస్తే లోన్ రీచార్జ్ అవుతుంది. కాగా, మెరుగైన సేవల కోసం వినియోగదారులు మై బీఎస్ఎన్ఎల్ యాప్‌లో లాగిన్ అయ్యాక గో డిజిటల్ ఆఫ్టన్‌ను సెలక్ట్ చేయాలని తెలిపింది. మరోవైపు బీఎస్ఎన్ఎల్ రూ .18తో కాంబో ప్లాన్‌ను అందిస్తుంది. ఈ ప్లాన్ ద్వారా రోజుకు 1.8 జీబీ డేటాను, 250 నిమిషాల ఉచిత కాల్ టాక్‌టైమ్ పొందవచ్చు. అయితే ఈ ఆఫర్ కేవలం 2 రోజుల కాలపరిమితి మాత్రమే ఉంటుంది. రూ .108 ప్లాన్: ఈ ప్లాన్ ద్వారా 1జీబీ డేటాతో పాటు 500 ఎస్ఎంఎస్లను 60 రోజుల కాలపరిమితిలో ఎప్పుడైనా చేసుకోవచ్చు. (రూ .153 ప్లాన్):ఈ ప్లాన్ ద్వారా ప్రతి రోజు 1 జీబీ డేటాతో పాటు 100 ఎస్ఎంఎస్లను 180 రోజుల కాలపరిమితితో పొందవచ్చు. (రూ .186 ప్లాన్): ఈ ప్లాన్ ద్వారా ప్రతి రోజు 2 జీబీ, 100 ఎస్ఎంఎస్లను 180 రోజుల కాలపరిమితో పొందవచ్చు. -
కరోనా: ఇంటి నుంచి ఈ పనులు చేయండి
సాక్షి, అమరావతి: కరోనా వైరస్ నివారణలో భాగంగా దేశంలోని అన్ని యూనివర్సిటీలు, వాటి పరిధిలోని అన్ని విద్యా సంస్థలను మూసేసి ఇంటి నుంచే పని విధానాన్ని ఈ నెల 31 వరకు అమలు చేయాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు విడుదల చేసిన ఉత్తర్వుల్లో ఫ్యాకల్టీ మెంబర్లు, టీచర్లు, రీసెర్చి స్కాలర్లు, కాంట్రాక్టు ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది మొత్తం ఇంటి నుంచే విధులు నిర్వర్తించేలా చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది. ఆన్లైన్ కంటెంట్, ఆన్లైన్ బోధన, ఆన్లైన్ మూల్యాంకనం కార్యక్రమాలను అభివృద్ధి చేయాలని పేర్కొంది. (కరోనా: చప్పట్లు కాదు అవి ఇవ్వండి!) వర్క్ ఫ్రమ్ హోమ్ సందర్భంగా ఫ్యాకల్టీ సభ్యులు, ఉపాధ్యాయులు, పరిశోధకులు వివిధ విద్యా కార్యకలాపాల కోసం ఈ కాలాన్ని ఉపయోగించుకోవాలి. ► వచ్చే విద్యా సంవత్సరం లేదా తదుపరి సెమిస్టర్లో అందించే కోర్సులకు పాఠ్య ప్రణాళికను సిద్ధం చేయాలి. ► బోధనా సామగ్రిని అభివృద్ధి పరచాలి. ► పరిశోధకులు ఇంటి నుంచే పరిశోధనలు కొనసాగించాలి. ► వివిధ అంతర్జాతీయ జర్నల్స్‌కు, ఇతర మ్యాగజైన్లకు వ్యాసాలు, పేపర్లు మొదలైనవి ఇంటి నుంచే రాసి పంపించాలి. ► విద్యార్థులకు ఉపయోగపడేలా ప్రశ్నలను సిద్ధం చేయాలి. ► ‘ఏక్ భారత్ శ్రేష్ట భారత్’ తదితర అంశాలపై వినూత్న ప్రాజెక్టులను సిద్ధం చేయాలి. ► ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ కాలాన్ని విధుల్లో ఉన్నట్లు పరిగణిస్తారు. ► హాస్టళ్లలో ఉన్న విద్యార్థులు ముఖ్యంగా విదేశీ విద్యార్థులుంటే వారిని హాస్టళ్లలో కొనసాగడానికి అనుమతించాలి. వారికి అవసరమైన ఏర్పాట్లు, ఇతర భద్రతా చర్యలు తీసుకోవాలి. ► ఫ్యాకల్టీ సభ్యులు, ఉపాధ్యాయులు, పరిశోధకులు, బోధనేతర సిబ్బందిని సంప్రదించేందుకు మొబైల్ నంబర్లు, ఈ–మెయిల్ ఐడీ తదితర సమాచారాన్ని తమ సంస్థలకు పంపించాలి. -
పుతిన్.. ఎన్నటికీ రష్యాధిపతే!
మాస్కో: రష్యాలో రెండు దశాబ్దాలుగా అప్రతిహతంగా సాగుతున్న తన అధికారాన్ని ఇకపైనా నిరాటంకంగా కొనసాగించే దిశగా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పావులు కదుపుతున్నారు. అందులో భాగంగా తాజాగా పలు రాజ్యాంగ సంస్కరణలను ఆయన ప్రతిపాదించారు. పార్లమెంటు, కేబినెట్ అధికారాలను విస్తృతపరచాల్సి ఉందని బుధవారం జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో ఆయన స్పష్టం చేశారు. రాజ్యాంగాన్ని ఈ మేరకు సవరించాల్సి ఉందన్నారు. 2024తో దేశాధ్యక్షుడిగా పుతిన్ పదవీకాలం ముగియనుండటంతో... ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పార్లమెంటు పాత్ర పెరగాలి: ప్రధానమంత్రిని, కేబినెట్‌ను ఎంపిక చేసే అధికారాన్ని పార్లమెంట్‌కు ఇవ్వాలని పుతిన్ తాజాగా ప్రతిపాదించారు. ప్రస్తుతం ఆ అధికారం అధ్యక్షుడి చేతిలో ఉంది. ‘ఆ అధికారాలను ఇవ్వడం ద్వారా పార్లమెంటరీ పార్టీలు, పార్లమెంట్ పాత్ర మరింత పెరుగుతుంది. ప్రధాన మంత్రి, కేబినెట్ మంత్రుల అధికారం, స్వతంత్రత కూడా పెరుగుతాయి’ అని ఆ ప్రసంగంలో పుతిన్ స్పష్టంచేశారు. కాకపోతే ఇక్కడో చిన్న మెలిక పెట్టారాయన. ‘‘అలాగని పార్లమెంటరీ పాలన విధానం గొప్పదని చెప్పలేం. పార్లమెంటరీ వ్యవస్థలోకి వెళ్తే దేశ సుస్థిరతకు ప్రమాదం కలిగే అవకాశముంది. ‘ప్రధానిని, కేబినెట్‌ను రద్దు చేసే అధికారం అధ్యక్షుడికే ఉండాలి. రక్షణ రంగంలోని అత్యున్నత అధికారులను నియమించే అధికారం సైతం దేశ అధ్యక్షుడికే ఉండాలి. రష్యా మిలటరీ, ఇతర దర్యాప్తు సంస్థల ఇన్చార్జిగా కూడా అధ్యక్షుడే ఉండాలి’ అని పుతిన్ స్పష్టం చేశారు. ప్రాంతీయ గవర్నర్లు సభ్యులుగా ఉన్న స్టేట్ కౌన్సిల్ అధికారాలను కూడా రాజ్యాంగంలో నిర్దిష్టంగా పేర్కొనాలని సూచించారాయన. ‘ఎక్కువమంది పిల్లలున్న వారికి ప్రభుత్వ సబ్సిడీలను పెంచాలి. తక్కువ ఆదాయం వల్లే జనం ఎక్కువ మంది పిల్లలు వద్దనుకుంటున్నారు. వారి ఆదాయాన్ని పెంచేలా పరిశ్రమలు తేవాలి’ అని చెప్పారాయన. రష్యా ప్రస్తుత జనాభా 14.7 కోట్లు. ప్రతిపాదిత సంస్కరణలను దేశవ్యాప్త ఓటింగ్‌కు పెట్టాలని పుతిన్ కోరారు. మెద్వదేవ్ రాజీనామా పుతిన్ ప్రసంగం అనంతరం, దేశ ప్రధాని దిమిత్రి మెద్వదేవ్ తన పదవికి రాజీనామా చేశారు. ప్రభుత్వ వ్యవస్థలో పుతిన్ తీసుకురాదలచిన మార్పులను సానుకూలపర్చేందుకు వీలుగా తాను రాజీనామా చేస్తున్నట్లు ఆయన చెప్పారు. మెద్వదేవ్ రాజీనామాను పుతిన్ ఆమోదించారు. ఆయన సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం, ప్రెసిడెన్షియల్ సెక్యూరిటీ కౌన్సిల్ ఉప దళపతిగా మెద్వదేవ్‌ను, తదుపరి ప్రధానిగా మైఖేల్ మిషుస్తిన్‌ను నియమించారు. ఆ వెంటనే, ఈ నియామకాల్ని పార్లమెంట్ ఆమోదించింది. కాగా, మెద్వదేవ్ పనితీరుపై గతంలో పుతిన్ పలు సందర్భాల్లో అసంతృప్తి వ్యక్తం చేశారు. పుతిన్ ఆలోచన ఇదే!! రష్యా రాజ్యాంగం వరసగా రెండుసార్లు మాత్రమే అధ్యక్షుడిగా ఉండటానికి అవకాశం కల్పిస్తోంది. 2000వ సంవత్సరంలో అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన పుతిన్... నిబంధనల ప్రకారం నాలుగేళ్లు చొప్పున 2008 వరకూ రెండుసార్లు అధ్యక్షుడిగా కొనసాగారు. ఆ తరవాత ప్రధాని పదవిని చేపట్టారు. ప్రధానిగా ఉన్న తన అనుచరుడు మెద్వదేవ్‌ను అధ్యక్షుడిని చేశారు. తన పదవీకాలంలో మెద్వదేవ్... అధ్యక్ష పదవీ కాలాన్ని నాలుగేళ్ల నుంచి ఆరేళ్లకు పెంచేశారు. అంతేకాకుండా 2012లో పుతిన్ కోసం మెద్వదేవ్ తన పదవి నుంచి దిగిపోయారు. అప్పుడు అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన పుతిన్ 2018లో మొదటి విడతను పూర్తి చేసుకుని, రెండోవిడత కూడా కొనసాగుతున్నారు. 2024 వరకూ పదవీ కాలం ఉంది. గ్యాప్ కోసం 2024లో మళ్లీ దిగి... ప్రధానిగా బాధ్యతలు చేపడతారని, అప్పుడు కూడా తన చేతిలో అధికారమంతా ఉండేందుకే పుతిన్ ఈ ప్రతిపాదన చేశారని విశ్లేషకుల మాట. తన స్థానంలో అధ్యక్షుడిగా వచ్చే వ్యక్తి .. మళ్లీ తనకే పగ్గాలు అప్పగించేలా చేయడమే పుతిన్ వ్యూహమని చెబుతున్నారు. జోసెఫ్ స్టాలిన్ తరువాత అత్యధిక కాలం దేశ కీలక పదవిలో కొనసాగిన ఘనత పుతిన్‌దే కావడం విశేషం. రష్యా కొత్త ప్రధాని మైఖేల్ మిషుస్తిన్ -
జియో కొత్తప్లాన్స్ ఇవే..ఒక బంపర్ ఆఫర్
సాక్షి, ముంబై: రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ బుధవారం ప్లాన్లను తీసుకొచ్చింది. ఆల్ ఇన్ వన్ ప్లాన్స్ సరికొత్త తారిఫ్‌లను ప్రకటించింది. ఇందులో అన్ లిమిటెడ్ వాయిస్, డేటా ప్లాన్స్ అందుబాటులోకి రానున్నాయని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ న్యూ ఆల్ ఇన్ వన్ ప్లాన్స్ డిసెంబర్ 6 నుంచి అమల్లోకి రానుంది. అయితే కొత్త ఆల్ ఇన్ వన్ ప్లాన్ ద్వారా జియో కస్టమర్లు 300 శాతం వరకు అధిక ప్రయోజనాలను పొందుతారు. వినియోగదారుల విశ్వాసానికి కట్టుబడి ఉంటూనే, భారతీయ టెలికమ్యూనికేషన్ పరిశ్రమను నిలబెట్టడానికి జియో అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపింది. నెలకు రూ.199 ప్లాన్‌నుంచి ఏడాదికి రూ. 2,199 తాజా ప్లాన్లు ఉండనున్నాయి. న్యూ ఆన్‌ఇన్ వన్ ప్లాన్స్ ఆఫర్ ఏంటంటే.. అంతేకాదు పూర్తి ప్రయోజనాలకోసం డిసెంబర్ 6 కి జియో కస్టమర్లు తమ పాత రీఛార్జ్ ప్లాన్లను రీచార్జ్ చేసుకోవచ్చని సూచించింది. 336 రోజుల నిరంతరాయ సేవలతో 444 ప్లాన్‌తో నాలుగుసార్లు రీఛార్జ్ చేసుకోవచ్చు. రోజుకు 2 జీబీ డేటాను అందిస్తుందనీ, ప్రతి రూ. 444 రీఛార్జ్ 84 రోజులు చెల్లుతుంది కాబట్టి, నాలుగు ప్లాన్లను కొనుగోలు చేస్తే మీకు 336 రోజుల సేవ లభిస్తుందని జియో వెల్లడించింది. ఇప్పటికే భారతి ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా కొత్త ప్లాన్లను అమల్లోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. -
మొబైల్ టారిఫ్‌లలో మరింత పారదర్శకత
న్యూఢిల్లీ: మొబైల్ ఫోన్ సర్వీస్ రేట్ల విషయంలో మరింత పారదర్శకత తెచ్చే దిశగా టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా కస్టమర్లకు అనువైన ప్లాన్ సూచించేలా టారిఫ్ కాల్క్యులేటర్ ప్రవేశపెట్టడం తదితర ప్రతిపాదనలు చేసింది. టెలికం ఆపరేటర్లు కొత్త ప్లాన్లు ప్రవేశపెట్టినప్పుడు.. పాత పథకాల వివరాలు కూడా అందుబాటులో ఉంచాలని ప్రతిపాదించింది. దీనివల్ల రెండింటిని పోల్చి చూసుకుని తగిన ప్లాన్ ఎంపిక చేసుకోవడం సులువవుతుంది. ప్రస్తుతం టెల్కోలు కొత్త ప్లాన్లు ప్రవేశపెట్టాక.. పాత ప్లాన్ల వివరాలను తొలగించేస్తున్నాయి. ఫలితంగా సరైన సమాచారం లేకపోవడం లేదా వివరాలు తప్పుదోవ పట్టించేవిగా ఉండటం లేదా అస్పష్టంగా ఉండటం వంటి వివిధ కారణాలతో యూజర్లు గందరగోళ పరిస్థితి ఎదుర్కొంటున్నారని ట్రాయ్ అభిప్రాయపడింది. ఇక యూజరు తను ఎంత డేటా, ఎన్ని నిమిషాల అవుట్గోయింగ్ వాయిస్ కాల్స్ చేయొచ్చు, ఎన్నాళ్ల వేలిడిటీ కోరుకుంటున్నారు తదితర వివరాలిస్తే.. వారికి అత్యంత అనువైన ప్లాన్స్‌ను సూచించేలా టారిఫ్ కాల్‌క్యులేటర్‌ను రూపొందించాల్సిన అవసరం ఉందని ట్రాయ్ పేర్కొంది. మరోవైపు, ఫెయిర్ యూసేజీ పాలసీ (ఎఫ్‌యూపీ), ఫస్ట్ రీచార్జ్ కండీషన్ (ఎఫ్ఆర్సీ) వంటి విధానాలు అమలు చేసేటప్పుడు షరతులు, నిబంధనలను సవివరంగా తెలపకపోవడం లేదా తెలిపినా స్పష్టత లేకపోవడం వంటి అంశాల వల్ల యూజర్లు సమస్యలు ఎదుర్కొంటున్నారని ట్రాయ్ అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో సర్వీసులు మెరుగుపర్చడానికి టెల్కోలు ఇంకా ఏం చర్యలు తీసుకోవచ్చన్న దానిపై అభిప్రాయాలు తెలపాలంటూ టెలికం యూజర్లకు ట్రాయ్ సూచించింది. అభిప్రాయాలు పంపేందుకు తుది గడువు డిసెంబర్ 26 కాగా.. పరిశ్రమ వర్గాలు కౌంటర్ కామెంట్స్ సమర్పించేందుకు జనవరి 9 ఆఖరు తేదీగా ట్రాయ్ నిర్ణయించింది. కాగా, చార్జీలు పెంచాలని టెల్కోలు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ప్రస్తుతం దీనిపై జోక్యం చేసుకోరాదని ట్రాయ్ భావిస్తున్నట్లు సమాచారం. టెల్కోల చీఫ్‌లతో ట్రాయ్ చైర్మన్ భేటీ.. వచ్చే ఏడాది (2020) దేశీ టెలికం రంగానికి సంబంధించిన అజెండా రూపకల్పనలో భాగంగా వొడాఫోన్–ఐడియా సీఈవో రవీందర్ టక్కర్ సహా వివిధ టెల్కోల చీఫ్‌లతో ట్రాయ్ చైర్మన్ ఆర్ఎస్ శర్మ సమావేశమయ్యారు. 2020లో ప్రధానంగా దృష్టి సారించాల్సిన అంశాలపై చర్చించినట్లు ఆయన తెలిపారు. -
జియో ఫోన్ కస్టమర్లకు బంపర్ ఆఫర్ : కొత్త ప్లాన్స్
సాక్షి,ముంబై : రిలయన్స్ జియో కస్టమర్లను ఆకట్టుకునేందుకు విభిన్న ప్రయోగాలు చేస్తోంది. ఇటీవల స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు ‘ఆల్ వన్ ప్లాన్’ తీసుకొచ్చి విజయాన్ని సాధించిన జియో ఇదే వ్యూహాన్ని జియో ఫోన్ విషయంలో కూడా అమలు చేస్తోంది. తాజాగా ఇండియా కా స్మార్ట్‌ఫోన్ జియోఫోన్ ప్రీపెయిడ్ వినియోగదారులకు ఆల్ ఇన్ వన్ మంత్లీ ప్లాన్లను లాంచ్ చేసింది. రూ. 75, రూ.125, రూ.185 విలువైన రీచార్జ్ ప్లాన్లను తీసుకొచ్చింది.ఈ ప్లాన్లలో వరుసగా నెలకు 3జీబీ (రోజుకు 0.1 జీబీ), 14జీబీ,(రోజుకు 0.5 జీబీ), 28 జీబీ (రోజుకు 1 జీబీ), 56 జీబీ (రోజుకు 2జీబీ) డేటాలను అందిస్తుంది. అంతేకాదు ఉచిత 500 నిమిషాల నాన్-జియో వాయిస్ కాలింగ్ సదుపాయం కూడా ఈ ప్లాన్స్‌లో అఫర్ చేస్తోంది. అలాగే అపరిమిత జియో-టు-జియో, ల్యాండ్‌లైన్ వాయిస్ కాల్లు కూడా ఉన్నాయి. జియో ఫోన్ వినియోగదారుల కోసం తన కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ల ద్వారా ప్రత్యర్థుల కంటే 25 రెట్లు ఎక్కువ విలువను అందిస్తున్నామని జియయో పేర్కొంది. ఇటీవల ఇంటర్ కనెక్ట్ యూజ్ ఛార్జ్ (ఐయుసి) చార్జీలను జియో ప్రకటించింది. దీనిపై వినియోగదారులనుంచి నిరసన వ్యక్తం కావడంతో స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకోసం ఆల్ ఇన్ వన్ మంత్లీ ప్లాన్లను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. చదవండి : దిగి వచ్చిన జియో : కొత్త రీచార్జ్ ప్లాన్లు -
దిగి వచ్చిన జియో : కొత్త రీచార్జ్ ప్లాన్లు
సాక్షి, ముంబై : ప్రముఖ టెలికాం ఆపరేటర్ రిలయన్స్ జియో కొత్త మంత్లీ ప్లాన్లను లాంచ్ చేసింది. ఇటీవల నిమిషానికి 6 పైసల చార్జీల వడ్డనపై నిరసనలు వెల్లువెత్తడంతో జియో కొత్త ఎత్తుగడతో వచ్చినట్టు కనిపిస్తోంది. ఉచిత ఐయూసీ కాల్స్ ఆఫర్‌తో ‘జియో ఆల్ ఇన్ వన్ ప్లాన్స్ (మూడు రీచార్జ్ ప్లాన్ల)ను సోమవారం తీసుకొచ్చింది. ఈ ప్లాన్ల ద్వారా రోజుకు 2 జీబీడేటాను అందిస్తోంది. ప్రధానంగా ఈ ప్లాన్లలో విశేషం ఏమిటంటే జియోయేతర మొబైల్ నంబర్లకు 1,000 నిమిషాల ఉచిత టాక్‌టైమ్‌ను ఆఫర్ చేస్తోంది. దీంతోపాటు ఎప్పటిలాగే జియో టు జియో అన్లిమిటెడ్ కాలింగ్ సదుపాయం. ఈ కొత్త ప్లాన్స్ ఒక నెలకు రూ. 222, 2 నెలలకు రూ. 333, 3 నెలలకు రూ. 444 లు ప్లాన్లను ఎంపిక చేసుకోవచ్చు. తమ కొత్త ప్లాన్స్ ఇతర ప్రత్యర్థి కంపెనీల కంటే మార్కెట్లో కనీసం 20-50 వరకు వరకు చౌకగా ఉన్నాయని జియో ఒక ప్రకటనలో తెలిపింది. జియో కస్టమర్లు తమ ప్లాన్స్‌ను రూ. 111తో అప్‌గ్రేడ్ చేసుకోవచ్చని పేర్కొంది. 3 నెలల 2జీబీ ప్యాక్(రూ. 448) తో పోలిస్తే.. రూ. 444 మాత్రమే ఖర్చు అవుతుంది. రూ. 396 (198x2) ప్లాన్స్‌లో మునుపటి ఖర్చుతో పోలిస్తే ఇపుడు రూ. 333 మాత్రమే ఖర్చవుతుందని, అలాగే అదనంగా 1,000 నిమిషాల ఐయూసీ వాయిస్ కాల్స్ ఉచితమని జియో తెలిపింది. విడిగా దీన్ని కొనాలంటే 80 రూపాయలు వినియోగదారుడు వెచ్చించాల్సి వస్తుందని జియో వెల్లడించింది. కాగా ఇంటర్‌కనెక్ట్ యూజర్ ఛార్జీ పేరుతో నిమిషానికి రూ. 6 పైసల వసూలును ఇటీవల జియో ప్రకటించింది. అలాగే ఒక రోజు వాలిడిటీ ఉన్న రూ.19 ప్లాన్‌ను, 7రోజుల వాలిడిటీ రూ. 52ప్లాన్‌ను తొలగించింది. దీనిపై వినియోగదారుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తం కాగా, అటు ప్రత్యర్థి కంపెనీ వొడాఫోన్ స్పందిస్తూ తాము ఎలాంటి ఐయూసీ చార్జీలు వసూలు చేయబోమని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. -
వినోద భారం తగ్గేనా?
కూకట్‌పల్లిలో ఉండే శివకు కేబుల్ బిల్లు రూ.280 వచ్చింది. ‘మేం చూసేదే.. ఐదో, ఆరో చానళ్లు ఇంత ధరెందుకు? అంటే సార్ ఇది హైదరాబాద్.. ఇక్కడ అన్ని భాషలోళ్లు ఉంటరు.. మీ ఒక్కరికోసం తగ్గించలేం ’అని బదులిచ్చాడు కేబుల్ బాయ్. ఈ బాధ భరించలేక.. డీటీహెచ్ కొనుక్కున్నాడు. కానీ, అందులోనూ అదే దోపిడీ ఎంపిక చేసిన చానళ్ల పేరుతో ఖర్చు రూ.500లకు పెరిగింది.అందులోనూ తాను చూడని చానళ్లే అధికం. దీంతో దిక్కుతోచలేదు అతనికి. సాక్షి, హైదరాబాద్: కేబుల్ టీవీ, డీటీహెచ్ పేరిట ఇష్టానుసారంగా జరుగుతున్న దోపిడీకి ఇది నిదర్శనం. నిబంధనల్ని తుంగలో తొక్కి అవసరం ఉన్నా లేకున్నా.. నచ్చని చానళ్లను అంటగడుతూ.. అందినకాడికి డబ్బులు దండుకుంటున్నారు. ఇక నుంచి ఇలాంటి వినియోగదారులపై వినోద భారం తగ్గనుంది. ఫిబ్రవరి 1 నుంచి ట్రాయ్ కొత్త నిబంధనలు అమలుకానున్నాయి. వాస్తవానికి ఇవి డిసెంబరు ఆఖరుకే అమలు కావాలి. కానీ, వివిధ వర్గాల ఆందోళనల నేపథ్యంలో అమలును ఫిబ్రవరి 1కి వాయిదా వేశారు. ట్రాయ్ కొత్త నిబంధనల ప్రకారం.. ఇష్టానుసారంగా చానళ్లకు రుసుం వసూళ్లు చేస్తామంటే కుదరదు. ఇష్టం లేని, చూడని చానళ్లకు డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. ఎక్కువ వసూలు చేస్తున్నారు వాస్తవానికి ట్రాయ్ నిబంధనల ప్రకారం.. కనిష్టంగా రూ.100 నుంచి గరిష్టంగా రూ.153 వసూలు చేయాలి. కానీ.. ఈ నిబంధనలు ఎక్కడా అమలు కావడం లేదు. ఎవరికి వారు ఇష్టానుసారంగా వసూలు చేస్తున్నారు. తాము చూడని చానళ్లకు కూడా వారు డబ్బు చెల్లిస్తున్నారు. తెలంగాణలో దాదాపుగా 82 లక్షల మంది టీవీ సబ్స్క్రైబర్లున్నారు. వీరిలో 17 లక్షల మంది డీటీహెచ్ సబ్స్క్రైబర్లు. మీరు చూడని చానల్‌కు డబ్బులు చెల్లించనక్కర్లేదని ట్రాయ్చెబుతున్నా.. ఆ నిబంధనల్నికొన్ని శాటిలైట్ చానళ్లు పట్టించుకోవడం లేదు. వాస్తవానికి మదర్ చానల్ ఒకటి ఉంటుంది. దానికి అనుబంధంగా మరో డజను చానళ్ల వరకు ఉంటాయి. ఈ డజను చానళ్లలో ఏదో ఒకటే ఎంచుకుంటానంటే కుదరదు. ఏ ఒక్కటి చూడాలన్నా.. మొత్తం కొనుక్కోవాల్సిందే. వీటిపై ట్రాయ్ ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ప్రకటనల మాటేంటి? వివిధ చానళ్లలో యాడ్ల ద్వారా ఆయా చానళ్లకు కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతోంది. వీటిలో ఉచిత చానళ్లలో యాడ్లపై వినియోగదారులకు ఎలాంటి అభ్యంతరాలు లేవు. ఎటొచ్చీ పెయిడ్ చానళ్ల విషయంలో అభ్యంతరాలను లేవనెత్తుతున్నారు. ఇప్పటికే చానల్ చూస్తున్నందుకు డబ్బులిస్తున్నాం కదా? అలాంటప్పుడు మళ్లీ యాడ్ల గోల ఎందుకు? అని నిలదీస్తున్నారు. ట్రాయ్ కొత్త నిబంధనల నేపథ్యంలో ఒక్కో చానల్ ధరను 400% పెంచేశాయి. వీటి ద్వారానే కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతున్నపుడు తిరిగి ప్రకటనలు ప్రసారం చేయడం ఎందుకంటున్నారు. వినియోగదారులకు హక్కులివి! 1. ఏ పే చానల్‌కు అయినా.. గరిష్ఠంగా 19 రూపాయలు మాత్రమే వసూలు చేయాలి. కొత్త నిబంధనల ప్రకారం 100 ఉచిత చానళ్లు తప్పనిసరిగా ఇవ్వాలి. అందులో 26 దూరదర్శన్ చానళ్లే ఉంటాయి. ఈ వంద చానళ్లకీ కలిపి 130 రూపాయలు, 18% జీఎస్టీ అంటే మొత్తం రూ.153.40 మాత్రమే చెల్లించాలి. 2. ఉచిత చానళ్ల ఎంపికలో పూర్తి స్వేచ్ఛ వినియోగదారుడిదే. వంద చానళ్ల కంటే ఎక్కువ ఉచిత చానళ్లను ఎంపిక చేసుకునే హక్కు కూడా వినియోగదారుడికి ఉంది. ఉదాహరణకు వందకు పైన ఇంకో 25 ఉచిత చానళ్లు కోరుకుంటే దానికి మరో 20 రూపాయలు ఎక్కువ బిల్లు కట్టాలి. 3. ప్రతీ చానల్ ధర వేర్వేరుగా ఉంటుంది. లేదంటే ఒకే గ్రూపునకు చెందిన చానళ్లు నాలుగైదింటికి కలిపి ఒక ధర ఇవ్వవచ్చు. 4. ప్రతీ ఆపరేటరూ తాను అందించే చానళ్ల లిస్టును వినియోగదారులకు వద్దకు తీసుకురావాలి. అందులో వినియోగదారులు నచ్చినవి ఎంపిక చేసుకుని, ఏది కావాలో టిక్ పెట్టి కింద సంతకం పెట్టాలి. 5. కేబుల్ యాక్టివేషన్ చార్జీలు 350 రూపాయలకు మించకూడదు. అన్నిటికీ బిల్లులు తప్పనిసరిగా ఇవ్వాలి. నెల నెలా కట్టే డబ్బులతో సహా. 6. మీకిచ్చే కార్డులో మొత్తం చానళ్ల పట్టిక, వాటి ధరలు, గ్రూపు చానళ్ల ధరలు, మీ ఎంపిక, నెలవారీ బిల్లు – మొత్తం ఉండాలి. 7. అన్ని రకాల నిబంధనలు ముద్రించిన కాగితం ఇవ్వాలి. అన్ని రకాల రేట్లు, రూల్స్ గురించి వివరించి చెప్పాలి. ఫిర్యాదు చేస్తే 8 గంటల్లో సర్వీసు సమస్య పరిష్కరించాలి. 8. ఏదైనా పే చానల్ ప్రసారాలు ఆగిపోతే ఆ డబ్బు వసూలు చేయకూడదు. కావాలంటే దాని బదులు అంతే ధర ఉన్న వేరే పే చానల్ ఇవ్వవచ్చు. 9. ఫిర్యాదులకు సంబంధించిన నంబర్లు ఇవ్వాలి, వెబ్ సైట్ ఏర్పాటు చేయాలి. చానళ్ల మార్పిడి రాతపూర్వకంగా ఉండాలి, 72 గంటల్లో జరగాలి. 10. నెల కంటే ఎక్కువ రోజులు చానల్ చూడకపోతే ఆ నెల బిల్లు కట్టక్కర్లేదు. కానీ ఆ విషయం 15 రోజుల ముందే ఆపరేటర్‌కి చెప్పాలి. కానీ రీ–కనెక్షన్‌కి 3 నెలల లోపు అయితే 25 రూపాయలు, మూడు నెలలు దాటితే 100 రూపాయలు కట్టాలి. ప్రస్తుత తెలుగు చానళ్లు ఆఫర్ చేస్తోన్న ధరలు(రూ.ల్లో): జెమినీ బొకే రూ.35.40, ఈటీవీ బొకే రూ.28.32, స్టార్ తెలుగు బొకే రూ.46.02, జీ ప్రైమ్ ప్యాక్ బొకే రూ.23.60, భవిష్యత్తులో అంతా ఆన్‌లైన్‌కే మొగ్గు! ఇప్పటికే ఆన్లైన్లో అమేజాన్, నెట్‌ఫ్లిక్స్, జియో తదితర సంస్థలు యాడ్లు లేకుండా వినోదాన్ని అందించే ప్యాకేజీలు అందుబాటులో ఉంచాయి. ట్రాయ్ నిబంధనల ప్రకారం.. ప్రతీ ప్యాకేజీ భారంగా కనిపించే అవకాశాలున్న నేపథ్యంలో చాలామంది వీటివైపు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వీటిలో నచ్చిన కార్యక్రమం చూసుకోవచ్చు. పైగా మొబైల్‌కు, టీవీకి, కంప్యూటర్, ట్యాబ్ ఎక్కడైనా ఎపుడైనా చూసుకోవచ్చు. పైగా వీటి సబ్స్క్రిప్షన్ ఏడాదికి రూ.1000 లోపే కావడం గమనార్హం. ట్రాయ్ నిబంధనల్లో ప్రైవేటు ప్యాకేజీల భారంగా భావించినవారంతా వీటివైపు మొగ్గుచూపే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఎందుకంటే ఎలాగూ.. న్యూస్ చానళ్లు ఉచితంగా వస్తున్నాయి. పలు టీవీ సీరియళ్లు యూట్యూబ్ ఇతర యాప్‌లో అందుబాటులో ఉంటున్నాయి. -
నక్సల్స్ దిష్టిబొమ్మల వ్యూహం!
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో గత కొన్ని నెలల్లో తీవ్ర ఎదురుదెబ్బలు తిన్న నక్సలైట్లు, భద్రతా దళాలతో పోరాడేందుకు కొత్త వ్యూహాలు పన్నారు. భద్రతా దళ సిబ్బందిని తప్పుదారి పట్టించేందుకు మనుషుల దిష్టిబొమ్మలు, నకిలీ తుపాకులను వారు ఉపయోగిస్తున్నారు. జవాన్లను ఉచ్చులోకి దింపేందుకు వ్యూహాత్మకంగా ఈ దిష్టిబొమ్మలను అడవుల్లో అక్కడక్కడా పెట్టారు. గత ఎనిమిది రోజుల్లోనే సుక్మా జిల్లాలో ఇలాంటి 13 దిష్టిబొమ్మలను స్వాధీనం చేసుకున్నామని ఆ జిల్లా ఎస్పీ అభిషేక్ మీనా తెలిపారు. గత కొన్ని నెలల్లో భద్రతా దళాల ఎన్కౌంటర్లలో భారీ సంఖ్యలో నక్సలైట్లు ప్రాణాలు కోల్పోవడం తెలిసిందే. ఇందుకు ప్రతీకారం తీర్చుకునేందుకు, తమ ఉనికిని నిలుపుకునేందుకు నక్సల్స్ ఈ కొత్త వ్యూహాన్ని ఎంచుకుని ఉండొచ్చని ఎస్పీ చెప్పారు. వియత్నాం యుద్ధంలో ఇలాంటి పద్ధతిని నాటి సైనికులు వినియోగించారనీ, అయితే నక్సల్స్ ఈ వ్యూహాన్ని అమలు చేయడం మాత్రం ఇదే తొలిసారని మీనా వెల్లడించారు. చింతగుహ అడవుల్లో దొరికిన ఓ దిష్టిబొమ్మ వద్ద అత్యాధునిక పేలుడు పదార్థాన్ని కూడా అమర్చారనీ, సైనికులపై దొంగదాడి చేసేందుకు లేదా వారిని పేలుడు పదార్థాలతో చంపేందుకు నక్సల్స్ ఈ కొత్త వ్యూహానికి తెరతీసి ఉండొచ్చన్నారు. పలు హాలీవుడ్ సినిమాలు, డాక్యుమెంటరీలు చూసి నక్సల్స్ ఈ తరహా కొత్త వ్యూహాలు పన్ని ఉండొచ్చని భద్రతా నిపుణుడొకరు చెప్పారు. పూర్తి వ్యూహం తయారుచేసే ముందు దిష్టిబొమ్మలకు భద్రతా దళ సిబ్బంది ఎలా స్పందిస్తారో తెలుసుకునేందుకే వారు ఇలా చేసి ఉంటారని ఆయన తెలిపారు. -
98 జీబీ, 126 జీబీ డేటా ఫ్రీ
సాక్షి, న్యూఢిల్లీ: టెలికాం రంగంలో డేటావార్ కొనసాగుతూనే ఉంది. ఇటీవల ఎయిర్టెల్, బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్లను ప్రకటించిన నేపథ్యంగా మరో ప్రధాన ఆపరేటర్ వోడాఫోన్ కొత్త ప్లాన్‌తో కస్టమర్లను ఆకట్టుకునేందుకు సిద్ధమైంది. తన ప్రీపెయిడ్ చందాదారుల కోసం రెండు కొత్త ప్లాన్లను వోడాఫోన్ ప్రకటించింది. వోడాఫోన్ రూ.549, రూ.799 రెండు రీచార్జ్ ప్లాన్లను తీసుకొచ్చింది. రూ. 549 ప్లాన్‌లో రోజుకు 3.5జీబీ డేటాను అందిస్తోంది. ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులు. అంటే మొత్తం 98 జీబీ డేటా నెలకు అందిస్తుంది. దీనితో పాటు అన్లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు ఉచితం. ఇక రెండో ప్లాన్ రూ.799 రీచార్జ్‌పై వోడాఫోన్ వినియోగదారులు రోజుకు 4.5జీబీ డేటా వాడుకోవచ్చు. దీని ప్రకారం మొత్తం126జీబీ ఉచితం. ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులు. ఇంకా అన్లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు ఆఫర్ చేస్తోంది. -
జియో మరో సంచలన సర్వీసులు
రిలయన్స్ జియో మరో సంచలన సర్వీసులను కమర్షియల్‌గా లాంచ్ చేయబోతుంది. అవే జియోలింక్ సర్వీసులు. ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న జియోలింక్ సర్వీసులపై బంపర్ ఆఫర్ ప్రకటించింది. తన జియోలింక్ సబ్స్క్రైబర్ల కోసం మూడు కొత్త ప్లాన్లను లాంచ్ చేస్తున్నట్టు రిలయన్స్ జియో తెలిపింది. అవే 699 రూపాయలు, 2099 రూపాయలు. 4199 రూపాయల ప్యాకేజీలు. ఈ ప్యాకేజీలన్నింటిపై రోజుకు 5జీబీ డేటాను ఆఫర్ చేయనున్నట్టు రిలయన్స్ జియో తెలిపింది. ఈ ప్యాక్‌లపై ఎలాంటి కాలింగ్ ప్రయోజనాలు ఉండవు. తొలి ప్లాన్ కింద 699 రూపాయలపై 5జీబీ 4జీ డేటాను కంపెనీ అందిస్తోంది. ఈ ప్లాన్‌వాలిడిటీ 28 రోజులు. కేవలం 5 జీబీ డేటా మాత్రమే కాకుండా 16 జీబీ అదనపు డేటాను జియో ఆఫర్ చేస్తోంది. అంటే మొత్తంగా నెలకు 156 జీబీ డేటాను యూజర్లు పొందుతారు. ఇక రెండో ప్లాన్ కింద పైన పేర్కొన్న ప్రయోజనాలే 98 రోజుల పాటు అందనున్నాయి. రోజుకు 5 జీబీ డేటా, ఈ ప్లాన్‌పై అదనంగా 48 జీబీ డేటాను 4జీ స్పీడులో యూజర్లకు జియో ఆఫర్ చేయనుంది. దీంతో మొత్తంగా 98 రోజుల పాటు 538 జీబీ డేటాతో యూజర్లు పండుగ చేసుకోవచ్చు. సగం వార్షిక ప్రాతిపదికన మూడో ప్లాన్‌ను జియో ఆవిష్కరించింది. అది 4,199 రూపాయల ప్లాన్. ఈ ప్లాన్ 196 రోజుల పాటు అందుబాటులో ఉంటుంది. ఈ ప్యాక్‌పై కూడా రోజుకు 5 జీబీ డేటాను, అదనంగా 96 జీబీ డేటాను యూజర్లు పొందవచ్చు. అంటే మొత్తంగా యూజర్లు 1076 జీబీ డేటాను పొందనున్నారు. ఈ మూడు ప్యాక్‌లపై జియో యాప్స్ కాంప్లిమెంటరీ సబ్ స్క్రిప్షన్ ను పొందవచ్చు. మంచి నెట్వర్క్ ఉండి కూడా సమస్యలు ఎదుర్కొనే వారికి జియోలింక్ సర్వీసులు ఎంతో ఉపయోగకరం. ప్రస్తుతం జియో లింక్ సర్వీసులు కమర్షియల్‌గా ఇంకా అందుబాటులోకి రాలేదు. ఇవి టెస్టింగ్ దశలో ఉన్నట్టు తెలిసింది. త్వరలోనే ఈ సర్వీసులను కూడా రిలయన్స్ జియో కమర్షియల్‌గా లాంచ్ చేయబోతుంది. జియోలింక్ డివైజ్ హాస్పాట్ డివైజ్ కంటే ఎక్కువ. వైర్డ్ కనెక్షన్లో ఎలాంటి పరిమితులు లేకుండా.. హై-స్పీడ్ ఇంటర్నెట్ యాక్సస్‌ను అందించడమే జియోలింక్ డివైజ్ ఉద్దేశం. -
షావోమి న్యూ ప్లాన్: గిఫ్ట్ కార్డ్
సాక్షి, న్యూఢిల్లీ: షావోమి భారత కస్టమర్లను ఆకట్టుకునేందుకు మరో ప్రణాళికను సిద్ధం చేసింది. ఎంఐ గిఫ్ట్‌కార్డ్ ప్రోగ్రామ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈమెయిల్ ద్వారా గిఫ్ట్‌లను అందించేలా ఎంఐ గిఫ్ట్‌కార్డ్‌ను ప్రవేశపెట్టింది. దీని ద్వారా పుట్టినరోజు, వార్షికోత్సవం, అభినందనలు తెలిపేందుకు లాంటి సందర్భాల్లో ఈ బహుమతులను అభిమానులకు, సన్నిహితులకు పంపుకోవచ్చు. రూ.100నుంచి గరిష్టంగా రూ.10వేల దాకా షావోమి ఉత్పత్తులను గిఫ్ట్‌గా ఇవ్వవచ్చు. ఒక లావాదేవీలో గరిష్ట 10గిఫ్ట్ కార్డులను ఉపయోగించవచ్చు ఎంఐ.కాం, లేదా ఎంఊస్టోర్ యాప్ ద్వారా స్మార్ట్ఫోన్ల నుంచి టెలివిజన్ దాకా స్మార్ట్ ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి వీటిని ప్రవేశపెట్టింది. ఎస్ఏఏఎస్ ఆధారిత ప్రీపెయిడ్ కార్డు సొల్యూషన్స్ ప్రొవైడర్ క్విక్కిల్వర్తో జత కట్టింది. అంతేకాదు ఎంఐ.కామ్ లేదా మి స్టోర్ స్టోర్లలో ఈ గిఫ్ట్ కార్డులను..కార్డుల గ్యాలరీ నుంచి ఎంచుకోవచ్చు లేదంటే.. మనకిష్టమైన ఫోటోను, ఇమేజ్ లేదా డిజైన్‌ను అప్లోడ్ చేసి ఆకర్షణీయమైన పెర్సనలైజ్డ్ కార్డ్‌ను కూడా పొందవచ్చు. డిజిటల్ గిఫ్టింగ్ భారతదేశంలో లభిస్తున్న ఆదరణ నేపథ్యంలో క్విక్కిల్వర్ భాగస్వామ్యంతో డిజిటల్ గిఫ్టింగ్ పథకాన్ని లాంచ్ చేశామని షావోమి ఇండియా ఆన్లైన్ సేల్స్ హెడ్ రఘురెడ్డి వెల్లడించారు. గిఫ్ట్‌కార్డ్ పొందాలంటే: గిఫ్ట్ కార్డును రీడీమ్ చేయడానికి, ఎంఐస్టోర్ యాప్‌లోకి వెళ్లి.. మై అకౌంట్ క్లిక్ చేసి ..యాడ్ గిఫ్ట్‌కార్డ్‌ను ఎంచుకోవాలి. 16 డిజిట్ నెంబర్‌ను, ఈమెయిల్ ద్వారా మనకు అందిన 6డిజిట్ పిన్ నెంబర్ ఎంటర్ చేయాలి. యాడ్ గిఫ్ట్‌కార్డ్‌ను క్లిక్ చేసి మన ఖాతాను చెక్ చేసుకోవచ్చు. దీనిద్వారా కస్టమర్లకిష్టమైన ఉత్పత్తిని ఎంచుకుని గిఫ్ట్‌గా మన కిష్టమైనవారికి పంపుకోవచ్చు. కొనుగోలు ఎలా చేయాలంటే:ఎంఐ గిఫ్ట్ కార్డుద్వారా కొనుగోలు చేయడానికి షావోమి వెబ్సైట్ స్పెషల్ పేజ్‌ను విజిట్ చేయాలి. ఎంఐ గిఫ్ట్ కార్డ్‌ను సెలక్ట్ చేసుకోవాలి. ఆ తరువాత గిప్ట్ పంపేవారి, గిప్ట్ అందుకునే వారి,చిరునామా,ఇతర సమాచారాన్ని నింపాలి. తరువాత మెసేజ్ , బహుమతి కార్డుతోపాటు డెలివరీ తేదీ వంటి వివరాలను పూరించాలి. ఈ ప్రక్రియ ఒకసారి పూర్తయితే, క్రెడిట్ /డెబిట్ కార్డు/ ఈఎంఐ/ యూపీఐ ద్వారా చెల్లింపుల ప్రక్రియ పూర్తయిన తర్వాత, స్వీకర్తకు ఒక ఇమెయిల్ అందుతుంది. దీంతోపాటు లావాదేవీ వివరాలు , గిఫ్ట్కార్డులో ఇంకా మిగిలి ఉన్న బ్యాలెన్స్ వంటి సమాచారం కూడా వినియోగదారుడికి అందుతుంది. ముఖ్యంగా, ఈ కార్డ్ ఒక సంవత్సరం పాటు చెల్లుబాటులో ఉంటుంది. ఒకవేళ ప్రొడక్ట్‌ను రిటర్న్ చేస్తే .. దాని విలువ తిరిగి గిఫ్ట్‌కార్డ్ ఖాతాలో జమ అవుతుంది. -
జియో న్యూఇయర్ ఎఫెక్ట్ : వొడాఫోన్ కొత్త ప్లాన్స్
కొత్త ఏడాది వస్తుందంటే... రిలయన్స్ జియో న్యూఇయర్ ఆఫర్లతో టెల్కోలకు షాకిస్తోంది. ఇప్పటికే న్యూఇయర్ 2018 సందర్భంగా మరో రెండు కొత్త ప్లాన్లతో రిలయన్స్ జియో తన కస్టమర్ల ముందుకు వచ్చేసింది. జియో న్యూఇయర్ ప్లాన్ల ఎఫెక్ట్‌తో దిగ్గజ టెల్కోలు కూడా కొత్త కొత్త ప్లాన్లతో వినియోగదారులను మురిపించబోతున్నాయి. దిగ్గజ కంపెనీల్లో ఒకటైన వొడాఫోన్, జియో న్యూఇయర్ ప్లాన్లకు ఫస్ట్ సవాల్‌గా రెండు సరికొత్త ప్లాన్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. దానిలో ఒకటి రూ.198 ఆఫర్. మరొకటి రూ.229 ఆఫర్. రూ.199 ఆఫర్ కింద వొడాఫోన్ తన కస్టమర్లకు రోమింగ్‌తో పాటు అపరిమిత వాయిస్ కాల్స్, రోజూ 100 ఎస్ఎంఎస్లు, రోజూ 1జీబీ 3జీ/4జీ డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్ కేవలం వొడాఫోన్ ప్రీపెయిడ్ కస్టమర్లకేనని, 28 రోజుల పాటు వాలిడిటీలో ఉంటుందని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. రెండో వొడాఫోన్ ప్లాన్ రూ.229పై కూడా రోజుకు 1జీబీ డేటా, అపరమిత కాల్స్, ఉచిత రోమింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్లను 28 రోజుల పాటు ఆఫర్ చేస్తుంది. అయితే ఈ ప్లాన్ కేవలం వొడాఫోన్ కొత్త యూజర్లకు మాత్రమేనని తెలిసింది. ఈ రెండు ప్లాన్లు వొడాఫోన్ 4జీ సర్కిల్స్‌కు మాత్రమే అందుబాటులో ఉంటాయి. జియో హ్యాపీ న్యూఇయర్ ఆఫర్‌ను టార్గెట్ చేసి ఈ రెండు ప్లాన్లను వొడాఫోన్ ప్రవేశపెట్టింది. న్యూఇయర్ సందర్భంగా జియో రూ.199, రూ.299తో కొత్త ప్లాన్లను వినియోగదారుల ముందుకు తీసుకొచ్చింది. రిలయన్స్ జియోకు టెలికాం దిగ్గజం ఎయిర్టెల్ నుంచి కూడా గట్టి పోటీ ఎదురవుతోంది. రూ.198తో 28 రోజుల వాలిడిటీలో ఎయిర్టెల్ గత నెలలోనే సరికొత్త ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. రూ.199 ప్లాన్‌ను కూడా ఎయిర్టెల్ లాంచ్ చేసింది. -
న్యూఇయర్ గిఫ్ట్ : జియో రెండు సరికొత్త ప్లాన్స్
న్యూఢిల్లీ : రిలయన్స్ జియో తన కస్టమర్లకు హ్యాపీ న్యూఇయర్ కానుకలు తీసుకొచ్చేసింది. హ్యాపీ న్యూఇయర్ 2018 స్కీమ్ కింద రెండు సరికొత్త ప్లాన్లను లాంచ్ చేసింది. ఒకటి రూ.199 ప్లాన్. మరొకటి రూ.299 ప్లాన్. నేటి అర్థరాత్రి నుంచి జియో ఈ ప్లాన్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. రూ.199 ప్లాన్ కింద ఉచిత వాయిస్, అపరిమిత డేటా(రోజుకు 1.2జీబీ హైస్పీడ్ 4జీ డేటా), అపరిమిత ఎస్ఎంఎస్లు, జియో ప్రైమ్ మెంబర్లందరికీ ప్రీమియం జియో యాప్స్ సబ్‌స్క్రిప్షన్‌ను 28 రోజుల పాటు అందించనున్నట్టు పేర్కొంది. ఎక్కువ డేటా వాడే వారికోసం రూ.299 ప్లాన్‌ను లాంచ్ చేసింది. ఈ ప్లాన్ కింద ఉచిత వాయిస్, అపరిమిత డేటా(రోజుకు 2జీబీ హైస్పీడ్ 4జీ డేటా), అపరిమిత ఎస్ఎంఎస్లు,జియో ప్రైమ్ మెంబర్లందరికీ ప్రీమియం జియో యాప్స్ సబ్‌స్క్రిప్షన్‌ను 28 రోజుల పాటు అందించనున్నట్టు ప్రకటించింది. జియో ఇప్పటికే రూ.149 ప్లాన్‌ను కలిగి ఉంది. ఈ ప్లాన్ కింద 28 రోజుల పాటు 4జీబీ డేటాను, అపరిమిత కాలింగ్, ఎస్ఎంఎస్లను అందిస్తోంది. హ్యాపీ న్యూఇయర్ 2018 కింద తన కస్టమర్లకు ఈ రెండు సరికొత్త ప్లాన్లను యాడ్ చేస్తూ.. తన ప్యాకేజీ వివరాలను ప్రకటించింది. -
అపరిమిత డేటాతో వొడాఫోన్ కొత్త ప్లాన్స్
వొడాఫోన్ కొత్తగా తన ప్రీపెయిడ్ యూజర్లకు రెండు సూపర్ ప్లాన్లను లాంచ్ చేసింది. ఎంపిక చేసిన సర్కిళ్లు మధ్యప్రదేశ్, చత్తీష్‌గఢ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బిహార్ అండ్ జార్ఖాండ్, జమ్ము, కశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్ యూజర్లకు కొత్తగా ఈ రూ.409, రూ.459 ప్లాన్లను తీసుకొచ్చింది. ఈ రీఛార్జ్ ప్యాక్స్ కింద అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు, అపరిమిత 2జీ డేటాను ఆఫర్ చేయనుంది. కొత్తగా తీసుకొచ్చిన ఈ రెండు ప్యాక్‌లకు మధ్య ఉన్న తేడా వాలిడిటీ మాత్రమే. రూ.409 ప్లాన్‌ను 70 రోజుల వ్యవధిలో అందిస్తుండగా.. రూ.459 ప్లాన్‌ను 84 రోజుల కాలానికి గాను అందిస్తోంది. ఆసక్తి గల వినియోగదారులు ఈ ప్యాక్‌లను మైవొడాఫోన్ యాప్, ఇతర ఆఫ్‌లైన్ వొడాఫోన్ స్టోర్ల ద్వారా కొనుగోలు చేయొచ్చని కంపెనీ తెలిపింది. ప్రస్తుతం ఈ ప్యాక్‌లు అందుబాటులో ఉన్న సర్కిల్స్‌లో వొడాఫోన్ 3జీ కవరేజ్ లేదు. జమ్ము, కశ్మీర్ సర్కిల్లో ఈ రెండు ప్యాక్‌లు ఇంకా తక్కువ ధరలకే లభించనున్నాయి. రూ.409 ప్లాన్ రూ.359కు, రూ.459 ప్లాన్ కేవలం రూ.409కే అందుబాటులో ఉంది. వొడాఫోన్ ఇటీవలే మధ్య ప్రదేశ్, చత్తీష్‌గఢ్ సర్కిల్ వినియోగదారులకు రూ.176 ప్యాక్‌ను లాంచ్ చేసింది. ఈ ప్లాన్ కింద అపరమిత రోమింగ్ వాయిస్ కాల్స్‌ను అందిస్తోంది. అంతేకాక రోజుకు 1జీబీ డేటాను 28 రోజుల పాటు ఆపర్ చేస్తోంది. రూ.79 నుంచి రూ.509 మధ్యలో కూడా ఐదు సూపర్ ప్లాన్లను వొడాఫోన్ ఈ నెల మొదట్లో లాంచ్ చేసింది. -
బీఎస్ఎన్ఎల్ కొత్త రీచార్జ్ ప్లాన్లు
సాక్షి, ముంబై: ప్రభుత్వ రంగ టెలికాం రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ సరికొత్త ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ముఖ్యంగా ప్రధాన ప్రత్యర్థి టెలికాం కంపెనీల డేటా ప్లాన్లకు దీటుగా తాజా ప్లాన్లను ప్రకటించింది. దేశంలోని అతి పెద్ద టెలికాం సంస్థ ఎయిర్టెల్, టెలికాం సంచలనం జియో ఆఫర్లతో పోల్చితే దాని వినియోగదారులకు మరింత వేగవంతమైన డేటాను అందించేలా ఆఫర్లను లాంచ్ చేసింది. రూ. 186ల అతి తక్కువ ప్లాన్లను ప్రకటించింది. 180 రోజుల వాలిడిటీలో మొదటి 28రోజుల్లో రోజుకు 1 జీబీ డేటా అందిస్తుంది. రూ. 187 (జిఎస్టితో సహా) ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్యాక్ కింద రింగ్ టోన్తోపాటు, నేషనల్ కాల్స్(ముంబై, ఢిల్లీ మినహా) ఉచితం.రూ.485 ప్లాన్‌లో రోజుకు 1 జీబీ డేటా(ముంబై, ఢిల్లీ మినహా) అందిస్తుంది. ఈ డేటా ప్రయోజనం తొలి 90రోజులకు మాత్రమే అలాగే అన్‌లిమిటెడ్‌కాల్స్ కూడా. -
ఆ ఎయిర్టెల్ ప్లాన్లు ఇక అందరికీ!
జియో రాకతో టెలికాం రంగంలో పెద్ద కుదుపులే వచ్చాయిని చెప్పాలి. అప్పటి వరకూ ఆకాశన్నంటిన డేటా ధరలు నేలకు దిగాయనే చెప్పాలి. జియో పోటీని తట్టుకొని మార్కెట్లో నిలబడటానికి ఇతర టెలికం కంపెనీలు అన్నీ చేస్తున్న పనులు అన్నీ ఇన్నీ కావు. ఇందులో భాగంగానే తాజగా ఎయిర్టెల్ సరికొత్త పంధా ఎన్నుకుంది. గతంలో కొందరికి మాత్రమే ఇచ్చే బెనిఫిట్లను అందరికీ అందివ్వనుంది. గతంలో ఏదైనా కొత్త ప్లాన్ ప్రవేశ పెడితే అది సదరు వినియోగదారుడికి వర్తిస్తుందో లేదో తెలుసుకోవడానికి మైఎయిర్‌టెల్ యాప్‌లో చూసుకోవాల్సి వచ్చేది. అందులో ఆఫర్ల జాబితాలో లేకపోతే అది వినియోగదారుడికి వర్తించదు. అయితే తాజగా ఎయిర్టెల్ ఆ విధానానికి స్వస్తి పలికింది. ఎయిర్టెల్ ప్రీపెయిడ్ ప్రామిస్ పథకం కింద, ఎక్కువ మంది ఎయిర్టెల్ కష్టమర్లు వాడుతున్న కొన్ని ప్లాన్లను, ఓపెన్ మార్కెట్ ప్లాన్లుగా అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చింది. రూ. 179, రూ. 349, రూ. 448, రూ. 549, రూ. 799 ప్లాన్లని ఇలా అందరికీ వర్తించే విధంగా నిర్ణయం తీసుకుంది. ఈ ఐదు ప్లాన్లు ఇకపై ఆ నిర్థిష్టమైన టెలికం సర్కిల్లో ఉన్న ఎయిర్టెల్ వినియోగదారులు అందరికీ వర్తిస్తాయి. -
వొడాఫోన్ నుంచి కూడా రెండు సరికొత్త ప్లాన్లు
రిలయన్స్ జియో నుంచి వస్తున్న పోటీని తట్టుకునేందుకు వొడాఫోన్ సంస్థ తన ప్రీపెయిడ్ కస్టమర్లకు తాజాగా రెండు సరికొత్త ప్లాన్లను లాంచ్ చేసింది. రూ.458, రూ.509 పేరిట ఈ రెండు ప్లాన్లు తన ప్రీపెయిడ్ కస్టమర్లకు ప్రవేశపెడుతున్నట్టు తెలిపింది. ఈ ప్లాన్ల కింద రోజుకు 1జీబీ డేటా, అపరిమిత కాలింగ్ సౌకర్యం, ఉచిత రోమింగ్, ఉచిత ఎస్ఎంఎస్లు లభ్యం కానున్నాయి. అయితే ఇతర ప్లాన్ల మాదిరిగా కాకుండా ఈ రెండు ప్లాన్ల వాలిడిటీ మాత్రం భిన్నంగా ఉంది. రూ.458 ప్లాన్ వాలిడిటీ 70 రోజులు ఉండగా, రూ.509 ప్లాన్ వాలిడిటీ 84 రోజులుగా ఉంది. రూ.509 రీఛార్జ్ చేసుకున్న వొడాఫోన్ ప్రీపెయిడ్ యూజర్లకు అపరిమిత లోకల్ కాల్స్, రోజుకు 1జీబీ డేటా లభించనుందని కంపెనీ తెలిపింది. అపరిమిత లోకల్, ఎస్టీడీ కాల్స్ భారత్‌లో ఏ నెంబర్‌కైనా చేసుకోవచ్చు. రోమింగ్‌కు కూడా ఇది ఉచితమే. అయితే రోజుకు గరిష్టంగా 250 నిమిషాల వరకు, వారానికి 1వేయి నిమిషాల వరకు మాత్రమే లోకల్, ఎస్టీడీ కాల్స్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్‌లో భాగంగా వొడాఫోన్ ప్లే ఉచిత సబ్స్క్రిప్షన్ కూడా దీనిలో కలిసి ఉంటుంది. 1జీబీ డేటా 4జీ, 3జీ కనెక్షన్ల రెండింటికీ వర్తిసుంది. మొత్తం వాలిడిటీ ఈ ప్లాన్‌ది 84 రోజులు. అంటే 84జీబీ డేటా వినియోగదారులకు అందుబాటులో ఉండనుంది. రోజుకు 1జీబీ డేటా పరిమితి దాటిపోయిన తర్వాత బ్రౌజింగ్ స్పీడు పడిపోతుంది. ఇక రెండో ప్లాన్ కింద రూ.458 తో రీఛార్జ్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ ప్లాన్ కింద కూడా అచ్చం రూ.509 ప్లాన్‌లో అందిస్తున్న ప్రయోజనాలే అందనున్నాయి. కానీ వాలిడిటీ మాత్రమే భిన్నం. ఈ ప్లాన్ వాలిడిటీ 70 రోజులే. అంటే రోజుకు 1జీబీ డేటా చొప్పున మొత్తంగా వినియోగదారులకు 70జీబీ డేటా అందుబాటులో ఉండనుంది. అయితే ఈ రెండు ప్లాన్లు కూడా ఎంపిక చేసిన ప్రీపెయిడ్ యూజర్లకేనని తెలిసింది. ప్యాన్ ఇండియా బేసిస్‌లో ఎంపిక చేసిన కస్టమర్లకు ఈ ప్లాన్లను అందించనుంది. మైవొడాఫోన్ యాప్ లేదా కస్టమర్ కేర్‌కు కాల్ చేసి ఈ ఆఫర్లు తమకు అందుబాటులో ఉన్నాయో లేదో కస్టమర్లు తెలుసుకోవాల్సి ఉంది. ఇవే ప్లాన్లు జియోలో రూ.459, రూ.509 లకు లభిస్తున్నాయి. రూ.459 ప్లాన్‌లో రోజుకు 1జీబీ డేటా లభిస్తుండగా, రూ.509 ప్లాన్‌లో రోజుకు 2జీబీ డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ల వాలిడిటీ వరుసగా 84 రోజులు, 49 రోజులుగా ఉంది. రెండింటిలోనూ యూజర్లకు అన్‌లిమిటెల్ కాల్స్ లభిస్తాయి. -
తెలుగు కస్టమర్లకు టెలినార్ సరికొత్త ఆఫర్స్
సాక్షి, హైదరాబాద్ : నార్వేకు చెందిన టెలికాం ఆపరేటర్ టెలినార్ తెలుగు రాష్ట్రాల కస్టమర్ల కోసం సరికొత్త ఆఫర్లను లాంచ్ చేసింది. ఈ కొత్త ప్యాకేజీలు ప్రీపెయిడ్ వాయిస్, డేటా సర్వీసులకు ఎంతో సరసమైనవని తెలిపింది. టెలినార్ ప్రవేశపెట్టిన ప్లాన్లలో ఒకటి ఎస్టీవీ 143. ఈ ప్లాన్ కింద తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సర్కిల్లోని పాత కస్టమర్లు అపరిమిత లోకల్, ఎస్టీడీ కాల్స్‌ను వినియోగించుకోవచ్చు. అంతేకాకుండా ఎలాంటి అవాంతరాలు లేకుండా 2జీబీ హైస్పీడ్ 4జీ డేటా సర్వీసులను సద్వినియోగం చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులు. కొత్త కస్టమర్లు ఇవే ప్రయోజనాలను పొందాలంటే ఎఫ్ఆర్సీ 148తో రీఛార్జ్ చేయించుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎక్కువ వాడక కస్టమర్ల కోసం ఎఫ్ఆర్సీ 448ను లాంచ్ చేసింది. ఈ కొత్త ఫస్ట్ రీఛార్జ్ ప్లాన్ కింద 84 రోజుల పాటు అపరిమిత లోకల్, ఎస్టీడీ కాల్స్‌ను, హైస్పీడు 4జీ డేటాను వాడుకోవచ్చని టెలినార్ పేర్కొంది. తమ కొత్త ప్లాన్లలతో కొత్త, పాత కస్టమర్లు బిల్లు గురించి ఆందోళన చెందకుండా తమ ప్రియమైన వారితో అపరిమితంగా మాట్లాడుకోవచ్చని టెలినార్ ఇండియా టీఎస్, ఏపీ సర్కిల్ బిజినెస్ హెడ్ శ్రీనాథ్ కోటియాన్ తెలిపారు. సరసమైన ఉత్పత్తులు, సంబంధిత సర్వీసులతో కస్టమర్లకు వీలైనన్ని సేవలు టెలినార్ అందిస్తూ ఉంటుందని చెప్పారు. -
జియో కొత్త ప్లాన్స్ వచ్చేశాయ్!
ధన్ ధనా ధన్ ఆఫర్ ప్రయోజనాలు, సమ్మర్ సర్ప్రైజ్ ఆఫర్ మరికొన్ని రోజుల్లో ముగుస్తుండగా.. రిలయన్స్ జియో తన ప్లాన్స్‌ను సవరించింది. అంతేకాక రెండు సరికొత్త ప్లాన్స్‌ను ప్రకటించింది. రూ.399, రూ.349 ఎంఆర్పీలతో ఈ కొత్త జియో ప్రీపెయిడ్ ప్లాన్స్‌ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్స్‌లో భాగంగా రూ.349 రీఛార్జ్‌తో 20జీబీ 4జీ డేటాను 56 రోజుల పాటు వినియోగించుకోవచ్చు. అయితే డైలీ ఇంత డేటానే వాడుకోవాలి అనే పరిమితి ఏమీ లేదు. ఒక్కసారి 20జీబీ డేటా అయిపోయిన తర్వాత స్పీడు కూడా 128కేబీపీఎస్‌కు పడిపోతుంది. మరో కొత్త ప్లాన్ రూ.399 కింద మూడు నెలల పాటు అపరిమిత సర్వీసులను వాడుకోవచ్చు. ఈ ప్లాన్ అచ్చం ముందస్తు ప్రకటించిన రూ.309 ప్లాన్ మాదిరిగానే ఉంది. ఈ ప్లాన్‌లో జియో డేటా పరిమితిని విధించింది. రోజుకు 1జీబీ డేటాను మాత్రమే వినియోగించుకునే అవకాశముంటుంది. ధన్ ధనా ధన్ ఆఫర్ ఇప్పుడు కేవలం రూ.399 ప్లాన్‌కే 84 రోజుల పాటు అందుబాటులో ఉంటుందని తెలిసింది. ఈ మార్పులు మినహా తొలి రీఛార్జ్ పొందే మిగతా ప్రయోజనాలన్నీ సమానంగా ఉంటాయని కంపెనీ చెప్పింది. ప్రీపెయిడ్ ప్లాన్లు రూ.19 నుంచి ప్రారంభమై, రూ.9999 వరకు ఉన్నాయి. ప్రస్తుతం రూ.309, రూ.509 ప్లాన్స్ కూడా రెండు నెలల పాటు వాలిడిటీలో ఉన్నాయి. రూ.309 ప్లాన్ కింద 60జీబీ డేటాను, రూ.509 ప్లాన్ కింద 128జీబీ డేటాను జియో అందిస్తోంది. రూ.999 ప్లాన్ కింద రూ.90జీబీ డేటాను వినియోగదారులు వాడుకోవచ్చు.. ఎవరైతే రూ.309 ప్లాన్‌ను కొనసాగించాలనుకుంటున్నారో వారు ఆ ప్రయోజనాలు వినియోగించుకోవచ్చు.. అంటే రూ.309 రీఛార్జ్‌పై రెండు నెలల పాటు అపరిమిత సర్వీసులు అందుతాయి. అన్ని దీర్ఘకాలిక ప్లాన్స్‌ను కూడా ఒక నెల అదనపు ప్రయోజనాలతో కంటిన్యూ చేసుకోవచ్చని జియో చెప్పింది. అంతేకాక ఈడీఎంవీ ప్లాన్స్‌ను జియో ప్రకటించింది. రూ.149 ప్లాన్స్ లో ఎలాంటి మార్పులను జియో చేపట్టలేదు. కొత్త కస్టమర్లు రూ.99 చెల్లించే జియో ప్రైమ్‌ను ఎన్రోల్ చేసుకోవచ్చని తెలిపింది. -
జియో కొత్త ప్లాన్స్: 100శాతం క్యాష్ బ్యాక్
రిలయన్స్ జియో మరోసారి సంచలన ఆఫర్లను తన వినియోగదారుల ముందుకు తీసుకొచ్చింది. ప్రత్యర్థులు ఆఫర్ చేస్తున్న పాత డోంగిల్, డేటా కార్డు, వైఫై రూటర్లను జియో వైఫై 4జీ రూటర్ తో ఎక్స్చేంజ్ చేసుకుంటే 100 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ చేయనున్నట్టు ప్రకటించింది. రెండు ప్లాన్స్ గా జియో ఈ సంచలన ఆఫర్ ను ప్రకటించింది. ఒకటి ప్రస్తుత డేటా కార్డు, డోంగిల్, హాట్ స్పాట్ రూటర్ ను జియో డిజిటల్ స్టోర్ లో ఎక్కడ ఎక్స్చేంజ్ చేసుకున్నా 100 శాతం క్యాష్ బ్యాక్ లేదా డివైజ్ ఎక్స్చేంజ్ కు రూ.2010విలువైన 4జీ డేటాను ఆఫర్ చేయనున్నట్టు తెలిపింది. జియోఫై రూటర్ పొందడానికి కస్టమర్లు రూ.1,999 చెల్లించాల్సి ఉంటుంది. దాంతో పాటు 309 ప్లాన్ కింద కచ్చితంగా మొదటిసారి 408 రూపాయలతో రీఛార్జ్ చేసుకోవాలి. 99 రూపాయల ప్రైమ్ మెంబర్ షిప్ తీసుకుని ఉండాలి. కస్టమర్లు చెల్లించిన 1999 రూపాయలను 2010 రూపాయల విలువైన 4జీ డేటాతో మైనస్ చేస్తే కస్టమర్లకు ఇంటర్నెట్ కనెక్షన్ దాదాపు ఉచితంగా లభించనుంది. ఇక రెండో ప్లాన్ కింద యూజర్లు తమ డేటా కనెక్షన్లు ఎక్స్చేంజ్ చేసుకోవాల్సినవసరం లేదు. కచ్చితంగా రీఛార్జ్ చేపించుకోవాల్సిన 408 రూపాయలతో తొలి రీఛార్జ్ చేపించుకుంటే చాలు 1,999కే జియోఫై అందుబాటులో ఉంటుంది. కానీ దీనికింద కేవలం 1005 రూపాయల విలువైన 4జీ డేటాను మాత్రమే పొందడానికి వీలుంటుంది. -
ఎయిర్టెల్ కొత్త ప్లాన్స్... ఏంటవి?
జియో ఎంట్రీతో మొదలైన టెలికాం ఇండస్ట్రీలో బ్రాడు బ్యాండ్ స్పీడు, డేటా, కాలింగ్ ప్లాన్స్ లో వార్ ఇంకా కొనసాగుతూనే ఉంది. దేశీయ టెలికాం దిగ్గజం ఎయిర్ టెల్ మరోసారి తన పోస్టు పెయిడ్ కస్టమర్ల ప్లాన్స్ ను సవరించింది. ప్రస్తుతం సవరించిన ప్లాన్స్ మైప్లాన్ ఇన్ఫీనిటీ కింద దేశవ్యాప్తంగా ఇన్ కమింగ్ కాల్స్ కు ఉచిత రోమింగ్ ప్రయోజనాలను అందించనుంది. రూ.299 ప్లాన్... అన్ని కనెక్షన్లకు 680 నిమిషాల లోకల్, ఎస్టీడీ కాల్స్ తో పాటు, 600 ఎంబీ 4జీ డేటాను కంపెనీ ఈ బిల్లింగ్ సైకిల్ లో ఆఫర్ చేయనుంది. రూ.399 ప్లాన్... ఉచిత లోకల్, ఎస్టీడీ కాల్స్ నిమిషాలను కంపెనీ 765కు పెంచింది. డేటా వాడకం కూడా ఈ బిల్లింగ్ సైకిల్ లో 1జీబీకి పెంచింది. ఈ రెండు ప్యాక్ ఆఫర్స్ కింద కంపెనీ ఉచిత రోమింగ్ ఇన్కమింగ్ కాల్స్ సౌకర్యాన్ని అందించనుంది. అవుట్ గోయింగ్ లోకల్ కాల్స్ కు నిమిషానికి 80 పైసలను వసూలు చేయనుంది. అదే అవుట్ గోయింగ్ ఎస్టీడీ కాల్స్ కైతే, నిమిషానికి 1.15పైసల ఛార్జీ వేయనుంది. స్పీడ్ టెస్ట్ సర్వీసుల తనకు ఫాస్టెస్ట్ నెట్ వర్క్ అనే టైటిల్ ఇచ్చిన సందర్భంగా కంపెనీ తన పోస్టు పెయిడ్ కస్టమర్లకు 6జీబీ నుంచి 30జీబీ డేటా ఆఫర్ చేస్తున్న సంగతి తెలిసిందే. మై ఎయిర్ టెల్ యాప్ ద్వారా ఏప్రిల్ 30 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. అయితే ఈ కొత్త ప్లాన్స్ లో కంపెనీ అపరిమిత ప్రయోజనాలను కల్పించడం లేదు. 499 ప్లాన్ కిందనైతే, కంపెనీ అపరిమిత ఎస్టీడీ, లోకల్ కాల్స్, 3జీబీ 4జీ డేటాను వంటివాటిని పొందవచ్చు. -
స్వయం సంఘాలకు కొత్త రూపు
- జిల్లాలో 15,683 ఎస్‌హెచ్‌జీలకు కొత్త అధ్యక్షులు - 624 గ్రామ సమాఖ్యలకు కూడా.. - అవకతవకలను అరికట్టడమే లక్ష్యం సాక్షి, రంగారెడ్డి జిల్లా : స్వయం సహాయక సంఘాలు (ఎస్‌హెచ్‌జీ) ‘కొత్త’రూపాన్ని సంతరించుకుంటున్నాయి. ఈ సంఘాలకు కొత్త అధ్యక్షుల ఎంపికకు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ నడుంబిగించింది. ప్రస్తుతం ఉన్న అధ్యక్షుల్లో చాలావరకు ఏళ్ల తరబడిగా కొనసాగుతున్నారు. దీంతో సంఘ అభివృద్ధి కార్యకలాపాల్లో ఇబ్బందులు ఏర్పడుతుండడంతోపాటు కొంతమేర అవకతవకలు కూడా చోటుచేసుకుంటున్నాయి. ఈక్రమంలో అవకతవకలకు చెక్‌పెడుతూ.. మరింత బలోపేతం చేసేందుకు అధికారులు చర్యలకు ఉపక్రమించారు. ఇందులో భాగంగా జిల్లాలో 15,683 ఎస్‌హెచ్‌జీలకు నూతన అధ్యక్షులు ఎంపిక కానున్నారు. ప్రస్తుతం జిల్లాలో 35,460 మహిళా సంఘాలున్నాయి. వీటి పరిధిలో 3,62,689 మంది మహిళలు సభ్యులుగా కొనసాగుతున్నారు. వాస్తవానికి ప్రతి మూడు నెలలకోసారి ఈ సంఘాలకు కొత్త అధ్యక్షురాళ్లు ఎంపిక కావాల్సి ఉంటుంది. సంఘాల నిబంధనల ప్రకారం ఒక సంఘానికి అధ్యక్షురాలుగా మూడేళ్లకు మించి కొనసాగే అర్హత లేదు. అయినప్పటికీ చాలాచోట్ల ఐదేళ్లకు పైబడి.. పదేళ్లుగా ఒకే అధ్యక్షురాలితో కొనసాగుతున్న సంఘాలున్నాయి. ఈక్రమంలో వాటిని గుర్తించిన జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ యంత్రాంగం... వెంటనే అధ్యక్ష మార్పునకు నిర్ణయించింది. జిల్లాలో 13,284 సంఘాలు మూడేళ్లకు పైబడిన అధ్యక్షురాళ్లు కొనసాగుతున్నారు. ఇవేగాకుండా మరో 2,399 సంఘాలకు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రాతినిధ్యాన్ని మార్చాల్సి వచ్చింది. ఇలా మొత్తంగా 15,683 సంఘాలకు ఈనెలాఖరులోగా కొత్త అధ్యక్షులను ఏర్పాటు చేయాల్సి ఉంది. ‘సమాఖ్య’లోనూ మార్పులు.. ప్రస్తుతం ఎస్‌హెచ్‌జీ స్థాయిలో నూతన అధ్యక్షులు ఏర్పాటు కానుండడంతో గ్రామ సంఘాలు(వీఓ)ల్లోనూ మార్పులు అనివార్యం కానుంది. ఎస్‌హెచ్‌జీ అధ్యక్షులే గ్రామ సంఘాల్లో సభ్యులు, అధ్యక్షులుగా కొనసాగుతారు. వీఓల్లోని సభ్యులు మండల సమాఖ్యలో.. మండల సమాఖ్యలోని సభ్యులు జిల్లా సమాఖ్యలో కొనసాగుతారు. ప్రస్తుతం జిల్లాలో 1,452 గ్రామ సమాఖ్యలున్నాయి. తాజాగా ఎస్‌హెచ్‌జీ అధ్యక్షుల మార్పుతో జిల్లాలో 624 గ్రామ సమాఖ్యల అధ్యక్షులు మార నున్నారు. ఇవేగాకుండా సమాఖ్య తీర్మానంతో మరికొన్ని గ్రామ సమాఖ్యలు కూడా మారే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అవకతవకలకు ఆస్కారం లేకుండా.. సంఘాల అధ్యక్ష మార్పుతో అవకతవకలకు ఆస్కారం ఉండదనేది ప్రధాన ఉద్దేశం. దీర్ఘకాలికంగా ఒకరే అధ్యక్షురాలిగా కొనసాగుతుండడంతో వాటి నిర్వహణలో అక్రమాలు జరుగుతున్నట్లు అధికారుల పరిశీలనలో వెల్లడైంది. యాచారం మండలంలోని ఓ గ్రామంలో పదేళ్లుగా ఒక మహిళ ఆధ్వర్యంలో సంఘం కొనసాగడంతో అక్కడ అభయహస్తం ఉపకారవేతనాలకు మొదలు.. స్త్రీనిధి రుణాల్లో అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. దీంతో ఒక ప్రాజెక్టు మేనేజర్‌తోపాటు ఇద్దరు స్లస్టర్ స్థాయి అధికారులపై వేటు వేశారు. అదేవిధంగా శామీర్‌పేట మండలంలోనూ ఇలాంటి అక్రమాలు జరిగినట్లు అధికారులు తేల్చారు. బంట్వారం, వికారాబాద్ మండలాల్లోనూ సంఘాల నిర్వహణ గాడితప్పుతోందని పసిగట్టారు. ఇకపై అక్రమాలకు ఆస్కారం లేకుండా సంఘాల అధ్యక్షుల మార్పును యుద్దప్రాతిపదికంగా చేపడుతున్నట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డెరైక్టర్ సర్వేశ్వర్‌రెడ్డి ‘సాక్షి’తో అన్నారు. -
‘భూసేకరణ’పై కొత్త ఎత్తు
ఉత్సాహం ఉండటంలో తప్పులేదుగానీ...అలా ఉత్సాహపడేవారికి దాని ప్రయోజనం, పరమార్థం విషయంలో స్పష్టత ఉండాలి. వాటిని సాధించడానికి అవసరమైన సాధనాసంపత్తులు తమకున్నాయో లేదో అవగాహన ఉండాలి. కేంద్రంలో అధికారంలోకొచ్చిన వెంటనే ఎన్డీయే ప్రభుత్వం భూసేకరణ చట్టంపై దృష్టి సారించింది. ఎక్కడలేని చురుకుదనాన్నీ ప్రదర్శించి దానికి సవరణలు చేయ డానికి పూనుకున్నది. నిరుడు డిసెంబర్లో కేంద్ర మంత్రివర్గం దీనిపై చర్చించి ఆర్డినెన్స్ జారీచేసింది. కాలపరిమితి ముగిసిన రెండు సందర్భాల్లోనూ ఆర్డినెన్స్‌కు ప్రాణప్రతిష్ట చేసింది. ఈమధ్యలో ఒకసారి లోక్‌సభలో ఆర్డినెన్స్ స్థానంలో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదం కూడా పొందారు. రాజ్యసభలో సహ జంగా విపక్షానిదే మెజా రిటీ గనుక ఆ ప్రయత్నం అక్కడ వీగిపోయింది. ఆ బిల్లు ప్రస్తుతం సంయుక్త కమిటీ పరిశీలనలో ఉంది. ఈలోగా కేంద్రం స్వరం మార్చింది. అభివృద్ధిలో దూసుకుపోద ల్చుకున్న ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా ప్రస్తుత భూ సేకరణ చట్టం స్థానంలో మెరుగైన చట్టాన్ని తీసుకురాదల్చుకుంటే అందుకు తాము సహకరిస్తామని ప్రకటించింది. విపక్షాలనుంచి తీవ్ర ప్రతిఘటన వచ్చినా వెనక్కి తగ్గకుండా ఆర్డినెన్స్‌ల మీద ఆర్డినెన్స్‌లు జారీచేసిన ఎన్డీయే సర్కారు... ఇప్పుడు మధ్యలో కాడి పారేసి ‘మీలో ఎవరైనా చట్టాలు చేసుకుందామనుకుంటే చేసుకోండ’ని రాష్ట్రాలకు సూచిస్తున్నది. బిల్లుపై ఏకాభిప్రాయాన్ని సాధించడంలో విఫలమైతే ఇది తప్ప ప్రత్యామ్నాయం లేదని భావిస్తున్నట్టు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ చెబుతున్నారు. అలాగని చాలామంది నుంచి సూచనలొస్తున్నాయని అంటున్నారు. సాధారణంగా ఏ చట్టంపైన అయినా అభ్యంతరాలొచ్చినప్పుడూ, దాని అమలుకు ఆటంకాలెదురవుతున్నప్పుడూ, అది ఆశించిన ప్రయోజనాన్ని నెరవే ర్చడం లేదని రుజువవుతున్నప్పుడూ దాన్ని సవరించాలని ఏ ప్రభుత్వమైనా భావి స్తుంది. భూసేకరణ చట్టానికి అలాంటి అభ్యంతరాలో, ఆటంకాలో ఎదురైన దాఖ లాలు లేవు. దాని కారణంగా ఏ ప్రాజెక్టు అయినా ఆగిపోయినట్టు లేదా మొద లెట్టిన ప్రాజెక్టు నత్తనడకన సాగినట్టు ఎవరూ చెప్పలేదు. అసలు ఎన్డీయే ప్రభుత్వం గద్దెనెక్కడానికి ఆర్నెల్లముందు యూపీఏ హయాంలో ఆ చట్టం వచ్చింది. ఎన్డీయే వచ్చాక ఆ చట్టంకింద భూసేకరణ చేసింది లేదు. ఆచరణకే రాని చట్టం గురించి ఫిర్యాదులుండటానికీ ఆస్కారం లేదు. పారిశ్రామికాభివృద్ధికి ఈ చట్టం ఆటంకంగా మారిందని కేంద్రం అనడమే తప్ప దాన్ని సమర్థించే ఉదంతాలను చూపలేదు. మరి ఎందుకని ఆర్డినెన్స్ జారీలో అత్యుత్సాహం చూపినట్టు? పారిశ్రామిక కారిడార్లు, ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య ప్రాజెక్టులు(పీపీపీ), రక్షణ, గ్రామీణ మౌలిక వసతుల కల్పన వంటి అవసరాలకు భూములు సేకరించే సందర్భంలో భూ యజమానుల అనుమతి అవసరం లేదని ఆర్డినెన్స్‌లో ఎందుకు పేర్కొన్నట్టు? ఆయా ప్రాజెక్టుల సామాజిక ప్రభావ అంచనా(ఎన్ఐఏ) నిబంధనను ఎందుకు తొలగించినట్టు? ఎవరు అడిగారని ఈ సవరణలకు పూనుకున్నారు? ఈ ఆర్డినెన్స్‌ల వ్యవహారాన్ని కాంగ్రెస్, వామపక్షాలు, మరికొన్ని ఇతర పార్టీలు మాత్రమే కాదు...ఎన్డీయే భాగస్వామ్య పక్షాలైన అకాలీదళ్, పీడీపీ కూడా వ్యతిరేకిం చాయి. స్వదేశీ జాగరణ్ మంచ్, భారతీయ కిసాన్ సంఘ్వంటి సంఘ్ పరివార్ సంస్థలు సైతం ఆర్డినెన్స్ నిబంధనలు రైతు వ్యతిరేకమైనవని ఆరోపించాయి. పరిస్థితి ఇలా ఉన్నప్పుడు ఏ ప్రభుత్వమైనా అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించి అందరి అభిప్రాయాలనూ తెలుసుకుంటుంది. ఎలాంటి పరిస్థితుల్లో ఆర్డినెన్స్ అవసరమైందో వివరిస్తుంది. తన ప్రతిపాదనల్లోని లోపాలను పరిహరించడానికి సిద్ధపడుతుంది. కానీ ఏ దశలోనూ ఇలాంటి ప్రయత్నం జరగలేదు. లోక్‌సభలో బిల్లుపై చర్చ జరిగిన మాట వాస్తవమే అయినా చివరకు అధికార పక్షానికున్న సంఖ్యాబలమే దాన్ని గెలిపించింది. రాజ్యసభలో గెలవడం అసాధ్యమైన ఈ పరిస్థితుల్లో ఇతరత్రా వేదికలపై భూసేకరణ ఆర్డినెన్స్ గురించి చర్చించాలని కేంద్రం నిర్ణయించింది. అందులో భాగంగానే మొన్న జరిగిన నీతి ఆయోగ్ సమావేశానికి ముఖ్యమంత్రులను ఆహ్వానించింది. ‘సహకార ఫెడరలిజం’లో భాగంగానే ఈ చర్చకు చోటిస్తున్నట్టు కేంద్రం చెప్పడం బాగానే ఉన్నా... వరసబెట్టి మూడుసార్లు ఆర్డినెన్స్ జారీచేసినప్పుడు అది ఎందుకు గుర్తుకురాలేదో వివరించలేదు. నిజానికి బీజేపీ వ్యవహరించిన ఇలాంటి తీరువల్లే కాంగ్రెస్‌కు ఎక్కడలేని బలమూ వచ్చింది. లోక్‌సభ ఎన్నికల్లో కేవలం 44 స్థానాలు మాత్రమే గెల్చుకుని ఎటూ పాలుబోని స్థితిలో పడిన ఆ పార్టీ చేతికి ఆయుధాన్నందించి దాన్ని నిత్యమూ వార్తల్లో ఉండేలా చేసిన ఘనత ఎన్డీయే సర్కారుకు దక్కుతుంది. నీతి ఆయోగ్ సమావేశాన్ని కాంగ్రెస్ సీఎంలంతా బహిష్కరించి పార్టీ రైతుల పక్షాన ఉన్నదని ప్రకటించడానికి దాన్నొక సందర్భంగా ఎంచుకున్నారు. భూసేకరణ చట్ట సవరణ విషయంలో కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ చేస్తున్న సవాళ్లకు బీజేపీ నేతల వద్ద జవాబు లేదు. 56 అంగుళాల ఛాతి ఆర్నెల్లు తిరిగేసరికల్లా 5.6 అంగుళాలుగా మారిందని ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి ఆయన ఎద్దేవా చేస్తుంటే బీజేపీ ఆత్మరక్షణలో పడిన స్థితికి చేరుకుంది. లోక్‌సభలో 282 స్థానాలున్న పాలక పార్టీ కీలకమైన బీహార్ ఎన్నికల ముందు ఇలా బలహీనంగా కనబడటం మంచిది కాదని ఆ పార్టీ నేతలకే అనిపిస్తున్నది. అందువల్లే ఈ సవరణ బిల్లు సంగతిని పూర్తిగా పక్కనబెట్టి రాష్ట్రాలు చట్టాలు చేసుకోవచ్చునని జైట్లీ చెబుతున్నారు. సవ రణ బిల్లు ఆమోదం కోసం అవసరమైతే పార్లమెంటు సంయుక్త సమావేశానికి సిద్ధమని దూకుడు ప్రదర్శించినవారు ఇప్పుడిలా స్వరం మార్చడం వింతగొలుపుతుంది. అయితే జైట్లీ ప్రతిపాదన చిక్కులతో కూడుకున్నది. భూ సేకరణ అంశం ఉమ్మడి జాబితాలోనిదే అయినా... ప్రస్తుతం అమల్లో ఉన్న కేంద్ర చట్టానికి విరుద్ధంగా రాష్ట్రాలు చట్టం చేయడం ఆచరణ సాధ్యమేనా? న్యాయస్థానాల్లో అవి నిలబడతాయా? భూసేకరణ చట్టం విషయంలో ఇన్నాళ్లూ అనుసరించిన వైఖరి సరైంది కాదనుకుంటే ఆ సంగతిని బహిరంగంగా ప్రకటించాలి. బీహార్ ఎన్నికల్లో నష్టపోతామన్న భయంతో ఇలాంటి ఎత్తులకు దిగడమంటే నైతికంగా బలహీనం కావడమేనని బీజేపీ తెలుసుకోవాలి. ఈ మాదిరి ఎత్తుగడలే కాంగ్రెస్‌ను శంకరగిరి మాన్యాలు పట్టించాయని గ్రహించాలి. -
‘గ్రీవెన్స్’పై ఏసీబీ కన్ను
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ప్రభుత్వ విభాగాల్లో అవినీతికి అడ్డుకట్ట వేసేందుకు అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) సరికొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులు లంచం తీసుకున్నా, ఆదాయానికి మించి ఆస్తులు సంపాదిస్తున్నా, రికార్డుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తున్నా.. వారిపై ఫిర్యా దు చేసేందుకు ప్రజలు, బాధితులు పెద్దగా ముందుకు రాని పరిస్థితుల్లో స్వయంగా తామే కార్యాలయాలపై నిఘా పెట్టాలని భావిస్తోం ది. అవినీతి సిబ్బంది, అధికారుల సమాచారం ఇవ్వాలని, ఏసీబీ తమ ఫోన్ నెంబర్లతో కూడిన పోస్టర్లను ప్రభుత్వ కార్యాలయాల అతికిస్తుంటే అయా విభాగాల సిబ్బంది వాటిని చించేస్తున్నారు. మరోవైపు వివిధ ప్రసార మాధ్యమాల్లో ఏసీబీ విభాగం తమ ఫోన్ నెంబర్లను తరచూ ప్రకటిస్తున్నా ప్రజల్లో చైతన్యం రావడం లేదు. టోల్‌ఫ్రీ నెంబర్ ప్రకటించినా ఊహించిన స్థాయిలో స్పందన రావడం లేదు. దీంతో సరికొత్త ప్రయోగానికి అవినీతి నిరోధక శాఖ తెర తీసింది. ప్రభుత్వ కార్యాలయాలతో పాటు కలెక్టరేట్లో ప్రతి సోమవారం జరిగే గ్రీవెన్స్ డేపై ఏసీబీ దృష్టి సారించింది. గ్రామ, మండల స్థాయిలో నెలల తరబడి పరిష్కారం కాని సమస్యలపై జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసేందుకు పెద్ద సంఖ్యలో జిల్లా గ్రీవెన్స్ సెల్‌కు వస్తుంటారు. వీటికి స్పందిస్తూ ఉన్నతాధికారులు ఆదేశించినా.. డబ్బులు ముట్టనిదే పనులు జరిగే పరిస్థితి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో కలెక్టరేట్, ఎస్సీ కార్యాలయాలతో సహా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ గ్రీవెన్స్ నిర్వహించే రోజు ఏసీబీ సిబ్బంది నిఘా వేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. బాధితులకు కౌన్సెలింగ్ చేయడంతో పాటు లంచం డిమాండ్ చేసే ఉద్యోగుల వివరాలు తెలుసుకునేందుకు ఇది దోహదపడుతుందని ఏసీబీ కొత్త డీఎస్పీ రంగరాజు భావిస్తున్నారు. ఇందుకోసం అవసరమైతే ఏసీబీ సిబ్బంది ప్రత్యేకంగా ఒక కియోస్క్(సదుపాయాల బెంచీ) ఏర్పాటు చేయించేందుకు జిల్లా ఉన్నతాధికారులతో చర్చలు జరుపుతున్నట్టు తెలిసింది. ఆకస్మిక తనిఖీలు జరిపి, లంచం తీసుకున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నా రాజకీయ, ఇతర ఒత్తిళ్లతో చాలా కేసులు నీరుగారిపోతున్నాయి. దీంతో నేరుగా తనే రంగంలోకి దిగి ప్రజల సహకారంతో లంచగొండుల భరతం పట్టేందుకు నిర్ణయించినట్టు తెలుస్తోంది. ప్రజల సహకారం తప్పనిసరి అవినీతిని రూపుమాపాలంటే ప్రజలు ముఖ్యంగా బాధితుల సహకారం తప్పనిసరి. ఎవరికి వారు మనకెందుకులే అనుకుంటే పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుంది. శ్రీకాకుళం ఏసీబీ డీఎస్పీగా వారం క్రి తం బాధ్యతలు స్వీకరించా. కొత్తగా ఇద్దరు సీఐలు వస్తున్నారు. మరికొన్ని సౌకర్యాలు కూడా సమకూరనున్నాయి. ఏసీబీపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు, ప్రచారాన్ని ముమ్మరం చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. బాధితులు కోరితే ఫిర్యాదులను రహస్యంగా ఉంచుతాం. తనిఖీలు ముమ్మరం చేస్తాం. అధికారులు సహకరిస్తే గ్రీవెన్స్ వద్ద సిబ్బందిని ఉంచేందుకు ప్రయత్నిస్తాం. అవినీతి సిబ్బంది సమాచారాన్ని ఎవరైనా 94404-46124నెంబర్‌కు ఫోన్ చేసి చెప్పవచ్చు. -కె,రంగరాజు, ఏసీబీ డీఎస్పీ -
ఔటర్’కు వీడిన గ్రహణం
శామీర్‌పేట-కీసర మార్గానికి రీ టెండర్ రూ.190కోట్ల వ్యయంతో తాజా అంచనాలు జూలై మొదటి వారంలో బిడ్స్‌కు ఆహ్వానం సాక్షి, సిటీబ్యూరో : అతుకుల బొంతగా ఉన్న ఔటర్ రింగ్ రోడ్డుకు ఎట్టకేలకు మోక్షం లభించనుంది. 2015 డిసెంబర్ నాటికి మొత్తం ఔటర్ నిర్మాణాన్ని పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (హెచ్‌జీసీఎల్) తాజాగా లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న శామీర్‌పేట-కీసర (10.3కి.మీ) మార్గంలో మిగిలిపోయిన నిర్మాణాన్ని పునఃప్రారంభించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇందుకోసం రూ.190 కోట్ల వ్యయ అంచనాతో కొత్తగా ప్రణాళికలు సిద్ధం చేశారు. శామీర్‌పేట-కీసర మార్గంలో ఏడేళ్లుగా నిలిచిపోయిన పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేసేందుకు జూలై మొదటి వారంలో రీ టెండర్‌ను పిలవనున్నట్లు ఓఆర్ఆర్ ప్రాజెక్టు డెరైక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ స్పష్టం చేశారు. ఇది గ్లోబల్ టెండర్ కనుక బిడ్స్ దాఖలుకు నిర్దిష్ట సమయం ఇచ్చి, వచ్చే సెప్టెంబర్‌లో కాంట్రాక్టు సంస్థను ఖరారు చే యాలని అధికారులు ముహూర్తం నిర్ణయించారు. ఏజెన్సీ ఖరారైన వెంటనే జాప్యానికి తావివ్వకుండా అగ్రిమెంట్ చేసుకొని నిర్మాణ పనులు ప్రారంభించేందుకు పక్కాగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే రెండుసార్లు నిర్మాణ గడువును పొడిగించిన అధికారులు ఈసారి 2015 డిసెంబర్ నాటికి ఔటర్తో పాటు సర్వీసు రోడ్ల నిర్మాణాన్ని కూడా పూర్తిచేసేందుకు ప్రణాళిక రూపొందించారు. శామీర్‌పేట-కీసర మార్గంలో భూసేకరణ, విద్యుత్లైన్ల షిప్టింగ్ వంటి అడ్డంకులేవీ లేనందున అగ్రిమెంట్ చేసుకొన్న 15 నెలల్లోగా మొత్తం 10.3 కిలోమీటర్ల మార్గాన్ని పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. నిజానికి ఈ మార్గంలో ఇప్పటికే 50 శాతం పనులు పూర్తయినందున మిగతా పనులు చకచకా జరిగిపోతాయని అధికారులతో పాటు సిబ్బంది అంచనా వేస్తున్నారు. ఆదిలోనే అశ్రద్ధ... శామీర్‌పేట్-కీసర రీచ్‌ను మొదట్లో దక్కించుకున్న యూజీసీ సంస్థతో సకాలంలో పనులు చేయించుకోవడంలో హెచ్‌జీసీఎల్ సంస్థ ఘోరంగా విఫలమైంది. దాని పర్యవసానమే ఇప్పుడు రూ.100 కోట్లు అదనపు భారం హెచ్ఎండీఏపై పడింది. నిజానికి 2009లో శామీర్‌పేట్-కీసర రీచ్‌ను 17 శాతం లెస్తో కోట్ చేసిన యూజీసీ సంస్థ రూ.195 కోట్లతో టెండర్‌ను దక్కించుకుంది. ఒప్పందం ప్రకారం 2012 నవంబర్ నాటికి ఈ రీచ్ నిర్మాణం పూర్తికావాలి. అయితే మెటీరియల్ కాస్ట్ అనూహ్యంగా పెరగడం, అధికారులు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడం తదితర కారణాల వల్ల నిర్మాణ పనులు మధ్యలోనే ఆగిపోయాయి. సుమారు రూ.100 కోట్ల విలువైన పనులు పూర్తిచేసిన కాంట్రాక్టర్ ఆ తర్వాత చేతులెత్తేశారు. దీంతో అధికారులు పలుమార్లు నోటీసులు జారీచేసి నిర్మాణ గడువును 2014 మార్చి వరకు పొడిగించారు. అయినా పనుల్లో ప్రగతి కనిపించకపోవడంతో 2014 ఏప్రిల్ 2న యూజీసీ కాంట్రాక్టు సంస్థకు ఉద్వాసన (టెర్మినేట్) పలికారు. ఇప్పుడు ఆ మార్గంలో మిగిలిపోయిన పనులు పూర్తిచేసేందుకు హెచ్‌జీసీఎల్ తాజాగా రీ టెండర్లు పిలిచింది. పాత టెండర్ ప్రకారం 10.3 కిలోమీటర్ల మార్గంలో మిగిలిపోయిన పనులకు రూ.100 కోట్లు ఖర్చవుతుం డగా, కొత్త ఎస్టిమేట్స్ ప్రకారం ఆ పను లుపూర్తి చేయడానికి రూ.190 కోట్లు వెచ్చించాల్సి వచ్చింది. ఈ భారమంతా పరోక్షంగా నగరవాసులపై పడినట్లే. 15నెలల గడువు: పీడీ శామీర్‌పేట-కీసర మార్గంలో మిగిలిపోయిన పనులను పూర్తిచేసేందుకు వారం రోజుల్లో రీ టెండర్ పిలుస్తున్నామని ఓఆర్ఆర్ పీడీ శామ్యూల్ ఆనంద్ కుమార్ స్పష్టం చేశారు. టెండర్ ప్రక్రియను వచ్చే 3 నెలల్లో ముగించి అర్హత గల సంస్థతో ఒప్పందం కుదుర్చుకొని 15 నెలల్లో నిర్మాణ పనులు పూర్తి చేసేలా లక్ష్యం నిర్దేశిస్తామన్నారు. ఈసారి ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా 2015 డిసెంబర్ నాటికి మొత్తం 158 కిలోమీటర్ల ఔటర్ రింగ్‌రోడ్డును, సర్వీసు రోడ్లను అందుబాటులోకి తెస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ మార్గంలో ఇప్పటికే 50శాతం పనులు పూర్తయినందున మిగతావి నిర్ణీత సమయంలో అయిపోతాయని తెలిపారు. -
నేత యువకుడైతే ఇక దూకుడే..
ఐదేళ్లపాటు అభివృద్ధి పనులకు కోడ్ ఆటంకాలుండవు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు మంచి అవకాశం ఇక మిగిలింది సర్పంచ్ ఎన్నికలు అయిపోయాయ్.. మున్సిపల్ ఎన్నికలు కావొస్తున్నాయ్ జెడ్పీటీసీ ఎన్నికలూ ఇప్పుడే ఉన్నాయ్ ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకోబోతున్నాం ఐదేళ్లపాటు ఎన్నికలు, కోడ్ బాధలు ఉండవు సంక్షేమ రాజ్యం రావడమే దానికి సమర్థ నేతను ఎన్నుకోవడవే తెలుగు జాతి రెండు రాష్ట్రాలుగా విడిపోయింది. కొత్త రాష్ట్రాల నవనిర్మాణం కోసం సరి‘కొత్త’ ప్రణాళికలు.. నవతరం నాయకత్వం అవసరం. ఇదే సందర్భంలో ఇరు ప్రాంతాలకు మంచి అవకాశమూ లభించింది... రెండు కొత్త రాష్ట్రాల్లో రానున్న ఐదేళ్లూ ఎన్నికలే ఉండవ్! ‘కోడ్’కూతలు అసలే ఉండవ్! గతంలో ఆర్నెల్లు, ఏడాదికోసారి వచ్చే ఎన్నికల సందర్భాలు తెలుగు ప్రజలకు సుపరిచితం. అయితే పదేపదే వచ్చే ఎన్నికల పేరుతో ఇక అభివృద్ధి పనులను నిలిపివేసే ఛాన్స్ ఎంత మాత్రమూ లేదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్.. ఈ రెండు రాష్ట్రాల శాసనసభ, లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ.. ఆ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2 నాటికే పూర్తవుతుంది. ఆ లోపే మున్సిపాలిటీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ తదితర స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ముగుస్తాయి. ఇప్పటికే గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ కూడా పూర్తయింది. ఈ లెక్కన రెండు రాష్ట్రాల్లో కొత్తగా ఏర్పాటయ్యే ప్రభుత్వాలకు వచ్చే అయిదేళ్లపాటు ఎన్నికల గొడవ ఉండదు. ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఏదైనా కారణాలతో కూలిపోయి.. ఆ సమయంలో ఇంకొక పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేని పరిస్థితులు తలెత్తితే తప్ప వచ్చే ఐదేళ్ల పాటు ఎన్నికలుండవు. ఎన్నికల తర్వాత ఏర్పడబోయే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు పరిష్కరించాల్సిన సమస్యలు అనేకం ఉన్నాయి. హైదరాబాద్ పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగుతున్న విచిత్రమైన పరిస్థితితో పాటు రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇరు ప్రభుత్వా లు సామరస్యంగా పరిష్కరించుకోవలసిన అంశాలెన్నో ఉన్నాయి. అయితే సుస్థిర ప్రభుత్వాలు ఏర్పడితేనే ఇరు రాష్ట్రాల మధ్య తలెత్తే సమస్యలను సమన్వయంతో పరిష్కరించుకోవడానికి వీలుంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు ఓటర్ల ముందున్న ప్రధాన బాధ్యత సుస్థిర, మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవడమే. ఇచ్చిన హామీలు, కొత్త రాష్ట్రాల అవసరాలను గుర్తించడం, సంక్షేమ రాజ్యం నిర్మించడంలో విశ్వసనీయత, మాట పై నిలబడగలిగే నేతను ఎన్నుకోవడం ద్వారానే రెండు రాష్ట్రాల్లో ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించగలుగుతారు. ఆధునిక పోకడలను అందిపుచ్చుకుని అభివృద్ధి ఎజెండాతో ఉరకలెత్తే నాయకుడికి పట్టం కట్టాల్సి ఉంది. ఇలాగైతేనే ఇరు ప్రాంతాలూ పురోగతి సాధిస్తాయి.