Jio Fiber Launches New Home Broadband Backup Plan With Unlimited Data - Sakshi
Sakshi News home page

వేగవంతమైన నెట్ సర్వీస్ కోసం.. జియో కొత్త ఎంట్రీ లెవెల్‌ ప్లాన్‌!

Published Tue, Mar 28 2023 7:04 AM | Last Updated on Tue, Mar 28 2023 8:59 AM

jio new broadband service plan - Sakshi

న్యూఢిల్లీ: ఫిక్సిడ్‌ బ్రాడ్‌బాండ్‌ సెగ్మెంట్‌లో పోటీని మరింత వేడెక్కిస్తూ జియో కొత్తగా ఎంట్రీ లెవెల్‌ ప్లాన్‌ను ఆవిష్కరించింది. నెలకు రూ.198 ధరతో బ్రాడ్‌బాండ్‌ బ్యాకప్‌ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. దీనితో సెకనుకు 10 మెగాబిట్‌ వేగంతో నెట్‌ సర్వీసులు అందుకోవచ్చు. రూ. 21 - 152 వరకు చెల్లించడం ద్వారా 1 - 7 రోజుల పాటు ఇంటర్నెట్‌ వేగాన్ని 30 ఎంబీపీఎస్‌ లేదా 100 ఎంబీపీఎస్‌కు అప్‌గ్రేడ్‌ చేసుకునే వీలును కల్పిస్తున్నట్లు సంస్థ తెలిపింది. 5 నెలల పాటు యూసేజీ, ఇన్‌స్టాలేషన్‌ చార్జీలు కలిపి కొత్త కస్టమరు రూ.1,490 కట్టాల్సి ఉంటుంది. ఇప్పటివరకు జియో ఫైబర్‌ కనెక్షన్‌ తీసుకునేందుకు కనీస ప్లాన్‌ నెలకు రూ.399గా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement