new service
-
10 నిమిషాల్లోనే అంబులెన్స్.. బ్లింకిట్ కొత్త సర్వీస్
క్విక్ కామర్స్ (Quick commerce) ప్లాట్‌ఫారమ్ బ్లింకిట్ (Blinkit) కొత్త సర్వీస్‌ను ప్రారంభించింది. 10 నిమిషాల అంబులెన్స్ (ambulance)సేవను గురుగ్రామ్ నగరంలో అందుబాటులోకి తెచ్చింది. ఈ మేరకు కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) అల్బిందర్ ధింద్సా తాజాగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు."మన నగరాల్లో వేగవంతమైన, విశ్వసనీయమైన అంబులెన్స్ కొరత సమస్యను పరిష్కరించడానికి మేము మొదటి అడుగు వేస్తున్నాము" అని ధిండ్సా పేర్కొన్నారు. గురుగ్రామ్ నగరంలో కంపెనీ ఈరోజు (జనవరి 2) నుండి ఐదు అంబులెన్స్‌లను ప్రారంభించిందని, మరిన్ని ప్రాంతాలకు విస్తరించే ఆలోచన కూడా ఉందని ఆయన వెల్లడించారు.“మొదటి ఐదు అంబులెన్స్‌లు గురుగ్రామ్‌లో రోడ్‌పైకి వస్తాయి. సర్వీస్‌ను మరిన్ని ప్రాంతాలకు విస్తరింపజేసినప్పుడు, బ్లింకిట్ యాప్ ద్వారా బేసిక్ లైఫ్ సపోర్ట్ (BLS) అంబులెన్స్‌ని బుక్ చేసుకునే ఎంపికను మీరు చూస్తారు" అని ధిండ్సా తన పోస్ట్‌లో పేర్కొన్నారు.బ్లింకిట్ అంబులెన్స్‌లలో ఆక్సిజన్ సిలిండర్లు, ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డీఫిబ్రిలేటర్ (AED), స్ట్రెచర్, మానిటర్ వంటి పరికరాలతోపాటు అత్యవసర మందులు అందుబాటులో ఉంటాయని ధిండ్సా వివరించారు. ప్రతి అంబులెన్స్‌లో ఒక పారామెడిక్, సహాయకుడు, శిక్షణ పొందిన డ్రైవర్ ఉంటారని చెప్పుకొచ్చారు. ఇందులో తమకు లాభం ముఖ్యం కాదని, తక్కువ ధరకు ఈ సేవలు అందిస్తామని వివరించారు.Ambulance in 10 minutes.We are taking our first step towards solving the problem of providing quick and reliable ambulance service in our cities. The first five ambulances will be on the road in Gurugram starting today. As we expand the service to more areas, you will start… pic.twitter.com/N8i9KJfq4z— Albinder Dhindsa (@albinder) January 2, 2025 -
ఇక లోన్స్ ఈజీ.. యూపీఐ తరహాలో యూఎల్ఐ
దేశ డిజిటల్ పేమెంట్ వ్యవస్థలో పెను మార్పులు తీసుకొచ్చిన యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ ) తరహాలో యూఎల్ఐ (యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్) పేరుతో మరో కొత్త సేవలకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శ్రీకారం చుట్టబోతోంది. గత ఏడాది ప్రారంభించిన ఈ ప్లాట్‌ఫాం ప్రస్తుతం పైలట్ దశలో ఉంది. త్వరలో దీన్ని జాతీయ స్థాయిలో ప్రారంభించనున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. బెంగళూరులో డీపీఐ, ఎమర్జింగ్ టెక్నాలజీస్‌పై జరిగిన గ్లోబల్ కాన్ఫరెన్స్‌లో దాస్ ప్రసంగించారు.“పైలట్ ప్రాజెక్ట్ ఫలితాల ఆధారంగా, యూఎల్ఐని దేశవ్యాప్తంగా త్వరలో ప్రారంభిస్తాం. యూపీఐ చెల్లింపుల వ్యవస్థను మార్చినట్లే, యూఎల్ఐ దేశంలో రుణ వితరణలో అదే విధమైన పాత్రను పోషిస్తుందని మేము ఆశిస్తున్నాం. ఇది దేశ డిజిటల్ ప్రయాణంలో ఒక విప్లవాత్మక ముందడుగు అవుతుంది” అన్నారు. -
బధిర వినియోగదారులకు కోసం అమెజాన్ పే కొత్త సర్వీస్ - వివరాలు
అందరినీ కలుపుకుని వెళ్లే ప్రయత్నంలో భాగంగా డిజిటల్ చెల్లింపుల రంగంలో అగ్రగామిగా ఉన్న అమెజాన్ పే, ఇటీవల వినికిడి, మాట లోపం ఉన్న భారతీయ వినియోగదారుల కోసం ఒక వీడియో సంకేత భాషలో కేవైసీ (KYC) సర్వీస్ ప్రారంభించింది. ఇందులో సైన్ లాంగ్వేజ్ల ద్వారా కమ్యూనికేషన్ ఉంటుంది. అమెజాన్ పే ఉద్యోగులు, వినియోగదారుల మధ్య సంకేత భాషలో టూ-వే వీడియో కమ్యూనికేషన్‌ను ప్రారంభించే ప్రయత్నాన్ని కంపెనీ రూపొందించింది. సంకేత భాషపై ఆధారపడే వారి కోసం కేవైసీ ప్రక్రియను సునాయాసంగా చేయడం, డిజిటల్ చెల్లింపులను మరింత సులువగా చేసే లక్ష్యంతో కంపెనీ దీన్ని రూపొందించింది. డిజిటల్ భారత్‌కు అనుకూలంగా అమెజాన్ ఈ వినూత్న ప్రయత్నాన్ని చేపట్టింది. డిజిటల్‌గా సాధికారత కలిగిన భారతదేశం కోసం విస్తృత దృష్టికి అనుగుణంగా, తన సేవలు అందరినీ కలుపుకొని, అందుబాటులో ఉండేలా నిర్ధారిస్తుంది. ఈ సర్వీస్ గురించి ఇన్ పేమెంట్స్, పేమెంట్స్ అండ్ ఫైనాన్సియల్ సర్వీసెస్.. డైరెక్టర్ 'వికాస్ బన్సాల్' మాట్లాడుతూ, సైన్ లాంగ్వేజ్ వీడియో కేవైసీ సర్వీస్ అబ్సెషన్, ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్‌పై అమెజాన్ పే దృష్టికి ఇది సహజమైన పొడిగింపు. మేము మా అవరోధ రహిత సేవ పరిధిలో అమలు చేసిన ఈ సేవతో, వీడియో కేవైసీ ద్వారా సులభంగా, సురక్షితంగా ప్రయోజనం పొందేందుకు వైకల్యాలున్న మా వినియోగదారులకు సేవలు అందుందుకునే చేస్తున్నాము. ఈ సేవ వారి రోజువారీ చెల్లింపు అవసరాల కోసం డిజిటల్ వాలెట్ మెరుగైన ప్రయోజనాలను అందిస్తుంది. మా ఉత్పత్తులు అందరికీ అందుబాటులో ఉన్నాయని, మా సేవలు, అనుభవాలు, కార్యాచరణ ప్రతి ఒక్కరికీ వారి సామర్థ్యంతో సంబంధం లేకుండా అందుబాటులో ఉండేలా చూడాలని మేము కోరుకుంటున్నామని వివరించారు. భారతదేశంలోని వినియోగదారులకు వీడియో ఆధారిత కైవైసీ సేవలను అందించడానికి 120 మంది ఉద్యోగులకు అమెజాన్ పే భారతీయ సంకేత భాషపై శిక్షణ ఇచ్చింది. ఇంటరాక్టివ్ ట్రైనింగ్ మాడ్యూల్, వినికిడి, మాట్లాడలేని సమస్య ఉన్న వినియోగదారులతో సమర్థవంతంగా కమ్యూనికేట్ చేయగల సామర్థ్యం ఈ ఉద్యోగులకు ఉంది. దివ్యాంగులైన వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరచేందుకు కొనసాగుతున్న ప్రయత్నాలకు అనుగుణంగా, దివ్యాంగులైన వినియోగదారులు తాము ఎదుర్కొంటున్న సమస్యలు, తమ ప్రత్యేక అవసరాల గురించి తెలుసుకునేందుకు అమెజాన్ భారతదేశంలోని వినియోగదారులకు ‘లిజన్-ఇన్స్ ఫర్ యాక్ససబిలిటీ’ పేరిట ప్రయోజనాన్ని చేకూర్చే పలు కార్యక్రమాలను ప్రారంభించగా, ఇందులో కస్టమర్ సర్వీస్ టీమ్‌లు అపరిచితులు చేసిన కాల్ రికార్డింగ్‌లను వింటాయి. అంతే కాకుండా అమెజాన్ డిజిటల్, డివైస్ అండ్ అలెక్సా సపోర్ట్ (D2AS) సంస్థ యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్డమ్, కెనడా, ఇండియా, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్, మరియు జర్మనీలతో సహా ఎనిమిది మార్కెట్ ప్లేస్‌లలో వినియోగదారునికి మద్దతును అందించే యాక్ససబిలిటీ సపోర్ట్ బృందాలను అందుబాటులో ఉంచింది. ఈ యాక్సెసిబిలిటీ అసోసియేట్లలో అధిక మొత్తంలో భారతదేశం వెలుపల ఉన్నారు. అమెజాన్ తమ పూర్తి సామర్థ్యాన్ని అన్‌లాక్ చేసేందుకు ఉద్యోగులందరికీ సమాన అవకాశాలను అందించే సమగ్ర సంస్కృతిని పెంపొందించడానికి కట్టుబడి ఉంది. మహిళలు, LGBTQIA+ కమ్యూనిటీ, సైనిక అనుభవజ్ఞులు, విభిన్న సామర్థ్యం ఉన్న వారితో సహా వివిధ వర్గాలకు చెందిన వారందరికీ అవకాశాలను కల్పించేందుకు లింగ వైవిధ్యానికి మించి దృష్టి విస్తరించింది. అమెజాన్ విభిన్నమైన వర్క్‌ఫోర్స్ ఆవిష్కరణలను ప్రోత్సహిస్తుంది. విభిన్న కస్టమర్ బేస్‌ను అర్థం చేసుకోవడంలో ఇది సహాయపడుతూ, విభిన్న దృక్కోణాల ద్వారా నిర్ణయం తీసుకోవడాన్ని మెరుగుపరుస్తుంది. డీఈ & ఐ పట్ల కంపెనీ దాని నిబద్ధత దాని విధానాలు, ప్రోగ్రామ్‌లు మరియు కార్యాలయంలో వైవిధ్యం, ఈక్విటీ, చేరికను ప్రోత్సహించే లక్ష్యంతో చేసిన కార్యక్రమాలలో ఇది ప్రతిబింబిస్తుంది. -
జియో కొత్త ప్లాన్.. రూ.198కే బ్రాడ్‌బాండ్ సేవలు
న్యూఢిల్లీ: ఫిక్సిడ్ బ్రాడ్‌బాండ్ సెగ్మెంట్లో పోటీని మరింత వేడెక్కిస్తూ జియో కొత్తగా ఎంట్రీ లెవెల్ ప్లాన్‌ను ఆవిష్కరించింది. నెలకు రూ.198 ధరతో బ్రాడ్‌బాండ్ బ్యాకప్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. దీనితో సెకనుకు 10 మెగాబిట్ వేగంతో నెట్ సర్వీసులు అందుకోవచ్చు. రూ. 21 - 152 వరకు చెల్లించడం ద్వారా 1 - 7 రోజుల పాటు ఇంటర్నెట్ వేగాన్ని 30 ఎంబీపీఎస్ లేదా 100 ఎంబీపీఎస్‌కు అప్‌గ్రేడ్ చేసుకునే వీలును కల్పిస్తున్నట్లు సంస్థ తెలిపింది. 5 నెలల పాటు యూసేజీ, ఇన్స్టాలేషన్ చార్జీలు కలిపి కొత్త కస్టమరు రూ.1,490 కట్టాల్సి ఉంటుంది. ఇప్పటివరకు జియో ఫైబర్ కనెక్షన్ తీసుకునేందుకు కనీస ప్లాన్ నెలకు రూ.399గా ఉంది. -
Zomato Everyday: హోమ్ స్టైల్ మీల్స్.. కేవలం రూ. 89 మాత్రమే
ఆర్డర్ చేసిన నిముషాల్లోనే డెలివరీ చేసే ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో ఫుడీస్ కోసం అదిరిపోయే సర్వీస్ తీసుకువచ్చింది. జొమాటో ఎవిరిడే (Zomato Everyday) పేరుతో ఈ సర్వీస్ ద్వారా కస్టమర్లకు హోమ్ స్టైల్ మీల్స్‌ను అందిస్తుంది. మార్కెట్లో జొమాటో ఎప్పటికప్పుడు తమ ఇన్స్టంట్ సర్వీస్‌ను రీమోడలింగ్ చేయడంలో భాగంగానే ఈ కొత్త సర్వీసుని అందిస్తున్నట్లు కంపెనీ సీఈవో దీపేంద్ర గోయల్ తెలిపారు. ఈ సర్వీస్ కింద సరసమైన ధరలోనే హోమ్ స్టైల్ ఫుడ్ అందిస్తామన్నారు. 2022-23 క్యూ3 ఆర్థిక ఫలితాలను వెల్లడించే సమయంలో ఈ కొత్త సర్వీస్ తీసుకువస్తామని తెలిపారు. జొమాటో ఎవిరిడే సర్వీస్ ప్రారంభంలో గురుగావ్‌లో ఎంపిక చేసిన కొన్ని ప్రాంతాలలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. కంపెనీ ఫుడ్ పార్ట్నర్ హోమ్ చెఫ్‌తో భాగస్వామ్యం ఏర్పరుచుకుని తమ కస్టమర్లకు హోమ్ స్టైల్ మీల్స్ అందిస్తారు. కంపెనీ అందించే ఈ హోమ్ స్టైల్ మీల్స్ ప్రారంభ ధర కేవలం రూ. 89 మాత్రమే. (ఇదీ చదవండి: ఎగబడి మరీ 'మారుతి ఈకో' కొంటున్న జనం.. అమ్మకాల్లో అరుదైన రికార్డ్!) జొమాటో సంస్థకు ప్రధాన ప్రత్యర్థి గతంలో స్విగ్గీ 2019 లో స్విగ్గీ డెయిలీ పేరుతో హోమ్ స్టైల్ ఫుడ్ సర్వీస్ ప్రారభించింది. అయితే అనుకున్నంత సక్సెస్ సాధిచకపోవడంతో 2020లో హోమ్ స్టైల్ ఫుడ్ సర్వీసులను నిలిపేసింది. అయితే ఇప్పుడు జొమాటో అలాంటి సర్వీసుని త్వరలోనే ప్రారంభిస్తుంది. జొమాటో కంపెనీ తమ కస్టమర్ల కోసం ప్రారంభించే ఈ కొత్త సర్వీస్ ఎంత వరకు సక్సస్ సాధిస్తుందనేది త్వరలోనే తెలుస్తుంది, అంతే కాకుండా కంపెనీ డెలివరీ బాయ్స్ కోసం రెస్ట్ రూమ్స్ నిర్మిస్తున్నట్లు తెలిపింది. డెలివరీ బాయ్స్ ఈ రూమ్స్‌లో కొంత విశ్రాంతి తీసుకోవచ్చు. -
చాట్‌జీపీటీకి భారీ షాక్: గూగుల్ సీఈవో కీలక ప్రకటన
సాక్షి,ముంబై: గూగుల్‌కి సవాల్‌గా దూసుకొచ్చిన చాట్‌జీపీటీకి చేదువార్త. టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ భారీ పెట్టుబడులతో శరవేగంగా వస్తున్న చాట్‌జీపీటీ ఓపెన్ఏఐకి చెక్ చెప్పేందుకు గూగుల్ సిద్ధ మవుతోంది. చాట్‌జీపీటీకి పోటీగా సెర్చ్ ఇంజీన్ దిగ్గజం గూగుల్ సరికొత్త ఏఐ బేస్డ్ చాట్‌బాట్ ‘బార్డ్’ ను తీసుకొస్తోంది. దీనికి సంబంధించిన టెస్టింగ్‌ను కూడా మొదలు పెట్టింది. అతి త్వరలోనే దీన్ని అందుబాటులోకి తీసుకురానుంది. వినియోగదారుల ఫీడ్‌బ్యాక్ కోసం ఈ ఏఐ సర్వీస్ బార్డ్‌ను రిలీజ్ ఓపెన్ చేస్తున్నామని, దీని తరువాత త్వరలోనే పబ్లిక్‌గా విడుదల చేస్తామని గూగుల్,ఆల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్ వెల్లడించారు. సోమవారం ఒక బ్లాగ్‌పోస్ట్‌లో ఈ విషయాన్ని ప్రకటించిన ఆయన రానున్న కొద్ది వారాల్లోనే పబ్లిక్‌గా విడుదల చేస్తామని తెలిపారు. (Valentine’s Day sale: ఐఫోన్14 సిరీస్ ఫోన్లపై భారీ తగ్గింపు) అలాగే ఏఐ వ్యవస్థలలో ఒకటైన ఆంథ్రోపిక్‌లో గూగుల్ దాదాపు 400 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 3,299 కోట్లు) పెట్టుబడి పెడుతున్నట్టు పిచాయ్ చెప్పారు. నిజానికి ప్రయోగాత్మక సంభాషణ కృత్రిమ మేధతో కూడిన సర్వీస్ బార్డ్ ను రెండేళ్ల క్రితమే గూగుల్ ఆవిష్కరించింది. LaMDA (లాంగ్వేజ్ మోడల్ ఫర్ డైలాగ్ అప్లికేషన్స్) ద్వారా అందిస్తోందని పేర్కొన్నారు.తమ విశాలమైన భాషా మోడల్స్ ఇది గొప్ప పవర్ ఇంటిలిజెన్స్, క్రియేటివిటీ కలబోతగా ఉంటుందన్నారు. (ఫిబ్రవరి సేల్స్: మారుతి బంపర్ ఆఫర్) కాగా టిక్‌టాక్,ఇన్‌స్టాగ్రామ్‌లను అధిగమించి చరిత్రలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న యాప్‌గా చాట్‌జీపీటీ వార్తల్లో నిలిచింది. ఈ జనవరిలో దాదాపు 100 మిలియన్ల నెలవారీ క్రియాశీల వినియోగదారులను సాధించిన సంగతి తెలిసిందే. -
కస్టమర్ల కోసం ఎస్బీఐ సరికొత్త సేవ.. ఒక్క మెసేజ్ పెడితే చాలు..
దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా(SBI) మరో సేవను తన కస్టమర్ల కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది. కేవలం ఒక మెసేజ్‌తో ఫాస్టాగ్( FASTag) బ్యాలెన్స్‌ను చెక్ చేసుకునే సర్వీసును లాంచ్ చేసింది. దీని ద్వారా ఎస్బీఐ కస్టమర్లు ఫాస్టాగ్( FASTag) బ్యాలెన్స్‌ను సెకన్లలో తెలుసుకోగలుగుతారు. అందులో.. ఫాస్ట్‌ట్యాగ్‌ని ఉపయోగించే ఎస్బీఐ కస్టమర్లు వారి రిజిస్టర్ అయిన నంబర్ నుంచి 7208820019కి ఎస్ఎంఎస్ (SMS) పంపడం ద్వారా వారి ఫాస్ట్‌ట్యాగ్ బ్యాలెన్స్‌ను తెలుసుకోవచ్చని తెలిపింది. అయితే దీని కోసం ఎస్బీఐ కస్టమర్లు తమ మొబైల్ నెంబర్‌ను బ్యాంకు వద్ద రిజిస్టర్ చేసుకుని ఉండాలి. టోల్ గేట్ల వద్ద వాహనదారుల సమయం వృథా కాకుండా.. వారి సేవింగ్స్ అకౌంట్ల నుంచే నేరుగా నగదు కట్టేలా కేంద్ర ప్రభుత్వం ఫాస్టాగ్ సర్వీసులను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇలా చేస్తే చాలు సెకనులో.. మీ వాహనంలో ఇన్స్టాల్ చేసిన ఫాస్టాగ్ బ్యాలెన్స్ వివరాలు.., మీరు FTBAL అని వ్రాసి 7208820019 నంబర్‌కు ఎస్ఎంఎస్ పంపాల్సి ఉంటుంది. అదే సమయంలో, మీకు చాలా వాహనాలు ఉంటే అప్పుడు మీరు FTBAL అని వ్రాసి 7208820019కి పంపాలి. Dear SBI FASTag Customer, send an SMS to 7208820019 from your registered mobile number to quickly know your SBI FASTag balance. #SBIFastag #SBI #AmritMahotsav pic.twitter.com/mDQQgDl7Mv — State Bank of India (@TheOfficialSBI) September 10, 2022 చదవండి: టెక్నాలజీ అంటే ఇష్టం.. రూ.13వేల ఖర్చు, పాత ఇనుప సామగ్రితో బైక్! -
మారుతి సుజుకీ కస్టమర్లకు శుభవార్త..! కేవలం రూ. 500తో..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైడ్రోస్టాటిక్ లాక్, ఇంధన కల్తీ కారణంగా వాహనాల ఇంజన్లో ఊహించని వైఫల్యాలు తలెత్తుతుంటాయి. ఇటువంటి సమస్యలు ఉత్పన్నమైతే మేమున్నామని భరోసా ఇస్తోంది మారుతి సుజుకీ ఇండియా. స్వల్ప మొత్తంతో కస్టమర్ కన్వీనియెన్స్ ప్యాకేజీని (సీసీపీ) ప్రకటించింది. సీసీపీ కింద ఆల్టో, వేగన్–ఆర్ మోడళ్లకైతే రూ.500 చెల్లించాలి. ఇంజన్ పాడైతే మారుతి సుజుకీ అధీకృత సర్వీస్ సెంటర్ తీసుకెళితే చాలు. ఎటువంటి ప్రశ్నలు వేయకుండా రిపేర్ చేసి ఇస్తారు. ‘రోడ్లపై వరద నీరు కారణంగా ఇంజన్ నిలిచిపోతోంది. అలాగే కల్తీ ఇంధన ప్రభావం కొన్నేళ్లుగా పెరుగుతోంది. ఇటువంటి సందర్భాల్లో కస్టమర్లకు సీసీపీ ఉపశమనం కలిగిస్తుంది’ అని కంపెనీ వెల్లడించింది. దేశవ్యాప్తంగా సంస్థకు 2,100 నగరాలు, పట్టణాల్లో 4,200లకుపైగా సర్వీస్ టచ్ పాయింట్స్ ఉన్నాయి. చదవండి: మైలేజ్‌లో రారాజు..మారుతి సుజుకీ రికార్డుల హోరు..! 10 లక్షలకుపైగా.. -
ఓలా, ఉబెర్‌లకు షాక్ : నగరవాసులకు ఊరట
సాక్షి, హైదరాబాద్ : క్యాబ్ సర్వీసు సంస్థలు ఓలా, ఉబెర్‌తో విసిగిపోయిన హైదరాబాద్ వాసులకు శుభవార్త. ప్రధానంగా డిమాండ్‌ను బట్టి చార్జీలు, సర్ చార్జీలు బాదేస్తూ ప్రయాణికులను దోచుకుంటున్న ప్రధాన క్యాబ్ సర్వీసులకు షాకిచ్చేలా టోరా క్యాబ్స్ పేరుతో నగరంలోకి కొత్త క్యాబ్ సర్వీసుల సంస్థ ఎంట్రీ ఇచ్చింది. ‘జీరో సర్జ్, జీరో కమిషన్ క్యాబ్స్’ లక్ష్యమని టోరా ప్రకటించడం విశేషం. అంతేకాదు తమ యాప్ ఆధారిత సర్వీసు ద్వారా పారదర్శక బిజినెస్‌తో అటు ప్రయాణికులు, ఇటు డ్రైవర్లు ఇద్దరికీ ప్రయోజనాలు అందించాలని భావిస్తోంది. జూన్ 12న పైలట్ వెర్షన్‌గా సేవలను ప్రారంభించిన టోరా క్యాబ్స్ వచ్చే 45 రోజుల్లో పూర్తి సేవలను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కొరియన్ సంస్థ భాగస్వామ్యంతో జాయింట్ వెంచర్‌గా ఏర్పడి న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్నామని టోరా క్యాబ్స్ డైరెక్టర్ ఎస్.బి. షిన్ చెప్పారు. తన సేవలను తొలుత హైదరాబాద్‌లోనే ప్రారంభించడం విశేషమన్నారు. హైదరాబాద్‌లో ఇప్పటివరకు 1500 మంది డ్రైవర్లు తమ ప్లాట్‌ఫాంపై రిజిస్టరై ఉన్నారని, మరో 45 రోజుల్లో ఈ సంఖ్య 4 వేలకు చేరుతుందని టోరా క్యాబ్స్ మార్కెటింగ్ అండ్ పబ్లిక్ పాలసీ డైరెక్టర్ కవితా భాస్కరన్ ప్రకటించారు.ప్రయాణికులు, డ్రైవర్లకు సౌకర్యవంతమైన, ప్రయోజనం కల్గించే విధానాన్ని టోరా ప్రవేశపెడుతోందని అన్నారు. టోరా క్యాబ్స్ టెక్నాలజీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్(టీటీఎస్‌పీఎల్) డ్రైవర్లు కేవలం రోజువారీ సబ్‌స్క్రిప్షన్‌ను రూ.199, వారానికి రూ. 1194 నెలకు రూ.4975గా నిర్ణయించింది. ఇది మినహా ఎలాంటి కమిషన్లు తీసుకోదు. దీనికి తోడు కంపెనీ నుంచి డ్రైవర్లు రూ.5 లక్షల ఇన్సూరెన్స్‌ను పొందుతారు. అలాగే ప్రయాణికుల నుంచి ఎలాంటి సర్‌ఛార్జ్‌ను వసూలు చేయమని మినిమమ్ ఛార్జీగా మూడు కిలోమీటర్లకు రూ.39 వసూలు చేయనున్నామని, ఆ తర్వాత ఒక్కో కిలోమీటర్‌కు బేస్ ఛార్జీగా రూ.8ను విధించనున్నామని ఆమె పేర్కొన్నారు. డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు అధిక చార్జీలు వసూలు చేయబోమని ఆమె స్పష్టం చేశారు. -
ఆధార్ ‘అడ్రస్ మార్పు’నకు కొత్త సర్వీస్
న్యూఢిల్లీ: ఆధార్ కార్డులో సరైన అడ్రస్ లేని వారు తాము ప్రస్తుతం ఉంటున్న నివాసం అడ్రస్‌ను అప్డేట్ చేసుకునేందుకు యూఐడీఏఐ కొత్త సర్వీసును అందుబాటులోకి తీసుకురానుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఈ సర్వీస్ అమల్లోకి వస్తుంది. ‘సరైన అడ్రస్ ప్రూఫ్ ఉన్న వాళ్లు ఆ వివరాలను ఆధార్ సెంటర్లో సమర్పించి చిరునామా మార్చుకోవచ్చు. లేని వారు ఆ అడ్రస్‌కు పంపే ‘రహస్య పిన్’ను ఆధార్ కేంద్రంలో లేదా ఎస్ఎస్యూపీ ఆన్లైన్ పోర్టల్‌లో పొందుపరిచి చిరునామా మార్చుకోవచ్చు’ అని యూఐడీఏఐ తెలిపింది. ఆధార్‌లో సరైన అడ్రస్ లేనందున వలస కార్మికులు, అద్దె ఇళ్లలో ఉండేవారు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో కొత్త సర్వీసు ఆధారంగా ఈ సమస్యకు వీలైనంత పరిష్కారం లభించవచ్చని అధికారులు భావిస్తున్నారు. దీనికోసం జనవరి 1, 2019 నుంచి పైలట్ ప్రాజెక్టు చేపట్టనున్నారు. -
అగ్నిమాపక శాఖకు కొత్త హంగులు
కాకినాడ క్రైం (కాకినాడ సిటీ) : అగ్నిమాపక శాఖను బహుళ విపత్తుల నివారణ సంస్థగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్టు డైరెక్టర్ ఆఫ్ ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్ కె.జయరామ్ నాయక్ తెలిపారు. జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన బుధవారం స్థానిక సాలిపేటలోని అగ్నిమాపక కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేవలం అగ్ని ప్రమాదాల నిరోధానికే కాకుండా ప్రకృతి విపత్తులు, వరదలు, ఆస్తి, ప్రజలను కాపాడే సంస్థగా తీర్చిదిద్దేందుకు డైరెక్టర్ జనరల్ సత్యనారాయణ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారన్నారు. సిబ్బందికి స్కిల్స్ డెవలప్మెంట్, అధునాతన యంత్రాలు, పరికరాల వినియోగంపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామన్నారు. ప్రజలను భాగస్వాములు చేసేందుకు రాష్ట్రంలో ఆరు వేల మంది వలంటీర్లను ఎంపిక చేశామన్నారు. ఫైర్ స్టేషన్లలో మౌలిక వసతుల కల్పన, అధునాతన యంత్రాలు, పరికరాలు కొనుగోలుకు రూ.4 కోట్ల ప్రపంచ బ్యాంకు నిధులు వినియోగించనున్నట్టు చెప్పారు. సిబ్బంది సంక్షేమం, రక్షణ కోసం ప్రత్యేక పథకాలను అమలు చేస్తారన్నారు. 228 అడ్వా¯Œ్సడ్ వాటర్ ట్యాంకులు, 56 బోట్లు ఉన్నట్టు తెలిపారు. రక్షణ పథకంలో సిబ్బంది, అధికారులకు రూ.3 లక్షల దాకా బెనిఫిట్ ఉండేదని, దాన్ని రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతూ ప్రతిపాదనలు పంపామన్నారు. టాస్క్‌ఫోర్స్ సిబ్బంది ఆధ్వర్యంలో నిర్వహించిన రిస్క్యూ ఆపరేషన్, రోప్, లేడర్, కెమికల్ టూల్స్, సేండ్ కటర్, ఉడ్కట్టర్ తదితర విన్యాసాలు, వస్తు, యంత్రాలు, టూల్స్ ప్రదర్శనను తిలకించారు. ఈ కార్యక్రమంలో డీఎఫ్ఓ టి.ఉదయ్‌కుమార్, అగ్నిమాపక శాఖ ఏడీ ఐ.ధర్మారావు, ఎస్ఎఫ్ఓ ఎం.రాజా పాల్గొన్నారు. -
ఓలాకు పోటీగా ఉబర్ కొత్త సర్వీసు
న్యూఢిల్లీ : దేశీయ ట్యాక్సీ అగ్రిగేటర్ ఓలా రెంటల్స్‌కు పోటీగా శాన్ఫ్రాన్సిస్కో దిగ్గజం ఉబర్ ఓ కొత్త సర్వీసును ప్రారంభించింది. ఆన్‌డిమాండ్ క్యాబ్ సర్వీసుల కోసం 'ఉబర్ హైర్' ను సోమవారం యూజర్ల ముందుకు తీసుకొచ్చింది. ఈ సర్వీసులతో ఇక నుంచి ఉబర్ క్యాబ్‌ను 12 గంటల పాటు అద్దెకు తీసుకోవచ్చు. కాంచిలో విజయం పొందిన ఈ సర్వీసులను మరో ఎనిమిది సిటీల్లో ప్రారంభిస్తున్నట్టు పేర్కొంది. న్యూఢిల్లీ, బెంగళూరు, చెన్నై, ముంబాయి, పుణే, అహ్మదాబాద్, వైజాగ్, నాగ్‌పూర్‌లో వీటిని లాంచ్ చేస్తున్నట్టు తెలిపింది. ఇతర సిటీల్లోకి కూడా ఈ సర్వీసులను విస్తరిస్తామంది. ఈ సర్వీసులకు కనీస ఛార్జీలు రెండు గంటల వరకు, 30 కిలోమీటర్ల వరకు రూ.449 ఉంటాయి. మొత్తం ఛార్జీని ఉబర్ క్యాబ్‌లో ప్రయాణం మొత్తం పూర్తయిన తర్వాత, దూరం, ట్రిప్పు సమయం బట్టి లెక్కించనున్నారు. రైడర్స్ రాకపోకల అవసరాలకు అనుగుణంగా దీన్ని ప్రారంభించామని ఉబర్ ఇండియాకు ఇంజనీరింగ్ అధినేత అపూర్వ దలాల్ తెలిపారు. టూరిస్టులకు, బిజినెస్ ట్రావెలర్స్‌కు, సీనియర్ సిటిజన్లకు, వర్కింగ్ ప్రొఫిషన్లకు ఇది ఎంతో సహకరించనుందని పేర్కొన్నారు. ఓలా లాంటి ఇతర ట్యాక్సీ కంపెనీలు కూడా అవర్లీ క్యాబ్ రెంటల్స్‌ను నడుపుతున్న సంగతి తెలిసిందే. -
ఆస్ట్రేలియాలో ఉబెర్ సర్వీసులు
కాన్ బెర్రా: టాక్సీ అగ్రిగేటర్ ఉబెర్ తన వ్యాపారాన్ని మరింత స్తరించుకుంటోంది. ఈ ప్రణాళికలో భాగంగా ఆస్ట్రేలియా క్వీన్స్ లాండ్ రాష్ట్రంలో తన కొత్త సర్వీసులను లాంచ్ చేసింది. ఉబెర్ ఎక్స్ ఎల్ పేరుతో టాక్సీ సర్వీసులను ప్రారంభించింది. ఆరుగురు ఒకేసారి ప్రయాణించేలా 30 శాతం చౌక ధరలతో రైడ్ షేరింగ్ సేవలను గురువారంనుంచి అందుబాటులోకి తెచ్చింది. అక్కడ ప్రస్తుతం అందుబాటులో అక్కడి మాక్సీ- టాక్సీలకంటే తక్కవ రేటుకే ఈ సర్వీసులను అందిస్తున్నట్టు ప్రకటించింది. అయితే ఉబెర్ రైడ్ షేరింగ్ సేవల్లో ఈ రాష్ట్రంలో ఈ మే లోఉబెర్ డ్రైవర్లకు 1,772 డాలర్ల వరకు జరిమానాలు పెంచడం తో పాటు, నిర్వాహకులకు17,718 డాలర్ల వరకు జరిమానాను అక్కడి ప్రభుత్వ అధికారులు విధించినట్టు జిన్హువా వార్తా సంస్థ వెల్లడించింది. రైడ్ షేరింగ్ సర్వీసెస్ పై రివ్యూ అధికారులు పెద్ద ఎత్తున ఫైన్ విధించిన తరువాత కూడా. ఉబెర్ డ్రైవర్లకు అసలు మర్యాద తెలియదని. అగౌరవంగా ప్రవర్తిస్తారని, వారి వైఖరిలో ఎలాంటి మార్పు రాలదని ఇటీవల అధికారి ఒకరు చెప్పారని పేర్కొంది. దీనిపై స్పందించిన సంస్థ నిజానికి తాము ప్రభుత్వం, వారి సమీక్షల ఆధారంగా కలిసి పనిస్తున్నామని ఉబెర్ అధికారి ఒకరు తెలిపారు. అలాగే సురక్షితమైన,సరసమైన ధరల్లో తమ సేవలను వినియోగదారులకు అందిస్తున్నామన్నారు. -
టాటా స్కై నుంచి... కామెడీ సర్వీస్
హైదరాబాద్: ప్రముఖ డెరైక్ట్ టు హోమ్(డీటీహెచ్) కంపెనీ టాటా స్కై తన వినియోగదారుల కోసం టాటా స్కై కామెడీ పేరుతో కొత్త సర్వీస్‌ను అందిస్తోంది. భారత్‌లో డీటీహెచ్‌లో ఇదే తొలి ఇంటరాక్టివ్ సర్వీస్ కానున్నదని టాటా స్కై కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. అన్ని ఫార్మాట్ల హిందీ కామెడీని ఈ టాటా స్కై కామెడీ సర్వీస్‌తో పొందవచ్చని ఈ సర్వీస్‌ను ప్రారంభించిన టాటా స్కై చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ పల్లవి పురి చెప్పారు. నుక్కడ్, యో జో హై జిందగి, తదితర క్లాసిక్ కామెడీ టీవీ షోలను, సినిమా పేరడీలను, నకిలీ న్యూస్ షోలు, తదితర విభిన్నమైన కామెడీ కంటెంట్‌ను వీక్షకులు ఆస్వాదించవచ్చని వివరించారు. రోజంతా ఎలాంటి ప్రకటనలు లేకుండా వచ్చే ఈ టాటా స్కై కామెడీకి షేమారూ ఎంటర్టైన్మెంట్ అందిస్తోందని వివరించారు.