టాటా స్కై నుంచి... కామెడీ సర్వీస్ | Tata Sky launches Tata Sky Comedy with Hindi comedy content | Sakshi
Sakshi News home page

టాటా స్కై నుంచి... కామెడీ సర్వీస్

Mar 17 2016 1:52 AM | Updated on Sep 3 2017 7:54 PM

టాటా స్కై నుంచి... కామెడీ సర్వీస్

టాటా స్కై నుంచి... కామెడీ సర్వీస్

ప్రముఖ డెరైక్ట్ టు హోమ్(డీటీహెచ్) కంపెనీ టాటా స్కై తన వినియోగదారుల కోసం టాటా స్కై కామెడీ పేరుతో కొత్త సర్వీస్‌

హైదరాబాద్: ప్రముఖ డెరైక్ట్ టు హోమ్(డీటీహెచ్) కంపెనీ టాటా స్కై తన వినియోగదారుల కోసం టాటా స్కై కామెడీ పేరుతో కొత్త సర్వీస్‌ను అందిస్తోంది. భారత్‌లో డీటీహెచ్‌లో ఇదే తొలి ఇంటరాక్టివ్ సర్వీస్ కానున్నదని టాటా స్కై కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. అన్ని ఫార్మాట్ల హిందీ కామెడీని ఈ టాటా స్కై కామెడీ సర్వీస్‌తో పొందవచ్చని  ఈ సర్వీస్‌ను ప్రారంభించిన టాటా స్కై చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ పల్లవి పురి చెప్పారు. నుక్కడ్, యో జో హై జిందగి, తదితర క్లాసిక్ కామెడీ టీవీ షోలను, సినిమా పేరడీలను, నకిలీ న్యూస్ షోలు, తదితర విభిన్నమైన కామెడీ కంటెంట్‌ను వీక్షకులు ఆస్వాదించవచ్చని వివరించారు. రోజంతా ఎలాంటి ప్రకటనలు లేకుండా వచ్చే ఈ టాటా స్కై కామెడీకి షేమారూ ఎంటర్‌టైన్మెంట్ అందిస్తోందని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement