దేశ డిజిటల్ పేమెంట్ వ్యవస్థలో పెను మార్పులు తీసుకొచ్చిన యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ ) తరహాలో యూఎల్‌ఐ (యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్‌ఫేస్) పేరుతో మరో కొత్త సేవలకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శ్రీకారం చుట్టబోతోంది.
గత ఏడాది ప్రారంభించిన ఈ ప్లాట్‌ఫాం ప్రస్తుతం పైలట్ దశలో ఉంది. త్వరలో దీన్ని జాతీయ స్థాయిలో ప్రారంభించనున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. బెంగళూరులో డీపీఐ, ఎమర్జింగ్ టెక్నాలజీస్‌పై జరిగిన గ్లోబల్ కాన్ఫరెన్స్‌లో దాస్ ప్రసంగించారు.
“పైలట్ ప్రాజెక్ట్ ఫలితాల ఆధారంగా, యూఎల్‌ఐని దేశవ్యాప్తంగా త్వరలో ప్రారంభిస్తాం. యూపీఐ చెల్లింపుల వ్యవస్థను మార్చినట్లే, యూఎల్‌ఐ దేశంలో రుణ వితరణలో అదే విధమైన పాత్రను పోషిస్తుందని మేము ఆశిస్తున్నాం. ఇది దేశ డిజిటల్ ప్రయాణంలో ఒక విప్లవాత్మక ముందడుగు అవుతుంది” అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment