shakti kantha das
-
సారొచ్చారు.. ఆర్బీఐ గవర్నర్‌గా సంజయ్ మల్హోత్రా బాధ్యతలు
బ్యాంకింగ్ రెగ్యులేటర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) 26వ గవర్నర్‌గా రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు గవర్నర్‌గా పనిచేసిన శక్తికాంతదాస్ మంగళవారం పదవీ విరమణ చేశారు. సంజయ్ మల్హోత్రా పదవీ కాలం మూడేళ్లు ఉంటుంది. కొత్తగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కొత్త ఆర్బీఐ గవర్నర్ మాట్లాడారు.‘ఆర్థిక వ్యవస్థకు స్థిరత్వం, విశ్వాసం, వృద్ధి మూడు మూల స్థంభాల్లాంటివి. వీటిని కొనసాగిస్తూ మరింత బలోపేతం చేయాల్సి ఉంటుంది. అందుకు భారత సెంట్రల్ బ్యాంక్ నిరంతరం కృషి చేస్తోంది. కొన్నేళ్లుగా ఆర్బీఐ పనితీరు, అనుసరిస్తున్న విధానాలు ప్రశంసణీయం. ఇందుకోసం చాలామంది సిబ్బంది శ్రద్ధతో పని చేశారు. వారు కాపాడుతూ వచ్చిన ఆర్బీఐ ప్రతిష్టను నేను మరింత ముందుకు తీసుకెళ్తాను. 2047 వరకు ప్రభుత్వం ‘వికసిత్ భారత్’ లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుంది. దాన్ని సాధించేందుకు సమర్థమంత నిర్ణయాలు అవసరం. ఈ సంస్థ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా అవి ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ముందుకెళ్తుంది’ అని సంజయ్ మల్హోత్రా చెప్పారు.అపార అనుభవం..56 సంవత్సరాల మల్హోత్రా కాన్పూర్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) నుంచి కంప్యూటర్ సైన్స్‌లో ఇంజినీరింగ్ పట్టభద్రుడయ్యారు. అమెరికాలోని ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయం నుంచి పబ్లిక్ పాలసీలో మాస్టర్స్ పట్టా పొందారు. 1990 బ్యాచ్ రాజస్తాన్ కేడర్ ఐఏఎస్ అధికారిగా ఎంపికయ్యారు. 33 సంవత్సరాలకు పైగా తన కెరీర్లో విద్యుత్, ఫైనాన్స్, పన్నులు, సమాచార సాంకేతికత, గనులుసహా పలు రంగాలలో కీలక బాధ్యతలు నిర్వహించారు.ఇదీ చదవండి: కంటెంట్ ఖండాలు దాటేలా యూట్యూబ్ కొత్త ఫీచర్నిన్నటి వరకు ఆర్థిక మంత్రిత్వ శాఖలో కార్యదర్శి (రెవెన్యూ)గా కీలక బాధ్యతల్లో ఉన్నారు. అంతక్రితం ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఆర్థిక సేవల విభాగంలో కార్యదర్శిగా పనిచేశారు. రాష్ట్రంతో పాటు కేంద్ర ప్రభుత్వ స్థాయిలలో ఆర్థిక, పన్నుల విషయంలో ఆయనకు విస్తృత అనుభవం ఉంది. ప్రత్యక్ష, పరోక్ష పన్నుల విధాన రూపకల్పనలో అయన కీలక పాత్ర పోషించారు. -
ఇక లోన్స్ ఈజీ.. యూపీఐ తరహాలో యూఎల్ఐ
దేశ డిజిటల్ పేమెంట్ వ్యవస్థలో పెను మార్పులు తీసుకొచ్చిన యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ ) తరహాలో యూఎల్ఐ (యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్) పేరుతో మరో కొత్త సేవలకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శ్రీకారం చుట్టబోతోంది. గత ఏడాది ప్రారంభించిన ఈ ప్లాట్‌ఫాం ప్రస్తుతం పైలట్ దశలో ఉంది. త్వరలో దీన్ని జాతీయ స్థాయిలో ప్రారంభించనున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. బెంగళూరులో డీపీఐ, ఎమర్జింగ్ టెక్నాలజీస్‌పై జరిగిన గ్లోబల్ కాన్ఫరెన్స్‌లో దాస్ ప్రసంగించారు.“పైలట్ ప్రాజెక్ట్ ఫలితాల ఆధారంగా, యూఎల్ఐని దేశవ్యాప్తంగా త్వరలో ప్రారంభిస్తాం. యూపీఐ చెల్లింపుల వ్యవస్థను మార్చినట్లే, యూఎల్ఐ దేశంలో రుణ వితరణలో అదే విధమైన పాత్రను పోషిస్తుందని మేము ఆశిస్తున్నాం. ఇది దేశ డిజిటల్ ప్రయాణంలో ఒక విప్లవాత్మక ముందడుగు అవుతుంది” అన్నారు. -
ఆహార ధరలు ఇంకా తీవ్రమే..
న్యూఢిల్లీ: తక్షణం వడ్డీరేటు సరళతరం అయ్యే అవకాశం లేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ తెలిపారు. వినియోగ ధరల సూచీ ఆధారిత (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 2 ప్లస్‌తో ఆరు శాతానికి కట్టడి చేయాలన్న కేంద్రం నిర్దేశం... ప్రస్తుతం 6 శాతం దిగువనే ఉన్న పరిస్థితి (మేలో ఏడాది కనిష్ట స్థాయిలో 4.75 శాతం)ని ఆయన ప్రస్తావిస్తూ, ‘‘ప్రస్తుత ద్రవ్యోల్బణం–4 శాతం లక్ష్యం మధ్య ఉన్న అంతరాన్ని బట్టి వడ్డీ రేటుపై వైఖరిని మార్చడం చాలా ముందస్తు చర్య అవుతుంది’’ అని ఉద్ఘాటించారు. రిటైల్ ద్రవ్యోల్బణం లక్ష్యం 4 శాతమేనని పలు సందర్భాల్లో ఆర్బీఐ గవర్నర్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ద్రవ్యోల్బణంపై ఆందోళనలు పొంచి ఉన్నాయని కూడా ఆయన పలు సందర్భాల్లో ప్రస్తావించారు. ముఖ్యంగా ఆహార ద్రవ్యోల్బణంపై గవర్నర్ ఆందోళన వ్యక్తం చేస్తూ వస్తున్నారు. జూన్ 2023 నుండి వరుసగా 11వ నెలలో ప్రధాన ద్రవ్యోల్బణం తగ్గింది. సేవల ద్రవ్యోల్బణం చారిత్రక కనిష్ట స్థాయిలకు దిగివచి్చంది. వస్తు ద్రవ్యోల్బణం అదుపులోనే ఉంది. ఈ నేపథ్యంలో గవర్నర్ ఇచి్చన ఒక ఇంటర్వ్యూలో కొన్ని ముఖ్యాంశాలు.. → మనం స్థిరమైన ప్రాతిపదికన 4 శాతం రిటైల్ ద్రవ్యోల్బణం వైపునకు వెళ్లినప్పుడు వడ్డీరేటు వైఖరిలో మార్పు గురించి ఆలోచించే విశ్వాసం మనకు లభిస్తుంది. → ద్రవ్యోల్బణం ప్రయాణం అంచనాలకు తగ్గట్టుగానే పురోగమిస్తున్నది. అయితే పూర్తి 4 శాతం దిశగా ప్రయాణం అత్యంత కష్టతరమైన అంశం. ఇందుకు పలు అడ్డంకులు ఉన్నాయి. → మార్చి–మే మధ్య తయారీ, ఫ్యూయల్ అండ్ లైట్ ద్రవ్యోల్బణం తగ్గింది. అయితే ఆహార ద్రవ్యోల్బణం విషయలో ఇంకా ఆందోళనలు ఉన్నాయి. కూరగాయలుసహా పలు నిత్యావసరాల వస్తువుల ద్రవ్యోల్బణం స్పీడ్ రెండంకెలపైనే ఉంది. → స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విషయానికి వస్తే పలు అంశాలు వృద్ధికి దోహదపడే విధంగా తమ పాత్రను పోషిస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో వృద్ధి వేగం చాలా బలంగా ఉంది. ఇది మొదటి త్రైమాసికంలో బలంగా కొనసాగుతుందని భావిస్తున్నాం. జూన్ పాలసీ సమావేశంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు అంచనాలను ఆర్బీఐ క్రితం 7 శాతం నుంచి 7.2 శాతానికి పెంచడం ఇక్కడ గమనార్హం. ఇదే జరిగితే దేశం వరుసగా నాలుగు సంవత్సరాల్లో 7 శాతం ఎగువన వృద్ధి సాధించినట్లు అవుతుంది. పాలసీ విధానం పునరుద్ఘాటన ఇంటర్వ్యూలో గవర్నర్ పాలసీ విధాన సమీక్ష అంశాలను పునరుద్ఘాటించడం గమనార్హం. ద్వైమాసిక ద్రవ్య పరపతి సమీక్షకు సంబంధించి జూన్ 5 నుంచి 7వ తేదీ మధ్య మూడు రోజుల పాటు సమావేశమైన ఆరుగురు సభ్యుల ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ)లో మెజారిటీ 4 శాతం దిగువకు రిటైల్ ద్రవ్యోల్బణం కట్టడే తన ప్రధాన లక్ష్యంగా పేర్కొంటూ వరుసగా ఎనిమిదవసారి కీలక రేటు– రెపోను (6.5 శాతం) యథాతథంగా ఉంచింది. అయితే వడ్డీ రేటును తగ్గించాలని గత సమీక్షలో అభిప్రాయపడిన వారు ఒకరే ఉండగా ఈసారి అది ఇద్దరికి పెరిగింది. వీరిలో ఎంపీసీ ఎక్స్టర్నల్ సభ్యులు జయంత్ వర్మతో ఆషిమా గోయల్ కూడా ఉన్నారు. అయితే ఆర్బీఐ ఎంపీసీ మెజారిటీ సభ్యులు –ఎటువంటి అనిశ్చితి లేకుండా ద్రవ్యోల్బణం దిగువబాటనే కొనసాగుతుందన్న భరోసా వచ్చే వరకూ– వేచిచూసే ధోరణి పాటించాలని అభిప్రాయపడ్డారు. బ్యాంకులకు ఆర్బీఐ తానిచ్చే నిధులపై వసూలు చేసే వడ్డీ రేటును రెపో రేటుగా వ్యవహరిస్తారు. బ్యాంకింగ్ వ్యవస్థలో వడ్డీ రేట్లు ప్రధానంగా దీనిపై ఆధారపడి ఉంటాయి. 2023 ఫిబ్రవరి నుంచి ఆర్బీఐ దీన్ని యథాతథంగా కొనసాగిస్తోంది. కాగా, వృద్ధికి విఘాతం కలగకుండా ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయగలిగిన విషయాన్ని పరిగణనలోకి తీసుకున్నప్పటికీ, ఆహార ధరలపరంగా ద్రవ్యోల్బణం మళ్లీ ఎగిసే రిసు్కలను ఎంపీసీ నిశితంగా పరిశీలిస్తోందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పాలసీ సమీక్ష సందర్భంగా చెప్పారు. ధరలు నిలకడగా ఉండే విధంగా స్థిరత్వాన్ని సాధించగలిగితేనే అధిక వృద్ధి సాధనకు పటిష్టమైన పునాదులు వేయడానికి సాధ్యపడగలదని ఆయన పేర్కొ న్నారు. ద్రవ్యోల్బణం భయాలు ఇంకా పొంచే ఉన్నాయని ఎంపీసీలోని మెజారిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు. ఆర్బీఐ పాలసీ విధానానికి ప్రాతిపదిక అయిన వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 2024–25లో 4.5 శాతం ఉంటుందన్నది ఆర్బీఐ పాలసీ అంచనా. క్యూ1 (ఏప్రిల్–జూన్) 4.9 శాతం, క్యూ2లో 3.8 శాతం, క్యూ3 లో 4.6 శాతం, క్యూ4లో 4.5 శాతం రిటైల్ ద్రవ్యో ల్బణం ఉంటుందని ఆర్బీఐ భావిస్తోంది. ఆహార ధరల తీవ్రతవల్లే రిటైల్ ద్రవ్యోల్బణం 4 శాతం దిగువకు రావడం లేదని ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష పేర్కొంది. మేలో ఏడాది కనిష్ట స్థాయిలో 4.75 శాతంగా రిటైల్ ద్రవ్యోల్బణం నమోదయినప్పటికీ, ఆర్బీఐ గవర్నర్ పేర్కొంటున్న లక్ష్యం కన్నా 75 బేసిస్ పాయింట్లు అధికం. -
బిజినెస్: ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో.. గవర్నర్ చర్చ!
ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో నార్త్‌బ్లాక్‌లో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ సమావేశమయ్యారు. ఎకానమీపై చర్చించారు. కాగా సెబీ చైర్పర్సన్ మాధవి పురి బుచ్ కూడా ఆర్థిక మంత్రితో సమావేశమై మార్కెట్ పరిణామాలను వివరించారు. స్విగ్గీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రోహిత్ కపూర్ సీతారామన్‌తో సమావేశమయినట్లు మరో పోస్ట్‌లో ఆర్థికశాఖ పేర్కొంది. ఇవి చదవండి: బిజినెస్ - నష్టాల్లోంచి లాభాల్లోకి.. -
క్రిప్టోలపై మా వైఖరిలో మార్పు లేదు
న్యూఢిల్లీ: క్రిప్టోకరెన్సీలను వ్యతిరేకించడంపై తమ వైఖరిలో ఎటువంటి మార్పూ లేదని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ స్పష్టం చేశారు. నియంత్రణల విషయంలో ఇతర దేశాలను ఆర్బీఐ అనుకరించబోదని గురువారం ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. బిట్‌కాయిన్ ఎక్సే్చంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్) కు అమెరికాలో క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ ఎస్ఈసీ అనుమతించిన నేపథ్యంలో దాస్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘వేరే దేశానికి మంచిదైనంత మాత్రాన అది మన దేశానికి కూడా మేలు చేస్తుందనేమీ లేదు. కాబట్టి క్రిప్టోలపై రిజర్వ్ బ్యాంక్, అలాగే వ్యక్తిగతంగా నా అభిప్రాయాల్లో కూడా ఎటువంటి మార్పూ లేదు. (బిట్‌కాయిన్ ఈటీఎఫ్‌లను అనుమతించినప్పటికీ) వాటితో రిసు్కల విషయంలో జాగ్రత్త వహించాల్సిందేనని ఎస్ఈసీ ఒక హెచ్చరిక కూడా చేసిన సంగతిని గమనించాలి‘ అని ఆయన చెప్పారు. వర్ధమాన మార్కెట్లు, సంపన్న దేశాలు.. క్రిప్టోకరెన్సీల బాటలో వెళితే భారీ రిస్కులు తప్పవని, భవిష్యత్తులో వాటిని అధిగమించడం చాలా కష్టమవుతుందని దాస్ చెప్పారు. క్రిప్టో మేనియా భరించలేం.. వర్ధమాన మార్కెట్లు, ప్రపంచ దేశాలు ’క్రిప్టో మేనియా’ను భరించగలిగే పరిస్థితి లేదని దాస్ తెలిపారు. ‘గతంలో నెదర్లాండ్స్‌లో టులిప్ మేనియా ఏ విధంగా అసెట్ బబుల్‌కి దారి తీసిందో మనకు తెలుసు. దాదాపు అలాంటి పర్యవసానాలకే దారి తీసే క్రిప్టో మేనియాను వర్ధమాన మార్కెట్లు, ప్రపంచం భరించే పరిస్థితిలో లేవని నేను భావిస్తున్నాను‘ అని చెప్పారు. మరోవైపు, ప్రస్తుత ప్రభుత్వ గత ట్రాక్ రికార్డు చూస్తే ఎన్నికల ముంగిట కేంద్రం ప్రవేశపెట్టబోయే ఓటాన్ అకౌంట్ .. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను పెంచే విధంగా ఉండకపోవచ్చని ఆయన తెలిపారు. యూపీఐ ప్రపంచంలోనే అత్యుత్తమ పేమెంట్స్ విధానం.. ఏకీకృత చెల్లింపుల విధానం (యూపీఐ) ప్రపంచంలోనే అత్యుత్తమ పేమెంట్స్ విధానమని దాస్ ప్రశంసించారు. యూపీఐ వృద్ధి చెందేందుకు మరింతగా అవకాశాలు ఉన్నాయని, పేమెంట్స్‌లో ప్రపంచంలోనే అగ్రగామిగా ఎదగగలదని చెప్పారు. యూపీఐ సృష్టికర్త నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (ఎన్పీసీఐ)ది గుత్తాధిపత్యంగా మారిందంటూ కొన్ని వర్గాల నుంచి వచి్చన విమర్శలపై దాస్ స్పందించారు. ఎన్‌పీసీఐకి పోటీగా మరేదీ రాకూడదని ఆర్బీఐ కోరుకోవడం లేదని, వాస్తవానికి అటువంటి సంస్థ ఏర్పాటు కోసం దరఖాస్తులను కూడా ఆహా్వనించిందని ఆయన తెలిపారు. కానీ, తమకు అందిన ప్రతిపాదనలు వేటిలోనూ కొత్తదనమేమీ కనిపించలేదన్నారు. అటు, దివాలా కోడ్ (ఐబీసీ) కింద బ్యాంకర్లు మొత్తం క్లెయిమ్‌లలో 32 శాతం బాకీలను రాబట్టుకోగలిగాయని దాస్ చెప్పారు. 2023 నాటికి ఐబీసీ కింద రూ. 9.92 లక్షల కోట్ల క్లెయిమ్‌లను అడ్మిట్ చేసుకోగా రుణదాతలు రూ. 3.16 లక్షల కోట్లు రాబట్టుకోగలిగారని దాస్ చెప్పారు. అయితే, సదరు చట్టం ఇప్పటిదాకా అమలైన తీరుతెన్నులను అధ్యయనం చేసిన మీదట కొన్ని దిద్దుబాటు చర్యలు తీసుకోవాల్సి ఉందని తెలుస్తోందని ఆయన పేర్కొన్నారు. మొండి పద్దు పరిష్కారానికి గణనీయంగా సమయం పడుతోందని, క్లెయిమ్‌లలో హెయిర్‌కట్ (మొండి బాకీ వసూలులో వదులుకుంటున్న మొత్తం) భారీగా ఉంటోందని ఐబీసీపై ప్రధానంగా రెండు విమర్శలు ఉన్నాయి. -
పక్షి కన్ను చూస్తున్న అర్జునుడి పాత్రలో ఆర్బీఐ: దాస్
దేశంలో ద్రవ్యోల్బణం రోజురోజుకు పెరుగుతోంది. నిత్యావసర వస్తువులు మరింత ప్రియంగా మారుతున్నాయి. దానికితోడు అంతర్జాతీయ యుద్ధాలతో దేశాభివృద్ధికి ఆటంకం కలుగుతుందేమోనని ఆందోళనలు పెరుగుతున్నాయి. తాజాగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ ఫిక్కీ సమావేశంలో మాట్లాడారు. ద్రవ్యోల్బణాన్ని నాలుగు శాతం లేదా అంతకంటే తగ్గించాలనే లక్ష్యంతో ఆర్బీఐ పనిచేస్తోందని ఆయన అన్నారు. ద్రోణాచార్యుడి పరీక్షలో చెట్టుపై ఉన్న పక్షి కన్నును చూస్తున్న అర్జునుడితో ఆర్బీఐ పనితీరును పోల్చారు. ద్రవ్యోల్బణాన్ని తగ్గించేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ప్రతి పరిస్థితిని క్షుణ్నంగా పరిశీలిస్తున్నట్లు వివరించారు. భౌగోళిక రాజకీయ సవాళ్ల మధ్య బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలకు కొత్త నిబంధనలు తీసుకొచ్చిన నేపథ్యంలో వాటి పనితీరును ఉద్దేశించి ‘సుదీర్ఘ ఆట ఆడండి. రాహుల్ ద్రావిడ్ లాగా ఆడండి’ అని అన్నారు. తాను ఇటీవల ఓ విమానాశ్రయానికి వెళితే అక్కడే ఉన్న సీఐఎస్ఎఫ్ బృందం ద్రవ్యోల్బణం, వడ్డీరేట్లు ప్రభావంపై ప్రశ్నలడిగినట్లు దాస్ ఫిక్కీ సమావేశంలో తెలిపారు. ప్రజలకు ఆర్థిక అంశాలపై ఎంతో అవగాహన ఉందని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. -
RBI Policy review: రెపో రేటు పెంపు, ఈఎంఐలు మరింత భారం!
సాక్షి,ముంబై: రిజర్వ్ బ్యాంకు ఇండియా (ఆర్బీఐ) అంచనాలకు అనుగుణంగానే రెపో రేటు పావు శాతం పెంచింది. వరుసగా ఆరోసారి రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచి 6.50 శాతానికి పెంచింది. దీంతో 6.25 శాతంగా ఉన్న కీలక వడ్డీరేటు 6.50 శాతానికి చేరింది. అలాగే ఎంఎస్ఎప్ రేట్లు 25 బీపీఎస్ పాయింట్లు పెరిగి 6.75శాతానికి చేరింది. జీడీపీ వృద్ధి అంచనాలు 2023 ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి వృద్ధి అంచనా 6.8 శాతం నుండి 7 శాతానికి పెరిగింది. 2023-24లో GDP వృద్ధిని 6.4శాతంగా అంచనా వేసింది ఆర్బీఐగవర్నర్ శక్తికాంత దాస్ బుధవారం (ఫిబ్రవరి8, 2023) ద్రవ్య విధాన ప్రకటనను ప్రకటించారు. ఇది వరుసగా ఆరోసారి వడ్డీ రేటు పెంపు. డిసెంబర్ మానిటరీ పాలసీ సమీక్షలో కీలక బెంచ్ మార్క్ వడ్డీ రేటును 35 బేసిస్ పాయింట్లు పెంచింది. గత ఏడాది మే నుంచి ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ స్వల్పకాలిక రుణ రేటు, తాజా పెంపుతో కలిపి 250 బేసిస్ పాయింట్లు పెంచింది. పెరగనున్న రుణ భారం తాజా రేట్ల పెంపు ప్రభావం అన్ని రకాల రుణాల రేట్లపై భారం పడనుంది. ఇప్పటికే వరుసగా పెరిగిన వడ్డీ రేట్ల కారణంగా రుణ వినియోగదారులపై భారం పడుతున్న సంగతి తెలిసిందే -
ఆర్బీఐ పాలసీ రివ్యూ: 5.4 శాతానికి రెపో రేటు
సాక్షి,ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ కమిటీ శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది. మార్కెట్ నిపుణులు, విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగానే రెపో రేటును 50 బీపీఎస్ పాయింట్లు మేర పెంచుతూ నిర్ణయాన్ని ప్రకటించింది. ఎంపీసీ కమిటీ ఏకగగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. తాజా పెంపుతో రెపో రేటు 5.4 శాతానికి చేరింది. అలాగే స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ (ఎస్డీఎఫ్) 5.15 శాతానికి సర్దుబాటు చేసింది. జీడీపీ వృద్ధిని 7.2 శాతంగా అంచనా వేశారు. ద్రవ్యోల్బణం 6 శాతం కంటే ఎక్కువగానే ఉంటుందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సీపీఐ ద్రవ్యోల్బణం 6.7 శాతంగా ఉంటుందని, 2023-24 ఆర్థిక సంవత్సరానికి 5 శాతంగా ఉంటుందని ఆర్బీఐ గవర్నర్ అంచనా వేశారు. భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచ ఆర్థిక పరిస్థితులకు సహజంగానే ప్రభావితమవుతోందని తెలిపారు. ఆర్థికవ్యవస్థ అధిక ద్రవ్యోల్బణంతో సతమతమవుతోంది. ద్రవ్యోల్బణం 6 శాతం కంటే ఎక్కువగానే ఉంటుందని అంచనా వేశారు. త్వరలోనే వంటనూనెలు దిగి రానున్నాయని ఆయన చెప్పారు. కాగా గత మూడు నెలల్లో రెపో రేటును పెంచడం ఇది వరుసగా మూడోసారి. గవర్నర్ శక్తికాంత దాస్ నేృత్వత్వంలో మూడు రోజుల సమావేశాల అనంతరం కమిటీ పాలసీ విధానాన్ని ప్రకటించింది. అధిక ధరలు, ద్రవ్యోల్బణం, ప్రపంచ ఆర్థికమాంద్యం ఆందోళనల నేపథ్యంలో ఆర్బీఐ రేటు పెంపునకే మొగ్గు చూపింది. -
ఆర్బీఐ పాలసీ సమావేశాలు.. ‘వడ్డింపు’ భయాలు..
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) రెండవ ద్వైమాసిక సమావేశం సోమవారం ప్రారంభమైంది. గవర్నర్ శక్తికాంతదాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల కమిటీ బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపోను (ప్రస్తుతం 4.4 శాతం) మరో 35 బేసిస్ పాయింట్ల నుంచి 50 బేసిస్ పాయింట్ల (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) వరకూ పెంచే అవకాశం ఉందన్న విశ్లేషణలు వినబడుతున్నాయి. ఏప్రిల్‌లో తొలి ద్వైమాసిక సమీక్షలో రెపో రేటును యథాతథంగా కొనసాగించిన ఆర్బీఐ ఎంపీసీ, మే తొలి వారంలో అనూహ్య రీతిలో సమావేశమై రెపో రేటును 2018 ఆగస్టు తర్వాత మొట్టమొదటిసారి 0.4 శాతం పెంచింది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో ద్రవ్యోల్బణం తీవ్రత దీనికి కారణం. ఇదే పెంపు ధోరణిని ఆర్బీఐ తాజా సమావేశంలోనూ కొనసాగిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రెపో రేటు 5.6 శాతం వరకూ పెరుగుతుందన్న అంచనాలు ఉన్నాయి. మే మధ్యంతర సమావేశంలో రెపో రేటుతోపాటు బ్యాంకులు ఆర్బీఐ వద్ద తప్పనిసరిగా ఉంచాల్సిన ‘వడ్డీ రహిత’ నిధులకు సంబంధించిన నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్)ని కూడా (రూ.87,000 కోట్లు వ్యవస్థ నుంచి వెనక్కు తీసుకోవడం లక్ష్యంగా) పరపతి విధాన కమిటీ 50 బేసిస్ పాయింట్లు పెంచింది. దీనితో ఈ రేటు 4.5 శాతానికి పెరిగింది. కొనసాగుతున్న బ్యాంకింగ్ ‘వడ్డింపు’ ఆర్బీఐ రెపో పెంపు నేపథ్యంలో బ్యాంకింగ్ పలు దఫాలుగా వడ్డీరేట్ల పెంపునకు శ్రీకారం చుట్టాయి. తాజాగా సోమవారం ఈ వరుసలో కెనరా బ్యాంక్, కరూర్ వైశ్యా బ్యాంకులు నిలిచాయి. నెలవారీ చెల్లింపుల (ఈఎంఐ) ఆధారిత బెంచ్‌మార్క్ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించాయి. -
మార్కెట్‌కు ఆర్బీఐ షాక్..
ముంబై: ఊహించని విధంగా ఆర్బీఐ కీలక వడ్డీరేట్లను పెంచడంతో బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్ కుప్పకూలింది. అతిపెద్ద పబ్లిక్ ఇష్యూ ఎల్ఐసీ ఐపీఓ ప్రారంభం నేపథ్యంలో బడా ఇన్వెస్టర్లు తమ స్టాక్స్ హోల్డింగ్స్ నుంచి పెద్ద ఎత్తున నగదు ఉపసంహరించుకున్నారు. విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు సెంటిమెంట్‌పై మరింత ఒత్తిడిని పెంచాయి. వడ్డీరేట్ల పెంపు నిర్ణయంతో బాండ్ మార్కెట్ వణికింది. పదేళ్ల కాలపరిమితి కలిగిన బాండ్లపై రాబడి రెండేళ్ల గరిష్ట స్థాయి 7.41 శాతానికి చేరింది. యూఎస్ ఫెడ్ ద్రవ్యపాలసీ ప్రకటన (బుధవారం రాత్రి)కు ముందు అప్రమత్తత చోటు చేసుకుంది. ఈ అంశాలూ ట్రేడింగ్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. అన్ని రంగాల షేర్లూ అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ముఖ్యంగా వడ్డీ రేట్ల ఆధారిత బ్యాంకింగ్, ఆటో, ఆర్థిక, రియల్టీ షేర్లలో భారీ స్థాయిలో విక్రయాలు వెల్లువెత్తాయి. ఫలితంగా సెన్సెక్స్ 56 వేల స్థాయిని కోల్పోయి 1,307 పాయింట్లు క్షీణించి 55,669 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 392 పాయింట్లు నష్టపోయి 16,680 వద్ద నిలిచింది. ఈ ముగింపు ఇరు సూచీలకు ఎనిమిది వారాల కనిష్ట స్థాయి కావడం గమనార్హం. సెన్సెక్స్ సూచీలో పవర్‌గ్రిడ్, ఎన్టీపీసీ, కొటక్ బ్యాంక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు మాత్రమే స్వల్ప లాభంతో గట్టెక్కాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ రెండున్నర శాతం, స్మాల్ క్యాప్ సూచీ రెండుశాతం చొప్పున పతనమయ్యాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.3,288 కోట్ల షేర్లను అమ్మేయగా, దేశీయ ఇన్వెస్టర్లు రూ.1,338 కోట్ల షేర్లను కొన్నారు. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ ఎనిమిది పైసలు బలపడి 76.40 వద్ద స్థిరపడింది. ఫెడ్ రిజర్వ్ ద్రవ్య పాలసీ ప్రకటకు ముందు ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు వేచిచూచే ధోరణి ప్రదర్శిస్తున్నాయి. ఆసియాలో సింగపూర్, హాంగ్‌కాంగ్, కొరియా మార్కెట్లు నష్టపోయాయి. చైనా, ఇండోనేషియా, జపాన్ మార్కెట్లకు సెలవు. యూరప్‌లో బ్రిటన్, ఫ్రాన్స్ మిశ్రమంగా ట్రేడ్ అవుతున్నాయి. అమెరికా స్టాక్ ఫ్యూచర్లు మిశ్రమంగా ట్రేడ్ అవుతున్నాయి. కుప్పకూలిన బ్యాంకింగ్, ఆటో, రియల్టీ షేర్లు ఆర్బీఐ రెపో రేటు 40 బేసిస్ పాయింట్ల పెంపు నిర్ణయంతో వడ్డీరేట్ల ఆధారిత కుప్పకూలిన బ్యాంకింగ్, ఆటో, రియల్టీ షేర్లు కుప్పుకూలాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండస్ ఇండ్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బంధన్ బ్యాంక్, ఏయూ స్మాల్ బ్యాంక్, ఐసీఐసీఐ, ఎస్బీఐ బ్యాంక్ షేర్లు నాలుగు శాతం నుంచి అరశాతం వరకు క్షీణించాయి.అశోక్ లేలాండ్, బజాజ్ ఆటో, టీవీఎస్ మోటార్, మారుతీ, హీరో మోటోకార్ప్, ఎంఅండ్ఎం, టాటా మోటార్స్ షేర్లు నాలుగున్నర శాతం నుంచి రెండు శాతం పతనమయ్యాయి. రూ.6.27 లక్షల కోట్లు సంపద ఆవిరి ఆర్బీఐ వడ్డీరేట్ల పెంపు నిర్ణయంతో సోమవారం ఒక్కరోజే రూ.6.27 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ కంపెనీల మార్కెట్ విలువ రూ.259 లక్షల కోట్లకు దిగివచ్చింది. -
క్రిప్టోకరెన్సీలపై నిర్మలా సీతారామన్ ఆసక్తికర వ్యాఖ్యలు..!
న్యూఢిల్లీ: పార్లమెంటు బడ్జెట్ సమావేశాల సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ క్రిప్టోకరెన్సీలపై నేడు రాజ్యసభలో మాట్లాడారు. నిపుణుల సంప్రదింపుల తర్వాత క్రిప్టోకరెన్సీలను దేశంలో నిషేదించాలా.. వద్దా? అనే దానిపై . కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. వర్చువల్ కరెన్సీల వల్ల వచ్చే లాభాలపై కేంద్ర ప్రభుత్వం 30 శాతం పన్ను విధించడానికి ప్రైవేట్ క్రిప్టోకరెన్సీల చట్టబద్ధతతో సంబంధం లేదని పేర్కొన్నారు. క్రిప్టోకరెన్సీ లావాదేవీల వల్ల వచ్చిన లాభంపై పన్ను విధించే సార్వభౌమ హక్కు ప్రభుత్వానికి ఉందని ఆర్థిక మంత్రి తెలిపారు. "క్రిప్టోకరెన్సీలను దేశంలో నిషేదించాలా.. వద్దా? అనేది నిపుణుల సంప్రదింపుల తర్వాత తెలుస్తుంది" అని రాజ్యసభలో ఎఫ్ఎం సీతారామన్ తెలిపారు. తన బడ్జెట్ ప్రసంగంలో ఎఫ్ఎం సీతారామన్ వ్యక్తి ఆదాయపు పన్ను స్లాబ్‌తో సంబంధం లేకుండా క్రిప్టోకరెన్సీ వ్యాపారాల లాభాలపై 30 శాతం పన్ను విధించే ప్రతిపాదనను ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. అయితే, చాలా మంది మన దేశంలో క్రిప్టోకరెన్సీలకు చట్టబద్దత వచ్చినట్లు భావిస్తున్నారు. అయితే, ఈ విషయం మీదే నేడు సీతారామన్ స్పష్టత ఇచ్చారు. ఫిబ్రవరి 10న జరిగిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) ద్రవ్య పరపతి సమీక్షా సమావేశంలో గవర్నర్ శక్తికాంత దాస్ మాట్లాడుతూ.. ఆర్థిక వ్యవస్థ, ఫైనాన్షియల్ స్థిరత్వాలకు ఈ కరెన్సీ ముప్పని స్పష్టం చేశారు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఇన్వెస్టర్లను గవర్నర్ హెచ్చరించారు. అటువంటి అసెట్స్‌కు ఎటువంటి అంతర్లీన విలువా ఉండదని గవర్నర్ అన్నారు. క్రిప్టో కరెన్సీ.. తులిప్ పువ్వుకన్నా దిగదుడుపని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆయన 17వ శతాబ్దంలో వచ్చిన ‘తులిప్ మ్యానియా’ను గుర్తుచేశారు. (చదవండి: ఫిక్స్డ్ డిపాజిట్ చేసేవారికి ఆ రెండు బ్యాంకులు శుభవార్త..!) -
రిజర్వ్‌బ్యాంక్ ద్రవ్య పరపతి విధాన సమీక్ష
-
ఆర్బీఐ కీలక నిర్ణయం... స్టాక్ మార్కెట్లో అనూహ్య మార్పులు
ముంబై: రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం వెలువరించిన మరుక్షణం స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులకు లోనవుతోంది. రెపోరేటు, రివర్స్ రేపో రేటులలో మార్పులు ఉండబోవంటూ ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ నిర్ణయం ప్రకటించిన వెంటనే స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. ఆ తర్వాత ఇన్వెస్టర్ల సెంటిమెంట్ కలిసిరావడంతో తిరిగి మార్కెట్ కోలుకుంటోంది. పాజిటివ్ ట్రెండ్ ఈ వారం ప్రారంభం నుంచి స్టాక్మార్కెట్లో పాజిటివ్ ట్రెండ్ నడుస్తోంది. వరుసగా ప్రతీ రోజు ఇన్వెస్టర్లు లాభాలు కళ్లజూస్తున్నారు. గడిచిన మూడు రోజులుగా అయితే సెన్సెక్స్, నిఫ్టీలు రికార్డులు సృష్టించాయి. ఆల్‌టైం హైలకు చేరుకున్నాయి. ఈవారంలో మార్కెట్‌కి చివరి రోజైన శుక్రవారం సైతం సెన్సెక్స్ స్వల్ప నష్టాలతో ప్రారంభమై ఆ వెంటనే పుంజుకుంది. మార్కెట్ ప్రారంభమైనప్పటి నుంచి నిఫ్టీ లాభాల బాటలోనే పయణించింది. గంటలోనే ఈరోజు ఉదయం 54,492 పాయింట్లతో సెన్సెక్స్ మొదలైంది. ఓ దశలో గరిష్టంగా 54,663 పాయింట్లను తాకింది. ఈ సమయంలో రిపోరేటు, రివర్స్ రిపోరేటుపై ఆర్బీఐ నిర్ణయం ప్రకటించింది. దీని ప్రకారం ప్రస్తుతం ఉన్నట్టుగానే రిపో రేటు 4 శాతం, రివర్స్ రిపో రేటు 3.35 శాతంగానే కొనసాగుతాయని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు. ఆర్బీఐ నుంచి ప్రకటన వెలువడిన మరుక్షణమే దేశీ సూచీలు లాభాల నుంచి నష్టాల దిశగా దారి మార్చుకున్నాయి. ఆర్బీఐ నిర్ణయం వెలువడిన గంట వ్యవధిలోనే 205 పాయింట్లు నష్టపోయి 54,287 వద్ద సెన్సెక్స్ ట్రేడయ్యింది. మరికాసేపటికే కోలుకుంది. ఉదయం 11 గంటల సమయంలో 88 పాయింట్ల నష్టంతో 54,403 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ సైతం నేషనల్ స్టాక్ ఎక్సేంజీ సూచీ నిఫ్టీ ఈ రోజు ఉదయం 16,304 పాయింట్లతో మొదలైంది. ఓ దశలో 16,336 పాయింట్లకు చేరుకుంది. ఆర్బీఐ నిర్ణయం వెలువడిన మరుక్షణం నుంచి పాయింట్లు కోల్పోవడం మొదలైంది. గంట వ్యవధిలో 41 పాయింట్లు నష్టపోయి 16,253 వద్ద ట్రేడయ్యింది. అయితే కాసేపటికే పుంజుకుంది. ఉదయం 11;30 గంటల సమయంలో 24 పాయింట్లు నష్టపోయి 16,270 వద్ద ట్రేడవుతోంది. -
వడ్డీరేట్ల మార్పుపై రిజర్వ్‌బ్యాంక్ కీలక నిర్ణయం
ముంబై: బ్యాంకు వడ్డీ రేట్ల మార్పుపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న రిపో రేటు, రివర్స్ రిపో రేటులపై మానిటరీ పాలసీ కమిటీ సూచనలకు అనుగుణంగా ఆర్బీఐ వడ్డీ రేట్లను నిర్ణయించింది. మార్పులేదు కోవిడ్ సెకండ్ వేవ్ ప్రభావం నుంచి ఆర్థిక వ్యవస్థ గాడిన పడే వరకు ప్రస్తుతం ఉన్న రిపో రేటు, రివర్స్ రిపో రేటులను కొనసాగించాలని మానిటరీ పాలసీ కమిటీ సూచించిందని, అందుకు తగ్గట్టుగా ప్రస్తుతం ఉన్న పరిస్థితినే కొనసాగిస్తున్నట్టు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ప్రకటించారు. దీని ప్రకారం ప్రస్తుతం ఉన్నట్టుగానే రిపో రేటు 4 శాతం, రివర్స్ రిపో రేటు 3.35 శాతంగానే కొనసాగనున్నాయి. గాడిన పడుతోంది వ్యవసాయ సీజన్లో వర్షాలు సమృద్ధిగా కురుస్తుండం, వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతుండటంతో త్వరలోనే ఆర్థిక వ్యవస్థ పూర్వ స్థితికి చేరుకుంటుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు పెట్రోలు ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నా.. ద్రవ్యోల్బణం అదుపులోనే ఉందన్నారు. రిపోరేటు ప్రభుత్వ సెక్యూరిటీలను తన వద్ద ఉంచుకుని వాణిజ్య బ్యాంకులకు ఆర్బీఐ అప్పులు ఇచ్చేప్పుడు వసూలు చేసే వడ్డీని రెపో రేటుగా వ్యవహరిస్తారు. ఇదే సమయంలో వాణిజ్య బ్యాంకులు తన వద్ద డిపాజిట్ చేసిన మొత్తానికి ఆర్బీఐ ఇచ్చే వడ్డీని రివర్స్ రిపో రేటు అంటారు. -
పెరుగుతున్న సైబర్ దాడులతో రిస్క్
ముంబై: కరోనా రెండో విడత భారత్‌పై తీవ్ర ప్రభావం చూపిందన్నారు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్. అయితే మే చివరి నుంచి ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటున్నట్టు చెప్పారు. పెరుగుతున్న డేటా తస్కరణ, సైబర్ దాడుల సమస్యలను దేశ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్నట్టు ఆయన పేర్కొన్నారు. ‘‘2020–21 రెండో అర్ధ భాగంలో కోలుకున్న దేశ ఆర్థిక వ్యవస్థపై.. 2021 ఏప్రిల్, మే నెలల్లో తిరిగి ప్రభావం పడింది. కరోనా వైరస్ కేసులు ఎంత వేగంగా పెరిగాయో.. అంతే వేగంగా నియంత్రణలోకి రావడం వల్ల మే చివరి నుంచి, జూన్ వరకు కార్యకలాపాల్లో పురోగతి నెలకొంది’’ అంటూ ఆర్బీఐ రూపొందించిన ద్వైవార్షిక ఆర్థిక స్థిరత్వ నివేదిక(ఎఫ్ఎస్ఆర్)లో శక్తికాంతదాస్ ప్రస్తావించారు. ఎన్పీఏలు పెరగొచ్చు.. బ్యాంకుల స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్పీఏలు/వసూలు కాని రుణాలు) 2021 మార్చి నాటికి 7.5 శాతం వద్దే స్థిరంగా, ఆరు నెలల ముందునాటి మాదిరే ఉన్నట్టు ఆర్బీఐ ఎఫ్ఎస్ఆర్ తెలిపింది. అయితే 2022 మార్చి నాటికి ఇవి 9.8 శాతానికి పెరిగే అవకాశాలున్నట్టు పేర్కొంది. ఇది కూడా కనీస అంచనాలేనని.. పరిస్థితులు మరీ ప్రతికూలంగా మారితే స్థూల ఎన్పీఏలు 11.22 శాతానికి కూడా పెరిగిపోవచ్చని అంచనా వేసింది. ముఖ్యంగా ప్రభుత్వరంగ బ్యాంకుల స్థూల ఎన్పీఏలు 2021 మార్చి నాటికి 9.54 శాతంగా ఉంటే.. 2022 మార్చి నాటికి 12.52 శాతానికి చేరొచ్చని పేర్కొంది. అయితే, ఈ ఏడాది జనవరిలో విడుదల చేసిన ఎఫ్‌ఎస్‌ఆర్‌లో బ్యాంకుల స్థూల ఎన్పీఏలు 2022 మార్చి నాటికి 13.5 శాతానికి పెరగొచ్చని అంచనా వేయడం గమనార్హం. బ్యాంకుల వద్ద తగినంత నిధులున్నట్టు ఈ నివేదిక తాజాగా పేర్కొంది. ఆర్థిక సంస్థల బ్యాలన్స్ షీట్లపై ప్రభావం గతంలో వేసిన స్థాయిలో ఉండకపోవచ్చని శక్తికాంతదాస్ అభిప్రాయపడ్డారు. తాము ప్రకటించిన చర్యలు పూర్తి స్థాయిలో ఆచరణ రూపం దాలిస్తేనే వాస్తవ ప్రభావం ఎంతన్నది తెలుస్తుందన్నారు. ఆర్థిక స్థిరత్వమే తమ ప్రాధాన్యంగా చెప్పారు. రిటైల్, ఎంఎస్ఎంఈ రుణాలపై దృష్టి రిటైల్, ఎంఎస్ఎంఈ రుణాలపై ఎక్కువ ప్రభావం ఉందంటూ వీటిపై బ్యాంకులు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎఫ్ఎస్ఆర్ బ్యాంకులకు సూచించింది. అనుకూల మార్కెట్ పరిస్థితులు ఏర్పడితే మూలధన నిధులను పెంచుకోవాలని కోరింది. చదవండి : జెట్ ఎయిర్వేస్లోకి రూ. 1,375 కోట్లు! -
ఆర్బీఐ వడ్డీరేట్ల ఊరట..!
ముంబై: దేశంలో కరోనా ప్రభావం కనిష్ట స్థాయికి చేరే వరకూ తగిన సరళతర ద్రవ్య, పరపతి విధానాలనే అనుసరిస్తామని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) భరోసా ఇచ్చింది. కరోనా సెకండ్ వేవ్ భారత్ ఆర్థిక వ్యవస్థను అనిశ్చితిలోకి నెట్టిందని పేర్కొంది. ఈ పరిస్థితుల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021ఏప్రిల్–2022 మార్చి) వృద్ధి రేటు 9.5 శాతంగానే ఉంటుందని అంచనావేసింది. ఈ విషయంలో గత అంచనా 10.5 శాతానికి ఒకశాతం మేర కోత పెట్టింది. ఈ పరిస్థితుల్లో ఎకానమీ వృద్ధికి సరళతర ద్రవ్య పరపతి విధానాన్ని కొనసాగించక తప్పదని స్పష్టం చేసింది. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపోను వరుసగా ఆరవ ద్వైమాసిక సమావేశంలోనూ యథాతథంగా 4 శాతంగా కొనసాగించాలని గవర్నర్ శక్తికాంత్‌దాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ఎంపీసీ ఏకగ్రీవంగా నిర్ణయించింది. దీనితోపాటు అవసరమైతే మరింత తగ్గించే అవకాశం ఉందనీ సంకేతాలు ఇచ్చింది. మార్చి 2020 తర్వాత 115 బేసిస్ పాయింట్లు రెపోను తగ్గించిన ఆర్బీఐ, కరోనా కష్ట కాలం దేశానికి ప్రారంభమైన తర్వాత యథాతథ రేటును కొనసాగిస్తూ వస్తోంది. ఇక బ్యాంకులు తమ అదనపు నిధుల డిపాజిట్‌పై ఇచ్చే వడ్డీ–రివర్స్ రెపో రేటును కూడా యథాతథంగా 3.35గా కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. 2వ తేదీ నుంచి 4వ తేదీ వరకూ జరిగిన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష అనంతరం గవర్నర్ శక్తికాంత్‌దాస్ మీడియాతో మాట్లాడారు. సంబంధిత వివరాలు, నిర్ణయాలను క్లుప్లంగా పరిశీలిస్తే.. కట్టడిలో ద్రవ్యోల్బణం ద్రవ్యోల్బణం కట్టడిలో ఉండడం సరళతర ద్రవ్య విధానం కొనసాగింపునకు దోహదపడుతుందని ఆర్బీఐ విశ్లేషించింది. కేంద్రం నిర్దేశాలకు (2 నుంచి 6 శాతం మధ్య) అనుగుణంగా 2021–22లో రిటైల్ ద్రవ్యోల్బణం సగటున 5.1 శాతంగా కొనసాగుతుందని అంచనావేసింది. అయితే ఇది గత అంచనాలకన్నా 10 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) ఎక్కువ కావడం గమనార్హం. బ్యాంకింగ్‌కు నిధుల భరోసా 2021–22 ఆర్థిక సంవత్సరంలో తీవ్రంగా నష్టపోయిన రంగాలకు రుణ సహాయాన్ని అందించడానికి భారత చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంక్ (ఎస్ఐడీబీఐ– సిడ్బీ)సహా ఫైనాన్షియల్ సంస్థలకు తాజా మద్దతు ప్రకటించింది. ఇందులో భాగంగా 2022 మార్చి 31 వరకూ రూ.15,000 కోట్ల ప్రత్యేక లిక్విడిటీ విండో (ద్రవ్య లభ్యత సౌలభ్యం)ను ప్రకటించింది. ఈ విండో కింద బ్యాంకులు మూడేళ్ల కాలానికి రెపో రేటుకు రుణాలను తీసుకోవచ్చు. తద్వారా హోటల్స్, రెస్టారెంట్లు, పర్యాటకం వంటి కోవిడ్ బాధిత రంగాల పునరుద్ధరణకు బ్యాంకులు రుణ సహాయం అందించవచ్చు. దీనికితోడు లఘు, మధ్య చిన్న తరహా పరిశ్రమలకు (ఎంఎస్ఎంఈ) చేయూతను ఇవ్వడానికి సిడ్బీకి రూ.16,000 కోట్ల అదనపు నిధిని కేటాయించింది. కరోనా కష్టాల్లో ఉన్న రంగాలకు రుణ సహాయ పరిమితిని రూ.25 కోట్ల నుంచి రూ.50 కోట్లకు పెంచింది. రుణ రేట్ల కట్టడికి... బాండ్ల కొనుగోలు సరళ విధానంలో రుణ రేట్లను కట్టడిలో ఉంచడానికి రెండవ త్రైమాసికంలో గవర్నమెంట్ సెక్యూరిటీస్ అక్విజేషన్ కార్యక్రమం (జీ–ఎస్ఏపీ–2.0) కింద అదనంగా రూ.1.2 లక్షల కోట్ల బాండ్లను కొనుగోలు చేయనున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. ఏప్రిల్–మే మధ్య జీ–ఎస్ఏపీ–1.0 కింద రూ. లక్ష కోట్ల విలువైన ప్రభుత్వ బాండ్లను కొనుగోలు చేస్తామని ఆర్బీఐ ఏప్రిల్‌లో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆగస్టు 1 నుంచీ నిరంతరం... ఎన్ఏసీహెచ్ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) నిర్వహిస్తున్న నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్ (ఎన్ఏసీహెచ్) వ్యవస్థ 2021 ఆగస్టు 1వ తేదీ నుంచి నిరంతరం అన్ని రోజులూ అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం బ్యాంకింగ్ పనిదినాల్లో మాత్రం ఈ సౌలభ్యం అందుబాటులో ఉంటోంది. చెల్లింపులకు సంబంధించి మధ్యవర్తిత్వ సంస్థగా ఎన్ఏసీహెచ్ నుంచి అత్యాధునిక సేవలు అందుబాటులో ఉంటాయి. డివిడెండ్, వడ్డీ, వేతనం, పెన్షన్ వంటి బదలాయింపులకు అలాగే విద్యుత్, గ్యాస్ టెలిఫోన్, వాటర్ నెలవారీ రుణ వాయిదాలు, మ్యూచువల్ ఫండ్స్, బీమా ప్రీమియం చెల్లింపులకు ఎన్ఏసీహెచ్ వ్యవస్థ కీలక సేవలు అందిస్తోంది. క్రిప్టో కరెన్సీపై ఆందోళనలు ఉన్నాయ్... బిట్‌కాయిన్ వంటి క్రిప్టో కరెన్సీలపై ఆర్బీఐ వైఖరిలో మార్పు లేదు. తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యే ఇలాంటి ఇన్స్ట్రమెంట్లపై ‘‘తీవ్ర ఆందోళనలు’’ ఉన్నాయి. ఇప్పటికే దీనిపై విడుదల చేసిన ఆర్బీఐ సర్క్యులర్ ఆయా అంశాలకు సంబంధించి పూర్తి స్పష్టతను ఇచ్చింది. 2018లో తొలుత ఇందుకు సంబంధించి జారీ చేసిన ఒక సర్క్యులర్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ నేపథ్యంలో సవరిత నోటిఫికేషన్‌ను తాజాగా ఆర్థిక సంస్థలకు జారీ చేయడం జరిగింది. అందువల్ల క్రిప్టోకరెన్సీ అంశాల విషయంలో 2018 నాటి సర్క్యులేషన్‌ను ఉదహరించవద్దని తాజా నోటిఫికేషన్లో బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు, పేమెంట్ వ్యవస్థలకు ఆర్బీఐ సూచిస్తోంది. -
ఆర్బీఐ ఆదేశాలు వెంటనే అమలు చేయండి
ముంబై: మహమ్మారి కరోనా విసురుతున్న సవాళ్లను ఎదుర్కొనడంలో భాగంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇటీవల ప్రకటించిన చర్యలను వేగవంతంగా అమలు చేయాలని గవర్నర్ శక్తికాంత దాస్ ప్రభుత్వ రంగ బ్యాంకుల ఎండీలు, సీఈఓలను బుధవారం ఆదేశించారు. అలాగే ఒడిదుడుకులను తట్టుకునేలా బ్యాంకుల బ్యాలెన్స్ షీట్ల పటిష్టతపైనా దృష్టి సారించాలని వీడియో కాన్ఫరెన్స్‌లో పిలుపునిచ్చారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ఆర్బీఐ ఇందుకు సంబంధించి ఒక ప్రకటన విడుదల చేసింది. కరోనా సవాళ్లు, రుణ లభ్యతపై చర్చ ప్రకటన ప్రకారం, దేశ ప్రస్తుత ద్రవ్య– ఆర్థిక పరిస్థితులు, చిన్న రుణ గ్రహీతలు అలాగే లఘు, చిన్న మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ)సహా వివిధ రంగాలకు రుణ లభ్యత, కోవిడ్ రిజల్యూషన్ ఫ్రేమ్‌వర్క్ వంటి అంశాలు వీడియో కాన్ఫరెన్స్‌లో చర్చకు వచ్చాయి. ద్రవ్య పరపతి విధాన నిర్ణయ ఫలాల బదలాయింపు, కోవిడ్ సవాళ్లను ఎదుర్కొనడానికి ఆర్బీఐ తీసుకున్న విధాన నిర్ణయాల అమలుపైనా చర్చ జరిగింది. ప్రస్తుత ఆరోగ్య సంక్షోభ పరిస్థితుల్లో బ్యాంకులు పోషిస్తున్న క్రియాశీల పాత్రను తన ప్రారంభోపన్యాసంలో గవర్నర్ ప్రశంసించారు. డిప్యూటీ గవర్నర్లు ఎంకే జైన్, ఎం రాజేశ్వరరావు, మైఖేల్ డీ పాత్ర, టీ రవి శంకర్ తదితర సీనియర్ ఆర్బీఐ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కరోనా కష్టకాలాన్ని ఎదుర్కొనే క్రమంలో మే నెల మొదటి వారంలో ఆర్బీఐ పలు చర్యలను ప్రకటించిన నేపథ్యంలో తాజా సమావేశం జరిగింది. వ్యక్తులు, చిన్న సంస్థలకు రుణాల పునరుద్ధరణ, రుణ పునర్వ్యవస్థీకరణ, వైద్య, ఆరోగ్య రంగానికి రూ.50,000 కోట్లు, టీకాల తయారీ, ఆస్పత్రులు, ల్యాబ్‌లకు రుణాలు, రాష్ట్రాల ఓవర్‌డ్రాఫ్ట్ నిబంధనలు సరళతరం, రూ.35వేల కోట్లతో జీ–సెక్‌ల కొనుగోలు వంటి పలు చర్యలు వీటిలో ఉన్నాయి. -
ఆర్బీఐ పాలసీ సమావేశాలు ప్రారంభం
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) 2021–22 తొలి ద్వైమాసిక మూడురోజుల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. కోవిడ్–19 కేసులు పెరుగుతుండటం, 2–6 శాతం మధ్య ద్రవ్యోల్బణ లక్ష్యానికి కట్టుబడి ఉండాలంటూ కేంద్రం నిర్దేశాల నేపథ్యంలో జరుగుతున్న ఈ సమావేశం కీలక నిర్ణయాలు బుధవారం వెల్లడవుతాయి. తాజా పాలసీ సమీక్షలోనూ కీలక వడ్డీ రేటు రెపో యథాతథ స్థితి కొనసాగించే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదే జరిగితే రెపో యథాతథ స్థితి వరుసగా ఐదవసారి అవుతుంది. రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీ రేటు) ప్రస్తుతం 4 శాతంగా ఉంది. ఎకానమీ రికవరీలో అసమానతలు ఉన్నాయని, కనిష్ట స్థాయి నుంచి కోలుకునే ప్రక్రియ నెమ్మదిగా జరుగుతోందని ఎడెల్వీజ్ రీసెర్చ్ తెలిపింది. తాజాగా కోవిడ్ కేసులు విజృంభిస్తుండటం మరో కొత్త సవాలుగా మారిందని పేర్కొంది. ఈ పరిస్థితుల్లో ఇటు వృద్ధికి, అటు ద్రవ్యోల్బణ కట్టడికి ఎప్పటికప్పుడు విధానపరమైన చర్యల తోడ్పాటు అవసరమని తెలిపింది. ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించే అవకాశం ఉందని వివరించింది. ఒకవైపు కోవిడ్–19 కేసులు, మరోవైపు ద్రవ్యోల్బణం పెరుగుతుండటంతో రిజర్వ్ బ్యాంక్ పరిస్థితి సంక్లిష్టంగా మారిందని హౌసింగ్‌డాట్‌కామ్ గ్రూప్ సీఈవో ధృవ్ అగర్వాలా చెప్పారు. దీనితో తాజా ద్వైమాసిక సమీక్షలో రెపో రేటును మార్చకపోవచ్చని పేర్కొన్నారు. గత ఏడాది ఫిబ్రవరి తర్వాత రెపో రేటును 115 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) తగ్గించిన సెంట్రల్ బ్యాంక్, గడచిన (2020 ఆగస్టు, అక్టోబర్, డిసెంబర్, ఫిబ్రవరి 2021 నెలల్లో) నాలుగు ద్వైమాసిక సమావేశాల్లో యథాతథ రేటును కొనసాగిస్తోంది. రిటైల్ ద్రవ్యోల్బణం భయాలను ఇందుకు కారణంగా చూపుతోంది. 18 పైసలు తగ్గిన రూపాయి ముంబై: ఫారెక్స్ మార్కెట్లో సోమవారం రూపాయి విలువ 18 పైసలు కరిగిపోయి 73.30 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ బలపడటం, దేశీయ ఈక్విటీ మార్కెట్ పతనం రూపాయి క్షీణతకు కారణమయ్యాయి. ఇంట్రాడేలో 73.28 – 73.45 రేంజ్లో కదలాడింది. ఆర్థిక వ్యవస్థ రికవరీకి తోడ్పడే సంస్కరణలేవీ లేకపోవడం, దేశీయ స్థూల ఆర్థిక గణాంకాలు నిరుత్సాహపరచడంతో రూపాయి రానున్న రోజుల్లో బలహీనంగా ట్రేడయ్యే అవకాశం ఉంది’ అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రీసెర్చ్ విశ్లేషకుడు దిలీప్ పర్మర్ తెలిపారు. -
‘సెకండ్ వేవ్’తో వృద్ధికి సమస్య లేదు!
ముంబై: భారత్‌ను ప్రస్తుతం భయాందోళనలకు గురిచేస్తున్న కరోనా ‘సెకండ్ వేవ్’ వల్ల ఆర్థిక వృద్ధి రికవరీ బాటకు ఎటువంటి ఢోకా ఉండబోదన్న విశ్వాసాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ గురువారం వ్యక్తంచేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2021–22) భారత్ 10.5 శాతం వృద్ధిని సాధిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో ఆర్బీఐ గత నెల అంచనాలను తగ్గించాల్సి వస్తుందని తాను భావించడం లేదని అన్నారు. కరోనా కేసులు పెరుగుతుండడం ఆందోళనకరమైన అంశమే అయినప్పటికీ, దేశ వ్యాప్త లాక్డౌన్ల పరిస్థితి మళ్లీ తలెత్తుతుందని భావించనక్కర్లేదని అన్నారు. ఒక మీడియా గ్రూప్ ఏర్పాటు చేసిన ఎకనమిక్ సదస్సునుద్దేశించి చేసిన ప్రసంగంలో శక్తికాంతదాస్ బిట్‌కాయిన్ వంటి క్రిప్టో కరెన్సీ నుంచి బ్యాంకింగ్ రంగంలో సంస్కరణల వరకూ పలు అంశాలపై మాట్లాడారు. ఆయనేమన్నారంటే... బాండ్ ఈల్డ్స్‌పై రుణ సమీకరణ ఎఫెక్ట్ ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారీ రుణ సమీకరణ ప్రణాళిక బాండ్ ఈల్డ్స్ (వడ్డీ) పెరుగుదలకు ప్రధాన కారణం. ఈ కారణంగానే 2020–21 ఆర్థిక సంవత్సరం చివరి దఫా రూ.20,000 కోట్ల బెంచ్‌మార్క్ బాండ్ వేలాన్ని ఈ నెల 22వ తేదీన కేంద్రం రద్దు చేసింది. ఆర్బీఐ–బాండ్ మార్కెట్ మధ్య ఎలాంటి ఘర్షణాత్మక పరిస్థితి లేదు. క్రిప్టోకరెన్సీలపై ఆందోళన బిట్‌కాయిన్ వంటి క్రిప్టోకరెన్సీలపై ఆర్బీఐ ఆందోళన చెందుతోంది. ఇదే విషయాన్ని కేంద్రానికీ తెలియజేసింది. క్రిప్టోకరెన్సీలపై ఆర్బీఐ–ప్రభుత్వం మధ్య వేర్వేరు అభిప్రాయాలు ఉన్నాయని భావించడంలేదు. ఫైనాన్షియల్ స్థిరత్వ పటిష్టతకు ప్రభుత్వం, ఆర్బీఐ కట్టుబడి ఉన్నాయి. క్రిప్టోకరెన్సీపై ప్రభుత్వం, సెంట్రల్ బ్యాంక్ త్వరలో ఒక నిర్ణయానికి వస్తాయి. బ్యాంకుల ప్రైవేటీకరణపై కేంద్రంతో చర్చలు మరిన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ యత్నాల విషయంలో ఆర్బీఐ ప్రభుత్వంతో చర్చలు జరుపుతోంది. ఈ ప్రక్రియ కొనసాగుతుంది. బ్యాంకింగ్ పటిష్టంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇందుకు పటిష్ట మూలధనం అవసరం. నైతిక విలువలతో కూడిన పాలనా వ్యవస్థలు ఉండాలి. నాలుగు కేటగిరీల్లో వచ్చే దశాబ్ద కాలంలో విభిన్న బ్యాంకింగ్‌రంగాన్ని భారత్ చూడబోతోంది. పోటీతత్వం, సామర్థ్యం వంటి అంశాలకు ప్రాధాన్యత ఉంటుంది. భవిష్యత్ నాలుగు రకాల బ్యాంకులను చూస్తే... మొదటిగా పెద్ద బ్యాంకులు దేశీయంగా, అంతర్జాతీయంగా కార్యకలాపాలు నిర్వహిస్తాయి. రెండవది... మధ్య తరహా బ్యాంకులు దేశ వ్యాప్తంగా ఆర్థి క సేవలు అందిస్తాయి. మూడవ బ్యాంకింగ్ విభాగంలో చిన్న ఫైనాన్స్ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకులు చిన్న రుణ గ్రహీతల అవసరాలను నెరవేర్చడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇక నాల్గవ రకం బ్యాంకింగ్‌లో డిజిటల్ ప్లేయర్స్ ఉంటాయి. ప్రత్యక్షంగాకానీ, బ్యాంకుల ద్వారాకానీ, ఏజెంట్లు, సంఘాల ద్వారాకానీ కస్టమర్‌కు ఇవి సేవలను అందిస్తాయి. సామర్థ్యం, పోటీతత్వం ప్రధాన అంశాలుగా బ్యాంకులు, చిన్న ఫైనాన్స్ బ్యాంకులు పేమెంట్ బ్యాంకులకు లైసెన్సింగ్ విధానం తీసుకురావడం ఒక కీలకమైన అడుగు. -
‘మొండి’ భారం రెట్టింపు!
ముంబై: కోవిడ్–19 ప్రేరిత సవాళ్ల నేపథ్యంలో భారత్ బ్యాంకింగ్‌పై మొండిబకాయిల (ఎన్పీఏ) భారం తీవ్రతరం కానుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్వైవార్షిక ద్రవ్య స్థిరత్వ నివేదిక (ఎఫ్ఎస్ఆర్) పేర్కొంది. ఎన్పీఏలకు సంబంధించి కనిష్ట ప్రభావం మేరకు చేసినా, మొత్తం రుణాల్లో మొండిబకాయిల భారం సెప్టెంబర్ నాటికి 13.5 శాతానికి చేరుతుందని సోమవారం నాడు వెలువడిన నివేదిక పేర్కొంది. ప్రభావం తీవ్రంగా ఉంటే ఏకంగా ఇది 14.8 శాతానికి ఎగసే అవకాశం ఉందని తెలిపింది. ఇదే జరిగితే గడచిన 25 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంత తీవ్ర మొండిబకాయిల భారం బ్యాంకింగ్‌పై ఉంటుంది. 2020 సెప్టెంబర్ నాటికి బ్యాంకింగ్‌పై ఎన్పీఏ భారం 7.5 శాతం. అప్పటి నుంచీ చూస్తే, కనీసమయినా ఎన్పీఏలు 600 బేసిస్ పాయింట్లు (6 శాతం) అయినా పెరుగుతుందన్నమాట. నివేదిక ప్రకారం... ► ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ) మొండిబకాయిలు 2021 సెప్టెంబర్ నాటికి కనీస స్థాయిలో 9.7– 16.2% శ్రేణిలో ఉండే వీలుంది. ప్రైవేటు బ్యాంకింగ్ విషయంలో ఈ శ్రేణి 4.6–7.9% శ్రేణిలో ఉండవచ్చు. ఫారిన్ బ్యాంకుల విషయంలో ఈ శ్రేణి 2.5–5.4% శ్రేణిలో ఉండే వీలుంది. ► ఇక తీవ్ర స్థాయిల్లో పీఎస్బీ, ప్రైవేట్, ఫారిన్ బ్యాంకుల విషయంలో ఎన్పీఏలు వరుసగా 17.6 శాతం, 8.8 శాతం, 6.5 శాతం శ్రేణిలో ఉండే అవకాశం ఉంది. మరింత స్పష్టత అవసరం! ఎన్పీఏల విషయలో నిజానికి మరింత స్పష్టత రావాల్సి ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆర్థిక వ్యవస్థ క్షీణతలోకి జారిపోవడం, ఉపాధి అవకాశాలు కోల్పోవడం, రుణాలు తీర్చడంలో ఆలస్యం లేదా మొత్తంగా విఫలంకావడం వంటి ఎన్నో అంశాలు దీనికి కారణంగా ఉన్నాయి. ఈఎంఐల చెల్లింపులపై మారటోరియం, అసెట్ వర్గీకరణలో యథాతథ స్థితి, రుణ పునర్ వ్యవస్థీకరణ, తాజా రుణాల పరిస్థితి, కొన్ని అకౌంట్లను మొండిబకాయిలుగా ప్రకటించవద్దంటూ అక్టోబర్ 3న సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల వంటి ఎన్నో అంశాలూ మొండిబకాయిలపై ఇంకా స్పష్టత లేకుండా చేస్తున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బ్యాంకుల బ్యాలెన్స్ షీట్ పరిస్థితి, రుణాలు ఎన్పీఏలుగా మారే అకాశాలు, లాభదాయకత, మూలధనం సహా బ్యాంకులు సమర్పించిన తత్సబంధ గణాంకాల ప్రాతిపదికన తాజా ‘స్ట్రెస్ టెస్ట్’ అంచనాలను వెలువరిస్తున్నట్లు నివేదిక తెలిపింది. 1996–1997లో బ్యాంకింగ్‌పై ఎన్పీఏ భారం 15.7%. గడచిన ఏడాది జూలైలో ఆర్బీఐ ఎఫ్ఎస్ఆర్ను ఆవిష్కరించింది. 2021 మార్చి నాటికి ఎన్పీఏలు 12.5 –14.7% శ్రేణిలో ఉంటాయని అప్పట్లో నివేదిక పేర్కొంది. వ్యవస్థలోకి రూ.2లక్షల కోట్లు... బ్యాంకింగ్‌లో మరింత ద్రవ్య లభ్యతకు (లిక్విడిటీ) వీలు కల్పిస్తూ రెపో చర్యలకు ఆర్బీఐ శ్రీకారం చుడుతోంది. రానున్న పక్షం రోజుల్లో రూ. 2 లక్షల కోట్ల రివర్స్ రెపో లావాదేవీల ద్వారా రూ.2 లక్షల కోట్లను బ్యాంకింగ్ వ్యవస్థలోకి విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. బ్యాంకింగ్ వ్యాపార నమూనా మారాలి... నియంత్రణాపరంగా ఇచ్చిన వెసులుబాటును వెనక్కు తీసుకుంటే, ఇది బ్యాంకింగ్ బ్యాలెన్స్ షీట్లపై అలాగే మూలధనంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. తగిన లిక్విడిటీ, ఫైనాన్షియల్ పరిస్థితులు బ్యాంకుల ద్రవ్య ప్రమాణాలను ప్రస్తుతం నిలబెడుతున్నాయి. అయితే గణాంకాలనులోతుగా విశ్లేషిస్తే, ఒత్తిడి తీవ్రను గుర్తించవచ్చు. మూలధనాన్ని పెంచుకోడానికి ప్రస్తుత పరిస్థితులను బ్యాంకులు అనుకూలంగా మలచుకోవాలి. అలాగే తమ వ్యాపార నమూనాలను మార్చుకోవాలి. ఈ చర్యలు భవిష్యత్ భద్రతకు భరోసాను అందిస్తాయి. కేంద్రం ఆదాయాలు తగ్గుతుండడం, మార్కెట్ నుంచి మరిన్ని రుణ సమీకరణకు (2020–21లో రూ.7 లక్షల కోట్ల రుణ సమీకరణ బడ్జెట్ లక్ష్యంగా పెట్టుకోగా దానిని రూ.12 లక్షల కోట్లకు సవరించడం జరిగింది) ప్రభుత్వం ఇష్టపడకపోవడం వంటి అంశాలు బ్యాంకులపై భవిష్యత్తులో మూలధన సంబంధ ఒత్తిడులను పెంచే అవకాశం ఉంది. ఫైనాన్షియల్ అసెట్స్‌లో విలువల అసమతౌల్యతలు ఫైనాన్షియల్ స్థిరత్వానికి ఇబ్బందులు సృష్టించే అవకాశం ఉంది. ఆయా పరిస్థితులన్నింటినీ గమనంలోకి తీసుకుంటూ ఎటువంటి ఇబ్బందులు తలెత్తినా తట్టుకునే విధంగా తగిన చర్యలు తీసుకోవాలి. – ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ‘నివేదికలో ముందుమాట’ -
ఎక్కడి ‘రేట్లు’ అక్కడే!
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష మార్కెట్ అంచనాలకు అనుగుణంగా సాగింది. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపోను 4 శాతంగానే కొనసాగించాలని శుక్రవారం వరకూ వరుసగా మూడు రోజులుగా సాగిన గవర్నర్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) ఏకగ్రీవంగా నిర్ణయించింది. సెప్టెంబర్ త్రైమాసికంలో ధరల స్పీడ్ (2019 ఇదే కాలంలో పోల్చి) ఎక్కువగానే ఉందని అభిప్రాయపడ్డ విధాన ప్రకటన తరువాతి త్రైమాసికాల్లో ఇది దిగివస్తుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఆయా అంశాల నేపథ్యంలో దేశ ఆర్థిక వృద్ధికి దోహదపడేందుకు వీలుగా సరళతర ద్రవ్య విధానాన్నే కొనసాగించనున్నట్లు వెల్లడించింది. తద్వారా వడ్డీరేట్లు మరింత తగ్గేందుకే అవకాశం ఉందని మార్కెట్‌కు సూచించింది. ఈ ఏడాది మార్చి తరువాత 115 బేసిస్ పాయింట్ల (100 బేసిస్ పాయింట్లు 1%) రెపోరేటు తగ్గించిన ఆర్బీఐ, ద్రవ్యోల్బణం ఇబ్బందులతో ఆగస్టులో యథాతథ విధానాన్ని ప్రకటించింది. తాజా సమీక్షలోనూ ఇదే విధానాన్ని కొనసాగించింది. 2021 ఏప్రిల్–జూన్‌లో 20.6 శాతం వృద్ధి! ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020 ఏప్రిల్–2021 మార్చి) ఎకానమీ 9.5 శాతం క్షీణిస్తుందని అంచనావేసింది. 2020–21 తొలి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) 23.9 శాతం క్షీణతను ప్రస్తావిస్తూ, సెప్టెంబర్ , డిసెంబర్ త్రైమాసికాల్లోనూ క్షీణ రేటే నమోదవుతుందని అంచనా. ఈ క్షీణ రేట్లను వరుసగా 9.8 శాతం, 5.6 శాతంగా లెక్కగట్టింది. అయితే చివరి త్రైమాసికం అంటే జనవరి–మార్చి త్రైమాసికంలో స్వల్పంగా 0.5 శాతం ఆర్థికాభివృద్ధి నమోదవుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. ఇక వచ్చే ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో (2021 ఏప్రిల్–2021 జూన్) భారీగా 20.6 శాతం వృద్ధి నమోదవుతుందని భావిస్తోంది. ఇప్పటికే పలు ఆర్థిక, రేటింగ్ సంస్థలు వచ్చే ఆర్థిక సంవత్సరం వృద్ధి నమోదవుతుందని పేర్కొన్నాయి. అయితే ఇందుకు బేస్ ఎఫెక్ట్ (2020లో దారుణ పతన స్థితి) మరీ తక్కువగా ఉండడం కారణమని ఆయా సంస్థలు విశ్లేషిస్తున్నాయి. వ్యవసాయ రంగం ఆర్థిక వ్యవస్థకు చక్కటి తోడ్పాటును అందిస్తుందని విధాన కమిటీ అంచనావేసింది. మొత్తంగా చూస్తే, కరోనా వైరస్‌పై పోరులో భారత్ ఆర్థిక వ్యవస్థ నిర్ణయాత్మక దశలోకి ప్రవేశించిందని, కరోనా కట్టడితోపాటు ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణపైనా ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన తక్షణ అవసరం ఉందని పేర్కొంది. ద్రవ్యోల్బణం దిగివస్తుంది సెప్టెంబర్ త్రైమాసికంలో ద్రవ్యోల్బణం తీవ్రంగా ఉన్నా, డిసెంబర్, మార్చి త్రైమాసికాల్లో లక్ష్యాల మేరకు దిగివచ్చే అవకాశాలు ఉన్నాయి. తొలి అంచనాల ప్రకారం, సెప్టెంబర్ త్రైమాసికంలో వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 6.8 శాతం. (ఆర్బీఐకి కేంద్రం నిర్దేశాల ప్రకారం ఈ రేటు మైనస్ 2 లేదా ప్లస్ 2తో 4 శాతం వద్ద కొనసాగాలి. సరఫరాలు– డిమాండ్ మధ్య అసమతౌల్యత కారణంగా ద్రవ్యోల్బణం తీవ్రంగా ఉంది. అయితే వచ్చే త్రైమాసికాల్లో ఈ సమస్య తగ్గుతుంది. దీనికితోడు వ్యవసాయ రంగం పరిస్థితి కూడా ఆశాజనకంగా ఉంది. వెరసి డిసెంబర్ త్రైమాసికంలో (క్యూ3) 5.4 శాతానికి, మార్చి త్రైమాసికంలో (క్యూ4) 4.5 శాతానికి ద్రవ్యోల్బణం దిగివస్తుందన్న అంచనాలను వెలువరించింది. క్యూ3లో 3.2–5.9 శాతం శ్రేణి ఉంటే, క్యూ4లో ఈ శ్రేణి 2.4–6.6 శాతం మధ్య ఉంటుందని ఆర్బీఐ భావిస్తోంది. చిన్న పరిశ్రమలకు ఊరట రిటైల్ రుణ గ్రహీతలు, లఘు, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు రుణాలు అందించే విషయంలో బ్యాంకులకు మరింత వెసులుబాటు లభించింది. ఇందుకు సంబంధించిన పరిమితిని (ఫండ్ అండ్ నాన్–ఫండ్ ఆధారిత) రూ.5 కోట్ల నుంచి రూ.7.5 కోట్లకు పెంచింది. దీనికితోడు ఈ రుణాల మంజూరీకి సంబంధించి మూడవ పార్టీ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీల (సీఆర్ఏలు) నుంచి బ్యాంక్ లోన్ రేటింగ్ (బీఎల్ఆర్)ను బ్యాంకులకు పొందాల్సిన అవసరం లేదు. ఎగుమతిదారులకు వరం ఎగుమతిదారుల ప్రయోజనాలకు పెద్దపీటవేస్తూ, సిస్టమ్ ఆధారిత ఆటోమేటిక్ కాషన్ లిస్టింగ్‌ను మినహాయించింది. దీనివల్ల విదేశీ కొనుగోలుదారులతో ఎగుమతిదారులు మరింత మెరుగైన రీతిన లావాదేవీలు నిర్వహించగలుగుతారు. అలాగే ఎగుమతుల ద్వారా సముపార్జించిన మొత్తాన్ని మరింత సులభతరమైన రీతిలో అందుకోగలుగుతారు. 2016లో ప్రవేశపెట్టిన ఆటోమేషన్ ఆఫ్ ఎక్స్పోర్ట్ డేటా ప్రాసెసింగ్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ (ఈడీపీఎంఎస్)– ‘కాషన్/డీ–కాషన్ లిస్టింగ్ ప్రకారం... రెండేళ్లు పైబడిన షిప్పింగ్ బకాయిల విషయంలో ఎగుమతిదారుడు కొన్ని ప్రతికూల పరిస్థితును ఎదుర్కొనాల్సి ఉంటోంది. కరోనా కష్టకాలంలో ఎగుమతిదారుపై మరిన్ని నియంత్రణలు తగదని ఆర్బీఐ పాలసీ భావిస్తోంది. ద్రవ్య లభ్యతకు ఢోకా ఉండదు ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య లభ్యత (లిక్విడిటీ) ఎటువంటి విఘాతం కలగకుండా చర్యలు ఉంటాయి. వచ్చే వారం ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ (వోఎంవో) వేలం ద్వారా రూ.20,000 కోట్లను బ్యాంకింగ్ వ్యవస్థలోకి ప్రవేశపెట్టడం జరుగుతుంది. అలాగే రూ.లక్ష కోట్లను అందుబాటులో ఉంచడానికి వీలుగా మూడేళ్ల కాలపరిమితితో దీర్ఘకాలిక రెపో చర్యలను (టీఎల్టీఆర్ఓ) ఆర్బీఐ తీసుకుంటుంది. ఇందుకుగాను ఫ్లోటింగ్ రేటును మార్చి 31, 2021 వరకూ ఉండే పాలసీ రెపో రేటుతో అనుసంధానించడం జరుగుతుంది. దిశా నిర్దేశం... విధాన నిర్ణయం వృద్ధి పునరుద్ధరణకు తగిన మార్గదర్శకాన్ని సూచించింది. ఆర్థిక వ్యవస్థను పాలసీ ప్రతిబింబిస్తోంది. ‘అధికారిక నిర్ణయాల’ ప్రాతిపదికన కాకుండా, ‘దిశా నిర్దేశం’ ప్రాతిపదికన వృద్ధికి ఊతం ఇవ్వాలని పాలసీ భావిస్తోంది. – దినేష్ కుమార్ ఖారా, ఎస్బీఐ చైర్మన్ మరోదఫా రేటు కోత విధాన నిర్ణయాలను పరిశీలిస్తే, డిసెంబర్లో లేదా ఫిబ్రవరి పాలసీ సమీక్ష సందర్భంగా రెపో రేటు కోత అవకాశం ఉంది. ద్రవ్య లభ్యత విషయంలో ఎటువంటి ఇబ్బందిలేని పరిస్థితిపై పరపతి విధాన కమిటీ దృష్టి సారించినట్లు కనిపిస్తోంది. – అభీక్ బారువా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ చీఫ్ ఎకనమిస్ట్ రియల్టీకి సానుకూలం గృహ రుణాలపై రిస్క్ వెయిటేజ్ హేతుబద్దీకరణ రియల్టీకి సానుకూల అంశం. ఈ రంగంలో రుణ లభ్యత పెరగడానికి ఈ నిర్ణయం దోహదం చేస్తుంది. అయితే పరిశ్రమ పురోగతికి, డిమాండ్ పెరగడానికి మరిన్ని చర్యలు తీసుకోవాల్సి ఉంది. – సతీష్ మగార్, క్రెడాయ్ నేషనల్ ప్రెసిడెంట్ వృద్ధికి మార్గం... వృద్ధి రికవరీ దిశలో ఆర్బీఐ తగిన నిర్ణయాలను తీసుకుంది. ద్రవ్య లభ్యత, ఎగుమతులు, రుణ వృద్ధి పలు అంశాలకు సంబంధించి తీసుకున్న నిర్ణయాలు ఆయా రంగాలకు ఊరటనిస్తాయి. ముఖ్యంగా మరోదఫా రేటు కోతకు అనుగుణమైన విధానం హర్షణీయం. – చంద్రజిత్ బెనర్జీ, సీఐఐ డైరెక్టర్ జనరల్ ఆర్టీజీఎస్ సేవలు ఇక 24x7 డిసెంబర్ నుంచి అమల్లోకి ముంబై: భారీ స్థాయిలో నగదు బదిలీ లావాదేవీలు నిర్వహించే వ్యాపార వర్గాలకు ఊరటనిచ్చే దిశగా రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ సిస్టమ్ (ఆర్టీజీఎస్) విధానాన్ని ఏడాది పొడవునా, ఇరవై నాలుగ్గంటలూ అందుబాటులోకి తేనున్నట్లు రిజర్వ్ బ్యాంక్ వెల్లడించింది. డిసెంబర్ నుంచి ఇది అమలవుతుందని పేర్కొంది. ప్రస్తుతం ప్రతి నెలా రెండు, నాలుగో శనివారం మినహా వారంలోని అన్ని పని దినాల్లో ఉదయం 7 గం. నుంచి సాయంత్రం 6 గం. దాకా ఆర్టీజీఎస్ సర్వీసులు అందుబాటులో ఉంటున్నాయి. ‘భారీ స్థాయి చెల్లింపుల వ్యవస్థను ఇరవై నాలుగ్గంటలూ అందుబాటులో తెచ్చిన అతి కొద్ది దేశాల సరసన భారత్ కూడా నిలుస్తుంది‘ అని మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశం అనంతరం ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. రూ. 2 లక్షల పైబడిన ఆర్థిక లావాదేవీలకు ఆర్టీజీఎస్ విధానాన్ని, రూ. 2 లక్షల లోపు లావాదేవీలకు నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ (నెఫ్ట్) విధానాన్ని ఉపయోగిస్తున్నారు. 2019 డిసెంబర్ నుంచి నెఫ్ట్ ఏడాది పొడవునా, ఇరవై నాలుగ్గంటలూ అందుబాటులోకి వచ్చింది. మరోవైపు లైసెన్సింగ్ సంబంధ అనిశ్చితిని తగ్గించేందుకు పేమెంట్ సిస్టమ్ ఆపరేటర్లకు ఇచ్చే ఆథరైజేషన్ సర్టిఫికెట్ (సీవోఏ)ను సుదీర్ఘకాలం వర్తించేలా చర్యలు తీసుకోనున్నట్లు ఆర్బీఐ తెలిపింది. గృహ రుణాలపై రిస్క్ వెయిటేజ్ హేతుబద్దత గృహ రుణాలకు సంబంధించి రిస్క్ (మొండిబకాయిగా మారే అవకాశాలు) వెయిటేజ్‌ని ఆర్బీఐ హేతుబద్దీకరించింది. అన్ని కొత్త గృహ రుణాలకు సంబంధించి రిస్క్ వెయిటేజ్ ఇకపై ఒకేగాటన కాకుండా, ‘లోన్ టూ వ్యాల్యూ నిష్పత్తి’కి అనుసంధానమై ఉంటుంది. ఇందుకు అనుగుణమైన విధంగా రుణ గ్రహీతలు వివిధ సంస్థల నుంచి తగిన వడ్డీరేటు ప్రయోజనాలు పొందవచ్చు. కొత్త విధానం 2022 మార్చి 31వ తేదీ వరకు అమల్లో ఉంటుంది. కరోనా.. క్రికెట్.. ఆర్బీఐ పాలసీ.. ఆర్బీఐ గవర్నర్ దాస్ ప్రకటనలో క్రికెట్ పరిభాష ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) జరుగుతున్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ పాలసీ ప్రకటనలో ఈసారి క్రికెట్ పరిభాష కూడా చోటు దక్కించుకుంది. రికవరీ ప్రక్రియ, వివిధ రంగాల పరిస్థితుల గురించి ఉటంకిస్తూ .. ఆఖరి ఓవర్లు, ఖాతా తెరవడం, ఇన్నింగ్స్ కాపాడుకోవడం వంటి పదాలను దాస్ ప్రస్తావించారు. కరోనా వైరస్ బారిన పడ్డ ఎకానమీ కోలుకునే ప్రక్రియను వివరించే ప్రయత్నం చేస్తూ ‘నా అభిప్రాయం ప్రకారం రికవరీ మూడంచెలుగా ఉండవచ్చు. కరోనాను కూడా తట్టుకుని నిలబడిన రంగాలను అన్నింటికన్నా ముందుగా ’పరుగుల ఖాతా తెరిచిన’ వాటిగా పరిగణించవచ్చు. వ్యవసాయం, ఎఫ్ఎంసీజీ, వాహనాలు, ఫార్మా మొదలైనవి ఈ కేటగిరీలోకి వస్తాయి. మాంచి ‘స్ట్రైక్ ఫామ్’లో ఉన్నవి రెండో కోవలోకి వస్తాయి. కార్యకలాపాలు క్రమంగా మళ్లీ సాధారణ స్థాయికి వస్తున్న రంగాలు ఇందులో ఉంటాయి. ఇక ‘ఆఖరు ఓవర్లను’ (తీవ్ర ఒత్తిడిని) ఎదుర్కొని బరిలో నిల్చి, ఇన్నింగ్స్‌ను కాపాడే రంగాలు మూడో కేటగిరీలోకి వస్తాయి. సామాజిక దూరం వంటి నిబంధనలతో తీవ్రంగా దెబ్బతిన్న రంగాలు ఇందులో ఉన్నాయి’ అని దాస్ పేర్కొన్నారు. -
ఆర్బీఐ ఎంపీసీ సమావేశం వాయిదా
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశం వాయిదా పడింది. తదుపరి సమావేశ తేదీలను తరువాత ప్రకటించడం జరుగుతుందని ఆర్బీఐ నోటిఫికేషన్ ఒకటి తెలిపింది. మంగళవారం నుంచి మూడు రోజులపాటు (సెప్టెంబర్ 29, 30, అక్టోబర్ 1) ఈ కీలక భేటీ జరగాల్సి ఉంది. కమిటీలో స్వతంత్ర సభ్యుల నియామకంలో జరిగిన ఆలస్యం, దీనితో సమావేశం నిర్వహణకు సంబంధించి పాల్గొనాల్సిన కనీస సభ్యుల సంఖ్య (కోరమ్) తగ్గే అవకాశాలు ఏర్పడ్డం వంటి అంశాలు ఎంపీసీ సమావేశం వాయిదాకు కారణమని తెలుస్తోంది. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు రెపో (ప్రస్తుతం 4 శాతం)సహా ఆర్థిక రంగానికి సంబంధించి పలు కీలక నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల సమావేశం తీసుకునే కీలక సాంప్రదాయం 2016 అక్టోబర్ నుంచీ ప్రారంభమైంది. ఇందులో సగం మంది సభ్యులు బయటివారు(ఎక్స్టర్నల్). అలాగే కమిటీలో వీరు స్వతంత్ర సభ్యులుగా ఉంటారు. ఈ ముగ్గురు సభ్యుల బాధ్యతల కాలం నాలుగేళ్లు. గత నెలతో వీరి పదవీకాలం ముగిసిపోయింది. అయితే కొత్తవారి నియామకం జరగలేదు. పాతవారి పునఃనియామకం అవకాశం ఉండదు. సమావేశంలో కనీసం నలుగురు సభ్యులు పాల్గొనాల్సి ఉంది. గవర్నర్ లేదా కమిటీలో సభ్యులుగా ఉన్న ఆయన డిప్యూటీ (పరపతి విధానం ఇన్చార్జ్) సమావేశంలో తప్పనిసరిగా పాల్గొనాల్సి ఉంటుంది. కమిటీలో ఆర్బీఐ తరఫున సెంట్రల్ బోర్డ్ నియమించిన మరో సీనియర్ అధికా రి కూడా సభ్యులుగా ఉంటారు. బయటి నుంచి కొత్తగా ముగ్గురు సభ్యులను నియమించేందుకు ఈ ఏడాది మొదట్లో ఒక కమిటీ ఏర్పాటైంది. క్యాబినెట్ కార్యదర్శి, ఆర్బీఐ గవర్నర్, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. ఆగస్టు 4వ తేదీ నుంచి 6వ తేదీ వరకూ ఎంపీసీ చివరి 24వ సమావేశం జరిగింది. -
రూపాయికి ‘శక్తికాంత్’ బలం
ముంబై: కరోనా నేపథ్యంలో ఏర్పడిన తీవ్ర ఆర్థిక పరిస్థితులను ఎదుర్కొనడంలో తమ వద్ద ఉన్న అస్త్రాలు అయిపోలేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంతదాస్ చేసిన ప్రకటన భారత కరెన్సీ– రూపాయికి బలాన్ని ఇచ్చింది. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ ఒకేరోజు 48 పైసలు బలపడింది. 73.82 వద్ద ముగిసింది. దేశంలోకి కొనసాగుతున్న విదేశీ నిధుల ప్రవాహం, దేశీయ సానుకూల ఈక్విటీ మార్కెట్, ఆరు కరెన్సీలతో ట్రేడయ్యే డాలర్ బలహీనత వంటి అంశాలూ రూపాయి సెంటిమెంట్‌ను బలపరిచాయని ఫారెక్స్ ట్రేడర్లు తెలిపారు. 74.30 వద్ద రూపాయి ట్రేడింగ్ ప్రారంభమైంది. 73.81–74.36 శ్రేణిలో కదలాడింది. రూపాయికి ఇప్పటి వరకూ ఇంట్రాడే కనిష్ట స్థాయి 76.92 (2020, ఏప్రిల్ 22వ తేదీ). ముగింపులో రికార్డు పతనం 76.87 (2020, ఏప్రిల్ 16వ తేదీ). -
మరిన్ని అస్త్రాలు రెడీ..!
ముంబై: కరోనా వైరస్ వల్ల ఏర్పడిన ఆర్థిక ప్రతికూల పరిస్థితులపై పోరు విషయంలో రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) అస్త్రాలు అయిపోలేదని గవర్నర్ శక్తికాంతదాస్ స్పష్టం చేశారు. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు రెపో (ప్రస్తుతం 4 శాతం)సహా తగిన చర్యలన్నింటినీ సకాలంలో తీసుకోడానికి ఆర్బీఐ సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. తగిన సమయంలో చర్యలు తీసుకోడానికి అవసరమైన విధానాలు ఆర్బీఐ దగ్గర ఉన్నాయని సూచించిన ఆయన, అయితే వీటిని వినియోగించడానికి తగిన సమయం కోసం సెంట్రల్ బ్యాంక్ వేచిచూస్తుందని తెలిపారు. ఈ నెల 6వ తేదీ ద్రవ్య, పరపతి విధాన ప్రకటన సందర్భంగా రెపో రేటును యథాతథంగా కొనసాగించాలన్న ఆర్బీఐ నిర్ణయాన్నీ ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. సరళతర ద్రవ్య, పరపతి విధానానంవైపే ఆర్బీఐ ఇప్పటికీ మొగ్గుచూపుతోందని ప్రకటించిన ఆయన, అవసరమైన సమయంలో ఈ మేరకు రేటు కోత నిర్ణయాలు ఉంటాయని సూచించారు. ప్రస్తుత అనిశ్చితి పరిస్థితుల్లో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ), ద్రవ్యోల్బణంపై ఒక అంచనాకు రాలేకపోతున్నామని ఆయన వెల్లడించారు. కరోనా ప్రభావం తగ్గడంతోనే దీనిపై ఒక నిర్ణయానికి రాగలమని పేర్కొన్నారు. ఒక ఫైనాన్షియల్ దినపత్రిక నిర్వహించిన వెబినార్‌లో ఆయన చేసిన ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... ► రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలు ఆర్థిక వ్యవస్థపై పనిచేయడం లేదనీ, వడ్డీరేట్లు పెరిగే అవకాశాలే కనిపిస్తున్నాయని ఈ పరిస్థితి మాంద్యానికి దారితీస్తుందని పేర్కొనడం సరికాదు. ఇలాంటి ప్రతికూల పరిస్థితులు ఏవీ చోటుచేసుకోకుండా తగిన చర్యలు ఉంటాయి. తగిన సమయంలో రెపోరేటు కోత నిర్ణయం ఉంటుంది. ► వడ్డీరేట్ల తగ్గింపు ఆర్థిక వ్యవస్థ పురోభివృద్ధికి దోహదపడుతుంది. రేటు కోత ప్రయోజనాన్ని కస్టమర్లకు బదలాయించడానికి బ్యాంకులు మరిన్ని చర్యలు తీసుకోవాలి. ► కోవిడ్–19 సంక్షోభాన్ని ఎదుర్కొనడానికి కేంద్రం చర్యలు పటిష్టంగా ఉన్నాయి. సెంట్రల్ బ్యాంక్ పరిశీలనలోకి వచ్చిన అంశాన్నే నేను చెబుతున్నాను. ► ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీన వ్యూహం హర్షణీయం. భారీ బ్యాలెన్స్ షీట్స్ ఉన్న బ్యాంకుల వల్ల ప్రయోజనం ఉంటుంది. గ్లోబల్ బ్యాంకులకు భారత్ బ్యాంకింగ్ పోటీ ఇవ్వగలుగుతుంది. ► మొండిబకాయిలను దృష్టిలో ఉంచుకుని రుణాల మంజూరు, పంపిణీ విషయంలో బ్యాంకింగ్ మరీ ఆందోళన చెందాల్సిన పనేమీలేదు. అది ‘‘తనంతట తానుగా ఓడిపోవడం లాంటిదే. (రుణ వృద్ధి రేటు 6 శాతం దిగువకు పడిపోవడం వల్ల మొండిబకాయిల భయాలతో బ్యాంకులు మరీ భయపడిపోయి, రుణ మంజూరీలకు వెనుకడుగువేస్తున్నాయా అని పలువురు అనుమానాలు వ్యక్తం చేసిన నేపథ్యం). ఇలాంటి ధోరణి వల్ల బ్యాంకింగ్ తన ఆదాయ వనరులను తానే అడ్డుకున్నట్లు అవుతుంది. దీనితో తన కనీస అవసరాలను సైతం సమీకరించుకోలేకపోతుంది. ఇలాంటి ధోరణి బ్యాంకింగ్‌లో ఎంతమాత్రం మంచిదికాదు. ► రుణాల మంజూరీకి ముందు ఆయా వ్యాపారాల పరిస్థితి ఎలా ఉందన్న విషయాలను ఒక్కసారి గమనించండి. దీనివల్ల రుణాలు పొందే విషయాల్లో జరిగే మోసాలను ముందు పసిగట్టవచ్చు. 2018–19లో రూ.71,500 కోట్ల బ్యాంకింగ్ మోసాలు జరిగితే, అటు తర్వాత 2020 జూన్ నాటికి ఈ మొత్తం రూ.1.85 లక్షల కోట్లకు చేరాయి. ► భారత్ బ్యాంకింగ్ వ్యవస్థ ఎప్పుడూ పటిష్టంగా, స్థిరంగా కొనసాగుతోంది. అయితే కోవిడ్–19 నేపథ్యంలో బ్యాంకింగ్ వద్ద మూలధన సమస్యలు తలెత్తాయి. ► ఈ నెలాఖరుతో ముగిసిపోనున్న ‘‘మారటోరియం’’ తాత్కాలిక పరిష్కార మార్గమే. దీనిని దీర్ఘకాలికంగా కొనసాగించలేము. ఆరు నెలల మారటోరియం ముగిసిపోతే, మొండిబకాయిలు భారీగా పెరిగిపోతాయన్న ఆందోళన ఉంది. అయితే ఒక కొత్త ప్రణాళిక కింద కొత్త మారటోరియం విధానం తీసుకురావడం, లేదా అవసరాలకు అనుగుణంగా ప్రస్తుత మారటోరియంనే కొనసాగించడం వంటి చర్యలను బ్యాంకులు చేపట్టవచ్చు. ► కంపెనీల రుణ పునర్వ్యవస్థీకరణ విషయంలో నియమించిన నిపుణుల కమిటీ త్వరలో తన సిఫారసులను చేయనుంది. అనంతరం ఈ విషయంలో అనుసరించాల్సిన విధానాలను సెప్టెంబర్ 6 లోపు ప్రకటిస్తాం. రుణానికి–డిమాండ్‌కు సంబంధం... రుణ వృద్ధికీ, డిమాండ్‌కు సంబంధం ఉంటుంది. గతంలో వలెనే బ్యాంకింగ్ ఇప్పుడూ రుణాలు ఇవ్వడం లేదన్న సాధారణ అభిప్రాయాన్ని గవర్నర్ తెలియజేశారు. అయితే రుణానికి డిమాండ్ తగినంతలేదు. పెట్టుబడులు తక్కువగా ఉన్న పరిస్థితులు, ఆర్థిక వ్యవస్థ పరిస్థితులు దీనికి నేపథ్యం. – రజ్నీష్ కుమార్, ఎస్బీఐ చైర్మన్ డిమాండ్ లేకపోవడమే ఇబ్బంది... రుణాల మంజూరీకి బ్యాం కులు వెనుకంజ వేయడం లేదు. డిమాండ్ లేకపోవడమే అసలు సమస్య. 2016లో మొండిబకాయిలపై ఆర్బీఐ కఠిన నిబంధనలు తెచ్చిననాటి సమస్య మొదలైంది. దివాలా కోడ్ (ఐబీసీ) పరిస్థితిని ఇంకాస్త దిగజార్చింది. ఇప్పుడు కరోనా మిగిలిన డిమాండ్‌ను చంపేసింది. – ఎస్ మల్లిఖార్జున రావు, పీఎన్బీ సీఈఓ బ్యాంకింగ్‌ను అనడం సరికాదు... రుణాలు ఇవ్వడానికి భయపడిపోవద్దని చెబుతూ, ఈ విషయంలో బ్యాంకింగ్‌పైనే ఎందుకు బాధ్యత పెడుతున్నారో నాకు తెలియడంలేదు. మేము మంచి ప్రాజెక్టులకే రుణాలను ఇస్తున్నాము. ఇక్కడ ఏ బ్యాంకునూ అనడానికి లేదు. రుణాలను తేలిగ్గా మంజూరు చేసే మొత్తం వ్యవస్థే దెబ్బతింది. – రాజ్‌కిరణ్ రాయ్, యూనియన్ బ్యాంక్ సీఈఓ మా బ్యాంక్‌లో 20 శాతం వృద్ధి... జూన్ త్రైమాసికంలో మా బ్యాంక్ కీలక వడ్డీ ఆదాయంలో 20 శాతం వృద్ధిని నమోదుచేసింది. బ్యాంక్ భారీ రుణ వృద్ధిని ఇది ప్రతిబింబిస్తోంది. ఇక్కడ రుణాల మంజూరీ విషయంలో వెనుకంజవేయడమనే ప్రశ్నేలేదు. బ్యాంకింగ్ పటిష్ట, సమర్థవంతమైన విధానాలను అవలంబించడమే కీలకం. – ఆదిత్య పురి, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సీఈఓ -
ఫైర్ పవర్ తగినంత ఉంది : శక్తికాంత దాస్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుత కరోనా సంక్షోభ సమయంలో ఆర్థిక పరిస్థితిని అదుపులో ఉంచేందుకు తగిన శక్తి సామర్థ్యాలు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వద్ద మెండుగా ఉన్నాయని, మొత్తంమీద భారత బ్యాంకింగ్ వ్యవస్థ ధృఢంగానే ఉందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ గురువారం వెల్లడించారు. ఈ సంక్షోభం ముగిసిన అనంతరం ఆర్థిక స్థిరీకరణకోసం చాలా జాగ్రత్తగా, నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని, సంబంధిత చర్యలను ఆర్బీఐ చేపట్టనుందని స్పష్టం చేశారు. అలాగే బ్యాంకులు తమ ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేసుకోవాలన్నారు. తద్వారా భవిష్యత్తులో కీలక వడ్డీరేటు కోత లుంటాయనే సంకేతాలందించారు. ఒక వెబ్‌నార్ సిరీస్ ఈవెంట్ ముఖ్య ప్రసంగంలో గవర్నర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక వ్యవస్థ రక్షణ చర్యల్ని వెంటనే నిలిపివేయడం లేదని, పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని ఆయన హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆర్బీఐ చర్యల్నినిలిపివేసిందన్నఊహాగానాలకు అర్థం లేదన్నారు. సంబంధిత చర్యలపై ఆర్బీఐ దీర్ఘకాలిక ప్రయోజనాల రీత్యా రేట్లలో మార్పులు చేయాల్సి ఉంటుందన్నారు. కరోనా వ్యాప్తి ఎలా ఉండబోతోందనే దానిపై స్పష్టత రాగానే ద్రవ్యోల్బణం, అభివృద్ధికి సంబంధించిన గణాంకాలను ఆర్బీఐ విడుదల చేస్తుందని శక్తికాంత్ దాస్ పేర్కొన్నారు. రేట్ల కోత అయినా, లేదా ఇతర విధానపరమైన చర్యలయినా ఆర్బీఐ దగ్గర అస్త్రాలు ఇంకా మిగిలే ఉన్నాయంటూ భరోసా ఇచ్చారు. మహమ్మారి కట్టడి అనంతరం ఆర్థిక రంగం సాధారణ స్థితికి చేరుకునేందుకు జాగ్రత్తగా బాటలు వేయాల్సిన అవసరం ఉందని దాస్ ఉద్ఘాటించారు. ఏదేమైనా, ఈ చర్యలను త్వరలోనే ముగిస్తుందని ఏ కోణంలోనూ భావించరాదని ఆయన స్పష్టం చేశారు. అతిగా రక్షణాత్మక వైఖరి అవలంబించడం ద్వారా చివరికి బ్యాంకులకే నష్టం కలుగుతుందని ఆయన చెప్పారు. కరోనా ఒత్తిడిని ఎదుర్కొంటున్న రుణగ్రహీతలకు రిజల్యూషన్ ఫ్రేమ్‌వర్క్ మంచి ఉపశమనం ఇస్తుందని చెప్పారు. లాక్డౌన్ సందర్భంలోరుణాలపై తాత్కాలిక నిషేధం తాత్కాలిక పరిష్కారం మాత్రమేనన్నారు. ఈ సమయంలో బ్యాంకులు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయనేది స్పష్టం..కానీ, ఈ సవాళ్లకు ఎలా స్పందిస్తాయి, ఎలా ఎదుర్కొంటాయినేది కీలకమని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు మహమ్మారిపై కట్టడిలో కేంద్రం ప్రభుత్వం స్పందించిన తీరునున దాస్ ప్రశంసించారు. -
ఎకానమీకి ‘రుణ’ పునరుత్తేజం!
ముంబై: బ్యాంకింగ్ రుణ పునర్వ్యవస్థీకరణ ఆర్థికరంగం పునరుత్తేజానికి దోహదపడుతుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ విశ్లేషించారు. రుణ పునఃచెల్లింపులకు తగిన సమయం కల్పించడం వల్ల ద్రవ్య లభ్యత విషయంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంస్థలకు ఎంతో వెసులుబాటు కలుగుతుందని ఆయన అన్నారు. రుణ పునర్వ్యవస్థీకరణ వల్ల వ్యాపార పునరుద్ధరణ జరుగుతుందని, దీనితో ఉపాధి అవకాశాలకు విఘాతం కలగదని గవర్నర్ అన్నారు. అంతిమంగా ఇది ఆర్థిక వ్యవస్థ పురోగతికి దోహదపడుతుందన్నారు. ఒక వార్తా సంస్థకు ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... ► భారత స్టాక్ మార్కెట్ సర్దుబాటు జరగాలి. వాస్తవ ఆర్థిక పరిస్థితిని మార్కెట్ ప్రతిబింబించడం లేదు. ► ఒకవైపు బ్యాంకుల ఆర్థిక పరిపుష్ఠి ఎంతో ముఖ్యమైన అంశం. మరోవైపు కోవిడ్–19 నేపథ్యంలో తీవ్ర ఒత్తిడిలో ఉన్న చిన్న వ్యాపార సంస్థల ప్రయోజనాల పరిరక్షణా ముఖ్యం. ఈ రెండు అంశాల సమతౌల్యతకు తగిన ప్రయత్నం జరుగుతుంది. ► రుణ చెల్లింపులపై మారటోరియం గడువు ఈ నెలాఖరుతో ముగిసిపోతుంది. ‘‘మారటోరియం’’ అనేది తాత్కాలిక పరిష్కార మార్గమే. దీనిని దీర్ఘకాలికంగా కొనసాగించలేము. ► ఆరు నెలల మారటోరియం ముగిసిపోతే, మొండిబకాయిలు భారీగా పెరిగిపోతాయన్న ఆందోళన ఉంది. అయితే ఒక కొత్త ప్రణాళిక కింద కొత్త మారటోరియం విధానం తీసుకురావడం, లేదా అవసరాలకు అనుగుణంగా ప్రస్తుత మారటోరియంనే కొనసాగించడం వంటి చర్యలు తీసుకోడానికి బ్యాంకులకు తగిన సౌలభ్యత ఉంటుంది. ► కరోనా వైరస్ నేపథ్యంలో సవాళ్లను ఎదుర్కొంటున్న ఆర్థిక వ్యవస్థకు మద్దతునివ్వడానికి పాలనా, అధికార యంత్రాంగం తగిన ప్రయత్నాలు అన్నీ చేస్తోంది. మొండిబకాయిలు 2 దశాబ్దాల గరిష్టానికి చేరిన నేపథ్యంలో ఫైనాన్షియల్ రంగం స్థిరత్వం అవసరం. ఆర్థిక వృద్ధికి దోహదపడే దిశలో రుణ వృద్ధి జరిగేందుకు బ్యాంకులు ప్రయత్నం చేస్తున్నాయి. ఆర్బీఐ అవసరమైన సమయంలో తగిన నిర్ణయాలు తీసుకుంటుంది. ► కంపెనీల రుణ పునర్వ్యవస్థీకరణ విషయంలో నియమించిన నిపుణుల కమిటీ త్వరలో తన సిఫారసులను చేయనుంది. అనంతరం ఈ విషయంలో అనుసరించాల్సిన విధానాలను సెప్టెంబర్ 6 లోపు ప్రకటించడం జరుగుతుంది. ఏ అకౌంట్‌కు సంబంధించి రుణ పునర్వ్యవస్థీకరణ అవసరమో బ్యాంకులు అంతర్గతంగా ఒక నిర్ధారణకు రాగలుగుతాయి. ► రుణ పునర్వ్యవస్థీకరణ రియల్టీ రంగానికి ఎంతో మేలు చేస్తుందని భావిస్తున్నాం. ► కరోనాపై పోరులో మనం విజయం సాధిస్తాము. అయితే దానికి ఎంత సమయం పడుతుందో చెప్పలేను. అయితే విజయం మాత్రం కచ్చితంగా మనదే. ► సరళతర ద్రవ్య పరపతి విధానంవైపే ఆర్బీఐ మొగ్గుచూపుతోంది. వడ్డీరేట్లు తగ్గుదలకే అవకాశం ఉంది. అయితే అత్యంత జాగరూకత, పరిపక్వతతో ఈ విధానాన్ని రూపొందించాల్సి ఉంది. ద్రవ్యోల్బణం అంశాలను జాగ్రత్తగా పరిగణనలోకి తీసుకుని నిర్ణయాలు తీసుకోవాలి. ► ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణపై నిర్ణయించాల్సింది కేంద్రమే. దీనిపై కేంద్రం అడిగితే, ఆర్బీఐ తన అభిప్రాయాలను తెలియజేస్తుంది. ► ప్రైవేటు బ్యాంకుల యాజమాన్య సమీక్షకు ఆర్బీఐ అంతర్గత కార్యాచరణ బృందాన్ని ఏర్పాటు చేసింది. సెప్టెంబర్‌లో ఇది తుది నివేదికను అందజేస్తుంది. మొండిబకాయిల ప్రస్తుత స్థితి... 2021 మార్చి నాటికి మొత్తం అన్ని బ్యాంకుల రుణాల్లో స్థూల మొండి బకాయిలు (జీఎన్‌పీఏ) 12.5 శాతానికి పెరిగే అవకాశం ఉందని ఇటీవల విడుదల చేసిన ద్వైవార్షిక ఆర్థిక వ్యవహారాల స్థిరత్వ నివేదిక (ఎఫ్ఎస్ఆర్)లో స్వయంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పేర్కొనడం ఇక్కడ గమనార్హం. ఆర్థిక అనిశ్చిత పరిస్థితి మరింత విషమిస్తే, ఈ రేటు ఏకంగా 14.7 శాతానికీ పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయని విశ్లేషించింది. 2020 మార్చి నాటికి మొత్తం బ్యాంకింగ్ జీఎన్‌పీఏ రేటు కేవలం 8.5 శాతంగా ఉన్న విషయం గమనార్హం. రుణ నిబంధనలు తరచూ మార్చేయొద్దు బ్యాంకులకు ఆర్బీఐ సూచన ముంబై: వ్యాపార సంస్థలకిచ్చే రుణాలకు సంబంధించిన నిబంధనలను సహేతుక కారణాలు లేకుండా తరచూ మార్చేయొద్దని బ్యాంకులకు రిజర్వ్ బ్యాంకు సూచించింది. రుణ సదుపాయాలను సమీక్షించేందుకు క్రమబద్ధంగా నిర్దిష్ట కాలవ్యవధిని నిర్దేశించాలని, మధ్యలో పదే పదే సమీక్షలు జరపడాన్ని నివారించాలని పేర్కొంది. సమీక్ష ఎప్పుడెప్పుడు జరపాలి, ఏ విధానాలను పాటించాలి తదితర అంశాలకు సంబంధించి బోర్డు ఆమోదిత విధానాన్ని రూపొందించుకోవాలని తెలిపింది. బ్యాంకులు ఒక్కో రకంగా భారీ స్థాయిలో వడ్డీ రేట్లు వసూలు చేస్తున్నాయని, ప్రభుత్వం ఉద్దీపనలు ఇస్తున్నా వ్యాపార సంస్థలకు తగు విధంగా ఆర్థిక తోడ్పాటు ఇవ్వడం లేదని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆర్బీఐ తాజా ఆదేశాలు ఇచ్చినట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. -
ఇన్ఫ్రా పెట్టుబడులు జోరందుకోవాలి
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక స్థితిగతులను నిశితంగా పరిశీలిస్తున్నామని, వృద్ధికి ఊతమిచ్చేందుకు తగిన చర్యలు తీసుకునేందుకు వెనుకాడే ప్రసక్తే లేదని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పారు. కరోనా వైరస్ సంక్షోభంతో సతమతమవుతున్న ఇన్ఫ్రా రంగాన్ని మళ్లీ వృద్ధి బాట పట్టించేందుకు భారీగా పెట్టుబడులు పెట్టాలని పరిశ్రమవర్గాలకు సూచించారు. గతంలో స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్టు తరహాలో మెగా ఇన్ఫ్రా ప్రాజెక్టులతో ఎకానమీకి గణనీయంగా తోడ్పాటు లభిస్తుందని పేర్కొన్నారు. ‘తూర్పు–పశ్చిమ, ఉత్తరాది–దక్షిణాది మధ్య ఎక్స్‌ప్రెస్‌వే, హై స్పీడ్ రైల్ కారిడార్లు మొదలైన వాటి రూపంలో ఈ ప్రాజెక్టులు ఉండచ్చు. ఇలాంటి రెయిల్, రోడ్ నెట్‌వర్క్‌ల ఏర్పాటుతో వాటి చుట్టు పక్కల ఉన్న ప్రాంతాలు, ఎకానమీలోని ఇతర రంగాలకు కనెక్టివిటీ లభిస్తుంది. మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల సాకారానికి ప్రభుత్వ, ప్రైవేట్ పెట్టుబడులు... రెండూ కీలకమే‘ అని పరిశ్రమల సమాఖ్య సీఐఐ సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా దాస్ చెప్పారు. నీతి ఆయోగ్ అంచనాల ప్రకారం దేశీయంగా 2030 నాటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో 4.5 లక్షల కోట్ల డాలర్ల పెట్టుబడులు అవసరమన్నారు. ఇతర మార్గాల్లో నిధుల సమీకరణ..: ఇన్ఫ్రా రంగానికి బ్యాంకులు ఇచ్చిన రుణాల్లో భారీగా మొండిబాకీలు పేరుకుపోయిన నేపథ్యంలో నిధుల సమీకరణకు ఇతరత్రా అవకాశాలను పరిశీలించాల్సిన అవసరం ఉందని దాస్ చెప్పారు. వన్–టైమ్ రుణాల పునర్వ్యవస్థీకరణ, కార్పొరేట్ బాండ్లను ఆర్బీఐ నేరుగా కొనుగోలు చేయాలన్న పరిశ్రమ వర్గాల సిఫార్సులను దృష్టిలో ఉంచుకున్నామని, సమయం వచ్చినప్పుడు తగిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ‘ఆర్బీఐ చాలా అప్రమత్తంగా ఉంది. పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తోంది. అవసరమైనప్పుడు.. తగిన చర్యలు తీసుకోవడంలో సందేహించే ప్రసక్తే లేదు. మ్యూచువల్ ఫండ్ పరిశ్రమకు తోడ్పాటునిచ్చే అంశంలో ఆర్బీఐ వ్యవహరించిన తీరు మీకు తెలిసిందే. రిజర్వ్ బ్యాంక్ ఎప్పుడూ క్రియాశీలకంగానే వ్యవహరిస్తుంది‘ అని దాస్ తెలిపారు. కరోనా పరిణామాలతో మొండిబాకీలు పెరిగి, సమస్య మరింత జటిలమయ్యే దాకా చూస్తూ కూర్చోకుండా బ్యాంకులు .. మరింత మూలధనాన్ని సమకూర్చుకోవడంలో క్రియాశీలకంగా వ్యవహరించాలని దాస్ సూచించారు. వ్యవ’సాయం’.. ఇటీవలి సంస్కరణలతో వ్యవసాయ రంగంలో కొత్త వ్యాపార అవకాశాలు వస్తున్నాయని దాస్ చెప్పారు. ఫలితంగా ఉపాధి కల్పనకు, రైతుల ఆదాయాలు పెరిగేందుకు మరింతగా ఊతం లభించగలదని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇవి చీకట్లో చిరుదివ్వెల్లాగా ఉన్నాయని అభివర్ణించారు. ఇక, భారత్ ప్రస్తుతం మిగులు విద్యుత్ దేశంగా.. పొరుగు దేశాలకు కూడా ఎగుమతి చేయగలుగుతోందని దాస్ చెప్పారు. మొత్తం విద్యుదుత్పత్తిలో పునరుత్పాదక విద్యుత్ వాటాను 2030 నాటికల్లా 40 శాతానికి పెంచుకోవాలని భారత్ లక్ష్యంగా నిర్దేశించుకుందని.. దీనివల్ల బొగ్గు దిగుమతుల బిల్లులు తగ్గుతాయని.. ఉపాధి అవకాశాల కల్పన జరగగలదని ఆయన పేర్కొన్నారు. వృద్ధి చోదకంగా ఐసీటీ.. ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ).. దాదాపు రెండు దశాబ్దాలుగా భారత్ ప్రగతి చోదకంగా నిలుస్తోందని గవర్నర్ చెప్పారు. గతేడాది స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ) ఐసీటీ వాటా 8 శాతానికి చేరిందని.. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రైవేట్ రంగంలో అత్యధికంగా ఉద్యోగాలు కల్పిస్తున్న రంగంగా నిల్చిందని పేర్కొన్నారు. స్టార్టప్ ఇండియా కార్యక్రమం ఔత్సాహిక వ్యాపారవేత్తలకు ఊతమిస్తోందని, పలు స్టార్టప్‌లు యూనికార్న్ హోదా (1 బిలియన్ డాలర్ల వేల్యుయేషన్) సాధించడం ద్వారా ఇన్నోవేషన్ హబ్‌గా భారత్ స్థానాన్ని మరింత పటిష్టం చేస్తున్నాయని దాస్ తెలిపారు. మారటోరియం పొడిగించొద్దు: హెచ్డీఎఫ్సీ పరేఖ్ రుణాల చెల్లింపుపై మారటోరియంను కొన్ని సంస్థలు దుర్వినియోగం చేస్తున్న నేపథ్యంలో దీని గడువును మరింత పొడిగించొద్దంటూ రిజర్వ్ బ్యాంక్‌ను హెచ్డీఎఫ్సీ చైర్మన్ దీపక్ పరేఖ్ కోరారు. రుణాలు కట్టే సామర్థ్యాలున్నప్పటికీ కొన్ని సంస్థలు.. మారటోరియం స్కీమును అడ్డం పెట్టుకుని చెల్లించడం లేదని తెలిపారు. దీనివల్ల ఆర్థిక రంగానికి .. ముఖ్యంగా నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలకి సమస్యలు వస్తున్నాయని సీఐఐ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా దాస్‌కు తెలిపారు. కరోనా వైరస్ దెబ్బతో ఆదాయాలు కోల్పోయిన వారికి ఊరటనిచ్చేలా రుణాల ఈఎంఐలను చెల్లించేందుకు కాస్త వ్యవధినిస్తూ ఆర్బీఐ ఆదేశాల మేరకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఆరు నెలల పాటు మారటోరియం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 31తో గడువు తీరిపోతుండటంతో .. ఇప్పటికీ పరిస్థితులు చక్కబడనందున మారటోరియం వ్యవధిని మరింతగా పెంచాలంటూ అభ్యర్థనలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పరేఖ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అయితే, పరేఖ్ సూచనను పరిశీలిస్తామని, ఇప్పటికిప్పుడు మాత్రం దీనిపై ఏమీ చెప్పలేనని దాస్ పేర్కొన్నారు. -
బ్యాంకులు నిధులు సమీకరించుకోవాలి
ముంబై: కరోనా వైరస్ కారణంగా ఏర్పడిన సమస్యలను అధిగమించేందుకు బ్యాంకులకు నిధులు అవసరమని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ సూచించారు. రుణ వితరణతోపాటు ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండాలంటే అందుకు బ్యాంకుల వద్ద మిగులు నిల్వలు కీలకమవుతాయన్నారు. ‘‘ఇటువంటి సమయాల్లో బ్యాంకులు తమ పాలనను, సమస్యలను ఎదుర్కొనే నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం ఎంతో ముఖ్యం. ముందస్తు అంచనాలతో అవి నిధులను సమకూర్చుకోవాలి. అంతేకానీ ఆ అవసరం ఏర్పడే వరకు వేచి చూడరాదు. ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులు చురుగ్గా వ్యవహరిస్తూ తమ వద్ద తగినంత మిగులు నిధులు ఉండేలా చూసుకోవాలి’’ అని శక్తికాంతదాస్ అన్నారు. ఎస్బీఐ నిర్వహించిన బ్యాంకింగ్ అండ్ ఎకనమిక్ సదస్సును ఉద్దేశించి ఆయన ప్రసంగించిన సందర్భంగా ఈ అభిప్రాయాలు వ్యక్తం చేశారు.లాక్డౌన్, అనంతర పరిణామాలతో మొండి బకాయిలు (ఎన్పీఏలు) పెరిగే అవకాశాలు ఉన్నాయని గవర్నర్ అంచనా వేశారు. కరోనా కారణంగా తమ బ్యాలెన్స్ షీట్లపై పడే ప్రభావంపై అధ్యయనం చేయాలని ఆర్బీఐ ఇటీవలే బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలను కోరింది. ఈ అధ్యయన ఫలితాల ఆధారంగా సమస్యలను అధిగమించడం, నిధులు సమీకరించడంపై ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించినట్టు శక్తికాంతదాస్ తెలిపారు. -
అనిశ్చితిలో ఇంకా ఏం చేద్దాం!
న్యూఢిల్లీ: కోవిడ్–19 ప్రతికూలతల నేపథ్యంలో గురువారం దేశీయ, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులపై ఫైనాన్షియల్ స్టెబిలిటీ అండ్ డెవలప్మెంట్ కౌన్సిల్ (ఎఫ్ఎస్డీసీ) దృష్టి సారించింది. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఈ కీలక సమావేశానికి అధ్యక్షత వహించారు. కరోనా వైరస్ సంక్షోభం దేశంలో ప్రారంభమైన తర్వాత కౌన్సిల్ సమావేశం ఇదే తొలిసారి. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ 22వ కౌన్సిల్ సమావేశంలో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్, సెబీ చీఫ్ అజయ్ త్యాగి, ఐఆర్డీఏఐ చైర్మన్ సుభాష్ చంద్ర కుంతియా, ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా (ఐబీబీఐ) చైర్మన్ ఎంఎస్ సాహూ, పీఎఫ్‌ఆర్‌డీఏఐ చైర్మన్ సుప్రీతం బందోపాధ్యాయ పాల్గొన్నారు. ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి తరుణ్ బజాజ్, రెవెన్యూ కార్యదర్శి అజయ్ భూషన్ పాండే, ఫైనాన్షియల్ సేవల కార్యదర్శి దేబాషిస్ పాండా సహా ఆర్థికశాఖ పలువురు సీనియర్ అధికారులు కూడా ఈ భేటీలో ఉన్నారు. సమావేశానికి సంబంధించి కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... ► దేశంలో ద్రవ్యలభ్యత పరిస్థితులను మెరుగుపరిచే చర్యలు మరిన్ని తీసుకోవాలని, ఫైనాన్షియల్ సెక్టార్లో మూలధన అవసరాలను ఎప్పటికప్పుడు తీర్చాలని ఎఫ్ఎస్డీసీ భావించింది. ► మార్కెట్ ఒడిదుడుకులు, దేశీయంగా ఆర్థిక వనరుల సమీకరణ, అంతర్జాతీయ పెట్టుబడులు వంటి కీలక అంశాలపై సమావేశం చర్చించింది. ► కోవిడ్–19 గ్లోబల్ ఫైనాన్షియల్ వ్యవస్థ స్థిరత్వానికి ముప్పును తెచ్చిపెట్టిందనీ, రికవరీ ఎప్పుడన్నది సైతం ఇప్పుడే చెప్పడం కష్టమని పేర్కొంది. -
ద్రవ్యలోటు కట్టడి కష్టమే
ముంబై : కరోనా వైరస్ సంక్షోభం నేపథ్యంలో ఈ ఏడాది ద్రవ్య లోటు కట్టడి లక్ష్యాలు అధిగమించడం కష్టసాధ్యమేనని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పారు. లాక్డౌన్ కారణంగా జీఎస్టీ, ప్రత్యక్ష పన్ను వసూళ్లపైనా ప్రభావం పడొచ్చని వార్తాసంస్థ కోజెన్సిస్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు. ఇంటర్వ్యూలోని కొన్ని విశేషాలు.. ఎకానమీపై కరోనా ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం తీసుకోతగిన చర్యలేంటి? ఆర్థిక ఉద్దీపనల కోసం ప్రభుత్వం ఇప్పటికే పలు ప్యాకేజీలపై కసరత్తు చేస్తున్నట్లు ఆర్థిక మంత్రి ఇప్పటికే వెల్లడించారు. కరోనా వేళ బడుగు వర్గాల కోసం ప్రభుత్వం పలు సహాయక చర్యలు ప్రకటించింది. ప్రస్తుత పరిస్థితుల దరిమిలా ద్రవ్య లోటును 3.5 శాతానికి పరిమితం చేయాలని నిర్దేశించుకున్న లక్ష్యం కష్టసాధ్యమే. ద్రవ్య లోటు కచ్చితంగా దాటేయొచ్చు. ఇక లాక్డౌన్ కారణంగా జీఎస్టీ వసూళ్లపై తీవ్ర ప్రతికూల ప్రభావం ఉంటుంది. ప్రత్యక్ష పన్నులపైనా ప్రభావాన్ని తోసిపుచ్చలేం. ఏదేమైనా కరోనా సవాళ్లను ఎదుర్కొనడంతో పాటు ద్రవ్య లోటును కట్టడి చేసేలా ప్రభుత్వం సమతూకమైన నిర్ణయాలు తీసుకుంటుందని భావిస్తున్నాను. ద్రవ్య లోటు భర్తీలో ఆర్బీఐ ఏమైనా తోడ్పాటు అందించబోతోందా? ప్రస్తుత పరిస్థితుల్లో దీనిపై ఇంకా ఏ అభిప్రాయమూ లేదు. అవసరం తలెత్తినప్పుడు స్థూల ఆర్థిక వ్యవస్థ స్థిరత్వాన్ని దృష్టిలో ఉంచుకుని తగు నిర్ణయం తీసుకుంటాం. ఈ క్రమంలో నిధుల సమీకరణకు ప్రత్యామ్నాయ మార్గాలను కూడా పరిశీలిస్తాం. 2008, 2020 సంక్షోభాలను చూసినప్పుడు ఎకానమీని పట్టాలెక్కించడంలో ఆర్బీఐ పాత్ర పరిమితంగానే ఉంటోందనే భావనపై మీ అభిప్రాయమేంటి? కేంద్రీయ బ్యాంకు పాత్రను తక్కువగా చేసి చూడటానికి లేదు. ద్రవ్య పరపతి విధానం, లిక్విడిటీ నిర్వహణ, ఆర్థిక రంగ నియంత్రణ.. పర్యవేక్షణ మొదలైనవన్నీ చాలా శక్తిమంతమైన సాధనాలే. ఆర్థిక పరిస్థితులపై దీర్ఘకాల ప్రభావాలు చూపేవే. ప్రస్తుతం ఒక మహమ్మారిపరమైన మందగమనంతో పోరాడుతున్నాం. దీన్ని ఎదుర్కొనేందుకు అన్ని వర్గాలు కలిసికట్టుగా కృషి చేయాల్సి ఉంటుంది. సంక్షోభాన్ని ఎదుర్కొనడంలో ప్రభుత్వం చాలా కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది. ఉదార ఆర్థిక విధానాల చక్రవ్యూహం నుంచి బైటపడే మార్గమేంటి? ఇలాంటి అంశాల్లో ఎంట్రీ, ఎగ్జిట్‌కి సంబంధించి సమయోచిత మార్గదర్శక ప్రణాళిక ఉండాలి. ద్రవ్య లోటు కావొచ్చు లేదా లిక్విడిటీ కావొచ్చు లేదా అసాధారణ చర్యలేవైనా కావొచ్చు.. చక్రవ్యూహంలోకి ప్రవేశించడం, బైటపడటం గురించి ఏకకాలంలో వ్యూహాలు రచించుకోవాలి. ఇదంతా చూసి.. ఆర్బీఐ కఠినతర విధానాన్ని పాటించబోతోందని మార్కెట్లు భావించకుండా ఒక విషయం స్పష్టం చేయదల్చుకున్నాను. పరిస్థితులు దాదాపుగా సాధారణ స్థాయికి వచ్చాయని, చక్కబడ్డాయని భరోసా కలిగినప్పుడు మాత్రమే సమయోచితంగా ఎగ్జిట్ ఉండాలి. మరీ ముందుగానో.. మరీ ఆలస్యంగానో ఉండకూడదు. ఇక ప్రస్తుత పరిస్థితుల్లో ఎగ్జిట్ విషయమొక్కటే కాదు.. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కూడా కష్టమే. అసాధారణ పరి స్థితుల్లో అసాధారణ చర్యలు తీసుకోవాల్సిందే. -
మరో విడత రేటు కోతకు చాన్స్!
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంతదాస్ మరో విడత రెపో రేటు తగ్గిస్తామనే సంకేతాలిచ్చారు. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటే రెపో. ప్రస్తుతం ఇది 5.15 శాతంగా ఉంది. ఆర్థిక వ్యవస్థలో మందగమన ధోరణిని ఆర్బీఐ 2019 ఫిబ్రవరిలోనే గుర్తించిందని, దీన్ని నివారించే లక్ష్యంతోనే అప్పటి నుంచీ వరుసగా ఐదు ద్వైమాసిక సమావేశాల్లో రెపో రేటును తగ్గిస్తూ వచ్చామని చెప్పారాయన. ఈ కాలంలో 135 బేసిస్ పాయింట్ల రెపో (1.35%) తగ్గించడాన్ని ప్రస్తావించారు. ఈ నెల్లో పెంచకపోవటాన్ని ప్రస్తావిస్తూ... ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుని, వేచిచూసే ధోరణికి మారామన్నారు. భారత ఆర్థిక వ్యవస్థపై టైమ్స్ నెట్వర్క్ నిర్వహించిన ఒక సదస్సులో ఆయన మాట్లాడారు. ‘బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు, కంపెనీలు తమ బ్యాలెన్స్ షీట్లను సరిచేసుకునే ప్రక్రియలో ఉన్నాయి. మొండిబకాయిల సమస్య పరిష్కారానికి సంబంధించిన దిశలో ఇది ఒక కీలక అడుగు. తదుపరి ఆర్థిక వృద్ధికి ఊతం ఇచ్చే అంశం’ అని పేర్కొన్నారు. -
సహకార బ్యాంకుల పనితీరుపై ఆర్బీఐ సమీక్ష
భువనేశ్వర్: పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంకు (పీఎంసీ) స్కామ్‌తో లక్షల మంది డిపాజిటర్లు సమస్యలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో అర్బన్ సహకార బ్యాంకుల పనితీరును రిజర్వ్ బ్యాంక్ సెంట్రల్ బోర్డు శనివారం సమీక్షించింది. ఆర్థిక వ్యవస్థ స్థితిగతులు, అంతర్గతంగాను.. అంతర్జాతీయంగాను దేశం ఎదుర్కొంటున్న సవాళ్లు మొదలైన అంశాలు కూడా చర్చించింది. గవర్నర్ శక్తికాంత దాస్ సారథ్యంలో సమావేశమైన సెంట్రల్ బోర్డు.. పట్టణ ప్రాంత కోఆపరేటివ్ బ్యాంకులు, వాటితో పాటు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థల్లో నిబంధనల అమలు తదితర అంశాలను సమీక్షించిందని ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. రియల్టీ సంస్థ హెచ్‌డీఐఎల్‌కు మొత్తం రూ. 6,226 కోట్ల మేర రుణాలిచ్చినప్పటికీ .. పీఎంసీ బ్యాంకు కేవలం రూ. 440 కోట్లు మాత్రమే ఇచ్చినట్లు ఆర్బీఐకి చూపించిన సంగతి తెలిసిందే. ఈ స్కామ్ బైటపడటంతో పీఎంసీ బ్యాంకు ఖాతాదారుల విత్డ్రాయల్స్పై ఆర్బీఐ ఆంక్షలు విధించింది. -
అందరివాడు... దాస్
న్యూఢిల్లీ: దేశీ బ్యాంకింగ్ రంగ నియంత్రణ సంస్థ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌గా శక్తికాంత దాస్ బాధ్యతలు చేపట్టి సంవత్సరమవుతోంది. గతేడాది డిసెంబర్ 12న ఆర్బీఐ గవర్నర్‌గా ఉర్జిత్ పటేల్ అర్ధంతరంగా నిష్క్రమించిన తర్వాత అనూహ్యంగా ఆ స్థానంలో దాస్ నియమితులయ్యారు. బ్యూరోక్రాట్ స్థాయి నుంచి స్వతంత్ర ప్రతిపత్తి గల ఆర్బీఐ 25వ గవర్నర్‌గా ఎదిగారాయన. 1980 బ్యాచ్ తమిళనాడు కేడర్ ఐఏఎస్ అధికారి అయిన దాస్.. గతంలో కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సహా పలు హోదాల్లో సేవలు అందించారు. అందరినీ కలుపుకుపోవడం, అందరూ తమ అభిప్రాయాలు తెలిపేందుకు అవకాశమివ్వడం .. దాస్ స్టయిల్ అంటారు ఆయన్ను గురించి తెలిసినవారు. ప్రభుత్వానికి నిధుల బదిలీ, మొండిబాకీల పరిష్కారానికి కొత్త విధానం ప్రవేశపెట్టడం మొదలుకుని వరుసగా పలు దఫాలు కీలక రేట్లను తగ్గించడం దాకా ఈ ఏడాది కాలంలో ఆర్బీఐ అనేక కీలక నిర్ణయాలు తీసుకుంది. బ్యాంకింగ్ రంగంలో సంక్షోభాలు, మందగిస్తున్న ఆర్థిక వృద్ధి తదితర సవాళ్ల మధ్య దాస్ సారథ్యంలో ఆర్బీఐ పనితీరును ఒకసారి సింహావలోకనం చేస్తే .. ► ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చే క్రమంలో ఆర్బీఐ 2019 ఫిబ్రవరి నుంచి ఇప్పటిదాకా అయిదు విడతల్లో 135 బేసిస్ పాయింట్ల మేర రెపో రేటును తగ్గించింది. ఆగస్టులో అసాధారణంగా 35 బేసిస్ పాయింట్లు తగ్గించింది. అయితే, కచ్చితంగా మరో విడత రేట్లను తగ్గిస్తుందన్న అంచనాలను తల్లకిందులు చేస్తూ నవంబర్‌లో నిర్ణయం తీసుకోవడం అందర్నీ విస్మయపర్చింది. ► స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి అంచనాలను కూడా మొత్తం మీద 240 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. ► ఆర్బీఐ వద్ద ఎంత మేర నిధులు ఉండాలన్న వివాదాస్పద చర్చకు ముగింపునిచ్చి, కేంద్రానికి రూ. 1,76,051 కోట్ల మేర మిగులు నిధులను రిజర్వ్ బ్యాంక్ బదలాయించింది. ► చిన్న, మధ్యతరహా సంస్థలకు ఊరటనిస్తూ వన్ టైమ్ రుణ పునర్వ్యవస్థీకరణ వెసులుబాటు కల్పించింది. ► సత్వర దిద్దుబాటు చర్యలకు (పీసీఏ) సంబంధించిన ఆంక్షలు ఎదుర్కొంటున్న 11 బ్యాంకుల్లో నుంచి మూడు బ్యాంకులను (బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్) బైటికి తెచ్చింది. ► సంస్కరణలపరంగా చూస్తే.. ద్రవ్య పరపతి విధానాల ప్రయోజనాలు సత్వరం బదిలీ అయ్యేలా... బ్యాంకులు రుణాలకు సంబంధించి రెపో ఆధారిత ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్ విధానానికి మళ్లేలా దాస్ కృషి చేశారు. ► రోజంతా చెల్లింపుల వ్యవస్థలు పనిచేసేలా చూసేందుకు నెఫ్ట్ సదుపాయం 24 గంటలూ అందుబాటులో ఉండేలా ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. ఇది 2020 జనవరి నుంచి అమల్లోకి వస్తోంది. ఆర్బీఐదే తుది నిర్ణయం.. ఆర్బీఐ, ప్రభుత్వం మధ్య చాలా విషయాలపై విస్తృతంగా చర్చలు జరుగుతాయి. కానీ, అంతిమంగా నిర్ణయం తీసుకునేది రిజర్వ్ బ్యాంకే. నిర్ణయాలు తీసుకోవడంలో ఆర్బీఐకి 100 శాతం పైగా స్వయం ప్రతిపత్తి ఉంది. ఇందులో ఎవరి జోక్యం ఉండదు. – శక్తికాంత దాస్, గవర్నర్, ఆర్బీఐ అందర్నీ ఒకే తాటిపైకి తెచ్చారు నిబద్ధత, పారదర్శకత, నిజాయితీ గల వ్యక్తి శక్తికాంత దాస్. ప్రభుత్వాన్ని, వ్యవస్థను ఒకే తాటిపైకి తేవడంలోనూ, బోర్డును సమగ్రంగా తీర్చిదిద్దడంలోను అన్ని విధాలా సఫలీకృతమయ్యారు. – సచిన్ చతుర్వేది, ఆర్బీఐ సెంట్రల్ బోర్డు సభ్యుడు -
ఆర్బీఐ వరమిచ్చినా..
ముంబై: అంచనాలు, విశ్లేషణలకు అనుగుణంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రెపో రేటును పావుశాతం తగ్గించింది. దీనితో ఈ రేటు 6% నుంచి 5.75%కి తగ్గింది. రెపో రేటు తగ్గించడం జనవరి నుంచీ ఇది మూడవసారి. రెండు నెలలకోసారి జరిగే సమీక్షలో గడిచిన ఆరు నెలల్లో మూడు సార్లు 0.25% చొప్పున రేటును ఆర్బీఐ తగ్గిస్తూ వస్తోంది. తాజా రేటు తగ్గింపుతో రెపో తొమ్మిదేళ్ల కనిష్ట స్థాయికి చేరినట్లయింది. గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) ఏకగ్రీవంగా రేటు కోత నిర్ణయం తీసుకుంది. ఇక ముందూ రేటు తగ్గిస్తామనే సంకేతాలను ఇస్తూ, పాలసీ విధానాన్ని ‘తటస్థం’ నుంచి ‘మార్పునకు వీలైన సరళ వైఖరికి’ మార్చింది. ఏంటీ రెపో... బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీ రేటునే రెపోగా వ్యవహరిస్తారు. గడిచిన ఆరునెలల్లో ఇది ఏకంగా 0.75 శాతం తగ్గింది. ఇలా తగ్గటం వల్ల ఆర్బీఐ నుంచి బ్యాంకులకు చౌక వడ్డీకే నిధులు లభ్యమవుతాయి. అప్పుడు బ్యాంకులు కూడా తాము ఇచ్చే రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించవచ్చు. అలా చేసినా వాటి లాభాలపై ఎలాంటి ప్రతికూల ప్రభావమూ పడదు. కానీ ఇక్కడే జరగాల్సింది సరిగా జరగడం లేదు. స్వయంగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ కూడా ఈ విషయంపై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ ఏడాది జూన్ 5 వరకూ ఆర్బీఐ 0.50% రేటు తగ్గిస్తే, బ్యాంకులు 0.21 శాతం తగ్గింపును మాత్రమే కస్టమర్లకు బదలాయించాయి. అది కూడా కొత్తగా రుణాలు తీసుకునే వారికి మాత్రమే ఈ ప్రయోజనాన్ని అందజేశాయి. పాత రుణ గ్రహీతలకు ఒనగూరిన రేటు తగ్గింపు ప్రయోజనం కేవలం 0.04%. ఈ విషయంపై తాను బ్యాంకర్లతో మాట్లాడతానని కూడా ఆర్బీఐ గవర్నర్ పేర్కొన్నారు. రుణాల్లో వృద్ధే ప్రధాన లక్ష్యంగా తాజా పాలసీ సమీక్ష, నిర్ణయాలు జరిగినట్లు తెలిపారు. రేటు తగ్గింపు పరిస్థితులు చూస్తే... బ్యాంకులకు తగ్గించిన రేటు ప్రయోజనం... సాధారణ వినియోగదారు నుంచి పరిశ్రమల వరకూ అందినప్పుడు అది వ్యవస్థలో రుణ రేటు తగ్గుదలకు తోడ్పడుతుంది. రుణాలపై వడ్డీ తక్కువ కనక రుణాలు ఎక్కువ తీసుకుంటారు. ఇది వృద్ధి మెరుగుదలకు దోహదపడుతుందనేది క్లుప్తంగా ఆర్థిక విశ్లేషణ. ఆర్థిక వ్యవస్థలో క్రియాశీలత తగ్గిపోయింది. మందగమనం చోటు చేసుకుంటోంది. ఈ పరిణామాల నేపథ్యంలో... రెపో రేటు తగ్గింపునకు ఆర్బీఐ శ్రీకారం చుట్టింది. ఆ అంశాలను పరిశీలిస్తే... ► అటు వినియోగదారుల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం, ఇటు టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం ప్రభుత్వం, ఆర్బీఐ నిర్దేశిత శ్రేణి 2%కి అటు ఇటుగా 4 శాతం వద్దే కొనసాగుతున్నాయి. ► మరోవైపు పారిశ్రామిక ఉత్పత్తిలో వృద్ధి ధోరణి పూర్తిగా ఆగిపోయింది. ఇంకా చెప్పాలంటే మార్చిలో క్షీణతలోకి పారిశ్రామిక రంగం జారింది. తయారీ, సేవల రంగాలు మందగమనంలోకి జారిపోయాయి. వాహన రంగం రివర్స్‌గేర్‌లో ప్రయాణిస్తోంది. ► గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో (208–19, జనవరి–మార్చి) భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ఐదేళ్ల కనిష్టస్థాయి 5.8 శాతానికి పడిపోయింది. వాహన, ఆటో, గృహ రుణ రేట్లు తగ్గే చాన్స్... బ్యాంకులు రెపో రేటు తగ్గింపు ప్రయోజనాన్ని గనక వినియోగదారులకు బదలాయిస్తే... దీనికి అనుసంధానమయ్యే వాహన, ఆటో, గృహ రుణాలపై కస్టమర్ నెలవారీ చెల్లించే వాయిదా మొత్తం (ఈఎంఐ) తగ్గుతుంది. కొత్త రుణాలకు సైతం వడ్డీ రేట్లు తగ్గుతాయి. మరోవంక డిపాజిట్లపై చెల్లించే వడ్డీని కూడా బ్యాంకులు తగ్గించేస్తాయి. అసంఘటిత రంగమే అత్యధికంగా ఉండే మన దేశంలో చాలామంది రిటైరైన తరవాత సరైన ఆదాయం కోసం వడ్డీపైనే ఆధారపడుతుంటారు. అలాంటి వారికి ఈ వడ్డీ తగ్గింపులు అశనిపాతం లాంటివే. కొన్నాళ్లుగా బ్యాంకులు ఏం చేస్తున్నాయంటే... ఆర్బీఐ రెపో రేటు తగ్గించిన వెంటనే అవి డిపాజిట్లపై వడ్డీ రేటును తగ్గించేస్తున్నాయి. అదే స్పీడులో రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించటం లేదు. దీనివల్ల బ్యాంకుల లాభాలు పెరుగుతాయి తప్ప కస్టమర్లకు ఒరిగేదేమీ ఉండదు. బ్యాంకుల ఈ వైఖరి వల్ల వృద్ధి రేటు వచ్చే మూడేళ్లు కూడా పెద్దగా పెరిగేదేమీ ఉండకపోవచ్చనేది రేటింగ్ ఏజెన్సీల అంచనా. పాలసీ ప్రధానాంశాలు... ► రెపో రేటును పావుశాతం తగ్గించడం వరుసగా ఇది మూడవసారి. ఇంతక్రితం వరుసగా రెండు దఫాలుగా తగ్గిన అరశాతంసహా తాజా పావుశాతం తగ్గింపుతో ఈ రేటు 5.75 శాతానికి దిగివచ్చింది. ఇది తొమ్మిదేళ్ల కనిష్ట స్థాయి. ► రివర్స్ రెపో రేటు 5.50 శాతంగా ఉంది. ► మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ 6%. ► పాలసీ వైఖరిని ‘తటస్థం’ నుంచి ‘తగిన విధం గా మార్చుకునే సరళ విధానం’ వైపు మార్పు. ► జీడీపీ వృద్ధి రేటు అంచనాలను 7.2 శాతం నుంచి 7 శాతానికి తగ్గింపు. ► ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య రిటైల్ ద్రవ్యోల్బణం 3 నుంచి 3.1 శాతం శ్రేణిలో ఉంటుంది. అక్టోబర్ నుంచి మార్చి మధ్య ఈ రేటు 3.4–3.7 శ్రేణిలో ఉంటుంది. ► వర్షపాతం విషయంలో అనిశ్చితి, క్రూడ్ ఆయి ల్ ధరలు, ఫైనాన్షియల్ మార్కెట్లలో ఒడిదుడుకులు, ద్రవ్యలోటు తీవ్రత వంటి అంశాలు ద్రవ్యోల్బణానికి సవాళ్లను విసురుతాయి. ► డిజిటల్ లావాదేవీల ప్రోత్సాహంలో భాగంగా ఆర్టీజీఎస్, ఎన్ఈఎఫ్టీ చార్జీల రద్దు. ► బ్యాంకులు విధించే ఏటీఎం చార్జీలు, ఫీజుల సమీక్షకు కమిటీ నియామకం. ► నిర్దిష్టకాల పరిమితితో సంబంధం లేకుండా, ఎప్పటికప్పుడు చిన్న ఫైనాన్స్ బ్యాంకుల లైసెన్సుల జారీకి సంబంధించి ఆగస్టు నాటికి ముసాయిదా మార్గదర్శకాల జారీ. ► పెట్టుబడుల్లో తీవ్ర మందగమనం, ప్రైవేటు వినియోగ వృద్ధి నెమ్మదించడం వంటి అంశాలపై ఆందోళన. ► పావుశాతం రేటు తగ్గింపునకు సానుకూలంగా మొత్తం ఆరుగురు సభ్యుల ఏకగ్రీవ ఓటు. ► జూన్ ప్రారంభంనాటికి వ్యవస్థలో సగటు రోజువారీ ద్రవ్యలభ్యత రూ.66,000 కోట్లు. ► దేశంలో మే 31వ తేదీ నాటికి విదేశీ మారకద్రవ్య నిల్వలు 421.9 బిలియన్ డాలర్లు. ► మొండిబకాయిల పరిష్కారం దిశలో 3, 4 రోజుల్లో కొత్త నిబంధనలు ► ద్రవ్యలోటు కట్టుతప్పకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందన్న విశ్వాసం ► నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల సవాళ్లను ఎదుర్కొనడంలో సహకారం. ► తదుపరి విధాన సమీక్ష ఆగస్టు 7. బ్యాంకర్లూ... మీరెంతో చేయాలి! ఆర్బీఐ రేటు తగ్గించినా... ఆ ప్రయోజ నాన్ని బ్యాంకర్లు వ్యవస్థలోకి బదలాయించకపోవడంపట్ల గవర్నర్ శక్తికాంత్‌దాస్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో బ్యాంకర్లు మరెంతో చేయాల్సి ఉందని ఆయన సూచిం చారు. పాలసీ అనంతరం శక్తికాంతదాస్ పేర్కొన్న అంశాలను క్లుప్తంగా చూస్తే... ‘‘గతంలో ఆర్బీఐ పాలసీ రేటు తగ్గింపు నిర్ణయం తీసుకుంటే, ఈ ప్రభావం వ్యవస్థలో ప్రతిబింబించడానికి నాలుగు నుంచి ఆరు నెలల కాలం పట్టేది. ఇప్పుడు ఈ పరిస్థితి మారింది. ఈ ఏడాది జూన్ 5 వరకూ ఆర్బీఐ 0.50 శాతం రేటు తగ్గిస్తే, బ్యాంకులు 0.21 శాతం కస్టమర్లకు బదలాయించాయి. కొత్త రుణ గ్రహీతలకే ఈ మొత్తం ప్రయోజనం దక్కింది. పాత రుణ గ్రహీతలకు ఒనగూరిన రేటు తగ్గింపు ప్రయోజనం కేవలం 0.04% మాత్రమే. రేటు తగ్గింపు ప్రయోజనం మరింతమేర, మరింత వేగంగా అందాలన్నది మా అభిప్రాయం. వినియోగదారులకు, ద్విచక్ర వాహన గ్రహీతలకు అందరికీ ఈ ప్రయోజనం అందాలి. రేటు ప్రయోజనం బదలాయింపు ఏ మేర జరుగుతోందన్న విషయాన్ని ఆర్బీఐ ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. రేటు ప్రయోజనం ఎంతో కీలకం. బ్యాంకులతో ఈ విషయంపై చర్చిస్తాం. చేయాల్సినదంతా చేస్తాం. ఏప్రిల్‌లో పావుశాతం రేటు తగ్గించాం. అయితే కొన్ని బ్యాంకులు కేవలం 5 నుంచి 10 బేసిస్ పాయింట్ల రేటు కోత నిర్ణయాన్ని తీసుకున్నాయి. అయితే మరింత రేటు ప్రయోజన బదలాయింపు జరగాలి. రుణ డిమాండ్, ఆర్థిక వ్యవస్థ క్రియాశీలతకు ఇది ఎంతో అవసరం’’ – శక్తికాంత దాస్, ఆర్బీఐ గవర్నర్ -
కొత్త రంగుల్లో రూ.20 నోటు
న్యూఢిల్లీ: భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) కొత్తగా ఆకుపచ్చ రంగులో రూ. 20 కరెన్సీ నోటును చలామణిలోకి తీసుకురానుంది. ఈ కొత్త రూ.20 నోట్‌పై రిజర్వుబ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ సంతకం ఉంటుంది. ఈ నోటుపై కొత్త డిజైన్లు, అందులో కలిసేలా రేఖాగణిత నమూనాలు ఉంటాయి. గతంలోలాగే గాంధీజీ సిరీస్‌లోనే ఈ కొత్త నోట్ కూడా ఉంటుంది. కొత్త 20 రూపాయల నోటు వెనుకవైపు మన చారిత్రక వారసత్వ సంపదైన ఎల్లోరా గుహల చిహ్నం ఉంటుంది. నోటుకు, వెనుకవైపు స్వచ్ఛభారత్ లోగో, నినాదం ఉంటాయి. ఎల్లోరా గుహల చిత్రం, దేవనాగరి లిపిలో 20 అంకె ఉంటుంది. కొత్త నోట్‌తోపాటు పాత నోట్లూ చలామణిలోనే ఉంటాయని ఆర్బీఐ తెలిపింది. -
దాస్.. ‘డబుల్’ ధమాకా!
ముంబై: మెజారిటీ విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగానే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆరుగురు సభ్యుల పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) రెపో రేటు పావుశాతం కోతకు నిర్ణయం తీసుకుంది. దీనితో ఈ రేటు 6.25 శాతం నుంచి 6 శాతానికి తగ్గింది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలో 2వ తేదీ నుంచీ ఎంపీసీ ద్రవ్య విధాన కమిటీ ద్వైమాసిక సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమావేశం కీలక నిర్ణయాలు మూడవరోజు– గురువారం వెలువడ్డాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2019 ఏప్రిల్ నుంచి 2020 మార్చి వరకూ) ఇది తొలి ద్వైమాసిక సమావేశం. రెండు నెలల క్రితం జరిగిన ద్వైమాసిక సమావేశంలో (ఫిబ్రవరి 7) కూడా ఆర్బీఐ రెపో రేటు పావుశాతం కోత నిర్ణయం తీసుకుంది. 2016లో ఎంపీసీ ఏర్పాటయిన తర్వాత ఇలా వరుసగా రెండుసార్లు రేటు కోత నిర్ణయం ఇదే తొలిసారి. గత ఏడాది ఆర్బీఐ రెండు సార్లు అరశాతం రేటు పెంచింది. తాజా నిర్ణయంతో పెరిగిన మేర రివర్స్ అయినట్లయ్యింది. సార్వత్రిక ఎన్నికల తొలిదశ మరో వారంలో ఉండగా ఆర్బీఐ తాజా కీలక నిర్ణయం తీసుకుంది. కాగా, రివర్స్ రెపో రేటును కూడా ఆర్బీఐ పావుశాతం తగ్గించింది. దీనితో ఈ రేటు 6 శాతం నుంచి 5.75 శాతానికి సర్దుబాటు అయ్యింది. బ్యాంకులు తమ వద్ద మిగులు నిధులు ఉంటే, వాటిని ఆర్బీఐ వద్ద ఉంచి వడ్డీ పొందుతాయి. ఈ రేటునే రివర్స్ రెపోగా పేర్కొంటారు. ఈ రేటు ఎక్కువగా ఉంటే, తద్వారానే అధిక ప్రయోజనం పొందడానికి బ్యాంకులు మొగ్గుచూపుతాయి. వ్యవస్థలో రుణ లభ్యత, లిక్విడిటీ (ద్రవ్య లభ్యత) పెరగాలంటున్న ఆర్బీఐ, రివర్స్రెపో రేటును కూడా తగ్గించడం గమనార్హం. ఆర్థిక సంవత్సరంలో రెండవ ద్వైమాసిక సమావేశం జూన్ 3 నుంచి 6వ తేదీ వరకూ జరుగుతుంది. ఫలితాలు ఎలా ఉంటాయంటే? బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటే రెపో. దీనిని తగ్గిస్తే, బ్యాంకులకు నిధుల సమీకరణ భారం తగ్గుతుంది. ఇలా తమకు లభించే వడ్డీరేటు ప్రయోజనాన్ని బ్యాంకింగ్ కస్టమర్లకు బదలాయిస్తే, గృహ, రుణ, వాహన రుణాలపై కస్టమర్ల నెలవారీ చెల్లింపులు (ఈఎంఐ) తగ్గుతాయి. అయితే తమకు లభించిన రేటు ప్రయోజనాన్ని యథాతథంగా బ్యాంకింగ్ కస్టమర్లకు బదలాయించడం లేదన్న విమర్శ అన్ని వర్గాల నుంచీ వ్యక్తమవుతుంది. ఆర్బీఐ తాజాగా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ, తగ్గించిన రేటు ప్రయోజనాన్ని కస్టమర్లకు అందేలా బ్యాంకులు తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ఫిబ్రవరిలో పావుశాతం రేటు తగ్గిస్తే, కొన్ని బ్యాంకులు తమ ఎంసీఎల్ఆర్ (మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్స్) కేవలం 5 నుంచి 10 బేసిస్ పాయింట్లే తగ్గించిన విషయాన్ని గుర్తుచేసింది. మరింత రేటు కోత అవసరాన్ని స్పష్టంచేసింది. కాగా రెపో రేటు, బాండ్ ఈల్డ్స్ వంటి బెంచ్‌మార్క్ రేట్లతో వ్యక్తిగత, గృహ, ఆటో, చిన్న, మధ్య తరహా పరిశ్రమల రుణాల అనుసంధానంపై బ్యాంకులతో ఆర్బీఐ మరిన్ని చర్చలు జరుపుతుందని ఆర్బీఐ ప్రకటన పేర్కొంది. దీనితో ఇందుకు సంబంధించి తుది మార్గదర్శకాల జారీ మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. యథాతథమే బెటరన్న ఇరువురు కాగా రేటు కోత నిర్ణయం ఏకాభిప్రాయ ప్రాతిపదికన జరగలేదు. ఇరువురు సభ్యులు ఇందుకు ‘నో’ అన్నారు. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ విరాల్ ఆచార్య, ఎంసీసీ సభ్యుడు ఛేతన్ ఘాటే ఇందులో ఉన్నారు. ఆర్బీఐ గవర్నర్‌తో పాటు పామీదువా, రవీంద్ర దోలాకియా, మైఖేల్పాత్రలు రేటుకోతకు సానుకూలంగా ఓటు వేశారు. ఇక ద్రవ్య వ్యవస్థకు సంబంధించి అనుసరించాల్సిన వైఖరిపై ఆరుగురిలో ఐదుగురు ప్రస్తుతం ఉన్న ‘న్యూట్రల్’ (తటస్థం)ను కొనసాగించాలని పేర్కొంటే, రవీంద్ర డోలాకియా మాత్రం ‘అకామిడేటివ్’ (సర్దుబాటుకు అనువైన) విధానాన్ని అనుసరించడానికి ఓటు చేశారు. దీనితో తటస్థం విధానాన్నే ఆర్బీఐ ఎంచుకున్నట్లయ్యింది. ధరా‘భయం’ ఉపశమనం... ద్రవ్యోల్బణం రేటు అంచనాలను మాత్రం ఆర్బీఐ తగ్గించింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో ద్రవ్యోల్బణం 2.9–3 శాతం శ్రేణిలో ఉంటుందని ఆర్బీఐ అంచనా వేసింది. ఫిబ్రవరిలో ఈ అంచనాలను 3.2–3.4 శ్రేణిగా ఆర్బీఐ పేర్కొంది. కాగా ఆర్థిక సంవత్సరం రెండవ భాగంలో 3.5–3.8% వరకూ ఉంటుందని అంచనావేసింది. అంటే ఆర్బీఐ లక్ష్యం 4% దిగువనే ద్రవ్యోల్బణం ఉంటుందన్నమాట. ఫిబ్రవరిలో వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 2.57 శాతం. కాగా ఆహార, ఇంధన ధరలు తీవ్రంగా పెరిగితే మాత్రం మొత్తంగా ద్రవ్యోల్బణం పెరుగుతుందని ఆర్బీఐ పేర్కొంది. వృద్ధి, ద్రవ్యోల్బణం ప్రాతిపదికగా... ‘తాజా నిర్ణయానికి ప్రధానంగా రెండు అంశాలు కారణం. ఒకటి వృద్ధిరేటు మందగమనంలో ఉండడం. రెండవది ద్రవ్యోల్బణం అదుపులో ఉండడం. ధరల స్పీడ్ తక్కువగా ఉన్నందువల్ల వృద్ధి లక్ష్యంగా రేటు కోతకు తగిన సమయమని భావించడం జరిగింది. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిల్లో ఎగుమతుల వృద్ధి బలహీనంగా ఉంది. దిగుమతులు విషయానికి వస్తే, చమురు యేతర దిగుమతులు తగ్గాయి. బంగారం దిగుమతులూ తగ్గాయి. దేశంలో వృద్ధి మందగమన పరిస్థితులను ఇది సూచిస్తోంది. ఇక ఆర్థిక వ్యవస్థలో లిక్విడిటీ (ద్రవ్య లభ్యత) అవరోధాలు లేకుండా చూస్తాం’ అని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థ ఎదురీత... దేశీయ ఆర్థిక వ్యవస్థ ఎదురీదుతోందని విధాన ప్రకటన తెలిపింది. ప్రత్యేకించి అంతర్జాతీయ రంగంలో తీవ్ర ప్రతికూలతలను ఎదుర్కొంటున్నట్లు పేర్కొంది. దీనితో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధిరేటును 7.2 శాతంగా అంచనా వేస్తున్నట్లు పేర్కొంది. ఫిబ్రవరిలో ఈ రేటును 7.4 శాతంగా అంచనా వేసింది. అంటే 20 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) కోత పెట్టిందన్నమాట. డిసెంబర్ త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)వృద్ధి రేటు 6.6 శాతానికి పడిపోయిన సంగతి తెలిసిందే. ప్రైవేటు పెట్టుబడుల్లో బలహీనత దీనికి కారణం. బలహీనంగా ఉన్న ప్రైవేటు పెట్టుబడులకు ఊతం ఇవ్వడం ద్వారా దేశీయ వృద్ధి రేటును పటిష్ట పరచుకోవాల్సి ఉందని ప్రకటన పేర్కొంది. ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో వృద్ధి రేటు 6.8 శాతం నుంచి 7.1 శాతం శ్రేణిలో ఉంటుందని సెంట్రల్ బ్యాంక్ అంచనా వేయగా, రెండవ అర్ధభాగంలో 7.3 శాతం నుంచి 7.4 శాతం మధ్య ఉంటుందని భావించింది. సుప్రీం తీర్పు వ్యతిరేకం కాదు... మొండిబకాయిలకు సంబంధించి 2018 ఫిబ్రవరి 12 ఆర్బీఐ సర్క్యులర్‌ను సుప్రీం కోర్టు తోసిపుచ్చిందంటే.. దానర్థం, ఆర్బీఐ అధికారాలను తీసుకుందని కాదు. ఇందుకు సంబంధించిన అధికారాలను ఎలా వినియోగించాలన్నది సుప్రీంకోర్టు సూచించింది. అందువల్ల ఎన్పీఏ పునర్వ్యవస్థీకరణ, పరిష్కార ప్రణాళికలకు సంబంధించి త్వరలో ఆర్బీఐ సవరిత మార్గదర్శకాలను జారీ చేస్తుంది. ఎన్పీఏల సత్వర పరిష్కారానికి ఆర్బీఐ కట్టుబడి ఉంది. బ్యాంకింగ్ స్థిరత్వానికి ఇది ఎంతో అవసరం. మొత్త ఫైనాన్షియల్ రంగంలో పరిస్థితులకు అనుసంధానమైన అంశం ఇది. ఆర్బీఐ నియంత్రణలో ఉన్న ఒక సంస్థ సహా (కొటక్ మహీంద్రా బ్యాంక్) విద్యుత్ కంపెనీలు ఆర్బీఐని కోర్టుకు లాగడం ఆందోళనకరమన్న విశ్లేషణలు సరికాదు. ఏ సంస్థ నిర్ణయాన్నైనా చట్టం ముందు సవాలు చేయడం ఒక రాజ్యాంగ హక్కు. ఐఎల్ ఎఫ్ఎస్ రుణాలను ఎన్పీఏలుగా ప్రకటించవద్దని ఎన్సీఎల్ఏటీ ఇచ్చిన రూలింగ్ విషయానికి వస్తే, దీనిని సవరించవలసిందిగా ఆర్బీఐ ఇప్పటికే ఒక పిటిషన్ దాఖలు చేసింది. ఇక గణాంకాల విషయానికి వస్తే, అధికారికంగా అందిన డేటాకు అనుగుణంగా ఆర్బీఐ నిర్ణయాలు తీసుకుంటుంది. ఆర్థిక వ్యవస్థపై అంచనాలు, తమ పాలసీలపై స్పందనలకు అనుగుణంగా వ్యవహరిస్తుంది. కార్పొరేట్ రుణాలకు సెకండరీ మార్కెట్ అభివృద్ధిపై కార్యాచరణ బృందం ఏర్పాటు చేయడం జరుగుతుంది. – శక్తికాంత్ దాస్, ఆర్బీఐ గవర్నర్ రేట్ల తగ్గింపును బ్యాంకులు బదలాయిస్తే మంచిదే: పరిశ్రమలు పారిశ్రామిక వర్గాలు రేటు తగ్గింపును స్వాగతించాయి. పెట్టుబడులకు ప్రోత్సాహం ఇచ్చే అంశంగా పేర్కొన్నాయి. వినియోగ వ్యయాలు పెరుగుతాయని విశ్లేషించాయి. అయితే తాజా రేటు కోత ప్రయోజనాలన్ని బ్యాంకులు కస్టమర్లకు బదలాయిస్తేనే ఇది సాధ్యమని పేర్కొన్నాయి. ఫిక్కీ ప్రెసిడెంట్ సందీప్ సోమానీ మాట్లాడుతూ, ద్రవ్యోల్బణం కట్టడిలో ఉండడం రేటు కోతకు దోహదపడిందన్నారు. రేటు మరికొంత తగ్గింపునకూ అవకాశం ఉందని పీహెచ్‌డీసీసీఐ ప్రెసిడెంట్ రాజీవ్ తల్వార్ అభిప్రాయపడ్డారు. వృద్ధి పటిష్టతపై ఆర్బీఐ పాలసీ దృష్టి సారించిందని సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ పేర్కొన్నారు. అయితే రేటు తగ్గింపు ప్రయోజనాన్ని కస్టమర్లకు బదలాయించడానికి బ్యాంకింగ్ తగిన చర్యలు తీసుకోవాలని వీరు అభిప్రాయపడటం గమనార్హం. బ్యాంకుల నుంచి స్పందన నిల్... ఆర్బీఐ వరుసగా రెండవదఫా రేటుకోత నిర్ణయం తీసుకున్నా... ఈ ప్రయోజనాన్ని తక్షణం కస్టమర్లకు బదలాయించడంపై బ్యాంకుల నుంచి తగిన స్పందన రాలేదు. పాలసీ బాగుందని పేర్కొన్నా, తమ నుంచి రేటు కోతపై ఏ బ్యాంక్ నుంచీ తక్షణం ఎటువంటి స్పష్టమైన ప్రకటనలు వెలువడలేదు. సంక్లిష్టతలు ఉన్నాయ్ జీడీపీ రేటు అంచనా తగ్గింది. ద్రవ్యోల్బణం అదుపులో ఉంటుందన్న అంచనాలు ఉన్నా, తగిన వర్షపాతం లేకపోతే పరిస్థితి మరింత క్లిష్టంగా ఉంటుంది. లిక్విడిటీ లభ్యతలకు చర్యలు బాగున్నాయి. ముందుచూపుతో రూపొందించిన ద్రవ్య విధానమిది. మార్కెట్ భాగస్వాముల డిమాండ్‌ను నెరవేర్చుతుంది. – రజనీష్ కుమార్, ఎస్బీఐ చీఫ్ బ్యాంకింగ్‌కు సానుకూలం రేటు తగ్గింపు, లిక్విడిటీ అందుబాటులో ఉంచడానికి తగిన చర్యలు బ్యాంకర్లకు సానుకూలం. అలాగే రేటు తగ్గింపు ప్రయోజనం సత్వర బదలాయింపునకూ ఈ నిర్ణయం దోహదపడుతుంది. రేటు కోత ఆర్థిక వృద్ధికి దోహదపడుతుంది. ధరలు అదుపులో ఉంటాయన్న అంచనాలు సానుకూలం. – సునిల్ మెహతా, ఐబీఏ చైర్మన్ భయపడాల్సింది ఏదీలేదు ఆర్బీఐ తాజా పాలసీ సమీక్షలో దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు అంచనాలను తగ్గించినంత మాత్రాన భయపడాల్సింది ఏమీలేదు. వృద్ధికి సంబంధించి రానున్న కాలంలో ఆశాజనకమైన పలు అంశాలు ఉన్నాయి. బడా కార్పొరేట్ కంపెనీలకు రుణ వృద్ధి అంతకంతకూ పెరుగుతుండడం ఇందులో ఒకటి. – కృష్ణమూర్తి సుబ్రమణ్యం, ప్రధాన ఆర్థిక సలహాదారు ఆర్బీఐ రిజర్వ్స్‌పై త్వరలో జలాన్ నివేదిక రిజర్వ్ బ్యాంక్ వద్ద నిల్వలు ఏ స్థాయిలో ఉండాలన్న అంశంపై ఆర్బీఐ మాజీ గవర్నర్ బిమల్ జలాన్ నేతృత్వంలో ఏర్పాటయిన కమిటీ త్వరలో తన నివేదికను సమర్పిస్తుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. కమిటీ ప్రస్తుతం ముమ్మర చర్చల్లో ఉందన్నారు. ఆర్బీఐ వద్ద జూన్ నాటికి రూ.9.43 లక్షల కోట్ల అదనపు నిల్వలున్నాయి. నగదు, బంగారం రీవాల్యుయేషన్ (రూ.6.91 లక్షల కోట్లు), కంటెంజెన్సీ ఫండ్ (రూ.2.32 లక్షల కోట్లు) ద్వారా ఈ నిధులు సమకూరాయి. భారీ ద్రవ్యలోటును పూడ్చుకోవడంలో భాగంగా ఆర్బీఐ నిధుల్లో అధిక మొత్తాన్ని కేంద్రం కోరుతున్నట్లు వార్తలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. -
కుదిరితే మరిన్ని కోతలు
ధరలు తగ్గుముఖం పట్టడంతో అన్ని రంగాలకు రుణాల వృద్ధి కోసమే రేట్లను పావుశాతం మేర తగ్గించామని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ఎంపీసీ విధాన ప్రకటన తర్వాత మీడియాతో పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం అంచనాల పరిధిలోనే తక్కువగా ఉంటే భవిష్యత్తులో మరిన్ని రేట్ల కోతలు ఉంటాయని స్పష్టం చేశారు. ఆర్బీఐ చట్ట నిబంధనల పరిధిని మించి ఎంపీసీ ఏమీ చేయలేదని స్పష్టం చేశారు. ‘‘వచ్చే 12 నెలల కాలంలో ద్రవ్యోల్బణం 3.9 శాతం పరిధిలో... గరిష్టంగా 4 శాతం లేదా అంతకులోపు ఉంటే రేట్ల తగ్గింపును పరిశీలించే అవకాశం ఉంటుంది’’అని దాస్ పేర్కొన్నారు. బడ్జెట్లో ప్రతిపాదనల వల్ల ద్రవ్యలోటు, ద్రవ్యోల్బణంపై పడే ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకున్న తర్వాతే కొత్త ద్రవ్యోల్బణం అంచనాలకు వచ్చినట్టు చెప్పారు. లిక్విడిటీ సమస్య లేదు వ్యవస్థలో లిక్విడిటీ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని, కీలకమైన ఏ రంగానికీ నిధుల లభ్యత (లిక్విడిటీ) సమస్య లేదని శక్తికాంతదాస్ తెలిపారు. అవసరమైనప్పుడు తగినన్ని నిధులను అందుబాటులోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ (ఓఎంవో) ద్వారా వ్యవస్థలోకి రూ.2.36 లక్షల కోట్లను తీసుకొచ్చామని, ఫిబ్రవరి నెలలో రూ.37,500 కోట్లను తీసుకురానున్నట్టు ఇప్పటికే ప్రకటించిన విషయాన్ని విరాళ్ ఆచార్య గుర్తు చేశారు. ఎన్పీఏ నిబంధనల్లో మార్పుల్లేవు రుణ చెల్లింపుల్లో ఒక్కరోజు విఫలమైనా ఎన్పీఏలుగా గుర్తించాలన్న 2018 ఫిబ్రవరి 12 నాటి ఉత్తర్వుల్లో ఎటువంటి మార్పులను చేయడం లేదని శక్తికాంతదాస్ స్పష్టం చేశారు. ఇప్పటికైతే ఇందుకు సంబంధించి ఎటువంటి ప్రతిపాదనా లేదన్నారు. నాటి ఉత్తర్వుల మేరకు బ్యాంకులు నిర్ణీత గడువులోపు రుణ చెల్లింపులు చేయని ఖాతాల విషయంలో నిర్ణీత వ్యవధిలోపు పరిష్కారం చూడడం, విఫలమైతే ఐబీసీ చట్టం కింద ఎన్సీఎల్టీకి నివేదించడం చేయాల్సి ఉంటుంది. మధ్యంతర డివిడెండ్... న్యాయబద్ధమే ప్రభుత్వం ఆర్బీఐ నుంచి మధ్యంతర డివిడెండ్‌ను కోరడం చట్టబద్ధమేనని, ఈ నిధులను దేనికి వినియోగించుకోవాలన్నది ప్రభుత్వ ఇష్టమేనని దాస్ చెప్పారు. ఆర్బీఐ నుంచి మరిన్ని నిధులను బదిలీ చేయాలన్న ప్రభుత్వ డిమాండ్లతోనే ఉర్జిత్ పటేల్ గవర్నర్ పదవి నుంచి తప్పుకున్నట్టు అప్పట్లో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ‘‘మిగులు నిధులు లేదా మధ్యంతర డివిడెండ్‌ను ప్రభుత్వానికి చెల్లించడం అన్నది ఆర్బీఐ చట్టం పరిధిలోనిదే. ఈ చట్టపరమైన నిబంధనలను దాటి మేమేమీ చేయడం లేదు’’ అని దాస్ స్పష్టం చేశారు. చందాకొచర్‌పై నిర్ణయం దర్యాప్తు సంస్థలదే... ఐసీఐసీఐ బ్యాంకు మాజీ సీఈవో చందాకొచర్ వ్యవహారంలో దాస్ తొలిసారి స్పందించారు. ఈ కేసులో చర్యలు తీసుకోవడం దర్యాప్తు సంస్థల పరిధిలోనే ఉందన్నారు. నిబంధనలను వ్యక్తులు లేదా గ్రూపు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకునే విషయంలో ఆర్బీఐ పాత్ర పరిమితమేనన్నారు. ఒకవేళ ఏదైనా అంశాల్లో దర్యాప్తు అవసరం అయితే తదుపరి చర్యల అధికారం వారి పరిధిలోనే ఉంటుందని స్పష్టం చేశారు. సాగు రంగానికి వెసులుబాటు హామీల్లేకుండా వ్యవసాయానికి ఇచ్చే రుణాల పరిమితిని రూ.1 లక్ష నుంచి రూ.1.6 లక్షలకు పెంచుతూ ఆర్బీఐ ఎంపీసీ నిర్ణయం తీసుకుంది. వ్యవసాయ రంగానికి రుణాల పరిస్థితిని సమీక్షించి ఆచరణాత్మక విధానాన్ని సూచించేందుకు ఓ అంతర్గత వర్కింగ్ గ్రూపును ఏర్పాటు చేయనుంది. గత కొన్నేళ్లలో వ్యవసాయ రంగానికి రుణాల పంపిణీ వృద్ధి గణనీయంగా ఉన్నప్పటికీ... ఈ రుణాల పంపిణీ విషయంలో ప్రాంతాల మధ్య అంతరాలు, కవరేజీ విస్తృతి వంటి సమస్యలు ఉన్నట్టు ఆర్బీఐ పేర్కొంది. ఈ అంశాలను ఆర్బీఐ వర్కింగ్ గ్రూపు పరిగణనలోకి తీసుకోనుంది. డిపాజిట్లకు నిర్వచనంలో మార్పు బ్యాంకులకు డిపాజిట్ల సమీకరణ విషయంలో ఆర్బీఐ కొంత స్వేచ్ఛ కల్పించింది. ప్రస్తుతం రూ.కోటి ఆపై మొత్తాలను బల్క్ డిపాజిట్లుగా పరిగణిస్తుంటే, దీన్ని రూ.2 కోట్లు, అంతకంటే ఎక్కువకు మార్చింది. బ్యాంకులు చిన్న డిపాజిట్ల కంటే బల్క్ డిపాజిట్లపై కొంత మేర అదనపు వడ్డీని ఆఫర్ చేస్తుంటాయి. బ్యాంకులు తమ అవసరాలు, ఆస్తులు, అప్పుల నిర్వహణ సమతుల్యత కోసం బల్క్ డిపాజిట్లపై భిన్నమైన రేటును ఆఫర్ చేసే స్వేచ్ఛ వాటికి ఉంటుంది. అర్బన్ కోపరేటివ్ బ్యాంకులకు అంబ్రెల్లా ఆర్గనైజేషన్ ఏర్పాటుకు త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్టు ఆర్బీఐ తెలిపింది. దివాలా ప్రక్రియలో పాల్గొనే బిడ్డర్లకు ఈసీబీ సదుపాయం దివాలా అండ్ బ్యాంక్రప్టసీ కోడ్ (ఐబీసీ) పరిధిలోని కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియ (సీఐఆర్‌పీ)లో పాల్గొనే కంపెనీలు ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్ (ఈసీబీ) మార్గంలో నిధుల సమీకరణకు ఆర్బీఐ అవకాశం కల్పించింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం విదేశీ కరెన్సీ లేదా రూపాయి మారకంలో ఈసీబీ ద్వారా సమీకరించే నిధులను తిరిగి చెల్లింపులు లేదా రూపాయి మారకంలోని రుణాలను తీర్చివేసేందుకు అనుమతి లేదు. మరో రేటు కోత అంచనా! తాజా రేటు తగ్గింపు వృద్ధికి దోహదపడే అంశమని పలు వర్గాలు, విశ్లేషకులు పేర్కొంటున్నారు. దీనితోపాటు త్వరలో మరో దఫా రేటు కోత తథ్యమని మెజారిటీ విశ్వసిస్తోంది. తాజా పాలసీపై పలువురి అభిప్రాయాలు ఇలా... తటస్థ వైఖరి... సానుకూలం పాలసీపై ‘తటస్థం’ దిశగా ఆర్బీఐ అడుగులు వేయడం ప్రస్తుత పరిస్థితుల్లో వృద్ధికి తగిన సానుకూలతను సృష్టిస్తోంది. ధరలు పెరక్కపోతే మరో కోతకు చాన్సుంది. – అభీక్ బారువా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రెండు కీలక నిర్ణయాలు ఆర్బీఐ తీసుకున్న నిర్ణయాలతో రైతులకు మరింత రుణం అందుబాటులోకి వస్తుంది. దీనివల్ల రైతుల రుణ సమస్యలు కొంత తీరుతాయి. ఇక వ్యవస్థలో మొత్తంగా రుణ డిమాండ్ పెరుగుతుంది. – దినేష్ ఖేరా, ఎస్బీఐ ఎండీ వేచి చూడాల్సి ఉంది వృద్ధికి తాజా పాలసీ కొంత అవకాశం కల్పించింది. అయితే పూర్తి ఫలితానికి వేచి చూడాల్సి ఉంటుంది. ద్రవ్యలోటుసహా పలు అంశాలపై వృద్ధి జోరు ఆధారపడి ఉంటుంది. – ప్రజుల్ భండారీ, హెచ్ఎస్బీసీ (ఇండియా) చీఫ్ ఎకనమిస్ట్ మరింత తగ్గింపు ఉండవచ్చు ఆర్బీఐ నిర్ణయం హర్షణీయం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉన్న ప్రస్తుత తరుణంలో రేటు తగ్గింపు మరో విడత ఉండవచ్చని భావిస్తున్నాం. పెట్టుబడులు, వినియోగం పెరుగుదలకు ఇది అవసరం. – సందీప్ సోమానీ, ఫిక్కీ ప్రెసిడెంట్ ఏప్రిల్‌లో మరో కోత ఏప్రిల్‌లో మరో దఫా రేటు కోత ఉండే అవకాశం ఉంది. ద్రవ్యోల్బణం తక్కువగా ఉండడం, పారిశ్రామిక వృద్ధి మందగమనం దీనికి కారణం. ఆర్బీఐ నిర్ణయాలు వ్యవస్థలో లిక్విడిటీని పెంచుతున్నాయి. – రాధికారావు, డీబీఎస్ ఎకనమిస్ట్ బ్యాంకింగ్ రంగానికి సానుకూలం శక్తికాంతదాస్ మొదటి పాలసీ బ్యాంకింగ్‌పై పెద్ద స్థాయిలో సానుకూల ప్రభావం చూపుతుంది. వ్యవస్థలో రుణ వృద్ధికి అలాగే మొత్తంగా ఆర్థిక వ్యవస్థ పురోగతికి దోహదపడే నిర్ణయం ఇది. – సునిల్ మెహతా, ఐబీఏ చైర్మన్ -
వడ్డీ రేట్లు తగ్గించాలి
న్యూఢిల్లీ: దేశ వృద్ధి రేటుకు ఊతమిచ్చేందుకు కీలకమైన వడ్డీ రేట్లను, నగదు నిల్వల నిష్పత్తిని తగ్గించాలని దేశ పారిశ్రామిక సంఘాలు ఆర్బీఐని కోరాయి. కీలకమైన మానిటరీ పాలసీ సమీక్షకు ముందు దేశ పారిశ్రామిక ప్రతినిధులతో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ గురువారం ముంబైలో సమావేశమై వారి అభిప్రాయాలను తెలుసుకునే ప్రయ త్నం చేశారు. ద్రవ్యోల్బణం కనిష్ట స్థాయికి దిగొచ్చినందున రుణాలపై అధిక వ్యయాలను తగ్గించాలని, కఠిన ద్రవ్య లభ్యత పరిస్థితులను సులభతరం చేసే దిశగా చర్యలు చేపట్టాలని పారిశ్రామికవేత్తలు ఈ సందర్భంగా కోరారు. 2018–19 ఆర్థిక సంవత్సరానికి ఆరవ ద్వైమాసిక పాలసీ సమీక్ష ఫిబ్రవరి 7న జరగనుంది. ప్రస్తుతం సీఆర్ఆర్ 4 శాతం (బ్యాంకు డిపాజిట్లలో ఆర్బీఐ వద్ద ఉంచాల్సిన నిష్పత్తి), రెపో రేటు 6.5 శాతంగా (బ్యాంకులకు ఆర్బీఐ ఇచ్చే రుణాలపై రేటు) ఉన్నాయి. సీఐఐ సూచనలు ఇవీ... ‘‘నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్)ని కనీసం అర శాతమయినా తగ్గించాలి. ద్రవ్యోల్బణం స్థిరంగా కనిష్ట స్థాయిల్లో కొనసాగుతున్నందున రెపో రేటును సైతం అరశాతం తగ్గించడాన్ని పరిశీలించాలి. తద్వారా రుణాలపై అధిక వ్యయ భారాన్ని తగ్గించాలి. ఎంఎస్ఎంఈ, ఇన్ఫ్రా రంగానికి రుణ సదుపాయాన్ని పెంచాలి’’ అని సీఐఐ సూచించింది. ద్రవ్యలభ్యత పెంపునకు ఆర్బీఐ తీసుకున్న చర్యలను ప్రశంసించింది. ఎంఎస్ఎంఈ రంగం ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లను పరిష్కరించేందుకు, బ్యాంకులు కోరే అదనపు హామీలను పరిమితం చేసే అంశాన్ని పరిశీలించాలని కోరింది. సరైన హామీలు ఇచ్చినప్పుడు వ్యక్తిగత హామీలు ఇవ్వాల్సిన అవసరం లేకుండా చూడాలని కోరింది. సీఐఐ ప్రెసిడెంట్ డిసిగ్నేట్ ఉదయ్ కోటక్ ఆధ్వర్యంలో ఈ సూచనలు చేశారు. కొనుగోలు దారులకు క్రెడిట్ సదుపాయం కల్పించే లెటర్స్ ఆఫ్ అండర్‌టేకింగ్‌లను (ఎల్ఓయూ) ఎంఎస్ఎంఈలకు కూడా జారీ చేసేలా బ్యాంకులను ఆదేశించాలని కోరింది. బలహీన బ్యాంకుల విషయంలో కచ్చితమైన దిద్దుబాటు కార్యాచరణను పునఃసమీక్షించాలని, కనీసం ఆయా బ్యాంకులను నేషనల్ హౌసింగ్ బ్యాంకుకు రుణాలిచ్చేందుకు అయినా అనుమతించాలని కోరింది. దీనివల్ల హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలకు నిధుల లభ్యత పెరుగుతుందని అభిప్రాయపడింది. వృద్ధిని కూడా చూడాలి... రెపో రేటు, సీఆర్ఆర్ను తగ్గించాలని మరో పారిశ్రామిక సంఘం ఫిక్కీ కూడా ఆర్బీఐ గవర్నర్‌ను కోరింది. దీని వల్ల దేశంలో పెట్టుబడులు పుంజుకుంటాయని, వినియోగాన్ని పెంచి వృద్ధికి తోడ్పడతాయని ఫిక్కీ ప్రెసిడెంట్ సందీప్ సోమాని పేర్కొన్నారు. ‘‘వృద్ధిపై దృష్టి సారించేలా సర్దుబాటుతో కూడిన మానిటరీ పాలసీ అవసరం. మానిటరీ పాలసీ ఉద్దేశ్యాలు కేవలం ధరల స్థిరత్వానికే పరిమితం కాకూడదు. వృద్ధి రేటు, కరెన్సీ మారకం స్థిరత్వానికి కూడా అవసరమే’’ అని సందీప్ సోమాని సూచించారు. దేశంలో నగదు లభ్యత పెంచే విధంగా ఆర్బీఐ మానిటరీ పాలసీ ఉండాలని, ద్రవ్య లభ్యత వృద్ధిని నిలబెట్టగలదని అసోచామ్ సూచించింది. ‘‘ఎన్బీఎఫ్సీ, హెచ్ఎఫ్సీల నిధుల సమీకరణ సామర్థ్యాలు గణనీయంగా తగ్గాయి. నిధుల సమీకరణకు ప్రత్యామ్నాయ మార్గాలను వాటికి కల్పించాల్సి ఉంది. కేవలం ఎన్బీఎఫ్సీ, హెచ్ఎఫ్సీల ఆరోగ్యం కోసమే కాదు, జీడీపీ స్థిరమైన వృద్ధికి కూడా ఇది తప్పనిసరి అవసరం’’ అని అసోచామ్ తన సూచనల్లో పేర్కొంది. మరింత కరెన్సీ అవసరం: ఆర్బీఐ కోల్‌కతా: దేశ జీడీపీ పరిమాణం పెరుగుతున్న కొద్దీ వ్యవస్థలో మరింత నగదు అవసరం ఉంటుందని రిజర్వ్ బ్యాంకు అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. 2016 నవంబర్‌లో పెద్ద నోట్ల రద్దు తర్వాత వ్యవస్థలో నగదుకు కొరత ఏర్పడిన విషయం విదితమే. -
ఇక రూ.500 నోట్లపై దృష్టి పెడతాం
న్యూఢిల్లీ: నోట్ల సమస్య రోజురోజుకు తగ్గిపోతోందని కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శి శక్తికాంత దాస్ అన్నారు. ఇప్పటి వరకు రూ.2000 నోట్లు ముద్రించడంపైనే దృష్టి సారించామని, ఇక నుంచి రూ.500 నోట్లను ఎక్కువగా ప్రింట్ చేస్తామని చెప్పారు. 50శాతం నోట్లను ఇప్పటికే మార్చేశామని ఆయన చెప్పారు. కోపరేటివ్ బ్యాంకులకు కూడా డబ్బులు ఇస్తున్నామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాలకు పెద్ద మొత్తంలో డబ్బులు పంపేందుకు ప్రయత్నం చేస్తున్నామని వివరించారు. అలాగే, దూర ప్రాంతాలకు విమానాల్లో డబ్బు పంపిస్తున్నామన్నారు. ఇప్పుడు వస్తున్న కొత్త నోట్లు పూర్తిగా సురక్షితమని ఆయన స్పష్టం చేశారు. తక్కువ మొత్తాల్లో విత్ డ్రా చేసుకునే వారికోసం రూ.100 నోట్లను ఏడాదికి పంపించేన్ని నోట్లను కేవలం ఐదు వారాల్లోనే మూడింతలు బ్యాంకులకు పంపిచామని చెప్పారు. దేశంలో మొత్తం రెండులక్షల 20 వేల ఏటీఎంలు ఉన్నాయని, వాటిలో రెండులక్షల ఏటీఎంలలో సాఫ్ట్వేర్ ఇప్పటికే అవసరానికి తగినట్లుగా మార్చడం జరిగిందన్నారు. అక్రమంగా డబ్బు నిల్వలు ఉంచిన వారిపై, పెద్ద మొత్తంలో నల్లధనం కూడబెట్టిన వారిపై, బ్యాంకు అధికారులపై ఈడీ చర్యలు తప్పక ఉంటాయని స్పష్టం చేశారు. ఇప్పుడు ఈడీ అందుకే అనూహ్య దాడులు చేస్తోందని, వీటిని సర్జికల్ స్ట్రైక్స్ అనుకోవచ్చని చెప్పారు.