![Govt to ban cryptocurrencies in India, FM Nirmala Sitharaman replies - Sakshi](/styles/webp/s3/article_images/2022/02/11/FM%20Nirmala%20Sitharaman%20Rajya%20Sabha.jpg.webp?itok=i4ZrAWZy)
న్యూఢిల్లీ: పార్లమెంటు బడ్జెట్ సమావేశాల సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ క్రిప్టోకరెన్సీలపై నేడు రాజ్యసభలో మాట్లాడారు. నిపుణుల సంప్రదింపుల తర్వాత క్రిప్టోకరెన్సీలను దేశంలో నిషేదించాలా.. వద్దా? అనే దానిపై . కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. వర్చువల్ కరెన్సీల వల్ల వచ్చే లాభాలపై కేంద్ర ప్రభుత్వం 30 శాతం పన్ను విధించడానికి ప్రైవేట్ క్రిప్టోకరెన్సీల చట్టబద్ధతతో సంబంధం లేదని పేర్కొన్నారు. క్రిప్టోకరెన్సీ లావాదేవీల వల్ల వచ్చిన లాభంపై పన్ను విధించే సార్వభౌమ హక్కు ప్రభుత్వానికి ఉందని ఆర్థిక మంత్రి తెలిపారు.
"క్రిప్టోకరెన్సీలను దేశంలో నిషేదించాలా.. వద్దా? అనేది నిపుణుల సంప్రదింపుల తర్వాత తెలుస్తుంది" అని రాజ్యసభలో ఎఫ్ఎం సీతారామన్ తెలిపారు. తన బడ్జెట్ ప్రసంగంలో ఎఫ్ఎం సీతారామన్ వ్యక్తి ఆదాయపు పన్ను స్లాబ్తో సంబంధం లేకుండా క్రిప్టోకరెన్సీ వ్యాపారాల లాభాలపై 30 శాతం పన్ను విధించే ప్రతిపాదనను ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. అయితే, చాలా మంది మన దేశంలో క్రిప్టోకరెన్సీలకు చట్టబద్దత వచ్చినట్లు భావిస్తున్నారు. అయితే, ఈ విషయం మీదే నేడు సీతారామన్ స్పష్టత ఇచ్చారు.
ఫిబ్రవరి 10న జరిగిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) ద్రవ్య పరపతి సమీక్షా సమావేశంలో గవర్నర్ శక్తికాంత దాస్ మాట్లాడుతూ.. ఆర్థిక వ్యవస్థ, ఫైనాన్షియల్ స్థిరత్వాలకు ఈ కరెన్సీ ముప్పని స్పష్టం చేశారు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఇన్వెస్టర్లను గవర్నర్ హెచ్చరించారు. అటువంటి అసెట్స్‌కు ఎటువంటి అంతర్లీన విలువా ఉండదని గవర్నర్ అన్నారు. క్రిప్టో కరెన్సీ.. తులిప్ పువ్వుకన్నా దిగదుడుపని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆయన 17వ శతాబ్దంలో వచ్చిన ‘తులిప్ మ్యానియా’ను గుర్తుచేశారు.
(చదవండి: ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసేవారికి ఆ రెండు బ్యాంకులు శుభవార్త..!)
Comments
Please login to add a commentAdd a comment