
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ: క్రిప్టో కరెన్సీలపై భారత్ విధానం మారబోదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. కరెన్సీలను ప్రభుత్వం లేదా సెంట్రల్ బ్యాంకులే జారీ చేయాలే తప్ప క్రిప్టోలను కరెన్సీగా గుర్తించే ప్రసక్తే లేదన్నారు. ఇటువంటి అసెట్స్‌ను నియంత్రించే దిశగా సమగ్రమైన ఫ్రేమ్‌వర్క్ రూపొందించే అంశాన్ని జీ20 కూటమి పరిశీలిస్తోందని మంత్రి పేర్కొన్నారు.
మరోవైపు, ప్రపంచ మార్కెట్లు అనేక ఒడిదుడుకులకు లోనవుతున్నా దేశీయంగా స్టాక్ మార్కెట్ స్థిరంగానే వ్యవహరిస్తోందని ఆమె పేర్కొన్నారు. కాబట్టి మార్కెట్‌ను దాని మానాన వదిలేయాలని అభిప్రాయపడ్డారు. స్మాల్, మిడ్ క్యాప్ స్టాక్స్‌లో బబుల్ తరహా పరిస్థితులు ఉన్నాయని, వాటిపై చర్చాపత్రాన్ని తెచ్చే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చైర్‌పర్సన్ మాధవి పురి ఇటీవల తెలిపిన నేపథ్యంలో మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment