
న్యూఢిల్లీ: భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) కొత్తగా ఆకుపచ్చ రంగులో రూ. 20 కరెన్సీ నోటును చలామణిలోకి తీసుకురానుంది. ఈ కొత్త రూ.20 నోట్‌పై రిజర్వుబ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ సంతకం ఉంటుంది. ఈ నోటుపై కొత్త డిజైన్లు, అందులో కలిసేలా రేఖాగణిత నమూనాలు ఉంటాయి. గతంలోలాగే గాంధీజీ సిరీస్‌లోనే ఈ కొత్త నోట్ కూడా ఉంటుంది. కొత్త 20 రూపాయల నోటు వెనుకవైపు మన చారిత్రక వారసత్వ సంపదైన ఎల్లోరా గుహల చిహ్నం ఉంటుంది. నోటుకు, వెనుకవైపు స్వచ్ఛభారత్ లోగో, నినాదం ఉంటాయి. ఎల్లోరా గుహల చిత్రం, దేవనాగరి లిపిలో 20 అంకె ఉంటుంది. కొత్త నోట్‌తోపాటు పాత నోట్లూ చలామణిలోనే ఉంటాయని ఆర్‌బీఐ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment