Ellora Caves
-
కైలాస్నాథ్... చరణాద్రి శిఖరం
ఎల్లోరా గుహలు గురించి చాలామంది ఎన్నోసార్లు విని ఉంటారు, ఒకటి – రెండు సార్లయినా చూసి ఉంటారు కూడా. ఆ గుహల్లో ఒక శిలాగ్రంథం ఉంది. ఇది శివుడికి అంకితం చేసిన కైలాస్నాథ్ ఆలయం. కానీ రామాయణ, మహాభారత గ్రంథాలకు శిల్పరూపం ఈ ఆలయం. ఎల్లోరా గుహల్లో చెక్కిన ఏకరాతి ఆలయమే ఈ కైలాసనాథ్ ఆలయం.నంబర్ 16... కట్టిపడేసే గుహఎల్లోరా గుహలను ఏ కొండల్లో చెక్కారు? సమాధానం కొంచెం కష్టమే. ఎందుకంటే అవి మనకు ఎల్లోరా గుహలుగానే తెలుసు. ఆ గుహలను చరణాద్రి కొండల్లో చెక్కారు. సహ్యాద్రి శ్రేణుల్లో ఒక భాగం చరణాద్రి కొండలు. మహారాష్ట్ర, ఔరంగాబాద్ జిల్లాలో ఉన్నాయి. ఎల్లోరా గుహలనగానే బౌద్ధ చైత్య, విహారాలే గుర్తొస్తాయి. కానీ ఈ గుహలు బౌద్ధ, హిందూ, జైన మతాల విశ్వాసాలకు ప్రతీకలు. ఒకటి నుంచి పన్నెండు వరకు బౌద్ధ గుహలు, 13 నుంచి 29 వరకు హిందూ గుహలు, 30 నుంచి వరకు 34 జైన గుహలు. కైలాస్నాథ్ ఆలయం 16వ గుహలో ఉంది. ఇవన్నీ ఏకకాలంలో చెక్కినవి కాదు.ఎల్లోరా గుహలు వందకు పైగా ఉన్నాయి. కానీ పర్యాటకులకు అనుమతి 34 వరకే. ఇవన్నీ ఒకేసారి చెక్కినవి కాదు. 8, 9,10 శతాబ్దాల్లో చెక్కిన గుహలు. కైలాస్నాథ్ గుహాలయాన్ని మాత్రం రాష్ట్రకూట రాజు మొదటి కృష్ణుని కాలంలో క్రీ.శ 756 – 773 మధ్యకాలంలో చెక్కారు. రాజు తీవ్రమైన అస్వస్థతకు గురైనప్పుడు రాణి ఆయన ఆరోగ్యం కోసం శివుడిని ప్రార్థించిందని, కైలాసాన్ని పోలిన ఆలయాన్ని నిర్మిస్తానని మొక్కిందని చెబుతారు. రాజు ఆరోగ్యవంతుడైన తర్వాత కోకస శిల్పి పర్యవేక్షణలో కైలాస్నాథ్ ఆలయం రూపుదిద్దుకుంది. ఎల్లోరా పర్యాటకులు 33 గుహలకు కేటాయించినంత సమయం 16వ గుహలో గడుపుతారు. ఉత్తరాది ఆలయాలను చూసిన కళ్లకు ద్రవిడ శైలిలో చెక్కిన ఈ ఆలయం కనువిందు చేస్తుంది..గ్రంథాలకు శిల్పరూపంప్రత్యేకించి ఈ ఆలయం పొడవు 164 అడుగులు, వెడల్పు 109 అడుగులు, ఎత్తు 98 అడుగులు. ఏకరాతి ఆలయం అంటే చిన్నదో లేదా ఒక మోస్తరు ఆలయమో అనుకుంటాం. కానీ ఈ ఆలయాన్ని పూర్తిగా శిల్పసౌందర్యాన్ని ఆస్వాదిస్తూ తిలకించడానికి మూడు గంటలు కేటాయించాలి. భారతీయ శిల్పచాతుర్యానికి గీటురాయి ఇది. ఆలయం రథం ఆకారంలో ఉంటుంది. ఒక్కో ΄పార్శ్వంలో ఒక్కో ΄పౌరాణిక గ్రంథాన్ని చూడవచ్చు. 14 కాండల రామాయణం ఒక గోడలో, 18 పర్వాల మహాభారతం మరో గోడలో శిల్పాల రూపంలో ఒదిగిపోయాయి. ఇన్ని ప్రత్యేకతలున్నప్పుడు యునెస్కో గుర్తించకుండా ఉంటుందా? ఎల్లోరాను 1983లోనే గుర్తించింది..ఈ సెలవుల్లో వెళ్లాలి!శిరిడీ, ఔరంగాబాద్, అజంతా, ఎల్లోరాలు సాధారణంగా వేసవి సెలవుల టూర్ ప్లాన్‌లో ఉంటాయి. కానీ వేసవిలో గుహల్లో పర్యటన కష్టం. గుహలోపల ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్నప్పటికీ బయటకు రాగానే భరించలేనంత వేడితో సతమతమవుతాం. కాబట్టి దక్కనులో గుహల పర్యటనకు ఈ సీజన్ బాగుంటుంది. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
150 ఏళ్లు పట్టేదట! కానీ.. కేవలం 18 ఏళ్లలోనే.. !!
భారతీయ సంప్రదాయం ఉట్టిపడే ఎన్నో దేవాలయాల గురించి తెలుసుకుని ఉంటారు. సైన్స్‌కు అంతుచిక్కని గుళ్లు కూడా చాలానే ఉన్నాయి. ఐతే ఇప్పుడు మీరు తెలుసుకోబోయే దేవాలయానికి మాత్రం తాజ్‌మహల్‌కు ఉన్నంత చరిత్ర ఉంది. చదవండి: ఎడమచేతివాటం వారు ఈ విషయాల్లో నిష్ణాతులట.. మీకు తెలియని ఎన్నో ఆసక్తికర విషయాలు..! మహారాష్ట్రకు చెందిన ఔరంగాబాద్‌లోని ఎల్లోరా గుహల్లో కైలాష్ దేవాలయం ఉంది. మీరు తెలుసుకోబోయేది ఈ దేవాలయం గురించే!! దాదాపు 4 లక్షల టన్నుల కొండను తొలిచి నిర్మించిన ఏకశిలా దేవాలయమట ఇది. ఈ దేవాలయం పూర్తి నిర్మాణానికి 18 యేళ్లు పట్టిందని ఆర్కియాలజిస్టుల నివేదికలు తెల్పుతున్నాయి. నిజానికి అప్పట్లో చాలా త్వరగానే ఈ దేవాలయం నిర్మాణం పూర్తి చేశారట. ఎందుకంటే అంత పెద్ద కొండను తొలచడం అంత మామూలు విషయం కాదు. 7 వేల కూలీలు 150 సంవత్సరాలు రాత్రింబగళ్లు కష్టపడితే తప్ప అది సాధ్యంకాదని ఆర్కియాలజిస్టులు చెబుతున్నారు. మరొక ఆశ్చర్యకరమైన విషయం ఎంటంటే.. ఇక్కడ ఒక్క పూజారి కూడా కనిపించడు. అసలింతవరకు ఇక్కడ పూజలే జరగలేదట కూడా. ఈ దేవాలయాన్ని నిర్మించిన రాజు హిమాలయాల్లో ఉన్న శివున్ని దర్శించుకోలేని వారు ఇక్కడి కేశవుడ్ని దర్శించుకున్నట్లేననే నమ్మకంతో నిర్మించినట్లు నానుడి. కాగా 1983లో ఈ దేవాలయాన్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తించింది. చదవండి: డ్రీమ్ హౌస్ షిఫ్టింగ్.. సముద్రంపై పడవలతో గమ్యానికి చేర్చి..! -
‘దక్కన్ తాజ్ మహల్’ ఎవరు కట్టించారో తెలుసా?!
తాజ్ మహల్లాగానే అనిపిస్తుంది. ఇది ఆగ్రా కాదు. చూస్తున్నది తాజ్ మహలూ కాదు. తాజ్‌మహల్ లాంటిదే కట్టాలన్న ఓ ప్రయత్నం.పేరు బీబీ కా మఖ్బారా. ఔరంగాబాద్‌లో ఉంది. అందుకే దక్కన్ తాజ్‌గా వాడుకలోకి వచ్చింది. బీబీ కా మఖ్బారాలో తాజ్ మహల్లో ఉండే తేజం కనిపించదు, కానీ నిర్మాణ నైపుణ్యంలో తాజ్‌మహల్‌కు ఏ మాత్రం తీసిపోదు. ఔరంగజేబు భార్య దిల్రాస్ బానుబేగమ్ సమాధి నిర్మాణం ఇది. బాను బేగమ్ కొడుకు అజమ్ షా దగ్గరుండి కట్టించాడు. మొఘల్ ఆర్కిటెక్చర్ శైలిని ప్రతిబింబిస్తుంది, ప్రధాన భవనం ముందు పెద్ద కొలను, నాలుగు వైపులా విశాలమైన చార్బాగ్ కాన్సెప్ట్ తోటలు, పాలరాతి పూలలో పర్షియన్ లాలిత్యం ప్రతిదీ తాజ్‌మహల్‌ను పోలి ఉంటుంది. తలెత్తి ఓసారి పై కప్పును చూస్తే ఇక ఒక నిమిషం పాటు తల దించుకోలేం. తోటల నుంచి స్వచ్ఛమైన గాలి ధారాళంగా ప్రసరిస్తూ ఉన్న విశాలమైన వరండాలు, ఆర్చ్‌ల మధ్య తిరుగుతుంటే ఆహ్లాదంగా ఉంటుంది. భార్యాభర్తలిద్దరూ ఇక్కడే బీబీ కా మఖ్బారా... మహారాష్ట్ర, ఔరంగాబాద్ పట్టణానికి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఔరంగజేబు దక్కన్ కోసం పోరాడి పోరాడి దక్కన్‌లోనే మరణించాడు. బీబీ కా మఖ్బారాకు నలభై కిలోమీటర్ల దూరంలో ఖుల్దాబాద్‌లో అతడి సమాధి ఉంది. ఈ ట్రిప్‌లో శివాజీ మ్యూజియాన్ని కలుపుకోవచ్చు. ఆ మ్యూజియంలో శివాజీ ఆయుధాలు, నాణేల ప్రదర్శన ఆసక్తిగా ఉంటుంది. ఇవి కూడా చూడవచ్చు! 16 కిమీల దూరంలో దౌలతాబాద్ కోట 30 కి.మీల దూరంలో ఎల్లోరా గుహలు 50 కి.మీల దూరంలో పైథాన్ ఉంది. అక్కడి చేనేతకారులు నేసే చీరలను పైథానీ చీరలంటారు. మహిళల మనసు దోచే పైథానీ చీరలు గత దశాబ్దకాలంగా నడుస్తున్న ట్రెండ్. కాబట్టి ఒక్క చీరనైనా తెచ్చుకుంటే ఈ ట్రిప్‌కు గుర్తుగా ఉంటుంది. ధర పదివేల నుంచి మొదలవుతుంది. బస: ఔరంగాబాద్‌లో బస చేయవచ్చు. ఉత్తరాది, దక్షిణాది ఆహారం దొరుకుతుంది. – వాకా మంజులారెడ్డి చదవండి: పాపికొండలు.. బెంగాల్ పులులు.. బంగారు బల్లులు -
కొత్త రంగుల్లో రూ.20 నోటు
న్యూఢిల్లీ: భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) కొత్తగా ఆకుపచ్చ రంగులో రూ. 20 కరెన్సీ నోటును చలామణిలోకి తీసుకురానుంది. ఈ కొత్త రూ.20 నోట్‌పై రిజర్వుబ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ సంతకం ఉంటుంది. ఈ నోటుపై కొత్త డిజైన్లు, అందులో కలిసేలా రేఖాగణిత నమూనాలు ఉంటాయి. గతంలోలాగే గాంధీజీ సిరీస్‌లోనే ఈ కొత్త నోట్ కూడా ఉంటుంది. కొత్త 20 రూపాయల నోటు వెనుకవైపు మన చారిత్రక వారసత్వ సంపదైన ఎల్లోరా గుహల చిహ్నం ఉంటుంది. నోటుకు, వెనుకవైపు స్వచ్ఛభారత్ లోగో, నినాదం ఉంటాయి. ఎల్లోరా గుహల చిత్రం, దేవనాగరి లిపిలో 20 అంకె ఉంటుంది. కొత్త నోట్‌తోపాటు పాత నోట్లూ చలామణిలోనే ఉంటాయని ఆర్బీఐ తెలిపింది. -
ఎల్లోరా అందాలు
-
ఎల్లోరా గుహల్లో ప్రమాదం
ఔరంగాబాద్(మహారాష్ట్ర): ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఎల్లోరా గుహల్లో ప్రమాదం చోటుచేసుకుంది. ఓ పెద్ద బండరాయి దొర్లిపడటంతో ముగ్గురు పర్యాటకులకు గాయాలు అయ్యాయి. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో ఈ గుహలు ఉన్న విషయం తెలిసిందే. వీటిని సందర్శించేందుకు నిత్యం పర్యాటకులు వస్తూనే ఉంటారు. ఈ నేపథ్యంలోనే కైలాస ఆలయానికి కొందరు పర్యాటకులు వచ్చిన సమయంలోనే గుహపైన ఉన్న పెద్ద బండరాయి ఒక్కసారిగా పడటంతో ముగ్గురు పర్యాటకులు గాయపడ్డారు. వీరిలో ఒకరిది రాజస్థాన్ కాగా, మరో ఇద్దరి వివరాలు తెలియాల్సి ఉంది. గాయపడిన వీరిని ఆస్పత్రికి తరలించారు. పెద్దబండరాయి పడటంవల్ల గుహలోని కొన్ని భాగాలు కూడా దెబ్బతిన్నట్లు పురావస్తు శాస్త్ర అధికారులు తెలిపారు. -
ఎల్లోరా గుహలను ఆన్లైన్లో చూడచ్చు...
ఇక ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు భారతీయ చరిత్ర, సంస్కృతికి సంబంధించిన 1400 కళాకృతులను ఆన్లైన్లో వీక్షించనున్నారు. అలాగే సఫ్దర్‌జంగ్ సమాధులు, ఎల్లోరా గుహలు, పురాణ క్వీలా వంటి చారిత్రక ప్రాంతాలను గూగుల్ సాంస్కృతిక ఇన్స్టిట్యూట్ (జీసీఐ) వెబ్సైట్లో తిలకించవచ్చు. ఈ మేరకు చారిత్రక ఔన్నత్యం కలిగిన 76 ప్రాంతాలకు సంబంధించి 360 డిగ్రీల కోణంలో చూడగలిగే ఛాయచిత్రాలను విడుదల చేస్తున్నట్టు ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ ఓ ప్రకటనలో తెలిపింది. భారత ఆర్కియాలజీకల్ సర్వే (ఏఎస్ఐ) సహకారంతో వీటిని జీసీఐ సైట్లో అప్లోడ్ చేసినట్టు వివరించింది. స్టీట్ వ్యూ టెక్నాలజీ సాయంతో ఈ చారిత్రక ప్రదేశాలను విహంగ విక్షణం చేసే అవకాశం కల్పించింది. దీంతో ఆన్లైన్లో చేరిన ఏఎస్ఐ ఆధ్వర్యంలోని చారిత్రక ప్రదేశాల సంఖ్య వందకు చేరింది. తాజ్‌మహల్, హుమాయున్ సమాధులు వంటి చారిత్రక ప్రదేశాలను ఇప్పటికే ఆన్లైన్లో వీక్షించవచ్చు.