భారతీయ సంప్రదాయం ఉట్టిపడే ఎన్నో దేవాలయాల గురించి తెలుసుకుని ఉంటారు. సైన్స్‌కు అంతుచిక్కని గుళ్లు కూడా చాలానే ఉన్నాయి. ఐతే ఇప్పుడు మీరు తెలుసుకోబోయే దేవాలయానికి మాత్రం తాజ్‌మహల్‌కు ఉన్నంత చరిత్ర ఉంది.
చదవండి: ఎడమచేతివాటం వారు ఈ విషయాల్లో నిష్ణాతులట.. మీకు తెలియని ఎన్నో ఆసక్తికర విషయాలు..!
మహారాష్ట్రకు చెందిన ఔరంగాబాద్‌లోని ఎల్లోరా గుహల్లో కైలాష్ దేవాలయం ఉంది. మీరు తెలుసుకోబోయేది ఈ దేవాలయం గురించే!! దాదాపు 4 లక్షల టన్నుల కొండను తొలిచి నిర్మించిన ఏకశిలా దేవాలయమట ఇది. ఈ దేవాలయం పూర్తి నిర్మాణానికి 18 యేళ్లు పట్టిందని ఆర్కియాలజిస్టుల నివేదికలు తెల్పుతున్నాయి. నిజానికి అప్పట్లో చాలా త్వరగానే ఈ దేవాలయం నిర్మాణం పూర్తి చేశారట. ఎందుకంటే అంత పెద్ద కొండను తొలచడం అంత మామూలు విషయం కాదు. 7 వేల కూలీలు 150 సంవత్సరాలు రాత్రింబగళ్లు కష్టపడితే తప్ప అది సాధ్యంకాదని ఆర్కియాలజిస్టులు చెబుతున్నారు.
మరొక ఆశ్చర్యకరమైన విషయం ఎంటంటే.. ఇక్కడ ఒక్క పూజారి కూడా కనిపించడు. అసలింతవరకు ఇక్కడ పూజలే జరగలేదట కూడా. ఈ దేవాలయాన్ని నిర్మించిన రాజు హిమాలయాల్లో ఉన్న శివున్ని దర్శించుకోలేని వారు ఇక్కడి కేశవుడ్ని దర్శించుకున్నట్లేననే నమ్మకంతో నిర్మించినట్లు నానుడి. కాగా 1983లో ఈ దేవాలయాన్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తించింది.
చదవండి: డ్రీమ్ హౌస్ షిఫ్టింగ్.. సముద్రంపై పడవలతో గమ్యానికి చేర్చి..!
Comments
Please login to add a commentAdd a comment