lord shiva temple
-
గంగా తీరం వద్ద ఉన్న వారణాసి శివాలయంలో వింత విషయాలు
-
పరమ శివుడిని దర్శించుకుంటే' కోరిన కోర్కెలు తీరతాయి..!
-
ఖమ్మం జిల్లాలో వెయ్యేళ్లనాటి శివాలయం-అతిపెద్ద శివలింగం
కూసుమంచి (ఖమ్మం): కాకతీయుల భక్తిభావం, కళావైభవానికి ప్రత్యక్షసాక్ష్యం కూసుమంచిలోని శివాలయం. ఈశివాలయాన్నే గణపేశ్వరాలయంగా, రామలింగేశ్వరస్వామి ఆలయంగా కూడా పిలుస్తున్నారు. క్రీ.శ 11–12వ శతాబ్ధంలో కాకతీయుల కాలంలో వెయ్యిన్నొక్కటి శివాలయాల నిర్మాణ క్రమంలో గణపతి దేవుడు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు ప్రతీతి. ఈ ఆలయంలోని శివలింగం దక్షిణ భారతదేశంలో అతిపెద్ద శివలింగాల్లో ఒకటిగా ప్రసిద్ది చెందింది. ఖమ్మం జిల్లా కూసుమంచిలో ఉత్తర దిశగా ఈ ఆలయాన్ని నిర్మించారు. ఆలయ నిర్మాణం ఓ చేయి, కాలు లేని శిల్పి చేశాడనేది ప్రచారంలో ఉంది. ఈ ఆలయాన్ని పెద్దపెద్ద బండరాళ్లతో పేర్చిన ఘనత ఆ శిల్పికే దక్కింది. (చదవండి: అపార్ట్మెంట్లో బోర్‌వాటర్ వివాదం.. వాటర్‌ట్యాంక్ ఎక్కి దంపతుల హల్చల్) శివాలయంలోని శివలింగం ఆలయాన్ని పైగుండా చూస్తే నక్షత్రాకారంలో, మరోవైపు శివలింగాకారం ఉన్నట్లుగా బండరాళ్లను పేర్చి వాటిపై ఆలయాన్ని నిర్మించటం విశేషం. ఇక ఆలయంలో ఉన్న శివలింగం 6 అడుగుల ఎత్తు. 5.3 సెంమీ వ్యాసార్థంతో ప్రతిష్టించగా అది నున్నటి గ్రానైట్ రాయిని పోలి ఉంటుంది. శివలింగంపై ప్రతినిత్యం సూర్యోదయ సమయాన సూర్యకిరణాలు ప్రసరించేలా ఆలయాన్ని నిర్మించటం మరో విశేషం. వందలాది సంవత్సరాల పాటు కంపచెట్లు, మట్టిదిబ్బలతో జీర్ణావస్థకు చేరింది. గ్రామంలో గొప్ప ఆలయం ఉన్నా దాన్ని ఎవరూ పట్టించుకోక పోవటంతో అది ఎలా ఉందో కూడా గ్రామస్తులకు తెలియని పరిస్థితి. నాటి కూసుమంచి సీఐగా ఉన్న సాథు వీరప్రతాప్‌రెడ్డి దృష్టికి ఆలయం విషయం రావటంతో గ్రామస్థుల సహకారంతో ఈఆలయాన్ని వెలుగులోకి తీసుకవచ్చారు. దాన్ని అభివృద్ది పరిచి పూజలు ప్రారంభింపజేశారు. భక్తుల చొరవతో ఈ ఆలయం క్రమంగా వెలుగులోకి వచ్చింది. ఆ తరువాత మహా ఆలయంగా వెలుగొందుతోంది. ఈ ఆలయాన్ని దర్శించటం పునర్జన్మ సుకృతంగా పెద్దలు అభివర్ణిస్తున్నారు. కూసుమంచి శివాలయాన్ని దర్శిస్తే కోరిన కోరికలు తీరుతాయనేది భక్తుల నమ్మకం. అందుకే ఈశివాలయం భక్తులకు కొంగు బంగారంగా విరాజిల్లుతూ.. నానాటికి దినదినాభివృద్ధి చెందుతోంది. ప్రతి శివరాత్రికి ఖమ్మం జిల్లాతో పాటు పొరుగున ఉన్న ఉమ్మడి నల్లగొండ, వరంగల్ నుండి భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ప్రతియేడు వేల మంది భక్తులు ఈ శివాలయాన్ని దర్శించుకుంటున్నారు. (చదవండి: జంగు ప్రహ్లాద్ కన్నుమూత.. సీఎం కేసీఆర్ సంతాపం..) -
150 ఏళ్లు పట్టేదట! కానీ.. కేవలం 18 ఏళ్లలోనే.. !!
భారతీయ సంప్రదాయం ఉట్టిపడే ఎన్నో దేవాలయాల గురించి తెలుసుకుని ఉంటారు. సైన్స్‌కు అంతుచిక్కని గుళ్లు కూడా చాలానే ఉన్నాయి. ఐతే ఇప్పుడు మీరు తెలుసుకోబోయే దేవాలయానికి మాత్రం తాజ్‌మహల్‌కు ఉన్నంత చరిత్ర ఉంది. చదవండి: ఎడమచేతివాటం వారు ఈ విషయాల్లో నిష్ణాతులట.. మీకు తెలియని ఎన్నో ఆసక్తికర విషయాలు..! మహారాష్ట్రకు చెందిన ఔరంగాబాద్‌లోని ఎల్లోరా గుహల్లో కైలాష్ దేవాలయం ఉంది. మీరు తెలుసుకోబోయేది ఈ దేవాలయం గురించే!! దాదాపు 4 లక్షల టన్నుల కొండను తొలిచి నిర్మించిన ఏకశిలా దేవాలయమట ఇది. ఈ దేవాలయం పూర్తి నిర్మాణానికి 18 యేళ్లు పట్టిందని ఆర్కియాలజిస్టుల నివేదికలు తెల్పుతున్నాయి. నిజానికి అప్పట్లో చాలా త్వరగానే ఈ దేవాలయం నిర్మాణం పూర్తి చేశారట. ఎందుకంటే అంత పెద్ద కొండను తొలచడం అంత మామూలు విషయం కాదు. 7 వేల కూలీలు 150 సంవత్సరాలు రాత్రింబగళ్లు కష్టపడితే తప్ప అది సాధ్యంకాదని ఆర్కియాలజిస్టులు చెబుతున్నారు. మరొక ఆశ్చర్యకరమైన విషయం ఎంటంటే.. ఇక్కడ ఒక్క పూజారి కూడా కనిపించడు. అసలింతవరకు ఇక్కడ పూజలే జరగలేదట కూడా. ఈ దేవాలయాన్ని నిర్మించిన రాజు హిమాలయాల్లో ఉన్న శివున్ని దర్శించుకోలేని వారు ఇక్కడి కేశవుడ్ని దర్శించుకున్నట్లేననే నమ్మకంతో నిర్మించినట్లు నానుడి. కాగా 1983లో ఈ దేవాలయాన్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తించింది. చదవండి: డ్రీమ్ హౌస్ షిఫ్టింగ్.. సముద్రంపై పడవలతో గమ్యానికి చేర్చి..! -
పాల్వంచలో అఘోరాల సంచారం.. సోషల్ మీడియాలో వైరల్
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో అఘోరాల సంచారం చర్చానీయంశంగా మారుతుంది. చత్తీస్‌గఢ్ అటవి ప్రాంతం నుంచి కాలీనడకన కొందరు అఘోరాలు పాల్వంచకు వచ్చారు. అయితే కాశీ నుంచి చత్తీస్‌గఢ్‌కు వచ్చి అక్కడి నుంచి తెలంగాణకు వచ్చినట్లు తెలుస్తోంది. పాల్వంచలోని ఆత్మలింగేశ్వరాలయం చేరుకోని స్వామి దర్శనం చేసుకున్న అనంతరం ప్రత్యేక పూజలు కూడా చేశారు. వారు చేసే పద్దతుల్లో పూజలు నిర్వహించడం విశేషం. అఘోరాలు వచ్చారన్న విషయం తెలుసుకున్న స్థానికులు అక్కడికి చాలామంది వచ్చారు. ఆలయ విశిష్టతను, ప్రాముఖ్యతను అఘోరాలకు కోందరు స్థానికులు వివరించినట్లు తెలుస్తోంది. పాల్వంచలోని ఆత్మలింగేశ్వరాలయం అత్యంత పురాతన ఆలయం. స్థానికంగా ఈ ఆలయానికి ఏంతో ప్రాముఖ్యత కూడా ఉంది. ఇలాంటి ఆత్మలింగేశ్వరరాలయాలు దేశంలోనే చాలా అరుదుగా ఉన్నాయి. స్థానికులతో కొద్దిసేపు వివరాలు తెలుసుకున్న అనంతరం తిరిగి వారు వచ్చిన మార్గంలోనే వెళ్లిపోయారు. అయితే వారు వచ్చి వెళ్లిన విషయం సోషల్ మీడియాలో కోందరు పోస్ట్ చేయడం ద్వారా బయటపడింది. వారు వచ్చి వెళ్లిన విషయం ఏవరికి తెలియదు. ఆలయ పరిసర ప్రాంతంలో ఉన్న వారికి మాత్రమే తెలుసు. దీంతో తర్వాత అసలు అఘోరాలు ఆత్మలింగేశ్వరాలయానికి ఏందుకు వచ్చారని పాల్వంచలోనే కాకుండా జిల్లాలో సైతం జోరుగా చర్చ నడుస్తుంది. అంత దూరం నుంచి ఈ ఆలయంకే ఏందుకు వచ్చారని చర్చించుకుంటున్నారు. అయితే దేశంలో ఏ ప్రాంతంలో ఈశ్వరునికి సంబంధించి ప్రసిద్ధిగాంచిన దేవాలయాలు ఉన్నాయో అఘోరాలకు సమాచారం ఉంటుందని అందులో భాగంగానే వాళ్లు వస్తువుంటారని కోందరు పూజారులు చెప్పారు. -
శివాలయంలో సేవానందలహరి
మనలో చాలామంది భక్తులు ఆలయాలకు వెళ్తుంటారు. రోజూ, లేక వారానికోసారి, ఏదైనా పండుగలు, ఉత్సవాలు జరిగే సమయంలో ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకుని తిరిగి వచ్చేస్తుంటారు. ఏవైనా మొక్కుబడులు ఉంటే తీర్చుకుంటారు లేదా విశేష ఆర్జితసేవలు జరిపించుకుంటారు. అయితే మనం ఆలయాలకు వెళ్లి ఇంకా ఎన్నో సేవలు స్వయంగా ఆచరించి శివాలయ నిర్మాణం చేస్తే.. నిర్వహణ చేస్తే.. పునరుద్ధరణ చేస్తే ఎంతైతే ఫలితం ఉంటుందో దానితో సమానమైన ఫలితాలు శివాలయసేవ ద్వారా పొందవచ్చు. అటువంటి కొన్ని సేవలు.. వాటి ఫలితాలు ఇవి.. ఆవుపేడతో అలికి ముగ్గులు పెడితే.. ఆవుపేడ లక్ష్మీ నిలయంగా భావిస్తాం మనం. అందుకే ఆలయాన్ని శుభ్రంగా ఆవుపేడతో అలికితే కూడా ఎంతో గొప్ప ఫలితం ఉంది. మలినం కాని ఆవుపేడనే తీసుకోవాలి. గోమయంతో శివాలయ పరిసర ప్రాంతాన్ని చక్కగా అలికితే తమ పూర్వీకులు తరించి గోలోకం చేరుకుంటారు. చక్కగా రంగవల్లులు (ముగ్గులు) తీర్చిదిద్ది పంచరంగులతో అలంకరిస్తే చేసిన వారు.. వారి కుటుంబ సభ్యులతో సహా సిరిసంపదలతో తులతూగుతారు. దూరం నుండి దర్శిస్తే చాలు... అల్లంత దూరంలో ఆలయశిఖరం కనిపిస్తే చాలు. అమాంతం మన రెండు చేతులు ఒకదానికొకటి కలిసి నమస్కరిస్తాయి. అదే మన చిన్ననాటి నుండి మన పెద్దలు మనకు నేర్పిన ధర్మం. దానివలన ఏడుజన్మలలో తాను చేసిన పాపాలనుండి వెంటనే విముక్తుడౌతాడు. రెండుచేతులు జోడించిన వెంటనే మనలోని అహంకారం తొలగి దైవసాక్షాత్కారం కోరి మనస్సు పరితపిస్తుంది. అప్పుడే మనం ఆ దైవాన్ని దర్శించేందుకు పరిపూర్ణమైన యోగ్యత సంపాదించుకున్నవాళ్లమౌతాం. నీటితో కడిగి.. అద్దంలా తుడిస్తే... ఆలయాన్ని నీటితో కడిగితే ఆ ప్రాంతమంతా పరిశుద్ధమౌతుంది. అటువంటి ఆలయాన్ని కడిగే నీటిని మాత్రం వడగట్టి తీసుకోవాలని ధర్మశాస్త్రాలు చెపుతున్నాయి. వస్త్రంతో వడగట్టిన నీటితో ఆలయాన్ని పరిశుభ్రం చేసినవారు సజ్జనులు. అతడు యోగియై శివుని చేరుకుంటాడు. అలాగే శివాలయం నేలను అద్దం లా తుడవాలి. ఎంతలా అంటే నేలపై తన ప్రతిబింబం కనపడేంతగా. వెల్ల వేయించి.. దీపాలు వెలిగిస్తే... శివాలయానికి, ప్రాకారం గోడలకు సుధాకర్మ (సున్నం పూయించడం) చేయించినవారికి ఆలయనిర్మాణం చేసిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది. అలాగే ప్రతి సంవత్సరం విడువకుండా, పాలవంటి తెల్లసున్నంతో లేదా వేరే రంగులతో అందంగా వెల్లవేయించినా శివలోకవాసం లభిస్తుంది. అలాగే ఆలయంలోని గోడలకు సుగంధాలు పూయడం, గుగ్గిలంతో ధూపం వేయడం కూడా ఆలయసేవలో భాగాలే. ఆలయం ఆవరణలో దీపాలు వెలిగించడం, దానికి కావలసిన ద్రవ్యాలను అందించడం, మొదలైన సేవలు ముఖ్యమైన సేవలు. శివరూపాలను చిత్రిస్తే... మనం ఆలయగోపురాలపై అనేక శిల్పాలు చూస్తుంటాం. అలాగే ప్రాచీన ఆలయాల్లో అనేక శివరూపాలు చిత్రించి ఉంటాయి. ఉదాహరణకు మన రాష్ట్రంలో లేపాక్షి, తమిళనాడులోని మధురై దేవాలయం పై భాగంలో తలెత్తి చూస్తే అనేక దేవుళ్ల చిత్రాలు గమనించే ఉంటారు. అలా మనం కూడా ఆలయాల్లో దేవుడి చిత్రాలు చిత్రింపచేయడం ఒక కర్తవ్యం గా నెరవేర్చాలి. అలా ఎన్ని బొమ్మలు చిత్రిస్తారో అంతకాలం రుద్రకాలంలో ప్రకాశిస్తారు. రంగు రంగుల పూలమాలలతో అలంకరిస్తే... ఆలయం తోరణాలకు, గోడలకు, కొన్ని మండపాలు, స్తంభాలను పూలతో అలంకరించడం ఒక గొప్పసేవ. అలా చేస్తే ఆ మనిషి రుద్రలోకం చేరతాడని చెప్పబడింది. శివాలయాన్ని రకరకాల పుష్పాలతో అలంకరించినా.. అందంగా తీర్చిదిద్దినా..ఎంత ప్రదేశం తీర్చిదిద్దాడో దాన్ని అంగుళాలతో కొలిచి అంతకాలం రుద్రలోకంలో నివసిస్తారని చెప్పబడుతోంది. అలాగే శివపూజా కైంకర్యాలకోసం పుష్పవనాలను పాదుగొల్పినా.. రకరకాలైన పూల చెట్లను నాటి వాటిని సంరక్షించినా అది కూడా పుష్పకైంకర్యం లెక్కలోకే వస్తుంది కనుక భక్తులు ఈ ప్రయత్నం కూడా చేయాలి. ఆలయపరిసరాల్ని పరిశుభ్రం చేస్తే... పరిశుభ్రమైన మనసు ఉంటేనే పరమేశ్వరుని దర్శనం లభిస్తుందని భా వించే మనం.. మరి భగవంతుని నిలయమైన శివాలయానికి వెళ్లి అక్కడ అపరిశుభ్రంగా ఉంటే.. ఆలయంలో పశువులు తిరుగుతుంటే.. మనమేం చేయాలి? అప్పుడు భక్తులు అక్కడ ప్రాణులు, పశువులను కొట్టకుండా.. చప్పట్లు చరుస్తూ నోటితో అరుస్తూ వాటిని బయటకు పంపి ఆ పరిసరాన్ని మెత్తటి మార్జని(చీపురు)తో పరిశుభ్రం చేయాలి. అలా చేస్తే గొప్పదైన చాంద్రాయణవ్రతం ఆచరించిన ఫలితం కలుగుతుందని శివధర్మశాస్త్రం చెప్పింది. మన ఊరి ఆలయాన్నే మెరుగు చేద్దాం.. మన ఊరిలో మన పెద్దలు ఎంతోకాలం ముందుగానే మనకోసం అనేక ఆలయాలను నిర్మించారు. వాటిని మనం కేవలం దర్శించడమే కాదు. పాలించాలి కూడా. అలాగే వైభోగంగా వెలిగే ఆలయాలనే కాదు. ఒకపూట దీపారాధనకి కూడా అవకాశం లేని ఎన్నో ఆలయాల్లో మనవంతు ఆలయసేవగా మనం చేయాల్సింది మనం తప్పకుండా చేయాలి. ఇలాంటి అన్ని సేవలు అనేక క్షేత్రాల్లో ఉన్న పెద్ద దేవాలయాలలో చేయడానికి నేడు రేపు ఎంతోమంది భక్తులు ముందుకొస్తున్నారు. కానీ అదే సేవ మన పల్లెల్లో, గ్రామాల్లో ఉండే ఆలయాలపట్ల మనం ఎంత శ్రద్ధ వహిస్తున్నాం అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఇలా చేస్తే ప్రతీ దేవాలయం దివ్య భవ్య శోభలతో అలరారుతుంది. భక్తులకూ కల్పవృక్షమై నిలుస్తుంది. – శాస్త్ర ప్రవీణ కె.వి.సత్యబ్రహ్మాచార్య -
శివరాత్రి: ఇన్ని గంటలు శివార్చన చేస్తే పుణ్యం!
పరమేశ్వరునికి అత్యంత ప్రియమైనది శివరాత్రి. బ్రహ్మ విష్ణువులకు జ్ఞానబోధ చేయడానికి శివుడు లింగరూపం ధరించిన సమయం శివరాత్రి. ఇది మాఘ కృష్ణ చతుర్దశి సమయంలో జరిగింది. కనుకనే మనమంతా ఆ రాత్రిని శివరాత్రిగా జరుపుకుంటున్నాం. ఆ శివరాత్రి మధ్యరాత్రిని లింగోద్భవ కాలం అంటారు. లింగోద్భవ కాలంలో ప్రపంచంలోని సకల తీర్థాలు.. దేవతాంశలన్నీ శివలింగంలో నిలిచి ఉంటాయి. అందుకే ఆ సమయంలో ప్రతీ భక్తుడూ శివలింగారాధన చేయాలి. శివలింగారాధన సకల పాపాలనూ పోగొడుతుంది. సకల పుణ్యాలను సంపాదించి పెడుతుంది. ఈ జన్మను తరింపజేస్తుంది. మరు జన్మ లేకుండా చేస్తుంది. శాశ్వత శివపదాన్ని అందిస్తుంది. శివలింగారాధన అనగానే మనందరికీ అనేక పుణ్యక్షేత్రాలు.. గొప్ప పూజలు.. అభిషేకాలు.. యజ్ఞాలు తలంపుకు వస్తాయి. శివార్చన అనేది కేవలం ఆడంబరంతో..అధికారంతో చేసేది కాదు. ఐశ్వర్యంతో సాధ్యమయ్యేది కాదు. భక్తి ప్రధానమైనది. శివరాత్రి సమయంలో ఎనిమిది జాములలో వీలుకాకపోతే ఆరు జాములలో శివార్చన చేయాలని శాస్త్రవచనం. (ఒకరోజుకు ఎనిమిది జాములు. పగలు నాలుగు జాములు.. రాత్రి నాలుగు జాములు. మన కలగణనలో నాలుగు గంటలు) శివరాత్రి ఉదయం అంతా ఉపవాసం ఉండి రాత్రంతా శివనామస్మరణతో జాగరణ చేయాలి. సత్కాలక్షేపం చేస్తూ చేసేదే జాగరణ. మనసంతా మహాదేవుని నింపుకుని శివగాథలు వింటూ.. శివుని మహిమలను కీర్తిస్తూ.. శివనామం పలుకుతూ.. శివలింగాన్ని అభిషేకిస్తూ..శివార్చన చేస్తూ.. శివునికి నమస్కరిస్తూ..శివునికే తనువు, మనసును సమర్పించి సర్వం శివునిలో లయం చేయగలిగితేనే శివానుగ్రహం కలిగినట్లు. శివరాత్రి రోజున మనం చేయాల్సిన కార్యం ఇదే. అయితే సాధారణంగా శివరాత్రి అంటే అందరూ దగ్గరలో ఉండే ప్రముఖ శైవక్షేత్రం ఎక్కడ ఉంటే అక్కడకు పయనమవుతాం. కానీ మనం చేయాల్సిన పని ఒకటుంది. శివాలయం లేని ఊరుండదు. అటువంటి శివాలయం ఎంత పాతదైనా.. పాడైపోయినా.. చెట్టు చేమలు మొలిచినా దాన్ని శుభ్రం చేసి ఆ ఆలయంలో శివుని ఆరాధించుకుంటే కలిగే ఫలితం అనంతమైనది. శివరాత్రి ప్రతి శివలింగం తేజస్సుతో వెలుగులీనుతూ అందులో శివశక్తి ప్రవహిస్తుంది. కనుక అటువంటి ఆలయాలను పునరుద్ధరించి పూజించడం చాలా అవసరం. ఊరిలోని శివభక్తులంతా పూనుకొని ఈ పనిని సాధిస్తే ఆ ఊరిలోని ప్రజలందరికీ శ్రేయస్సు లభిస్తుంది. ఇవేవీ లేకపోయినా కేవలం శుద్ధజలంతో అభిషేకించినా శివుడు అమిత ప్రసన్నుడౌతాడు. శివార్చనకు తామరపువ్వు, జిల్లేడు పూలు, నల్లకలువలు చాలా ముఖ్యం. ఇవి తెచ్చే స్తోమత లేకపోతే దవనపత్రి, ఉసిరి పత్రి, మారేడు పత్రి వీటితోనైనా పూజించవచ్చు. పూజ కూడా కుదరని భక్తుడి చేతిలో శివనామస్మరణమనే ఆయుధం ఎలాగూ ఉంది. ‘ఓం నమఃశివాయ‘ అనే పంచాక్షరీ మంత్రం జపిస్తే చాలు. సమస్త పాపాలు తొలగిపోతాయి. శివరాత్రికి శివపంచాక్షరీ జపం చేసిన భక్తునికి ఎటువంటి పాపాలూ అంటవు. శివనామం భవసాగరం నుంచి తరింపజేసే నావ. ఏడేడు జన్మల పాపాలను క్షణంలో పోగొట్టే దివ్యమంత్రం. సకలదోషాలను..భూతప్రేతాలను పారద్రోలే పరమ మంత్రం. మహాదేవ అన్నా..శంభు అన్నా అన్నీ సదాశివుని అనుగ్రహాన్ని కలిగించేవే. శివనామోచ్చరణ ఫలితం అంతా ఇంతా కాదు. శివ నామాన్ని ఒక్కసారి కీర్తించినంత మాత్రం చేత మానవులు ఏడు జన్మలలో ఎప్పుడెప్పుడు చేసి ఉన్న ఏ పాపాలనుండి అయినా అతిశీఘ్రంగా విముక్తి పొందుతాడు. బుద్ధిమంతుడు ‘శి–వ’ అనే ఈ రెండక్షరాలనూ సదా ఉచ్చరిస్తూ సంసార సాగరాన్ని అవలీలగా దాటేసి, శివ సాయుజ్యం పొంది తీరుతాడు. ఇలా శివరాత్రి సమయంలో శివపంచాక్షరీ మంత్రం ఎంత ఎక్కువ జపిస్తే అంత గొప్ప ఫలితం లభిస్తుంది. కనుక శివరాత్రి వ్రతాన్ని ఆలయంలోనూ.. గృహంలోనూ.. ఇవి కుదరని వారు మనస్సులోనైనా భక్తితో జరుపుకుంటే వారు శివానుగ్రహభాగ్యులే. శివుడు వారికనుగ్రహించిన స్తోమతను బట్టి వారు శివపూజను ఆచరించుకోవచ్చు. ఇందులో తరతమభేదాలేమీ లేవు. భక్తి ముఖ్యం. భావన ముఖ్యం. శివునిపై మనసును నిలపడం ముఖ్యం. కనుక ఈ శివరాత్రిన శివునిపై భక్తిని నిలిపి చరమైన ఈ జీవితానికి స్థిరమైన లక్ష్యాన్ని ప్రసాదించమని పరమేశ్వరుని కోరుకుందాం. శివానుగ్రహం పొందుదాం. సాధారణంగా శివరాత్రి అంటే అందరూ దగ్గరలో ఉండే ప్రముఖ శైవక్షేత్రం ఎక్కడ ఉంటే అక్కడకు పయనమవుతాం. కానీ మనం చేయాల్సిన పని ఒకటుంది. శివాలయం లేని ఊరుండదు. అటువంటి శివాలయం ఎంత పాతదైనా.. పాడైపోయినా.. చెట్టు చేమలు మొలిచినా దాన్ని శుభ్రం చేసి ఆ ఆలయంలో శివుని ఆరాధించుకుంటే కలిగే ఫలితం అనంతమైనది. శివరాత్రి ప్రతి శివలింగం తేజస్సుతో వెలుగులీనుతూ అందులో శివశక్తి ప్రవహిస్తుంది. కనుక అటువంటి ఆలయాలను పునరుద్ధరించి పూజించడం చాలా అవసరం. ఊరిలోని శివభక్తులంతా పూనుకొని ఈ పనిని సాధిస్తే ఆ ఊరిలోని ప్రజలందరికీ శ్రేయస్సు లభిస్తుంది. వాగీశ విష్ణు సురసేవిత పాదపీఠ శ్రీ భ్రామరీ హృదయలోల దయాంబురాశే శ్రీమల్లికార్జున సదాశివ చంద్రచూడ శ్రీశైలవాస మమ దేహి కరావలంబమ్ వాగీశ విష్ణు సురసేవిత పాదపీఠ శ్రీ భ్రామరీ హృదయలోల దయాంబురాశే శ్రీమల్లికార్జున సదాశివ చంద్రచూడ శ్రీశైలవాస మమ దేహి కరావలంబమ్ శివుడు అభిషేక ప్రియుడు. కనుక ఆ రోజు పరమేశ్వరునికి ఒక చెంబెడు నీటితో అభిషేకించి.. మారేడు పత్రిని శివలింగంపై ఉంచి ఒక్క చిరుదీపాన్ని ఏ శివాలయంలో వెలిగించినా మహాదేవుడు అమితప్రీతిపాత్రుడై భక్తులను అనుగ్రహిస్తాడు. శివరాత్రి సమయంలో స్థిరలింగం, చరలింగం, మృత్తికా లింగం, బాణలింగం, స్ఫటిక లింగం ఇలా ఏ లోహంతోనైనా తయారు చేసిన శివలింగాన్ని పూజిస్తే ఆ జన్మకు ఆ ఒక్క శివరాత్రితోనే సార్థకత చేకూరుతుంది. సామాన్య భక్తులు చక్కగా మంచి పుట్టమట్టి..బంకమట్టిని తెచ్చుకొని శివలింగం తయారు చేసుకొని మన దగ్గర ఉన్నటువంటి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీళ్లు, పంచదార వీటితో అభిషేకం చేయవచ్చు. అభిషేకం చేసేటప్పుడు రుద్రనమకచమకాలనే వేదమంత్రాలను చెప్తూ చేసినా.. ఇవేవీ రానివారు పంచాక్షరీ మంత్రం పలుకుతూ చేసినా ఒకే ఫలితం కలుగుతుందని శివుడు పార్వతికి చెప్పాడు. – కందుకూరి వేంకట సత్యబ్రహ్మాచార్య, ఆధ్యాత్మిక రచయిత -
ఉనకోటిలో 30 అడుగుల కాలభైరవ విగ్రహం
నేల మీది కైలాసం ఉనకోటి... కోటికి ఒకటి తక్కువ. ఇది లెక్క మాత్రమే కాదు. ఓ ప్రదేశం కూడా. హిమాలయ శ్రేణుల పాదాల చెంత ఉంది. త్రిపుర రాష్ట్రంలో అందమైన పర్యాటక ప్రదేశమిది. త్రిపుర రాష్ట్ర రాజధాని అగర్తల నగరానికి 178 కి.మీ.ల దూరంలో ‘కైలాస్‌హర’ అనే పట్టణానికి దగ్గరగా ఉంది ఉనకోటి. జనారణ్యానికి దూరంగా వెళ్లే కొద్దీ చెట్లు చేమలు నిండిన పచ్చటి కొండలు బారులుతీరి ఉంటాయి. పచ్చదనం లోపించిన కొండరాయిలో అందమైన రూపాలు కనువిందు చేస్తాయి. విఘ్నేశ్వరుడు, ఈశ్వరుడు, దుర్గాదేవి, గంగ, ఇతర కైలాసగణమంతా కొలువుదీరినట్లు ఉంటుంది. ఇంతటి భారీ శిల్పాలను ఎప్పుడు చెక్కారో, ఎవరు చెక్కారో, ఎలా చెక్కారో? అన్నింటినీ చూడలేం... ఇక్కడి శివుడి పేరు ఉనకోటేశ్వర కాలభైరవ విగ్రహం 30 అడుగుల ఎత్తు ఉంటుంది. శివుడికి రెండు వైపులా సింహవాహనం మీద దుర్గాదేవి, గంగామాత శిల్పాలుంటాయి. నేలలో కూరుకుపోయిన నంది విగ్రహం, మౌనముద్రలో గణేశుడు, ఇంకా పేరు తెలియన అనేక శిల్పాలు కొన్ని ఎకరాల విస్తీర్ణంలో పరుచుకుని ఉన్నాయి. ప్రధానమైన వాటిని చూడడంతోనే శక్తి తగ్గిపోతుంది. కొన్ని శిల్పాలను సమీప గ్రామాల వాళ్లు ఇళ్లకు పట్టుకుపోగా మిగిలిన వాటి కోసం ఇండియన్ ఆర్కియాలజీ సర్వే నోటిస్ బోర్డు పెట్టింది. ఇంకా విగ్రహాలున్నయోమోనని అడవిని గాలిస్తోంది. ఇది హెరిటేజ్ సైట్. భవిష్యత్తులో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ల ప్రామాణిక పట్టికలో చేరి తీరుతుంది. ప్రపంచం గుర్తించేలోపే ఉనకోటిని చూసేశామంటే... ‘వరల్ట్ హెరిటేజ్ సైట్’ అనే ట్యాగ్‌లైన్ చేరిన రోజు ‘ఎప్పుడో చూసేశాం’ అని మన భుజాన్ని మనమే చరుచుకోవచ్చు. ఎవరు చెక్కారంటే... ‘కల్లు కుమ్హార్’ అనే గిరిజన శిల్పకారుడు ఈ శిల్పాలను చెక్కినట్లు స్థానికులు చెబుతారు. అతడు పార్వతి భక్తుడని, కైలాసాన్ని కళ్లకు కట్టడానికే ఈ శిల్పాలను చెక్కాడని చెబుతారు. క్రీ.శ 16వ శతాబ్దంలో కాలాపహాడ్ అనే మొఘలు గవర్నర్ భువనేశ్వర్‌లోని శివుడిని, ఉనకోటికి సమీపంలో ఉన్న తుంగేశ్వర శివుడిని ధ్వంసం చేసినట్లు చరిత్ర చెబుతోంది. ఈ ప్రదేశం మీద దాడిచేయడానికి అతడు చేసిన ప్రయత్నం కుదరక వదిలేసినట్లు చెబుతారు. ఇక్కడ ఏటా ఏప్రిల్ మాసంలో జరిగే ‘అశోకాష్టమి మేళా’లో వేలాదిగా భక్తులు పాల్గొంటారు. సమీప విమానాశ్రయం అగర్తలలో ఉంది. రైల్వేస్టేషన్ కుమార్‌ఘాట్‌లో ఉంది. కుమార్‌ఘాట్‌కు ఉనకోటి 20 కి.మీ.ల దూరాన ఉంది. జనపథ కథనం ఒకానొకప్పుడు శివుడితోపాటు కోటిమంది కైలాసగణం కాశీయాత్రకు బయలుదేరింది. ఆ ప్రయాణంలో ఈ ప్రదేశానికి వచ్చేసరికి సంజెచీకట్లు అలముకున్నాయి. ప్రయాణం కష్టమైంది. దాంతో ఆ రాత్రికి ఈ అడవిలోనే విశ్రమించారంతా. తెల్లవారక ముందే నిద్రలేచి ఈ ప్రదేశాన్ని విడిచిపెట్టాలని, ఆలస్యమైతే రాళ్లలా మారిపోతారని, నిద్రకుపక్రమించే ముందు శివుడు అందరినీ హెచ్చరిస్తాడు. చెప్పిన సమయానికి శివుడు తప్ప మరెవరూ నిద్రలేవలేకపోవడంతో మిగిలిన వారంతా శిలలుగా మారిపోయారు. కోటి మంది బృందంలో శివుడు మినహా మిగిలిన వారంతా శిలలు కావడంతో ఈ ప్రదేశానికి ‘ఉనకోటి’ అనే పేరు వాడుకలోకి వచ్చింది– అని స్థానికులు ఆసక్తికరమైన కథనం చెబుతారు. ఆ కథనం ప్రకారమైతే అక్కడ శివుడి శిల్పం ఉండకూడదు, కానీ ఇక్కడ శివుడి శిల్పం కూడా ఉంటుంది. పైగా దేశంలోకే అత్యంత పెద్ద శివుడి శిల్పం ఇదేనని కూడా చెబుతారు. వాస్తవాల అన్వేషణకు పోకుండా ఆ శిల్పాల నైపుణ్యాన్ని ఆస్వాదిస్తే ఈ టూర్ మధురానుభూతిగా మిగులుతుంది. -
శివుని చెంతకు ఎమ్మెల్యే వెంకటేగౌడ..!
సాక్షి, పలమనేరు : కర్ణాటక రాష్ట్రంలోని కొడుగు జిల్లా గొనగుప్ప కూర్గ్ అడవుల్లోని కుందాకొండపై శివాలయంలో స్థానిక ఎమ్మెల్యే వెంకటేగౌడ ఆదివారం దసరా సందర్భంగా మొక్కు తీర్చుకున్నారు. ఎమ్మెల్యే దట్టమైన అడవిలో రెండు కిలోమీటర్లు కాలినడకన వెళ్లి పరమశివుడిని దర్శించుకున్నారు. -
నాగుపాము కలకలం
అనంతపురం, రామగిరి: మండల కేంద్రం రామగిరిలోని శివాలయం గర్భగుడిలో సోమవారం నాగుపాము కలకలం రేపింది. ఉదయాన్నే అర్చకులు ఆలయ తలుపులు తెరచి గర్భగుడిలోకి ప్రవేశించగానే శివలింగంపై నాగుపాము కనిపించింది. అక్కడకు వచ్చిన భక్తులు శివలింగంపై ఉన్న పాముకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జనం తాకిడి పెరగడంతో పాము అక్కడి నుంచి వెళ్లిపోయింది. -
తెలుగు రాష్ట్రాలో కార్తీక శోభ
-
పుట్టపర్తి కళికితురాయి.. ఈ శివాలయం
సాక్షి, పుట్టపర్తి : పుట్టపర్తిలో సత్యసాయి జన్మస్థలంలో వెలసిన శివశక్తి స్వరూప ఆలయం చాలా అరుదైనదిగా భక్తులు భావిస్తుంటారు. ఇక్కడి మూలవిరాట్‌ను తన స్వహస్తాలతో బాబానే ప్రతిష్టించినట్లు ప్రతీతి. నిత్యం పుట్టపర్తిని సందర్శించే భక్తులు తప్పనిసరిగా ఈ శివాలయంలో అర్చనలు, అభిషేకాలు చేయించుకుని తరిస్తుంటారు. 125 దేశాల భక్తులతో పూజలు అందుకుంటున్న అరుదైన ఆలయంగా ఆధ్యాత్మిక చరిత్ర పుటల్లో ఈ ఆలయం స్థానం దక్కించుకుంది. పుట్టపర్తిలోని సత్యసాయి నివాసానికి సమీపంలో 1976లో శివశక్తి స్వరూప పేరుతో శివాలయాన్ని బాబా నిర్మించారు. సాధారణంగా శివాలయం అనగానే అందులో శివలింగాన్ని భక్తులు సందర్శిస్తుంటారు. అయితే శివశక్తి స్వరూప ఆలయంలో ఏకశిలా పాలరాతితో చేయించిన శివుడి ప్రతిమను సత్యసాయి ప్రతిష్టించారు. పుట్టపర్తికి వచ్చే 125 దేశాల భక్తులు, వివిధ రాష్ట్రాలకు చెందిన వారు నిత్యమూ ఇక్కడ అర్చనలు, అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేయిస్తుంటారు. ఇక కార్తీక మాసంలో ఆలయానికి భక్తులు పోటెత్తుతుంటారు. ప్రతి సోమవారం ఉదయం 10.30 నుంచి 12.30 గంటల వరకూ అభిషేక పూజలు ఉంటాయి. ప్రతి నెలా వచ్చే మాసశివరాత్రి నాడు ఉదయం 5 నుంచి 7.30 గంటల లోపు అభిషేకాలు నిర్వహిస్తుంటారు. బహుళ అష్టమి నాడు చండీ హోమాలు ఉంటాయి. పుట్టపర్తిలో మరో కళికితురాయి దేశంలో రెండవది, రాష్ట్రంలో మొదటి ఎత్తైన శివలింగ మందిరంగా పుట్టపర్తిలోని శివశక్తి స్వరూప ఆలయం ఖ్యాతి గడించింది. ఇక్కడ ఎన్నో చూడదగిన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. ఇటీవల నిర్మాణ పనులు పూర్తి చేసుకొని పూజలందుకోవడానికి సిద్దంగా ఉన్న మరో శివలింగాకార మందిరం పుట్టపర్తి కీర్తి మకుటంలో కళికితురాయిగా నిలవనుంది. ఇది రాష్ట్రంలోనే ఎత్తైన శివలింగ మందిరంగా గుర్తింపు పొందినట్లు బ్రహ్మకుమారీ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం యాజమాన్యం పేర్కొంటోంది. బ్రహ్మకుమారీల ఆధ్వర్యంలో పుట్టపర్తికి ఏడు కిలోమీటర్ల దూరంలోని సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి సమీపంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఇందు కోసం సుమారు రూ.కోటి వెచ్చించారు. దాదాపు 75 అడుగుల ఎత్తుతో ఐదు ఎకరాల విస్తీర్ణంలో చేపట్టిన ఈ ఆలయంలో మ్యూజియం, మెడిటేషన్, లేజర్‌షో ఏర్పాటు చేశారు. ఈ మందిరం చుట్టూ దేశంలోని ద్వాదశ జ్యోతిర్లింగాల నమూనాలను అందంగా పెయింటింగ్ వేయించారు. లోపల శ్రీకృష్ణుని లీలలు, రేపల్లె అందాలు, గోపికల విన్యాసాలు ఆకట్టుకునే బొమ్మల రూపంలో ఏర్పాటు చేశారు. ఈ మందిరానికి ఇటీవల గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కినట్లు ఈశ్వరీయ విశ్వవిద్యాలయం యాజమాన్యం తెలిపింది. -
ముక్తేశ్వర ఘాట్‌లో మద్యపానం
-
ముక్తేశ్వర ఘాట్‌లో మద్యపానం : వీడియో వైరల్
లక్నో: గంగానది ఒడ్డున దేవాలయ పరిసరాల్లో కొందరు యాత్రికులు అర్థనగ్నంగా మద్యం సేవిస్తున్న వీడియో వైరలవుతోంది. వీరు కన్వర్ యాత్రికులుగా భావిస్తున్నారు. వివరాల్లోకెళితే.. గంగా నది ప్రవహిస్తున్న ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో నదీముఖంగా ఉన్న శివాలయాలను దర్శించడానికి ఈ రోజుల్లో యాత్రికులు దేశం నలుమూలల నుంచి వస్తారు. దీనినే కన్వర్ యాత్ర అంటారు. ఈ నేపథ్యంలో కొందరు యాత్రికులు యూపీలోని హాపూర్‌లో గల ముక్తేశ్వర్ ఘాట్‌లో మద్యం సేవిస్తున్న వీడియో బయటపడింది. హిందువులు పవిత్రంగా భావించే ఇలాంటి ప్రదేశాల్లో మద్యం సేవించడం నిషిద్ధం. అంతేకాక నేరంగా పరిగణిస్తారు. ఈ విషయంపై హాపూర్ ఎసిపి సర్వేశ్ మిశ్రా ఎఎన్ఐతో మాట్లాడుతూ.. ప్రజలు పవిత్రంగా భావించే ప్రదేశాల్లో ఇలా చేయడం చట్టరీత్యా నేరం. వీడియోలో ఉన్న వ్యక్తులను ఇప్పటికే గుర్తించాం. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. -
నాలోని ఆ తెరలు తొలగించవా స్వామీ !
క్రికెట్ బ్యాట్ తెస్తాన్రా, తెస్తాన్రా అని కొడుకుతో పదిరోజులుగా చెప్తున్న తండ్రి పదకొండోరోజున నిజంగానే తెచ్చినా...‘అరే! ఇవ్వాళకూడా మర్చిపోయాన్రా’ అంటే... కొడుకు ‘మీరెప్పడూ ఇలాగే అంటారు’ అని ఏడుపు మొదలెడతాడు. వెంటనే తండ్రి తాను దాచిన క్రికెట్ బ్యాట్ చూపితే అంత ఏడుపులోకూడా సంతోషంగా దాన్ని అందిపుచ్చుకుంటున్న కొడుకును చూసి తండ్రి మురిసి పోతాడు. అదో ఆనందం తండ్రికి. అలాగే కుమార్తె వివాహానంతరం ‘జగమేలే పరమాత్మా...’ అంటూ త్యాగయ్య ఆర్తితో పిలుస్తూంటే...‘‘ రహస్యంగా నీకు దర్శనమిస్తాననుకున్నావా త్యాగయ్యా! నీ ఆర్తి ఏమిటో లోకానికి తెలిసేటట్లు ఒకరోజు దర్శనం ఇస్తాను’ అని అనుకుని ఉంటారు. అందుకే...త్యాగయ్యగారి జీవితంలో ఒకసారి తీర్థయాత్రకు వెడుతూ తిరుమల వెళ్ళారు. ఆయన వెళ్ళేటప్పటికి వేళమించిపోయిందని తెరలు వేసేశాం అని చెప్పారు అక్కడి వారు. క్షోభించిన మనసుతో ‘తెరతీయగరాదా! లోని / తిరుపతి వేంకటరమణ మత్సరమను /తెరతీయగరాదా ! / పరమపురుష ధర్మాదిమోక్షముల పారదోలుచున్నది నాలోని /తెరతీయగరాదా! / త్యాగరాజనుత మదమత్సరమను తెరతీయగరాదా !’’ అని పరమ ఆర్తితో త్యాగయ్య కీర్తన అందుకుంటే... కదిలిపోయిన వేంకటాచలపతి తెరలు తొలగించుకుని అందరూ చూస్తుండగా దర్శనమిచ్చారు. మన ఆంధ్రదేశంలో త్యాగరాజుగారి భక్తిని నిరూపించిన కీర్తన అది. రెండవ వారు శ్యామశాస్తిగ్రారు. ఒకానొక కాలంలో కంచిలో స్వర్ణకామాక్షిని ప్రతిష్ఠించారు. ఆదిశంకరాచార్యులవారు శ్యామశాస్త్రి గారి పూర్వీకులలో ఒకరిని అక్కడ అర్చకులుగా నియమించారు. కొంతకాలం తరువాత శ్రీ కృష్ణ్ణదేవరాయలు సామ్రాజ్యం పతనమై బహమనీ సుల్తాన్లు విజృంభించిన తరువాత బంగారు కామాక్షికి ఇబ్బంది ఏర్పడుతుందని భావించి అర్చకస్వామి కుటుంబీకులు ఆ విగ్రహాన్ని తీసుకుని అరణ్యమార్గాలగుండా తిరిగి తిరిగి, అనుకోకుండా తిరువారూరు చేరుకున్నారు. త్యాగయ్య (ఆ పేరుతో వెలసిన పరమశివుడి) ఆలయంలోనే ఆ విగ్రహాన్ని కూడా పెట్టి పూజలు చేస్తున్నారు. విశ్వనాథశాస్త్రి దంపతులకు చైత్రమాసం కృత్తికా నక్షత్రంతో కూడిన రోజున శ్యామశాస్త్రి గారు జన్మించారు. నామకరణం రోజున పెట్టిన పేరు వేంకట సుబ్రహ్మణ్యం. నీలమేఘశ్యాముడైన కృష్ణమూర్తిలా ఉన్నాడని తల్లి ‘శ్యామకృష్ణా! శ్యామకృష్ణా !’ అని పిలిచేది. అదే తరువాత శ్యామశాస్త్రి గా మారింది.శ్యామశాస్త్రి గారికి చిన్నతనం నుంచే అర్చకత్వంలోనూ, ఆ మంత్రాలలోనూ దానికి సంబంధించిన విషయాలలో తండ్రి తర్ఫీదు ఇచ్చాడు. మేనమామగారు మాత్రం సంగీతంలో కొంత ప్రవేశం ఉన్నవారు. ఆయన దగ్గర కొన్ని కృతులు నేర్చుకుని శ్యామశాస్త్రి గారు పాడుతుండేవారు. ఒకరోజున తండ్రిలేని సమయంలో రాగబద్ధంగా అమ్మవారి కీర్తనలు చాలా మధురంగా ఆలపిస్తూ పూజలు చేయడంలో నిమగ్నమైనారు. దర్శనానికి గుడికి వచ్చిన ధనిక భక్తుడొకరు అది చూసి మురిసిపోయి చాలా ఖరీదైన శాలువా ఒకటి బహూకరించారు. ఇది తెలిసి మేనమామగారికి ఆగ్రహం వచ్చి శ్యామశాస్త్రి గారు అభ్యసిస్తున్న సంగీత పుస్తకాలను చింపి అవతల పారేశారు.అయినా తల్లి కొడుకును ఓదార్చి సంగీతాభ్యాసం కొనసాగేలా సర్దుబాటు చేసింది.రామకృష్ణ స్వాములవారు త్యాగయ్యగారిని ఉద్ధరించినట్లుగానే సంగీత స్వాములవారు అనే ఒక విద్వాంసుడు చాతుర్మాస్య దీక్షకోసం తంజావూరు వచ్చి ఉన్నారు. అప్పటికి అక్కడ ఉన్న శ్యామశాస్త్రిగారికి స్వర్ణార్ణవాన్ని బహూకరించి సంగీతంలోనే అనేక రహస్యాలను బోధించారు. పోతూ పోతూ ఆయన పచ్చిమిరియం అప్పయ్య శాస్త్ర్రిగారనే మరో గురువుకు శామశాస్త్రి గారిని అప్పగించి వెళ్ళారు. -
‘తాజ్‌మహల్.. ఒకప్పటి శివాలయం’
న్యూఢిల్లీ: ప్రపంచ ప్రఖ్యాత కట్టడాల్లో ఒకటైన తాజ్‌మహల్ నిర్మాణంపై కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్దే సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజ్‌మహల్‌ను ముస్లింలు నిర్మించలేదని, అది ఒకప్పటి శివాలయం అని.. ఇందుకు చారిత్రక ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఆదివారం జరిగిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘తాజ్‌మహల్‌ను ముస్లింలు నిర్మించలేదు. జయసింహా అనే రాజు వద్ద నుంచి తాజ్‌మహల్‌ను కొనుగోలు చేసినట్టు తన ఆత్మకథలో షాజహాన్ చెప్పారు. పరమతీర్థ అనే రాజు నిర్మించిన శివాలయాన్ని తొలుత తేజోమహల్ అని పిలిచేవారు.. కాలక్రమంలో దాని పేరును తాజ్‌మహల్‌గా మార్చారు. మనం ఇలాగే నిద్ర పోతుంటే మన ఇళ్ల పేర్లను మసీదులుగా మారుస్తారు. రామున్ని జహాపన అని.. సీతా దేవిని బీబి అని పిలుస్తార’ని తెలిపారు. అంతేకాకుండా చరిత్రని.. వక్రీకరిస్తూ తిరగరాశారని తీవ్ర ఆరోపణలు చేశారు. గతంలో టిప్పు సుల్తాన్ జయంతి వేడుకలపై అనంత్ కుమార్ అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. -
శివాలయంలో నమాజ్, ఇఫ్తార్ విందు..
లక్నో, ఉత్తరప్రదేశ్ : మత ఘర్షణలు పెరిగిపోతున్నాయంటూ తరచూ వార్తలు వస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో... హిందువుల ఆరాధ్య దైవమైన మహాశివుడు కొలువైన ఓ ఆలయంలో ఇఫ్తార్ విందు, హారతి ప్రదేశంలో నమాజ్.. ఇలాంటి ఊహ కూడా అసాధ్యమే. కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు దేవ్యగిరి. లక్నోలోని వెయ్యేళ్ల చరిత్ర ఉన్న శివాలయంలో పూజారిగా బాధ్యతలు చేపట్టిన మొదటి మహిళ దేవ్యగిరి. మత సామరస్యాన్ని పెంపొందించడం కోసం ఆమె చేపట్టిన కార్యక్రమం అందరి మన్ననలు అందుకుంటోంది. వివరాలు.. ఉత్తరప్రదేశ్‌లోని గోమతి నది ఒడ్డున అతి పురాతనమైన మంకమేశ్వర్ గుడి ఉంది. అక్కడ ప్రధాన అర్చకురాలిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మహంత్ దేవ్యగిరిగా మారారు అరుణిమా సింగ్. ఏ మతమైనా మనుషులను ప్రేమించమని, సౌభ్రాతృత్వాన్ని పెంపొందించమని మాత్రమే చెబుతుందనే ఆమె నమ్మకాన్ని ఆచరించి చూపాలనుకున్నారు. అందుకోసం వెయ్యేళ్ల ప్రాశస్త్యం ఉన్న శివాలయంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసి చరిత్ర సృష్టించారు. హారతి స్థలంలో ముస్లిం సోదరులు నమాజ్ చేసుకునేందుకు వీలుగా ఏర్పాట్లు కూడా చేశారు. ‘మంకమేశ్వర్ ఆలయంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు సుమారు 500 మంది సున్ని, షియా ముస్లింలను ఆహ్వానించాం. విందు ఏర్పాటు కోసం ముగ్గురు వంటవారు, గుడిలో పనిచేసే కార్యకర్తలు ఉదయం నుంచే ఎంతో కష్టపడ్డారు. ముస్లిం సోదరుల కోసం మొదటిసారిగా మేము చేపట్టిన ఈ కార్యక్రమం విజయవంతమైంది. లక్నోలో ఒక ఆలయంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడమనేది మొదటిసారి. ఇలాంటి కార్యక్రమానికి నాందిగా నిలవడం ఎంతో సంతోషంగా ఉంది’ అంటూ దేవ్యగిరి హర్షం వ్యక్తం చేశారు. ఆమె నిర్ణయం ఆదర్శనీయం.. ఇఫ్తార్ విందుకు హాజరైన తేలీ వలీ మసీదు మౌలానా ఫజల్-ఈ-మనన్ మాట్లాడుతూ.. ‘మహంత్ దేవ్యగిరి శివాలయంలో విందు ఏర్పాటు చేస్తున్నామని నన్ను ఆహ్వానించినపుడు ఎంతో సంతోషంగా అనిపించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి కార్యక్రమాలు ఎంతో అవసరం. ఆమె నిర్ణయాన్ని మేమంతా స్వాగతిస్తున్నాం’ అంటూ సంతోషం వ్యక్తం చేశారు. -
శివ శివా..!
జలుమూరు: ప్రసిద్ద శైవక్షేత్రం శ్రీముఖలింగేశ్వరుని సన్నిధిలో దొంగలు పడ్డారు. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ఘటన జరిగింది. హుండీ కొల్లగొట్టి నగదు దోచుకుపోయారు. తెల్లవారుజామున ఆలయానికి వెల్లిన అర్చకులు ప్రధాన ద్వారం వద్ద తలుపులు తెరిచిఉండడం చూసి అవాక్కయ్యారు. చోరీ జరిగిందని గుర్తించి ఈవోతో కలిసి పోలీసులకు సమాచారం అందించారు. సరిగ్గా పదేళ్ల క్రితం ఇదే నెల ఇదే రోజున ఇలాగే ప్రధాన ఆలయంలో చోరీ జరిగింది. ప్రముఖ దేవాలయంలో దొంగతనం పునరావృతం కావడంతో భక్తుల్లో ఆందోళన కలుగుతోంది. ఈ ఘటనపై పోలీసులు, ఆలయ అధికారులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలావున్నాయి. శ్రీముఖలింగంలోని శ్రీముఖలింగేశ్వరుని దేవాలయంలో రోజువారీ కార్యక్రమాలు నిర్వహించేందుకు అర్చకులు పంచాది ఈశ్వరరావు మంగళవారం తెల్లవారుజాము 5 గంటలకు ఆలయం వద ్దకు వెళ్లారు. ద్వారం వద్ద తలుపులకు తాళాలు పగులగొట్టి ఉండడం గుర్తించిన ఆయన ఆలయ ఈవో వీవీఎస్ నారాయణకు విషయం తెలిపారు. తర్వాత వీరు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఆలయంలో తూర్పు ద్వారం ముఖమండపంనకు ఉన్న తలుపులకు ఐదు తాళాలు ఉన్నాయి. వీటిలో నాలుగు తాళాలను దొంగలు విరగొట్టారు. ప్రధాన ఆలయంలో ఉన్న పాలరాతి నందీశ్వరుని వెనుక భాగాన గల మొదటి హుండీని ఎత్తుకెళ్లిపోయారు. ప్రధాన హుండీతో పాటు మరో హుండీని ముట్టలేదు. ప్రధానంగా ఉత ్తర దిశ గదిలో పార్వతి పరమేశ్వురుల విలువైన వెండి, బంగారు ఆభరణాలు ఉన్నాయి. వీటితో పాటు గర్భగుడిలోని స్వయంభూ లింగం వెండితొడుగు, ఇతర వెండి వస్తువులు అలాగే ఉన్నాయి. వీటిని కనీసం ముట్టకు ండా కేవలం ఒక్క హుండీతో సరిపెట్టుకోవడంపై చిల్లర దొంగలు చేసే పనిగా భావిస్తున్నారు. దొంగతనం చేసేం దుకు దుండగులు ఏ దిక్కు నుంచి గోడ దూకి ఆలయంలోకి ప్రవేశించారో అర్ధం కాని ప్రశ్న. తీసుకెళ్లిన హుండీ ని ఆలయం పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో ఉంచి తాళాలు పగలుగొట్టినట్టు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ఈ హుండీలో సుమారు రూ. 10 వేలు నగదు చోరీకి గురైయింది. ఇందులో నోట్లను తీసుకుపోయి చిల్లర మాత్రం విడిచిపెట్టేశారు. హుండీని ఆలయం దగ్గరలో ఉన్న బీసీ బాలుర వసతి గృహం వెనుక భాగాన పడేశారు. బయటపడిన భద్రతలో డొల్లతనం ఎంతో విశిష్టత ఉన్న ఆలయానికి భద్రత కల్పించడంలో అధి కారులు విఫలమయ్యారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎంతో పటిష్టమైన భద్రత ఉండాల్సినప్పటికీ కేవలం ఒక్క సెక్యూరిటీ గార్డును మాత్రం తాత్కాలిక పద్ధతిలో నియమించి చేతులు దులుపుకున్న ఆలయ అధికారుల తీరును అందరూ తప్పుపడుతున్నారు. అలాగే ఇటీవల ఆలయ అభివృద్ధి పనుల్లో భాగంగా రసాయనాలు పూత వేస్తున్న దృష్ట్యా సీసీ కెమెరాలు తొలగించినట్టు ఈఓ వీవీఎస్ నారాయణ తెలిపారు. ఆలయంలో విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ గార్డు త్రినాథరావు రాత్రి రెండు గంటల వరకూ మెలకువతో ఉన్నట్లు చెబుతున్నారు. వరుసగా మూడు ఆలయాల్లో చోరీ గడచిన మూడు రోజుల్లో తిమడాంలోని షిర్డీసాయిబాబా, శివాలయంతో పాటు అచ్యుతాపురంలో ఉన్న రామాలయంలో వరుసగా దొంగతనాలు జరిగాయి. ఈ నేపథ్యంలో మళ్లీ శ్రీముఖలింగేశ్వరుని ఆలయంలో చోరీ జరగడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, దేవాలయంలో చోరీ జరిగిన విషయంపై స్థానిక ఎస్ఐ ఎం.గోవిందకు ఈవో ఫిర్యాదు చేశారు. దొంగతనం విషయం తెలుసుకున్న శ్రీకాకుళం క్లూస్‌టీమ్ సీఐ బీఎస్వీ కోటేశ్వరరావు ఆధ్వర్యంలో గుడి తలుపులు, పగులుగొట్టిన తాళాలు, ఇనుప దండిలు, హుండీ మీద ఉన్న వేలిముద్రలను సేకరించారు. నరసన్నపేట సీఐ కె.పైడుపునాయడు, జలుమూరు, నరసన్నపేట ఎస్ఐ లు ఎం.గోవింద, జి.నారాయణ స్వామితో పాటు సిబ్బ ంది సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. ఈ చోరీ సమాచారం తెలియడంతో దేవాదాయ శాఖ ఏసీ వి.శ్యామలాదేవి సంఘటనా స్థలానికి వచ్చి గ్రామస్తులు, ఆలయ అధికారులతో పాటు సీఐతో మాట్లాడారు. డీఎస్పీ పరిశీలన జలుమూరు: శ్రీముఖలింగం ప్రధాన ఆలయంలో చోరీ జరగడంతో శ్రీకాకుళం డీఎస్పీ వి.భీమారావు మంగళవారం సాయంత్రం పరిశీలించారు. చోరీ ఎలా జరిగిందని.. గుడి ఎన్ని గంటలకు మూత వేస్తారు... మూసిన తర్వాత తాళాలు ఎవరి వద్ద ఉంటాయి... ఎన్ని గంటలకు మళ్లీ తెరుస్తారు... తదితర విషయాలను ఈఓ వీవీఎస్ నారాయణను అడిగారు. వీటితో పాటు పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ఆయనతో పాటు సిబ్బంది ఉన్నారు. -
శివాలయంలో హుండీ చోరీ
వైఎస్సార్ కడప: జిల్లాలోని సుండుపల్లి పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న శివాలయంలో శుక్రవారం చోరీ జరిగింది. ఆలయ హుండీని గుర్తు తెలియని దుండగులు పగలగొట్టి నగదు, కానుకలు దోచుకె ళ్లారు. హుండీలో సుమారు రూ.2లక్షల వరకు నగదు ఉండవచ్చునని స్థానికులు చెబుతున్నారు. ఘటనపై ఆలయ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
శివాలయంలో హుండీ చోరీ
నల్గొండ(భువనగిరి అర్బన్): భువనగిరి మండలం తాజ్పూర్ గ్రామంలోని శివాలయంలో దోపిడీ జరిగింది. శనివారం అర్ధరాత్రి సమయంలో దొంగలు హుండీ పగలగొట్టి అందులో ఉన్న నగదును దోచుకున్నారు. హుండీలో రూ.10 వేల నగదు ఉండవచ్చునని గ్రామస్తులు భావిస్తున్నారు. ఆదివారం ఉదయం గమనించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. -
పోటెత్తిన వరదనీరు
-
శివోహం..
శైవ క్షేత్రాలకు తరలివెళ్లిన భక్తులు జిల్లాలో ఎన్నో శివాలయాలు ఉన్నాయి. వీటిలో దాదాపు అన్నింటిలోనూ శివుడు లింగాకారంలో ఉండడం మనకు తెలుసు. కానీ కొన్నిచోట్ల ఆలయాలలోనూ,ఆలయ ప్రాంగణాలలోనూ శివుడు విభిన్న రూపాలలో కనిపిస్తాడు. మహాశివరాత్రిసందర్భంగా జిల్లాలోని అలాంటి విభిన్న రూపాల శివయ్యల గురించి ‘సాక్షి’ ప్రత్యేక కథనం. -కడప కల్చరల్ నారీశ్వరుడు పెద్దచెప్పలి శ్రీ అగస్త్యేశ్వరస్వామి గర్భాలయం ఎదుట శివపార్వతులు నందీశ్వరునిపై ఉన్న శిల్పాన్ని మనం చూడవచ్చు. ఇలాంటి శిల్పం జిల్లాలో మరెక్కడా కనిపించదు. రాష్ట్రేతర భక్తులు కూడా విశేషంగా వస్తుంటారు. ముఖ్యంగా కర్ణాటక ప్రాంతం నుంచి వచ్చే భక్తులు ఈ శిల్పాన్ని ఆసక్తిగా తిలకిస్తారు. గర్భాలయంలోని శివలింగానికి పూజలు చేశాక అమ్మవారి సమేతంగా ఉన్న ఈ స్వామిని నందీశ్వరుడిని దర్శించుకుంటారు. లింగోద్భవం.. సాధారణంగా ఏ ఆలయంలోనైనా విష్ణువు మానవుడిని పోలిన రూపంలో పలు అలంకారాలతో దర్శనమిస్తాడు. శివుడు మాత్రం లింగాకారంలోనే కనిపిస్తాడు. జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పుష్పగిరిలో సాధారణ శివలింగాకారానికి భిన్నంగా కనిపిస్తాడు. శివరాత్రి నాడు శివుడు పుట్టుకను తెలిపే లింగ్భోదవ దృశ్యం ఈ శిల్పంలో ఉంది. జిల్లాలో అద్భుత శిల్పసంపదకు ఆటపట్టయిన పుష్పగిరి శ్రీ వైద్యనాథస్వామి ఆలయ ఆవరణంలో ప్రదర్శనగా ఉంచిన ఈ శిల్పాల్లో ఈ ప్రత్యేక శిల్పాన్ని మనం చూడవచ్చు. మహా లింగం.. జిల్లాలో 18 అడుగుల శివుడు ఉన్నాడంటే నమ్మలేం కదూ. వేముల మండలం మోపూరు భైరవేశ్వరుని ఆలయం ఈ ప్రత్యేకతను కలిగి ఉంది. స్వయంభుగా పేర్కొనే ఈ 18 అడుగుల శివలింగం తెలుగునాట అత్యంత ఎత్తయిన శివలింగాలలో ఒకటిగా చెబుతారు. ఇంత ఎత్తై శివలింగానికి పూజలు చేయడం కష్టం గనుక దీనికి ఆలయాన్ని రెండు అంతస్తులుగా నిర్మించారు. పై అంతస్తు నుంచి అభిషేకాలు, కింది అంతస్తు నుంచి ఇతర పూజలు నిర్వహిస్తుంటారు. సైకత లింగం జిల్లాలో ఇసుక (సైకతం)తో తయారు చేసి ప్రతిష్ఠించిన శివలింగం ఉంది. దీన్ని శ్రీరామచంద్రుడే స్వయంగా ప్రతిష్ఠించినట్లు పురాణగాథ. ప్రొద్దుటూరు ముక్తి రామేశ్వరాలయంలో ఈ శివలింగం ఉంది. రావణాసురుడిని హతమార్చిన శ్రీరాముడు తిరిగి అయోధ్యకు వెళుతూ ఈ ప్రాంతానికి వచ్చాడు. రావణవధ పాపాన్ని పోగొట్టుకునేందుకు ఇక్కడ శివలింగ ప్రతిష్ఠ చేయదలిచి శివలింగం తెమ్మని హనుమంతుడిని కాశీకి పంపాడు. ఆయన రావడం ఆలస్యం కావడంతో పెన్నానది ఇసుకతో శ్రీరాముడు శివలింగాన్ని తయారు చేసి ప్రతిష్ఠించాడు. రాయలసీమలో సైకత లింగం, రాముడే ప్రతిష్ఠించిన శివలింగం ఇదే కావడం విశేషం. బ్రహ్మం చెక్కిన శిల్పం శివుడికే కాకుండా జిల్లాలో శివుడి అంశ అయిన వీరభద్రుడికి కూడా ఆలయాలున్నాయి. అల్లాడుపల్లె గ్రామంలో కుందూ తీరాన గల వీరభద్రస్వామి ఆలయం మూల విరాట్ దాదాపు ఆరున్నర అడుగుల ఎత్తు ఉంది. దీన్ని కాలజ్ఞాని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి స్వయంగా మలిచి ప్రతిష్ఠించారని చెబుతారు. స్వామి మూల విరాట్ కంటే ఆలయంలోకి వెళ్లే ద్వారం తక్కువ ఎత్తులో ఉంది. స్వామి ఎదుట ఎవరైనా తలవంచుకుని వెళ్లవలసిందేనన్న ఉద్దేశంతో ఇలా ఏర్పాటు చేసినట్లు స్థానికులు చెప్పుకుంటారు. -
శివుడి గుడిలో నిఖా
లక్నో: కొన్నాళ్లుగా మతహింసకు సాక్షిగా నిలుస్తున్న ఉత్తరప్రదేశ్‌లో మతసామరస్యం వెల్లివిరిసింది. శివుడి సన్నిధిలో జరిగిన నిఖా.. హిందూ-ముస్లింల ఐక్యతకు చిహ్నంగా నిలిచింది... బులంద్‌షహర్ జిల్లా రాంనగర్ గ్రామానికి చెందిన ఇక్బాల్‌ఖాన్‌కు ఇద్దరు కూతుళ్లు నజ్మా, ముజ్మా...వారికి అదే జిల్లాకు చెందిన ఇద్దరు యువకులతో పెళ్లి నిశ్చయమైంది. మొదటగా తన ఇంట్లోనే కూతుళ్ల నిఖా చేయాలనుకున్నా ఇక్బాల్ తర్వాత తన కూతుళ్ల పెళ్లి మతసామరస్యానికి చిహ్నంగా ఉండాలని భావించాడు. వెంటనే ఊళ్లోని శివాలయంలో నిఖా నిర్వహించాలని నిర్ణయించుకున్నాడు. అందుకు అనుగుణంగా ఊళ్లోని రెండు మతాలకు చెందిన పెద్దలతో మాట్లాడి వారి ఆమోదాన్ని కూడా పొందాడు. పెళ్లి కొడుకులు కూడా శివాలయంలో నిఖా చేసుకోడానికి సంతోషంగా అంగీకరించారు. ఇక గుడిలోని పూజారులయితే సాదరంగా ఆహ్వానించారు. ఇంకేముంది.. కాసేపు మతాన్ని పక్కన పెట్టి ఊళ్లోని జనమంతా శివుడిగుడిలో జరిగే నిఖాకు పెద్దయెత్తున తరలివచ్చారు. రెండు మతాలకు చెందిన వందల మంది సాక్షిగా...శివుడి సన్నిధిలో... ఇస్లాం సంప్రదాయాలకు అనుగుణంగా... ఖాజీల మంత్రోచ్చారణల మధ్య... సోమవారం ఇక్బాల్ ఇద్దరు కూతుళ్ల నిఖా ఘనంగా జరిగింది. చివరగా, ఊళ్లో జనమంతా వధూవరులకు కన్నీటి వీడ్కోలు పలికి తమ మతసామరస్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పారు. -
భక్తులతో పోటెత్తిన శివాలయాలు
హైదరాబాద్ : పరమ శివుడికి అత్యంత ప్రియమైనది కార్తీక మాసం. తొలి కార్తీక సోమవారం రోజు రాష్ట్రంలోని శివాలయాలన్నీ కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజామునుంచే భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో శివుడికి పూజలు చేశారు. హైదరాబాద్‌లో శివాలయాలు కిక్కిరిసిపోయాయి. కార్తీక మాసం ప్రారంభమవుతుండడంతో రాష్ట్రమంతటా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. తొలిరోజే సోమవారం కావడంతో శివాలయలకు భక్తులు పోటెత్తారు. ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భక్తులంతా మహాశివుని దర్శనానికి క్యూ కట్టారు. సోమవారమంటే మహాదేవునికి మహా ప్రియం అందులోనూ ఈసారి విశేషించి సోమవారంనాడే ఈ మాసం ప్రారంభమైంది. ఈ మాసమంతా శివారాధనా, ఉపవాసం చెయ్యలేనివారు కేవలం ఈ ఒక్క సోమవారంనాడైనా నిండుమనస్సుతో చెయ్యగలిగితే వారు తప్పక కైవల్యాన్ని పొందుతారు. ఈ మాసంలో వచ్చే ఏ సోమవారం నాడైనా శివదేవునికి అభిషేకం, అర్చనలు చేసినవారు వెయ్యి అశ్వమేధయాగాలు చేసిన ఫలితాన్ని పొందుతారు. మరోవైపు శ్రీశైలం భక్తులతో కిటకిటలాడుతోంది. మహాదేవుడిని దర్శించుకుని అనుగ్రహం పొందేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. భక్తులకు ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.మరోవైపు కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా మహిళలు నదిలో దీపాలు వదలి దీపారాధన చేశారు.