లక్నో: గంగానది ఒడ్డున దేవాలయ పరిసరాల్లో కొందరు యాత్రికులు అర్థనగ్నంగా మద్యం సేవిస్తున్న వీడియో వైరలవుతోంది. వీరు కన్వర్ యాత్రికులుగా భావిస్తున్నారు. వివరాల్లోకెళితే.. గంగా నది ప్రవహిస్తున్న ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో నదీముఖంగా ఉన్న శివాలయాలను దర్శించడానికి ఈ రోజుల్లో యాత్రికులు దేశం నలుమూలల నుంచి వస్తారు. దీనినే కన్వర్ యాత్ర అంటారు. ఈ నేపథ్యంలో కొందరు యాత్రికులు యూపీలోని హాపూర్‌లో గల ముక్తేశ్వర్ ఘాట్‌లో మద్యం సేవిస్తున్న వీడియో బయటపడింది. హిందువులు పవిత్రంగా భావించే ఇలాంటి ప్రదేశాల్లో మద్యం సేవించడం నిషిద్ధం. అంతేకాక నేరంగా పరిగణిస్తారు. ఈ విషయంపై హాపూర్ ఎసిపి సర్వేశ్ మిశ్రా ఎఎన్‌ఐతో మాట్లాడుతూ.. ప్రజలు పవిత్రంగా భావించే ప్రదేశాల్లో ఇలా చేయడం చట్టరీత్యా నేరం. వీడియోలో ఉన్న వ్యక్తులను ఇప్పటికే గుర్తించాం. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment