ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్న కన్వర్ యాత్రకు ఉగ్రవాద ముప్పు పొంచివుందంటూ నిఘా వర్గాలకు సమాచారం అందిన నేపధ్యంలో యాత్ర భద్రత కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. దీని పర్యవేక్షణ బాధ్యతను యాంటీ టెర్రరిస్ట్ స్క్యాడ్(ఏటీఎస్)కు అప్పగించారు. ఈ నేపధ్యంలో ఏటీఎస్ బృందం భద్రతా ఏర్పాట్లను పరిశీలించింది.
ఉగ్రవాదుల దాడి యత్నానికి సంబంధించిన ఇన్‌పుట్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు అందినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ నేపధ్యంలో యూపీలోని ముజఫ్ఫర్‌నగర్ జిల్లాకు ఏటీఎస్ కమాండోల బృందం తరలివచ్చింది. వీరికి ఎస్‌ఎస్‌పీ అభిషేక్ సింగ్ విధులకు సంబంధించిన ఆదేశాలు జారీ చేశారు. ఈ బృందాన్ని శివచౌక్, మీనాక్షి చౌక్, హాస్పిటల్ తిరహా తదితర ముఖ్యమైన ప్రాంతాల్లో మోహరించినట్లు అధికారులు తెలిపారు. దీంతోపాటు యాంటీ శాబోటేజ్ టీం, బీడీడీఎస్ (బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్) కూడా జిల్లాలోని పలు ప్రాంతాల్లో నిరంతరం తనిఖీలు చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment