హుండీని పరిశీలిస్తున్న పోలీసులు, క్లూస్ టీమ్ సిబ్బంది
జలుమూరు: ప్రసిద్ద శైవక్షేత్రం శ్రీముఖలింగేశ్వరుని సన్నిధిలో దొంగలు పడ్డారు. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ఘటన జరిగింది. హుండీ కొల్లగొట్టి నగదు దోచుకుపోయారు. తెల్లవారుజామున ఆలయానికి వెల్లిన అర్చకులు ప్రధాన ద్వారం వద్ద తలుపులు తెరిచిఉండడం చూసి అవాక్కయ్యారు. చోరీ జరిగిందని గుర్తించి ఈవోతో కలిసి పోలీసులకు సమాచారం అందించారు. సరిగ్గా పదేళ్ల క్రితం ఇదే నెల ఇదే రోజున ఇలాగే ప్రధాన ఆలయంలో చోరీ జరిగింది. ప్రముఖ దేవాలయంలో దొంగతనం పునరావృతం కావడంతో భక్తుల్లో ఆందోళన కలుగుతోంది. ఈ ఘటనపై పోలీసులు, ఆలయ అధికారులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలావున్నాయి. శ్రీముఖలింగంలోని శ్రీముఖలింగేశ్వరుని దేవాలయంలో రోజువారీ కార్యక్రమాలు నిర్వహించేందుకు అర్చకులు పంచాది ఈశ్వరరావు మంగళవారం తెల్లవారుజాము 5 గంటలకు ఆలయం వద ్దకు వెళ్లారు. ద్వారం వద్ద తలుపులకు తాళాలు పగులగొట్టి ఉండడం గుర్తించిన ఆయన ఆలయ ఈవో వీవీఎస్ నారాయణకు విషయం తెలిపారు.
తర్వాత వీరు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఆలయంలో తూర్పు ద్వారం ముఖమండపంనకు ఉన్న తలుపులకు ఐదు తాళాలు ఉన్నాయి. వీటిలో నాలుగు తాళాలను దొంగలు విరగొట్టారు. ప్రధాన ఆలయంలో ఉన్న పాలరాతి నందీశ్వరుని వెనుక భాగాన గల మొదటి హుండీని ఎత్తుకెళ్లిపోయారు. ప్రధాన హుండీతో పాటు మరో హుండీని ముట్టలేదు. ప్రధానంగా ఉత ్తర దిశ గదిలో పార్వతి పరమేశ్వురుల విలువైన వెండి, బంగారు ఆభరణాలు ఉన్నాయి. వీటితో పాటు గర్భగుడిలోని స్వయంభూ లింగం వెండితొడుగు, ఇతర వెండి వస్తువులు అలాగే ఉన్నాయి. వీటిని కనీసం ముట్టకు ండా కేవలం ఒక్క హుండీతో సరిపెట్టుకోవడంపై చిల్లర దొంగలు చేసే పనిగా భావిస్తున్నారు. దొంగతనం చేసేం దుకు దుండగులు ఏ దిక్కు నుంచి గోడ దూకి ఆలయంలోకి ప్రవేశించారో అర్ధం కాని ప్రశ్న. తీసుకెళ్లిన హుండీ ని ఆలయం పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో ఉంచి తాళాలు పగలుగొట్టినట్టు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ఈ హుండీలో సుమారు రూ. 10 వేలు నగదు చోరీకి గురైయింది. ఇందులో నోట్లను తీసుకుపోయి చిల్లర మాత్రం విడిచిపెట్టేశారు. హుండీని ఆలయం దగ్గరలో ఉన్న బీసీ బాలుర వసతి గృహం వెనుక భాగాన పడేశారు.
బయటపడిన భద్రతలో డొల్లతనం
ఎంతో విశిష్టత ఉన్న ఆలయానికి భద్రత కల్పించడంలో అధి కారులు విఫలమయ్యారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎంతో పటిష్టమైన భద్రత ఉండాల్సినప్పటికీ కేవలం ఒక్క సెక్యూరిటీ గార్డును మాత్రం తాత్కాలిక పద్ధతిలో నియమించి చేతులు దులుపుకున్న ఆలయ అధికారుల తీరును అందరూ తప్పుపడుతున్నారు. అలాగే ఇటీవల ఆలయ అభివృద్ధి పనుల్లో భాగంగా రసాయనాలు పూత వేస్తున్న దృష్ట్యా సీసీ కెమెరాలు తొలగించినట్టు ఈఓ వీవీఎస్ నారాయణ తెలిపారు. ఆలయంలో విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ గార్డు త్రినాథరావు రాత్రి రెండు గంటల వరకూ మెలకువతో ఉన్నట్లు చెబుతున్నారు.
వరుసగా మూడు ఆలయాల్లో చోరీ
గడచిన మూడు రోజుల్లో తిమడాంలోని షిర్డీసాయిబాబా, శివాలయంతో పాటు అచ్యుతాపురంలో ఉన్న రామాలయంలో వరుసగా దొంగతనాలు జరిగాయి. ఈ నేపథ్యంలో మళ్లీ శ్రీముఖలింగేశ్వరుని ఆలయంలో చోరీ జరగడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, దేవాలయంలో చోరీ జరిగిన విషయంపై స్థానిక ఎస్‌ఐ ఎం.గోవిందకు ఈవో ఫిర్యాదు చేశారు. దొంగతనం విషయం తెలుసుకున్న శ్రీకాకుళం క్లూస్‌టీమ్ సీఐ బీఎస్‌వీ కోటేశ్వరరావు ఆధ్వర్యంలో గుడి తలుపులు, పగులుగొట్టిన తాళాలు, ఇనుప దండిలు, హుండీ మీద ఉన్న వేలిముద్రలను సేకరించారు. నరసన్నపేట సీఐ కె.పైడుపునాయడు, జలుమూరు, నరసన్నపేట ఎస్‌ఐ లు ఎం.గోవింద, జి.నారాయణ స్వామితో పాటు సిబ్బ ంది సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. ఈ చోరీ సమాచారం తెలియడంతో దేవాదాయ శాఖ ఏసీ వి.శ్యామలాదేవి సంఘటనా స్థలానికి వచ్చి గ్రామస్తులు, ఆలయ అధికారులతో పాటు సీఐతో మాట్లాడారు.
డీఎస్పీ పరిశీలన
జలుమూరు: శ్రీముఖలింగం ప్రధాన ఆలయంలో చోరీ జరగడంతో శ్రీకాకుళం డీఎస్పీ వి.భీమారావు మంగళవారం సాయంత్రం పరిశీలించారు. చోరీ ఎలా జరిగిందని.. గుడి ఎన్ని గంటలకు మూత వేస్తారు... మూసిన తర్వాత తాళాలు ఎవరి వద్ద ఉంటాయి... ఎన్ని గంటలకు మళ్లీ తెరుస్తారు... తదితర విషయాలను ఈఓ వీవీఎస్ నారాయణను అడిగారు. వీటితో పాటు పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ఆయనతో పాటు సిబ్బంది ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment