ఎల్లోరా గుహల్లో ప్రమాదం | 3 tourists injured as boulder falls at Ellora caves | Sakshi
Sakshi News home page

ఎల్లోరా గుహల్లో ప్రమాదం

Published Sun, Oct 4 2015 4:30 PM | Last Updated on Thu, Jul 11 2019 8:55 PM

ఎల్లోరా గుహల్లో ప్రమాదం - Sakshi

ఎల్లోరా గుహల్లో ప్రమాదం

ఔరంగాబాద్(మహారాష్ట్ర): ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఎల్లోరా గుహల్లో ప్రమాదం చోటుచేసుకుంది. ఓ పెద్ద బండరాయి దొర్లిపడటంతో ముగ్గురు పర్యాటకులకు గాయాలు అయ్యాయి. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో ఈ గుహలు ఉన్న విషయం తెలిసిందే. వీటిని సందర్శించేందుకు నిత్యం పర్యాటకులు వస్తూనే ఉంటారు.

ఈ నేపథ్యంలోనే కైలాస ఆలయానికి కొందరు పర్యాటకులు వచ్చిన సమయంలోనే గుహపైన ఉన్న పెద్ద బండరాయి ఒక్కసారిగా పడటంతో ముగ్గురు పర్యాటకులు గాయపడ్డారు. వీరిలో ఒకరిది రాజస్థాన్ కాగా, మరో ఇద్దరి వివరాలు తెలియాల్సి ఉంది. గాయపడిన వీరిని ఆస్పత్రికి తరలించారు. పెద్దబండరాయి పడటంవల్ల గుహలోని కొన్ని భాగాలు కూడా దెబ్బతిన్నట్లు పురావస్తు శాస్త్ర అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement