injure
-
రాజధానిలో అగ్ని ప్రమాదం.. ఒకరు మృతి
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలోని వసంత్ కుంజ్ ప్రాంతంలోగల ఓ ఇంట్లో ఒక్కసారిగా పేలుడు సంభవించి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను పోలీసులు ఎయిమ్స్ ట్రామా సెంటర్‌కు తరలించారు. వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.మీడియాకు అందిన వివరాల ప్రకారం వసంత్ కుంజ్‌లోని నాలుగు అంతస్తుల భవనంలో పేలుడు సంభవించింది. కొద్దిసేపటికే మంటలు ఇంటినంతా చుట్టుముట్టాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను ఆర్పి లోపలికి ప్రవేశించారు. శరీరం కాలిపోయి అపస్మారక స్థితిలోకి చేరిన బాధితులను ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు.మూడు రోజుల క్రితం కూడా ఢిల్లీలోని ప్రశాంత్ విహార్ ప్రాంతంలోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) పాఠశాల సమీపంలో పేలుడు సంభవించింది. రోజులు గడుస్తున్నా ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఈ పేలుడులో ఎలాంటి ప్రాణ నష్టం జరగనప్పటికీ, ఈ పేలుడు శబ్ధం దాదాపు 30 అడుగుల దూరం వరకు వినిపించగా, 250 అడుగుల మేర పొగలు కమ్ముకున్నాయి. ఈ పేలుడుపై ఢిల్లీ పోలీసులతో పాటు ఎన్ఐఏ, నిఘా సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి. ఇది కూడా చదవండి: మద్యంపై పోరులో మహిళల విజయం..! -
కాలు జారిన మోడల్.. షూ కంపెనీదే తప్పంటోంది!
లండన్‌కు చెందిన ఒక మోడల్ ఊహకందని రీతిలో ప్రమాదం బారినపడింది. దీంతో ఆమె జీవితాంతం హీల్స్ ధరించలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపధ్యంలో ఆ మోడల్ సదరు షూ కంపెనీపై £ 100,000 (సుమారు ఒక కోటి రూపాయలు) నష్టపరిహారం కోసం కేసు వేసింది. ఆ షూ కంపెనీకి చెందిన హీల్స్ ధరించడం కారణంగానే తాను ప్రమాదం బారినపడినట్లు ఆ మోడల్ తెలిపింది. న్యూస్ సైట్ ది మిర్రర్ నివేదిక ప్రకారం 31 ఏళ్ల క్లో మికెల్‌బరో 2018లో మిలన్లోని డిజైనర్ బేస్‌లో ప్రకటనల షూట్లో పాల్గొంది. వాక్‌వేపై నడుచుకుంటూ వెళ్తుండగా కాలు స్లిప్ అయి పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆ మోడల్ కాలి మడమ విరిగింది. తీవ్రమైన నొప్పి, కాలు వాపుతో ఆమె చాలా రోజులు మంచం మీదనే రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. అలాగే ఆమెకు హీల్స్ ధరించలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో క్లో ఆ షూ కంపెనీ నుంచి పరిహారం పొందేందుకు కోర్టును ఆశ్రయించింది. తన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఇకపై తాను ఎవరికీ డాన్స్ నేర్పించలేనని, తానూ డ్యాన్స్ చేయలేనని, పరిగెత్తలేనని కోర్టు ముందు మొరపెట్టుకుంది. అయితే స్టెల్లా మాక్కార్ట్నీ లిమిటెడ్ షూ కంపెనీ ఆమె వాదనను ఖండించింది. కంపెనీ తరపు న్యాయవాది మైఖేల్ పాట్రిక్ తెలిపిన వివరాల ప్రకారం ఆమెకు నడక మార్గంలో ప్రమాదం జరిగింది. ఆమె తన బరువును నియంత్రించుకోలేక పడిపోయింది. కాగా కేసు కోర్టు విచారణలో ఉంది. ఇది కూడా చదవండి: ఆ గ్రామం కేన్సర్ నిలయంగా ఎందుకు మారింది? -
బంగ్లాదేశ్‌లో రెండు రైళ్లు ఢీ.. 20 మంది మృతి
బంగ్లాదేశ్‌లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు రైళ్లు ఢీకొన్న ఘటనలో 20 మంది మృతిచెందారు. 100 మందికిపైగా ప్రయాణికులు గాయపడ్డారు. సోమవారం సాయంత్రం జరిగిన ఈ ఘటన బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు 80 కిలోమీటర్ల దూరంలోని ఖైరబ్ అనే ప్రాంతంలో చోటుచేసుకుంది. కిషోర్ గంజ్ రైల్వేస్టేషన్ దగ్గర గూడ్స్ రైలును ఎక్స్ ప్రెస్ రైలు వేగంగా ఢీకొనటంతో నాలుగు బోగీలు పట్టాలు తప్పాయి. ఢాకా వెళుతున్న గోథూళి ఎక్స్ ప్రెస్.. గూడ్స్ రైలును బలంగా ఢీకొన్నట్లు స్థానిక రైల్వే అధికారులు తెలిపారు. అయితే ఇంతకీ ఈ ప్రమాదం ఎలా జరిగిందనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదని అధికారులు చెబుతున్నారు. కాగా ప్రమాద తీవ్రత అధికంగా ఉందని, మృతుల సంఖ్య మరింతగా పెరగవచ్చని అధికారులు అంటున్నారు. ప్రమాదంలో కొన్ని బోగీలు నుజ్జునుజ్జు అయ్యాయని, వాటిలో ప్రయాణికులు చిక్కుకుపోయారని, ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు తెలిపారు అధికారులు. ఈ ఘటన నేపధ్యంలో బంగ్లాదేశ్ వ్యాప్తంగా పలు రైలు సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గాయపడిన వంద మందిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రమాద స్థలానికి అత్యవసర సర్వీసులు తరలివచ్చాయని, స్థానికుల సహకారంతో సహాయ చర్యలు కొనసాగుతున్నట్లు బంగ్లాదేశ్ రైల్వే అధికారులు తెలిపారు. కాగా విచారణ అనంతరం ఈ ప్రమాదానికి దారితీసిన కారణాలను వెల్లడించగలమని అధికారులు చెబుతున్నారు. రైలులో సురక్షితంగా ఉన్న ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు ప్రత్యేక వాహనాలలో తరలిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఇది కూడా చదవండి: హమాస్ చెర నుంచి మరో ఇద్దరు బందీల విడుదల! -
వీడియో: వృద్ధురాలిపై చిరుత దాడి.. వాకింగ్ స్టిక్‌తో ఫైటింగ్
ముంబై: ముంబైలోని ఆరే ఏరియాలో మరోసారి చిరుత కలకలం రేపింది. బుధవారం సాయంత్రం ఓ ఇంటి ఆవరణలో కూర్చున్న వృద్ధురాలిపై చిరుత దాడి చేసింది. అయితే ఆమె ఏ మాత్రం ధైర్యం కోల్పోకుండా తన వాకింగ్ స్టిక్ సహాయంతో చిరుతతో పోరాడింది. ఓ వైపు పులితో పోరాడుతూనే తాను గట్టిగా అరవడంతో ఆ పిలుపులు విన్న మహిళ కుటుంబ సభ్యులు అటు రావడంతో పులి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ మొత్తం ఘటన అక్కడి సీసీ కెమెరాలో రికార్డయింది. కాగా ఈ ఘటనలో ఆమెకు స్వల్ప గాయాలుకావడంతో చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఆ ప్రాంతంలో రెండ్రోజుల కింద నాలుగేళ్ల బాలుడిపై చిరుత దాడి చేయగా తాజాగా ఇలాంటి ఘటన జరగడం రెండో సారి కావడం గమనార్హం. దీంతో ఆ ప్రాంత నివాసితులు భయాందోళనకు గురవుతున్నారు. చదవండి: Viral Video: స్టేజ్‌పై నుంచి కిందపడ్డ బీజేపీ కార్యకర్త -
గాయపడిన పోలీస్ ప్రాణం కాపాడిన ముస్లిం
ఆగ్రా: పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశమంతటా పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో ఓ ముస్లిం మత గురువు మానవత్వం ప్రదర్శించాడు. కోపంతో రాళ్లు విసురుతున్న నిరసనకారుల నుంచి గాయపడిన ఓ పోలీస్ కానిస్టేబుల్‌ను కాపాడాడు. ఉత్తరప్రదేశ్‌లో ఫిరోజాబాద్ జిల్లాలోని ఓ మసీదులో గత వారం ప్రార్థనలు ముగించుకుని వస్తున్న 52 ఏళ్ల హాజీ ఖాదిర్‌కు కానిస్టేబుల్ అజయ్ కుమార్ గాయాలతో కనిపించాడు. నిరసనకారులు అజయ్‌పై దాడికి ప్రయత్నించగా ముందు తనను చంపి కానిస్టేబుల్‌పై దాడి చేయమని ఆందోళనకారులకు అడ్డు నిలిచాడు. అజయ్‌ను దగ్గర్లోని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లాడు. పోలీసులు అజయ్‌ను ఆగ్రాలోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. ఖాదిర్ ప్రదర్శించిన తెగువ, మానవత్వాలను పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు. -
శంకరా... ఏంటి సంగతి?
సౌతాంప్టన్: ఇప్పటికే బొటన వేలి గాయంతో ఓపెనర్ శిఖర్ ధావన్ పూర్తిగా దూరమై, ఫిట్నెస్ సమస్యలతో పేసర్ భువనేశ్వర్ ఇబ్బంది పడుతున్న వేళ... టీమిండియాను కొంత కలవరపరిచే సంఘటన చోటుచేసుకుంది. బుధవారం ప్రాక్టీస్ సందర్భంగా పేసర్ జస్ప్రీత్ బుమ్రా వేసిన యార్కర్‌ను ఎదుర్కొనే క్రమంలో ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ ఎడమ కాలి పాదానికి బంతి బలంగా తగిలింది. దీంతో అతడు నొప్పితో విలవిల్లాడాడు. అనంతరం పరిస్థితిని పర్యవేక్షించిన జట్టు మేనేజ్మెంట్ సాయంత్రానికి శంకర్ కోలుకున్నాడని, ఆందోళన అవసరం లేదని ప్రకటించింది. మరోవైపు గురువారం ప్రాక్టీస్‌లో దినేశ్ కార్తీక్ చాలాసేపు బ్యాటింగ్ సాధన చేశాడు. ఈ తీరు చూస్తుంటే శనివారం అఫ్గానిస్తాన్‌తో మ్యాచ్‌లో అతడు తుది జట్టులో ఉండే అవకాశం కనిపిస్తోంది. శంకర్ మాత్రం బ్యాట్ పట్టలేదు. కాసేపు జాగింగ్ చేశాడు. ఇతర ఆటగాళ్ల ప్రాక్టీస్‌ను గమనిస్తూ ఉండిపోయాడు. గాయం ప్రభావం లేనట్లు సాధారణంగానే నడిచాడు. చివర్లో కొద్దిసేపు బౌలింగ్‌కు దిగినా షార్ట్ రనప్‌తో సరిపెట్టాడు. ప్రస్తుత సమీకరణాల్లో జట్టు కూర్పులో కీలకంగా మారిన శంకర్‌కు టోర్నీ ప్రారంభానికి ముందు సైతం నెట్స్‌లో బంతి మోచేతికి బలంగా తాకింది. దీంతో అతడిని న్యూజిలాండ్‌పై సన్నాహక మ్యాచ్ ఆడించలేదు. ధావన్ దూరమై, రాహుల్ ఓపెనింగ్‌కు వెళ్లిన నేపథ్యంలో పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో చోటుదక్కిన శంకర్ రెండు కీలక వికెట్లు తీశాడు. శుక్రవారం టీమిండియా ప్రాక్టీస్ నుంచి విరామం తీసుకోనుంది. శనివారం అఫ్గానిస్తాన్‌తో మ్యాచ్ ఆడనుంది. భువీ పరిస్థితేమిటో! ప్రపంచకప్‌లో జట్టు రెండో ప్రధాన పేసర్‌గా నమ్మకం ఉంచిన భువనేశ్వర్ మరో 8 రోజుల తర్వాతే మైదానంలో దిగే పరిస్థితి కనిపిస్తోంది. తొడ కండరాలు పట్టేయడంతో పాక్‌తో మ్యాచ్ నుంచి మధ్యలో తప్పుకొన్న భువీ ఇంగ్లండ్‌తో మ్యాచ్ (జూన్ 30) సమయానికి కానీ కోలుకోడని తెలుస్తోంది. ఇప్పటికైతే అతడు ఫిట్నెస్ సాధిస్తాడనే బీసీసీఐ భావిస్తోంది. భువీ... బుధవారం జాగింగ్‌కే పరిమతమయ్యాడు. నెట్స్‌లో బౌలింగ్ చేయలేదు. బ్యాట్స్‌మెన్‌ను గాయపర్చాలని బౌలర్లెవరూ కోరుకోరు. మా ప్రాక్టీస్ మేం చేసుకోవాలి కదా?. నావరకైతే బ్యాట్స్‌మెన్‌కు బంతులేయడమే మంచి సాధన. ఆ దిశగానే ప్రయత్నిస్తుంటా. కొన్నిసార్లు ఇలా జరుగుతుంటుంది. ఇదంతా ఆటలో ఒక భాగమే. నేనేం విజయ్ను లక్ష్యంగా చేసుకోలేదు (నవ్వుతూ). అతడు క్షేమంగానే ఉన్నాడు. ధావన్ జట్టుకు ముఖ్యమైన ఆటగాడు. తను దూరమవడం దురదృష్టకరం. దీనిని మర్చిపోయి ముందుకెళ్లాలి. –జస్ప్రీత్ బుమ్రా, భారత పేసర్ -
హడలెత్తిస్తున్న గ్రామసింహాలు
సాక్షి, ఓజిలి(సుళ్లూరు పేట): మండలంలో గ్రామసింహాల బెడద ఎక్కువుగా ఉంది. వీధుల్లో గుంపులు గుంపులుగా తిరుగుతూ పాదచారులతో పాటు ద్విచక్రవాహనదారులపై దాడులు చేస్తున్నాయి. మండలంలో 3500కుపైగా వీధి కుక్కలు ఉన్నట్లు అధికారుల అంచనా. గత ఐదేళ్లుగా పంచాయతీ అధికారులు వీధి కుక్కలను నిర్మూలించే కార్యక్రమానికి మంగళంపాడడంతో వీటి సంఖ్య గణణీయంగా పెరిగిపోయింది. వీధికుక్కల బెడదతో ఒంటరిగా పిల్లలను బయట పంపాలంటే భయమేస్తోందని తల్లిదండ్రులు వాపోతున్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా కుక్కలు ద్విచక్రవాహన చోదకులను వెంబడిస్తుండడంతో అదుపుతప్పి పడిపోయి గాయాలపాలవుతున్నారు. -
గోపీచంద్‌కు గాయం
కొత్త సినిమా కోసం ఇండియా–పాకిస్తాన్ బోర్డర్లో భారీ యాక్షన్ సీన్స్‌లో పాల్గొంటున్నారు గోపీచంద్. అయితే బైక్ స్టంట్స్ చేస్తున్న సమయంలో గాయపడ్డారు. తమిళ దర్శకుడు తిరు దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా ఓ స్పై థ్రిల్లర్ రూపొందుతోంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. రాజస్తాన్‌లోని జైసల్మార్‌లో 40 రోజుల షెడ్యూల్ ప్లాన్ చేసింది చిత్రబృందం. ఈ షెడ్యూల్లో భాగంగా బైక్ చేజింగ్ సీన్స్ షూట్ చేస్తున్న సమయంలో బైక్ స్కిడ్ అవ్వడంతో గోపీచంద్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ‘‘ఆందోళన చెందాల్సిన అవసరం ఏం లేదు’’ అని డాక్టర్లు పేర్కొన్నారని చిత్రబృందం తెలిపింది. స్వల్ప గాయాలు కావడంతో పెద్దగా విశ్రాంతి తీసుకోకుండానే షూటింగ్లో పాల్గొంటారట. వేసవిలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. -
ఆటో బోల్తా..10 మందికి తీవ్ర గాయాలు
నల్గొండ : చింతపల్లి మండలం పోలేపల్లి రాంనగర్ వద్ద ఆదివారం ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఆటో ప్రయాణిస్తున్న 10 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హుటాహుటిన హైదరాబాద్‌కు తరలించారు. చింతపల్లి నుంచి మాల్ వైపు వస్తోండగా ఈ ప్రమాదం జరిగింది. బాధితులంతా చింతపల్లి మండలం కూరంపల్లికి చెందిన వారిగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కీర్తి సురేశ్‌కు గాయాలు.. అసలేం జరిగింది?
నేను శైలజ ఫేం కీర్తి సురేశ్ షూటింగ్లో గాయపడినట్లు ఓ వార్త హల్చల్ చేస్తోంది. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. మలయాళం సినిమా ‘కుంజిరామంటే కుప్పాయం’ షూటింగ్లో డ్యాన్స్ చేస్తూ ప్రమాదవశాత్తు కిందపడిందని, దీంతో ఆమెకు గాయాలైనట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వార్తకు ఈ వీడియో కూడా బలం చేకూరుస్తోంది. అయితే ఈ వార్తలను కీర్తి సురేశ్ ఖండించారు. ఇక పవన్‌కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న సినిమాలో కీర్తి నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ షూటింగ్ ప్రస్తుతం యూరప్‌లో జరుగుతోందని, గతవారమే చిత్రయూనిట్‌తో కలిసినట్లు ఆమె సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ వీడియోలో కిందపడిన హీరోయిన్ లిండకూమార్ అని కుంజిరామంటే కుప్పాయం చిత్రయూనిట్ ప్రకటించింది. ఇక కీర్తి సురేశ్‌కు 2018 బిగ్ ఇయర్‌గా నిలవనుంది. ఇప్పటికే పవన్‌కళ్యాణ్ చిత్రంతో పాటు, సావిత్రి బయోపిక్ ‘మహానటి’లో నటిస్తోంది. తమిళంలో విక్రమ్ సరసన సామీ2లో లీడ్ రోల్ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. సూర్య సరసన నటించిన ‘థాన సెర్తా కూటం’ సినిమా విడుదల కోసం ఎదురు చూస్తోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుంది. -
కీర్తీ సురేశ్ షూటింగ్లో ప్రమాదం?
-
పోప్ ఫ్రాన్సిస్‌కు గాయాలు
కార్టాజెనా : క్రైస్తవ మత గురువు పోప్ ఫ్రాన్సిస్‌కు గాయాలు అయ్యాయి. తనకోసం ప్రత్యేకంగా సిద్ధం చేసిన ఓపెన్ టాప్ వాహనంలో కొలంబియాలో భారీ జన సమూహం మధ్య పర్యటిస్తున్న ఆయన అనూహ్యంగా పట్టుతప్పి వాహనంలో నిలువుగా ఉన్న ఇనుప కడ్డీకి తాకడంతో స్వల్పంగా గాయాలు అయ్యాయి. కొన్ని రక్తపు బిందువులు కూడా పడ్డాయి. ఈ కారణంగా తలకు చిన్న బొప్పి కట్టడంతో దవడ ఎముక భాగంలో, ఎడమకంటి పక్కన చిన్న గాయాలయ్యాయి. అయితే, దీనికి సంబంధించి వాటికన్ సిటీ ప్రకటన చేస్తూ పోప్‌కు స్వల్పగాయమే అయిందని, కంగారు పడాల్సిన పనిలేదని చెప్పింది. ప్రస్తుతం ఆయనకు ఐస్‌తో ట్రీట్మెంట్ చేశారని, ఆయన పర్యటన కొనసాగుతుందని వెల్లడించింది. తనకు గాయం అవగానే 'నాకు పంచ్ పడింది.. నేను బానే ఉన్నాను' అంటూ పోప్ జోక్ చేశారు. -
పందుల దాడిలో చిన్నారికి గాయాలు
కౌతాళం : కౌతాళానికి చెందిన నరసయ్య, ఎలమ్మ దంపతుల కుమారుడు చరణ్ (3) పందుల దాడిలో గాయపడ్డాడు. గురువారం ఉదయం తల్లిదండ్రులు ఇంటి పనిలో నిమగ్నం కాగా, ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిపై పందులు దాడి చేశాయి. గాయపడిన బాలుడిని స్థానిక పీహెచ్సీలో ప్రాథమిక చేయించి ఆదోనికి తరలించారు. కౌతాళంలో పందుల బెడద అధికంగా ఉందని ఫిర్యాదు చేసినా పంచాయతీ సిబ్బంది, అధికారులు పట్టించుకోవడం లేదని ఆయా కాలనీవాసులు విమర్శిస్తున్నారు. -
వేగంగా వెళ్లి.. నదిలో పడి..
చెన్నై: బైక్ పై వేగంగా వెళ్తున్న ఓ యువకుడు ఫుట్ పాత్ మీద పాదచారులను తప్పించబోయి గోడను ఢీ కొట్టి నదిలో పడ్డాడు. ఆఫీస్ అవసరాలకు కావసిన వస్తువులను తెచ్చేందుకు డీ ఇన్ఫాంటో(20) బైక్ మీద పూనమల్లే రోడ్డులో అతి వేగంతో వెళ్తున్నాడు. అంపా స్కైవే దగ్గరకు చేరుకోగానే అతడి బైకు అదుపు తప్పి.. అటువైపు వెళ్తున్న పాదాచారుల వైపు వెళ్లసాగింది. దాంతో వారికి ప్రమాదం జరగకుండా తప్పించాలన్న ప్రయత్నంలో ఇన్ఫాంటో నదిని అనుకుని ఉన్న గోడను ఢీ కొట్టి 25 మీటర్ల లోతుకు నీళ్లలో పడిపోయాడు. దీంతో అప్రమత్తమైన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చి అతన్ని రక్షించారు. తలకు బలమైన గాయాలు కావడంతో అతనికి ప్రథమ చికిత్స అందించి నగరంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. బాధితుడికి డ్రైవింగ్ లైసెన్స్, బైక్ కు సంబంధించిన అన్ని పేపర్లు ఉన్నాయని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
షూటింగ్లో హీరోయిన్‌కు గాయాలు
బాలీవుడ్, హాలీవుడ్ అవకాశాలతో తీరికలేకుండా గడుపుతున్న హీరోయిన్ ప్రియాంక చోప్రా షూటింగ్లో గాయపడింది. హాలీవుడ్ చిత్రం బేవాచ్ షూటింగ్లో ప్రియాంకకు గాయాలయ్యాయి. అయితే ఆమెకు ప్రమాదం ఏమీలేదని, స్వల్ప గాయాలయినట్టు సమాచారం. చిన్న ఫస్ట్ ఎయిడ్ కిట్‌ను ప్రియాంక ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. పనిచేసేటపుడు తగిలే గాయాలకు మందులు అంటూ కామెంట్ రాసింది. 33 ఏళ్ళ ప్రియాంక బేవాచ్ సినిమాలో విక్టోరియా లీడ్స్ అనే విలన్ పాత్రలో నటిస్తోంది. వచ్చే ఏడాది మే 19న ఈ సినిమా రిలీజ్ కానుంది. బేవాచ్ టీవీ సిరీస్‌లో నటించిన డేవిడ్ హ్యాజెల్హాఫ్, పామెలా ఆండర్సన్లు ఈ సినిమాలో నటిస్తున్నారు. -
నటికి గాయాలు.. షూటింగ్ బ్రేక్
లాస్ ఎంజెల్స్: ప్రముఖ హాలీవుడ్ నటి నైనా దోబ్రేవ్కు గాయాలయ్యాయి. సినిమా షూటింగ్ సెట్లో ఆమె తొడభాగానికి పెద్ద గాయం అయింది. తన జీన్స్ ప్యాంటూ చిరిగి మరీ ఈ గాయం కావడంతో రక్తస్రావం కూడా అయింది. ఆ ఫొటోను కూడా ఆన్ లైన్ లో పెట్టారు. గతంలో భారీ హిట్ సాధించిన త్రిప్లెక్స్ చిత్రానికి కొనసాగింపుగా త్రిప్లెక్స్: ది రిటర్న్ ఆఫ్ క్జాండర్ కేజ్ అనే చిత్రం త్వరలో రానుంది. ఈ చిత్రం ఈ 27 ఏళ్ల అమ్మడు హీరోయిన్ గా నటిస్తోంది. ఇది పూర్తిగా యాక్షన్ చిత్రం కావడంతో ఫైట్లు వంటి రిస్క్ లు కూడా చేయాల్సి ఉంటుంది. విన్ డీసెల్ (38)తో కలిసి నటిస్తున్న నైనా దోబ్రేవ్ షూటింగ్ లో గాయపడిందని చిత్ర యూనిట్ కూడా తెలిపింది. ఈ నేపథ్యంలో ఆమె కోలుకునే వరకు షూటింగ్ కూడా నిలిపివేస్తున్నట్లు తెలిపింది. ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు చెప్పింది. కాగా, ఈ గాయం పెద్దగా పట్టించుకోనని, తనకు యాక్షన్ చిత్రాల్లో నటించడం చాలా ఇష్టమని చెబుతోంది నైనా. -
ఎల్లోరా గుహల్లో ప్రమాదం
ఔరంగాబాద్(మహారాష్ట్ర): ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఎల్లోరా గుహల్లో ప్రమాదం చోటుచేసుకుంది. ఓ పెద్ద బండరాయి దొర్లిపడటంతో ముగ్గురు పర్యాటకులకు గాయాలు అయ్యాయి. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో ఈ గుహలు ఉన్న విషయం తెలిసిందే. వీటిని సందర్శించేందుకు నిత్యం పర్యాటకులు వస్తూనే ఉంటారు. ఈ నేపథ్యంలోనే కైలాస ఆలయానికి కొందరు పర్యాటకులు వచ్చిన సమయంలోనే గుహపైన ఉన్న పెద్ద బండరాయి ఒక్కసారిగా పడటంతో ముగ్గురు పర్యాటకులు గాయపడ్డారు. వీరిలో ఒకరిది రాజస్థాన్ కాగా, మరో ఇద్దరి వివరాలు తెలియాల్సి ఉంది. గాయపడిన వీరిని ఆస్పత్రికి తరలించారు. పెద్దబండరాయి పడటంవల్ల గుహలోని కొన్ని భాగాలు కూడా దెబ్బతిన్నట్లు పురావస్తు శాస్త్ర అధికారులు తెలిపారు. -
ఏపీ భవన్లో తుపాకీ మిస్‌ఫైర్!
న్యూఢిల్లీ : ఢిల్లీ ఏపీభవన్‌లో ప్రమాదవశాత్తూ తుపాకీ మిస్‌ఫైర్ అయిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గోదావరి బ్లాక్‌లోని 404 గదిలో ఈ రోజు ఉదయం 11 గంటలకు ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో తెలంగాణ ఇన్స్పెక్టర్ రవికిరణ్ గాయపడ్డారు. ఆయనను చికిత్స నిమిత్తం రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించారు. ఆయన ఆరోగ్యం బాగానే ఉన్నట్లు తెలుస్తోంది. కాగా రివాల్వర్ బెల్టును నడుముకు పెట్టుకున్న రవికిరణ్...సెల్‌ఫోన్ కిందపడటంతో దాన్ని తీసుకునే ప్రయత్నంలో కిందకు వంగారు. దీంతో ఒత్తిడికి గురై రివాల్వర్ పేలడంతో కాలికి గాయమైంది. గతంలో ఆయన తిరుమలగిరి సీఐగా పనిచేశారు. ప్రస్తుతం రవికిరణ్ సీసీఎస్ లో ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు. మూడు రోజుల క్రితం ఎన్ మిషన్ లో పాల్గొనేందుకు రవికిరణ్ ఢిల్లీ వెళ్లారు.ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
తొమ్మిదిమందిని కరిచేశాయి
కృష్ణా: మరోసారి కుక్కలు స్వైర విహారం చేశాయి. స్థానికులను హడలెత్తించాయి. చందర్లపాడు మండలం విపరింతలపాడు గ్రామంలో కుక్కలు ఇష్టమొచ్చినట్లుగా రెచ్చిపోయాయి. కనిపించివారందరిపై దాడి చేశాయి. మొత్తం తొమ్మిదిమంది వీటివల్ల గాయాల పాలయ్యారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వీరందరినీ ఆస్పత్రికి తరలించి వైద్య సాయం అందిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం, గ్రామ నిర్వహణ కార్యకలాపాల్లో నిర్లక్ష్యం మూలంగా ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు. వెంటనే వాటి బారినుంచి బయటపడే రక్షణ చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. -
చంద్రబాబు సతీమణికి గాయం
-
చంద్రబాబు సతీమణికి గాయం
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి గాయపడ్డారు. సోమవారం ఉదయం ఆమె ఇంట్లో వ్యాయమం చేస్తుండగా ప్రమాదవశాత్తూ కిందపడిపోయినట్లు సమాచారం. చేతి మణికట్టు విరిగినట్లు తెలుస్తోంది. చికిత్స నిమిత్తం భువనేశ్వరిని జూబ్లిహిల్స్ అపోలో ఆస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
డేవిడ్ వార్నర్‌కు గాయం
మెల్బోర్న్: భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టులో రెండో రోజు ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఫీల్డింగ్‌కు దిగలేదు. ఉదయం నెట్స్‌లో ప్రాక్టీస్ సందర్భంగా అతని కుడి చేతికి గాయమైంది. దాంతో వాపు వచ్చినట్లు జట్టు మేనేజ్మెంట్ వెల్లడించింది. అతను రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయగలడా లేదా అనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు. మార్ష్ అవుట్... మరోవైపు తొడ కండరాల గాయంతో మూడో టెస్టుకు దూరమైన ఆల్ రౌండర్ మిషెల్ మార్ష్ సిడ్నీ టెస్టులోనూ ఆడే అవకాశం లేదు. స్కానింగ్ లో అతని గాయం తీవ్రత తెలిసిందని, ఈ సిరీస్‌లో అతను ఆడలేడని జట్టు ఫిజియో చెప్పారు. -
గాయపడ్డ రానా.. చేతి వేళ్లకు గాయాలు
హైదరాబాద్: టాలీవుడ్ యువ హీరో దగ్గుబాటి రానా గాయపడ్డారు. రానా ఓ చేతి నాలుగు వేళ్లకు కాలిన గాయాలయ్యాయి. ఈ విషయాన్ని రానాయే ట్విట్టర్లో తెలియజేశారు. ఫొటోలను కూడా పోస్ట్ చేశారు. కాగా ఈ ప్రమదానికి గల కారణాలను మాత్రం వెల్లడించలేదు. 'దయచేసి ప్రమాద కారణాలను మాత్రం అడగకండి' అంటూ రానా ట్వీట్ చేశారు. ప్రమాద వివరాలను రానా వెల్లడించకున్నా.. బాహుబలి సినిమా షూటింగ్లో గాయపడ్డారని వార్తలు వచ్చాయి. మరికొందరు మాత్రం ఓ బాలీవుడ్ సినిమా షూటింగ్ గాయపడ్డారని చెబుతున్నారు. అసలు విషయం ఏంటన్నది రానాకే తెలియాలి. రానా త్వరగా కోలుకోవాలని కోరుతూ ఆయన అభిమానులు ట్వీట్ చేశారు. -
మద్యం మత్తులో యువతి వీరంగం!
హైదరాబాద్ : మద్యం మత్తులో ఓ యువతి వీరంగం సృష్టించింది. నిర్లక్ష్యంగా కారును నడిపి ఓ యువకుడ్ని ఢీకొట్టింది.హుమాయూన్ నగర్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ రవీందర్ కథనం ప్రకారం... అబిడ్స్ చాపెల్ రోడ్డు ప్రాంతానికి చెందిన యువతి (26) సోమవారం అర్థరాత్రి (ఏపీ 9సీకే 1340) కారుపై మోహదీపట్నం నుంచి మాసబ్ ట్యాంక్ ఫ్లైఓవర్ మీదుగా వెళ్తూ ముందు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న టోలీచౌకికి చెందిన అజార్‌ని ఢీకొట్టింది. తర్వాత ఫ్లైఓవర్ పై ఉన్న డివైడర్‌ను ఢీకొట్టి హల్చల్ చేసింది. నిర్లక్ష్యంగా కారు నడుపుతున్నాఆమెను స్థానికులు ప్రశ్నించగా... అడగటానికి మీరెవరిని తిరగబడింది. అంతలో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీస్‌లు స్వల్పంగా గాయపడ్డ అజార్‌ను ఆస్పత్రికి పంపించారు. అనంతరం యువతిని ట్రాఫిక్ పోలీసులు బ్రీత్ అనలైజర్‌తో పరీక్షించి మోతాదుకు మించి మద్యం తాగివున్నట్లు నిర్థారించారు. ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. యువతి డ్రైవింగ్ లైసెన్స్‌ను రద్దు చేయాలని ఆర్టీఏకు సిఫార్సు చేస్తామన్నారు. కాగా ఇదే యువతి నగరంలో గతంలో కూడా ఇలాగే మద్యం సేవించి వీరంగం సృష్టించినట్లు పోలీసులు తెలిపారు. -
యశ్వంత్ సిన్హా తలకు గాయాలు
పాట్నా: బీజేపీ సీనియర్ నేత, కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా గాయపడ్డారు. జార్ఖండ్‌లోని హజారీ బాగ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న యశ్వంత్ సిన్హా తలకు స్వల్పంగా గాయాలయ్యాయి. శుక్రవారం ఆయన జైల్లో కుర్చీలో కూర్చుని పేపర్ చదువుకుంటున్న సమయంలో కుర్చీ విరగిపోవడంతో ఆయన కింద పడిపోయారు. జైలు సిబ్బంది వెంటనే ఆయనకు చికిత్స చేయించారు. హజారీబాగ్‌లో విద్యుత్ శాఖ అధికారిపై దౌర్జన్యం చేసిన కేసులో స్థానిక కోర్టు యశ్వంత్ సిన్హాను 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపింది. బెయిల్ తీసుకోవడానికి నిరాకరించడంతో సిన్హాతో పాటు మరో 54 మందికి రిమాండ్ విధించారు. విద్యుత్ కొరతకు నిరసనగా సిన్హా ఆధ్వర్యంలో బీజేపీ కార్యకర్తలు సోమవారం హజారీబాగ్‌లోని విద్యుత్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా తన చేతులు కట్టేసి దౌర్జన్యం చేసినట్లు జార్ఖండ్ విద్యుత్ బోర్డు జనరల్ మేనేజర్ ధానేష్‌జా ఫిర్యాదు చేయడంతో సిన్హాతో పాటు మరో 300 మందిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. -
రోడ్డు ప్రమాదంలో శోభానాగిరెడ్డి కన్నుమూత
-
రేపు శోభా నాగిరెడ్డి అంత్యక్రియలు
-
శోభ.. నా అక్కలాంటిది: వైఎస్ జగన్
-
శోభా నాగిరెడ్డి కోసం అభిమానులు తీవ్ర ఆవేదన
-
శోభా ఆరోగ్య పరిస్ధితి పై హెల్త్‌బులిటెన్ విడుదల
-
శోభానాగిరెడ్డి కోలుకోవాలని అభిమానుల పూజలు
-
'రోడ్డు మీద ఆరబోసిన ధాన్యం వల్లే ప్రమాదం'
-
కాసేపట్లో శోభానాగిరెడ్డి పరిస్థితిపై హెల్త్ బులెటిన్
-
ఫోన్లో వైద్యులను సంప్రదించిన వైఎస్ జగన్
కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వైఎస్ఆర్సీపీ నాయకురాలు శోభా నాగిరెడ్డి ఆరోగ్య పరిస్థితిపై పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఎప్పటికప్పుడు ఆమె ఆరోగ్యం గురించి డాక్టర్ సోమరాజుతో పాటు ఇతర వైద్య ప్రముఖులతో స్వయంగా ఫోన్లో మాట్లాడి తెలుసుకుంటున్నారు. ఆమె కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడి వారికి ధైర్యం చెబుతున్నారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ రాజమండ్రి నుంచి విమానంలో హైదరాబాద్ బయల్దేరారు. శోభా నాగిరెడ్డి తీవ్రంగా గాయపడిన విషయం తెలిసి వైఎస్ భారతి తక్షణం కడప నుంచి హైదరాబాద్‌కు బయల్దేరారు. బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శోభా నాగిరెడ్డిని పరామర్శించేందుకు పలువురు పార్టీ నాయకులు, ఇతర పార్టీలకు చెందిన నాయకులు కూడా ఆస్పత్రి వద్దకు భారీ సంఖ్యలో చేరుకుంటున్నారు. ఎంవీ మైసూరారెడ్డి, నన్నపనేని రాజకుమారి తదితరులు ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. -
కేర్ లో శోభానాగిరెడ్డికి చికిత్స
-
సోమరాజు ఆధ్వర్యంలో శోభానాగిరెడ్డికి చికిత్స
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వైఎస్ఆర్సీపీ నాయకురాలు, ఆళ్లగడ్డ అసెంబ్లీ అభ్యర్థి శోభానాగిరెడ్డిని కాపాడేందుకు కేర్ ఆస్ప్రత్రి ఛైర్మన్ డాక్టర్ సోమరాజు పర్యవేక్షణలో మూడు బృందాలు పనిచేస్తున్నాయి. ఆర్థో, న్యూరో, క్రిటికల్ కేర్ బృందాలు ఆమెకు చికిత్స చేస్తున్నాయి. ప్రస్తుతం సీటీ స్కాన్ తీశారు. పూర్తి స్థాయిలో పరీక్షలు చేసిన తర్వాతే ఏ చికిత్స అందిస్తారో తెలుస్తుంది. పరీక్షలన్నీ పూర్తయ్యి, చికిత్స ప్రారంభం అయిన తర్వాత మాత్రమే తాము మీడియాకు అప్డేట్ ఇవ్వగలమని వైద్యులు చెప్పారు. మొత్తం చికిత్స అంతా కేర్ ఆస్పత్రి చైర్మన్ డాక్టర్ సోమరాజు పర్యవేక్షణలోనే జరుగుతోంది. అయితే 48 గంటల పాటు పూర్తిగా పరిశీలించిన తర్వాత మాత్రమే ఏ విషయమైనా చెప్పగలమని వైద్యులు అంటున్నారు. ఆమె మెడకు తీవ్ర గాయం అయ్యిందని, కంటి పైభాగంలో కూడా గాయం అయ్యిందని చెబుతున్నారు. వాహనం బాగా వేగంగా ప్రయాణిస్తున్నప్పుడు ప్రమాదం జరిగి, వాహనం అద్దాలు పగిలి శోభానాగిరెడ్డి రోడ్డుపై పడటంతో బలమైన గాయాలైనట్లు ప్రత్యక్ష సాక్షులు అంటున్నారు. ఆమెకు తగిలిన గాయాల కారణంగా.. క్రిటికల్ కేర్ వైద్యులు ప్రధానంగా ఆమెను కంటికి రెప్పలా కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆర్థో టీంలో ముగ్గురు, న్యూరో టీంలో ముగ్గురు నలుగురితో పాటు క్రిటికల్ కేర్ విభాగంలోని ఓ పెద్ద బృందం ఆమకు చికిత్స అందిస్తోంది. దాదాపు మరో గంట సమయంలో హెల్త్ బులెటిన్ విడుదల అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎలా ఉందో మాత్రం తాము చెప్పలేమని వైద్యులు అంటున్నారు. అయితే ఆమెకు ఇంటర్నల్ బ్లీడింగ్ (అంతర్గత రక్తస్రావం) జరుగుతోందని మాత్రం తెలిసింది. -
పరిస్థితి ఇంకా విషమమే: వైద్యవర్గాలు
కర్నూలు జిల్లాలో జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వైఎస్ఆర్సీపీ నాయకురాలు, ఆళ్లగడ్డ అభ్యర్థి శోభానాగిరెడ్డి పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని వైద్యవర్గాలు చెబుతున్నాయి. ఆమెకు ముక్కు, చెవుల్లోంచి కూడా రక్తం వచ్చినట్లు కర్నూలు జిల్లాలో వైద్యులు ప్రాథమికంగా తెలిపారు. అందువల్ల బహుశ మెదడులో ఏమైనా గాయాలు ఉన్నాయేమోనని ఆందోళన చెందుతున్నారు. ఆమె శ్వాస తీసుకోడానికి తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని, అందువల్ల ప్రస్తుతానికి వెంటిలేటర్ ద్వారా శ్వాస అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం కేర్ ఆస్పత్రిలోని ఆర్థో, న్యూరో ఫిజిషియన్, జనరల్ ఫిజిషియన్ ముగ్గురూ కలిసి శోభా నాగిరెడ్డిని పరీక్షించి ఆమెకు చికిత్స అందిస్తున్నారు. శోభా నాగిరెడ్డితో పాటు ఆమె భర్త భూమా నాగిరెడ్డి కూడా హైదరాబాద్‌కు వచ్చారు. ఆమె చికిత్స పొందుతున్న కేర్ ఆస్పత్రి వద్దకు భారీ సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు చేరుకుంటున్నారు. పలు మీడియా ఛానళ్లకు చెందిన ప్రతినిధులు కూడా ఆస్పత్రి వద్దకు ఉదయమే చేరుకున్నారు. -
పరిస్థితి ఇంకా విషమమే: వైద్యవర్గాలు
-
శోభానాగిరెడ్డికి తీవ్రగాయాలు.. హైదరాబాద్ కు తరలింపు
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ సమీపంలో రోడ్డు ప్రమాదం నంద్యాలలో ప్రాథమిక చికిత్స.. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలింపు సాక్షి, ఆళ్లగడ్డ (కర్నూలు జిల్లా): వైఎస్సార్సీపీ ఆళ్లగడ్డ అసెంబ్లీ అభ్యర్థి భూమా శోభా నాగిరెడ్డి బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. శోభా నాగిరెడ్డి బుధవారం వైఎస్ షర్మిలతో పాటు నంద్యాలలో జరిగిన వైఎస్సార్ జనభేరి సభల్లో పాల్గొన్న అనంతరం ఆళ్లగడ్డలోని తమ నివాసానికి తిరిగి వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. కాసేపట్లో ఇంటికి చేరుకోవాల్సి ఉండగా ప్రమాదం సంభవించింది. రాత్రి 11 గంటల ప్రాంతంలో ఆళ్లగడ్డ మండలం గూబగుండం మిట్ట వద్ద రోడ్డుపై ఉన్న ధాన్యం కుప్పల్ని తప్పించేందుకు సడెన్ బ్రేక్ వేయడంతో ఆమె ప్రయాణిస్తున్న వాహనం బోల్తా పడి నాలుగు పల్టీలు కొట్టింది. డోర్ ఓపెన్ కావడంతో ముందు సీట్లో కూర్చున్న శోభా నాగిరెడ్డి వాహనం నుంచి ఎగిరి మళ్లీ వాహనంపై పడ్డారు. దీంతో ఆమె తలకు, పక్కటెముకలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను హుటాహుటిన నంద్యాలలోని సురక్ష ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స చేయించారు. అయితే, ఆమెకు వెంటిలేటర్ ద్వారా చికిత్స అందించాలని, అందుకు తప్పనిసరిగా హైదరాబాద్ తరలించాల్సిందేనని అక్కడి వైద్య వర్గాలు తెలిపాయి. దాంతో ఆమెను బంజారా హిల్స్ లోని కేర్ ఆస్పత్రికి తరలించారు. ప్రమాద వార్త తెలియగానే వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నంద్యాల ఆస్పత్రికి చేరుకున్నారు. ప్రమాదంలో ఆమెతోపాటు కారు డ్రైవర్ నాగేంద్ర, గన్‌మెన్ శ్రీనివాస్, బాషాలకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. శోభానాగిరెడ్డికి పక్కటెముకలు విరిగాయని వైద్యులు తెలిపారు. శ్వాస తీసుకోవడానికి ఆమె తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. వెంటిలేటర్ ద్వారా ఆమెకు శ్వాస అందిస్తున్నట్టు వైద్యులు తెలిపారు. ఆమె తలకు బలమైన గాయాలయ్యాయని చెప్పారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సలహా మేరకు మెరుగైన వైద్యం కోసం శోభా నాగిరెడ్డిని హైదరాబాద్ తరలించారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స అందిస్తున్నారు. -
శోభానాగిరెడ్డి తలకు తీవ్రగాయాలు
-
శోభానాగిరెడ్డిని హైదరాబాద్ కు తరలింపు
-
YSRCP నేత శోభానాగిరెడ్డికి తీవ్రగాయాలు..