గాయపడ్డ రానా.. చేతి వేళ్లకు గాయాలు | Daggubati Rana injured | Sakshi
Sakshi News home page

గాయపడ్డ రానా.. చేతి వేళ్లకు గాయాలు

Published Tue, Dec 9 2014 6:50 PM | Last Updated on Sun, Aug 11 2019 12:52 PM

గాయపడ్డ రానా.. చేతి వేళ్లకు గాయాలు - Sakshi

గాయపడ్డ రానా.. చేతి వేళ్లకు గాయాలు

హైదరాబాద్: టాలీవుడ్ యువ హీరో దగ్గుబాటి రానా గాయపడ్డారు. రానా ఓ చేతి నాలుగు వేళ్లకు కాలిన గాయాలయ్యాయి. ఈ విషయాన్ని రానాయే ట్విట్టర్లో తెలియజేశారు. ఫొటోలను కూడా పోస్ట్ చేశారు. కాగా ఈ ప్రమదానికి గల కారణాలను మాత్రం వెల్లడించలేదు. 'దయచేసి ప్రమాద కారణాలను మాత్రం అడగకండి' అంటూ రానా ట్వీట్ చేశారు.

ప్రమాద వివరాలను రానా వెల్లడించకున్నా.. బాహుబలి సినిమా షూటింగ్లో గాయపడ్డారని వార్తలు వచ్చాయి. మరికొందరు మాత్రం ఓ బాలీవుడ్ సినిమా షూటింగ్ గాయపడ్డారని చెబుతున్నారు. అసలు విషయం ఏంటన్నది రానాకే తెలియాలి. రానా త్వరగా కోలుకోవాలని కోరుతూ ఆయన అభిమానులు ట్వీట్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement