నటికి గాయాలు.. షూటింగ్ బ్రేక్
లాస్ ఎంజెల్స్: ప్రముఖ హాలీవుడ్ నటి నైనా దోబ్రేవ్కు గాయాలయ్యాయి. సినిమా షూటింగ్ సెట్లో ఆమె తొడభాగానికి పెద్ద గాయం అయింది. తన జీన్స్ ప్యాంటూ చిరిగి మరీ ఈ గాయం కావడంతో రక్తస్రావం కూడా అయింది. ఆ ఫొటోను కూడా ఆన్ లైన్ లో పెట్టారు. గతంలో భారీ హిట్ సాధించిన త్రిప్లెక్స్ చిత్రానికి కొనసాగింపుగా త్రిప్లెక్స్: ది రిటర్న్ ఆఫ్ క్జాండర్ కేజ్ అనే చిత్రం త్వరలో రానుంది.
ఈ చిత్రం ఈ 27 ఏళ్ల అమ్మడు హీరోయిన్ గా నటిస్తోంది. ఇది పూర్తిగా యాక్షన్ చిత్రం కావడంతో ఫైట్లు వంటి రిస్క్ లు కూడా చేయాల్సి ఉంటుంది. విన్ డీసెల్ (38)తో కలిసి నటిస్తున్న నైనా దోబ్రేవ్ షూటింగ్ లో గాయపడిందని చిత్ర యూనిట్ కూడా తెలిపింది. ఈ నేపథ్యంలో ఆమె కోలుకునే వరకు షూటింగ్ కూడా నిలిపివేస్తున్నట్లు తెలిపింది. ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు చెప్పింది. కాగా, ఈ గాయం పెద్దగా పట్టించుకోనని, తనకు యాక్షన్ చిత్రాల్లో నటించడం చాలా ఇష్టమని చెబుతోంది నైనా.