Nina Dobrev
-
మాజీ లవర్ పై ఇష్టమా.. ద్వేషమా?
లాస్ ఏంజెలిస్: బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్ అయిన తర్వాత ఇంకా అతడి గురించే ఆలోచిస్తూ హాలీవుడ్ నటి తెగ బెంగ పెట్టుకుంది. నీనా డొబ్రెవ్, ఆస్టిన్ స్టోవెల్ లు ఏడు నెలలపాటు ప్రేమాయణంతో పాటు డేటింట్ చేశారు. అయితే ఈ ఏడాది ఆరంభంలో వారిమధ్య మనస్పర్థలు వచ్చిన కారణంగా ఇద్దరూ విడిపోయారు. ఎవరి దారి వారు చూసుకున్నారు. తన మాజీ బాయ్ ఫ్రెండ్ ఆస్టిన్ స్టోవెల్, అమేజింగ్ స్పైడర్ మ్యాన్ ఫేమ్ ఎమ్మా స్టోన్ చెట్టాపట్టా లేసుకుని తిరుగుతున్నారు. ఈ విషయం ఆనోటా ఈనోటా పాకి నీనా చెవిన పడింది. ఇక అంతే వారి డేటింగ్ పై వస్తున్న రూమర్లకు కాస్త అప్ సెట్ అయిందట. 'హూ ఈజ్ డేటింగ్ హూ' అనే ఈవెంట్లో భాగంగా ఆస్టిన్ స్టోవెల్, ఎమ్మా స్టోన్ డేటింగ్ చేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. వారిద్దరిని సంప్రదించగా ఈ వార్తను వారు ఖండించలేదు. మాజీ బాయ్ ఫ్రెండ్ రాసలీలలు జరుపుతున్నాడని కన్ఫామ్ అయిన తర్వాత నీనా డొబ్రెవ్ మనసు మళ్లీ ముక్కలయిందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ఆమె ఇంకా అతడ్ని ఇష్టపడుతుందా.. లేక అప్పుడే తనను మరిచిపోయాడని కోప్పడుతుందా అర్థం కావడం లేదు. ప్రస్తుతం ఆమె చిత్రం 'ట్రిపుల్ ఎక్స్: ద రిటర్న్ ఆఫ్ జాండర్ కేగ్' షూటింగ్ ముగిసింది. ఈ మూవీలో బాలీవుడ్ ముద్దుగుమ్మ దీపికా పదుకొనే నటించింది. -
అయ్యోపాపం! దీపిక ఓ శాడ్ సెల్ఫీ!!
సినిమా షూటింగ్ కూడా సినీ తారలకు ఓ ప్రయాణంలాంటిదే. షూటింగ్ సాగినంతకాలం చాలావరకు చిత్రయూనిట్ అంతా కుటుంబసభ్యుల్లా ఆత్మీయంగా ఆప్యాయతలు కలబోసుకుంటారు. అలాంటి స్నేహపూర్వక చిత్రయూనిట్ షూటింగ్ ముగిసి.. ఎవరింటికి వారు వెళుతున్నారంటే.. కొంచెం బాధే కదా! అలాంటి బాధలోనే దీపికా పదుకొణే ఇప్పుడు మునిగిపోయింది. ఆమె ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న హాలీవుడ్ చిత్రం 'ట్రిపుల్ ఎక్స్: ద రిటర్న్ ఆఫ్ జాండర్ కేగ్' షూటింగ్ తాజాగా ముగిసింది. ఈ విషయాన్ని చిత్రంలో సహ నటీమణులైన దీపికా పదుకొణే, నీనా డొబ్రెస్ తాజాగా సోషల్ మీడియాలో వెల్లడించారు. షూటింగ్ చివరి రోజున విడిపోతున్నామన్న బాధతో ఈ ఇద్దరు కలిసి ఓ విషాద సెల్ఫీ దిగారు. తెగ బాధపడిపోతూ.. కళావిహీనమైన ముఖాలతో, బాధాతప్త భావోద్వేగాలతో ఈ సెల్ఫీలో కనిపిస్తున్న ఈ ఇద్దరిని చూసి.. అభిమానులూ తెగ ఇదయిపోతున్నారు. 2002 నాటి హాలీవుడ్ యాక్షన్ చిత్రం 'ట్రిపుల్ ఎక్స్'కు సీక్వెల్‌గా ఈ చిత్రం వస్తోంది. ఈ ప్రతిష్టాత్మక హాలీవుడ్ ప్రాజెక్టులో విన్ డీజిల్ సరసన దీపికా పదుకొణే, నినా డొబ్రెవ్ నటిస్తున్నారు. దీపికతో తీసుకున్న 'శాడ్ సెల్ఫీ' గురించి నీనా తన ఇన్స్టాగ్రామ్ పేజీలో రాస్తూ.. 'చివరిరోజు వచ్చేసింది. అద్భుతమైన సాహస ప్రయాణం ముగియడం బాధ కలిగిస్తోంది. నా కొత్త కుటుంబమైన ట్రిపుల్ ఎక్స్‌ను విడటం బాధ కలిగిస్తోంది. ఎంతో అకుంఠిత దీక్ష, పని పట్ల నిబద్ధత ఉన్న వ్యక్తులందరినీ మిస్ అవుతున్నాను. చిత్రయూనిట్లో ఎంతో అందమైన మనస్సున్న వ్యకులున్నారు. వారి కృషిని ఎంత అభినందించినా తక్కువే. ఎంతో కష్టమైన ఈ షెడ్యూల్‌ను పూర్తిచేసినందుకు వారాంత ఇక సేదదీరొచ్చు. ఇక విశాంత్రి కావాల్సినంత తీసుకోవచ్చు' అని పేర్కొంది. -
నటికి గాయాలు.. షూటింగ్ బ్రేక్
లాస్ ఎంజెల్స్: ప్రముఖ హాలీవుడ్ నటి నైనా దోబ్రేవ్కు గాయాలయ్యాయి. సినిమా షూటింగ్ సెట్లో ఆమె తొడభాగానికి పెద్ద గాయం అయింది. తన జీన్స్ ప్యాంటూ చిరిగి మరీ ఈ గాయం కావడంతో రక్తస్రావం కూడా అయింది. ఆ ఫొటోను కూడా ఆన్ లైన్ లో పెట్టారు. గతంలో భారీ హిట్ సాధించిన త్రిప్లెక్స్ చిత్రానికి కొనసాగింపుగా త్రిప్లెక్స్: ది రిటర్న్ ఆఫ్ క్జాండర్ కేజ్ అనే చిత్రం త్వరలో రానుంది. ఈ చిత్రం ఈ 27 ఏళ్ల అమ్మడు హీరోయిన్ గా నటిస్తోంది. ఇది పూర్తిగా యాక్షన్ చిత్రం కావడంతో ఫైట్లు వంటి రిస్క్ లు కూడా చేయాల్సి ఉంటుంది. విన్ డీసెల్ (38)తో కలిసి నటిస్తున్న నైనా దోబ్రేవ్ షూటింగ్ లో గాయపడిందని చిత్ర యూనిట్ కూడా తెలిపింది. ఈ నేపథ్యంలో ఆమె కోలుకునే వరకు షూటింగ్ కూడా నిలిపివేస్తున్నట్లు తెలిపింది. ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు చెప్పింది. కాగా, ఈ గాయం పెద్దగా పట్టించుకోనని, తనకు యాక్షన్ చిత్రాల్లో నటించడం చాలా ఇష్టమని చెబుతోంది నైనా.