మాజీ లవర్ పై ఇష్టమా.. ద్వేషమా?
లాస్ ఏంజెలిస్: బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్ అయిన తర్వాత ఇంకా అతడి గురించే ఆలోచిస్తూ హాలీవుడ్ నటి తెగ బెంగ పెట్టుకుంది. నీనా డొబ్రెవ్, ఆస్టిన్ స్టోవెల్ లు ఏడు నెలలపాటు ప్రేమాయణంతో పాటు డేటింట్ చేశారు. అయితే ఈ ఏడాది ఆరంభంలో వారిమధ్య మనస్పర్థలు వచ్చిన కారణంగా ఇద్దరూ విడిపోయారు. ఎవరి దారి వారు చూసుకున్నారు. తన మాజీ బాయ్ ఫ్రెండ్ ఆస్టిన్ స్టోవెల్, అమేజింగ్ స్పైడర్ మ్యాన్ ఫేమ్ ఎమ్మా స్టోన్ చెట్టాపట్టా లేసుకుని తిరుగుతున్నారు. ఈ విషయం ఆనోటా ఈనోటా పాకి నీనా చెవిన పడింది. ఇక అంతే వారి డేటింగ్ పై వస్తున్న రూమర్లకు కాస్త అప్ సెట్ అయిందట.
'హూ ఈజ్ డేటింగ్ హూ' అనే ఈవెంట్లో భాగంగా ఆస్టిన్ స్టోవెల్, ఎమ్మా స్టోన్ డేటింగ్ చేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. వారిద్దరిని సంప్రదించగా ఈ వార్తను వారు ఖండించలేదు. మాజీ బాయ్ ఫ్రెండ్ రాసలీలలు జరుపుతున్నాడని కన్ఫామ్ అయిన తర్వాత నీనా డొబ్రెవ్ మనసు మళ్లీ ముక్కలయిందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ఆమె ఇంకా అతడ్ని ఇష్టపడుతుందా.. లేక అప్పుడే తనను మరిచిపోయాడని కోప్పడుతుందా అర్థం కావడం లేదు. ప్రస్తుతం ఆమె చిత్రం 'ట్రిపుల్ ఎక్స్: ద రిటర్న్ ఆఫ్ జాండర్ కేగ్' షూటింగ్ ముగిసింది. ఈ మూవీలో బాలీవుడ్ ముద్దుగుమ్మ దీపికా పదుకొనే నటించింది.