Emma Stone
-
భర్త డైరెక్షన్లో ఎమ్మా మరో సినిమా.. మళ్లీ ఆస్కార్ వచ్చేనా?
హాలీవుడ్‌కి చెందిన క్రేజీ కపుల్స్‌లో డేవ్ మెక్ క్యారీ, ఎమ్మా స్టోన్ జోడీ ఒకటి. దర్శక–రచయిత, హాస్య నటుడు డేవ్, నటి ఎమ్మా 2016లో ప్రేమలో పడి, 2020లో పెళ్లి చేసుకున్నారు. 2021లో వీరికో పాప పుట్టింది. వ్యక్తిగత జీవితం జోష్‌గా ఉన్న నేపథ్యంలో గత నెల 10న జరిగిన ఆస్కార్ అవార్డు వేడుకలో ‘పూర్ థింగ్స్’ చిత్రానికి గాను ఎమ్మా స్టోన్ ఉత్తమ నటి అవార్డు అందుకున్నారు. 2016లో ఉత్తమ నటిగా ‘లా లా ల్యాండ్’ చిత్రానికి ఆస్కార్ అందుకున్న ఎమ్మాకి ‘పూర్ థింగ్స్’తో మరో అవార్డు దక్కింది. ఈ చిత్రానికి డేవ్, ఎమ్మా కూడా నిర్మాతలు. రెండోసారి ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు అందుకున్న ఆనందంలో ఉన్న ఎమ్మా స్టోన్‌కి మరో మంచి సినిమా ఇవ్వాలని డేవ్ మేక్ క్యారీ ప్లాన్ చేస్తున్నారట. ఈ చిత్రానికి తానే దర్శకత్వం వహించాలని కూడా అనుకుంటున్నారట. దర్శకుడిగా డేవ్‌కి ‘బ్రిగ్స్బీ బియర్’ (2017) తొలి చిత్రం. ఆ తర్వాత మరో సినిమాకి మెగాఫోన్ పట్టలేదు. ఇప్పుడు భార్య కోసం మళ్లీ డైరెక్టర్‌గా స్టార్ట్, కెమెరా, యాక్షన్ చెప్పడానికి రెడీ అయ్యారు డేవ్. -
లాక్డౌన్లో వెడ్ లాక్
‘క్రేజీ స్టుపిడ్ లవ్, అమేజింగ్ స్పెడర్ మేన్, లా లా ల్యాండ్’ వంటి చిత్రాలతో పాపులారిటీ సంపాదించిన హాలీవుడ్ నటి ఎమ్మా స్టోన్. మూడేళ్లుగా నటుడు, రచయిత డేవ్ మెక్యారీ, ఎమ్మా డేటింగ్ చేస్తున్నారు. గత ఏడాది డిసెంబర్లో నిశ్చితార్థం జరిగింది. ఈ ఏడాది ఘనంగా పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ లాక్డౌన్ వల్ల గుట్టుచప్పుడు కాకుండా వివాహం చేసుకున్నారనే వార్త ఈ మధ్య ప్రచారంలోకొచ్చింది. దానికి కారణం ఈ జంట మ్యాచింగ్ రింగులు ధరించి కనిపించడమే. ప్రచారంలోకొచ్చిన వార్త నిజమే. ఈ ఇద్దరూ లాక్డౌన్లో వెడ్లాక్లోకి ఎంటరయ్యారు. -
నేలపై నిద్రపోతున్న హీరోయిన్
హాలీవుడ్ సూపర్ నటి ఎమ్మా స్టోన్ నేలపై నిద్రపోతున్నారట. రెండేళ్ల క్రితం ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం తీసుకున్న నటిగా గుర్తింపు పొందిన ఈ హీరోయిన్‌కు ఎందుకు ఇంత కష్టం వచ్చిందంటే... అక్కడికే వస్తున్నాం. ఇటీవల ఆమె భుజానికి పెద్ద దెబ్బ తగిలిందని హాలీవుడ్ టాక్. దీంతో డాక్టర్ ఆమెకు దాదాపు రెండు నెలలు రెస్ట్ తీసుకోమని చెప్పారట. అలాగే నేలపై నిద్రపొమ్మని చెప్పారట. స్టార్ నటిగా ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్న ఎమ్మాకు ఎంత కష్టం వచ్చిందని ఆమె ఫ్యాన్స్ బాధపడిపోతున్నారు. ప్రస్తుతం ‘క్రూయెల్లా’ అనే హాలీవుడ్ మూవీ కమిట్ అయ్యారు ఎమ్మా. అయితే ఇంకా ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్‌లో ఉండటంతో ఎమ్మా గాయం ఈ సినిమాపై పడే ప్రభావం లేదంటున్నారు ఆమె సన్నిహితులు. ఇంతకీ ఎమ్మా భుజానికి ఎలా గాయం అయిందీ అంటే.. కొందరేమో షూటింగ్ లొకేషన్లో అని, కొందరేమో ఇంట్లో జారిపడ్డారని అంటున్నారు. -
ప్చ్... దీపికకు ఈసారి చుక్కెదురు
లాస్ ఏంజెల్స్ : ప్రముఖ అంతర్జాతీయ మాగ్జైన్ ఫోర్బ్స్ 2017 ఏడాదికి గానూ అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ల జాబితాను రిలీజ్ చేసింది. ఆస్కార్ బరిలో దుమ్ము దులిపిన చిత్రం లా లా లాండ్ సుందరి ఎమ్మా స్టోన్ ఈ లిస్ట్ లో ఫస్ట్ ప్లేస్ లో నిలవగా, భారత్ నుంచి ఎవరికీ చోటుదక్కలేదు. ఎమ్మా 26 మిలియన్ డాలర్ల పారితోషకంతో మొదటి స్థానంలో నిలిచిందని, పైగా ఈ జూన్ నాటికే అత్యధిక టాక్స్ కూడా చెల్లించేసిందని ఫోర్బ్స్ పేర్కొంది. రెండో స్థానంలో 48 ఏళ్ల నటి జెన్నిఫర్ అనిస్టోన్(25 మిలియన్ డాలర్లు) నిలిచింది. 2015, 16 సంవత్సరాలకుగానూ టాప్ పొజిషన్ లో నిలిచిన జెన్నీఫర్ లారెన్స్ ఈ యేడాది 24 మిలియన్ డాలర్ల రెమ్యునరేషన్ కారణంగా మూడోస్థానం సరిపెట్టుకుంది. గతేడాది ఆమె ఆదాయం 46 మిలియన్ల డార్లు కాగా, పాసింజర్స్ మూవీ డిజాస్టర్‌గా నిలవటంతో ఆదాయం సగానికి పైగా పడిపోయింది. ఇంకా ఈ లిస్ట్ లో ఎమ్మా వాట్సన్, కేట్ బ్లెంచెట్, జూలియా రాబర్ట్స్ వంటి వాళ్లు టాప్ 10 లో చోటు సంపాదించుకున్నారు. ఇక గతేడాది ఈ జాబితాలో అనూహ్యంగా స్థానం సంపాదించుకున్న బాలీవుడ్ నటి దీపికా పదుకొనేకు ఈసారి చుక్కెదురైంది. గతేడాది 10 మిలియన్ల డాలర్లతో పీకూ 10వ స్థానం దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే అదంతా పీకూ కేవలం ఎండోర్స్ మెంట్ లతోనే వెనకేయటం విశేషం. -
అట్టహాసంగా గోల్డెన్ గ్లోబ్ అవార్డులు
-
ఎమ్మా.. ఏం మాయ చేశావే!
లాస్ఏంజిల్స్: ప్రతిష్ఠాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో అమెరికన్ నటి ఎమ్మా స్టోన్ దుమ్మురేపింది. రొమాంటిక్ కామెడీగా తెరకెక్కిన ‘లా లా ల్యాండ్’ సినిమాలో అద్భుత నటనకుగానూ ఎమ్మా ఈ ఏటి ఉత్తమ నటి అవార్డును దక్కించుకుంది. అదే సినిమాలో కథానాయకుడిగా నటించిన ర్యాన్ గోస్లింగ్ ఉత్తమ నటుడి అవార్డును సొంతం చేసుకున్నాడు. 74వ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ప్రదానోత్సవం ఆదివారం రాత్రి లాస్ఏంజిల్స్లో అట్టహాసంగా జరిగింది. భారతీయ నటి ప్రియాంక చోప్రా సహా పలు సినీ, టీవీ స్టార్లు ఫంక్షన్లో సందడి చేశారు. బెర్రీ జెన్కిన్స్ దర్శకత్వం వహించిన ‘మూన్లైట్’కు ఉత్తమ చిత్రం అవార్డు దక్కగా, మ్యూజికల్/కామెడీ విభాగంలో ‘లా లా ల్యాండ్’ బెస్ట్ ఫిలంగా నిలిచింది. 2016కుగానూ అత్యధిక నామినేషన్లు సాధించిన ‘లా లా ల్యాండ్’సినిమాకే ఏడు అవార్డులు దక్కడం విశేషం. 74వ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల వివరాలిలా ఉన్నాయి.. అట్టహాసంగా గోల్డెన్ గ్లోబ్ అవార్డు [ ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి ] ఉత్తమ సినిమా- డ్రామా: మూన్లైట్ ఉత్తమ సినిమా- మ్యూజికల్/కామెడీ: లా లా ల్యాండ్ ఉత్తమ దర్శకుడు: డామియెన్ ఛాజెల్ ఉత్తమ నటి- మ్యూజికల్/కామెడీ: ఎమ్మా స్టోన్ ఉత్తమ నటుడు- మ్యూజికల్/కామెడీ: ర్యాన్ గోస్లింగ్ ఉత్తమ నటి -డ్రామా: ఇసబెల్లా హుపెర్ట్(‘ఎలీ’ సినిమాకు) ఉత్తమ నటుడు- డ్రామా: కేసీ ఆఫ్లెక్ (‘మాంచెస్టర్ బై ద సీ’ సినిమాకు) ఉత్తమ సహాయ నటి: వియోలా డావిస్(‘ఫెన్సెస్’ సినిమాకు) ఉత్తమ సహాయ నటుడు: ఆరోన్ టేలర్(‘నాక్టర్నల్ యానిమల్స్’ సినిమాకు) బెస్ట్ స్క్రీన్‌ప్లే: డామియెన్ ఛాజెల్ (లా లా ల్యాండ) బెస్ట్ ఒరిజినల్ స్కోర్: జస్టిన్ హార్విట్జ్(లా లా ల్యాండ్) బెస్ట్ ఒరిజినల్ సాంగ్: సిటీ ఆఫ్ స్టార్స్(జస్టిన్ హార్విట్జ్- లా లా ల్యాండ్) బెస్ట్ ఆనిమేషన్ ఫిల్మ్: జూటోపియా ఉత్తమ విదేశీ చిత్రం: ఎలీ- ఫ్రాన్స్ బెస్ట్ టీవీ సిరీస్- డ్రామా: ది క్రౌన్ బెస్ట్ టీవీ సిరీస్- మ్యూజికల్/కామెడీ: అట్లాంటా బెస్ట్ టెలివిజన్ లిమిటెడ్ సిరీస్: ది పీపుల్స్ వర్సెస్ ఓ.జె. సిప్సన్(అమెరికన్ క్రైమ్ స్టోరీ) ఉత్తమ టీవీ నటి- డ్రామా: క్లెయిర్ ఫోయ్(ది క్రౌన్) ఉత్తమ టీవీ నటుడు- డ్రామా: బిల్లీ బాబ్(గొలియాత్) ఉత్తమ టీవీ నటి- మ్యూజికల్/కామెడీ: ట్రెసి ఎలిస్ రోజ్(బ్లాకిష్) ఉత్తమ టీవీ నటుడు- మ్యూజికల్/కామెడీ: డోనాల్డ్ గ్లోవర్(అట్లాంటా) ఉత్తమ టీవీ నటుడు(లిమిటెడ్ సిరీస్ విభాగం): టామ్ హిడెల్‌స్టన్(ది నైట్ మేనేజర్) ఉత్తమ సహాయ నటి (లిమిటెడ్ సిరీస్ విభాగం): ఒలీవియా కోల్మన్ (ది నైట్ మేనేజర్) ఉత్తమ సహాయ నటుడు(లిమిటెడ్ సిరీస్ విభాగం): హాగ్ లూరీ (ది నైట్ మేనేజర్) నటి మేర్లీ స్ట్రీప్‌కు సిసిల్ బి డెమిలీ అవార్డు -
మాజీ లవర్ పై ఇష్టమా.. ద్వేషమా?
లాస్ ఏంజెలిస్: బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్ అయిన తర్వాత ఇంకా అతడి గురించే ఆలోచిస్తూ హాలీవుడ్ నటి తెగ బెంగ పెట్టుకుంది. నీనా డొబ్రెవ్, ఆస్టిన్ స్టోవెల్ లు ఏడు నెలలపాటు ప్రేమాయణంతో పాటు డేటింట్ చేశారు. అయితే ఈ ఏడాది ఆరంభంలో వారిమధ్య మనస్పర్థలు వచ్చిన కారణంగా ఇద్దరూ విడిపోయారు. ఎవరి దారి వారు చూసుకున్నారు. తన మాజీ బాయ్ ఫ్రెండ్ ఆస్టిన్ స్టోవెల్, అమేజింగ్ స్పైడర్ మ్యాన్ ఫేమ్ ఎమ్మా స్టోన్ చెట్టాపట్టా లేసుకుని తిరుగుతున్నారు. ఈ విషయం ఆనోటా ఈనోటా పాకి నీనా చెవిన పడింది. ఇక అంతే వారి డేటింగ్ పై వస్తున్న రూమర్లకు కాస్త అప్ సెట్ అయిందట. 'హూ ఈజ్ డేటింగ్ హూ' అనే ఈవెంట్లో భాగంగా ఆస్టిన్ స్టోవెల్, ఎమ్మా స్టోన్ డేటింగ్ చేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. వారిద్దరిని సంప్రదించగా ఈ వార్తను వారు ఖండించలేదు. మాజీ బాయ్ ఫ్రెండ్ రాసలీలలు జరుపుతున్నాడని కన్ఫామ్ అయిన తర్వాత నీనా డొబ్రెవ్ మనసు మళ్లీ ముక్కలయిందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ఆమె ఇంకా అతడ్ని ఇష్టపడుతుందా.. లేక అప్పుడే తనను మరిచిపోయాడని కోప్పడుతుందా అర్థం కావడం లేదు. ప్రస్తుతం ఆమె చిత్రం 'ట్రిపుల్ ఎక్స్: ద రిటర్న్ ఆఫ్ జాండర్ కేగ్' షూటింగ్ ముగిసింది. ఈ మూవీలో బాలీవుడ్ ముద్దుగుమ్మ దీపికా పదుకొనే నటించింది. -
వెడ్డింగ్ ప్లాన్!
నాలుగేళ్లుగా నడుస్తున్న డేటింగ్షిప్కు ఎట్టకేలకు ఫుల్స్టాప్ పెట్టారు ఎమ్మాస్టోన్, అండ్రూ గార్ఫీల్డ్. ఇప్పటి వరకు వీరి రొమాన్స్‌పై వచ్చిన రూమర్లకు తెరదించుతూ... ప్రేమాయణానికి శుభం కార్డు వేయనున్నారని ఓ వెబ్సైట్ కథనం. ఇన్నాళ్లూ రొమాంటిక్ టచ్‌లో ఉన్న ఇద్దరూ... వచ్చే సమ్మర్లో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారట. వాస్తవానికి గత ఏడాది మేలోనే ముహూర్తం పెట్టుకున్నారట. కానీ... అనుకోని కారణాల వల్ల వాయిదా పడిందట. ఈసారి రోమ్‌లో సిటీ హాల్ బుక్ చేద్దామనుకున్నాడట అండ్రూ. కానీ ఎమ్మా మాత్రం... ఈ అకేషన్‌ను మరింత గ్రాండ్‌గా, అంతకు మించి మెమరబుల్‌గా సెలబ్రేట్ చేసుకోవాలని యోచిస్తుందని సమాచారం.