ఎమ్మా.. ఏం మాయ చేశావే! | Emma Stone won top Golden Globes award | Sakshi
Sakshi News home page

ఎమ్మా.. ఏం మాయ చేశావే!

Published Mon, Jan 9 2017 1:15 PM | Last Updated on Tue, Sep 5 2017 12:49 AM

ఎమ్మా.. ఏం మాయ చేశావే!

ఎమ్మా.. ఏం మాయ చేశావే!

లాస్‌ఏంజిల్స్‌: ప్రతిష్ఠాత్మక గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డుల్లో అమెరికన్‌ నటి ఎమ్మా స్టోన్‌ దుమ్మురేపింది. రొమాంటిక్‌ కామెడీగా తెరకెక్కిన ‘లా లా ల్యాండ్‌’ సినిమాలో అద్భుత నటనకుగానూ ఎమ్మా ఈ ఏటి ఉత్తమ నటి అవార్డును దక్కించుకుంది. అదే సినిమాలో కథానాయకుడిగా నటించిన ర్యాన్‌ గోస్లింగ్‌ ఉత్తమ నటుడి అవార్డును సొంతం చేసుకున్నాడు.

74వ గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డుల ప్రదానోత్సవం ఆదివారం రాత్రి లాస్‌ఏంజిల్స్‌లో అట్టహాసంగా జరిగింది. భారతీయ నటి ప్రియాంక చోప్రా సహా పలు సినీ, టీవీ స్టార్లు ఫంక్షన్‌లో సందడి చేశారు. బెర్రీ జెన్‌కిన్స్‌ దర్శకత్వం వహించిన ‘మూన్‌లైట్‌’కు ఉత్తమ చిత్రం అవార్డు దక్కగా, మ్యూజికల్/కామెడీ విభాగంలో ‘లా లా ల్యాండ్‌’ బెస్ట్‌ ఫిలంగా నిలిచింది. 2016కుగానూ అత్యధిక నామినేషన్లు సాధించిన ‘లా లా ల్యాండ్‌’సినిమాకే ఏడు అవార్డులు దక్కడం విశేషం. 74వ గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డుల వివరాలిలా ఉన్నాయి..

అట్టహాసంగా గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు  [ ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి ]

ఉత్తమ సినిమా- డ్రామా: మూన్‌లైట్‌
ఉత్తమ సినిమా- మ్యూజికల్‌/కామెడీ: లా లా ల్యాండ్‌
ఉత్తమ దర్శకుడు‌: డామియెన్‌ ఛాజెల్‌
ఉత్తమ నటి- మ్యూజికల్‌/కామెడీ: ఎమ్మా స్టోన్‌
ఉత్తమ నటుడు- మ్యూజికల్‌/కామెడీ: ర్యాన్‌ గోస్లింగ్‌
ఉత్తమ నటి -డ్రామా: ఇసబెల్లా హుపెర్ట్‌(‘ఎలీ’ సినిమాకు)
ఉత్తమ నటుడు- డ్రామా: కేసీ ఆఫ్లెక్‌ (‘మాంచెస్టర్‌ బై ద సీ’ సినిమాకు)
ఉత్తమ సహాయ నటి: వియోలా డావిస్‌(‘ఫెన్సెస్‌’ సినిమాకు)
ఉత్తమ సహాయ నటుడు: ఆరోన్‌ టేలర్‌(‘నాక్టర్నల్‌ యానిమల్స్‌’ సినిమాకు)
బెస్ట్‌ స్క్రీన్‌ప్లే: డామియెన్‌ ఛాజెల్‌ (లా లా ల్యాండ​)
బెస్ట్‌ ఒరిజినల్‌ స్కోర్‌: జస్టిన్‌ హార్విట్జ్‌(లా లా ల్యాండ్‌)
బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌: సిటీ ఆఫ్‌ స్టార్స్‌(జస్టిన్‌ హార్విట్జ్‌- లా లా ల్యాండ్‌)
బెస్ట్‌ ఆనిమేషన్‌ ఫిల్మ్‌: జూటోపియా
ఉత్తమ విదేశీ చిత్రం: ఎలీ- ఫ్రాన్స్‌
బెస్ట్‌ టీవీ సిరీస్‌- డ్రామా: ది క్రౌన్‌
బెస్ట్‌ టీవీ సిరీస్‌- మ్యూజికల్‌/కామెడీ: అట్లాంటా
బెస్ట్‌ టెలివిజన్‌ లిమిటెడ్‌ సిరీస్‌: ది పీపుల్స్‌ వర్సెస్‌ ఓ.జె. సిప్సన్‌(అమెరికన్‌ క్రైమ్‌ స్టోరీ)
ఉత్తమ టీవీ నటి- డ్రామా: క్లెయిర్‌ ఫోయ్‌(ది క్రౌన్‌)
ఉత్తమ టీవీ నటుడు- డ్రామా: బిల్లీ బాబ్‌(గొలియాత్‌)
ఉత్తమ టీవీ నటి- మ్యూజికల్‌/కామెడీ: ట్రెసి ఎలిస్‌ రోజ్‌(బ్లాకిష్‌)
ఉత్తమ టీవీ నటుడు- మ్యూజికల్‌/కామెడీ: డోనాల్డ్‌ గ్లోవర్‌(అట్లాంటా)
ఉత్తమ టీవీ నటుడు(లిమిటెడ్‌ సిరీస్‌ విభాగం): టామ్‌ హిడెల్‌స్టన్‌(ది నైట్‌ మేనేజర్‌)
ఉత్తమ సహాయ నటి (లిమిటెడ్‌ సిరీస్‌ విభాగం): ఒలీవియా కోల్మన్‌ (ది నైట్‌ మేనేజర్‌)
ఉత్తమ సహాయ నటుడు(లిమిటెడ్‌ సిరీస్‌ విభాగం): హాగ్‌ లూరీ (ది నైట్‌ మేనేజర్‌)
నటి మేర్లీ స్ట్రీప్‌కు సిసిల్‌ బి డెమిలీ అవార్డు


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement