ప్చ్‌... దీపికకు ఈసారి చుక్కెదురు | Emma Stone top and Deepika Drop from Forbes highest paid List | Sakshi
Sakshi News home page

ప్చ్‌... దీపికకు ఈసారి చుక్కెదురు

Published Thu, Aug 17 2017 11:03 AM | Last Updated on Tue, Sep 12 2017 12:20 AM

Emma Stone top and Deepika Drop from Forbes highest paid List

లాస్‌ ఏంజెల్స్‌ : ప్రముఖ అంతర్జాతీయ మాగ్జైన్ ఫోర్బ్స్‌ 2017 ఏడాదికి గానూ అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ల జాబితాను రిలీజ్ చేసింది. ఆస్కార్ బరిలో దుమ్ము దులిపిన చిత్రం లా లా లాండ్ సుందరి ఎమ్మా స్టోన్‌ ఈ లిస్ట్ లో ఫస్ట్ ప్లేస్ లో నిలవగా, భారత్‌ నుంచి ఎవరికీ చోటుదక్కలేదు.
 
ఎమ్మా 26 మిలియన్‌ డాలర్ల పారితోషకంతో మొదటి స్థానంలో నిలిచిందని, పైగా ఈ జూన్ నాటికే అత్యధిక టాక్స్ కూడా చెల్లించేసిందని ఫోర్బ్స్‌ పేర్కొంది. రెండో స్థానంలో 48 ఏళ్ల నటి జెన్నిఫర్‌ అనిస్టోన్‌(25 మిలియన్‌ డాలర్లు) నిలిచింది. 2015, 16 సంవత్సరాలకుగానూ టాప్ పొజిషన్ లో నిలిచిన జెన్నీఫర్‌ లారెన్స్ ఈ యేడాది 24 మిలియన్ డాలర్ల రెమ్యునరేషన్ కారణంగా మూడోస్థానం సరిపెట్టుకుంది. గతేడాది ఆమె ఆదాయం 46 మిలియన్ల డార్లు కాగా, పాసింజర్స్ మూవీ డిజాస్టర్‌గా నిలవటంతో ఆదాయం సగానికి పైగా పడిపోయింది.  
 
ఇంకా ఈ లిస్ట్ లో ఎమ్మా వాట్సన్‌, కేట్ బ్లెంచెట్‌, జూలియా రాబర్ట్స్ వంటి వాళ్లు టాప్ 10 లో చోటు సంపాదించుకున్నారు.  ఇక గతేడాది ఈ జాబితాలో అనూహ్యంగా స్థానం సంపాదించుకున్న బాలీవుడ్ నటి దీపికా పదుకొనేకు ఈసారి చుక్కెదురైంది.  గతేడాది 10 మిలియన్ల డాలర్లతో పీకూ 10వ స్థానం దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే అదంతా పీకూ కేవలం ఎండోర్స్ మెంట్ లతోనే వెనకేయటం విశేషం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement