మద్యం మత్తులో యువతి వీరంగం! | Drunk woman hits man on mehadipatnam | Sakshi
Sakshi News home page

మద్యం మత్తులో యువతి వీరంగం!

Published Wed, Sep 17 2014 8:01 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM

మద్యం మత్తులో యువతి వీరంగం! - Sakshi

మద్యం మత్తులో యువతి వీరంగం!

హైదరాబాద్ : మద్యం మత్తులో ఓ యువతి వీరంగం సృష్టించింది. నిర్లక్ష్యంగా కారును నడిపి ఓ యువకుడ్ని ఢీకొట్టింది.హుమాయూన్ నగర్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ రవీందర్ కథనం ప్రకారం... అబిడ్స్ చాపెల్ రోడ్డు ప్రాంతానికి చెందిన యువతి (26) సోమవారం అర్థరాత్రి (ఏపీ 9సీకే 1340) కారుపై మోహదీపట్నం నుంచి మాసబ్ ట్యాంక్ ఫ్లైఓవర్ మీదుగా వెళ్తూ ముందు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న టోలీచౌకికి చెందిన అజార్ని ఢీకొట్టింది.

తర్వాత ఫ్లైఓవర్ పై ఉన్న డివైడర్ను ఢీకొట్టి హల్చల్ చేసింది. నిర్లక్ష్యంగా కారు నడుపుతున్నాఆమెను స్థానికులు ప్రశ్నించగా... అడగటానికి మీరెవరిని తిరగబడింది. అంతలో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీస్లు స్వల్పంగా గాయపడ్డ అజార్ను  ఆస్పత్రికి పంపించారు. అనంతరం యువతిని ట్రాఫిక్ పోలీసులు బ్రీత్ అనలైజర్తో పరీక్షించి మోతాదుకు మించి మద్యం తాగివున్నట్లు నిర్థారించారు. ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. యువతి డ్రైవింగ్ లైసెన్స్ను రద్దు చేయాలని ఆర్టీఏకు సిఫార్సు చేస్తామన్నారు. కాగా ఇదే యువతి నగరంలో గతంలో కూడా ఇలాగే మద్యం సేవించి వీరంగం సృష్టించినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement