వీడియో: వృద్ధురాలిపై చిరుత దాడి.. వాకింగ్‌ స్టిక్‌తో ఫైటింగ్‌ | Watch: Woman Fights Off Leopard With Walking Stick Mumbai | Sakshi
Sakshi News home page

Woman Fights Off Leopard: వృద్ధురాలిపై చిరుత దాడి.. వాకింగ్‌ స్టిక్‌తో ఫైటింగ్‌

Published Thu, Sep 30 2021 12:05 PM | Last Updated on Thu, Sep 30 2021 3:24 PM

Watch: Woman Fights Off Leopard With Walking Stick Mumbai - Sakshi

ముంబై: ముంబైలోని ఆరే ఏరియాలో మరోసారి చిరుత కలకలం రేపింది. బుధవారం సాయంత్రం ఓ ఇంటి ఆవరణలో కూర్చున్న వృద్ధురాలిపై చిరుత దాడి చేసింది. అయితే ఆమె ఏ మాత్రం ధైర్యం కోల్పోకుండా తన వాకింగ్‌ స్టిక్‌ సహాయంతో చిరుతతో పోరాడింది. ఓ వైపు పులితో పోరాడుతూనే తాను గట్టిగా అరవడంతో ఆ పిలుపులు విన్న మహిళ కుటుంబ సభ్యులు అటు రావడంతో పులి అక్కడి నుంచి వెళ్లిపోయింది. 

ఈ మొత్తం ఘటన అక్కడి సీసీ కెమెరాలో రికార్డయింది. కాగా ఈ ఘటనలో ఆమెకు స్వల్ప గాయాలుకావడంతో చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఆ ప్రాంతంలో రెండ్రోజుల కింద నాలుగేళ్ల బాలుడిపై చిరుత దాడి చేయగా తాజాగా ఇలాంటి ఘటన జరగడం రెండో సారి కావడం గమనార్హం. దీంతో ఆ ప్రాంత నివాసితులు భయాందోళనకు గురవుతున్నారు.

చదవండి: Viral Video: స్టేజ్‌పై నుంచి కిందపడ్డ బీజేపీ కార్యకర్త

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement