
చంద్రబాబు సతీమణికి గాయం
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి గాయపడ్డారు. సోమవారం ఉదయం ఆమె ఇంట్లో వ్యాయమం చేస్తుండగా ప్రమాదవశాత్తూ కిందపడిపోయినట్లు సమాచారం. చేతి మణికట్టు విరిగినట్లు తెలుస్తోంది. చికిత్స నిమిత్తం భువనేశ్వరిని జూబ్లిహిల్స్ అపోలో ఆస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.