
నేను శైలజ ఫేం కీర్తి సురేశ్ షూటింగ్‌లో గాయపడినట్లు ఓ వార్త హల్‌చల్ చేస్తోంది. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. మలయాళం సినిమా ‘కుంజిరామంటే కుప్పాయం’ షూటింగ్‌లో డ్యాన్స్ చేస్తూ ప్రమాదవశాత్తు కిందపడిందని, దీంతో ఆమెకు గాయాలైనట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వార్తకు ఈ వీడియో కూడా బలం చేకూరుస్తోంది. అయితే ఈ వార్తలను కీర్తి సురేశ్ ఖండించారు. ఇక పవన్‌కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న సినిమాలో కీర్తి నటిస్తున్న విషయం తెలిసిందే.
ఈ షూటింగ్ ప్రస్తుతం యూరప్‌లో జరుగుతోందని, గతవారమే చిత్రయూనిట్‌తో కలిసినట్లు ఆమె సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ వీడియోలో కిందపడిన హీరోయిన్ లిండకూమార్ అని కుంజిరామంటే కుప్పాయం చిత్రయూనిట్ ప్రకటించింది. ఇక కీర్తి సురేశ్‌కు 2018 బిగ్ ఇయర్‌గా నిలవనుంది. ఇప్పటికే పవన్‌కళ్యాణ్ చిత్రంతో పాటు, సావిత్రి బయోపిక్ ‘మహానటి’లో నటిస్తోంది. తమిళంలో విక్రమ్ సరసన సామీ2లో లీడ్ రోల్ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. సూర్య సరసన నటించిన ‘థాన సెర్తా కూటం’ సినిమా విడుదల కోసం ఎదురు చూస్తోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుంది.
Comments
Please login to add a commentAdd a comment