ఆటో బోల్తా..10 మందికి తీవ్ర గాయాలు | auto roll over..10 injured | Sakshi
Sakshi News home page

ఆటో బోల్తా..10 మందికి తీవ్ర గాయాలు

Published Sun, Dec 31 2017 12:52 PM | Last Updated on Thu, Aug 30 2018 4:17 PM

auto roll over..10 injured

నల్గొండ : చింతపల్లి మండలం పోలేపల్లి రాంనగర్‌ వద్ద ఆదివారం ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఆటో ప్రయాణిస్తున్న 10 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హుటాహుటిన హైదరాబాద్‌కు తరలించారు. చింతపల్లి నుంచి మాల్‌ వైపు వస్తోండగా ఈ ప్రమాదం జరిగింది. బాధితులంతా చింతపల్లి మండలం కూరంపల్లికి చెందిన వారిగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement