
నల్గొండ: నల్గొండ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నడమనూరు మండలం వెంపాడు స్టేజీ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ట్యాంకర్ అదుపు తప్పి.. టాటా ఏస్ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదం ఆరుగురు మృతి చెందారు. ఆటోలో ఏడుగురు ప్రయనిస్తుండగా అందులోని నలుగురు అక్కడిక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడ్డ మరో ఇద్దరని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి తరలించిన ఇద్దరు కూడా మృతి చెందారు.
సమాచారం అందుకున్న పోలీసలు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. మృతులు నిడమానూరు మండలం నిమానాయక్ తండా గ్రామ పంచాయతీ పరిధిలోని మల్లెవాని కుంట తండాకు చెందిన రమావత్ కేశవులు, గణ్, నాగరాజు, పాండ్య, బుజ్జిగా పోలీసులు గుర్తించారు.
చదవండి: ఎంఎంటీఎస్‌కు మరోసారి బ్రేక్
Comments
Please login to add a commentAdd a comment