auto accident
-
కోతిని తప్పించబోయి ఆటో బోల్తా
వేములవాడ రూరల్: వ్యవసాయ కూలీలు ప్రయాణిస్తున్న ఆటో బోల్తాపడి ఇద్దరు మృతిచెందిన సంఘటన రాజన్నసిరిసిల్ల జిల్లాలో మంగళవారం చోటుచేసుకుంది. ఈ ఘటనలో మరో 11 మంది గాయపడ్డారు. వేములవాడ అర్బన్ మండలం చింతల్‌ఠాణా మిడ్‌మానేరు ముంపు గ్రామం కావడంతో ఇక్కడ పనులు లేక కూలీలు ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన 13 మంది వ్యవసాయ మహిళా కూలీలు మంగళవారం ఉదయం ఆటోలో చందుర్తి మండలం మర్రిగడ్డకు వరినాట్ల పనులకు వెళ్లారు. పనులు ముగించుకుని సాయంత్రం తిరిగి వస్తుండగా వేములవాడ రూరల్ మండలం నాగాయపల్లి వద్ద ఆటోకు ఎదురుగా కోతి వచ్చింది. డ్రైవర్ కోతిని తప్పించబోగా ఆటోకింద ఇరుక్కోవడంతో బోల్తాపడింది. ఈ ఘటనలో జాతరకొండ మల్లవ్వ (51) అక్కడికక్కడే మృతిచెందగా, తీవ్రంగా గాయపడ్డ కుర్ర బాలవ్వ (65) కరీంనగర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. మిగతా 11 మంది కూలీలు వేములవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వేములవాడ రూరల్ ఎస్సై మారుతి కేసు నమోదుచేసి, మృతదేహాలను సిరిసిల్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
Hyderabad: డ్రైవర్ అత్యుత్సాహం.. కేబుల్ బ్రిడ్జిపై ఆటో బోల్తా
సాక్షి, హైదరాబాద్: నగరంలోని దుర్గం చెరువు తీగల వంతెనపై ఓ ఆటో బోల్తా పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 22న జరిగిన ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు తాజాగా వెలుగులోకి రావడంతోవ వైరల్‌గా మారాయి. జూబ్లీహిల్స్ నుంచి ఐటీసీ కొహినూర్ వైపు వస్తున్న ఆటో దుర్గం చెరువు తీగల వంతెనపై అకస్మాత్తుగా బోల్తా కొట్టింది. డ్రైవర్ సెల్‌ఫోన్ చూస్తూ ఆటో నడుపుతూ ముందుగా వెళ్తున్న బైక్‌ను తప్పించబోయి ఆటో అదుపుతప్పి పల్టీ కొట్టింది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్‌తో పాటుమరో ఇద్దరికి స్పల్పంగా గాయపడగా ఆసుపత్రికి తరలించారు. అయితే అత్యంత వేగంతో ఆటో నడపడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. మరోవైపు ఆటో పల్టీ కొట్టిన సమయంలో వెనుకనుంచి వచ్చిన కారు చాకచక్యంగా పక్కకు తిప్పడంతో ప్రమాదం తప్పింది. చదవండి: ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ క్యాంప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత -
లారీ బీభత్సం..! ఆటోను 30 మీటర్లు ఈడ్చుకెళ్లడంతో..
వరంగల్: వలస జీవులను లారీ మింగేసింది. డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఆరుగురు దుర్మరణం చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా మారింది. దీంతో ఆయా కుటుంబంలో తీరని విషాదం నెలకొంది. వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్ రాష్ట్రం జైపూర్‌కు చెందిన సుమారు పది కుటుంబాలు తేనే సేకరణ కోసం వరంగల్ జిల్లా కేంద్రానికి వచ్చి ఓసిటీ మైదానంలో డేరాలు వేసుకుని నివాసం ఉంటున్నాయి. నెల రోజుల క్రితం వచ్చిన ఈ వలసజీవులు నిత్యం ఉదయమే ఇక్కడ నుంచి ఆటోల్లో ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాలకు వెళ్లి తేనె సేకరించి తీసుకువచ్చి విక్రయిస్తుంటారు. రోజుమాదిరిగానే బుధవారం ఉదయం రెండు కుటుంబాలకు చెందిన ఆరుగురు వ్యక్తులు ఒక ఆటోలో వర్ధన్నపేట, తొర్రూరు వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో వర్ధన్నపేట మండలం ఇల్లంద వద్ద లారీ రాంగ్రూట్లో వచ్చి ఆటోను ఢీకొంది. అలాగే కొద్ది దూరం ఈడ్చుకెళ్లింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురు వ్యక్తుల్లో ఒకే కుటుంబానికి చెందిన కురేరి సురేష్ (43), అతడి కుమారులు అమిత్ కురేరి (23), నితీష్ కుమార్ కురేరి (11), సురేష్ సోదరి కుమారులు (మేనల్లుళ్లు) రూప్‌చంద్ దామి(33), జలావత్ దామి అలియాస్ జాబీర్ (19)తోపాటు ఆటోడ్రైవర్ నగరంలోని కరీమాబాద్ ఏసీరెడ్డి నగర్‌కు చెందిన బట్టు శ్రీనివాస్ (42)మృతి చెందారు. మృతుడి కురేరి సురేష్ మరో కుమారుడు అమీర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు కుటుంబ సభ్యులు ప్రీతి, పూజ తెలిపారు. ఆకలి తీర్చిన వ్యాపారులు.. రెండు కుటుంబాలకు చెందిన ఐదుగురు మృతి చెందారని తెలుసుకున్న లక్ష్మీపురం కూరగాయల మార్కెట్‌కు చెందిన పలువురు వ్యాపారులు చలించారు. తమ కుటుంబ సభ్యులు మృతి చెందారని, అందుకే ఉదయం నుంచి ఏమి తినలేదని చెప్పడంతో భోజనం తయారు చేయించి వారి ఆకలి తీర్చినట్లు వ్యాపారులు బిట్ల కృష్ణ, పాపాని భాస్కర్, బూర ప్రకాశ్ తెలిపారు. అమ్మా వస్తున్నా.. అంతలోనే దుర్మరణం ఖిలా వరంగల్: అమ్మా వస్తున్నా...కలిసి భోజనం చేద్దాం అంటివి.. అంతలోనే మాయమైనవా.. రెండు రోజులాయే నా చేతి కూడు తినక కొడుకా...తినకుండానే వెళ్లిపోయినావా .. అంటూ ఆటోడ్రైవర్ బట్టు శ్రీనివాస్ తల్లి రాజమ్మ రోదిస్తుంటే అక్కడున్న వాళ్లంతా కంటితడి పెట్టుకున్నారు. వర్ధన్నపేట మండలం ఇల్లందలో బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఆరుగురిలో ఆటోడ్రైవర్ బట్టు శ్రీనివాస్ కూడా ఉన్నారు. శ్రీనివాస్‌కు పదేళ్ల క్రితం వివాహం జరగగా కుమార్తె, కుమారుడు ఉన్నారు. తొమ్మిది నెలల క్రితం బతుకుదెరువు కోసం భార్య కల్పన, ఇద్దరు పిల్లలతో కలిసి హైదరాబాద్ వెళ్లారు. ఆర్థిక ఇబ్బందులతో రెండు నెలల క్రితం భార్య కల్పన తన పిల్లలను వెంటబెట్టుకుని నర్సంపేట ద్వారక పేటలోని పుట్టింటికి వెళ్లిపోగా.. శ్రీనివాస్ మాత్రం పుప్పాలగుట్ట ఏసీరెడ్డినగర్లోని తన పెద్దన్న నివాసం ఉండే తల్లి రాజమ్మ ఇంటికి చేరుకున్నాడు. అతను ప్రస్తుతం నాగమయ్య టెంపుల్ సమీప కాలనీలో ఓ గదిని అద్దెకు తీసుకుని అద్దె ఆటో నడిపిస్తున్నాడు. బుధవారం ఉదమే యజమానికి ఆటో ఇచ్చేసి ఇంటికి వస్తాననుకున్నాడు. ఈ లోపు ఓసిటీలో డేరాలు ఏర్పాటు చేసుకున్న జైపూర్‌కు చెందిన వలస జీవులు అండర్ బ్రిడ్జి వద్ద బట్టు శ్రీనివాస్ ఆటో ఎక్కి తొర్రూరులో దించాలని కోరారు. దీంతో వారిని ఎక్కించుకుని బయలుదేరగా ఇల్లంద వద్ద లారీ ఢీకొంది. దీంతో శ్రీనివాస్ మృతి చెందాడు. ఈ విషయం తెలియడంతో శ్రీనివాస్ సోదరుడు బట్టు కిషన్, వదిన మాలతీ, మృతుడి తల్లి రాజమ్మ, నర్సంపేట నుంచి చేరుకున్న భార్య కల్పన, ఇద్దరు పిల్లలు కన్నీరు మున్నీరుగా విలపించారు. దీంతో వరంగల్ పుప్పాలగుట్ట ఏసిరెడ్డినగర్లో విషాదం నెలకొంది. -
ఘోర రోడ్డు ప్రమాదం..తొమ్మిది మంది మృతి
యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో తొమ్మిది మంది మృతి చెందగా,ఒక చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో ఫతేపూర్‌లో చోటు చేసుకుంది. అతివేగంగా వెళ్తున్న ట్యాంకర్ ఆటోని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనలో సుమారు తొమ్మిది మంది అక్కడికక్కడే మరణించినట్లు వెల్లడించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. (చదవండి: ఆ ఎయిర్ లైన్స్, ఎయిర్‌పోర్ట్‌లకి భారీ షాక్! ప్రయాణికుడి పట్ల అలా వ్యవహరించడంతో..) -
బతుకుదెరువు.. గుండె బరువు.. తల్లి ఒడిలో నుంచి ఎగిరిపడి!
సాక్షి, మహబూబాబాద్: బతుకుదెరువు కోసం బయల్దేరిన ఓ కుటుంబానికి గుండె బరువైంది. పొట్టకూటి కోసం ఊరూరా తిరిగి స్టీల్ సామగ్రి అమ్మే కుటుంబంలో ఆటో బోల్తా పడి విషాదం నిండింది. మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధి శనిగపురం గ్రామ శివారులో మంగళవారం ఆటో బోల్తా పడి రేబెల్లి యాలాద్రి–సమ్మక్క దంపతుల కుమార్తె రాణి(3) మృతి చెందింది. మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధి జమాండ్లపల్లికి చెందిన యాలాద్రి–సమ్మక్క దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. వీరు బతుకుదెరువు కోసం ఊరూరా తిరిగి స్టీల్ సామగ్రి, అమ్ముతూ, గ్యాస్ స్టవ్‌లు మరమ్మతు చేస్తూ జీవనోపాధి పొందుతున్నారు. ఈక్రమంలో యాలాద్రి, సమ్మక్క తమ కుమార్తె రాణి కలిసి టాటా ఏస్ ట్రాలీ క్యాబిన్లో కూర్చున్నారు. వారితో పాటు వెనకాల ట్రాలీలో సమ్మక్క తల్లి వెంకటమ్మ కూర్చుని వరంగల్ వెళ్లేందుకు బయల్దేరారు. శనిగపురం శివారు గుండ్లబోడుతండా మూల మలుపు వద్ద గల రైస్ మిల్లు ప్రాంతానికి ఆటో చేరుకోగానే.. రోడ్డుపై ఉన్న గుంతను తప్పించే క్రమంలో ఒక్కసారిగా టాటాఏస్ ట్రాలీ అదుపుతప్పి బోల్తాకొట్టింది. ఈఘటనలో యాలాద్రి పక్కనే ఉన్న సమ్మక్క, చిన్నారి రాణి, ఆటో వెనుకభాగంలో కూర్చున్న వెంకటమ్మ రోడ్డుపై పడిపోయారు. సమ్మక్క, వెంకటమ్మకు స్వల్పగాయాలవగా.. రాణి తలకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు ఆటోలో వారిని ఆస్పత్రికి తరలించగా.. రాణి మృతి చెందినట్లు వైద్యులు గుర్తించారు. సమ్మక్క ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు రూరల్ ఎస్సై సీహెచ్.అరుణ్‌కుమార్, స్థానికులు తెలిపారు. చదవండి: ఇన్‌స్టాలో ఐఫోన్ అగ్గువ.. అత్యాశకు పోయి డబ్బులు పోగొట్టుకున్న నిట్ విద్యార్థిని -
హబ్సిగూడలో కారు బీభత్సం
సాక్షి, లాలాపేట: మద్యం మత్తులో ఓ కారు డ్రైవర్ హబ్సిగూడ ప్రధాన రహదారిలో బీభత్సం సృష్టించారు. నలుగురు ప్రయాణికులతో వెళ్తున్న ఓ ఆటోను, ఓ స్కూటీని ఢీకొట్టిన ఘటన ఉస్మానియా యూనివర్సిటీ పోలీసు స్టేషన్ పరిధిలో ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ రమేష్ నాయక్ తెలిపిన వివరాల మేరకు.. హబ్సిగూడలో ఫుడ్ పాయింట్ నిర్వహిస్తున్న మౌర్య తన స్నేహితులతో కలిసి అర్ధరాత్రి నుంచి ఉదయం వరకు పూటుగా మద్యం తాగారు. ఉదయం ఒక్కడే మౌర్య 8 గంటలకు హబ్సిగూడ స్ట్రీట్ నంబర్–8 నుంచి సికింద్రాబాద్‌కు కారులో బయలుదేరారు. కొద్ది సేపటికే మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తూ తన కారుతో రామంతాపూర్ వైపు వెళ్తున్న ఓ ఆటోను, ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. ఆటో, స్కూటీ నుజ్జునుజ్జయ్యాయి. ఆటోలో ప్రయాణిస్తున్న డ్రైవర్‌తో పాటు ఇద్దరు ప్యాసింజర్లు హరీష్, శ్రీనివాస్, ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తి మొత్తం నలుగురు వ్యక్తులు గాయపడగా వారిని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆటో డ్రైవర్ మల్లికార్జున్ పరిస్థితి విషమంగా ఉందన్నారు. కారు డ్రైవర్ మౌర్యను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ మేరకు కేసు దర్యాప్తులో ఉందని ఇన్స్పెక్టర్ రమేష్ నాయక్ తెలిపారు. (చదవండి: హాస్టల్లో ఉంటున్న కూతుర్ని చూసేందుకు వెళ్లి...అంతలోనే) -
ఆటోను ఢీకొట్టిన కారు.. ముగ్గురు మహిళలు దుర్మరణం
సాక్షి, జగిత్యాల: జగిత్యాల జిల్లాలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వెల్గటూర్ మండలం కృష్ణారావుపేటలో వేగంగా వచ్చిన ఓ కారు ఆటోను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మృతులు ధర్మపురి మండలం కమలాపూర్ వాసులుగా గుర్తించారు. ఇదీ చదవండి: పాణం తీసిన బంగారు గొలుసు -
సంతోషం.. సరదా కబుర్లు.. అంతలోనే ఘోరం..
కుషాయిగూడ (హైదరాబాద్): సాయంత్రం 5 గంటల సమయం. పాఠశాలలు వదిలేశారు. ఒకేచోట ఉన్న మూడు పాఠశాలలకు చెందిన విద్యార్థులు తాము రోజూ వచ్చే ఆటోలో ఎక్కారు. అందరిలోనూ ఇంటికి వె ళుతున్న సంతోషం. సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నారు. అంతలోనే ఘోరం.. వారు ప్రయాణిస్తున్న ఆటోను లారీ ఢీకొట్టడంతో ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి కిందపడి పల్టీలు కొట్టింది. పిల్లలు చెల్లా చెదురుగా పడిపోయారు. అమ్మా అంటూ ఆర్తనాదాలు మిన్నంటాయి. చదవండి: తల్లీ కుమారుడి దారుణ హత్య: వివాహేతర సంబంధమా..?, ఆస్తి గొడవలా..? ఇద్దరు విద్యార్థినులు అక్కడి కక్కడే మరణించారు. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. రక్తం మడుగులు కట్టింది. చర్లపల్లి చలించిపోయింది. స్థానికు లు హుటాహుటిన చిన్నారుల్ని సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఇద్దరు విద్యార్థినులు మరణించినట్లు ధ్రువీకరించిన వైద్యులు, ఒకరి పరిస్థితి విషమంగా ఉందని, ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయని తెలిపారు. కుషాయిగూడ పోలీ స్‌స్టేషన్ పరిధిలో గురువారం ఈ ప్రమాదం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఇళ్లకు చేరతారనగా.. చర్లపల్లి ప్రాంతానికి చెందిన తన్మయి (13) కోమలిత (11), రిషిప్రియ, రిషి వల్లభ్, రిషి కుమార్, వర్ణిక ఈసీఐఎల్‌లోని శ్రీ చైతన్య, నారాయణ, రవీంద్రభారతి పాఠశాలల్లో చదువుకుంటున్నారు. ఒకే ప్రాంతానికి చెందిన వారు కావడంతో వీరంతా రోజూ ఒకే ఆటోలో స్కూళ్లకు వచ్చి వెళ్తుంటారు. రోజులానే గురువారం ఉదయం కూడా స్కూల్‌కు వచ్చి సాయంత్రం ఇంటికి బయలుదేరారు. ఆటో బయలుదేరిన పది నిమిషాలకు, కాసేపట్లో ఇళ్లకు చేరతారనగా ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. చక్రిపురం చౌరస్తా మీదుగా చర్లపల్లి జైలు దాటి వెళ్తున్న క్రమంలో ఎదురుగా వచ్చిన లారీ (ఏపీ 28 టీడీ 0599) అదుపుతప్పి పిల్లలతో వెళ్తున్న ఆటోను (టీఎస్ 34 టీ 4311) వేగంగా ఢీ కొట్టింది. దీంతో ఆటో పల్టీలు కొడుతూ నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో నారాయణ స్కూల్లో 8వ తరగతి చదువుతున్న తన్మయి (13), శ్రీ చైతన్య స్కూల్లో 7వ తరగతి చదువుతున్న కోమలిత (11) చనిపోగా మిగతా నలుగురు గాయపడ్డారు. రవీంద్రభారతి స్కూల్లో 7వ తరగతి చదువుతున్న వర్ణిక పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను యశోద ఆసుపత్రికి తరలించారు. ఆటో డ్రైవర్ వినోద్‌కు కూడా తీవ్ర గాయాలు కాగా లారీ డ్రైవర్ పరారయ్యాడు. ఘోర దుర్ఘటనతో చర్లపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
సత్యసాయి జిల్లా: ఆటో ప్రమాదానికి కారణం ఇదే..
సాక్షి, సత్యసాయి జిల్లా: తాడిమర్రి మండలం చిల్లకొండయ్యపల్లిలో విషాద ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఆటోలో వెళ్తున్న కూలీలపై హై టెన్షన్ కరెంట్ వైర్లు తెగిపడటంతో మంటలు చెలరేగి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సభ్యులు మృతిచెందగా.. ఆరుగురు గాయపడ్డారు. ఈ ఘటనపై డీఎస్పీ రమాకాంత్ స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కుటుంబ సభ్యులు వ్యవసాయ పనుల కోసం ఆటోపై ఇనుప మంచం తీసుకెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఇనుప మంచానికి తెగిపడిన విద్యుత్ తీగ తగలడంతో మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో కొందరు ఆటో నుంచి దూకి బయటపడ్డారు. ఆటోలో ఉన్న ఐదుగురు మహిళలు మాత్రం మంటల్లో సజీవ దహనమయ్యారు. మృతులను గుడ్డంపల్లి వాసులుగా గుర్తించాము అని తెలిపారు. ఇదిలా ఉండగా.. విద్యుత్ ప్రమాద ఘటనపై ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ హరినాధ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ప్రమాద ఘటనలో వెలుగు చూసిన దాని ప్రకారం ఒక ఉడుత కారణంగా ఈ ప్రమాదం జరిగిందని నిర్ధారించారు. కరెంట్ వైర్‌ను ఎర్త్‌ను ఉడుత క్రాస్ చేయడంతో ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. ప్రమాద ఘటనపై శాఖ పరమైన విచారణకు ఆదేశించనట్టు వెల్లడించారు. అనంతపురం ఎస్.ఈతో పూర్తి విచారణకు ఆదేశించామని, ప్రమాదంలో మృతి చెందిన వారికి రూ. 5 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 2 లక్షల తక్షణ సహాయం అందిచనున్నట్టు తెలిపారు. ఇక, ఈ ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. పారిస్ పర్యటనలో ఉన్న ఆయన.. సీఎంవో ద్వారా ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం తరపున మృతుల కుటుంబాలకు పది లక్షల రూపాయాల చొప్పున పరిహారం అందించాలని అధికారులను ఆదేశించారు. అలాగే.. ఈ ప్రమాదంలో గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందించాలని తెలిపారు. బాధితుల కుటుంబాలకు అండగా నిలవాలని సీఎం జగన్ ఈ సందర్భంగా ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఇది కూడా చదవండి: సీఎం జగన్ దిగ్భ్రాంతి.. ఎక్స్‌గ్రేషియాకు, మెరుగైన చికిత్సకు ఆదేశం -
ఆటో ప్రమాదం: సీఎం జగన్ దిగ్భ్రాంతి.. ఎక్స్‌గ్రేషియాకు ఆదేశం
సాక్షి, అమరావతి: శ్రీ సత్యసాయి జిల్లా ఘోర ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. పారిస్ పర్యటనలో ఉన్న ఆయన.. సీఎంవో ద్వారా ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. గురువారం ఉదయం ధర్మవరం నియోజకవర్గం తాడిమర్రి మండలం చిల్లకొండయ్యపల్లి వద్ద హైటెన్షన్ విద్యుత్ వైర్లు తాకి ఆటో ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఐదుగురు మహిళా కూలీలు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం జగన్.. ప్రభుత్వం తరపున మృతుల కుటుంబాలకు పది లక్షల రూపాయాల చొప్పున పరిహారం అందించాలని అధికారులను ఆదేశించారు. అలాగే.. ఈ ప్రమాదంలో గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందించాలని తెలిపారు. బాధితుల కుటుంబాలకు అండగా నిలవాలని సీఎం జగన్ ఈ సందర్భంగా ప్రస్తావించినట్లు తెలుస్తోంది. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం తాడిమర్రి మండలం చిల్లకొండయ్యపల్లి వద్ద ఆటోపై హైటెన్షన్ విద్యుత్తు తీగ పడిన ఘటనలో.. ఐదుగురు మహిళలు సజీవదహనం అయ్యారు. ప్రమాద సమయంలో 12 మంది ఆటోలో ప్రయాణిస్తున్నారు. మృతిచెందిన వారిని గుడ్డంపల్లి వాసులు కాంతమ్మ, రాములమ్మ, రత్తమ్మ, లక్ష్మీదేవి, పెద్దకోట్లకు చెందిన కుమారిగా గుర్తించారు. ఇద్దరికి తీవ్రగాయాలు కాగా, ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. -
సత్యసాయి జిల్లా: ఘోర ప్రమాదం.. 5 మంది సజీవ దహనం
సాక్షి, సత్యసాయి: జిల్లాలోని తాడిమర్రి మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. చిల్లకొండయ్యపల్లిలో గురువారం ఉదయం వ్యవసాయ పనుల కోసం 5 మంది మహిళా కూలీలు ఆటోలో వెళ్తున్నారు. ఈ క్రమంలో ఆటోపై.. హైటెన్షన్ కరెంట్ తీగలు తెగిపడిపోయాయి. దీంతో, ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ మంటల్లో ఆటోలో వెళ్తున్న ఐదు మంది మహిళా కూలీలు అక్కడికక్కడే సజీవదహనమయ్యారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిని గుడ్డంపల్లి వాసులుగా గుర్తించారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఇది కూడా చదవండి: ‘దృశ్యం’ సినిమాను తలపించిన ప్రీప్లాన్డ్ కిడ్నాప్ డ్రామా.. -
చెల్లిని చూసేందుకు వెళ్లి... అంతలోనే...
చీపురుపల్లి: పట్టణంలోని మెయిన్రోడ్లో గల నటరాజ్ జంక్షన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో విజయనగరం పట్టణానికి చెందిన వస్త్ర వ్యాపారి ఎ.రామస్వామి అక్కడికక్కడే మృతిచెందాడు. వివరాలిలా ఉన్నాయి. మంగళవారం ఉదయం 7.30 గంటల సమయంలో విజయనగరం నుంచి రాజాం వైపు స్కూటీపై వెళ్తున్న రామస్వామికి చీపురుపల్లిలో ప్రధాన రహదారిపై ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ప్రమాదవశాత్తు తగలడంతో డివైడర్‌ను ఢీకొట్టి ట్రాక్టర్ కింద పడిపోయి అక్కడికక్కడే మృతిచెందాడు. తమిళనాడు రాష్ట్రంలోని తిరుచిపల్లి రోడ్, నమ్మక్కల్‌కు చెందిన రామస్వామి విజయనగరంలో స్థిరపడి బాలాజీ మార్కెట్లో 404వ నంబర్ దుకాణంలో వస్త్ర వ్యాపారం సాగిస్తున్నాడు. వ్యాపార విస్తరణలో భాగంగా రాజాం వైపు అరువులు ఇచ్చి డబ్బులు వసూలు చేసుకుంటాడు. ఈ నేపథ్యంలో విజయనగరంలో మంగళవారం మార్కెట్ సెలవు కావడంతో రాజాం పరిసర ప్రాంతాల్లో బకాయిల వసూలు కోసం ఉదయం 6 గంటలకే స్కూటీపై విజయనగరం నుంచి బయిలుదేరాడు. ఇంతలో చీపురుపల్లి వచ్చేసరికి రోడ్డు ప్రమాదంలో మృత్యువు కబళించింది. ట్రాక్టర్ డ్రైవర్ వెంకటరమణను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై సన్యాశినాయుడు చెప్పారు. విద్యుత్ షాక్‌తో టిప్పర్ డ్రైవర్.. చీపురుపల్లి రూరల్: కుటుంబపోషణ కోసం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని షాడోల్ జిల్లా బుదవా మండలం జరియా గ్రామం నుంచి వచ్చిన టిప్పర్ డ్రైవర్ ఓంప్రకాశ్ చీపురుపల్లి పట్టణంలో విద్యుత్ షాక్‌తో మంగళవారం మృతిచెందాడు. ఈ సంఘటనకు సంబంధించి హెచ్‌సీ రమణమూర్తి అందించిన వివరాలిలా ఉన్నాయి. పట్టణ సమీపంలో రెడ్డిపేట వద్ద జరుగుతున్న తోటపల్లి కాలువ పనులకు డ్రైవర్ ఓంప్రకాశ్ టిప్పర్‌తో రాతిబుగ్గిని తీసుకువెళ్లాడు. రాతిబుగ్గిని అన్లోడ్ చేసిన అనంతరం పూర్తిగా అన్లోడ్ అయ్యిందో లేదో చూసేందుకు వెనుక వైపు ఉన్న డోర్‌ను పట్టుకున్నాడు. అప్పటికే టిప్పర్ వెనుక భాగాన విద్యుత్‌వైరు తగిలి ఉండడంతో పట్టుకున్న వెంటనే విద్యుత్‌షాక్ తగిలి కిందపడిపోయాడు. విషయాన్ని గమనించిన స్థానికులు ద్విచక్రవాహనంపై చీపురుపల్లి ప్రభుత్వాస్పత్రికి తీసుకువెళ్లగా వైద్యసిబ్బంది పరీక్షించి మృతిచెందినట్లు నిర్ధారించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఆటోనుంచి జారిపడి ఒకరు.. పాలకొండ రూరల్: మండలంలోని తలవరం–అట్టలి రహదారి మధ్య మంగళవా ఆటోలో నుంచి జారిపడి ఓ వ్యక్తి మృతి చెందాడు. అవలంగి గ్రామానికి చెందిన నగరపు కృష్ణంనాయుడు (55) పాలకొండలో ఉన్న చెల్లిని చూసేందుకు పయనమై నవగాం కూడలిలో ఆటో ఎక్కి పాలకొండ వస్తున్నాడు. అట్టలి సమీపంలోని ఆర్సీఎం డొమినిక్ పాఠశాల వద్దకు చేరుకుంటున్న సమయంలో ఆటో అదుపు తప్పడంతో కృష్ణంనాయుడు ఆటోలో నుంచి జారి కిందపడగా తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు 108కు సమాచారం మివ్వగా వాహనం సంఘటనా స్థలానికి చేరుకునే సరికే మృతిచెందాడు. ఆయనకు భార్య గోవిందమ్మ ఉంది. రైతు కూలీగా జీవనం గడుపుతున్నట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. పిల్లలు లేకపోవడం, భర్త మరణించడంతో గోవిందమ్మ కన్నీటి పర్యంతమైంది. ఈ ఘటనపై ఎస్సై సీహెచ్ ప్రసాద్ కేసు నమోదు చేశారు. పట్టణంలోని మెయిన్రోడ్లో గల నటరాజ్ జంక్షన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో విజయనగరం పట్టణానికి చెందిన వస్త్ర వ్యాపారి ఎ.రామస్వామి అక్కడికక్కడే మృతిచెందాడు. వివరాలిలా ఉన్నాయి. మంగళవారం ఉదయం 7.30 గంటల సమయంలో విజయనగరం నుంచి రాజాం వైపు స్కూటీపై వెళ్తున్న రామస్వామికి చీపురుపల్లిలో ప్రధాన రహదారిపై ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ప్రమాదవశాత్తు తగలడంతో డివైడర్‌ను ఢీకొట్టి ట్రాక్టర్ కింద పడిపోయి అక్కడికక్కడే మృతిచెందాడు. తమిళనాడు రాష్ట్రంలోని తిరుచిపల్లి రోడ్, నమ్మక్కల్‌కు చెందిన రామస్వామి విజయనగరంలో స్థిరపడి బాలాజీ మార్కెట్లో 404వ నంబర్ దుకాణంలో వస్త్ర వ్యాపారం సాగిస్తున్నాడు. వ్యాపార విస్తరణలో భాగంగా రాజాం వైపు అరువులు ఇచ్చి డబ్బులు వసూలు చేసుకుంటాడు. ఈ నేపథ్యంలో విజయనగరంలో మంగళవారం మార్కెట్ సెలవు కావడంతో రాజాం పరిసర ప్రాంతాల్లో బకాయిల వసూలు కోసం ఉదయం 6 గంటలకే స్కూటీపై విజయనగరం నుంచి బయిలుదేరాడు. ఇంతలో చీపురుపల్లి వచ్చేసరికి రోడ్డు ప్రమాదంలో మృత్యువు కబళించింది. ట్రాక్టర్ డ్రైవర్ వెంకటరమణను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై సన్యాశినాయుడు చెప్పారు. (చదవండి: 186 దేశాలు పర్యటించిన తెలుగు ట్రావెలర్) -
ఘాట్రోడ్లో ఆటో బోల్తా
సీతంపేట: వివాహ శుభకార్యానికి వెళ్లి మంగళవారం మధ్యాహ్నం భోజనం చేసుకుని అనంతరం ఆటోలో తిరుగుప్రయాణమై వస్తుండగా మార్గమధ్యంలో అదుపు తప్పి ఘాట్‌రోడ్డులో ఆటో బోల్తా పడడంతో 20 మందికి గాయాలయ్యాయి. వారిలో ఆరుగురికి తీవ్రగాయాలు కావడంతో మెరుగైన వైద్యకోసం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. మిగతా 14 మంది స్థానిక ప్రాంతీయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గాయపడిన వారిలో ఆరుగురు చిన్నారులున్నారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని చింతాడలో ఓ వివాహ శుభకార్యానికి మెళియాపుట్టి మండలం బాణాపురం గ్రామానికి చెందిన 16 మంది ఆటోలో వచ్చి తిరుగు ప్రయాణమయ్యారు. గెడ్డగూడ సమీపంలో ఘాట్ రహదారి వద్ద ఆటో దిగుతుండగా ముందు ద్విచక్రవాహనంపై ఇద్దరు వెళ్తున్నారు. ఎదురుగా మరో ఇద్దరు ద్విచక్రవాహనంపై వస్తున్నారు. ఆటో ఒక్కసారిగా అదుపు తప్పి రెండు ద్విచక్ర వాహనాలను ఢీకొట్టి బోల్తా పడింది. ఆటోలో ఉన్న 16 మందితో పాటు ద్విచక్రవాహనాలపై వెళ్తున్న నలుగురు గాయపడడంతో వెంటనే ఐటీడీఏ ప్రత్యేక అంబులెన్స్‌లో స్థానిక ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: కోవిడ్ బాధిత బాలలకు ప్రభుత్వం అండ) -
రెండు ముక్కలైన ఆటో
మామునూరు: గుర్తు తెలియని వాహనం ఆటోను ఢీకొనడంతో డ్రైవర్‌తోపాటు ఇద్దరు మహిళలు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ఆటో నుజ్జునుజ్జు కావడంతోపాటు రెండు ముక్కలైంది. ఆదివారం తెల్లవారు జామున 5 గంటలకు వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిపై రామకృష్ణాపురం క్రాస్‌రోడ్డు సమీపంలో ఈ ఘటన జరి గింది. పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్ జిల్లా ఖిలా వరంగల్ మండలం అల్లీపురం గ్రామానికి చెందిన సింగారపు సమీదా, సాంబయ్య దంపతుల రెండో కొడుకు 23 ఏళ్ల ఎస్కే యాకూబ్‌పాషా (సింగారపు బబ్బులు) ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. పాషా ఎప్పటిలాగే తెల్లవారు జామున 3 గంటలకు ఆటో తీసుకుని ఇంటి నుంచి వరంగల్ బస్టాండ్‌కు బయలుదేరాడు. ఈ క్రమంలో హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం దండపెల్లి గ్రామానికి చెందిన పల్లపు పద్మ(35), ఆమె సమీప బంధువు, హనుమకొండ వినాయకనగర్‌కు చెందిన పల్లపు మీనా(27) కలసి వ్యక్తిగత పనిపై వరంగల్ బస్టాండ్‌కు చేరుకున్నారు. అక్కడినుంచి యాకూబ్‌పాషా ఆటోలో ఇద్దరు మహిళలు వర్ధన్నపేటకు వెళ్లి.. తిరిగి అదే ఆటోలో వరంగల్‌కు బయలుదేరారు. ఆటో రామకృష్ణాపురం సమీపానికి రాగానే.. వరంగల్ వైపు నుంచి వేగంగా వస్తున్న గుర్తు తెలియని వాహనం వీరి ఆటోను బలంగా ఢీకొట్టింది. దీంతో పద్మ, మీనా, డ్రైవర్ యాకూబ్‌పాషా అక్కడికక్కడే మృతిచెందారు. ప్రమాదం గురించి తెలు సుకున్న ఏసీపీ నరేశ్‌కుమార్, ఇన్స్పెక్టర్ రమేశ్‌నాయక్, ఎస్సైలు రాజేశ్‌రెడ్డి, కృష్ణవేణి, రాజన్‌బాబు అక్కడికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. అనంతరం పోలీసులు మృతదేహాలను ఎం జీఎం మార్చురీకి తరలించారు. మృతుల బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ రమేశ్‌నాయక్ తెలిపారు. గుర్తు తెలియని వాహనం ఢీకొనడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, ఆ వాహనాన్ని గుర్తించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని ఏసీపీ నరేశ్‌కుమార్ తెలిపారు. -
కరకట్టపై పల్టీకొట్టిన ఆటో..
ఘంటసాల (అవనిగడ్డ): మండలంలోని శ్రీకాకుళం వద్ద కృష్ణా కరకట్టపై ఆటో అదుపుతప్పి పల్టీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు తీవ్రంగా, మరో నలుగురు స్వల్పంగా గాయపడ్డారు. పెనమలూరు మండలం గంగూరు గ్రామానికి చెందిన ఆరుగురు అవనిగడ్డలో ఓ ఫంక్షన్ వెళ్లి వస్తుండగా సోమవారం సాయంత్రం తిరిగి వస్తుండగా శ్రీకాకుళం కృష్ణాకరకట్ట వద్ద వారు ప్రయాణిస్తున్న ఆటో అదుపు తప్పడంతో పల్టీ కొట్టి దిగువకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే 108కు ఫోన్ చేశారు. ఘంటసాల 108 సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ చిలకూరి వెంకటనర్సయ్య, ఫైలెట్ గాలం దినేష్ కుమార్ ఘటనా స్థలంలోనే తీవ్రంగా గాయపడిన అయ్యంకి ద్వారక, సురభి నిర్మలకుమారితోపాటు అయ్యంకి జానకి, మెహర్రాజ్ మనీషా, మరో ఇద్దరికి ప్రథమ చికిత్స చేసి విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఫోన్ చేసిన 20 నిమిషాల్లోనే ఘటనా స్థలానికి చేరుకుని, బాధితులకు ప్రథమ చికిత్స చేసిన 108 సిబ్బందిని గ్రామస్తులు అభినందించారు. ఈ ప్రమాదంపై పోలీసులకు ఫిర్యాదు అందలేదని సమాచారం. చదవండి: Omicron Outbreak: కరోనాకు రెడ్ కార్పెట్ వేసి మరీ ఘన స్వాగతం పలుకుతోన్న గోవా! -
ఆటో డ్రైవర్ సెల్‌ఫోన్ నిర్వాకం 9 మంది ప్రాణాలకు ఎసరెట్టింది!
సత్తెనపల్లి: ఆటో డ్రైవరు సెల్‌ఫోన్ నిర్వాకం తొమ్మిది మంది ప్రయాణికులను ఆస్పత్రి పాల్జేసింది. సత్తెనపల్లి రూరల్ ఎస్ఐ ఆవుల బాలకృష్ణ కథనం మేరకు సోమవారం బెల్లంకొండ నుంచి పది మంది ప్రయాణీకుల తో సత్తెనపల్లి వస్తున్న ఆటో వెన్నాదేవి వద్దకు రాగానే ఆటోడ్రైవర్‌కు ఫోన్ వచ్చింది. సదరు ఫోన్ మాట్లాడే క్రమంలో ఆటో అదుపు తప్పి ఎదురుగా వస్తున్న గ్యాస్‌లోడు ఆటోను ఢీకొంది. ఆటోలో ప్రయాణిస్తున్న పది మంది ప్రయాణీకుల్లో తొమ్మిది మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 లో సత్తెనపల్లి ఏరియా వైద్యశాలకు తరలించారు. ప్రాణ నష్టం జరుగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ఒక్క రోజులోనే 663 ఒమిక్రాన్ కేసులు.. ‘ఏప్రిల్ నాటికి వేల సంఖ్యలో మరణాలు’! -
ఆటో బోల్తా ఇద్దరు చిన్నారులు మృతి : కర్నూల్
-
ఆటోను ఢీకొన్న లారీ
చిల్లకూరు: వేగంగా దూసుకువచ్చిన లారీ ఢీ కొట్టడంతో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం నాంచారంపేట వద్ద బుధవారం జరిగింది. చిల్లకూరు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన కొందరు గూడూరు వెళ్లారు. బుధవారం అక్కడ్నుంచి ఆటోలో స్వగ్రామాలకు ప్రయాణమయ్యారు. నాంచారంపేట వద్దకు వచ్చేసరికి.. గూడూరు బైపాస్‌లోని సిలికా యార్డులో ఇసుక లోడ్ చేసుకునేందుకు వెళ్తున్న లారీ వీరి ఆటోను ఢీకొట్టింది. ఆటో పల్టీలు కొడుతూ రోడ్డు పక్కకు పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఏరూరు గ్రామానికి చెందిన మామిడాల బుజ్జమ్మ (55), కలవకొండకు చెందిన ముడి శిఖామణి(52) అక్కడికక్కడే మృతి చెందారు. బల్లవోలుకు చెందిన భారతి(38)ని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆమె మరణించింది. ఈ ప్రమాదంలో మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండడంతో నెల్లూరుకు తరలించారు. మిగిలిన వారికి గూడూరు ఏరియా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో విద్యార్థిని మృతి
పెనుకొండ: మండలంలోని కొండంపల్లి సమీపంలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో హిమబిందు (20) అనే ఇంజనీరింగ్ విద్యార్థిని దుర్మరణం చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. వివరాల్లోకెళితే.. కొత్తచెరువు మండలం ఎర్రబల్లికి చెందిన భాస్కరరెడ్డి వ్యవసాయంతో పాటు, ఆటో నడుపుతూ కుమార్తెను ఇంజనీరింగ్ చదివిస్తున్నాడు. ప్రస్తుతం కరోనా ప్రభావంతో కుమార్తె ఇంటి వద్దే ఉండగా విద్యార్థిని అనారోగ్యంగా ఉండటంతో పెనుకొండకు చికిత్స నిమిత్తం ఆటోలో బయలుదేరారు. మార్గమధ్యలో బండ్లపల్లికి చెందిన బాలాజీ, చెర్లోపల్లికి చెందిన ముత్యాలప్పలు ఆటోలో పెనుకొండకు ఎక్కారు. వీరు ప్రయాణిస్తున్న ఆటో కొండంపల్లి సమీపంలోని బీఈడీ కళాశాల వద్దకు రాగానే పెనుకొండ నుంచి వేగంగా వచ్చిన ఇండికా కారు ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హిమబిందు అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన విద్యార్థిని తండ్రి భాస్కరరెడ్డి, ముత్యాలప్పను పోలీసులు అనంతపురానికి తరలించారు. బాలాజీ స్వల్పగాయాలతో బయట పడ్డాడు. హిమబిందు మరణంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. కారు యజమాని లక్ష్మీనారాయణ మందు సేవించి వేగంగా కారును నడపడంతోనే ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
పొంగి ప్రవహిస్తున్న వాగు... డ్రైవర్ నిర్లక్ష్యంతో
సాక్షి, నల్గొండ: గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో తెలంగాణలోని పలు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. వేలాది ఎకరాల్లో పంట నీట మునిగింది. ఈ క్రమంలో నల్గొండ జిల్లా దేవరకొండ చింతపల్లి మండలం కిష్టారం పల్లి గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామ సమీపంలో పొంగిపొర్లుతున్న వాగులో ప్యాసెంజర్ ఆటో బోల్తా కొట్టింది. దీంతో అందులోని ప్రయాణికులు నీటిలో కొంత దూరం కొట్టుకు పోగా, రాములమ్మ అనే మహిళ నీట మునిగి మృతి చెందింది. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ప్రమాదం జరిగిందని స్థానికులు, మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులో ఆటోని పోనివ్వడంతో తమ ఇంటి దీపం ఆరిపోయిందని రాములమ్మ భర్త కన్నీటిపర్యంతమయ్యాడు. -
అంతులేని విషాదం
గుంటూరు, తాడికొండ: రెక్కాడితేగానీ డొక్కాడని కుటుంబాలు వారివి. నాలుగు మెతుకులు సంపాదించడానికి పిల్లలను కూడా వెంట తీసుకెళ్లాల్సిన పరిస్థితి. ఇలాంటి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఒకే సారి ముగ్గుర్ని బలిగొని ఆయా కుటుంబాల్లో విషాదం నింపింది. ఈ ఘటన తాడికొండ మండలం లాం సమీపంలో మంగళవారం చోటుచేసుకుంది. ఆటోడ్రైవర్ సెల్‌ఫోన్ వెనక్కి ఇద్దామనుకొనే ప్రయత్నంలో ఒంటి చేతితో వాహనం నడపడం, అతివేగంతో వెళ్లడంతో అదుపుతప్పి ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ముగ్గురు మృతితోపాటు మరో ఐదురుగు గాయాలపాలయ్యారు. వ్యవసాయ కూలీలుగా పనిచేసే వీరందరిదీ ఒక్కో గాథ. పాఠశాలకు సెలవు కావడంతో కుమారుడిని వెంట బెట్టుకొని పనికి వెళదామని ఆటోలో మోతడక నర్సరీలలో పని చేసేందుకు బయలుదేరిన షేక్ దరియాబీ కుమారుడు దరియావలి (12) ప్రమాదంలో ఛాతి, పొట్టలో బలమైన గాయం కావడంతో అసుపత్రికి చేరుకొనేలోపుగా మరణించాడు. మరో కుటుంబానికి చెందిన మృతురాలు రాయపూడి భారతి(28) 2వ తరగతి చదువుతున్న ఏడు సంవత్సరాల కుమారుడు సంతోష్‌ను వెంటబెట్టుకొని వెళుతుండగా తలకు బలమైన గాయం కావడంతో అమె ఆసుపత్రికి చేరుకొనేలోగా ప్రాణాలొదిలింది. కుమారుడు గాయాలతో చికిత్స పొందుతున్నాడు. మరో మృతురాలు మాతంగి నాగేంద్రమ్మ (52) అనే మహిళ తీవ్ర గాయాలతో జీహెచ్‌లో చికిత్స పొందుతూ ప్రాణాలొదిలింది. ఈమె కోడలు ఎస్తేరు రాణికీ తీవ్రంగా గాయాలు కావడంతో ప్రస్తుతం ప్రమాదకర స్థితిలో చికిత్స పొందుతుండగా ఇంటివద్ద ఎత్తుకొనేందుకు ఎవరూ లేరని వెంట తీసుకెళ్లిన 2 సంవత్సరాల కుమారుడు చిన్నారి అరుణ్ తేజ్ కూడా ప్రమాదంలో గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఎస్తేరు రాణి చెల్లలు కూడా ప్రమాదంలో తీవ్ర గాయాలతో ఆసుపత్రిలోనే చికిత్స పొందుతోంది. మృతురాలు నాగేంద్రమ్మకి నలుగురు కుమారులు. సత్తెనపల్లి మండలం కందులవారిపాలెం గ్రామానికి చెందిన ఈమె వ్యవసాయ పనుల నిమిత్తం 7 సంవత్సరాల నుంచి చిన్న కుమారుడు వద్దే ఉండి కూలి పనులకు వెళుతోంది. ప్రమాదం రూపంలో మృత్యువు వెంటాడటంతో నిర్జీవంగా పడి ఉన్న తీరు అందరినీ కలచివేసింది. ఘటనకు కారణమైన ఆటో డ్రైవర్‌ది నిడుముక్కల గ్రామం కాగా ప్రమాదం జరిగిన వెంటనే ఆయన పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయినట్లు సమాచారం. కలెక్టర్ పరామర్శ గుంటూరు ఈస్ట్: లాం సంమీపంలో రోడ్డు ప్రమాదంలో గాయపడి జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను, మృతుల బంధువులను కలెక్టర్ శామ్యూల్ ఆనంద్‌కుమార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త చంద్రగిరి ఏసురత్నం మంగళవారం పరామర్శించారు. -
జాతరకు వెళుతూ మృత్యుఒడికి
సాక్షి, పలమనేరు : గంగజాతరకు వెళ్తున్న వారిని మృత్యువు ఐచర్ వాహన రూపంలో కబళించింది. షేర్ ఆటోను ఐచర్ ఢీకొనడంతో నలుగురు దుర్మరణం చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటన బుధవారం పలమనేరు సమీపంలోని ఆంజనేయస్వామి ఆలయం వద్ద చెన్నై–బెంగళూరు జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. వివరాలు.. బైరెడ్డిపల్లె మండలం మిట్టకురప్పల్లె, కామినాయునిపల్లె, గంగవరం మండలం దండపల్లె కురప్పల్లె, కీలపట్ల కొత్తపల్లె, నాగిరెడ్డిపల్లె గ్రామాలకు చెందిన వారు బంగారుపాళెం మండలం టేకుమందలో గంగజాతరకు వెళ్లడానికి పలమనేరుకు వచ్చారు. ఇక్కడి నుంచి ఒక షేర్ ఆటోను మాట్లాడుకుని 14మంది బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న ఆటో ఆంజనేయస్వామి ఆలయం వద్ద వెళుతుండగా ఎదురుగా వస్తున్న ఐచర్ వాహనం మితిమీరిన వేగంతో దూసుకువచ్చి ఆటోను ఢీకొంది. దీంతో ఆటో ముందరి భాగం నుజ్జు నుజ్జు అయ్యింది. ఈ ప్రమాదంలో కురప్పల్లెకు చెందిన క్రిష్ణప్ప(53) ఆటోలోనే మృతి చెందాడు. మిగిలిన వారంతా తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. బంగారుపాళెం 108లో క్షతగాత్రులకు పలమనేరు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కామినాయునిపల్లె వాసి వెంకటప్ప(70), మిట్టకురప్పల్లెకు చెందిన రెడ్డెమ్మ అలియాస్ దేవమ్మ(36), క్రిష్ణమ్మ(45) కన్నుమూశారు. గాయపడిన వారిలో నాగిరెడ్డిపల్లెకు చెందిన శ్రీనివాసులు(35) అతని భార్య అమరమ్మ(28), మిట్టకురప్పల్లెకు చెందిన నందీష్(2), భాగ్య(15), మంగమ్మ(40), కీలపట్ల కొత్తపల్లెకు చెందిన కుమారి(30), ఆమె కుమార్తె ఇందు(8), దండపల్లె కురప్పల్లెకు చెందిన పద్మమ్మ(40), బంగారుపాళెంకు చెందిన ఆటోడ్రైవర్ నిషార్ అహ్మద్(37) ఉన్నారు. వీరిలో శ్రీనివాసులు, నందీష్ల పరిస్థితి విషమంగా ఉంది. ప్రథమ చికిత్స అనంతరం వారిని చిత్తూరు, కుప్పంలోని ఆస్పత్రులకు తరలించారు. కొంపముంచిన హైవే డైవర్షన్ ప్రమాదం జరిగిన చోట ఓ ఫ్లైఓవర్, దానికి ఇరువైపులా వన్‌వే, ఓ సర్వీసు రోడ్డుంది. ఆటోడ్రైవర్ ఆటో సర్వీసు రోడ్డు మీదుగా వెళ్లి ఉన్నపక్షంలోఈ ప్రమాదం తప్పేదే. మరోవైపు వన్‌వే రోడ్డు మరమ్మతుల కారణంగా ఒకే మరో రోడ్డుకి డైవర్షన్ చేశారు. దీంతో వేగంగా వస్తున్న ఐచర్ ఆటోకు వ్యతిరేక దిశలో వెళ్లి దానిని ఢీకొంది. ఐచర్ డ్రైవర్ సింగిల్ రోడ్డనుకుని వాహనాన్ని వేగంగా నడపడం ప్రమాదానికి దారితీసింది. మృతులంతా పేదలే దండపల్లెకు చెందిన క్రిష్ణప్ప పట్టణంలోని ఓ సిమెంటు దుకాణంలో పనిచేసేవాడు. కామినేపల్లెకు చెంది న వెంకటప్ప చిన్నపాటి పనులు చేసుకునేవాడు. మిట్టకురప్పల్లెకు చెందిన రెడ్డెమ్మ అలియాస్ దేవమ్మ భర్త మోటార్ మెకానిక్‌గా కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గాయపడిన వారు వేర్వేరు ఊర్లయినప్పటికీ ఒకే సామాజిక వర్గానికి చెందిన పేద కుటుంబాలకు చెందినవారే. టేకుమందలో బంధువుల ఆహ్వానం మేరకు జాతరకెళుతూ ప్రమాదం బారిన పడ్డారు. పలమనేరు ఆస్పత్రి మృతుల కుటుంబీకులు, బంధువుల ఆర్తనాదాలతో దద్దరిల్లింది. -
ఆటో, టాటా ఏస్ వాహనాల ఢీ
నెల్లిపాక (రంపచోడవరం): టాటా ఏస్ వాహనం, ఆటో ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో 11 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో తొమ్మిది మంది ఉండగా వారిలో ఇద్దరు గర్భిణులు ఉన్నారు. వివరాల్లోకెళితే.. తెలంగాణలోని అశ్వారావుపేట మండలం మద్దులమడ గ్రామంలోని ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మహిళలు, నలుగురు పురుషులు, ముగ్గురు చిన్నారులు చింతూరు మండలం మల్లంపేట గ్రామసమీప అటవీప్రాంతంలో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లారు. వీరు బుధవారం తిరిగి వారి గ్రామానికి వెళ్లే క్రమంలో భద్రాచలం వెళ్లేందుకు ఏడుగురాళ్లపల్లి గ్రామం వద్ద ఓ ఆటో ఎక్కారు. భద్రాచలం మరో ఏడు కిలోమీటర్లు ఉందనగా గుండాల గ్రామం వద్ద ఎదురుగా వస్తున్న టాటా ఏస్ వాహనాన్ని ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అటో బోల్తా పడిపోవడంతో అందులో ఉన్న వారందరూ ఆటో కింద పడి తీవ్రంగా గాయపడ్డారు. మడకం శిరమయ్య, మరియమ్మ, ఉంగమ్మ, సోమయ్య, దేవయ్య, రామయ్య, దూలయ్య, బీమమ్మ, పేరాల సత్యనారాయణ, శ్రీను ఉన్నారు. వీరిలో ఉంగమ్మ, మరియమ్మ గర్భిణులు. ప్రమాద సమయంలో ఎటపాక ఎస్సైలు చినబాబు, సాగర్లు అక్కడికి చేరుకుని క్షతగాత్రులను వారే టాటా మేజిక్ వాహనంలో ఎక్కించి భద్రాచలం ఏరియా వైద్యశాలకు తరలించి, చికిత్సలు చేయించారు. బాధితుల్లో రామయ్య, మరియమ్మ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి వాహనాల అతివేగమే కారణమని తెలిసింది. ఆటో డ్రైవర్ గాయలతో ఆస్పత్రికి వచ్చినా అక్కడి నుంచి పరారయ్యాడు. -
అన్న ఉన్నాడు.. అధైర్య పడొద్దు..
చింతపల్లి(పాడేరు): మృతుల కుటుంబాలకు అండగా ఉంటానని ముఖ్యమంత్రి జగన్మోన్రెడ్డి హామీ ఇచ్చారని, మీరు అధైర్య పడవలసిన అవసరం లేదని పాడేరు శాసనసభ్యురాలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి చెరువూరు మృతుల కుటుంబాలకు భరోసా ఇచ్చారు. మండలంలోని బలపం పంచాయతీ చెరువూరు గ్రామానికి చెందిన ఐదుగురు గిరిజనులు ఆదివారం ఆటోపై స్వగ్రామానికి వెళ్తుండగా... ఆటో విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో ఐదుగురు మృతి చెందగా మరో ఆరుగురు గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో గిరిజనులు మృతి చెందంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున నష్టపరిహారం మంజూరు చేయాలని కలెక్టర్ కాటంనేని భాస్కర్‌ను ఆదేశించారు. ఎంపీడీవో ప్రేమాకర్, తాహసీల్దార్ సత్యనారాయణ అత్యవసరంగా దహనక్రియల ఖర్చుల నిమిత్తం మృతుల కుటుంబాలకు రూ.5వేల చొప్పున అందజేశారు. మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి సోమవారం హుటాహుటిన చెరువూరు వెళ్లారు. భారీ వర్షం కారణంగా వాహన రాకపోలకు తీవ్ర అంతరాయం కలిగినా లెక్క చేయకుండా ఆమె మధ్యాహ్నం 3.30గంటలకు గ్రామానికి చేరుకున్నారు. ప్రమాదంలో మృతి చెందిన వంజారపు చిట్టిబాబు, సోదరుడు గంగరాజు, లోత బొంజుబాబు, ఆటో డ్రైవర్ వంతాల కృష్ణారావు, జనుగూడి ప్రసాద్ కుటుంబాలను ఆమె పరామర్శించారు. మృతదేహల వద్దకు వెళ్లి నివాళులు అర్పించారు. ప్రమాదం ఎలాజరిగిందో స్థానికులను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుం బాలకు అండగా ఉండాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేసినట్టు ఆమె తెలిపారు.మృతుల కుటుంబ సభ్యులను ఓదా ర్చారు. బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా తాము అండగా ఉంటామని చెప్పారు. ఆటో డ్రైవర్ వంతాల కృష్ణారావు కుటుం» సభ్యులను ఓదార్చే క్రమంలో ముగ్గురు పిల్లలు భోరున విలపించడంతో భాగ్యలక్ష్మి కన్నీటి పర్యంతమయ్యారు. బాధిత కుటుంబాలకు దహన క్రియలకోసం ఆమె సొంత సొమ్ము రూ.20వేలు అందజేశారు. ఒడిశా ప్రాంతానికి ఆనుకుని ఉన్న చెరువూరును ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి సందర్శించడం ఇదే మొదటి సారి. గాయపడిన గిరిజనులకు మెరుగైన వైద్యం అందించేందుకు ఉన్నతాధికారులతో చర్చిస్తామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో మిమ్స్ ఫ్రొఫెసర్ నర్సింగరావు, అరకు పార్లమెంట్ జిల్లా ప్రధాన కార్యదర్శి జల్లి సుధాకర్, కార్యదర్శి గణబాబు, పాడేరు మాజీ ఎంపీపీ ఎస్వీ రమణమూర్తి, చల్లంగి సుగునాథం, చింతపల్లి మండల అధ్యక్షుడు మోరి రవి, నాయకులు అభిస్వరూప్, మీరా తదితరులు పాల్గొన్నారు. తిరుగు ప్రయాణంలో వర్షం కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. కేజీహెచ్‌లో ఎమ్మెల్యే పరామర్శ పాడేరు: చింతపల్లి మండలం చెరువూరు వద్ద విద్యుత్ స్తంభాన్ని ఆటో ఢీకొన్ని ప్రమాదంలో తీవ్ర గాయాల పాలై విశాఖపట్నం కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి సోమవారం పరామర్శించారు. ఆమె కేజీహెచ్‌కు వెళ్లి క్షతగాత్రుల పరిస్థితిని తెలుసుకున్నారు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులను కోరారు. -
పాల ప్యాకెట్టే ప్రాణాలు తీసిందా?
చింతపల్లి(పాడేరు): మండలంలోని చెరువూరు వద్ద ఆదివారం విద్యుత్ స్తంభాన్ని ఆటో ఢీకొనడంతో ఐదుగురు గిరిజనులు మృతి చెందడానికి పాల ప్యాకెట్టే కారణమని స్థానికులు చెబుతున్నారు. చెరువూరుకు చెందిన వంతాల కృష్ణారావు గత కొంత కాలంగా ఆటో నడుపుతున్నాడు. కోరుకొండలో ఆదివారం జరిగిన వారపుసంతకు వచ్చిన కృష్ణారావు పాలప్యాకెట్ కొని, ఆటో స్టీరింగ్ భాగంలో పెట్టుకున్నాడు. ప్రయాణికులు ఎక్కిన తర్వాత చెరువూరికి సమీపంలోని దిగువ ప్రాంతానికి వెళుతుండగా పాలప్యాకెట్ ఆటో స్టీరింగ్ నుంచి జారీ కాళ్లపై పడడంతో ప్యాకెట్‌తీసి పైన పెట్టే క్రమంలో అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టినట్టు కొందరు చెబుతున్నారు. మండలంలోని అన్నవరం ప్రధాన రహదారి నుంచి చెరువూరు వరకు సుమారు 16 కిలోమీటర్ల మేర 150 విద్యుత్ స్తంభాలున్నాయి. ఇవన్నీ ఇనుప స్తంభాలు కావడంతో పాటు సింగిల్ లైన్ విద్యుత్ సరఫరా అవుతుంది. ఆటో స్తంభాన్ని స్వల్పంగా ఢీకొట్టినప్పటికీ పైన విద్యుత్ తీగ తెగి ఆటోపై పడడంతో షాక్‌కు గురై ఐదుగురు మరణించగా, ఆరుగురు గాయాలు పాలైనట్లు చెబుతున్నారు. గాయపడిన వారిని లోతుగెడ్డ పీహెచ్‌సీకి తరలించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు క్షతగాత్రులను నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. సీఎం స్పందించడం ఇదే ప్రథమం మండలంలో గతంలో ఎన్నో ప్రమాదాలు జరిగాయి. పెద్ద సంఖ్యలో గిరిజనులు మృత్యువాత పడ్డారు. కానీ ముఖ్యమంత్రి స్థాయిలో స్పందించడం ఇదే తొలిసారి అని పలువురు చర్చించుకుంటున్నారు. కడసిల్ప వద్ద జీపు బోల్తాపడి ఏడుగురు గిరిజనులు మృతి చెందారు. అప్పటి మంత్రిగా ఉన్న పసుపులేటి బాలరాజు ఈ ప్రాంతీయుడు కావడంతో స్పందించారు. తర్వాత జర్రెల ఘాట్ రోడ్డు వద్ద జీపు బోల్తాపడి నలుగురు గిరిజనులు అక్కడికక్కడే మృతి చెందినా మంత్రి స్థాయిలో కూడా ఎవరూ స్పందించలేదు. గత ఏడాది అన్నవరం వద్ద జీపు ప్రమాదానికి గురై నలుగురు గిరిజనులు మృతి చెందినా అధికారులు మినహా ప్రముఖ నేతలెవరు పట్టించుకున్న దాఖలాలు లేవు. రాష్ట్రంలో అత్యంత శివారునున్న విశాఖ మన్యంలోని చింతపల్లి మండలం ఒడిశా సరిహద్దు ప్రాంతంలో చెరువూరు వద్ద జరిగిన ప్రమాదంలో ఐదుగురు గిరిజనులు మృతి చెందిన వెంటనే ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి స్పందించి రూ.5లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించడం సర్వత్రా చర్చాంశనీయమైంది. సంఘటన జరిగిన వెంటనే బాధితులను పరామర్శించేందుకు వెళ్లాలని జిల్లా కలెక్టర్ భాస్కర్‌కు ఆదేశాలు జారీ చేయడంతో ఆదివారం అర్ధరాత్రి ఆయన చింతపల్లి చేరుకున్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పాడేరు ఎమ్మెల్యేగా ఎన్నికైన కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి సోమవారం పాడేరులో విజయోత్సవ ర్యాలీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విషాద సంఘటన సమాచారం తెలియడంతో ఆమె ర్యాలీని రద్దు చేసుకుని చెరువూరుకు వెళ్లారు. -
మృత్యువులోనూ తోడుగానే..
వినుకొండ(నూజెండ్ల): ఆటోను ట్రాక్టర్ ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన సంఘటన వినుకొండ–నూజెండ్ల రహదారిపై ఆముదాలమిల్లు వద్ద మంగళవారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. నూజెండ్ల మండలం పాలుప్పలపాడుకు చెందిన కట్టెంపూడి జయకృష్ణ , బొల్లాపల్లి మండలం కనుమలచెరువుకు చెందిన కందుకూరి రాజు కొత్త ఉప్పలపాడులో అన్నదమ్ముల పిల్లలైన బాలరోజా, యోగేశ్వరమ్మలను రెండేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. జయకృష్ణ భార్య బాలరోజా మూడు నెలల క్రితం ఆడపిల్లకు జన్మనిచ్చింది. రాజు భార్య యోగేశ్వరమ్మకు 6 నెలల బాబు ఉన్నాడు. యోగేశ్వరమ్మ తన అత్త ఇంటి వద్ద కనుమలచెరువులో ఉంది. వరుసకు తోడల్లుళ్లయిన జయకృష్ణ, రాజు మంగళవారం వినుకొండ వచ్చారు. కూలర్ కొనుగోలు చేసి కొత్త ఉప్పలపాడు బయలు దేరారు. వినుకొండ దాటి 2 కిలోమీటర్లు ప్రయాణించగానే నూజెండ్ల నుంచి వినుకొండ వస్తున్న ట్రాక్టరు వీరు ప్రయాణిస్తున్న ఆటోను ఢీకొట్టింది. దీంతో జయకృష్ణ, రాజు అక్కడికక్కడే మృతి చెందారు. ఆటో నుజ్జునుజ్జయింది. ట్రాక్టరు ట్రక్కు తిరగబడింది. వినుకొండ ఎస్ఐ శివరామయ్య సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ట్రాక్టర్ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆస్పత్రిలో మిన్నంటిన రోదనలు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారనే వార్త తెలుసుకున్న పాత ఉప్పలపాడు, కొత్త ఉప్పలపాడు, కనుమలచెరువు గ్రామాల నుంచి పెద్దసంఖ్యలో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి చేరుకున్నారు. భార్యా పిలల్లకు దిక్కెవరయ్యా అంటూ గుండెలు బాదుకున్నారు. ఆస్పత్రి వద్ద రోదనలు మిన్నంటాయి. మృతుల కుటుంబాలకు పరామర్శ జయకృష్ణ తండ్రి కట్టెంపూడి పిచ్చయ్య వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నూజెండ్ల ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. అతని కుటుంబ సభ్యులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పరామర్శించారు. -
ట్రాలీ ఆటో ఢీ..ఇద్దరు దుర్మరణం
ప్రకాశం, గొబ్బూరు (పెద్దారవీడు): బైకును ట్రాలీ ఆటో ఢీకొనడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు వైద్యశాలకు తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందారు. ఈ సంఘటన మండలంలోని గొబ్బూరు ఆల్లూరి పోలేరమ్మ దేవాలయం సమీపంలో గురువారం ఉదయం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. తర్లుపాడు మండలం కలుజువ్వలపాడు నుంచి గొర్రెలను ట్రాలీ ఆటోలో ఎక్కించుకొని మండలంలోని హనుమాన్‌జంక్షన్ కుంటలో ఉన్న గొర్రెల మండి (సంత)కి బయల్దేరింది. గొర్రెలను దించేసిన అనంతరం ట్రాలీ ఆటో తిరిగి బయల్దేరింది. మార్కాపురం మండలం రాయవరం నుంచి వినుకొండ మండలం భారతిపురం గ్రామానికి చెందిన బత్తుల వెంకట్రావు, మార్కాపురం మండలం పెద్దనాగులవరం గ్రామానికి చెందిన తురగ రాజు మోటార్ సైకిల్‌పై వెళ్తుండగా మార్గంమధ్యలో గొబ్బూరు ఆల్లూరి పోలేరమ్మ దేవాలయం సమీపంలో బైకును ట్రాలీ ఆటో ఢీకొట్టింది. ప్రమాదంలో తురగ రాజు (20) తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన బత్తుల వెంకట్రావు (40)ను అంబులెన్స్‌లో మార్కాపురం జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు. బత్తుల వెంకట్రావు రాయవరంలో వివాహం చేసుకున్నాడు. అత్తగారి ఇంటికి వచ్చి గురువారం ఉదయం సొంత గ్రామానికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మృతుడు తురగ రాజుకు భార్య లక్ష్మి, కుమారుడు ఉన్నారు. వెంకట్రావు భార్య గురవమ్మ కన్నీమున్నీరైంది. మృతులు భారతిపురం చేరుకొని తెలంగాణ రాష్ట్రంలో బేల్దారి పనులకు వెళ్లేందుకు బయల్దేరినట్లు తెలిసింది. ట్రాలీ ఆటో డ్రైవర్‌కు డైవింగ్ లైసన్స్ లేదు. అతడు సంఘటన స్థలం నుంచి పరారయ్యాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ప్రభాకర్‌రావు తెలిపారు. -
రోడ్డు ప్రమాదం.. సిసిటివి కెమెరాలో రికార్డైన దృష్యాలు
-
సీతారామా.. ఎంత ఘోరం జరిగిందయ్యా!
సీతారాముల కల్యాణ రమణీయ ఘట్టాన్ని కనులారా వీక్షించి తరించారు.. తమ జీవితాలు సాఫీగా సాగిపోవాలని భక్తిశ్రద్ధలతో ఏక పత్నీవ్రతుడిని వేడుకున్నారు.. అప్పటి వరకు భక్తిపారవశ్యంలో మునిగితేలిన ఆ భక్తులు.. ఆటోలో స్వస్థలానికి బయలుదేరారు. మరికొద్ది నిమిషాల్లో గమ్యస్థానాలకు చేరుకుంటారనే లోపలే ఘోరం జరిగిపోయింది. విధి వైపరిత్యమో.. మరో కారణమో తెలియదు కానీ ..ఆటో వారి పాలిట మృత్యుశకటంగా మారింది. మితిమీరిన వేగం.. ఆపై డ్రైవర్ నిర్లక్ష్యం వెరసి.. ముందుగా వెళుతున్న బస్సును ఓవర్టేక్ చేసే క్రమంలో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టడంతో అక్కడికక్కడే ఐదుగురు దుర్మరణం చెందగా.. ఆస్పత్రికి తరలిస్తుండగా మరో ఇద్దరు మృత్యుఒడికి చేరుకున్నారు. ఈ దుర్ఘటన ఆదివారం మధ్యాహ్నం కోదాడ సమీపంలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు, మృతుడి బంధువుల కథనం మేరకు... కోదాడరూరల్ : కోదాడ పట్టణానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న తమ్మర సీతారామాదేవాలయంలో ప్రతి సంవత్సరం శ్రీరామనవమి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. కోదాడకు చెందిన పలువురు భక్తులు అక్కడ జరిగే వేడుకలకు వెళ్లివస్తారు. ఈ క్రమంలో పట్టణంలోని సిరి అపార్ట్‌మెంట్‌కు చెందిన నలుగురు మహిళలు కల్యాణానికి వెళ్లారు. కల్యాణం అనంతరం అక్కడి నుంచి ఆటోలో కోదాడకు బయలుదేరారు. వీరితో పాటు పట్టణానికి చెందిన మరో ఐదుగురు ఆటోలోకి ఎక్కారు. డ్రైవర్‌తోపాటు మొత్తం ఆటోలో పది మంది ఉన్నారు. తమ్మర నుంచి ఆటో బయలుదేరి కోదాడ–ఖమ్మం ప్రధాన రహదారి మీదుగా కోదాడకు వస్తోంది. ఈ క్రమంలో ఖమ్మం క్రాస్ రోడ్డు సమీపంలో ముందు ఉన్న బస్సును ఆటో ఓవర్‌టెక్ చేస్తూ అకస్మాత్తుగా ఎడమవైపు నుంచి రోడ్డు కుడివైపునకు వచ్చాడు. అదే సమయంలో కోదాడ నుంచి ఖమ్మం పట్టణానికి సిమెంట్ లోడ్‌తో ఎదురుగా వస్తున్న లారీని ఆటో వెళ్లి ఢీకొట్టింది. దీంతో ఆటోలో ఉన్న కోదాడకు చెందిన బేతు లక్ష్మయ్య (60) ఆయన భార్య బేతు నాగసులోచన (57), తమ్మరకు చెందిన ఆటోడ్రైవర్ అబ్బాస్ (48), పట్టణంలోని మాతానగర్‌కు చెందిన నరిమినేని సుగుణమ్మ (45), రెడ్చిల్లి వెనుక నివాసముంటున్న గుండపనేని పద్మ (56) అక్కడికక్కడే మృతిచెందారు. సిరి అపార్టుమెంట్‌కు చెందిన అంబటి సైదమ్మ (38), వట్టికొండ శైలజ (40)లు తీవ్ర గాయాలు కావడంతో ఖమ్మం తరలించారు. అక్కడికి చేరుకొనే లోపే ఈ ఇద్దరు కూడా మార్గమధ్యలో మృతిచెందారు. ఆటోలో ఉన్న మరో ముగ్గురు మహిళలు లక్ష్మి, రేణుక, మంగతాయారుకు గాయాలయ్యాయి. రేణుక పరిస్థితి కూడా విషమంగా ఉండటంతో ఆమెను ఖమ్మం నుంచి హైదరబాద్‌కు తరలించారు. లక్ష్మీ విజయవాడలో చికిత్స పొందుతుండగా మంగతాయారు కోదాడ ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతోంది. ఆటోలో ఇరుక్కుపోయిన మృతదేహాలు... ప్రమాద ఘటనలో లారీని ఒక్కసారిగా ఢీకొట్టడంతో ఆటోను ముందుకు నెట్టుకుంటూ వెళ్లింది. దీంతో ఆటో నుజ్జునుజ్జు కావడంతో మృతదేహాలు, క్షతగాత్రులు కడ్డీల మధ్యలో ఇరుక్కుపోయారు. స్థానికులు వాహనదారులు అక్కడకు చేరుకుని దాదాపుగా 20 నిమిషాలు శ్రమించి ముందుగా గాయాలపాలైన వారిని బయటకు తీశారు. చికిత్స నిమిత్తం వైద్యశాలకు తరలించి , మృతదేహాలను బయటకు తీసారు. ప్రభుత్వాస్పత్రిలో మిన్నంటిన రోదనలు కోదాడకు చెందిన ఏడుగురు ఒక్కసారే మృతిచెందడంతో పట్టణంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతిచెందిన వారి కుటుంబాలన్ని దాదాపుగా పట్టణంలో అందరికి పరిచయాలు ఉండటంతో మృతదేహాలను చూసేందుకు వందల సంఖ్యలో ప్రభుత్వ వైద్యశాలకు చేరుకున్నారు. వైద్యశాల ఆవరణలో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఆటోడ్రైవర్ తొందరపాటే కారణమా...? ఘోర రోడ్డు ప్రమాదానికి ఆటో డ్రైవర్ తొందరపాటే కారణమని తెలుస్తోంది. శ్రీరామ నవమి కావడంతో ప్రయాణికులు ఎక్కువ సంఖ్యలో ఉం డటంతో మరిన్ని ట్రిప్పులు తోలుకోవచ్చనే ఆశతో ఎదురుగా బస్సు ఆగి ఉన్న ఒక్క నిమిషం కూడా ఆగకుండా ఆటో డ్రైవర్ తొందరపాటుతో ఎదురుగా వాహనాలు వస్తున్నాయో లేదో చూసుకోకుం డా ఒక్కసారే పక్కకు మలపడంతో లారీ ఢీకొ ట్టింది. ఇక్కనిమిషం ఆగితే అందరు క్షేమంగా ఇళ కు చేరేవారు. మరణించిన వారిలో నలుగురు కూ డా రెండు నిమిషాలు ఆగితే ఖమ్మం క్రాస్‌రోడ్, బీ ఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద దిగేవారే ఉన్నారు. మృతుల వివరాలు రాసుకోవడానికి వెళితే... తమ్మర నుంచి కోదాడకు వస్తున్న ఆటో లారీని ఢీకొట్టిందని, ఈ ప్రమాదంలో ఏడుగురు మతి చెందారనే సమాచారం కోదాడ పట్టణ పోలీసులకు అందింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి బయలుదేరారు. పట్టణ సీఐ శ్రీనివాసులరెడ్డితో పాటు రైటర్ వట్టికొండ రామారావు కూడా పెన్ను పేపర్లు తీసుకుని సంఘటన స్థలానికి బయలుదేరారు. ఘటనాస్థలిలో మృతుల , గాయపడిన వారి వివరాలు రాసుకోవడానికి రైటర్ రామారావు సిద్ధమవుతున్నాడు. కానీ అక్కడ కొన ఊపిరితో కొట్టు మిట్టాడుతూ తన భార్య వట్టికొండ శైలజ పడి ఉండడంతో రామారావుకు దిక్కుతోచలేదు. అపార్టుమెంట్ వాసులతో కలిసి ఆమె తమ్మర దేవాలయానికి వెళ్లి వస్తూ ప్రమాదానికి గురైంది. వెంటనే తేరుకున్న ఆయన ఆమెను హుటాహూటిని అంబులెన్స్‌లో ఖమ్మం తరలించాడు. కాని ఖమ్మం చేరుకొనే లోపే ఆమె మృతిచెందింది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. ముగ్గురి వివాహాలు చేసి.. తమ్మరబండపాలెం గ్రామానికి చెందిన ఎస్కె. అబ్బాస్ ఆటో తోలుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి ఇద్దరు కుతుర్లు, ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో ముగ్గురు వివాహాలు చేయగా మరో కుమారుడు వివాహానికి ఉన్నాడు. ఒంటరిని చేసి వెళ్లిపోయావా.. సైదమ్మ భర్త వీరారెడ్డి పట్టణంలో వ్యాపారం చేస్తుంటాడు. ఇతడికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. సైదమ్మ మృతితో వారి కుటుంబం దిక్కుతోని స్థితిలోకి వెళ్లిపోయింది. పిల్లలను, నన్ను ఒంటరిని చేసి వేళ్లిపోయావా అంటూ ఆమె భర్త బోరున విలపించాడు. కోదాడకు చేరుకున్న ఎస్పీ... ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ ఆర్.వెంకటేశ్వర్లు కోదాడకు చేరుకున్నారు. ప్రభుత్వ వైద్యశాలలో ఉన్న మృతదేహాలను సందర్శించి మృతుల కుటుంబాలతో మాట్లాడారు. కార్యక్రమాలు వెంటనే జరిగే విధంగా చూడాలని స్థానిక పోలీసులకు తెలిపారు. ఆయన వెంట పట్టణ, రూరల్ సీఐలు, స్థానిక ఎస్ఐలు సిబ్బంది ఉన్నారు. ప్రశాంతంగా జీవించే సమయంలో... గుండపనేని పద్మ ,భర్త సత్యనారాయణ పట్టణంలో కిరణాషాపు నిర్వహిస్తూ ఇద్దరు కుమారులు, ఓ కుమార్తెను ఉన్నత చదువులు చదివించారు. వీరిలో చిన్నకొడుకు, కుతూరు అమెరికాలో నివాసం ఉంటున్నారు. ఇటీవల కాలంలోనే రెడ్‌చిల్లీ వెనుక బజారులో ఇంటిని కొనుగోలు చేసి నెలరోజుల క్రితం చిన్నకుమారుడి వివాహం చేశారు. పిల్లలు ఉన్నతంగా ఉండటంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంటిలో ఉంటూ ప్రశాంతంగా జీవిస్తున్న సమయంలో పద్మ దుర్మరణం చెందడం ఆ కుటుంబాన్ని కలచివేసింది. ఒక్క దేవుడూ కాపాడలేక పోయాడా.. మృతుల్లో ఇద్దరు బేతులక్ష్మయ్య నాగసులోచన దంపతులు. వీరు బీఎస్ఎన్ కార్యాలయం ఎదురుగా గల వీధిలో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరి కూతుర్లు, ఓ కుమారుడు ఉన్నారు. వీరందరికీ వివాహాలు చేసిన లక్ష్మయ్య ఓ కిరణాషాపులో గుమస్తాగా పనిచేస్తున్నాడు. గృహిణిగా ఉంటున్న నాగసులోచనకు దైవభక్తి ఎక్కువ. ‘‘నువ్వు దేవుడికి రోజు పూజ చేస్తున్నా ఒక్క దేవుడన్నా మిమ్మల్ని కాపడలేదా అమ్మా.. ఇద్దరూ ఒక్కసారే మమ్మల్ని వదిలిపోయరా’’ అంటూ వారి కూతుళ్లు, కుమారుడు గుండెలవిసేలా రోదించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. ఘటన స్థలాన్ని సందర్శించిన ఎమ్మెల్యే... ప్రమాద జరిగిన విషయం తెలిసిన వెంటనే స్థానిక ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ ఘటన స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను వైద్యశాలకు తరలించేందుకు తగు చర్యలు తీసుకున్నారు. ఆతర్వాత వైద్యశాలో చికిత్స పొందుతున్న పలువురుని పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. విషమంగా ఉన్న వారిని ఖమ్మం, విజయవాడ తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ వైద్యశాలలో మృతదేహాలను సందర్శించి వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. పలు రాజకీయ పార్టీల నాయకులు, పట్టణ ప్రముఖులు మృతదేహాలను సందర్శించి వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. కూరగాయల మార్కెట్లో పనిచేస్తూ.. మాతానగర్‌కు చెందిన సుగుణకు భర్త, కొడుకుతో ఉంటూ బస్టాండ్ ఎదురుగా ఉన్న కూరగాయాల మార్కెట్లో పనిచేస్తోంది. భర్తకు చేదోడువాదోడుగా ఉంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. ఆమె మృతితో కొడుకు, భర్త, తీవ్రంగా రోదిస్తున్నారు. -
రిజిస్ట్రేషన్ కోసం వెళ్లి.. అనంత లోకాలకు
సాక్షి,జనగామ: ఆటో రిజిస్ట్రేషన్ కోసం వరంగల్ వెళ్లి తిరిగి వస్తుండగా జనగామ జిల్లా యశ్వంతాపూర్ శివారు వరంగల్–హైదరాబాద్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు, కుటుంబ సభ్యుల తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ చిలకనగర్‌లో నివాసముంటున్న కె.హేమంత్‌హరిశ్రీకాంత్(23) ఆటో నడుపుతూ కటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అదే ప్రాంతంలో నివాసముంటున్న స్నేహితుడు రమేష్ వద్ద ఆటోను కొనుగోలు చేశాడు. ఈ ఆటో రిజిష్ట్రేషన్ ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో ఉంది. దానిని తన పేర మార్పిడి చేసుకునేందుకు హేమంత్‌హరిశ్రీకాంత్ తన స్నేహితులు రమేష్, దాస్లతో కలిసి ఆటోలోనే ఉదయం వరంగల్‌కు బయలుదేరారు. పని పూర్తి చేసుకున్న తర్వాత రాత్రి హైదరాబాద్‌కు తిరిగి వెళ్తున్నారు. యశ్వంతాపూర్ శివారు నేషనల్ హైవేపై ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టడంతో ఆటో ఎగిరి పల్టీలు కొట్టింది. ఆ సమయంలో డ్రైవింగ్ చేస్తున్న శ్రీకాంత్ అక్కడిక్కడే మృతి చెందాడు. రమేష్, దాస్‌లకు తీవ్ర గాయాలయాయ్యయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్నారు. క్షతగాత్రులను జిల్లా ప్రధాన ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అనంతరం పరిస్థితి విషమించడంతో వారిని వరంగల్ ఎంజీఎంకు తీసుకు వెళ్లారు. శ్రీకాంత్ మృతదేహాన్ని పోస్టుమార్టం గదిలో భద్రపరిచారు.విషయం తెలుసుకున్న హేమంత్‌హరిశ్రీకాంత్ భార్య దివ్య, కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. తండ్రి కోసం ఏడాది కూతురు ఎదురు చూపు.. తండ్రి కనిపించపోవడంతో హేమంత్‌హరిశ్రీకాంత్ ఏడాది కూతురు బిక్కు బిక్కుమంటూ ఉండి పోయింది. జిల్లా ప్రధాన ఆస్పత్రిలో తల్లి దివ్య రోదిస్తుంటే.. ఏం జరిగిందో తెలియని ఆ పసిపాప దీనంగా చూసింది. నాన్న ప్రేమకు దూరమైన చిన్నారిని చూసిన వారు కంటతడి పెట్టారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం చేయించి బంధువులకు అప్పగించారు. -
‘పది’లో ఫస్ట్ వస్తానంటివే..!
సాక్షి, కమలాపురం: కమలాపురం–లేటపల్లె ప్రధాన రహదారిలో నసంతపురం వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పదవ తరగతి పరీక్ష రాయడానికి వెళ్తున్న విద్యార్థి దుర్మరణం చెందాడు. కుటుంబ సభ్యుల రోదనతో ఆసుపత్రి ఆవరణం దద్దరిల్లింది. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఎర్రబల్లె కొత్తపల్లెకు చెందిన విద్యార్థి అలిదెన విష్ణువర్ధన్ రెడ్డి(15) చిన్నచెప్పలి హైస్కూల్లో పదవతరగతి చదువు తున్నాడు. రోజూ అదే గ్రామానికి చెందిన మరి కొంత మంది విద్యార్థులతో కలిసి ఆటోలో పాఠశాలకు వెళ్తాడు. పదవ తరగతి పరీక్షలు కమలాపురంలో బాలికల హైస్కూల్ పరీక్ష కేంద్రంలో రాస్తున్నాడు. రోజులాగే మంగళవారం కూడా ఇతర విద్యార్థులతో కలిసి పరీక్ష రాయడానికి ఆటోలో బయలు దేరి వెళ్లాడు. అయితే ఆ ఆటో మార్గ మధ్యలో నసంతపురం వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న మరో ఆటో ఢీ కొంది. ప్రమాదంలో విష్ణువర్ధన్‌రెడ్డి కుడి కాలువ విరిగి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు హుటాహుటీన చికిత్స నిమిత్తం మరో ఆటోలో కమలాపురం తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి విష్ణువర్ధన్ రెడ్డి అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. అలాగే ఈ ఘటనలో 6వ తరగతి చదువుతున్న నవ్య శ్రీ,, 4వ తరగతి చదువుతున్న వెంకట కిషోర్‌తో పాటు ఆటో డ్రైవర్ సుబ్బరాయుడు తీవ్రంగా గాయపడ్డారు. వారికి ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్య సేవల కోసం రిమ్స్‌కు రెఫర్ చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఎవరు బాధ్యత వహిస్తారు రోడ్డు ప్రమాదంలో పదవ తరగతి పరీక్షలు రాయడానికి వెళ్తూ విద్యార్థి విష్ణు వర్ధన్ రెడ్డి మృతి చెందడం దారుణం అని ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి, సమన్వయకర్త దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి, రాజోలి వీరారెడ్డి తెలిపారు. మంగళవారం కమలాపురం ఆసుపత్రిలో ఉన్న మృతదేహాన్ని వారు పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ శివారు ప్రాంతాలకు ఆర్టీసీ బస్సులు లేక పోవడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుందన్నారు. ప్రజల సేవ కోసం బస్సులు ఏర్పాటు చేస్తే నష్టం వస్తోందని ఆర్టీసీ వారు సర్వీసులను తొలగించడం అన్యాయం అన్నారు. ఈ ప్రమాదం పట్ల ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా? అధికారులా? లేక ఆర్టీసీనా? అని ప్రశ్నించారు. మృతుని కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం అందిస్తానని ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి తెలిపారు. -
కెపాసిటీ మించింది..విషాదం మిగిల్చింది.
సాక్షి, ఎమ్మిగనూరురూరల్/పెద్దకడుబూరు: కొన్ని నిమిషాల్లో క్షేమంగా ఎమ్మిగనూరుకు చేరుకుంటాం అనుకుంటుండగానే మలుపు రూపంలో మృత్యువు ఆ చిన్నారులను పొట్టన పెట్టుకుంది. ఎమ్మిగనూరు సమీపంలో గురువారం మధ్నాహ్నం జరిగిన ఆటో ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ఎమ్మిగనూరు మండలం కందనాతి గ్రామానికి చెందిన మాల నరసింహులు, ఈరమ్మలకు అశ్విని(10), నందిని, ఉష, పవిత్ర(1) నలుగురు ఆడపిల్లలు. కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు. ఈరమ్మ తన పుట్టినిల్లు కర్ణాటకలోని సిరుగుప్పకు 12 రోజుల కిత్రం వెళ్లారు. గురువారం తన మెట్టినిల్లు కందనాతికి బయలుదేరారు. ఆదోనిలో బస్సు కోసం వేచి ఉండగా టాటా ఏసీ ఆటో ఎమ్మిగనూరుకు వెళ్తుండటంతో అందులో ఎక్కారు. వేగంగా వస్తున్న ఆటో.. నలందా బీఈడీ కాలేజీ మలుపు వద్ద అదుపు తప్పి డోర్ దగ్గర ఉన్న ఆశ్విని(10) కిందపడబోయింది. పక్కనే ఉన్న తల్లిదండ్రులు కుమార్తెను కిందపడకుండా పట్టుకోవటానికి ప్రయత్నించేలోపు మరో చిన్నారి పవిత్ర(1) కింద పడిపోయింది. క్షణాల్లో ఇద్దరు చిన్నారులు రోడ్డుపై పడిపోయారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆటో డ్రైవర్ అందులో ఉన్న వారిని కింద దింపి, గాయపడ్డ వారిని అటుగా వస్తున్న ఆటోలో ఎక్కించి, ఆదోని వైపు పరారయ్యాడు. ప్రమాదం హడావుడిలో ఉండటంతో చూసి తప్పించుకువెళ్లినట్లు తెలుస్తుంది. ఆటోలో కెపాసిటీకి మించి ప్రయాణికులను ఎక్కించుకోవటమే కాకుండా.. పిల్లలకు డబ్బులు ఇవ్వరు అని సీట్లో కూర్చున్న వారిని నిల్చోపెట్టినట్లు బాధితులు చెబుతున్నారు. ఇదే ప్రమాదంలో తల్లి ఈరమ్మకు ఎడమ చెయ్యి విరిగిపోయింది. క్షణాల్లో కళ్లముందే తమ పిల్లలు దుర్మరణం చెందటంతో తల్లిదండ్రులు దుఃఖసారగంలో మునిగిపోయారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో ప్రభుత్వాసుపత్రికి చేరుకున్నారు. పెద్దకడుబూరు ఎస్ఐ అశోక్ ప్రభుత్వాసుపత్రికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును చిన్నారుల తండ్రి నరసింహులను అడిగి తెలుసుకున్నారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తామని, ఆటో డ్రైవర్‌ను పట్టుకుంటామని పేర్కొన్నారు. -
దారికాసిన మృత్యువు
తూర్పుగోదావరి, రంపచోడవరం/నెల్లిపాక: నిరుద్యోగ భృతి అందుతుందని, తమకు కొంత ఆర్థిక చేయూత లభిస్తుందని ఆశపడిన ఆ యువతుల జీవితాలు అర్ధాంతరంగా ముగిసిపోయాయి. రంపచడవరానికి ఏడు కిలోమీటర్లు దూరంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువతులు, ఒక యువకుడు మృతి చెందారు. ఈ రోడ్డు ప్రమాదంలో ఎటపాక మండలం గౌరీదేవీపేటకు చెందిన తానికొండ ప్రవల్లిక (24), తోటపల్లి గ్రామానికి చెందిన సూదిపాక లావణ్య( 24), గన్నవరానికి చెందిన ములిశెట్టి ప్రశాంత్(26) మృతి చెందారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మృతి చెందిన యువతులు యువనేస్తం పథకంలో భాగంగా నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరి సర్టిఫికెట్స్ పరిశీలన కోసం బుధవారం ఉదయం గన్నవరం నుంచి ఆరు గంటలకు ఆటోలో రాజమహేంద్రవరం బయలుదేరారు. వీరితో పాటు గన్నవరానికి చెందిన గంజి వీరబాబు, తోటపల్లి గ్రామానికి చెందిన జి రమేష్ కూడా ఆటోలో రాజమహేంద్రవరం బయలుదేరారు. రంపచోడవరానికి ఏడు కిలోమీటర్ల దూరంలోని సీతపల్లి గుడి సమీపంలో మలుపు వద్ద వీరు ప్రయాణిస్తున్న ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ప్రవళిక, లావణ్య, ప్రశాంత్‌లను ప్రైవేట్ వాహనంలో రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి చేరుకునే సరికే ప్రవళిక, లావణ్యలు మృతి చెందారు. ప్రశాంత్ పరిస్థితి విషమంగా ఉండడంతో 108లో రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మలుపు వద్ద పొంచి ఉన్న మృత్యువు సీతపల్లి పాత రోడ్డు, కొత్త రోడ్డు కలిసే జంక్షన్ వద్ద మృత్యువు పొంచి ఉంది. మంగళవారం రెండు వాహనాలు ఢీకొనడంతో ఎటువంటి ప్రాణనష్టం లేకుండా బయట పడ్డారు. అయితే బుధవారం జరిగిన ప్రమాదంతో ఇదే మలుపులో ముగ్గురు మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. గోకవరం నుంచి ఇసుక లోడ్‌తో వస్తున్న లారీ సీతపల్లి గుడి సమీపంలోని మలుపు వద్ద ఎదురుగా వస్తున్న ఆటో వెనుక భాగాన్ని ఢీకొనడంతో వెనుక సీటులో ఉన్న ముగ్గురి తలలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు రమేష్, వీరబాబులు స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడ్డారు. గ్రామాల్లో విషాదఛాయలు ఎటపాక మండలంలోని మూడు గ్రామాలకు చెందిన యువతులు, యువకుడు మృతి చెందడంతో ఆ గ్రామాల్లో తీవ్ర విషాదం నెలకొంది. నిరుద్యోగ భృతి కోసం వెళుతూ మృత్యువాత పడడంతో వారు తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమవుతున్నారు. ప్రశాంత్ ఆటో నడుపుతూ తన కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండేవాడని తలచుకుని రోదిస్తున్నారు. మృతి చెందిన వారిని ప్రభుత్వపరంగా అదుకోవాలని వైఎస్సార్ సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్ కోరారు. అలాగే రంపచోడవరం ఏరియా మార్చురీలో ఉన్న యువతుల మృతదేహాలను భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య సందర్శించి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. -
పసుపు,కుంకుమ నగదు కోసం వచ్చి పరలోకానికి..
విశాఖపట్నం, పాడేరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పంపిణీ చేసిన పసుపు,కుంకుమ చెక్కులు మార్చుకునేందుకు మహిళలు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. ఈ చెక్కును మార్చుకునేందుకు వెళ్లిన ఓ మహిళ సోమవారం దుర్మరణం చెందింది. వివరాలు ఇలా ఉన్నాయి. పసుపు,కుంకుమ చెక్కులను పాడేరు యూనియన్ బ్యాంకులో తమ ఖాతాలో జమ చేసుకొని, నగదు తీసుకునేందుకు హుకుంపేట మండలం బాకూరు పంచాయతీ గొప్పులపాలెం గ్రామానికి చెందిన పలువురు డ్వాక్రా మహిళలు సోమవారం వచ్చారు. కానీ బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్ సేవలు స్తంభించడం, బ్యాంకులో లింక్ ఫెయిల్ కావడంతో నగదు తీసుకునేందుకు వీలుపడలేదు. దీంతో మహిళలు ఓ ఆటోలో గ్రామానికి తిరుగుముఖం పట్టారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో హుకుంపేట సమీపంలోని రాళ్ళగెడ్డ వంతెన వద్ద ప్రమాదవశాత్తు ఆటో బోల్తా పడింది. ఈ సంఘటనలో గొప్పులపాలెం గ్రామానికి చెందిన సూకురు నీలవేణి(45) అనే మహిళ అక్కడిక్కడే మృతి చెందింది. ఆటోలో ప్రయాణిస్తున్న అదే గ్రామానికి చెందిన చెదల చిలకమ్మ, చెదల బుల్లమ్మలతో పాటు మొత్తం మంది మహిళలు స్వల్పంగా గాయపడ్డారు. వీరంతా పాడేరు ప్రాంతీయ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందారు. పోస్టుమార్టం కోసం నీలవేణి మృతదేహాన్ని పాడేరు ప్రాంతీయ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఆస్పత్రి మార్చురీ వద్ద నీలవేణి కుమార్తె, కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి. మృతి చెందిన డ్వాక్రా మహిళ నీలవేణి భర్త ఏడాది క్రితమే అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో ఆమె కూలిపనులు చేస్తూ కుమార్తె, కుమారుడిని చదివిస్తోంది. ఆటో ప్రమాదంలో ఇప్పుడు తల్లి కూడా మృతి చెందడంతో వారు అనాథలయ్యారు. -
దేవుడా.. ఎంత పనిచేశావయ్యా..?
శింగనమల: అల్లారుముద్దుగా పెంచుకున్న కుమారుడిని ఆటో ప్రమాద రూపంలో మృత్యువు కబళించింది. దేవుడా ఎంత పనిచేశావయ్యా.. అంటూ తల్లి రోదించడం కలచివేసింది. వివరాల్లోకి వెళ్తే.. ఆత్మకూరు మండలం గొరిదిండ్ల ముట్టాలకు చెందిన అక్కులప్ప భార్య సాలమ్మ, కొడుకు శివ(3), కూతురు పల్లవి, బంధువులు మారెక్క, రాములమ్మలతో కలిసి శింగనమల మండలం చిన్నజలాలపురం గ్రామంలోని తన చెల్లెలు రాధమ్మ, మరిది ఆదినారాయణల గృహప్రవేశానికి సోమవారం మధ్యాహ్నం బయలుదేరారు. బస్సులో గార్లదిన్నెకు చేరుకుని, అక్కడి నుంచి చిన్నజలాలపురానికి ఆటోలో బయలుదేరారు. వెస్ట్ నరసాపురం సమీపంలోకి రాగానే కుక్క దూరడంతో ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. సాలమ్మ, పల్లవి, శివలపై ఆటో పడింది. ఈ ఘటనలో శివ అక్కడికక్కడే మృతి చెందాడు. సాలమ్మ, పల్లవిలకు తీవ్ర గాయాలు కాగా, రాములమ్మ, మారెక్క స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆటోలో అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సాలమ్మ, పల్లవిల పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేశారు. -
కొంపముంచిన ఫ్లెక్సీ!
ప్రకాశం , నాగులుప్పలపాడు: పొట్ట చేతబట్టుకొని వాహనాల్లో మైళ్లకొద్దీ ప్రయాణం చేసి కూలీనాలి చేసుకొనే ఆ పేదల బతుకులు క్షణాల్లో తెల్లారాయి. ఫ్లెక్సీ రూపంలో మృత్యువు కబళించింది. ఓ ఫ్లెక్సీ అడ్డుగా ఉండటంతో దారి కనిపించక కూలీల ఆటోను లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో ఇద్దరు మహిళలు చనిపోగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు, స్థానికుల సమాచారం ప్రకారం.. మండలంలోని అమ్మనబ్రోలు రైల్వేస్టేషన్ సమీపంలో ఉన్న ఎస్టీ కాలనీ నుంచి కొందరు కూలీలు పోతవరంలోని రైతుకు మిరప కాయలు కోసేందుకు స్వగ్రామం నుంచే నేరుగా ఆటో మాట్లాడుకొని రోజూ వెళ్లి వస్తున్నారు. ఈ క్రమంలో ఆటోలో డ్రైవర్‌తో పాటు 12 మంది మహిళా కూలీలు మిరపకాయల కోతకు వెళ్తున్నారు. కూలీలతో ఉన్న ఆటో పోతవరం సమీపంలోని సలివేంద్రం కుంటకు వచ్చే సరికి తిమ్మనపాలెం బైపాస్ నుంచి నిడమానూరు మీదుగా వస్తున్న లారీ బలంగా ఢీకొట్టింది. ఆటో రోడ్డు పక్కనే ఉన్న మైలేజ్ రాయిని ఢీకొని రెండు పల్టీలు కొట్టి పక్కనే ఉన్న పొలంలో పడింది. ఆటోలో ఉన్న ఇండ్ల రమణమ్మ (62) తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది. మరో మహిళ పాలపర్తి సుభాషిణమ్మ (60) ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మృతి చెందింది. రోడ్డు పక్కనే ఉన్న ఫ్లెక్సీ చాటుగా ఉండటంతో అటు వైపుగా వెళ్లే వాహనం కనిపించక ప్రమాదం జరిగిందని లారీ డ్రైవర్ పోలీసులతో చెప్పాడు. ఇటీవల కాలంలో అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు నూతన సంవత్సరం సందర్భంగా భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీ కుంట మీద ఏర్పాటు చేయడంతో నిడమానూరు, పోతవరం గ్రామాల వైపు నుంచి వచ్చే వాహనాలు కనిపించడం లేదు. ఇటీవల రెండు మోటారు సైకిళ్లు కూడా ఒకదానికొకటి ఎదురెదురుగా వచ్చి ఢీకొట్టుకున్నాయి. లారీ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆటోలోని కూలీలను స్థానికులు, పోలీసులు రక్షించారు. అనంతరం 108లో రిమ్స్‌కు తరలించారు. పాదర్తి ధనలక్ష్మి, కూచిపూడి కుమారి పరిస్థితి విషమంగా ఉండటంతో వేర్వేరు ప్రైవేట్ ఆస్పత్రులకు తీసుకెళ్లారు. మిగిలిన తొమ్మిది మందికి రిమ్స్‌లో చికిత్స అందిస్తున్నారు. సంఘటన స్థలాన్ని ఒంగోలు రూరల్ సీఐ దుర్గాప్రసాద్, ఎస్ఐ బాజీ నాగేంద్ర ప్రసాద్ పరిశీలించి వివరాలు సేకరించారు. ప్రమాదానికి కారణమైన లారీని పోలీసుస్టేషన్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పోలకంపాడులో రోడ్డు ప్రమాదం
గుంటూరు, తాడేపల్లిరూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని పోలకంపాడులో పాత జాతీయరహదారిపై బుధవారం ఆటో అదుపు తప్పి డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. అదే సమయంలో అటుగా ప్రయాణిస్తున్న ఎమ్మెల్యే ఆర్కే గాయపడిన వ్యక్తిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. సేకరించిన వివరాల ప్రకారం... తాడేపల్లి పట్టణ పరిధి ముగ్గురోడ్డులో నివసించే దర్శపు మోషే విజయవాడ నుంచి తన ఆటోలో ఇంటికి వస్తుండగా, ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోగా ఆటో పల్టీ కొట్టింది. ఆటో నడుపుతున్న మోషే రోడ్డుమీద పడడంతో తలకు తీవ్రంగా గాయమైంది. ఆ సమయంలో ఎమ్మెల్యే ఆర్కే నులకపేటనుంచి తన నివాసానికి వెళ్తుండగా, ప్రమాదం జరగడం చూసి, వెంటనే కారు నిలిపి, గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి పంపేందుకు 108కు సమాచారం ఇచ్చేందుకు ప్రయత్నించారు. అయితే 108 సిబ్బంది ఎవరూ స్పందించలేదు. దీంతో వెంటనే క్షతగాత్రుడిని తన కారులోఎక్కించమని తన సహచరులకు ఆదేశించారు. ఈలోగా గాయపడిన డ్రైవర్ మోషే బంధువులు మరో ఆటోలో రాగా, ఆ ఆటోలో మోషేను వైద్యం నిమిత్తం విజయవాడలోని ఓ కార్పొరేట్ ఆసుపత్రికి తరలించారు. మోషే తలకు తీవ్ర గాయమై రక్త స్రావం జరగడంతో ఆయన పరిస్థితి విషమంగా ఉంది. విషయం తెలుసుకున్న తాడేపల్లి సీఐ బ్రహ్మయ్య సంఘటనా స్థలానికి రాగా ప్రమాదం జరిగిన తీరును ఎమ్మెల్యే ఆర్కే సీఐకు వివరించారు. ప్రభుత్వం 108ను నిర్వీర్యం చేస్తోంది దివంగత నేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి పేద ప్రజల కోసం రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారిని ప్రాణాలతో కాపాడేందుకు ఏర్పాటుచేసిన 108 పథకాన్ని టీడీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని ఎమ్మెల్యే ఆర్కే మండిపడ్డారు. కనీసం సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వకుండా వారి జీవితాలతో ఆడుకుంటోందన్నారు. దివంగత నేత రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎవరు 108కి ఫోన్ చేసినా పది నిమిషాల్లో సంఘటనా స్థలానికి వచ్చి క్షతగాత్రులకు ప్రథమ చికిత్స నిర్వహించి, ఆసుపత్రికి తీసుకువెళ్లేవారని, ఆ విధంగా వేలాదిమంది ప్రాణాలు కాపాడారని, ప్రస్తుత ప్రభుత్వం 108ను నిర్వీర్యంచేసి ప్రజలకు అన్యాయం చేస్తోందన్నారు. జననేత వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అవగానే 108ను పునరుద్ధరించి ప్రజలకు మెరుగైన సేవలు అందించే విధంగా చేస్తామని ఆర్కే అన్నారు. -
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
గుంటూరు, చిలకలూరిపేట: రోడ్డు డివైడర్‌ను ఆటో ఢీకొన్న ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందగా, మూడేళ్ల బాలుడితో పాటు ఆరుగురు తీవ్రంగా గాయపడిన సంఘటన గురువారం పట్టణ పరిధిలోని జాతీయ రహదారిపై జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. యడ్లపాడు మండలం తిమ్మాపురం గ్రామంలోని ఓ స్పిన్నింగ్ మిల్లులో పట్టణానికి చెందిన రహమత్ నగర్, తూర్పు మాలపల్లె, ఎన్టీఆర్ కాలనీ తదితర ప్రాంతాలకు చెందిన వారు రోజు కూలీకి వెళతారు. సాయంత్రం పనులు ముగిశాక సుమారు 10 మంది కార్మికులు ఆటోలో పట్టణంలోని ఇళ్లకు బయలు దేరారు. జాతీయ రహదారిలోని ఏఎంజీ సంస్థ సమీపంలో ఉన్న వ్యవసాయ మార్కెట్ చెక్‌పోస్టు వద్ద వేగంగా వస్తున్న ఆటో అదుపు తప్పి రోడ్డు మధ్య ఉన్న డివైడర్‌ను ఢీకొట్టి పైకి ఎక్కింది. దీం తో ఆటోలో ఉన్న ఎన్టీఆర్ కాలనీకి చెందిన కొరటాల వాణి(55) మృతి చెందగా, నేలపాటి దయమ్మ, గట్టుపల్లి శౌరమ్మ, షేక్ శిలార్బీ, షేక్ మీరాబీ, జి.విజయరాణి, ఆమె కుమారుడైన మూడేళ్ల బాలుడు జి.హర్షవర్థన్‌కు తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిలో నేలపాటి దయమ్మ, గట్టుపల్లి శౌరమ్మ పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని 108 వాహనంలో ప్రభుత్వాసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అనంతరం కొందరిని గుంటూరు జీజీహెచ్‌కు, మరికొందరిని పట్టణంలోని ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు. సమాచారం అందుకున్న అర్బన్ సీఐ జి.శ్రీనివాసరావు, పట్టణ ఎస్ఐ ఎం.ఉమామహేశ్వరరావు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతివేగమే కారణమా? ఆటో అతివేగంగా ప్రయాణించటమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. అయితే మోటార్‌బైక్‌ను తప్పించే క్రమంలో ఆటో డివైడర్‌ను ఢీకొని పైకి ఎక్కటంతో ప్రమాదం జరిగిందని కొందరు చెబుతున్నారు. ఏదిఏమైనా చెక్‌పోస్టు సమీపంలో బ్యారన్ నగర్ వైపు నుంచి వచ్చే వాహనాలు జాతీయ రహదారి పైకి ప్రవేశించేందుకు ఉన్న జంక్షన్లో గతంలోనూ పలు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో జంక్షన్ వద్ద పోలీసులు గతంలోనే ప్రమాద హెచ్చరికలు ఏర్పాటు చేశారు. ఇక్కడ క్రాస్‌రోడ్డు ఉన్నా పట్టించుకోకుండా అతివేగంగా ప్రయాణించటమే పలు ప్రమాదాలకు కారణంగా ఉంటోంది. -
కొంపముంచిన అతివేగం
విజయనగరం, బొబ్బిలి రూరల్: ఓ ఆటో డ్రైవర్ అతివేగం, నిర్లక్ష్యం కారణంగా ఓ బాలిక ప్రాణాలు కోల్పోగా.. మరో బాలిక కోమాలోకి వెళ్లిపోయింది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని లింగంవలస గ్రామానికి చెందిన అలజంగి సునీత (10), మామిడి లావణ్య (18) మరో నలుగురైదుగురు ప్రయాణికులతో కలసి ఆటోలో బొబ్బిలి వెళ్తున్నారు. వీరి ఆటో ముత్తాయవలస జంక్షన్ వద్దకు వచ్చేసరికి డ్రైవర్‌నిర్లక్ష్యంగా నడపడంతో ఇద్దరు బాలికలు రోడ్డుమీద పడిపోయారు. ఈ ప్రమాదంలో సునీత తలకు తీవ్రగాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది. మరో బాలిక మామిడి లావణ్య స్పృహ కోల్పోయింది. వెంటనే స్థానికులు లావణ్యను బొబ్బిలి ఆస్పత్రికి తరలించడంతో ప్రథమ చికిత్స అందించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం విశాఖకు తరలించారు. ఏఎస్సై చదలవాడ సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నేనెలా బతకాలి కొడకా..?
అనంతపురం, గుత్తి: ‘రోజూ నిన్ను చూసి మురిసిపోయేదాన్ని. నీ ముఖం చూశాకే పనుల మీద ధ్యాస పెట్టేదాన్ని. నీ భవిష్యత్ కోసం రోజూ దేవున్ని పూజించేదాన్ని. ఉన్నపళంగా మమ్ములను విడిచి పరలోకాలకు వెళ్లిపోయావు. ఇక నేను ఎలా బతకాలి కొడకా’ అంటూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుమారుడిపై పడి ఆ తల్లి రోదించిన తీరు చూపరులను కంటతడిపెట్టించింది. వివరాల్లోకెళ్తే.. గుత్తి పట్టణంలోని బీసీ కాలనీలో చాకలి రాము, రాజేశ్వరి (రాజీ) దంపతులు నివాసముంటున్నారు. వీరికి కార్తికేయ అనే నాలుగు సంవత్సరాల కుమారుడు ఉన్నాడు. శుక్రవారం వాటర్ క్యాన్ల లోడుతో ఉన్న ఆటో రివర్స్ చేసుకుంటోంది. అదే సమయంలో ఇంటి వద్ద ఆడుకుంటున్న కార్తికేయ ఆటోకింద పడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ సభ్యులు హుటాహుటిన ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే కార్తికేయ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. విగతజీవి అయిన కుమారుడిని తల్లిదండ్రులు రాము, రాజేశ్వరిలు ఎత్తుకుని దిక్కులు పిక్కటిల్లేలా రోదించారు. వారిని ఓదార్చడం ఎవరితరమూ కాలేదు. పోస్టుమార్టం అనంతరం బాలుడి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఆటో డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు సీఐ ప్రభాకర్‌గౌడ్ చెప్పారు. -
ఆశల దీపం ఆరిపోయింది
తాము పడుతున్న కష్టాలను కుమారుడు పడకూడదని భావించి రెక్కలుముక్కలు చేసుకుని చదివిస్తున్న ఆ తల్లిదండ్రులకు చివరకు పుత్రశోకమే మిగిలింది. ఆదుకుంటాడనుకున్న కొడుకు రోడ్డు ప్రమాదం రూపంలో మృతిచెందాడనే పిడుగులాంటి వార్త వినాల్సి రావడంతో బాధిత కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ విషాద ఘటన పాలకొండ మండలం నవగాం చెరువు మలుపు వద్ద ఆదివారం చోటుచేసుకుంది. శ్రీకాకుళం, పాలకొండ/కొత్తూరు: కొత్తూరు మండలం కుంటిబద్ర కాలనీకి చెందిన కానుగ జగన్నాథం, యశోద దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. వీరిలో రెండో సంతానమైన కానుగ చంటి(17) చదువులో చురుకైన వాడు కావడంతో పాలకొండలోని ఎస్సీ బాలుర వసతి గృహంలో ఉంటూ ఇంటర్మీడియెట్ బైపీసీ సెకెండియర్ చదివిస్తున్నారు. ఆర్థిక స్థోమత లేకపోవడం, పిల్లలను ఎలాగైనా ఉన్నత చదువులు చదివించాలనే కోరికతో తల్లిదండ్రులిద్దరూ కూలీలుగా మారి చెన్నై వలస వెళ్లారు. తీరని విషాదం.. చంటి తన తల్లిదండ్రులతో దాదాపు ప్రతిరోజూ ఫోన్లో మాట్లాడుతుండేవాడు. కష్టసుఖాలు తెలుసుకునేవాడు. ఈ క్రమంలోనే ఇటీవల తన తల్లికి ఫోన్ చేసి సంక్రాంతికి తనకు కావాల్సిన వస్తువులన్నీ తీసుకురావాలని కోరాడు. ఆదివారం కళాశాలకు సెలవు కావడంతో పాలకొండ మండలంలోని పొట్లి గ్రామంలో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లేందుకు ఆటో ఎక్కాడు. నవగాం చెరువు వద్దకు వచ్చేసరికి ఆటో బోల్తాపడి పొలాల్లోకి పడిపోయింది. ఈ ఘటనలో చంటి రోడ్డుపైకి తుల్లిపడటంతో తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృత్యువాతపడ్డాడు. ఇదే ఆటోలో ప్రయాణిస్తున్న ఎం.సింగుపురం గ్రామానికి చెందిన కె.నారాయణమ్మ(65), పొట్లి గ్రామానికి చెందిన ఎం.మురళీకృష్ణలకు తీవ్ర గాయాలయ్యయి. వెంటనే స్పందించిన స్థానికులు క్షతగాత్రులను స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం రాజాం కేర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. చంటి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. స్థానిక ఎస్ఐ వాసునారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తల్లడిల్లిన తల్లిదండ్రులు.. కుమారుడి మరణ వార్త విని చంటి తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. చెన్నై నుంచి హుటాహుటిన బయలుదేరి వస్తున్నారు. సంక్రాంతి పండగకి రావాలని కోరిన కుమారుడు తమని ఇలా రప్పిస్తున్నాడంటూ కన్నీమున్నీరుగా రోదిస్తున్నారు. -
చాక్లెట్ కోసం వెళ్లి..
నెల్లూరు , ఆత్మకూరు: నాలుగేళ్ల చిన్నారి రోడ్డుకు అవతల ఉన్న దుకాణంలో చాక్లెట్ కొనుక్కున్నాడు. ఇంటికి వెళ్లేందుకు రోడ్డు దాటుతుండగా వేగంగా వెళుతున్న ఆటో ఢీకొని మృతిచెందాడు. ఈ విషాదకర ఘటన ఆత్మకూరు మండలంలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మండలంలోని అశ్వినీపురం గ్రామానికి చెందిన షేక్ మహ్మద్ షరీఫ్, షహీదాబేగం భార్యాభర్తలు. వీరికి షేక్ రిహాన్ (4), ఒక కుమార్తె ఉన్నారు. షరీఫ్ బతుకుదెరువు కోసం గుజరాత్ రాష్ట్రంలో ఉంటాడు. అతని భార్య పిల్లలను చదివించుకుంటూ గ్రామంలో ఉంటోంది. గురువారం మధ్యాహ్నం రిహాన్ అంగన్వాడీ కేంద్రం నుంచి ఇంటికి వచ్చాడు. చాక్లెట్ కొనుక్కునేందుకు రోడ్డు అవతల ఉన్న దుకాణం వద్దకు వెళ్లాడు. అక్కడి తీసుకుని తిరిగి ఇంటికి వచ్చేందుకు రోడ్డు దాటుతుండగా ఆత్మకూరు నుంచి అనంతసాగరం మండలం ఆమానిచిరువెళ్లకు వెళుతున్న ఆటో వేగంగా రిహాన్ను ఢీకొంది. దీంతో బాలుడు తీవ్రగాయాలపాలై రోడ్డుపై పడిపోయాడు. స్థానికులు గుర్తించి అతడిని చికిత్స కోసం ఆత్మకూరుకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. కొడుకు చనిపోవడంతో షహీదాబేగం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. కేసు నమోదు చేసుకున్న ఆత్మకూరు ఇన్చార్జి ఎస్సై కె.విక్రమ్ దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
కూలీ పనులకు వెళుతూ కానరాని లోకాలకు..
పశ్చిమగోదావరి, చింతలపూడి: చింతలపూడి మండలం తిమ్మిరెడ్డిపల్లి సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందగా మరో 15 మందికి గాయాలయ్యాయి. వీరిలో తీవ్ర గాయాలైన నలుగురిని ఏలూరు తరలించారు. గణిజర్ల గ్రామానికి చెందిన కూలీలు పత్తి చేలో పని నిమిత్తం ట్రాలీ ఆటోలో తిమ్మిరెడ్డిపల్లి గ్రామం బయలుదేరారు. తిమ్మిరెడ్డిపల్లి గ్రామం సమీపానికి రాగానే ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ వీరి ట్రాలీని రాసుకుని వెళ్లడంతో ట్రాలీలో గణిజర్ల గ్రామానికి చెందిన బోయ నాగమణి (26)కు మెడపై బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందగా ట్రాలీలో ఉన్న కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు 108 వాహనంలో చింతలపూడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ట్రాలీలో 30 మందికి పైగా ఉన్నట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. వీరిలో మహిళలు ఎక్కువగా ఉన్నారు. గాయపడిన వారిలో రాయల పచోటి, కొమ్ము సునీత, కొమ్ము జ్యోతి, బొర్రా రెబ్బాకకు బలమైన గాయాలవ్వడంతో మెరుగైన చికిత్స కోసం అంబులెన్స్‌లో ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మిగిలిన వారు చింతలపూడి ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. సీఐ పి.రాజేష్ సంఘటనా స్థలానికి చేరుకుని మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గ్రామస్తులు, బాధితుల కుటుంబ సభ్యులతో ఆసుపత్రి కిక్కిరిసి పోయింది. ఆసుపత్రి కారిడార్, వార్డులు అన్నీ బాధితులు, జనంతో నిండి పోయాయి. ప్రమాదానికి ట్రాక్టర్ ట్రక్కుకు ఉన్న ఆయిల్‌పామ్ గెలులు తరలించడానికి తయారు చేసిన ఇనుప చట్రం కారణమని బాధితులు చెప్పారు. వైఎస్సార్ సీపీ నేతల పరామర్శ ప్రమాద వార్త తెలుసుకున్న వైఎస్సార్ సీపీ ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త కోటగిరి శ్రీధర్, చింతలపూడి నియోజకవర్గ సమన్వయకర్త వీఆర్ ఎలీజా ఆసుపత్రికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. బాధితులను పరామర్శించారు. బాధితులకు న్యాయం చేయాలి డిమాండ్ చేశారు. జీవనం ఎలా..? రెక్కాడితేకాని డొక్కాడని ఆ పేద కూలీలకు ఇప్పుడు పెద్ద కష్టమే వచ్చి పడింది. రోడ్డు ప్రమాదం వల్ల గాయాల పాలవ్వడంతో కుటుంబాలను బతికించుకోవడమెలా అని బాధపడుతున్నారు. తగిలిన దెబ్బలతో కూలి పనులకు వెళ్లే దారిలేక జీవనం ఎలా అని మదన పడుతున్నారు. మరో పది నిమిషాల్లో గమ్య స్థానం చేరుకుంటామనగా రోడ్డు ప్రమాదం జరగడంతో వీరు ఇంకా షాక్ నుంచి తేరుకోలేదు. ప్రభుత్వం తమకు ప్రత్యామ్నాయ ఉపాధిని చూపించాలని కోరుతున్నారు. -
డిగ్రీ విద్యార్థి దుర్మరణం
కర్నూలు, బేతంచెర్ల: పట్టణానికి సమీపంలోని కర్నూలు రహదారిలో మంగళవారం ఆటోను ట్రాక్టర్ ఢీ కొంది. ఈఘటనలో ఓ విద్యార్థి మృతిచెందగా..ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. మండల పరిధిలోని సీతారామాపురం గ్రామం నుంచి వస్తున్న ఆటోలో డ్రైవర్ బ్రహ్మయ్యతో పాటు శంకలాపురం గ్రామానికి చెందిన డిగ్రీ విద్యార్థి హరీష్, పాణ్యంకు చెందిన రామసుబ్బయ్య, భార్య విజయ, కుమార్తె శ్రావణి, కుమారుడు మురళీ, గోరుమానుకొండ తండాకు చెందిన కిరణ్ నాయక్, యమున ఉన్నారు. బేతంచెర్లకు సమీపంలోని అయ్యల చెర్వు వద్ద నాపరాయి పరిశ్రమలో నుంచి ట్రాక్టర్ వచ్చి వెళ్తున్న ఆటోను ఢీ కొంది. ఈ ఘటనలోఆటో బోల్తా పడటంతో విద్యార్థి హరీష్‌కు కాలు విరిగి రక్తగాయలు కాగా రామసుబ్బయ్య, విజయ, శ్రావణి, మురళీ, కిరన్ నాయక్, యమునతో పాటు ఆటో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది బాధితులను చికిత్స నిమిత్తం బేతంచెర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. విద్యార్థి పరిస్థితి విషమంగా ఉండటంతో 108లో కర్నూలుకు తరలిస్తుండగా మార్గ మధ్యలోనే మృతిచెందాడు. శోకసంద్రంలో విద్యార్థి తల్లిదండ్రులు శంకలాపురం గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణ, రామలక్ష్మి దంపతుల ఏకైక కుమారుడు హరీష్ (20) స్థానిక జ్ఞాన సరస్వతీ డిగ్రీ కళాశాలలో బీకాం ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. సెమిష్టర్ పరీక్షలు రాసేందుకు మంగళవారం ఆటో ఎక్కి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. దీంతో విద్యార్థి తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. విషయం తెలుసుకున్న తహసీల్దార్ తులసీనాయక్, సీఐ ఓబులేసు, ఎస్ఐలు ఆర్ సురేష్ , జీఎండీ బాషా సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలు ఆరా తీశారు. గాయాల పాలైన వారిని ఆసుపత్రిలో పరామర్శించారు. మృతిచెందిన విద్యార్థి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సురేష్ తెలిపారు. కాగా తీవ్రగాయాల పాలైన 7 మందిని మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలించారు. -
నిందితులెక్కడ?
తూర్పుగోదావరి, గొల్లప్రోలు: చేబ్రోలులో రోడ్డు ప్రమాద ఘటన జరిగి ఐదు రోజులు గడచినా నేటి వరకు ప్రమాదకారకులను పోలీసులు అదుపులోకి తీసుకోలేదు. చేబ్రోలు శివారు బైపాస్ రోడ్డులో సోమవారం టాటా మేజిక్ వ్యాన్‌ను రాంగ్ రూట్లో వచ్చిన మట్టి లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విశాఖ జిల్లా మాకవారిపాలేనికి చెందిన తొమ్మిది మంది మృతి చెందగా, మరో ఏడుగురు తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన జరిగి ఐదు రోజులు గడచినా నేటి వరకు నిందితులపై చర్యలు తీసుకోలేదు. ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా కూడా ప్రకటించలేదు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించిన ఈ ప్రమాదంపై పోలీసులు స్పందిస్తున్న తీరు అనుమానాస్పదంగా మారింది. పచ్చతమ్ముళ్ల ఒత్తిడి మేరకు పోలీసులు కేసును నీరు గార్చేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. సాక్షాత్తూ జిల్లా ఎస్పీ విశాల్‌గున్ని సంఘటన స్థలాన్ని పరిశీలించి లారీ డ్రైవరు, యజమాని, రోడ్డు నిర్వహణ సక్రమంగా లేదని జాతీయ రహదారి విస్తరణ పనులు చేపట్టిన దిలీప్ బిల్డింగ్ కనస్ట్రక్షన్స్ కంపెనీపై కేసులు నమోదు చేశామని తెలిపారు. కాగా నేటి వరకు ఈ సంఘటనకు సంబంధించి బాధ్యులపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మట్టిమాఫియా బయటపడుతుందనా? ప్రమాదానికి కారణమైన లారీ మట్టి తరలింపు చేపడుతుండగా ప్రమాదం జరిగింది. మట్టి ఎక్కడ నుంచి వస్తుంది? ఎక్కడికి వెళుతోంది? మట్టి తరలించడానికి ఎటువంటి అనుమతులు ఉన్నాయి? అనే విషయాలు బయట పడతాయనే కేసును జాప్యం చేస్తున్నారు. మట్టి మాఫియాలో నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధి సోదరుడు మట్టిమాఫియాలో కీలక పాత్రధారి. చెందుర్తి శివారు పోలవరం కాలువ గట్టు మట్టిని ఇష్టారాజ్యం తవ్వుకుని రియల్ఎస్టేట్ భూములకు విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో పోలవరం కాలువ గట్టు నుంచి చేబ్రోలులోని అడవిపుంత మీదుగా 216 జాతీయరహదారిపై రాంగ్ రూట్లో మట్టి లారీల రవాణా జరిగింది. మట్టి తరలింపు రాంగ్రూట్లో చేపట్టడం వల్లే ప్రమాదం జరిగిందనేది పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. దీనిపై విచారణను పక్కదోవ పట్టించడానికి కుటిల ప్రయత్నాలు జరుగుతున్నాయి. కేసును నీరుగార్చేందుకు జాప్యం కేసును నీరుగార్చేందుకే నిందితులను అదుపులోకి తీసుకోవడంలో జాప్యం జరుగుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి. నిందితులను కాపాడేందుకు పోలీసులపై ఒత్తిడి ఉన్నట్టు అనుమానం బలపడుతోంది. నిందితులంతా టీడీపీ నియోజకవర్గ నాయకుడు అనుచరులు కావడం వల్లే పోలీసులు అరెస్ట్ చేయడానికి వెనుకంజ వేస్తున్నారు. ఇంత పెద్ద ప్రమాదం జరిగినా జిల్లాకు చెందిన హోంశాఖ మంత్రి, ఆర్థికశాఖా మంత్రి గానీ నేటి వరకు స్పందించకపోవడం విచారకరం. ఇతర జిల్లాల్లో ప్రమాదాలు జరిగితే క్యూ కట్టే నాయకులు జిల్లాలో ఇంత పెద్ద ప్రమాదం జరిగినా పట్టించుకోకపోవడం దారుణం. సాయం లేదు..పరామర్శ కరువు ప్రమాదంలో చనిపోయిన, గాయపడిన క్షతగాత్రులకు కనీసం ఎక్స్‌గ్రేషియాను ప్రభుత్వం నేటి వరకు ప్రకటించలేదు. ప్రమాదంలో చనిపోయిన వారందరూ వ్యవసాయకూలీలే. నిరుపేద కుటుంబాలకు చెందిన వారే. కనీసం మృతులు కుటుంబాలను కూడా స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పరామర్శించిన సందర్భాలు లేవు. విచారణ జరుగుతోంది రోడ్డు ప్రమాదం జరిగిన తీరుపై విచారణ జరుగుతోంది. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం. ఒక రోజుల్లో నిందితులను అరెస్ట్ చేస్తాం. బాధ్యులు ఎంతటివారైనా వదిలిపెట్టేది లేదు.– బి.శివకృష్ణ , ఎస్సై , గొల్లప్రోలు -
అమ్మా.. నాన్నేడీ..?
అనంతపురం, గుత్తి: రోడ్డు ప్రమాదంలో ఆటోడ్రైవర్ దుర్మరణం చెందాడు. అమ్మా.. నాన్న ఏడీ అని అమాయకంగా అడుగుతున్న కుమారుడిని చూసి ఆమె గుండెలవిసేలా రోదించింది. ‘చనిపోయిన మీ నాన్నను నేను ఎక్కడికి వెళ్లి తేవాలిరా’ అంటూ గుండెలకు హత్తుకుని విలపించింది. వివరాల్లోకెళ్తే.. లచ్చానపల్లికి చెందిన దానే గాదిలింగ (27) ఆటో డ్రైవర్. మంగళవారం గుత్తి ఆర్ఎస్ నుంచి ప్రయాణికులతో గుత్తికి బయల్దేరాడు. మార్గం మధ్యలో మేదర కాలనీ (కర్నూలు రోడ్డు) స్పీడ్ బ్రేకర్ వద్ద ఎదురుగా వెళ్తున్న బైక్‌ను తప్పించే క్రమంలో అదుపు తప్పి ఆటో బోల్తాపడింది. గాదిలింగ ఎగిరి తన ఆటో కిందనే పడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఆటోలో ఉన్న ఇద్దరు ప్రయాణికులు ఎటువంటి గాయాలు కాకుండా బయటపడ్డారు. ప్రమాద వార్త విని భార్య మల్లేశ్వరి, కుమారుడు ధీరజ్ ఆస్పత్రికి చేరుకుని మృతదేహం మీద పడి కన్నీరు మున్నీరుగా విలపించారు. అమ్మా.. నాన్న ఎక్కడ అంటూ ఆ మూడేళ్ల బాలుడు తల్లిని అడుగుతున్న దృశ్యం చూసి అక్కడున్న వారు కన్నీరు పెట్టారు. ‘మీ నాన్న మనలను వదిలి దేవుని దగ్గరకు వెళ్లాడు నాయనా. మీ నాన్న ఇక రాడు’ అంటూ దిక్కులు పిక్కటిల్లేలా మల్లేశ్వరి రోదించింది. ఆమెను ఓదార్చడం ఎవరికీ సాధ్యం కాలేదు. సంఘటన స్థలాన్ని ఎస్ఐ యువరాజు పరిశీలించి, కేసు నమోదు చేశారు. -
కన్నీటి వీడ్కోలు
అంతవరకూ గుండెలోతుల్లో గూడుకట్టుకున్న బాధ కన్నీళ్లరూపంలో ఎగసిపడింది... దు:ఖాన్ని దిగమింగుకుని అంతవరకూ నిశ్శబ్దంగా లోలోపల కుమిలికుమిలి పోయిన వారు ఒక్కసారిగా ఘొల్లుమన్నారు. విగతజీవులుగా మారిన తమ ఆప్తులను చూసి తట్టుకోలేకపోయారు. దీంతో అక్కడి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. చేబ్రోలు వద్ద సోమవారం జరిగిన ప్రమాదంలో తొమ్మిది మంది దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. ఏడుగురి మృతదేహాలకు మంగళవారం జి.వెంకటాపురంలో సామూహికంగా అంత్యక్రియలు నిర్వహించారు. కడసారి చూపు కోసం వేలాదిగా తరలివచ్చిన వారితో శ్మశానవాటిక కిక్కిరిసి పోయింది. స్థానికులే కాకుండా మండల వ్యాప్తంగా ప్రజలు చేరుకున్నారు. మృతుల బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యుల రోదనలతో శ్మశాన వాటిక మార్మోగింది. విశాఖపట్నం, మాకవరపాలెం(నర్సీపట్నం): కాకినాడలో జరిగిన శుభకార్యానికి వెళ్లి తిరిగివస్తుండగా జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో జి.వెంకటాపురం గ్రామానికి చెందిన సబ్బవరపు నూకరత్నం(35), సబ్బవరపు అచ్చియ్యమ్మ(50), పైల లక్ష్మి(45), సబ్బవరపు మహాలక్ష్మి(54), సబ్బవరపు పైడితల్లి(42), సబ్బవరపు వరహాలు(45), గవిరెడ్డి రాము(40)తోపాటు ఇ.కోడూరుకు చెందిన ఆళ్ల సంతోష్(34) మరణించిన సంగతి తెలిసిందే. వీరి మృత దేహాలకు పిఠాపురంలో మంగళవారం పోస్టుమార్టం నిర్వహించి, మధ్యాహ్నం 3 గంటలకు స్వగ్రామం తీసుకొచ్చారు. మృతదేహాలు పోస్టు మార్టం పూర్తయిన అనంతరం బయలుదేరాయన్న సంగతి తెలుసుకున్న స్థానికులు, కుటుంబ సభ్యులు వేలాదిగా శ్మశాన వాటికకు తరలివచ్చారు. దీంతో శ్మశాన వాటిక కిక్కిరిసిపోయింది. మృతదేహాల వాహనాలు చేరుకోవడంతో ఒక్కసారిగా వారంతా ఈ వాహనాల వద్దకు చేరకుని భోరున విలపించారు. తమ వారి మృతదేహం ఎక్కడ ఉందోనంటూ చూస్తూ వెక్కివెక్కి ఏడ్చారు. అనంతరం ఇక్కడే ఏర్పాటు చేసిన టెంటుల్లోకి ఏడు దేహాలను తీసుకువచ్చి ఉంచారు. దీంతో వాటిని గుర్తించిన కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలకు అవధుల్లేకుండాపోయింది. ఒకే చోట దహనం.. సంప్రదాయబద్ధంగా కార్యక్రమాలు పూర్తి చేసిన అనంతరం ఒకే చోట పేర్చిన చితులపై ఉంచి మృతదేహాలను దహనం చేశారు. ఎన్నడూ ఇలాంటి ఘటనను చూడలేందటూ అందరూ గుండెలవిసేలా రోదించారు. ఈ ప్రాంతంలో ఇలాంటి సంఘటన ఎన్నడూ చూడని ఇక్కడి ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంకా ఈ విషాదం నుంచి కోలుకోలేకపోతున్నారు. శోకసంద్రంలో సబ్బవరపు వీధి.. మాకవరపాలెం(నర్సీపట్నం): స్థానిక సబ్బవరపు వీధి శోకసంద్రంలో మునిగిపోయింది. కాకినాడలో జరిగిన శుభకార్యానికి వెళ్లి తిరిగివస్తూ చేబ్రోలు వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో జి.వెంకటాపురం గ్రామానికి చెందిన ఏడుగురు మహిళలు మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే మృతుల్లో ఒకే ఇంటిపేరుతో ఉన్న సబ్బవరపు వరహాలు, నూకరత్నం, మహాలక్ష్మి, అచ్చియ్యమ్మ, పైడితల్లి ఉన్నారు. వీరంతా ఆ గ్రామంలో ఒకే వీధిలో ఉంటున్నారు. దగ్గర బంధువులు కూడా. నూకరత్నం, పైడితల్లి తోటికోడళ్లు. ఈ ఇంటిలో ఇద్దరు, మిగిలిన ఇళ్లల్లో ఒక్కొక్క మహిళ మరణించడం సబ్బవరపు వారి వీధి వాసులు విషాదంలో మునిగిపోయారు. మాకు దిక్కెవరమ్మా.. మాకవరపాలెం(నర్సీపట్నం): తనకు పుట్టి న కుమార్తెకే కాదు తనను కనిపెంచిన తల్లి దండ్రులు కూడా ఆమె సమానంగా సపర్యలు చేస్తూ సాకుతోంది. పుట్టుకతోనే కుమా ర్తె మానసిక వికలాంగురాలు. తల్లిదండ్రులు కూడా వయసు మీదపడి చివరి క్షణాల్లో ఉండడంతో వారిని కూడా చిన్న పిల్లల్లాగే సాకుతోంది. తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో గవిరెడ్డి రాము మృతి చెందడంతో తమకు దిక్కెవరంటూ అటు ఆమె కుమార్తె, ఇటు తల్లిదండ్రులు రోదిస్తున్నారు. రాముకు 18 ఏళ్ల క్రితం గంగతల్లి జన్మించింది. పుట్టుకతోనే మానసిక వికలాంగురాలు కావడంతో ఏమీ చేసుకోలేని కుమార్తెను అన్నీ తానై చూసుకుంటోంది. ఇక తల్లిదండ్రులు లాలం తాతారావు, కొండమ్మ తనే పోషిస్తోంది. భర్తకు ఒక కన్ను కనిపించక పోవడంతో కూలి పనులే చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ప్రమాదంలో రాము మృతి చెందిందని తెలిసిన వీరంతా ఇక మాకు దిక్కెవరంటూ రోదిస్తున్నారు. రోదనలతో దద్దరిల్లిన ఆస్పత్రి పిఠాపురం: గొల్లప్రోలు మండలం చేబ్రోలు వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన వారిలో ఎనిమిది మృతదేహాలకు మంగళవారం పిఠాపురం ప్రభుత్వాసుపత్రి వైద్యులు విజయశేఖర్, పద్మశ్రీ పోస్టుమార్టం నిర్వహించారు. మృతుల కుటుంబ సభ్యులు మాకవరపాలెం మండలం జి.వెంకటాపురం, భీముకోటపాలెం, జి.కోడూరు గ్రామాల నుంచి పెద్ద ఎత్తున పిఠాపురం ప్రభుత్వాసుపత్రికి చేరుకున్నారు. తమ వారిని కడసారి చూసేందుకు ప్రయత్నించి వారి కోసం కన్నీరుమున్నీరయ్యారు. వారి రోదనలతో ఆస్పత్రి మార్మోగిపోయింది. పోస్టుమార్టం పూర్తయిన వెంటనే అధికారులు మృతదేహాలను వారి బంధువులకు అప్పగించి ప్రత్యేక ప్రభుత్వ వాహనాల్లో వారి స్వగ్రామాలకు పంపించారు. గౌరెడ్డి రాము(35), సబ్బారపు పైడితల్లి (42), సబ్బారపు అచ్చిరాజు(50), పైలాలక్ష్మి (45), సబ్బారపు పాప (30) సబ్బారపు మహాలక్ష్మి(54) వ్యాన్ డ్రైవరు ఆళ్ల సంతోష్ (30) తో పాటు సబ్బారపు వరహాలు(45) మృతదేహాలకు వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. వైఎస్సార్సీపీ నేతల ఓదార్పు : చేబ్రోలు ప్రమాద ఘటనలోని బాధిత కుటుంబీకులను వైఎస్సార్ సీపీ కాకినాడ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కన్నబాబు మంగళవారం పరామర్శించారు. మాజీ మంత్రి కొప్పన మోహనరావుతో కలిసి ఆయన పిఠాపురం ప్రభుత్వాస్పత్రిలో మృతుల కుటుంబ సభ్యులు, బంధువులను ఓదార్చారు. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, జాతీయ కార్యదర్శి విజయసాయిరెడ్డి ఆదేశాల మేరకు బాధితులకు అండగా ఉంటామని, వారిని అన్ని విధాలా ఆదుకుంటామని తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.20 లక్షలు, క్షతగాత్రులకు రూ.పది లక్షల పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. -
ఘొల్లుమన్న జి.వెంకటాపురం
విశాఖపట్నం, మాకవరపాలెం : ఒకే గ్రామంలో ఏడుగురు మరణించడం ఆ కుటుంబాలను ఛిన్నాభిన్నం చేసింది. ఆటోలో ప్రయాణిస్తున్న మహిళలను టిప్పర్ రూపంలో మృత్యువు కబళించడం తీవ్ర విషాదాన్ని నింపింది. శుభకార్యానికి వెళ్లి వస్తున్న వారు తిరిగిరాని లోకాలకు చేరుకోవడంతో జీ వెంకటాపురం గ్రామం గొల్లుమంది. సోమవారం కాకినాడలో గృహ ప్రవేశ కార్యక్రమానికి టాటా మేజిక్ ఆటోలో వెళ్లి వస్తుండగా చేబ్రోలు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో జీ వెంకటాపురం గ్రామానికి చెందిన సబ్బవరపు నూకరత్నం(35), సబ్బవరపు అచ్చియ్యమ్మ(50), పైల లక్ష్మి(45), సబ్బవరపు మహాలక్ష్మి(54), సబ్బవరపు పైడితల్లి(42), సబ్బవరపు వరహాలు(45), గవిరెడ్డి రాము(40)తోపాటు జీ.కోడూరుకు చెందిన ఆళ్ల సంతోష్(34), కోటవురట్ల మండలం కె.వెంకటాపురానికి చెందిన నాగరాజు(42) మృతి చెందడం ఈ రెండు గ్రామాల ప్రజలను కలచివేసింది. కూలి పనులే ఆధారం.. జీ.వెంకటాపురం గ్రామం సమీపంలో నిర్మించిన అన్‌రాక్ రిఫనరీ కోసం ఇక్కడి భూములు సేకరించారు. మృతులంతా ఈ భూ సేకరణలో భూములు కోల్పోయిన వారే. దీంతో పదేళ్లుగా వీరంతా కూలి పనులపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. సబ్బవరపు నూకరత్నం భర్త అప్పనాయుడు తాపీ మేస్త్రీగా పనిచేస్తున్నాడు. తల్లులకు దూరమైన పిల్లలు... ప్రమాదంలో ఒకే గ్రామంలో ఏడుగురు మహిళలు మృతి చెందడంతో వారి పిల్లలు తల్లులకు దూరమయ్యారు. వరహాలమ్మకు ఒక కూతురు, కొడుకు ఉండగా కుమార్తెకు వివాహం చేసింది. ఇక మహాలక్ష్మి భర్త మరణించాడు. ఉన్న ఒక కూతురుకి వివాహం చేసినా ఆమెను భర్త వదిలేయడంతో మహాలక్ష్మి కూలి పనులు చేస్తూ కూతురు, మనుమరాలిని పోషిస్తోంది. పైల లక్ష్మి ఇద్దరు ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేసింది. అచ్చియ్యమ్మ ఒక కూతురికి వివాహం చేసింది. కొడుకు చిన్న ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటున్నాడు. గవిరెడ్డి రాముకు ఒక కొడుకు, కూతురు ఉన్నారు. కూతురు వికలాంగురాలు, రాము వృద్ధ తల్లిదండ్రులు కూడా ఈమె వద్దే ఉంటున్నారు. ఇక వీరి బాగోగులు చూసుకునే వారెవరంటూ స్థానికులు కన్నీరు పెట్టుకుంటున్నారు. పైడితల్లికి కూతురికి వివాహం చేయగా, కొడుకు చదువుకుంటున్నాడు. వారికి దిక్కెవరో... ఆటో డ్రైవర్‌కు భార్య, ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయిన ఈ చిన్నారులకు దిక్కెవరోనని స్థానికులు కన్నీటిపర్వంతమయ్యారు. నూకరత్నంకు కూడా ఇద్దరు అమ్మాయిలు, ఒక బాబు ఉన్నారు. వీరు చదువుకుంటున్నారు. వీరు కూడా తల్లిలేని పిల్లలయ్యారు. దీంతో గ్రామస్థులంతా మృతుల ఇళ్ల వద్దకు చేరుకుని విలపించారు. తల్లులను కోల్పోయిన పిల్లలను ఓదార్చారు. మృతదేహాలు ఎప్పుడు గ్రామానికి చేరుకుంటాయోనని ఎదరుచూస్తున్నారు. -
టిప్పర్ లారీ రూపంలో దూసుకొచ్చిన మృత్యువు
విశాఖపట్నం, పిఠాపురం, గొల్లప్రోలు: ‘‘మా ఇంటి వీరభద్రుని సంబరం.. మీరందరూ తప్పని సరిగా రావాలి’’ అని చెప్పగానే వారందరూ ఎంతో సంతోషపడ్డారు. ఓ వాహనాన్ని పురమాయించుకుని మరీ బయల్దేరారు. ఇక బంధువుల ఇంట సంబరం వేడుకలో ఆనందంగా గడిపారు. భోజనాలు పూర్తి చేసుకుని వెళ్లొస్తామంటూ వీడ్కోలు చెప్పారు. అయితే అవే వారి చివరి వీడ్కోలని ఎవరూ ఊహించలేదు. వేగంగా దూసుకొచ్చిన టిప్పర్ లారీ వారు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఆరుగురు మృతి చెందగా.. తీవ్రంగా గాయపడిన ఇద్దరు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మరో ఇద్దరు మరణించారు. మరో ఎనిమిది మంది గాయాలతో ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నారు. తీవ్ర విషాదాన్ని నింపిన ఈ ఘటన గొల్లప్రోలు మండలం చేబ్రోలు కోటలంక చెరువు దగ్గర కొత్తగా నిర్మించిన 216 హైవే బైపాస్‌లో సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు జరిగింది. కాకినాడకు చెందిన కె.అప్పారావుకు విశాఖ జిల్లా మాకవరపాలెం మండలం జి.వెంకటాపురానికి చెందిన సత్యవతితో వివాహమైంది. వారు కాకినాడలో ఉంటున్నారు. రెండు రోజుల క్రితం నూతన గృహ ప్రవేశం చేసుకున్నారు. అప్పారావు తన భార్య తరఫు బంధువులను శుభకార్యానికి భోజనాలకు పిలిచారు. దీంతో ఆమె బంధువులు 18 మంది టాటా మేజిక్ వాహనాన్ని పురమాయించుకుని అక్కడి నుంచి బయల్దేరి కాకినాడ చేరుకున్నారు. వీరందరూ కూలీలే. చాలా కాలం తర్వాత తమ ఇంటి ఆడపడుచును చూస్తున్నామనే సంతోషంలో వారందరూ ఉన్నారు. వీరభద్రుని సంబరాన్ని తిలకించారు. భోజనాలు కూడా పూర్తి చేశారు. కార్యక్రమం పూర్తయిన అనంతరం 16 మంది తిరిగి అదే వాహనంలో బయల్దేరారు. వారు వెళుతున్న వాహనాన్ని సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు గొల్లప్రోలు మండలం చేబ్రోలు కోటలంక చెరువు దగ్గర కొత్తగా నిర్మించిన 216 హైవే బైపాస్‌లో ఓ టిప్పర్ ఢీకొట్టింది. మట్టి లోడుతో వెళుతున్న ఈ టిప్పర్ రాంగ్రూట్లో అతివేగంగా వచ్చి అదే దారిలో వెళుతున్న మేజిక్ వ్యాన్‌ను ఢీకొట్టడంతో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఇద్దరు ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు విడిచారు. మరో ఎనిమిది మంది తీవ్రగాయాలపాలయ్యారు. ఆ ఇద్దరూ మృత్యుంజయులు బంధువుల ఇంటికి వ్యాన్‌లో బయలు దేరింది 18 మంది అయితే కాకినాడలో బంధువుల ఇంటి వద్ద కార్యక్రమం పూర్తయ్యాక బయల్దేరిన వారు 16 మందే. మిగిలిన ఇద్దరూ తాము కాకినాడలో ఉన్న తమ బంధువుల ఇంటికి వెళుతున్నామని చెప్పి వారు ఆగిపోయారు. ఆ ఇద్దరు అక్కడ ఆగకుండా వ్యాన్‌లో ఎక్కి ఉంటే వారు కూడా ప్రమాదానికి గురయ్యేవారని క్షతగాత్రులు చెబుతున్నారు. కదిలిన పోలీసు యంత్రాంగం కాకినాడ డీఎస్పీ రవి వర్మ, పిఠాపురం సీఐ అప్పారావు, పిఠాపురం పట్టణ, గొల్లప్రోలు, పిఠాపురం రూరల్, కొత్తపల్లి ఎస్సైలు శోభన్‌కుమార్, శివకృష్ణ, మూర్తి, కృష్ణమాచారి ఇతర పోలీసు సిబ్బంది క్షతగాత్రులను తమ పోలీసు వాహనాలలో పిఠాపురం ఆస్పత్రికి తరలించి అనంతరం 108 వాహనాల్లో కాకినాడ తరలించారు. జిల్లా ఎస్పీ విశాల్‌గున్ని సంఘటన స్థలాన్ని పరిశీలించి 216 జాతీయ రహదారి కాంట్రాక్ట సంస్థపై కేసు నమోదు చేయాలని స్థానిక పోలీసులను ఆదేశించారు. ఎస్బీ డీఎస్పీ మురళీమోహన్, త్రీటౌన్ సీఐ దుర్గారావుతో పాటు డీటీసీ సిరి ఆనంద్ సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఇలా వచ్చి.. అలా మృత్యుఒడికి! కాకినాడ: ఇంట్లో జరిగే వేడుకకు పది మందిని పిలిచి ఎంతో సంతోషంతో ఉన్న ఆ కుటుంబానికి ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. నిమిషాల వ్యవధిలోనే తమ ఇంట జరిగిన శుభకార్యక్రమానికి వచ్చివారు మృత్యు ఒడికి చేరారన్న సమాచారం ఆ ఇంటిలో పెనువిషాదాన్ని నింపింది. గొల్లప్రోలు మండలం చేబ్రోలు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది దుర్మరణం పాలైన ఘటన కాకినాడ డ్రైవర్స్ కాలనీలోని కుంచే అప్పారావు కుటుంబ సభ్యులను శోకసంద్రంలో ముంచింది. అప్పారావు కొత్తగా నిర్మించుకున్న ఇంటిని రెండు రోజుల క్రితం గృహప్రవేశం చేసుకున్నారు. సోమవారం వీరభద్రుని సంబరం, భోజనాలు ఏర్పాటు చేసుకుని కొంత మంది బంధువులను పిలుచుకున్నారు. ఇందు కోసం తన అత్తగారి వైపు బంధువులైన విశాఖ జిల్లా నర్సీపట్నం సమీపంలోని జి.వెంకటాపురం ప్రాంతానికి చెందిన వారిని ఆహ్వానించారు. వారందరూ ఉదయం 10.30 గంటల సమయంలో కాకినాడ చేరుకుని పట్టుమని అర్ధగంట కూడా గడవకముందే అంతే వేగంగా తిరుగు ప్రయాణమై.. గమ్యం చేరకుండా మృత్యుఒడికి చేరారన్న సమాచారం ఆ ఇంట ఆవేదనను మిగిల్చింది. వచ్చినంత వేగంగా తిరుగు ప్రయాణమై మృత్యుఒడికి చేరారంటూ కుంచే అప్పారావు ‘సాక్షి’ వద్ద తన ఆవేదన వెళ్లగక్కారు. ఇదే వాహనంలో వెళ్లాల్సిన మరో ఇద్దరు ఇక్కడ ఉన్న బంధువుల ఇళ్లకు వెళ్లాలనే ఉద్దేశంతో ఆ వాహనంలో ప్రయాణించకపోవడంతో వారు ప్రమాదం నుంచి బయటపడ్డారని బంధువులు చెబుతున్నారు. -
చిన్నారి నిండు ప్రాణన్ని బలిగొన్న ఆటో
-
షికా గోయల్ కారుకు ప్రమాదం
బంజారాహిల్స్: వేగంగా దూసుకు వచ్చిన ఓ ఆటోవాలా ఐపీఎస్ అధికారిణి కారును ఢీకొట్టిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి... బుధవారం ఉదయం ఐపీఎస్ అధికారిణి షికా గోయల్ జూబ్లీహిల్స్ రోడ్ నెం. 10లోని తన నివాసం నుంచి కార్యాలయానికి వెళ్తుండగా బోరబండ వైపు నుంచి వేగంగా వచ్చిన ఆటోవాలా కారును ఢీకొనడంతో కారు ధ్వంసమైంది. షికాగోయల్ డ్రైవర్ హన్మంతు ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. నిందితుడిని బోరబండ కమలానగర్‌కు చెందిన ఆటో డ్రైవర్ శ్రీకాంత్‌గా గుర్తించారు. తన తండ్రి ఆటోను లైసెన్స్ లేకుండానే నడిపిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. శ్రీకాంత్‌పై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆటోను స్వాధీనం చేసుకున్నారు. -
ప్రాణం తీసిన అతివేగం
‘తెలవారుతోంది. మార్కెట్ మొదలైపోయుంటుంది. సమయానికి సరుకు అందించాలి.. లేకపోతే సరుకంతా నిలిచి నష్టమొస్తుంది’ అని మార్కెట్‌కు తొందరగా చేరుకోవాలని లగేజీ ఆటో వేగం పెంచాడు. అదుపుతప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొన్నాడు. మితిమీరిన వేగం ఆ డ్రైవర్ బతుకు తెల్లారిపోయేలా చేసింది. గుంతకల్లు: గుంతకల్లు పట్టణ శివార్లలోని వేర్‌హౌస్ వద్ద శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటోడ్రైవర్ దుర్మరణం చెందాడు. ఈ ఘటనలోనే మరొకరు తీవ్రంగా గాయపడ్డాడు. వివరాలు ఇలా ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గలోని మారుతీనగర్ నివాసి చాంద్‌పీరా (43) లగేజ్ ఆటో డ్రైవర్. చిత్రదుర్గలో పండిన పచ్చి మిరపను గుత్తి మార్కెట్‌యార్డుకు తరలించడానికి అర్ధరాత్రి 2.00 గంటల ప్రాంతంలో బయలుదేరాడు. సకాలంలో మార్కెట్‌కు చేరుకోవాలన్న ఆతృతతో ఆటో వేగాన్ని పెంచాడు. నెల్లూరు – అంకోలా జాతీయ రహదారిలో నాలుగు రోడ్ల పనులు జరుగుతున్న దృష్ట్యా వన్‌వేలో వాహన రాకపోకలు సాగుతున్నాయి. చాంద్‌పీరా అతి వేగంతో గుంతకల్లు నుంచి వస్తున్న లారీని బళ్లారి రోడ్డులోని వేర్‌హౌస్ వద్ద బలంగా ఢీకొన్నాడు. ఈ ఘటనలో లగేజ్ ఆటో ముందు భాగం నుజ్జునుజ్జు అయి స్టీరింగ్ చక్రం మెడకు చుట్టుకొని ఊపిరాడక అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. లారీడ్రైవర్ మహమ్మద్ ఇక్బాల్ (గుంతకల్లు) తలకు తీవ్రమైన గాయాలై ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. రోడ్డు ప్రమాదం జరిగిన ప్రాంతం వజ్రకరూరు పరిధిలోకి రావడంతో వజ్రకరూరు ఎస్ఐ ఇబ్రహీం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు చాంద్‌పీరా భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. -
అత్తా, కోడలు మృతి
గూడూరు రూరల్: మోకాళ్ల నొప్పులు, కంటి చూపు లోపించడంతో మహానందిలో నాటు వైద్యం చేయించుకునేందుకు ఆటో వెళ్తూ అత్తా బోయ ఉసేనమ్మ(70), కోడలు బోయ లక్ష్మిదేవి(45), మృతి చెందారు. మండల పరిధిలోని చనుగొండ్ల గ్రామానికి చెందిన ఉసేనమ్మకు ఇద్దరు కూతుళ్లు, ముగ్గురు కుమారులు. కాగా అందరికి పెళ్లిళ్లు చేసి కుమారుల వద్ద జీవనం సాగిస్తోంది. లక్ష్మిదేవికి ముగ్గురు కూతుళ్లు, ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడైన అన్నమయ్యకు వివాహం కాలేదు. లక్ష్మిదేవి భర్త వెంకటేష్‌తో కలిసి స్థానిక బస్టాండ్ సమీపంలో టీ హోటల్ పెట్టుకుని జీవనం సాగిస్తోంది. కొంత కాలంగా మోకాళ్ల నొప్పులతో లక్ష్మిదేవి, కంటి చూపు సమస్యతో ఉసేనమ్మ బాధపడుతున్నారు. నాటు మందు ద్వారా వ్యాధులను బాగు చేసుకునేందు కు గానూ మూడు వారాలుగా మహానందికి వెళ్తున్నారు. ఆదివారం నాటు మందు వేయించుకునేందుకు ఉసేనమ్మ, లక్ష్మిదేవితో పాటు పెద్ద కొడుకు అశోక్, బంధువులు సరోజ, మద్దిలేటి, వై.ఖానాపు రం భగవంతులు ఆటోలో బయలుదేరి సోమయాజుల పల్లె వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో చను గొండ్లకు చెందిన అత్తా, కోడలు మృతి చెందగా అదే గ్రామానికి చెందిన భార్య, భర్తలు సరోజ, మద్దిలేటి, మృతురాలు లక్ష్మిదేవి కుమారుడు అశోక్, భగవంతులు గాయాలపాలయ్యారు. -
కుప్ప కూలిన బతుకులు
వారు రెక్కాడితే గాని డొక్కాడని బడుగు జీవులు. కూలి పనులే వారికి ఉపాధి. పొట్ట కూటి కోసం ఉపాధి పనులకు వెళ్లి తిరుగు పయనం కాగా.. వారు ప్రయాణిస్తున్న ఆటో బోల్తా పడటంతో ఇద్దరు కూలీలు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. మరో 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. బి.కోడూరు : బి.కోడూరు మండలం మేకవారిపల్లె గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన సుమారు 20 మంది ఉపాధి కూలీలు ఉపాధి పనులకు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరో 10 నిమిషాల్లో ఇళ్లు చేరతామనుకుంటున్న సమయంలో శ్రీరామ్‌నగర్ గ్రామ సమీపంలో ఆటో అదుపు తప్పింది. ఈ ప్రమాదంలో పందీటి వెంకటసుబ్బమ్మ (48), పందీటి ఆదిలక్షుమ్మ (28) అనే మహిళలపై ఆటో బోల్తాపడటంతో తీవ్ర గాయాలయ్యాయి. వీరిని బద్వేలులోని ప్రభుత్వాసుత్రికి తీసుకెళ్లగా అప్పటికే వెంకటసుబ్బమ్మ మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆదిలక్షుమ్మను మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. ఆదిలక్షుమ్మకు భర్త ఓబులేసు, అవినాష్ (4), అఖిల్ (2), లక్ష్మి (3 నెలలు) పిల్లలు ఉన్నారు. తల్లి మృతితో పిల్లలు అనాథలుగా మారారు. ఈ ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన లక్కినేని శేఖర్ అనే వ్యక్తికి కాలు విరిగిపోగా, పందీటి అచ్చమ్మకు తలకు తీవ్ర గాయమైంది. లక్కినేని లలితమ్మకు నడుం భాగం, తలకు తీవ్ర గాయాలు కాగా నాగిపోగు పోలమ్మ, లక్కినేని నారాయణమ్మ, పందీటి ఓబులమ్మ, పందీటి రాజా, అట్లూరు గోపాలయ్య, పందీటి చిన్నయ్య, నాగిపోగు గుర్రమ్మ, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరందరిని కడప రిమ్స్‌కు తరలించారు. వీరిలో నాగిపోగు పోలమ్మ, అట్లూరు గోపాలయ్యల పరిస్థితి విషమంగా ఉండటంతో తిరుపతికి రెఫర్ చేశారు. మృతులు, క్షతగాత్రులు అంతా ఒకే గ్రామానికి చెందిన వారు కావడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎంపీడీఓ మల్లన్న, మండల తహసీల్దారు దుగ్గిరెడ్డి, ఏపీఓ నాగిరెడ్డి, బి.కోడూరు ఎస్ఐ బాలమద్దిలేటిలు సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులను వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ వెంకటసుబ్బయ్య, మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, ఎమ్మెల్యే జయరాములు, వైవీయూ పాలకమండలి సభ్యురాలు విజయజ్యోతి, డ్వామా పీడీ హరిహరనాథ్, జెడ్పీటీసీ రామకృష్ణారెడ్డి, మాజీ సర్పంచు బోరెడ్డి శేషారెడ్డి, నాయకులు బోడి రమణారెడ్డి, రామచంద్రారెడ్డి, మున్నెల్లి సర్పంచు ఓ.రమణారెడ్డిలు పరామర్శించి మృతిచెందిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ మేరకు బి.కోడూరు ఎస్ఐ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రెండు గంటలు ఆలస్యంగా వచ్చిన 108 వాహనం ప్రమాదం జరిగిన వెంటనే 108 వాహనానికి సమాచారం ఇచ్చినా సరైన సమయంలో అంబులెన్స్ రాలేదు. దీంతో క్షతగాత్రులంతా రోడ్డుపై అలాగే పడిపోయి ఉన్నారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రైవేటు వాహనాలలో కొంత మందిని బద్వేలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సకాలంలో అంబులెన్స్ వచ్చి ఉంటే వెంకటసుబ్బమ్మ, ఆదిలక్షుమ్మలు మృతిచెంది ఉండేవారు కాదని గ్రామస్తులు పేర్కొన్నారు. -
బావమరిది పెళ్లిచూపులకు వెళుతూ మృత్యుఒడిలోకి
నెల్లూరు, సంగం: ముందు వెళుతున్న ఆటోను వెనుకనుంచి మరో ఆటో ఢీకొనడంతో వ్యక్తి మృతిచెందిన ఘటన మండల కేంద్రమైన సంగం గురుకుల కళాశాల సమీపంలోని ఎర్రచెరువు వద్ద బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికుల, పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. దగదర్తి మండలం చెన్నూరుకు చెందిన చింతపండు రవి (35) స్థానికంగా కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. రవి భార్య చెంచమ్మ తమ్ముడు చెంచయ్యకు ఏఎస్‌పేట మండలం శ్రీకొలనులో పెళ్లి సంబంధం చూశారు. ఈ పనిపై అక్కడికి వెళ్లేందుకు రవి, చెంచమ్మ ఇద్దరు పిల్లలతో చెన్నూరు నుంచి బుచ్చిరెడ్డిపాళెంకు వచ్చి అక్కడి నుంచి ఆటోలో శ్రీకొలనుకు బయలుదేరారు. ఆటో సంగం ఎర్రచెరువు సమీపంలోకి వచ్చే సరికి వెనుక నుంచి టాటా ఏస్ వాహనం ఢీకొట్టింది. ప్రయాణికులతో వెళుతున్న ఆటో ఎర్రచెరువులో నాలుగు ఫల్టీలు కొట్టింది. దీంతో చింతపండు రవి అక్కడికక్కడే మృతిచెందాడు. భార్య చెంచమ్మ, ఇద్దరు పిల్లలు, తోటి ప్రయాణికులు కనుపూరు గురుదేవి, లక్ష్మమ్మలు సైతం తీవ్రంగా గాయపడ్డారు. కాగా మద్యం సేవించి ఉన్న టాటా ఏస్ డ్రైవర్ వాహనాన్ని వదిలి పరారయ్యాడు. మృత్యువాత పడిన భర్తను చూసి చెంచమ్మ గుండెలవిసేలా విలపిం చింది. సంగం పోలీసులు రవి మృతదేహాన్ని బుచ్చి రెడ్డిపాళెం మార్చురీకి తరలించి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కనికరం లేని సర్కారిది
అది ఘోరమైన ప్రమాదం.. ఆటోలో ప్రయాణిస్తున్న ముక్కుపచ్చలారని చిన్నారులతో సహా 11మందిని బావి మింగేసింది. బాధిత కుటుంబాలను తీవ్ర విషాదంలోకి నెట్టేసింది. ఏమిచ్చిన వారి బాధను తగ్గించలేని పరిస్థితి. ప్రభుత్వం కూడా వారికి కొద్దిపాటి సాయం చేసి చేతులు దులుపుకుంది. మోర్తాడ్(బాల్కొండ): మెండోరా శివారులోని వ్యవసాయ బావిలోకి ఆటో దూసుకెళ్లిన సంఘటనలో మరణించిన వారి కు టుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించడంలో ప్రభు త్వం మొండిచేయి చూపిస్తోంది. బావిలోకి ఆటో దూ సుకెళ్లిన సంఘటన పక్షం రోజుల కింద చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనతో పలు కుటుంబాల్లో విషాదం నిండింది. అయితే ఇదే తరహాలో నల్లగొండ జిల్లాలో ఒ క ట్రాక్టర్ కాలువలో పడిపోగా తొమ్మిది మరణించా రు. మరణించిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2లక్షల చొప్పున ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. మెండోరా దుర్ఘటనకు, నల్గొండలో చోటు చేసుకున్న సంఘటనకు పోలికలు లేకపోయినా పరిహారం విషయంలో మాత్రం ఎంతో తేడా ఉంది. మెండోరా సంఘటనలో.. మెండోర దుర్ఘటనలో 11 మంది మరణించగా అం దులో ఐదుగురు పెద్దవారు కాగా ఆరుగురు పసివాళ్లున్నారు. ఐదుగురు పెద్దవారి కుటుంబ సభ్యులకు జిల్లా అధికార యంత్రాంగం రూ.50వేల చొప్పున ఆపద్బందు పథకం ద్వారా ఆర్థిక సహాయం అందించింది. నల్గొండలో ట్రాక్టర్ నీట మునిగి మరణించిన వారి కుటుంబాలకు మాత్రం ప్రభుత్వం రూ.2లక్షల చొప్పున పరిహారం అందించడం గమనార్హం. ఒకే విధమైన సంఘటన వేరు వేరు జిల్లాల్లో చోటు చేసుకోగా పరిహారం అందించే విషయంలో ప్రభుత్వం తేడాలు చూపడంపై బాధిత కుటుంబాలు కుమిలిపోతున్నాయి. ఇది ఇలా ఉండగా మెండోరా ఘటనలో చిట్టాపూర్‌కు చెందిన రోజా అనే మహిళ తన ఇద్దరు పిల్లలతో సహా మరణించింది. అలాగే ఇదే సంఘటనలో తన బావ కూతురిని కూడా కోల్పోయింది. అయితే రోజా భర్తకు కేవలం రూ.50వేల ఆపద్బందు పథకం చెక్కును మాత్రమే అందించారు. సాధారణంగా పెద్ద పెద్ద ప్రమాదాల్లో ఎక్కువ మంది మరణిస్తే ప్రభుత్వం బాధిత కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియాను ప్రకటిస్తుంది. ప్రజాప్రతినిధులూ స్పందించలేదు.. మన జిల్లాలో చోటు చేసుకున్న సంఘటనపై ప్రభు త్వం స్పందించకపోగా ప్రజాప్రతినిధులు కూడా బా ధిత కుటుంబాల వైపు నిలిచి ప్రభుత్వం నుంచి పరిహారం అందించలేక పోయారు. ఆపద్బందుతోనే చే తులు దులుపుకోవడంపై సర్వాత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆటో బావిలోకి దూసుకెళ్లిన ఘటన లో మరణించిన వారంతో పేద, మధ్య తరగతి కు టుంబాలకు చెందినవారే ఉన్నారు. ఆపద్బంధు రెగ్యులర్ పథకమే.. ఆపద్బంధు పథకం కింద మృతుల కుటుంబాలకు రూ.50వేల చొప్పున ఆర్థిక సహాయంను మంజూరు చేయడం సాధారణ విషయం అని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర బీమా సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిఏటా కొంత సొమ్మును ప్రీమియంగా చెల్లిస్తుంది. ప్రభుత్వం స్పందించి మెండోరా ఘటనలో మృతి చెందిన కుటుంబాలను ఆదుకోవడానికి నిధులు కేటాయించాలని బంధువులు కోరుతున్నారు. -
విద్యార్థులకు గాయాలు
మనూరు(నారాయణఖేడ్): మనూరు మండల పరిధిలోని శెల్గిరా మోడ్ వద్ద బుధవారం ఆటోపల్టీ కొట్టడంతో ముగ్గురు పదోతరగతి విద్యార్థులు తీవ్ర గాయాల పాలయ్యారు. విద్యార్థులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని బోరంచ, తుమ్నూర్‌కు చెందిన పదోతరగతి విద్యార్థులు శెల్గిరాలో చివరి పరీక్ష రాసి ఆటోలో ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు. ఆటోను స్థా«నిక మోడ్ వద్ద ఎదురుగా వస్తున్న ఓ బైక్ ఢీట్టింది. దీంతో ఆటో పల్టీ కొట్టింది. ప్రమాద సమయంలో ఆటోలో తొమ్మిది మంది విద్యార్థులు ఉండగా, అందులో తుమ్నూర్‌కు చెందిన రాకేశ్, మౌనిక, బోరంచకు చెందిన అపర్ణకు తీవ్ర గాయాల పాలయ్యారు. వీరిని నారాయణఖేడ్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. విద్యార్థులను బోరంచ హెచ్ఎం నూరందయ్య, ఉపాధ్యాయులు పరామర్శించారు. -
లోయలో పడ్డ ఆటో..
టేకులపల్లి : ఎదురుగా వచ్చిన పశువులను తప్పించబోయి కల్వర్టు లోయలో ఆటో పడిన సంఘటన సోమవారం మండలంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం మండలంలోని బోడు పంచాయతీ ఎర్రాయిగూడేనికి చెందిన ఎనిమిది మంది కుటుంబ సభ్యులు సోమవారం రోళ్లపాడు వెళ్లేందుకు ఆటోలో బయలుదేరారు. సామ్యాతండా సమీపంలోకి రాగానే ఒక్కసారిగా ఎదురుగా కొన్ని ఎడ్లు పొడుచుకుంటూ ఆటో మీదకు దూసుకొచ్చాయి. దీంతో అదుపు తప్పిన ఆటో కల్వర్టు లోయలో బోల్తా పడింది. ఆటోలో ప్రయాణిస్తున్న ఊకే అశ్విని అనే యువతి స్పృహ కోల్పోయింది. వెంటనే స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స అనంతరం యువతి కోలుకుంది. మిగిలిన ప్రయాణికులు కోటేశ్వరరావు, సునీత, అపర్ణ, ఇద్దరు చిన్నారులు ప్రాణాపాయం నుంచి బయట పడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి రక్షణ చర్యలు చేపట్టారు. లోయలో పడిన వారిని బయటకు తీసుకువచ్చారు. -
నిజామాబాద్‌లో మరో ఆటో ప్రమాదం
సాక్షి, నిజమాబాద్: ఆటో బావిలో పడి 11 మంది దుర్మరణం చెందిన ఘటనను మరువకముందే నిజామాబాద్‌లో మరో ఆటో ప్రమాదం జరిగింది. ఆర్మూర్‌లోని సిద్దుల గుట్ట ఘాట్ రోడ్డుపై సోమవారం ఉదయం ఓ ఆటో అదుపు తప్పి పడిపోవడంతో నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆర్మూర్ ఆసుపత్రికి తరలించారు. కాగా అతి వేగమే ఆటో బోల్తాకు కారణమని స్థానికులు అంటున్నారు. గాయపడినవారిలో నిజామాబాద్ జిల్లా అంకాపూర్‌కు చెందిన సువర్ణ, మామిడిపల్లికి చెందిన వెంకట్ స్వామి ఉన్నారు. -
పరీక్ష రాసేందుకు వెళుతూ..
గండేపల్లి(జగ్గంపేట): పదో తరగతి పరీక్ష రాసేందుకు వెళుతున్న ఆటోలో వెళుతున్న విద్యార్థులు ప్రమాదబారిన పడ్డారు. రాంగ్రూట్లో వస్తున్న వాహనాన్ని తప్పించబోయే ప్రయత్నంలో ఆటో అదుపుతప్పి బోల్తాకొట్టడంతో ఆటోలో ఉన్న విద్యార్థులు తీవ్రగాయాలపాలయ్యారు. ఎస్సై దుర్గాశ్రీనివాస్ కథనం ప్రకారం.. సోమవారం మండలంలోని ఉప్పలపాడు గ్రామానికి చెందిన మల్లేపల్లి హైస్కూల్ విద్యార్థులు 12 మంది గండేపల్లిలో హైస్కూల్ పరీక్ష కేంద్రంలో పరీక్ష రాసేందుకు ఆటోలో వెళుతున్నారు. గండేపల్లి శివారున రాయి చెరువు ఎదురుగా(సోమా కంపెనీ) సమీపంలోకి వచ్చేసరికి గండేపల్లిలో రైస్‌మిల్లుకు చెందిన బొలెరో(మినీ వాహనం) రాంగ్రూట్లో వస్తోంది. దీంతో విద్యార్థులతో ప్రయాణిస్తున్న ఆటో బొలెరాను తప్పించే ప్రయత్నంలో అదుపు తప్పి బోల్తాకొట్టింది. ఈ ప్రమాదంలో కె.వీరదుర్గలక్ష్మి, జి.వీరలక్ష్మి, షేక్ దేవి, ఎం.దేవిలకు తీవ్రంగా, మిగిలిన విద్యార్థులకు స్వల్పంగా గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఇతర ప్రయాణికులు, స్థానికుల సహాయంతో పోలీసులు ఆటోలో చిక్కుకున్న విద్యార్థులను బయటకుతీసి మరో వాహనంలో చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం విద్యార్థులు పరీక్షలు రాసేందుకు పరీక్ష కేంద్రాలకు హాజరయ్యారు. తీవ్రంగా గాయపడిన విద్యార్థులు ముగ్గురు పరీక్షలు రాయలేకపోవడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మరొకరి సహాయంతో పరీక్షలు రాసేందుకు అవకాశం కల్పించారు. పరీక్ష సమయం ముగిసిన వెంటనే నలుగురు విద్యార్థులను రోడ్డు సేఫ్టీ వాహనంలో రాజమహేంద్రవరం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరీక్ష కేంద్రాల వద్ద పరీక్షలకు హాజరైన విద్యార్థులను తహసీల్దార్ గీతాంజలి, ఎంపీడీఓ రమేష్, ఎంఈఓ కేహెచ్ నాయక్, సీఐ కాశీవిశ్వనాథం, పోలీస్ సిబ్బంది పరిశీలించి తల్లిదండ్రులు, బందువులతో మాట్లాడారు. ప్రమాదమేమిలేదని ఆందోళన చెందవద్దని ఓదార్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్టు ఎస్సై పేర్కొన్నారు. -
పరీక్ష రాసి వస్తుండగా...
చీపురుపల్లి: ఆ కుటుంబాన్ని చూసి విధికి కన్ను కుట్టింది. అందుకేనేమో నిండు నూరేళ్లు జీవించాల్సిన యువకుడిని రెండు పదుల వయసు రాకముందే తిరిగిరాని లోకాలకు తీసుకెళ్లిపోయింది. ఓ వైపు చదువుకుంటూ మరోవైపు ఆటో నడుపుతూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్న కొడుకు అకాలమరణంతో కుటుంబ సభ్యులు లబోదిబోమంటున్నారు. ఇంటర్ పరీక్ష రాసిన తర్వాత తోటి విద్యార్థులతో కొద్దిసేపు గడిపి ఇంటికి వెళ్తున్న విద్యార్థిని ఆటో రూపంలో మృత్యువు కబలించింది. ఈ సంఘటనకు సంబంధించి స్థానికులు, పోలీసులు అందించిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని పెదనడిపల్లి గ్రామానికి చెందిన టొంపల కిషోర్(19) పట్టణంలోని గాయత్రీ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం (సీఈసీ గ్రూపు) చదువుతున్నాడు. బుధవారం పరీక్ష రాసేందుకు చీపురుపల్లి వచ్చి తిరిగి మధ్యాహ్నం తన స్వగ్రామం వెళ్తుండగా పట్టణ శివారులో కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయ సమీపంలో ఆటో బోల్తా పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో ఏఎస్సై చిన్నారావు సంఘటనా స్థలానికి చేరుకుని కిషోర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కుటుంబ పోషణకు ఆటో నడుపుతూ..... తల్లిదండ్రులు రామారావు, సుభద్రలు కూలీలు కావడంతో కుటుంబపోషణ భారం కిశోర్‌పై పడింది. దీంతో ఓ వైపు చదువుతూ మరోవైపు ఆటో నడుపుతూ కుటుంబ సభ్యులకు చేదోడు, వాదోడుగా ఉంటున్నాడు. కిశోర్ పదో తరగతి పూర్తయిన తర్వాత పాలిటెక్నికల్ కోర్సు చేశాడు. తర్వాత గాయత్రీ కళాశాలలో ఇంటర్మీడియట్లో చేరాడు. ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాస్తున్నాడు. అయితే బుధవారం పరీక్ష పూర్తయిన అనంతరం అలకనారాయణపురానికి చెందిన స్నేహితుడు శివ, మరికొంతమంది స్నేహితులతో మధ్యాహ్నం మూడు గంటల వరకు గడిపినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత తనకు నిద్ర వస్తోందని కిశోర్ చెప్పినా స్నేహితులు బలవంతం చేయడంతో ఆటో తీయాల్సి వచ్చింది. దీంతో చీపురుపల్లి నుంచి కనీసం రెండు కిలోమీటర్లు కూడా వెళ్లకముందే ఆటో బోల్తా పడడంతో కిశోర్ అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే అదే ఆటోలో ఉన్న శివకు మాత్రం ఎటువంటి గాయాలవ్వలేదు. శివను పోలీసులు అదుపులోకి తీసుకుని సంఘటన జరిగిన తీరుపై విచారిస్తున్నారు. -
ఇంజినీరింగ్ విద్యార్థి దుర్మరణం
విజయపురి సౌత్: కుటుంబ ఆర్థిక భారంతో ఆటో నడుపుకుంటూ ఇంజినీరింగ్ చదువుతున్న ఓ యువకుడిని మృత్యువు కాటు వేసింది. విధి ఆడిన వింత నాటకంలో విగత జీవిగా మారాదు. చదువు కోసం నాలుగు రాళ్లు సంపాదించుకోవాలనే అనే ఆశలు అడియాస అయ్యాయి. కర్నూల్ జిల్లా డోన్ మండలం, కొండాపేట గ్రామానికి చెందిన ఈడిగ మహేష్ మాచర్ల పట్టణంలో రూమ్ అద్దెకు తీసుకొని అలుగురాజుపల్లిలోని న్యూటన్స్ ఇంజినీరింగ్ కళాశాలలో మూడో సంవత్సరం చదువుతున్నాడు. రోజూ కళాశాలకు వెళ్లి వచ్చిన తరువాత రాత్రి గుంటూరు నుంచి మాచర్ల వచ్చే రైలు ప్రయాణికుల కోసం తన ఆటోను తీసుకొని స్టేషన్‌కు చేరుకుంటాడు. మంగళవారం రాత్రి కూడా 10గంటలకు స్నేహితుడు రాజేష్‌తో కలసి ప్రయాణికులను తీసుకొని విజయపురిసౌత్‌లో దింపి విడిచిపెట్టి మాచర్లకు తిరుగు ప్రయాణమయ్యాడు. సరిగ్గా చింతలతండా మూలమలుపు వద్ద రాగానే ఒక్కసారిగా పల్టీ కొట్టింది. ఆటో నడుపుతున్న మహేష్ తలకు, పక్కటెములకు తీవ్ర గాయాలయ్యాయి. వెనుక కూర్చున్న రాజేష్‌కు స్వల్ప గాయాలయ్యాయి. హుటాహుటిన అదే ఆటోలో మహేష్‌ను స్నేహితుడు రాజేష్ మాచర్ల ప్రభుత్వాసుపత్రికి తరలించాడు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం గుంటూరు తరలిస్తుండగా మార్గంమధ్యలోనే మృతి చెందాడు. మృతుని తండ్రి కృష్ణాగౌడ్, తల్లి రామలక్ష్మిలకు ముగ్గురు సంతానం కాగా వీరిలో మహేష్ పెద్దవాడు. చేతికి అందివచ్చిన కొడుకు మృతి చెందాడని తండ్రి కృష్ణా గౌడ్ విలపిస్తున్న తీరు పలువురిని కలచి వేసింది. -
చెట్టుకు ఆటో ఢీ: ముగ్గురు దుర్మరణం
సాక్షి, ముళబాగిలు : ఆటో చెట్టుకు ఢీకొన్న ఘటనలో ముగ్గురు దుర్మరణం చెందారు. ఈ ఘటన కర్ణాటకలోని ముళబాగిలు తాలూకాలోని గాజులబావి వద్ద శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. డ్రైవర్ ఆటోపై నియంత్రణ కోల్పోవడంతో అది చెట్టును ఢీకొంది. అందులోని ప్రయాణికుల్లో ముగ్గురు సంఘటనా స్థలంలోనే మరణించగా మరో నలుగురు తీవ్రంగా గాయపడి ఆర్ఎల్ జాలప్ప ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితులు తాయలూరు రోడ్డులోని ఖాద్రిపుర శని మహాత్మ దేవాలయానికి కుటుంబ సమేతంగా ఆటోలో వచ్చి తిరిగి వెళ్తుండగా రాత్రి 11 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. సుణ్ణకుప్ప గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ భాస్కర్(25), పార్వతమ్మ(28), గౌరమ్మ(30)లు ఘటనా స్థలంలోనే మరణించారు. నారాయణప్ప, శంకరమ్మ, వి.కృష్ణమూర్తి, ఎ.శంకరలు తీవ్రంగా గాయపడ్డారు. శంకరమ్మ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. -
ఆటో బోల్తా..10 మందికి తీవ్ర గాయాలు
నల్గొండ : చింతపల్లి మండలం పోలేపల్లి రాంనగర్ వద్ద ఆదివారం ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఆటో ప్రయాణిస్తున్న 10 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హుటాహుటిన హైదరాబాద్‌కు తరలించారు. చింతపల్లి నుంచి మాల్ వైపు వస్తోండగా ఈ ప్రమాదం జరిగింది. బాధితులంతా చింతపల్లి మండలం కూరంపల్లికి చెందిన వారిగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆటో బోల్తా.. వృద్ధుని మృతి
సాక్షి, మర్రిపాడు : నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం కదిరినాయుడుపల్లి వద్ద సోమవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. ఆటో బోల్తా పడిన సంఘటనలో బాషా (60) అనే వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా వీరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
మొన్న తల్లి.. నిన్న కూతురు
కరీంనగర్‌రూరల్: ఈనెల 17న ఆటోలో కూలీ పనులకు వెళ్తుండగా.. కరీంనగర్ శివారు మల్కాపూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వారి సంఖ్య ఏడుకు చేరింది. ఆ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కరీంనగర్ మండలం చామన్‌పల్లికి చెందిన మేకల అనూష(20) హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చికిత్స పొందుతూ మంగళవారం అర్ధరాత్రి మృతిచెందినట్లు కుటుంబసభ్యుల తెలిపారు. ఆటోలో పత్తి ఏరేందుకు వెళ్తుండగా జరిగిన ఆ ప్రమాదంలో కూలీలు మేకల దేవమ్మ, లలిత, సాయిలీ ల, లావణ్య, కూనరాజుల ఓదెమ్మ, ఆటోడ్రైవర్ వెంకటమాధవరావు మృతిచెందిన విషయం తెల్సిందే. గాయపడిన పదిమందిని అపోలోరీచ్ ఆస్పత్రిలో చేర్పించారు. అనూష కాలు విరగడంతో ఆమెను ఈనెల 18న హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఆరోగ్యం విషమించడంతో మృతిచెందింది. ప్రమాద సమయంలో చనిపోయిన మేకల దేవమ్మ కూతురే ఈ అనూష. మొన్న తల్లి.. నిన్న కూతురు చనిపోవడంతో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. రూ.97వేలు చెల్లించాలని వైద్యుల డిమాండ్ ఆస్పత్రికి తరలించిన అనూషకు శస్త్రచికిత్స చేసేందుకు ఆమె తండ్రి లచ్చయ్య రూ.60వేల వరకు చెల్లించాడు. ఇంకా రూ.97వేలు చెల్లించాక మృతదేహాన్ని తీసుకెళ్లాలని ఆస్పత్రి సిబ్బంది కరాఖండీగా చెప్పడంతో కుటుంబసభ్యులు ఆందోళన గురయ్యారు. ఇప్పటికే చనిపోయిన భార్య లలిత.. తాజాగా కూతురు అనూష మరణంతో లచ్చయ్య దిక్కుతోచని స్థితిలో పడిపోయాడు. అనూష చనిపోయిన విషయం తెలుసుకున్న మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ బుధవారం గ్రామానికి చేరుకున్నారు. కలెక్టర్, నిమ్స్ డైరెక్టర్‌తో ఫోన్లో మాట్లాడారు. స్ధానిక టీఆర్ఎస్ నాయకులు స్పందించి ఎమ్మెల్యే గంగులకు వివరించారు. ఆయన మంత్రి రాజేందర్ దృష్టికి తీసుకెళ్లగా మంత్రి నిమ్స్ డైరెక్టర్‌తో మాట్లాడి ప్రభుత్వపరంగా బిల్లు చెల్లిస్తామని చెప్పారు. అనూష మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కరీంనగర్‌కు తీసుకొచ్చారు. -
ఆటోలో మంటలు.. డ్రైవర్ సజీవదహనం
సాక్షి, భీమవరం: పశ్చిమ గోదావరి జిల్లా ఆకీవీడు మండలం జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ఆటోలో బాణాసంచా తరిలిస్తుండగా ప్రమాదవశాత్తు మంటలు చేలరేగి ఆటోడ్రైవర్ సజీవ దహనమయ్యాడు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో స్థానికంగా కలకలంరేగింది. ఆ వివరాలు.. ఏలూరులో నిర్వహించే జాతర కోసం భీమవరంలోని ముసలయ్య అనే బాణాసంచా తయారీదారి నుంచి భారీ ఎత్తులోబాణాసంచా సామాగ్రిని ఆటోలో తరలిస్తుండగా ఆకీవీడు జాతీయరహదారిపై ఐబీపీ పేట్రోలు సమీపంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆటో డ్రైవర్ నాగరాజు ఆటోలోనే సజీవదహనమయ్యాడు. మిగిలిన ఇద్దరు హలకొండ సత్యనారయణ, 70 శాతం కాలిపోగా కొల్లా శ్రీనివాస్ 40 శాతం కాలిన గాయాలతో ఆటోలో నుంచి దూకి ప్రాణాలు రక్షించుకున్నారు. స్థానికులు 108 సాయంతో సమీప ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఆటో వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా ముందు ఒక నెంబర్, వెనుక ఒక నెంబర్ ఉండటంతో సాధ్యం కాలేదు. -
ఆటోలో మంటలు.. డ్రైవర్ సజీవదహనం
-
ఆటో కింద పడి చిన్నారి దుర్మరణం
కదిరి అర్బన్: అభం శుభం తెలియని చిన్నారి ఆటో చక్రాల కిందపడి ప్రాణం కోల్పోయింది. పట్నం గ్రామంలో రాధిక, ఆంజనేయులు దంపతులకు ఒక కుమారుడు, ఒక కుమార్తె సంతానం. మంగళవారం ఉదయం తాగునీరు పట్టుకునేందుకు రాధిక ఆటో ట్యాంకర్ వద్దకెళ్లింది. ఆమె వెనకాలే కార్తీక (3) వెళ్లింది. బిందెలో నీరు పట్టుకుని తల్లి అక్కడి నుంచి వెళ్లిపోయింది. చిన్నారి వెనకాలే నిల్చుని ఉండిపోయింది. ఇంతలో ఎదురుగా వస్తున్న వాహనానికి దారివ్వడం కోసం డ్రైవర్ ఆటో ట్యాంకర్‌ను వెనక్కు తోలాడు. వెనుకచక్రాల కిందపడిన కార్తీక తీవ్రంగా గాయపడింది. ఆస్పత్రికి తరలించేలోపు మృతి చెందింది. కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కదిరి ఆస్పత్రికి తరలించారు. పట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. -
శంషాబాద్‌లో తప్పిన పెను ప్రమాదం
శంషాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం రాళ్ళగూడలో పెను ప్రమాదం తప్పింది. రెండు ఆటో ట్రాలీలు అతివేగంగా వెళ్తూ అదుపుతప్పి 33/11 కెవి విద్యుత్ స్తంభానికి ఢీకొన్నాయి. దీంతో విద్యుత్ స్తంభం కూలి ఆటోలపై పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న నలుగురికి గాయాలయ్యాయి. అయితే ఆ సమయంలో విద్యుత్ సరఫరా లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. -
ఆటో ప్రమాదంలో విద్యార్థులకు గాయాలు
ధర్మవరం రూరల్: చిగిచెర్ల గ్రామం నుంచి ధర్మవరం వస్తున్న ఆటో శుక్రవారం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పలువురు విద్యార్థులు గాయపడ్డారు. వివరాలలోకి వెళ్లితే చిగిచెర్ల నుంచి ఉదయం 8 గంటలకు ఆటో బయలు దేరింది. డ్రైవర్ పాటలు వింటూ ఆటోను వేగంగా నడుపుతున్నాడు. గ్రామం దాటి కొద్ది దూరం రాగానే అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న గోతిలోకి ఆటో బోల్తాపడింది. స్వాతి, నందిని, శ్రీలక్ష్మి, విజయ్, అంజాన్, ఉమాపతి, బాషా అనే విద్యార్థులు గాయపడ్డారు. మరొకరు స్వల్పంగా గాయపడ్డారు. వీరంతా పట్టణంలోని సీతారామయ్య, శ్రీ సాయి డిగ్రీ కళాశాలలో చదువుతున్నారు. కళాశాలకు వచ్చేందుకు ఆటోలో వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గాయపడిన వారిని అనంతపురం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
బోరబండలో టాటాఏస్ ఆటో బీభత్సం
అమీర్పేటః బోరబండ సైట్-3లో టాటాఏస్ ఆటో భీభత్సం సృష్టించింది. ఎస్ఆర్నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి పొద్దుపోయాక ఓ ఆటో చిన్నపిల్లలపైకి దూసుకుపోయింది. ఎస్సై లక్ష్మణ్ తెలిపిన వివరాల ప్రకారం స్థానికంగా ఉండే 60 ఏళ్ల వృద్దుడు శంకర్ వృత్తిరిత్యా ఆటో డ్రైవర్. అతని కుమారుడు టాటాఏస్ ఆటోను రాత్రి ఇంటి ముందు నిలిపాడు. శంకర్ తాళం తీసుకుని ఆటో స్టార్ట్ చేశాడు. కొద్దిదూరం వెళ్లాక ఆటో అదుపుతప్పి ఇళ్ల ముందు ఆడుకుంటున్న ముగ్గురు చిన్నారులపైకి వెళ్లింది. వీరిలో ఇద్దరు చిన్నారుల తలలు పగిలి తీవ్ర రక్తస్రావం జరిగింది.అప్పటి వరకు ఆడుతూ పాడుతూ కనిపించిన చిన్నారులకు రక్తపు మరకలు కనిపించడంతో ఆగ్రహనికి గురైన తల్లిదండ్రులు శంకర్‌ను చితక బాదారు. గాయాలైన పిల్లలను చికిత్స నిమిత్తం వారిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేపు నమోదు చేసుకున్న పోలీసులు శంకర్‌ను అదుపులోకి తీసుకున్నారు. వాహనం నడిపిన శంకర్ బ్రేకుమీద కాకుండా ఎక్స్‌లేటర్‌పై వేయడంతో అదుపు తప్పి పిల్లలపైకి వెళ్లిందని పోలీసులు నిర్ధారించారు. కేసు దర్యాప్తులో ఉంది. -
రెండు ఆటోలు ఢీ.. ఒకరి మృతి
ఎనిమిది మందికి గాయాలు సూర్యాపేట: ఎదురెదురుగా వస్తున్న రెండు ఆటోలు ఒకదానికొకటి ఢీకొన్న ఘటనలో ఒకరు మృతిచెందగా.. మరో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. ఈ సంఘటన సూర్యాపేట మండలం రాజానాయక్‌తండా శివారులో శనివారం ఉదయం చోటుచేసుకుంది. దీంతో వారిని అంబులెన్స్‌ల సాయంతో సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
ఆటో ఢీకొని స్కూటరిస్టు దుర్మరణం
పెనుకొండ రూరల్ : మండలంలోని గుట్టూరు-మునిమడుగు మార్గంలో బుధవారం రాత్రి బాగా పొద్దుపోయిన తరువాత జరిగిన రోడ్డు ప్రమాదంలో గుట్టూరుకు చెందిన నాగరాజు(28) మరణించినట్లు పోలీసులు తెలిపారు. నాగరాజు తమ స్వగ్రామం నుంచి అత్తగారి ఊరైన మునిమడుగుకు బుధవారం రాత్రి బైక్‌లో బయలుదేరాడన్నారు. మార్గమధ్యంలో మునిమడుగు నుంచి ఎదురొచ్చిన ఆటో ఢీకొనడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు చొరవ చూపి వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు పేర్కొన్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. మృతునికి భార్య అనిత, కుమారుడు రితిక్ ఉన్నారు. కేసు దర్యాప్తులో ఉంది. -
స్కూల్ ఆటో బోల్తా: విద్యార్థులకు గాయాలు
నిర్మల్: స్కూల్ పిల్లలను తీసుకెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టడంతో.. ముగ్గురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన నిర్మల్ మండలం కొండాపూర్ వద్ద గురువారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఎనిమిది మంది విద్యార్థులు జిల్లా కేంద్రంలోని విజయ హైస్కూల్ నుంచి స్కూల్ ఆటోలో తిరిగి ఇంటికి వెళ్తుండగా.. ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలోరాకేష్, బ్లెస్సీతో పాటు మరో చిన్నారికి తీవ్ర గాయాలుకాగా మిగతా ఐదుగురు విద్యార్థులు సురక్షితంగా బయటపడ్డారు. ఇది గుర్తించిన స్థానికులు గాయాలపాలైన విద్యార్థులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. కాగా.. ఆటోకు సైకిల్ అడ్డురావడంతో దాన్ని తప్పించే క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చేబుతున్నారు. -
ఆటోను ఢీకొన్న లారీ: విద్యార్థులకు గాయాలు
హైదరాబాద్: చర్లపల్లిలో విద్యార్థులతో వెళ్తున్న ఓ ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురు విద్యార్థులు గాయపడ్డారు. వారిని దగ్గరలోని ఓ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
టాటాఏస్ బోల్తా: 20 మందికి గాయాలు
ఉరవకొండ: వేగంగా వెళ్తున్న టాటా ఏస్ వాహనం బోల్తా కొట్టిన ఘటనలో 20 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. అందులో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన అనంతపురం జిల్లా ఉరవకొండ శివారులోని హోతూరు రోడ్డులో సోమవారం ఉదయం జరిగింది. వజ్రకరూర్ మండల నుంచి ఉరవకొండ వెళ్తున్న ప్రయాణికుల ఆటో(టాటాఏస్).. ఉరవకొండ సమీపంలోకి రాగానే ఎదురుగా వస్తున్న బైక్‌ను తప్పించబోయి అదుపుతప్పి బోల్తా కొట్టింది. దీంతో ఆటోలో ఉన్న 20 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను గుంతకల్లు ఆస్పత్రికి తరలించగా.. అందులో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రమాదం జరగిన సమయంలో ఆటోలో 40 మంది ఉన్నట్లు సమాచారం. -
రెండు ఆటోలు ఢీ: ఇద్దరి దుర్మరణం
భూత్పూర్ : మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలం కొత్తమొల్గర గ్రామ శివారులో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. ఐదుగురు గాయపడ్డారు. ప్రయాణికులను తీసుకెళుతున్న రెండు ఆటోలు ఎదురెదురుగా వేగంగా వచ్చి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. క్షతగాత్రులను 108 వాహనంలో ఆస్పత్రికి తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. -
ఆటో ఢీకొని మూడేళ్ల చిన్నారి మృతి
హైదరాబాద్: నగరంలోని జీడిమెట్ల పరిధిలోని అపురూప కాలనీలో విషాదం చోటు చేసుకుంది. ఇంటి ముందు ఆడుకుంటున్న మూడేళ్ల చిన్నారిని ఓ ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తలకు తీవ్రగాయాలపాలైన చిన్నారి తనూశ్రీ అక్కడికక్కడే మృతి చెందింది. తనూశ్రీ తండ్రి పేరు అచ్యుతరావు. సొంతూరు శ్రీకాకుళం జిల్లా. స్థానికంగా కిరాణా షాపు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. చిన్నారి మృతితో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆటో బోల్తా :వ్యక్తి మృతి
మృతదేహాన్ని అడవిలో పడేసిన ఆటోడ్రైవర్ చిలమనూరు (బాలాయపల్లి) : వెంకటగిరి–నాయుడుపేట రోడ్డులో చిలమనూరు తిప్ప మలుపు వద్ద శుక్రవారం అర్ధరాత్రి ఆటో బోల్తాపడి అదే గ్రామానికి చెందిన బత్తల మహేశ్వరయ్య (65) అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని ఆటోడ్రైవర్ ఆతను స్నేహితుడు కలిసి అడవిలోకి వెళ్తున్న కాలి దారిలో పడేసి వెళ్లారు. పోలీసులు కథనం మేరకు శుక్రవారం ఉదయం మహేశ్వరయ్య వెంకటగిరికి వెళ్లాడు రాత్రి 10 గంటలకు వెంకటగిరి ఆర్టీసీ బస్టాండ్ వద్ద చిలమనూరుకు చెందిన మోడి కృష్ణయ్య ఆటోలో ఎక్కాడు. చిలమనూరు సమీపంలో తిప్ప మలుపు వద్ద ఆటో బోల్తాపడి మహేశ్వరయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. ఆటోడ్రైవర్ కృష్ణయ్య, అతని స్నేహితుడు కలిసి మృతదేహాన్ని ఆడవిలో పడేసి వెళ్లిపోయారు. మహేశ్వరయ్య శుక్రవారం రాత్రి ఇంటికి రాకపోవడంతో అనారోగ్యంతో మంచంలో ఉన్న భార్య ఆదెమ్మ బంధువులకు తెలపడంతో బంధువులు ఆటోడ్రైవర్ కృష్ణయ్యను అడిగారు. అతను తన ఆటోలో ఎక్కలేదని చెప్పాడు. దీంతో వెంకటగిరిలో ఉన్న బంధువులను విచారించగా శుక్రవారం రాత్రి 10 గంటలకు కృష్ణయ్య ఆటోలో బయలు దేరి వచ్చాడని చెప్పారు. అప్పటికే పశువుల కాపరులు మహేశ్వరయ్య మృతదేహం అడవిలో ఉందని సమాచారం ఇవ్వడంతో పోలీసులకు తెలిసింది. దీంతో వెంకటగిరి ఎస్ఐ రహీంరెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించి, ఆటో డ్రైవర్ కృష్ణయ్యను విచారించాడు. ఆటో బోల్తాపడిం మహేశ్వరయ్య ఆటో కింద పడి మృతి చెందాడని చెప్పాడు. మానవత్వం కోల్పోయిన ఆటో డ్రైవర్ ఆటో బోల్తాపడి మృతి చెందితే ఆటోడ్రైవర్ ఎవరికి తెలియదులే అనుకుని మహేశ్వరయ్య మృతదేహాన్ని స్నేహితుడు సాయంతో అడవిలో పడేయడంతో గ్రామస్తులు మండిపడ్డారు. ఇక ఆటోను ఎవరికి తెలియకుండా అడవిలో దాచి ఇంటి వద్ద అందరితో కలిసి ఏమి తెలియనట్టు వ్యవహరించడంతో మానత్వం లేకుండా వ్యవహరించడంపై ఆవేదన వ్యక్తం చేశారు.