చెట్టును ఢీకొన్న ఆటో: 10 మందికి తీవ్రగాయాలు | 10 people injured in auto accident at podalakuru | Sakshi
Sakshi News home page

చెట్టును ఢీకొన్న ఆటో: 10 మందికి తీవ్రగాయాలు

Published Fri, Aug 16 2013 11:19 AM | Last Updated on Fri, Sep 1 2017 9:52 PM

10 people injured in auto accident at podalakuru

పొదలకూరు మండలం నావూరు క్రాస్ రోడ్డు వద్ద శుక్రవారం ఉదయం ఆటో చెట్టును ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆటోలోని 10 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలపాలయ్యారు. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను నెల్లూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ అతివేగంగా ఆటో నడపడంతోనే ఆ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు.



అయితే వరంగల్ జిల్లాలోని వర్థన్నపేట మండలం పున్నేల్లో జిల్లా నారాయణ అనే వ్యక్తిపై అతని సమీప బంధువులు శుక్రవారం గొడ్డలితో దాడి చేశారు. దాంతో నారాయణ పరిస్థితి విషమంగా మారింది. కుటుంబసభ్యులు వెంటనే స్పందించి వరంగల్లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఆ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కుటుంబ కలహాలతోనే బంధువులు నారాయణపై దాడి చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement