
సాక్షి, హైదరాబాద్: నగరంలోని దుర్గం చెరువు తీగల వంతెనపై ఓ ఆటో బోల్తా పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 22న జరిగిన ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు తాజాగా వెలుగులోకి రావడంతోవ వైరల్‌గా మారాయి.
జూబ్లీహిల్స్ నుంచి ఐటీసీ కొహినూర్ వైపు వస్తున్న ఆటో దుర్గం చెరువు తీగల వంతెనపై అకస్మాత్తుగా బోల్తా కొట్టింది. డ్రైవర్ సెల్‌ఫోన్ చూస్తూ ఆటో నడుపుతూ ముందుగా వెళ్తున్న బైక్‌ను తప్పించబోయి ఆటో అదుపుతప్పి పల్టీ కొట్టింది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్‌తో పాటుమరో ఇద్దరికి స్పల్పంగా గాయపడగా ఆసుపత్రికి తరలించారు.
అయితే అత్యంత వేగంతో ఆటో నడపడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. మరోవైపు ఆటో పల్టీ కొట్టిన సమయంలో వెనుకనుంచి వచ్చిన కారు చాకచక్యంగా పక్కకు తిప్పడంతో ప్రమాదం తప్పింది.
చదవండి: ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ క్యాంప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత