సోషల్ మీడియాలో వీడియో వైరల్
కేసు నమోదు చేసిన రాయదుర్గం పోలీసులు
హైదరాబాద్: బైక్‌పై స్టంట్లు చేస్తూ బాణ సంచా కాల్చుతూ ఐటీ కారిడార్‌లో ఓ యువకుడు హల్‌చల్ చేసిన వీడియో వైరల్‌గా మారింది. ప్రమాదకర రీతిలో స్టంట్టు చేయడమే కాకుండా బాణసంచా కాల్చడాన్ని సైబరాబాద్ పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో ఈ ఘటనపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు.
కేబుల్ బ్రిడ్జీపై నుంచి స్టంట్లు చేసుకుంటూ వచ్చిన యువకుడు ఐటీసీ కోహినూర్ వద్ద లెఫ్ట్‌కు తీసుకొని షాట్స్(బాణసంచా) పేల్చాడు. స్టంట్లు చేస్తూ షాట్స్ పేల్చడాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వాహనాల రద్దీ ఉండే ప్రాంతంలో బైక్‌పై స్టంట్లు చేయడం, బాణసంచా కాల్చడం అత్యంత ప్రమాదకరం. ఈ క్రమంలో రాయదుర్గం పోలీసులు చట్ట ప్రకారం చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు.
ఘట్‌కేసర్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్టు చేసినట్లు పోలీసులు గుర్తించారు. కేబుల్ బ్రిడ్జి పైనా స్టంట్లు చేసే వీడియోలను సేకరించినట్లు తెలుస్తోంది. బైక్‌పై నెంబర్ లేకపోవడంతో సదరు యువకుడి ఆచూకీ తెలియలేదని రాయదుర్గం ఇన్‌స్పెక్టర్ సీహెచ్ వెంకన్న తెలిపారు. స్టంట్లు చేసి, బాణసంచా కాల్చిన యువకుడిపై బీఎన్‌ఎస్‌ఎస్ 121 సెక్షన్ కింద ఆదివారం కేసు నమోదు చేశామన్నారు.
నాలెడ్జ్ సిటీలో బైక్ రేస్.. 36 మందిపై కేసు నమోదు
కేకలు వేస్తూ వాహనదారులను భయపెడుతూ బైక్ రేసింగ్‌కు పాల్పడిన 35 మందిపై కేసు నమోదు చేసినట్లు రాయదుర్గం ఇన్‌సెక్టర్ సీహెచ్ వెంకన్న తెలిపారు. ప్రమాదకర స్థితిలో బైక్‌తో స్టంట్లు చేయడం, బిగ్గరగా అరవడంతో అటుగా వెళ్లే వాహనదారులు ఒక్కసారిగా ఆందోళనకు గురవుతున్నారు. నాలెడ్జ్‌సిటీలో బైక్ రేస్ నిర్వహిస్తున్నారన్న సమాచారంతో శనివారం రాత్రి 11.30 గంటల సమయంలో రాయదుర్గం పోలీసులు ఘటనా స్థలానిక చేకున్నారు. నలువైపుల పోలీసులు మోహరించి బైక్ రేస్‌కు పాల్పడిన 21 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. 21 బైక్‌లను స్వాదీనం చేసుకున్నారు.
చదవండి: వ్యాపారి రమేష్ కుమార్ హత్య కేసులో ట్విస్ట్
శుక్రవారం రాత్రి బైక్ రేస్‌కు పాల్పడిన 15 మంది, బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. రేస్‌కు పాల్పడిన యువకులను రిమాండ్ చేస్తామని ఇన్‌స్పెక్టర్ తెలిపారు. స్వాధీనం చేసుకున్న బైక్‌లను ఆర్టీఏ అధికారులకు అప్పగిస్తామన్నారు. బైక్ రేస్ చేయకుండా వారి తల్లిదండ్రులు కట్టడి చేయాల్సిన అవసరం ఉదని ఆయన సూచించారు. రేసింగ్‌లకు ఎలాంటి అనుమతులు లేవని, అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా, దీపావళి నాడు కొంతమంది చేసిన ఓవరాక్షన్‌పై ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఆవేదన వ్యక్తం చేశారు.
దీపావళి పండుగ పూట ఇదేం వికృతానందం. ఎటు వెళ్తోందీ సమాజం.
దీపావళి అంటే ఉల్లాసం, ఉత్సాహాలతో పాటు ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉన్న పర్వదినం.
పండుగ నాడు ఇలాంటి వెర్రి వేషాలు వేస్తూ.. అపహాస్యం చేసేలా ప్రవర్తించడం ఎంత వరకు సమంజసం!? pic.twitter.com/pYbELJeZAR— V.C. Sajjanar, IPS (@SajjanarVC) November 3, 2024
Comments
Please login to add a commentAdd a comment