bike racings
-
కేబుల్ బ్రిడ్జీపై స్టంట్లు చేస్తూ.. బాణసంచా కాల్చుతూ వెర్రి వేషాలు
హైదరాబాద్: బైక్‌పై స్టంట్లు చేస్తూ బాణ సంచా కాల్చుతూ ఐటీ కారిడార్‌లో ఓ యువకుడు హల్చల్ చేసిన వీడియో వైరల్‌గా మారింది. ప్రమాదకర రీతిలో స్టంట్టు చేయడమే కాకుండా బాణసంచా కాల్చడాన్ని సైబరాబాద్ పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో ఈ ఘటనపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు.కేబుల్ బ్రిడ్జీపై నుంచి స్టంట్లు చేసుకుంటూ వచ్చిన యువకుడు ఐటీసీ కోహినూర్ వద్ద లెఫ్ట్‌కు తీసుకొని షాట్స్(బాణసంచా) పేల్చాడు. స్టంట్లు చేస్తూ షాట్స్ పేల్చడాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వాహనాల రద్దీ ఉండే ప్రాంతంలో బైక్‌పై స్టంట్లు చేయడం, బాణసంచా కాల్చడం అత్యంత ప్రమాదకరం. ఈ క్రమంలో రాయదుర్గం పోలీసులు చట్ట ప్రకారం చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు.ఘట్కేసర్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్టు చేసినట్లు పోలీసులు గుర్తించారు. కేబుల్ బ్రిడ్జి పైనా స్టంట్లు చేసే వీడియోలను సేకరించినట్లు తెలుస్తోంది. బైక్‌పై నెంబర్ లేకపోవడంతో సదరు యువకుడి ఆచూకీ తెలియలేదని రాయదుర్గం ఇన్స్పెక్టర్ సీహెచ్ వెంకన్న తెలిపారు. స్టంట్లు చేసి, బాణసంచా కాల్చిన యువకుడిపై బీఎన్ఎస్ఎస్ 121 సెక్షన్ కింద ఆదివారం కేసు నమోదు చేశామన్నారు.నాలెడ్జ్ సిటీలో బైక్ రేస్.. 36 మందిపై కేసు నమోదు కేకలు వేస్తూ వాహనదారులను భయపెడుతూ బైక్ రేసింగ్‌కు పాల్పడిన 35 మందిపై కేసు నమోదు చేసినట్లు రాయదుర్గం ఇన్సెక్టర్ సీహెచ్ వెంకన్న తెలిపారు. ప్రమాదకర స్థితిలో బైక్‌తో స్టంట్లు చేయడం, బిగ్గరగా అరవడంతో అటుగా వెళ్లే వాహనదారులు ఒక్కసారిగా ఆందోళనకు గురవుతున్నారు. నాలెడ్జ్సిటీలో బైక్ రేస్ నిర్వహిస్తున్నారన్న సమాచారంతో శనివారం రాత్రి 11.30 గంటల సమయంలో రాయదుర్గం పోలీసులు ఘటనా స్థలానిక చేకున్నారు. నలువైపుల పోలీసులు మోహరించి బైక్ రేస్‌కు పాల్పడిన 21 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. 21 బైక్‌లను స్వాదీనం చేసుకున్నారు.చదవండి: వ్యాపారి రమేష్ కుమార్ హత్య కేసులో ట్విస్ట్శుక్రవారం రాత్రి బైక్ రేస్‌కు పాల్పడిన 15 మంది, బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. రేస్‌కు పాల్పడిన యువకులను రిమాండ్ చేస్తామని ఇన్స్పెక్టర్ తెలిపారు. స్వాధీనం చేసుకున్న బైక్‌లను ఆర్టీఏ అధికారులకు అప్పగిస్తామన్నారు. బైక్ రేస్ చేయకుండా వారి తల్లిదండ్రులు కట్టడి చేయాల్సిన అవసరం ఉదని ఆయన సూచించారు. రేసింగ్‌లకు ఎలాంటి అనుమతులు లేవని, అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా, దీపావళి నాడు కొంతమంది చేసిన ఓవరాక్షన్‌పై ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఆవేదన వ్యక్తం చేశారు. దీపావళి పండుగ పూట ఇదేం వికృతానందం. ఎటు వెళ్తోందీ సమాజం. దీపావళి అంటే ఉల్లాసం, ఉత్సాహాలతో పాటు ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉన్న పర్వదినం. పండుగ నాడు ఇలాంటి వెర్రి వేషాలు వేస్తూ.. అపహాస్యం చేసేలా ప్రవర్తించడం ఎంత వరకు సమంజసం!? pic.twitter.com/pYbELJeZAR— V.C. Sajjanar, IPS (@SajjanarVC) November 3, 2024 -
రాజేంద్రనగర్ లో బైక్ రేసింగ్ లు..
-
హైదరాబాద్: రోడ్లపై స్టంట్లు.. రేసర్ల అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ఐటీ హబ్‌లో బైక్ రేసింగ్స్తో యువకులు వీరంగం సృష్టిస్తున్నారు. టీ హబ్, ఐటీసీ కొహినూర్, నాలెడ్జ్ పార్క్, సాత్వా బిల్డింగ్ ప్రాంతాలో బైక్ రేసింగ్స్తో యువకులు హచ్‌చల్ చేస్తున్నారు. దీంతో రాయదుర్గం పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపట్టి.. రేసింగ్స్కి పాల్పడిన 50మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి బైకులను స్వాధీనం చేసుకొని.. ఆర్టీఏ అధికారులకు అప్పగించారు. రేసింగ్‌తో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న యువకులపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. -
నా కొడుకులకు అలాంటివి చేయొద్దని చెప్తా : నాగార్జున
Nagarjuna: నాగార్జున, టబు హీరో, హీరోయిన్లుగా కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘నిన్నే పెళ్లాడతా’. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ సినిమా విడుదలై పాతికేళ్లు దాటింది. ఈ సందర్భంగా నాగార్జున ఈ సినిమా విశేషాలను షేర్ చేసుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సినిమాలో ఎక్కువగా బైక్ సీన్స్ ఉన్నాయి. అయితే అవన్నీ డూప్ లేకుండానే చేశానని నాగార్జున తెలిపారు. అంత వేగంతో ఎలా నడిపానో తెలియదు. ఇప్పుడైతే చేయను. ఇప్పుడు మా పిల్లలు అడిగినా కూడా అలా చేయవద్దనే వాళ్లకి చెబుతాను అని పేర్కొన్నారు. ఆ సీన్స్‌లో గంటకి 80-90 మీటర్ల వేగంతో బైక్ నడిపామని, ఒకరు పడ్డా అందరూ పడేవాళ్లని పేర్కొన్నారు. అప్పుడు ఎలాగో చేశాను కానీ అలాంటి రిస్కీ థింగ్స్ చేయొద్దనే సలహా ఇస్తానని సినిమా విశేషాలను పంచుకున్నారు. కాగా ప్రస్తుతం నాగార్జున నటించిన ఘోస్ట్ సినిమా విడుదలకు సిద్ధం అవుతుంది. -
హైదరాబాద్‌లో అర్థరాత్రి యువకులు హంగామా
-
దుర్గం చెరువు బ్రిడ్జ్ పై బైక్ రేసింగ్‌లు
-
బెజవాడలో బైక్ రేస్‌లు
సాక్షి, అమరావతి బ్యూరో (కృష్ణా): కుర్రాళ్లు బైక్ ఎక్కారంటే చాలు.. రోడ్డుపై నడపాల్సిన బండిని గాల్లో లేపేస్తుంటారు. ఆ బైకును రాకెట్ అనుకుంటారో లేక తమకే రెక్కలొచ్చాయని ఫీలవుతారో కానీ.. 100, 150 æదాటిన స్పీడ్‌లో రయ్యిన దూసుకెళ్తుంటే.. చూసేవారి ఒళ్లు జలదరించాల్సిందే. నిన్నమొన్నటి వరకు హైదరాబాద్, చెన్నై వంటి మెట్రో నగరాలకే పరిమితమైన ఈ రేస్ పిచ్చి.. విజయవాడలోను మొదలైంది. వీకెండ్ వచ్చిందంటే చాలు.. నగరంలోని విశాల రహదారుల్లో ఈ దృశ్యాలు సర్వ సాధారణమైపోయాయి. ఇన్నాళ్లు హైదరాబాద్‌కే పరిమితమైన బైక్ రేస్ విజయవాడకు పాకింది. వీకెండ్లో యువత చేసే స్టంట్స్.. వారి ప్రాణాలే కాదు పక్కవారి ప్రాణాలను కూడా రిస్క్‌లో పడేస్తున్నాయి. బీఆర్టీఎస్ రోడ్డు, ఇన్నర్ రింగ్‌రోడ్డు, బందరు రోడ్డు, ఏలూరు రోడ్డు, సీఎస్ఐ ఆస్పత్రి వెనుక రోడ్లు కుర్రాళ్ల బైక్ రేసులకు వేదికగా మారుతున్నాయి. ఇక్కడ విశాలమైన రోడ్లు ఉండటంతో యువత పిచ్చెక్కి ప్రవర్తిస్తున్నారు. చీకటి పడితే చాలు.. కుర్రాళ్ల డార్క్ డ్రైవింగ్ స్టార్ట్ అవుతుంది. స్పోర్ట్స్ బైకులపై ఓవర్ స్పీడ్‌తో రోడ్డుపై వెళ్లేవారిని భయపెడుతున్నారు. సరదాలు.. బెట్టింగ్‌లు.. అర్ధరాత్రి అయిందంటే చాలు.. కుర్రాళ్లు నడిరోడ్డుపైకి దూసుకువస్తున్నారు. హాలివుడ్ సినిమా తరహాలో సీన్లు చూపిస్తున్నారు. ఖరీదైన బైకులపై రోడ్డెక్కి రయ్యిన దూసుకెళ్తూ అటు ప్రజలకు ఇటు పోలీసులకు తలనొప్పిగా మారుతున్నారు. కొందరు సరదా కోసం చేస్తుంటే.. మరికొందరు బెట్టింగ్‌ల కోసం బరితెగిస్తున్నారు. ఇంజినీరింగ్, డిగ్రీ స్టూడెంట్స్ గ్రూపులుగా ఏర్పడి బైక్ రేసుల్లో పాల్గొంటున్నారు. సింగిల్ టైర్ రైడ్, సైడ్ హ్యాంగింగ్ రైడ్, జిగ్ జాగ్, స్నేక్ రైడ్ ఇలా రకరకాల డేంజర్ స్టంట్లతో రేసుల్లో పాల్గొంటున్నారు. 360 డిగ్రీస్, 120 యాంగిల్, ఫ్రంట్ లీ, బ్యాక్ లీ.. పేర్లతో పిలిచే ఈ స్టంట్స్‌పై యువత క్రేజ్ పెంచుకుంటోంది. పోలీసుకు దొరక్కుండా..! విజయవాడలో బైక్ రేసింగ్ కొత్తేమీ కాదు. కొన్నేళ్లుగా జరుగుతున్నదే. పోలీసులు రైడ్స్ చేసి రేసర్లను పట్టుకున్న సందర్భాలున్నాయి. పోలీసులు నిఘా పెంచినప్పుడు కాస్త తగ్గుతుందేమో కానీ ఆ తర్వాత అంతా మామూలే. అసలు బైక్ రేసింగ్ కల్చర్ హైదరాబాద్‌లో ఎక్కువగా ఉండేది. శివారులోని ఔటర్ రింగ్ రోడ్డుపై బైక్ రేసింగ్ చేస్తూ ప్రాణాలు కోల్పోయిన విషాదకర సంఘటనలు ఉన్నాయి. ఆ తర్వాత ఈ రేసింగ్ కల్చర్ విజయవాడ నగరానికి పాకింది. వీకెండ్లో రేసులు జోరుగా జరుగుతున్నాయి. ఇటీవల విజయవాడలో బైక్ రేసుల్లో పాల్గొంటున్న కుర్రాళ్లు తమ బైక్ నంబరు ప్లేట్లు కనిపించకుండా వాటి అంచులను వంచేసి మరీ రేసుల్లో పాల్గొంటున్నారు. ఒకవేళ తమ బైక్ రేసులు సీసీ కెమెరాల్లో రికార్డు అయినా తప్పించుకునేలా ఈ దారిని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. -
పోలీసుల స్పెషల్ డ్రైవ్ : బైక్ రేసర్లు అరెస్ట్
హైదరాబాద్: నగరంలో బైక్ రేసింగ్‌లకు పాల్పడుతున్న యువత ఆటకట్టించారు పోలీసులు. జూబ్లిహిల్స్, బంజారాహిల్స్‌లో శుక్రవారం అర్ధరాత్రి పలుచోట్ల పోలీసులు స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మోతాదుకు మించి మద్యం సేవించి వాహనాలు నడుపతున్న 9 మందిపై కేసులు నమోదు చేసి 3 బైక్‌లు, 5 కార్లు స్వాధీనం చేసుకున్నారు. రోడ్ నెంబర్ 45లో బైక్ రేసింగ్‌లకు పాల్పడుతున్న 19 మందిని యువతను పోలీసులు అరెస్ట్ చేశారు. వారికి కౌన్సిలింగ్ నిర్వహిస్తామని చెప్పారు. -
పాతబస్తీలో బైక్‌రేస్..
హైదరబాద్సిటీ: పాతబస్తీలో బైక్‌రేసింగ్‌లకు పాల్పడుతున్న 100 మందికి పైగా మైనర్లను సౌత్‌జోన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మైనర్ల తల్లిదండ్రులకు ఈ విషయం గురించి సమాచారం అందించారు. బుధవారం ఉదయం 9 గంటలకు కులుబ్ కుతుబ్‌షాహీ గ్రౌండ్స్‌లో వారికి కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. మైనర్లకు బైక్‌లు ఇచ్చినందుకు వారి తల్లిదండ్రులపై కేసు నమోదు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. -
జూబ్లీహిల్స్‌లో బైక్ రేసింగ్‌లు అడ్డుకున్న పోలీసులు
హైదరాబాద్ : నగరంలోని జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు సమీపంలో బైక్ రేసింగులు చేస్తున్న యువకులను ఆదివారం పోలీసులు అడ్డుకున్నారు. ఆ క్రమంలో పోలీసులపై సదరు యువకులు చిందులు తొక్కారు. దీంతో ఆగ్రహించిన పోలీసులు బైక్ రేసింగులకు పాల్పడుతున్న 16 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. అలాగే 16 బైకులతోపాటు రెండు కార్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకుని... పోలీస్ స్టేషన్‌కు తరించారు. యువకుల తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్‌కు పోలీసులు పిలిపించారు. వారి సమక్షంలో యువకులకు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. -
శ్రీకాళహస్తిలో బైక్ రేసింగ్‌ల కలకలం
చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సొంత జిల్లా చిత్తూరులో అర్ధరాత్రి బైక్ రేసింగ్‌లు కలకలం రేపింది. జిల్లా పరిధిలోని శ్రీకాళహస్తిలోని స్వర్ణముఖి నదీ వంతెనపై ఆదివారం అర్ధరాత్రి దాటాక యువకులు బైక్‌లతో విచ్చలవిడిగా హల్ చల్ చేశారు. ఈ ఆనందంలో అదుపు తప్పిన రెండు బైకులు నదిలో పడిపోయాయి. ఈ ఘటనలో మునికుమార్ అనే యువకుడు మృతి చెందాడు. మరొకరికి గాయాలయ్యాయి.