(ఫైల్ ఫొటో)
హైదరాబాద్: నగరంలో బైక్ రేసింగ్‌లకు పాల్పడుతున్న యువత ఆటకట్టించారు పోలీసులు. జూబ్లిహిల్స్, బంజారాహిల్స్‌లో శుక్రవారం అర్ధరాత్రి పలుచోట్ల పోలీసులు స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహించారు.
ఈ తనిఖీల్లో మోతాదుకు మించి మద్యం సేవించి వాహనాలు నడుపతున్న 9 మందిపై కేసులు నమోదు చేసి 3 బైక్‌లు, 5 కార్లు స్వాధీనం చేసుకున్నారు. రోడ్ నెంబర్ 45లో బైక్ రేసింగ్‌లకు పాల్పడుతున్న 19 మందిని యువతను పోలీసులు అరెస్ట్ చేశారు. వారికి కౌన్సిలింగ్ నిర్వహిస్తామని చెప్పారు.