Hyderabad City Police: హాజరవలేని ఆహ్వానం | Hyderabad City Police Funny Invitation For Drunk And Drive People | Sakshi
Sakshi News home page

Hyderabad City Police: హాజరవలేని ఆహ్వానం

Published Mon, Jan 1 2024 7:43 PM | Last Updated on Mon, Jan 1 2024 8:09 PM

Hyderabad City Police Funny Invitation For Drunk And Drive People - Sakshi

సోషల్‌ మీడియా వైరల్‌: ఏదైనా విందుకో, వేడుకకో ఎవరైనా ఆహ్వానపత్రిక పంపితే మనం వెళ్లకతప్పదు. కాని ఓ ఆహ్వనపత్రిక మనం హాజరవలేని విధంగా వచ్చిందనుకోండి అదే విడ్డూరం. డిసెంబర్ 31న హైదరాబాద్ సిటీ పోలీస్ హైదరాబాద్ నగరవాసులకు ఇటువంటిదే ఓ ఆహ్వానపత్రిక పంపింది. అదేమిటో మీరూ ఓ లుక్కేయండి.

ఈ నూతన సంవత్సర వేడుకలకు మీరు మా అతిధి అవ్వకూడదని ప్రార్ధించండి. కాకపోతే రాష్ డ్రైవర్లకు, తాగి నడిపే వాహనదార్లకు, ఇతర రూల్స్ అతిక్రమించేవారికి మా ఆతిధ్యం ఉచితం. వారికి మాత్రమే స్పెషల్ లాకప్ డీజె షో ఏర్పాటు చేయబడుతుంది. ఇకపోతే మా ఆతిధ్యం స్వీకరించేవారికి రుచికరమైన కాప్ కేక్ , ప్రత్యేకంగా మా డెజర్ట్‌లో పొందుపరిచిన కష్టడీ వడ్డించబడుతుంది. ఆఖరుగా ఈ పార్టీ వేదిక మీ దగ్గరలోని పోలీస్ స్టేషన్ అని వినూత్నంగా డిజైన్ చేసిన ఈ ‘హాజరవలేని ఆహ్వానం’ సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది.

చదవండి: Hyd: భారీగా డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు.. మద్యం ఎంత తాగారంటే?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement