
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ఐటీ హబ్‌లో బైక్ రేసింగ్స్‌తో యువకులు వీరంగం సృష్టిస్తున్నారు. టీ హబ్, ఐటీసీ కొహినూర్, నాలెడ్జ్ పార్క్, సాత్వా బిల్డింగ్ ప్రాంతాలో బైక్ రేసింగ్స్‌తో యువకులు హచ్‌చల్ చేస్తున్నారు.
దీంతో రాయదుర్గం పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపట్టి.. రేసింగ్స్‌కి పాల్పడిన 50మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి బైకులను స్వాధీనం చేసుకొని.. ఆర్టీఏ అధికారులకు అప్పగించారు. రేసింగ్‌తో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న యువకులపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు.

Comments
Please login to add a commentAdd a comment