racers
-
డాకర్ ర్యాలీ 2025 - ఎడారిలో దూసుకెళ్లిన కార్లు (ఫోటోలు)
-
2025 డాకర్ ర్యాలీ - ఎడారిలో దుమ్ములేపుతున్న బైకులు (ఫోటోలు)
-
హైదరాబాద్: రోడ్లపై స్టంట్లు.. రేసర్ల అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ఐటీ హబ్‌లో బైక్ రేసింగ్స్తో యువకులు వీరంగం సృష్టిస్తున్నారు. టీ హబ్, ఐటీసీ కొహినూర్, నాలెడ్జ్ పార్క్, సాత్వా బిల్డింగ్ ప్రాంతాలో బైక్ రేసింగ్స్తో యువకులు హచ్‌చల్ చేస్తున్నారు. దీంతో రాయదుర్గం పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపట్టి.. రేసింగ్స్కి పాల్పడిన 50మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి బైకులను స్వాధీనం చేసుకొని.. ఆర్టీఏ అధికారులకు అప్పగించారు. రేసింగ్‌తో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న యువకులపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. -
పగలు పూజారి.. రాత్రిళ్లు బైక్ రేసర్!
ఒకేసారి రెండూ విభిన్న రంగాల్లో రాణించడం అందరికీ సాధ్యం కాదేమో. కొందరూ మాత్రం వాటిని అలవోకగా సాధిస్తారు. వారు ఉన్న రంగానికి ఎంచుకున్న రంగానికి చాలా తేడా ఉంటుంది. చూసే వాళ్లు సైతం ఇది నిజమా అని ఆశ్చర్యపోయాలా సమర్థవంతంగా దూసుకుపోతారు. అభిరుచిని వదులోకోవాల్సి అవసరం లేదు మనం ఎందులో ఉన్న మన కలను నిజం చేసుకోవచ్చు అని తెలియజెప్పుతారు కొందరూ వ్యక్తులు. ఆ కోవకే చెందుతారు కేరళకు చెందిన ఓ పూజారి. వివరాల్లోకెళ్తే..కేరళలో కొట్టాయం జిల్లాకు చెందిన ఉన్ని కృష్ణన్ పగలు ఆలయంలో పూజరిగా విధులు నిర్వర్తిస్తుంటాడు. అతను ఓ సాధారణ పూజరి మాత్రమే కాదు. అతనిలో ఓ రైసర్ కూడా దాగున్నాడు. రాత్రిళ్లు ఎక్స్‌పల్స్ 200 మోటార్ బైక్‌పై రయ్ మంటూ దూసుకుపోతుంటాడు. అతను గ్లోవ్స్, బూట్లు, హెల్మెట్ ధరించి ఓ రైసర్లా దూసకుపోతుంటాడు. అతని గురించి తెలుసుకున్న స్థానికులు సైతం ఆశ్చర్యపోయారు. ఉన్నికృష్ణన్న్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చదువుకున్న విద్యావంతుడు. Temple priest at dawn, dirtbike racer by dusk.Meet Unnikrishnan (34), melshanti of Pudhukkulamgara Devi temple in Kottayam, Kerala, an avid motorcross rider who recently raced in INRC 2023 in Coimbatore. A former IT engineer, this priest-racer is training for a race in Bengaluru pic.twitter.com/9c3TJ2WtKl— Petlee Peter (@petleepeter) August 14, 2023 2013 వరకు ఐటీ రంగంలో పనిచేశాడు కూడా. ఐతే అతడి మనసు ఎప్పుడూ ఆధ్యాత్మికత వైపే వెళ్తుండటతో ఇక ఈ రంగంలోకి వచ్చేశాడు. అదీగాక 2019లో పూజారి అయిన తన తండ్రి గతించడంతో ఉన్నికృష్ణన్ తన కుటుంబ సంప్రదాయ వృత్తిని తాను కొనసాగించాలని నిర్ణయించుకున్నాడు. డిసెంబర్ 2021లో అధికారికంగా పుదుక్కులంగర దేవి ఆలయంలో పూజారిగా బాధ్యతలు తీసుకున్నాడు. 2023లో మోటార్ సైక్లింగ్‌లో లైసెన్స్ పొందడమే గాక కోయంబత్తూరులో జరిగిన ఇండియన్ నేషనల్ ర్యాలీ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొని రేసర్‌గా తన సత్తా ఏంటో చూపించాడు. నిజంగా ఉన్ని కృష్ణన్ చూస్తే..అభిరుచికి లిమిట్స్ ఉండవు. మనిషిలో తగినంత సామర్థ్యం, ప్రతిభ ఉంటే ఏ ఫీల్డ్‌లో ఉన్నా గెలుపు తీరాన్ని అందుకోగలడని అవగతమవుతోంది కదూ. (చదవండి: సింగిల్‌గా ఉంటే.. చిరుతైనా గమ్మునుండాల్సిందే!లేదంటే..) -
11 ఏళ్లకే రేసింగ్‌లో రికార్డు.. మరెన్నో విజయాలు
Shreyas Hareesh: ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉందని ఊహించారు.. సర్క్యూట్ రేసింగ్ చరిత్రకి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తాడని భావించారు. 13 సంవత్సరాల వయసులోనే లెక్కకు మించిన అవార్డులు, బహుమానాలు.. అతి తక్కువ కాలంలో గొప్ప రేసర్‌గా గుర్తింపు పొందిన 'శ్రేయస్ హరీష్' అందరి ఆశలకు తెరదించి కన్ను మూసాడు. నివేదికల ప్రకారం, మద్రాస్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ రేసింగ్ చాంపియన్‌షిప్‌లో జరిగిన ప్రమాదంలో 'శ్రేయస్ హరీష్' (Shreyas Hareesh) ప్రమాదానికి గురైనట్లు, హాస్పిటల్‌కి తరలించేలోపే కన్ను మూసినట్లు తెలుస్తోంది. దీంతో రేసింగ్ ఛాంపియన్షిప్ రద్దు చేశారు. 11 ఏళ్లకే చాంపియన్‌షిప్.. భారతదేశంలో మొట్టమొదటి మినీజీపీ చాంపియన్‌షిప్ కొట్టిన 'శ్రేయస్ హరీష్'.. తన ఐదేళ్ల ప్రాయంలోనే సైక్లింగ్‌లో మంచి నైపుణ్యం కనపరుస్తుండతో అతని తండ్రి హరీష్ పరంధామన్ ఈ రంగంలో ముందుకు వెళ్ళడానికి సహకరించారు. 11 సంవత్సరాలకే నేషనల్ ఛాంపియన్ షిప్ కైవసం చేసుకున్నారు. 2022లో పెద్ద రైడర్స్‌తో కూడా పోటీపడి రికార్డ్ కొట్టిన ఘనత శ్రేయస్ సొంతం. బెంగళూరుకు చెందిన శ్రేయాస్ ఇంటర్నేషన్ ఛాంపియన్ షిప్కి కూడా అర్హత సాధించి, అందులో కూడా మంచి ప్రతిభ కనపరిచాడు. కార్లకు ఫార్ములా వన్ రేస్ మాదిరిగానే.. 'మోటో జిపి అనేది బైకులతో నిర్వహించే రేసింగ్' దీని గురించి మన దేశంలో పెద్దగా తెలియకపోవచ్చు. రేసింగ్ బ్యాగ్రౌండ్ లేని తెలియని కుటుంబం నుంచి వచ్చిన శ్రేయస్ అతి తక్కువ కాలంలోనే దేశం గర్వించదగ్గ స్థాయికి ఎదిగాడు. ఈ ఏడాది స్పెయిన్‌లోనే ట్రైనింగ్ తీసుకుని అక్కడ జరిగే చాంపియన్‌షిప్‌లో పాల్గొనటానికి సన్నాహాలు కూడా జరుగుతున్నాయి. అంతే కాకుండా ఇతడు ఆగస్టులో మలేషియాలోని సెపాంగ్ సర్క్యూట్లో MSBK ఛాంపియన్షిప్ 2023లో 250సీసీ విభాగంలో (గ్రూప్ B) జట్టు CRA మోటార్‌స్పోర్ట్స్‌కు కూడా ప్రాతినిధ్యం వహించాల్సి ఉంది. అంతలోనే శ్రేయస్ మృత్యువు కౌగిలి చేరిపోయాడు. -
సమరానికి సై.. ఫార్ములా–ఈ పోటీలకు రేసర్లు రెడీ..
సాక్షి, సిటీబ్యూరో: ఫార్ములా– ఈ ప్రిక్స్‌కు వేళయింది. దేశంలోనే తొలిసారిగా నగరం వేదికగా జరగనున్న అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనేందుకు రేసర్లు సమరోత్సాహాంతో సన్నద్ధమవుతున్నారు. వీరంతా ఇప్పటికే నగరానికి చేరుకున్నారు.వివిధ దేశాల్లో నిర్వహించిన ఫార్ములా పోటీల్లో అద్భుతమైన ప్రతిభను, నైపుణ్యాన్ని ప్రదర్శించిన 22 మంది రేసర్లు పాల్గొంటారు. గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు రేసర్లు గతంలో నిర్వహించిన పోటీలపై రూపొందించిన వీడియోను ప్రదర్శించారు. ఈ సందర్భంగా రేసింగ్ డ్రైవర్లు జీన్ ఎరిక్ వర్జిన్, ఆండ్రే లాట్టర్లు తమ అనుభవాలను వివరించారు. పోటీల్లో పాల్గొనడం ఎంతో ఆసక్తికరంగా ఉందన్నారు. పోటీల్లో పాల్గొనడానికి ముందు ఒత్తిడిని తగ్గించుకొనేందుకు తాను మైకేల్ జాక్సన్ పాటలు వింటానని ఆండ్రే చెప్పారు. రేసింగ్ డ్రైవర్లపై తప్పనిసరిగా మానసిక ఒత్తిడి ఉంటుందని, దానిని అధిగమించేందుకు వివిధ రకాల పద్ధతులను పాటిస్తామన్నారు. వీలైనంత వరకు చుట్టూ ఉండే వాతావరణాన్ని ఆహ్లాదభరింతగా ఉంచుకోనున్నట్లు చెప్పారు. మరోవైపు మానసిక ఒత్తిడి, ఆందోళన వంటి ఇబ్బందులను అధిగమించేందుకు సైకాలజిస్టులను కూడా సంప్రదిస్తామని చెప్పారు. కాగా.. ఫార్ములా– ఈ పోటీల కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. నెక్లెస్‌రోడ్డులోని 2.8 కి.మీ ట్రాక్‌ను సిద్ధం చేశారు. 20 వేల మందికి పైగా సందర్శకులు వీక్షించేందుకు అనుగుణంగా గ్యాలరీలను ఏర్పాటు చేశారు. పలు ప్రాంతాల్లో భారీ స్క్రీన్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారు. 11 ఆటోమొబైల్ దిగ్గజ సంస్థలకు చెందిన సింగిల్ సీటర్ ఎలక్ట్రిక్ కార్లు, 22 మంది రేసింగ్ డ్రైవర్లు పోటీల్లో పాల్గోనున్న సంగతి తెలిసిందే. -
తీవ్ర విషాదం.. కార్ రేసింగ్ పోటీల్లో ప్రముఖ రేసర్ దుర్మరణం
చెన్నై: ఎంఆర్ఎఫ్–ఎఫ్ఎమ్ఎస్ సీఐ జాతీయ కార్ రేసింగ్ చాంపియన్‌షిప్‌లో అపశ్రుతి చోటు చేసుకుంది. ఆదివారం మద్రాస్ ఇంటర్నేషనల్ సర్క్యూట్లో జరిగిన రెండో రౌండ్ రేసింగ్‌లో సీనియర్ రేసర్ కె.ఇ.కుమార్ కారు ప్రమాదానికి గురైంది. ఇందులో పోటీపడిన 59 ఏళ్ల సీనియర్ రేసర్ కుమార్ తీవ్ర గాయాలపాలయ్యాడు. అతన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. చికిత్స పొందుతూ అతను మృతి చెందాడు. ఈ దుర్ఘటనపై భారత మోటార్ స్పోర్ట్స్ సమాఖ్య (ఎఫ్ఎమ్ఎస్సీఐ) దర్యాప్తు చేయాలని ఆదేశించింది. -
మోటార్ సైక్లిస్టు సంతోష్‌కు ప్రమాదం
న్యూఢిల్లీ: భారత ప్రముఖ మోటార్ సైక్లిస్టు, హీరో మోటో స్పోర్ట్స్ రేసర్ సీఎస్ సంతోష్ బుధవారం ప్రమాదానికి గురయ్యాడు. సౌదీ అరేబియాలో జరుగుతోన్న డాకర్ ర్యాలీ మోటార్ రేసు సందర్భంగా ఈ ప్రమాదం జరిగింది. రేసులో భాగంగా కంకరతో కూడిన ట్రాక్‌పై 135 కి.మీ వేగంతో ప్రయాణిస్తోన్న 37 ఏళ్ల సంతోష్ అదుపుతప్పి పడిపోయాడు. దీంతో అతని కుడి భుజానికి, తలకు గా యాలయ్యాయి. వెంటనే విమానంలో రియాద్‌లోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతను కోలుకుంటున్నాడని, వైద్యులు అతన్ని కృత్రిమ కోమాలో ఉంచారని హీరో మోటో స్పోర్ట్స్ యాజమాన్యం ప్రకటించింది. -
రేసర్.. సాయిధర్..
పశ్చిమగోదావరి,జంగారెడ్డిగూడెం: జిల్లాకు చెందిన సాయిధర్ను రేసర్ కావాలనే అతని ఆసక్తి టాలెంట్ హంట్ టెస్ట్‌లో ఫైనల్ వరకు తీసుకువెళ్లింది. చిన్నతనం నుంచి రేసింగ్‌పై మక్కువ ఉన్న అతను హోండా–టెన్10 రేసింగ్ అకాడమీ నిర్వహిస్తున్న 2018 హోండా టాలెంట్ హంట్ టెస్ట్‌కు వెళ్లి సత్తాచాటాడు. ఫైనల్ పోరులోనూ పాల్గొన్నాడు. వివిధ దశలో ఫైనల్ జరిగింది. ప్రస్తుతం అతను ఫైనల్ ఫలితాల కోసం ఎదురుచూస్తున్నాడు. ఫైనల్లో విజేతగా నిలిస్తే రేసింగ్ అకాడమీకి ఎంపికవుతాడు. దీంతో జాతీయ స్థాయిలో రేసింగ్ పోటీలకు పాల్గొనేందుకు మార్గం సుగమం అవుతుంది. ఏలూరుకు చెందిన 18 ఏళ్ళ దాసరి సాయిధర్ ఆల్ ఇండియా లెవల్ హోండా ఇండియా టాలెంట్ హంట్ టెస్ట్‌లో ఫైనల్ క్వాలిఫయింగ్ పూర్తిచేశాడు. గత నెల 27 నుంచి చెన్నై ఇరున్గటుకొట్టాయ్లోని మద్రాస్ మోటార్ స్పోర్ట్స్ రేస్ ట్రాక్‌లో జరిగిన ఫైనల్ పోటీల్లో ప్రతిభ చాటాడు. వివిధ దశల్లో హోండా టాలెంట్ హంట్ టెస్ట్ మూడు దశలలో జరుగుతుంది. మొదటి దశలో రాష్ట్రస్థాయిలో ఆన్లైన్ పరీక్ష నిర్వహిస్తారు. రెండో దశలో డ్రైవింగ్ స్కిల్స్, ఫిజికల్ టెస్ట్ నిర్వహిస్తారు. మూడో స్టేజ్‌లో రేస్ ట్రాక్‌పై పోటీ నిర్వహిస్తారు. తొలి క్వాలిఫయింగ్ ఎగ్జామ్‌లో భాగంగా సాయిధర్ ఆన్లైన్ పరీక్షను పూర్తిచేసి రెండో క్వాలిఫయింగ్ ఎంపికయ్యాడు. ఈనెల 18న తెలంగాణ రాష్ట్రం షామీర్పేట్లో జరిగిన రెండో క్వాలిఫయింగ్‌లో 16 మందితో పోటీ పడి విజేతగా నిలిచాడు. మొత్తం ఐదు రాష్ట్రాలకు చెందిన వారు పాల్గొనగా రాష్ట్రానికి ఒకరు చొప్పున ఎంపిక చేశారు. వీరిలో 4వ వాడిగా సాయిధర్ రాష్ట్రం నుంచి ఎంపికయ్యాడు. 27వ తేదీ నుంచి చెన్నై ఇరున్గటుకొట్టాయ్లోని మద్రాస్ మోటార్ స్పోర్ట్స్ రేస్ ట్రాక్‌లో జరుగుతున్న పోటీల్లో పాల్గొన్నాడు. ఈ పోటీలో మొత్తం 9 మంది పాల్గొనగా, ప్రస్తుతం సాయిధర్ ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఫలితాలు అనంతరం హోండా టెన్10 రేసింగ్ అకాడమీకి ఐదుగురిని ఎంపిక చేస్తారు. ఇదీ నేపథ్యం ఏలూరులో పుట్టి పెరిగిన సాయిధర్ ఆదిత్య డిగ్రీ కళాశాలలో బీబీఏ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. తండ్రి గిరిధర్ పోలీస్‌శాఖలో పనిచేస్తున్నారు. సాయిధర్ చిన్నతనం నుంచి బైక్ రేస్‌లపై ఎక్కువగా ఆసక్తి చూపించేవాడు. ఖాళీ సమయాల్లో టీవీలో ఎక్కువగా బైక్ రేస్‌లను చూస్తుండేవాడు. క్రమేపీ ఆ ఆసక్తి అతను బైక్ సంబంధిత గేమ్స్ వైపు మళ్ళింది. ఇదే సమయంలో మోటార్ బైక్‌ను నేర్చుకోవడం, బైక్ నడపటంలో నైపుణ్యతను సాధించాడు. ఇది గమనించిన సాయిధర్ సోదరుడు శశిధర్ తమ్ముడిని మరింత ప్రోత్సహించాడు. ఎప్పటికైనా జాతీయా స్థాయిలో మంచి రేసర్‌ని కావాలనే తన ఉద్దేశాన్ని సోదరుడికి తెలపడంతో తమ్ముడిని ప్రోత్సహించాడు. గత ఏడాది హైదరాబాద్‌లో జరిగిన సమ్మర్ కోచింగ్ క్యాంప్‌కి పంపించాడు. అక్కడ సాయిధర్ ఫిజికల్ ట్రైనింగ్, టెక్నికల్ స్కిల్స్ నేర్చుకున్నాడు. అయితే జాతీయ స్థాయి రేసర్ కావాలంటే అతనికి రేసింగ్ లైసెన్స్ ఉండాల్సి రావడంతో అకాడమీకి పంపాలని యోచన చేశాడు. ఇదే సమయంలో హోండా టెన్10 రేసింగ్ అకాడమీ రేసింగ్‌పై ఆసక్తి ఉన్న వారికి శిక్షణ ఇచ్చే నిమిత్తం దరఖాస్తులు ఆహ్వానిస్తూ ఆన్లైన్ ప్రకటన ఇచ్చింది. దీంతో సాయిధర్ దరఖాస్తు చేసుకుని పోటీల్లో పాల్గొన్నాడు. మంచి రేసర్నికావాలనేదే లక్ష్యం నాకు బైక్ రేసులంటే చాలా ఇష్టం. చిన్నతనం నుంచి బైక్ రేసులను ఎక్కువగా చూసేవాడిని. గేమ్స్ కూడా ఆడేవాడిని. వాటిలో ఉన్న కొద్ది మెలకువలతో నేను బైక్‌ను నేర్చుకున్నాను. నాకున్న ఆసక్తికి నా తండ్రి గిరిధర్, సోదరుడు శశిధర్లు ప్రోత్సాహాన్ని ఇచ్చారు. ప్రస్తుతం అకాడమీలో చేరేందుకు పోటీకి హాజరయ్యాను. ఎప్పటికైనా జాతీయ స్థాయిలో మంచి రేసర్‌గా గుర్తింపు పొందాలనేది నా లక్ష్యం. –సాయిధర్, రేసర్ -
హైదరాబాద్‌లో రెచ్చిపోయిన బైక్ రేసర్లు
హైదరాబాద్: నగరంలోని శంషాబాద్‌లో గురువారం బైక్ రేసర్లు రెచ్చిపోయారు. బెంగుళూరు-హైదరాబాద్ జాతీయ రహదారిపై జరుగుతున్న రేస్‌ను ఆపేందుకు వెళ్లిన కానిస్టేబుల్ నరేందర్‌ను బైక్‌తో ఢీ కొట్టాడొ రేసర్. ఈ ఘటనలో కానిస్టేబుల్‌కు తీవ్రగాయాలయ్యాయి. దీంతో రంగంలోకి దిగిన ఎయిర్‌పోర్టు పోలీసులు 27 మంది రేసర్లను అదుపులోకి తీసుకున్నారు. 10 బైకులను సీజ్ చేశారు. గాయాలపాలైన కానిస్టేబుల్‌ను ఆసుపత్రికి తరలించారు. అరస్టైన రేసర్ల ఏడుగురు మైనర్లు కూడా ఉన్నారు. దీంతో వారి తల్లిదండ్రులపై కేసు నమోదు చేశారు పోలీసులు. రేసర్లంతా రాజేంద్రనగర్, వట్టేపల్లి, హసన్ నగర్, సులేమాన్ నగర్‌లకు చెందిన వారిగా పోలీసులు వెల్లడించారు. -
బైక్ రేసర్ల దూకుడుకు పోలీసుల బ్రేక్!