Shreyas Hareesh: ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉందని ఊహించారు.. సర్క్యూట్ రేసింగ్ చరిత్రకి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తాడని భావించారు. 13 సంవత్సరాల వయసులోనే లెక్కకు మించిన అవార్డులు, బహుమానాలు.. అతి తక్కువ కాలంలో గొప్ప రేసర్‌గా గుర్తింపు పొందిన 'శ్రేయస్ హరీష్' అందరి ఆశలకు తెరదించి కన్ను మూసాడు.
నివేదికల ప్రకారం, మద్రాస్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ రేసింగ్ చాంపియన్‌షిప్‌లో జరిగిన ప్రమాదంలో 'శ్రేయస్ హరీష్' (Shreyas Hareesh) ప్రమాదానికి గురైనట్లు, హాస్పిటల్‌కి తరలించేలోపే కన్ను మూసినట్లు తెలుస్తోంది. దీంతో రేసింగ్ ఛాంపియన్‌షిప్ రద్దు చేశారు.
11 ఏళ్లకే చాంపియన్‌షిప్..
భారతదేశంలో మొట్టమొదటి మినీజీపీ చాంపియన్‌షిప్ కొట్టిన 'శ్రేయస్ హరీష్'.. తన ఐదేళ్ల ప్రాయంలోనే సైక్లింగ్లో మంచి నైపుణ్యం కనపరుస్తుండతో అతని తండ్రి హరీష్ పరంధామన్ ఈ రంగంలో ముందుకు వెళ్ళడానికి సహకరించారు. 11 సంవత్సరాలకే నేషనల్ ఛాంపియన్ షిప్ కైవసం చేసుకున్నారు. 2022లో పెద్ద రైడర్స్‌తో కూడా పోటీపడి రికార్డ్ కొట్టిన ఘనత శ్రేయస్ సొంతం.
బెంగళూరుకు చెందిన శ్రేయాస్ ఇంటర్నేషన్ ఛాంపియన్ షిప్కి కూడా అర్హత సాధించి, అందులో కూడా మంచి ప్రతిభ కనపరిచాడు. కార్లకు ఫార్ములా వన్ రేస్ మాదిరిగానే.. 'మోటో జిపి అనేది బైకులతో నిర్వహించే రేసింగ్' దీని గురించి మన దేశంలో పెద్దగా తెలియకపోవచ్చు.
రేసింగ్ బ్యాగ్రౌండ్ లేని తెలియని కుటుంబం నుంచి వచ్చిన శ్రేయస్ అతి తక్కువ కాలంలోనే దేశం గర్వించదగ్గ స్థాయికి ఎదిగాడు. ఈ ఏడాది స్పెయిన్‌లోనే ట్రైనింగ్ తీసుకుని అక్కడ జరిగే చాంపియన్‌షిప్‌లో పాల్గొనటానికి సన్నాహాలు కూడా జరుగుతున్నాయి. అంతే కాకుండా ఇతడు ఆగస్టులో మలేషియాలోని సెపాంగ్ సర్క్యూట్‌లో MSBK ఛాంపియన్‌షిప్ 2023లో 250సీసీ విభాగంలో (గ్రూప్ B) జట్టు CRA మోటార్‌స్పోర్ట్స్‌కు కూడా ప్రాతినిధ్యం వహించాల్సి ఉంది. అంతలోనే శ్రేయస్ మృత్యువు కౌగిలి చేరిపోయాడు.
Comments
Please login to add a commentAdd a comment