Shreyas
-
నటుడు శ్రేయాస్ తల్పాడేకి గుండెపోటు..ఆ వ్యాక్సినే కారణమా..?
బాలీవుడ్, మళయాళీ నటుడు, నిర్మాత, దర్శక్షుడు అయిన శ్రేయాస్ తల్పాడే గతేడాది గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. నాటి దురదృష్టకర ఘటనను గుర్తు తెచ్చుకుంటూ తాను ధూమపానం సేవించనే, మందు తాగాను అయినా తాను ఈ గుండెపోటు బారిని పడ్డానని బాధగా అన్నారు. తనకు కొలస్ట్రాల్ ఎక్కువగా ఉందన్న విషయం తెలుసనిన్నారు. అందుకోసం మందులు వాడుతున్నట్లు చెప్పారు. ఇక తనకు మధుమేహం, రక్తపోటు వంటి దీర్ఘకాలి వ్యాధులు లేవనిన్నారు. అలాంటప్పుడు తాను ఈ గుండె జబ్బు బారిన ఎలా పడ్డానని ఆవేదనగా అన్నారు. బహుశా ఇది కోవిడ్ వ్యాక్సిన్ వల్లే అయ్యి ఉండొచ్చని అనుమానాన్ని వ్యక్తం చేశారు. నిజానికి ఆ మహమ్మారి సమయంలో బయటపడేందుకు ప్రభుత్వం వ్యాక్సిన్ డ్రైవ్‌లు చేపట్టింది. మనం కూడా సేఫ్‌గా ఉండాలనే ఉద్దేశ్యంతో వారి చెప్పిన డోస్‌లు తీసుకున్నాం. అయితే నిజానికి మనకు శరీరంలో ఏం తీసుకుంటున్నామనేది తెలియదు. ఎలాంటి కంపెనీలను విశ్వసించాలో కూడా తెలియని స్థితి అది. ప్రస్తుతం కోవిషీల్డ్ తీసుకోవడం వల్ల ముగ్గురు చనిపోయారని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలోనే శ్రేయాస్ ఇలా తన అనుమానాన్ని బాధగా వెలిబుచ్చారు. ఇక బాధితులు పోస్ట్‌మార్టంలో కూడా వ్యాక్సిన్ రియాక్షన్ కారణంగానే మరణించినట్లు వెల్లడవ్వడంతో ఒక్కసారిగా అందరిలో తీవ్ర ఆందోళనలు వెల్లువెత్తాయి. కాగా, నటుడు గతేడాది డిసెంబర్లో శ్రేయాస్ తల్పాడే తనకు గుండెపోటు వచ్చిన విధానాన్ని గూర్తి వివరిస్తూ.."అహ్మద్ ఖాన్ వెల్కమ్ టు ది జంగిల్ కోసం ముంబైలో జోగేశ్వరికి దగ్గరగా ఉన్న ఎస్ఆర్పీఎఫ్ గ్రౌండ్స్‌లో షూటింగ్ చేస్తున్నాం. ఆర్మీ శిక్షణా సన్నివేశాలు చిత్రికరిస్తుండగా..సడెన్‌గా ఒక షాట్లో ఊపిరి పీల్చుకోలేకపోడం, ఎడమ ఛాతీలో తీవ్ర నొప్పి రాడం జరిగింది. దీంతో కనీసం ఆ షూట్ తర్వాత నేను నా వానిటీ వ్యాన్‌కి వెళ్లి బట్టలు కూడా మార్చుకోలేకపోయాను. ఈ విధమైన అలసటను తానెప్పుడూ ఫేస్ చేయలేదని చెప్పుకొచ్చాడు శ్రేయాస్ తల్పాడే. అంతేగాదు తాను కోలుకుని బయటపడాతనని కూడా అనుకోలేదని చెప్పారు. ఇది తనకు భగవంతుడు ఇచ్చిన రెండో అవకామని అన్నారు. నిజంగా కోవిషీల్డ్ ప్రమాదకరమైనదా..?భారతదేశంలో కోవిషీల్డ్ 175 కోట్ల డోస్‌లు ఇచ్చారు. భారతదేశంలో ప్రజలకు అత్యంత విస్తృతంగా అందించిన టీకా. అయితే ఇటీవల ఈ ఆస్ట్రాజెనెకాకు చెందిన కోవిడ్-19 వ్యాక్సిన్ కోవిషీల్డ్ దుష్ఫ్రభావాలు గురించి ప్రజల్లో తీవ్ర ఆందోళలను మొదలయ్యాయి. కానీ ఆస్ట్రాజెనెకా చట్టపరమైన సమర్పణలో టీకా గురించి సవివరంగా వెల్లడించింది. అందులో ఈ టీకా కారణంగా థ్రోంబోసైటోపెనియా సిండ్రోమ్ (టీటీఎస్)తో థ్రాంబోసిస్కు దారితీస్తుందని అంగీకరించింది. ఈ పరిస్థితి కారణంగా రక్తం గడ్డకట్టడం, తక్కువ ప్లేట్లెట్ కౌంట్‌కి పడిపోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ దుష్ప్రభావాలు గురించి క్లియర్ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. నిజానికి మనదేశంలో ఈ టీకా వేసిన తర్వాత పరిమిత సంఖ్యలో ఈ టీటీఎస్ కేసులు నమోదయ్యాయి. టీకా-ప్రేరిత రోగనిరోధక థ్రోంబోటిక్ థ్రోంబోసైటోపెనియా (VITT)తో సహా థ్రోంబోసైటోపెనియా సిండ్రోమ్ (TTS)తో థ్రాంబోసిస్ అనేది చాలా అరుదైన దుష్ప్రభావం. ఎక్కువగా ప్రాథమిక టీకా తర్వాత కనిపిస్తుంది. అలాగే ఈ వ్యాక్సిన్‌ని తీసుకున్న ప్రతిఒక్కరు దీని బారిన పడరని ఆస్ట్రాజెనెకా కంపెనీ చట్టపరమైన పత్రాల్లో స్పష్టం చేసింది. చాలావరకు టీకా తీసుకున్న మొదటి 21 రోజుల్లోనే ఈ దుష్ప్రభావం సంభవిస్తుంది. అరుదైన సందర్భాల్లో ప్రాణాంతకం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. అందువల్ల ఈ టీకా తీసుకున్నవాళ్లు ఎవరు ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఎందుకంటే టీకా వేసిన కొన్ని వారాల్లోనే ఇలాంటీ టీటీఎస్ సమస్యలు వస్తాయని తేల్చి చెప్పారు.(చదవండి: ఆజానబాహుడిలా ఉండే జాన్ అబ్రహం ఫిట్నెస్ రహస్యం ఇదే! అందుకే..!) -
శ్రేయాస్ షిప్పింగ్ @ రూ. 400
ముంబై: డీలిస్టింగ్‌కు శ్రేయాస్ షిప్పింగ్.. షేరుకి రూ. 400 చొప్పున కౌంటర్ ఆఫర్‌ను ప్రకటించింది. ఆఫర్ ఈ నెల 17న ముగియనుంది. వెరసి కంపెనీ రెండోసారి డీలిస్టింగ్ ప్రయత్నాలను చేపట్టింది. గత నెలలో తొలుత ప్రకటించిన రూ. 338 ధరను రూ. 375కు సవరించినప్పటికీ వాటాదారులు షేరుకి రూ. 890 ధరలో షేర్లను టెండర్ చేయడంతో ఆఫర్ ధరను మరోసారి పెంచింది. తద్వారా కౌంటర్ ఆఫర్‌కు తెరతీసింది. డీలిస్టింగ్ ప్రాసెస్‌లో భాగంగా ఆఫర్ ఈ నెల 11న ప్రారంభమై 17న ముగియనున్నట్లు మాతృ సంస్థ ట్రాన్స్‌వరల్డ్ హోల్డింగ్స్ ఒక ప్రకటనలో పేర్కొంది. డీలిస్టింగ్ ప్రకటనకు ముందు మే 19న షేరు ధర రూ. 262 వద్ద నిలిచింది. ఈ ధరతో పోలిస్తే కౌంటర్ ఆఫర్ దాదాపు 53 శాతం ప్రీమియంకావడం గమనార్హం! కాగా.. 60 రోజుల సగటు ధర రూ. 292 కావడంతో ఫ్లోర్ ధరకు 37 శాతం ప్రీమియంతో కౌంటర్ ఆఫర్‌ను నిర్ణయించింది. ఇక మంగళవారం(10న) ముగింపు ధర రూ. 374తో పోలిస్తే ఇది దాదాపు 7 శాతం అధికం. ఈ ఏడాది మే 21న శ్రేయాస్ షిప్పింగ్ డీలిస్టింగ్‌ను స్వచ్చందంగా చేపట్టనున్నట్లు ట్రాన్స్‌వరల్డ్ వెల్లడించిన విషయం విదితమే. ప్రస్తుతం కంపెనీలో ట్రాన్స్‌వరల్డ్‌కు 70.44 శాతం వాటా ఉంది. -
11 ఏళ్లకే రేసింగ్‌లో రికార్డు.. మరెన్నో విజయాలు
Shreyas Hareesh: ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉందని ఊహించారు.. సర్క్యూట్ రేసింగ్ చరిత్రకి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తాడని భావించారు. 13 సంవత్సరాల వయసులోనే లెక్కకు మించిన అవార్డులు, బహుమానాలు.. అతి తక్కువ కాలంలో గొప్ప రేసర్‌గా గుర్తింపు పొందిన 'శ్రేయస్ హరీష్' అందరి ఆశలకు తెరదించి కన్ను మూసాడు. నివేదికల ప్రకారం, మద్రాస్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ రేసింగ్ చాంపియన్‌షిప్‌లో జరిగిన ప్రమాదంలో 'శ్రేయస్ హరీష్' (Shreyas Hareesh) ప్రమాదానికి గురైనట్లు, హాస్పిటల్‌కి తరలించేలోపే కన్ను మూసినట్లు తెలుస్తోంది. దీంతో రేసింగ్ ఛాంపియన్షిప్ రద్దు చేశారు. 11 ఏళ్లకే చాంపియన్‌షిప్.. భారతదేశంలో మొట్టమొదటి మినీజీపీ చాంపియన్‌షిప్ కొట్టిన 'శ్రేయస్ హరీష్'.. తన ఐదేళ్ల ప్రాయంలోనే సైక్లింగ్‌లో మంచి నైపుణ్యం కనపరుస్తుండతో అతని తండ్రి హరీష్ పరంధామన్ ఈ రంగంలో ముందుకు వెళ్ళడానికి సహకరించారు. 11 సంవత్సరాలకే నేషనల్ ఛాంపియన్ షిప్ కైవసం చేసుకున్నారు. 2022లో పెద్ద రైడర్స్‌తో కూడా పోటీపడి రికార్డ్ కొట్టిన ఘనత శ్రేయస్ సొంతం. బెంగళూరుకు చెందిన శ్రేయాస్ ఇంటర్నేషన్ ఛాంపియన్ షిప్కి కూడా అర్హత సాధించి, అందులో కూడా మంచి ప్రతిభ కనపరిచాడు. కార్లకు ఫార్ములా వన్ రేస్ మాదిరిగానే.. 'మోటో జిపి అనేది బైకులతో నిర్వహించే రేసింగ్' దీని గురించి మన దేశంలో పెద్దగా తెలియకపోవచ్చు. రేసింగ్ బ్యాగ్రౌండ్ లేని తెలియని కుటుంబం నుంచి వచ్చిన శ్రేయస్ అతి తక్కువ కాలంలోనే దేశం గర్వించదగ్గ స్థాయికి ఎదిగాడు. ఈ ఏడాది స్పెయిన్‌లోనే ట్రైనింగ్ తీసుకుని అక్కడ జరిగే చాంపియన్‌షిప్‌లో పాల్గొనటానికి సన్నాహాలు కూడా జరుగుతున్నాయి. అంతే కాకుండా ఇతడు ఆగస్టులో మలేషియాలోని సెపాంగ్ సర్క్యూట్లో MSBK ఛాంపియన్షిప్ 2023లో 250సీసీ విభాగంలో (గ్రూప్ B) జట్టు CRA మోటార్‌స్పోర్ట్స్‌కు కూడా ప్రాతినిధ్యం వహించాల్సి ఉంది. అంతలోనే శ్రేయస్ మృత్యువు కౌగిలి చేరిపోయాడు. -
దివ్యాంశ్ శ్రేయ జంటకు కాంస్యం
చాంగ్వాన్ (కొరియా): అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) ప్రపంచ చాంపియన్‌షిప్‌లో నాలుగో రోజు భారత సీనియర్ షూటర్లు విఫలమైనా జూనియర్లు సత్తా చాటారు. 10 మీ. ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ జూనియర్ ఈవెంట్లో దివ్యాంశ్ సింగ్–శ్రేయ అగర్వాల్ జోడీ కాంస్యం సాధించింది. ఫైనల్లో దివ్యాంశ్–శ్రేయ జంట 435 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్యం సొంతం చేసుకుంది. అంతకుముందు 42 జట్లు పాల్గొన్న క్వాలిఫయింగ్ రౌండ్లో దివ్యాంశ్–శ్రేయ జోడీ 834.4 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచి ఫైనల్‌కు చేరగా... మరో భారత జంట ఎలవనీల్ వలరివన్–హిృదయ్ హజారికా జంట (829.5 పాయింట్లు) 13వ స్థానంతో సరిపెట్టుకుంది. ఈ మెగా ఈవెంట్లో భారత్ ప్రస్తుతం మూడు స్వర్ణాలు, మూడు రజతాలు, మూడు కాంస్యాలతో పతకాల పట్టికలో సంయుక్తంగా మూడో స్థానంలో ఉంది. సీనియర్లు విఫలం... 2020 టోక్యో ఒలింపిక్స్‌కు తొలి అర్హత టోర్నమెంట్‌గా నిర్వహిస్తున్న ఈ మెగా ఈవెంట్లో పురుషుల 50 మీ. రైఫిల్ ప్రోన్ విభాగంలో చైన్ సింగ్ 623.9 పాయింట్లతో 14వ స్థానంలో నిలిచి నిరాశపరచగా... తాజా ఆసియా క్రీడల రజత పతక విజేత సంజీవ్ రాజ్‌పుత్ (620 పాయింట్లు) 48వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. టీమ్ విభాగంలో చైన్ సింగ్, సంజీవ్, గగన్ నారంగ్‌ల త్రయం 1856.1 పాయింట్లతో 15వ స్థానం దక్కించుకుంది. మహిళల 50 మీ. రైఫిల్ ప్రోన్ విభాగంలో తేజస్విని సావంత్ 617.4 పాయింట్లతో 28వ స్థానం దక్కించుకోగా... అంజుమ్ మౌద్గిల్ (616.5 పాయింట్లు) 33వ స్థానం... శ్రేయ సక్సేనా (609.9 పాయింట్లు) 54వ స్థానంలో నిలిచారు. టీమ్ విభాగంలో అంజుమ్, తేజస్విని, శ్రేయలతో కూడిన భారత జట్టు 1848.1 పాయింట్లతో ఆరో స్థానంతో సరిపెట్టుకుంది. -
మర్డర్ మిస్టరీ
మర్డర్ మిస్టరీ మూవీస్‌కి చాలా క్రేజ్ ఉంటుంది. ఈ తరహా చిత్రాలను సరైన రీతిలో తెరకెక్కిస్తే మాత్రం ప్రేక్షకాదరణ గ్యారంటీ అని గత చరిత్ర చెబుతోంది. ‘‘మా సినిమా కచ్చితంగా విజయాన్నే అందుకుంటుంది’’ అంటున్నారు బి. రామకృష్ణారెడ్డి. తమిళంలో పిజ్జా, విల్లా వంటి సూపర్ హిట్స్ నిర్మించిన సీవీ కుమార్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న తాజా చిత్రం ‘తేగిడి’. ఈ చిత్రం అనువాద హక్కులను శ్రేయాస్ మీడియాతో కలిసి పుష్యమి ఫిలిం మేకర్స్ అధినేత రామకృష్ణారెడ్డి పొందారు. తెలుగు సినిమాకి టైటిల్ ఖరారు చేయలేదు. రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ -‘‘ఆసక్తికరమైన కథతో సాగే మర్డర్ మిస్టరీ ఇది. ఆరంభం నుంచి చివరి వరకూ ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేస్తుంది. ఇప్పటికే తమిళ వెర్షన్ నిర్మాణానంతర పనులు జరుపుకుంటోంది. ఈ నెల రెండోవారంలో పాటలను, నెలాఖరున సినిమాని రిలీజ్ చేస్తాం’’ అన్నారు. అశోక్ సెల్వన్, జనని అయ్యర్ జంటగా నటించిన ఈ చిత్రానికి సంగీతం: నివాస్ ప్రసన్న, సహనిర్మాత: వెంకటరమణ, సమర్పణ: బి.సుధారెడ్డి, నిర్మాతలు: బి. రామకృష్ణారెడ్డి, గుడ్ ఫ్రెండ్స్.