ముంబై: డీలిస్టింగ్‌కు శ్రేయాస్ షిప్పింగ్.. షేరుకి రూ. 400 చొప్పున కౌంటర్ ఆఫర్‌ను ప్రకటించింది. ఆఫర్ ఈ నెల 17న ముగియనుంది. వెరసి కంపెనీ రెండోసారి డీలిస్టింగ్ ప్రయత్నాలను చేపట్టింది. గత నెలలో తొలుత ప్రకటించిన రూ. 338 ధరను రూ. 375కు సవరించినప్పటికీ వాటాదారులు షేరుకి రూ. 890 ధరలో షేర్లను టెండర్ చేయడంతో ఆఫర్ ధరను మరోసారి పెంచింది. తద్వారా కౌంటర్ ఆఫర్‌కు తెరతీసింది.
డీలిస్టింగ్ ప్రాసెస్‌లో భాగంగా ఆఫర్ ఈ నెల 11న ప్రారంభమై 17న ముగియనున్నట్లు మాతృ సంస్థ ట్రాన్స్‌వరల్డ్ హోల్డింగ్స్ ఒక ప్రకటనలో పేర్కొంది. డీలిస్టింగ్ ప్రకటనకు ముందు మే 19న షేరు ధర రూ. 262 వద్ద నిలిచింది. ఈ ధరతో పోలిస్తే కౌంటర్ ఆఫర్ దాదాపు 53 శాతం ప్రీమియంకావడం గమనార్హం! కాగా.. 60 రోజుల సగటు ధర రూ. 292 కావడంతో ఫ్లోర్ ధరకు 37 శాతం ప్రీమియంతో కౌంటర్ ఆఫర్‌ను నిర్ణయించింది. ఇక మంగళవారం(10న) ముగింపు ధర రూ. 374తో పోలిస్తే ఇది దాదాపు 7 శాతం అధికం. ఈ ఏడాది మే 21న శ్రేయాస్ షిప్పింగ్ డీలిస్టింగ్‌ను స్వచ్చందంగా చేపట్టనున్నట్లు ట్రాన్స్‌వరల్డ్ వెల్లడించిన విషయం విదితమే. ప్రస్తుతం కంపెనీలో ట్రాన్స్‌వరల్డ్‌కు 70.44 శాతం వాటా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment